01-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు, కావున మీరు సదా వారి శ్రీమతంపై నడవండి”

ప్రశ్న:-

మొట్టమొదట మీరు అందరికీ ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థము చేయించాలి?

జవాబు:-

బాప్ దాదా గురించి. మనము ఇక్కడ బాప్ దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురూ కలిసే ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు అన్న గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. వీరు (దాదా) భగవంతుడు కాదు. మనిషి భగవంతుడు కాలేడు. భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి.

గీతము:-

చివరికి ఆ రోజు రానే వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. తండ్రి, దాదా ద్వారా అనగా శివబాబా, బ్రహ్మా దాదా ద్వారా అర్థం చేయిస్తారు, ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా, దాదా (తాతగారు) వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వము లభిస్తుంది. తాతగారి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. ఎవరైతే పేదవారిని కిరీటధారులుగా వచ్చి తయారుచేస్తారో, వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది పక్కాగా నిశ్చయం ఉండాలి. వీరు చూడడానికి సాకార మనిషినే, వీరిని అందరూ బ్రహ్మా అని అంటారు. మీరందరూ బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు. మాకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. వారసత్వము ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుడు దుఃఖమనే శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గంలో భగవంతుడిని వెతకడానికి ఎదురుదెబ్బలు తింటారు. కానీ వారు ఎవరికీ లభించరు. మీరే తల్లి-తండ్రి అని భారతవాసులు పాడతారు. ఇంకా, మీరెప్పుడైతే వస్తారో, అప్పుడు మాకు మీరొక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు, ఇంకెవ్వరి పట్ల మేము మమకారము పెట్టుకోము, మాకు శివబాబా ఒక్కరే ఉన్నారు అని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని షావుకారులుగా చేసే వీరు, గవ్వలను వజ్ర సమానంగా చేస్తారు అనగా కలియుగములోని పతిత నిరుపేదలను సత్యయుగంలోని కిరీటధారులుగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు. మేము ఇక్కడ బాప్ దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మా ఆత్మ కూడా ఉంది, కావున ఇద్దరున్నారు కదా. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని గాయనము చేస్తారు. మొదటి నంబరులో ఆత్మలైన మీరు కలుసుకుంటారు అనగా ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు, వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. కిరీటధారిగా ఉన్న భారతదేశము ఇప్పుడు ఎంత నిరుపేదగా అయ్యింది. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ కిరీటధారులుగా చేసేందుకు వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటి పవిత్రతా కిరీటము ఉంటుంది, దానిని ప్రకాశంలా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటము. కావున మొట్టమొదట బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారనే గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. వీరు భగవంతుడు కాదు. మనిషి భగవంతునిగా కాలేరు. నిరాకారుడిని భగవంతుడు అని అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు, దానిని నిర్వాణధామము లేక వానప్రస్థం అని అంటారు, తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పము సుఖపు పాత్ర, అర్ధకల్పము దుఃఖపు పాత్ర ఉంటుంది. దుఃఖం యొక్క అంతిమంలో నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా తయారై ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు భట్టీకి వస్తారు. ఇక్కడ బయటకు చెందినవేవీ గుర్తు రాకూడదు. ఇక్కడ తల్లిదండ్రులు మరియు పిల్లలే ఉన్నారు. ఇక్కడ శూద్ర సంప్రదాయం కలవారు లేరు. ఎవరైతే బ్రాహ్మణులు కారో, వారిని శూద్రులని అంటారు. ఇక్కడ వారి సాంగత్యమే ఉండదు. ఇక్కడ బ్రాహ్మణుల సాంగత్యమే ఉంటుంది. శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గ రాజధానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము యజమానులము కాదు ఎందుకంటే ఇప్పుడు మనము పతితులుగా ఉన్నాము. మనము పావనంగా ఉండేవారిమి, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి సతో-రజో-తమోలోకి వచ్చాము. మెట్ల చిత్రములో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఏ పిల్లలను మొట్టమొదట కలుస్తారో, వారే సత్యయుగములోకి మొట్టమొదట వస్తారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతుంది అన్న జ్ఞానం తప్పకుండా బీజంలోనే ఉంటుంది. ఇది తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. భారతవాసులైన మేము పేదవారిగా ఉన్నామని మీకిప్పుడు తెలుసు. దేవీదేవతలుగా ఉన్నప్పుడు ఎంత షావుకారులుగా ఉండేవారము. వజ్రాలతో ఆడుకునేవారము. వజ్రాల మహళ్ళలో నివసించేవారము. మీరు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనే స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తారు. ఓ పతితపావనా, పేదల పెన్నిధి బాబా, రండి అని పిలుస్తారు. పేదవారిగా ఉన్న మమ్మల్ని మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారుచేయండి. స్వర్గంలో అపారమైన సుఖముండేది, ఇప్పుడు అపారమైన దుఃఖముంది. ఈ సమయంలో అందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతిమము, తర్వాత సత్యయుగము కావాలి. భారతదేశంలో మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మమొక్కటే ఉండేది, ఇప్పుడు అది ప్రాయః లోపమైపోయింది, మిగిలిన వారందరూ తమను తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో క్రైస్తవులు పెరిగిపోయారు, ఎందుకంటే చాలామంది హిందూ ధర్మము వారు అందులోకి కన్వర్ట్ అయిపోయారు. వాస్తవానికి దేవీ-దేవతలైన మీ కర్మలు శ్రేష్ఠంగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు రావణరాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. అది శివబాబా స్థాపించిన స్వర్గము. నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి మీకు సూర్య వంశ, చంద్ర వంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను అని తండ్రి అంటారు. వీరు బాప్ దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని స్వర్గానికి అర్హులుగా తయారుచేస్తున్నారు ఎందుకంటే పతిత ఆత్మలు పావనంగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేవు. నేను వచ్చి మీకు పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను అని ఇప్పుడు తండ్రి అంటారు. నేను మిమ్మల్ని పదమపతులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేసి వెళ్ళాను, మేము నిజంగానే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు స్మృతి కలిగింది. ఆ సమయంలో మనం చాలా కొద్దిమందే ఉండేవారము. ఇప్పుడైతే ఎంతమంది మనుష్యులున్నారు. సత్యయుగంలో 9 లక్షల మంది ఉంటారు, కావున నేను వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను అని తండ్రి అంటారు. కల్పక్రితము వలె అందరూ తయారీలు చేసుకుంటున్నారు. ఎన్ని బాంబులను తయారుచేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ మహాభారత యుద్ధము జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను నరుని నుండి నారాయణునిగా తయారుచేశారు కావున తప్పకుండా కలియుగ పాత ప్రపంచము యొక్క వినాశనం జరగాలి. మొత్తం అడవి అంతటికీ నిప్పు అంటుకోనున్నది. లేకపోతే వినాశనము ఎలా జరుగుతుంది? ఈ మధ్య బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి, అప్పుడే వినాశనము జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగము. రావణ రాజ్యము ‘ముర్దాబాద్ హెూ!’ (అంతరించి పోతుంది), రామరాజ్యము ‘జిందాబాద్’ (వర్ధిల్లుతుంది). కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుని రాజ్యముండేది. లక్ష్మీనారాయణుల బదులు కృష్ణుని పేరు తీసుకుంటారు ఎందుకంటే కృష్ణుడు సుందరమైనవారు, అందరికంటే ప్రియమైన బాలుడు. మనుష్యులకైతే తెలియదు కదా. కృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధ వేరే రాజధానికి చెందినవారు. భారత్ కిరీటధారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది, మళ్ళీ తండ్రి వచ్చి కిరీటధారిగా తయారుచేస్తారు. పవిత్రంగా అయ్యి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు అని ఇప్పుడు తండ్రి చెప్తారు. ఎవరైతే సేవ చేసి తమ సమానంగా తయారుచేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు, డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యయుగంలో రాజు, రాణి, ప్రజలు అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఉన్నది ప్రజారాజ్యము. రెండు కిరీటాలు లేవు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతితపావనుడిని. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే, మీ ఆత్మ నుండి మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు శ్యామము నుండి సుందరంగా అవ్వాలి. బంగారంలో మాలిన్యము చేరడంతో నల్లగా అయిపోతుంది, కావున ఇప్పుడు ఆ మాలిన్యాన్ని తొలగించాలి. మీరు కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చుని అందరి నుండి మమకారమును తొలగించండి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. మీరందరూ ప్రియుడినైన నా ఒక్కడికి ప్రేయసులు. భక్తులంతా భగవంతుడిని స్మృతి చేస్తారు. సత్య-త్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడ జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేకానీ శాస్త్రాలు చదివితే పగలు అయిపోతుందని కాదు. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన సాగరుడు, పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగయోగేశ్వరులుగా, తర్వాత రాజరాజేశ్వర, రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. పావనంగా ఉన్న రాజులే మళ్ళీ పతితులుగా అవుతారు. మీరే పూజ్యులుగా, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో ఉండాలి. ఉదాహరణకు ప్రేయసులు ప్రియుడిని స్మృతి చేస్తారు కదా. కుమారీకి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రియునికి భక్తి మార్గములో ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించి సుఖమునివ్వండి అని అందరూ దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తారు. ఇక్కడ శాంతి లేదు, సుఖము లేదు. సత్యయుగంలో రెండూ ఉంటాయి.

ఆత్మలమైన మేము 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తాము అన్నది మీకిప్పుడు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. 84 మెట్ల వరుస బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. మనము బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తే, అంతగా పవిత్రతా ప్రకాశం వస్తూ ఉంటుంది. మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎంత వీలైతే అంత సమయం తీసి స్మృతి చేసేందుకు ఉపాయాలను రచించాలి. ఉదయాన్నే సమయం బాగా లభిస్తుంది. ఈ పురుషార్థము చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. కామ చితిపై ఎక్కకండి. మీరిప్పుడు జ్ఞాన చితిపై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది, దీని కోసం బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తండ్రి అంటారు, మీరు 63 జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారు, ఇప్పుడు శివాలయము, అమరలోకానికి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రంగా ఉంటే ఏమవుతుంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విజయం పొందాలి, అప్పుడే జగత్ జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. తండ్రి అంటారు, అందరూ మరణించవలసిందే, ఇది అంతిమ జన్మ, మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. వజ్ర-వైఢూర్యాల గనులు నిండుగా అవుతాయి. అక్కడ మీరు వజ్ర-వైఢూర్యాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి వారి మతముపై నడుచుకోవాలి కదా. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠంగా అవుతారు. రావణుని మతము ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మలకు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము ఉంటుంది. నేను కల్ప-కల్పము సంగమయుగంలో వస్తాను, మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను అని తండ్రి అంటారు. మేము చక్రంలో ఎలా తిరుగుతాము అనేది ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రియే జ్ఞాన సాగరుడు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా మీకు వారసత్వమునిస్తారు. కావున, ఇప్పుడు వినాశనం జరిగే కన్నా ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతి ఉండాలి, స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశము వస్తుంది.

2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. భట్టీలో బయటకు చెందినవేవీ గుర్తు రాకూడదు.

వరదానము:-

స్వయంపై బాప్ దాదాను బలిహారం చేయించుకునే త్యాగమూర్త, నిశ్చయబుద్ధి భవ

"తండ్రి లభించారు, సర్వస్వమూ లభించింది” ఈ నషాలో సర్వస్వాన్ని త్యాగం చేసే జ్ఞాన స్వరూపులు, నిశ్చయబుద్ధి గల పిల్లలు, ఎప్పుడైతే తండ్రి ద్వారా సంతోషాన్ని, శాంతిని, శక్తిని మరియు సుఖాన్ని అనుభూతి చేస్తారో, అప్పుడు లోక నిందను కూడా లెక్క చేయకుండా, సదా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. వారికి ప్రపంచంలోనిదంతా తుచ్ఛంగా, నిస్సారంగా అనుభవమవుతుంది. ఇటువంటి త్యాగమూర్తులు, నిశ్చయబుద్ధి గల పిల్లలపై బాప్ దాదా తమ సర్వ సంపదల సహితంగా బలిహారం అవుతారు. ఎలాగైతే పిల్లలు బాబా, మేము మీ వారము అని సంకల్పం చేస్తారో, అలా బాబా కూడా తండ్రికి చెందినదంతా మీదే అని అంటారు.

స్లోగన్:-

ఎవరైతే తమ ప్రతి సంకల్పము మరియు కర్మ ద్వారా తండ్రి యొక్క స్నేహభరితమైన వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారో, వారే సహజయోగులు.