01-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ ముక్తి దళము, మీరు అందరికీ సద్గతినివ్వాలి, అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేయాలి”

ప్రశ్న:-

మనుష్యులు తమ బుద్ధిని ఏ విషయంలో ఉపయోగిస్తారు మరియు మీరు మీ బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలి?

జవాబు:-

మనుష్యులు తమ బుద్ధిని ఆకాశం మరియు సృష్టి యొక్క అంతాన్ని పొందడానికి ఉపయోగిస్తున్నారు కానీ దీని వలన ఎలాంటి లాభం ఉండదు. వీటి అంతమైతే లభించజాలదు. పిల్లలైన మీరు పూజ్యులుగా అవ్వడానికి మీ బుద్ధిని ఉపయోగిస్తారు. వాళ్ళను ప్రపంచం పూజించదు. పిల్లలైన మీరు పూజ్య దేవతలుగా అవుతారు.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము సర్వమునూ పొందాము..... (తుమ్ హే పాకే హమ్ నే.....)

ఓంశాంతి. ఇది జ్ఞాన మార్గమని, అది భక్తి మార్గమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గం మంచిదా లేక జ్ఞాన మార్గం మంచిదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇవి రెండు విషయాలైనట్లు కదా. జ్ఞానంతో సద్గతి కలుగుతుందని అంటారు. తప్పకుండా భక్తి మరియు జ్ఞానం రెండు వేర్వేరు అని అంటారు. భక్తి చేయడం వలన జ్ఞానం లభిస్తుందని, అప్పుడే సద్గతి కలుగుతుందని మనుష్యులు భావిస్తారు. భక్తి మధ్యలోకి జ్ఞానం రాలేదు. భక్తి అందరి కోసం ఉంది, జ్ఞానం కూడా అందరి కోసం ఉంది. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము, కావున తప్పకుండా అందరి దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు కూడా మరియు ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి, ఇప్పుడు మీతో సాంగత్యాన్ని జోడిస్తామని పాడుతారు కూడా. ఇప్పుడు ఇంతకీ వారెవరు, ఎవరితో జోడిస్తాము అనేది అర్థం చేసుకోరు. తరచుగా బుద్ధి కృష్ణుని వైపుకు వెళ్తుంది, మేము నీతోనే సత్యమైన ప్రీతిని జోడిస్తామని అంటారు. కేవలం కృష్ణుడితోనే ప్రీతిని జోడిస్తున్నప్పుడు, ఇక గురువులు మొదలైనవారి అవసరమే ఉండదు, కృష్ణుడినే స్మృతి చేయాలి. కృష్ణుడి చిత్రమైతే అందరి దగ్గర ఉంది. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, ఇక ఇతరులెవ్వరి వద్దకు వెళ్ళవలసిన అవసరమే ఉండదు. మీరా ఒక్కరితోనే ప్రీతిని జోడించారు, పనులు చేస్తూ కృష్ణుడినే గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఇంట్లో ఉంటూ, అన్నీ చేసుకుంటూ, తినడం-త్రాగడం అన్నీ చేసేవారు, కానీ సత్యమైన ప్రీతిని ఒక్క కృష్ణునితోనే జోడించారు. ఆమె ఒక ప్రేయసి మరియు కృష్ణుడు ఒక ప్రియుడు అన్నట్లు అయిపోయారు. కృష్ణుడిని గుర్తు చేస్తే ఫలం కూడా లభిస్తుంది. కృష్ణుని గురించైతే అందరికీ తెలుసు. మేము నీతోనే సత్యమైన ప్రీతిని జోడించాము, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలేశామని కూడా పాడుతారు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైనవారు, సత్యమైనవారు అయితే పరమపితయే. అందరికీ వారసత్వాన్నిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ శివ అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. శివజయంతి జరుగుతుంది అంటే వారు తప్పకుండా వచ్చి ఉంటారు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. సర్వులకు సద్గతినిస్తారని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. అది ఎలా ఇస్తారు, సద్గతికి అర్థం ఏమిటి అన్నది ఏమీ తెలియదు. శివబాబా అయితే తప్పకుండా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మీరు ఆ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు కానీ మీకు ఈ విషయం తెలియదు, మర్చిపోయారు, అటువంటప్పుడు ఇతరులు ఎలా తెలుసుకోగలరు. ఇప్పుడు శివబాబా ద్వారా మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు తెలియజేస్తారు. మీరు ఈశ్వరీయ ముక్తి దళము. ముక్తి దళము అనండి లేక సద్గతినిచ్చే దళము అనండి. ఇప్పుడు పిల్లలైన మీపై బాధ్యత ఉంది. మీరు చిత్రాలపై కూడా అర్థం చేయించవచ్చు. భాషలు అనేకమున్నాయి. ముఖ్యమైన భాషల్లో చిత్రాలను తయారుచేయించవలసి ఉంటుంది. భాషల విషయంలో కూడా చాలా జంజాటం ఉంటుంది, అందుకే ప్రదర్శినీలు కూడా తయారుచేయించవలసి వచ్చింది. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సులువుగా ఉంటుంది. సృష్టి చక్రం చిత్రంలో కూడా పూర్తి జ్ఞానం ఉంది, మెట్ల చిత్రం కేవలం భారతవాసుల కోసమే ఉంది. ఇందులో ఇతర ధర్మాలేవీ ఉండవు. భారత్ తమోప్రధానంగా అయినప్పుడు ఇతరులెవ్వరూ అలా ఉండరని కాదు, అందరూ తమోప్రధానంగా అవుతారు. కావున వారి కోసం కూడా ఏదైనా ఉండాలి. బుద్ధిలో సేవకు సంబంధించిన ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇద్దరు తండ్రుల రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది. లక్ష్మీనారాయణులు భారత్ యొక్క మొట్టమొదటి మహారాజా-మహారాణులుగా ఉండేవారు అనగా భగవాన్-భగవతీలుగా ఉండేవారు అన్నది కూడా అన్ని ధర్మాల వారికి తెలుసు. అచ్ఛా, వారికి ఈ స్వర్గ రాజ్యం ఎలా లభించింది. తప్పకుండా భగవంతుని ద్వారా లభించింది. ఎలా లభించింది, ఎప్పుడు లభించింది అనేది ఎవ్వరికీ తెలియదు. గీతలో కృష్ణుని పేరును రాసి ప్రళయాన్ని చూపించారు కానీ ఫలితం ఏమీ లేదు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. చిత్రాలైతే అన్ని చోట్ల ఉన్నాయి. లక్ష్మీనారాయణుల చిత్రాలు కూడా ఉంటాయి. కానీ డ్రెస్, ముఖ కవళికలు మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి. ఎవరికి ఎలా తోస్తే అలా తయారుచేశారు. ఈ రాధా-కృష్ణులే, శ్రీనాథుడు-శ్రీనాథిని కదా. శ్రీరాధ, శ్రీకృష్ణులైతే కిరీటధారులు కారు, నల్లని వారూ కారు. రాజధాని లక్ష్మీనారాయణులది, రాధా-కృష్ణులది కాదు. మందిరాలైతే అనేక రకాలవి నిర్మించారు కానీ లక్ష్మీనారయణ అన్న పేరునే పెడతారు. లక్ష్మీనారాయణుల రాజ్యమని అంటారు. సీతా రాముల వంశము, లక్ష్మీనారాయణుల వంశము ఉంటాయి, రాధా-కృష్ణుల వంశముండదు. ఈ విషయాలు మనుష్యుల ఆలోచనల్లో ఉండవు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు ఉత్సాహంతో ఉంటారు. మాకు అర్థమవుతుంది అని కొంతమంది అంటారు కానీ నెమ్మది-నెమ్మదిగా నోరు విప్పి జ్ఞానం చెప్పగలిగేలా యుక్తులను కూడా రచించాల్సి ఉంటుంది. వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తే, యజ్ఞ తపాదులు మొదలైనవి చేస్తే, తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తే పరమాత్మను పొందగలమని చాలామంది భావిస్తారు కానీ ఇవన్నీ నా నుండి దూరం చేసే మార్గాలు అని భగవంతుడు అంటారు. డ్రామాలో అందరూ దుర్గతిని పొందవలసిందే, అందుకే ఇటువంటి విషయాలను చెప్తారు. ఇంతకుముందు మనం కూడా, భగవంతుడు ఒక శిఖరం వంటివారని, ఎవరు ఎక్కడ నుండి వెళ్ళినా వారిని చేరుకోవచ్చునని అనేవారము. అందుకే మనుష్యులు అనేక రకాల మార్గాలను ఎన్నుకున్నారు. భక్తి మార్గంలోని మార్గాలను పట్టుకొని-పట్టుకొని అలసిపోయినప్పుడు, మళ్ళీ భగవంతుడినే పిలుస్తారు - ఓ పతితపావనా, మీరు వచ్చి పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేయండి, మీరు లేకుండా పావనంగా అవ్వలేము, అలసిపోయాము అని అంటారు. భక్తి రోజు రోజుకు పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. ఇప్పుడైతే మేళాలు మొదలైనవాటికి ఎన్ని లక్షల మంది వెళ్తారు, అక్కడ ఎంత మురికి ఉంటుంది. ఇప్పుడిది అంతిమము. ప్రపంచం పరివర్తనవ్వాలి. వాస్తవానికి ప్రపంచం ఒక్కటే ఉంటుంది, దానిని రెండు భాగాలుగా చేశారు, అందుకే మనుష్యులు స్వర్గం, నరకం వేర్వేరు ప్రపంచాలని భావిస్తారు, కానీ ఇవి సగం-సగం ఉంటాయి. పైన సత్యయుగం, తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు. కలియుగంలో తమోప్రధానంగా అవ్వాల్సిందే. సృష్టి పాతదిగా అవుతుంది. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు, తికమకలో ఉన్నారు. కొంతమంది కృష్ణుడిని భగవంతుడని, మరి కొంతమంది రాముడిని భగవంతుడని అంటారు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు తమను తామే భగవంతుడని చెప్పుకుంటారు. మేము ఈశ్వరుని అవతారమని అంటారు. దేవతల కన్నా కూడా మనుష్యులు తెలివైనవారిగా అయిపోయారు. ఎంతైనా దేవతలను దేవతలనే అంటారు, ఇక్కడైతే మనుష్యులను భగవంతుడని అంటారు. ఇది భక్తి మార్గము. దేవతలైతే స్వర్గంలో ఉండేవారు. ఇప్పుడు ఇనుప యుగం వంటి కలియుగంలో, మనుష్యులు భగవంతునిగా ఎలా అవ్వగలరు. తండ్రి అంటారు - నేను సంగమయుగంలోనే వస్తాను, ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చినప్పుడు నేను వస్తాను. కలియుగం సత్యయుగంగా అవుతుంది, మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము. అర్థం చేయించేందుకు నిరాకారీ వృక్షాన్ని కూడా పెద్దదిగా తయారుచేయవలసి ఉంటుంది. బ్రహ్మమహాతత్వం కూడా ఆకాశమంత పెద్దదిగా ఉంటుంది, రెండింటి అంతాన్ని పొందలేరు. అక్కడకు విమానాలు మొదలైనవాటిలో వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు కానీ అంతాన్ని పొందలేరు. సముద్రమే సముద్రము..... ఆకాశమే ఆకాశము ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. చాలా ప్రయత్నిస్తారు కానీ ఈ విషయాలన్నింటి వలన లాభం ఏముంటుంది. మేము మా బుద్ధిని ఉపయోగిస్తున్నామని భావిస్తారు. అయితే ఇది మనుష్యుల బుద్ధి, మనుష్యుల్లో సైన్సు యొక్క గర్వం కూడా ఉంది. ఎవరు ఎన్ని కనుగొన్నా సరే, వారినేమీ ప్రపంచమంతా పూజించదు. దేవతలకైతే పూజ జరుగుతుంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు. అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తారు. మనం మూలవతనం నుండి వస్తామని అందరికీ తెలుసు కానీ మీకు అర్థం అయిన విధంగా ప్రపంచానికి అర్థం కాదు. మూలవతనం అంటే ఏమిటి, అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి, మళ్ళీ నంబరువారుగా ఎలా వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. బ్రహ్మమహాతత్వంలో నిరాకారీ వృక్షం ఉంటుంది. సత్యయుగంలో కొద్దిమంది మనుష్యులే ఉంటారని, మిగిలిన ఆత్మలన్నీ మూలవతనంలో ఉంటాయని వారు అర్థం చేసుకోరు. ఈ సాకార వతనం ఎలా ఉంటుందో, మూలవతనం కూడా అలాగే ఉంటుంది. వతనం ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఈ సాకార వతనము ఖాళీ అవ్వదు, ఆ మూలవతనము అవ్వదు. అంతము జరిగినప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతారు. కొంతమంది ఈ వతనంలో ఉంటారు, వతనం పూర్తిగా ఖాళీ అయిపోతే ప్రళయం జరిగేది. కానీ ప్రళయం జరగదు. ఇది అవినాశీ ఖండము కదా. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మేము ఎవరి కళ్యాణం చేయాలి అని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీకు వారితో ప్రీతి జోడింపబడింది కావున వారి పరిచయాన్ని ఇవ్వాలి కదా. వారు తండ్రి, వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఎలా లభిస్తుంది అనేది మేము తెలియజేయగలము అని చెప్పాలి. ఇలా చెప్పగలిగేవారు కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చాలా మంచి రీతిలో భాషణ చేస్తారు, కొంతమంది చేయలేరు కనుక నేర్చుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరు తమ కళ్యాణాన్ని చేసుకోవాలి. మార్గం లభించినప్పుడు ఇతరుల కళ్యాణం చేయాలి. ఇతరులకు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని ఇప్పించాలని, ఆత్మిక సేవ చేయాలని మనసుకు అనిపిస్తుంది. అందరూ ఒకరికొకరు సేవ చేసుకుంటారు.

తండ్రి వచ్చి ఆత్మిక సేవను నేర్పిస్తారు, ఇతరులెవ్వరికీ ఆత్మిక సేవ గురించి తెలియదు. ఆత్మిక తండ్రియే ఆత్మల సేవను చేస్తారు. దైహిక సేవనైతే జన్మజన్మలుగా చాలా చేశారు, ఇప్పుడు అంతిమ జన్మలో తండ్రి నేర్పించిన ఆత్మిక సేవను చేయాలి. ఇందులోనే కళ్యాణముంది, ఇంక దేనిలోనూ లాభం ఉండదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, తోడును నిర్వర్తించాలి. వారికి కూడా ఇదే అర్థం చేయించి, కళ్యాణాన్ని చేయాలి. ప్రీతి ఉన్నట్లయితే, ఎంతో కొంత వింటారు. మేము కూడా సన్యాసం తీసుకోవలసి వస్తుందేమోనని చాలామంది భయపడతారు. ఈ రోజుల్లో సన్యాసులు చాలామంది ఉన్నారు కదా. కాషాయ వస్త్రాలను ధరించి రెండు మాటలు వినిపిస్తే చాలు, ఎక్కడో ఒక చోట నుండి భోజనమైతే లభించేస్తుంది. ఏ దుకాణానికి వెళ్ళినా, రెండు పూరీలనైతే ఇస్తారు. తర్వాత ఇంకొకరి వద్దకు వెళ్తారు, పొట్ట పూజ జరిగిపోతుంది. భిక్షం అడుక్కునే వారు కూడా అనేక రకాలుగా ఉంటారు. ఈ తండ్రి నుండైతే ఒకే విధమైన వారసత్వం లభిస్తుంది. అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది, సదా నిరోగులుగా అవుతారు. షావుకార్లు కష్టం మీద మేలుకుంటారు. పేదవారి కళ్యాణం కూడా చేయాలి. బాబా అనేక ప్రదర్శినీలను తయారుచేయిస్తున్నారు ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి కదా. మినిస్టర్లు మొదలైనవారు ఈ జ్ఞానం బాగుందని భావించినట్లయితే, అందరూ వినడం ప్రారంభిస్తారు. మున్ముందు మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది, అప్పుడు చాలామంది వస్తారు. తుప్పు వదలడానికి సమయం పడుతుంది. ఎవరైనా రాత్రింబవళ్ళు ఇందులో నిమగ్నమైనట్లయితే బహుశా వదిలిపోవచ్చు. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శినీల్లో కూడా అర్థం చేయించాలి. ముఖ్యమైనది - ఇదంతా భారత్ యొక్క విషయము. భారత్ యొక్క ఉన్నతి జరిగినప్పుడు అందరి ఉన్నతి జరుగుతుంది. ప్రొజెక్టర్లతో కన్నా ప్రదర్శినీలతో ఎక్కువ సేవ జరగగలదు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. రోజు రోజుకు మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని కూడా వ్రాయాలి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. బాబా సూచననిస్తారు కానీ పిల్లలు చాలా విషయాలను మర్చిపోతారు. ఏమి జరిగినా సరే, నేటికి 5 వేల సంత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది అని అంటారు. ఇది చాలా స్పష్టమైన విషయము, కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. వార్తాపత్రికల్లో వేయించగలిగితే, ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. జ్ఞాన మార్గంలో చాలా ఫస్ట్ క్లాస్ అవస్థ కావాలి. ఇటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ హర్షితంగా ఉండాలి. ఇది అలవాటైపోతే అవస్థ చాలా సంతోషభరితంగా ఉంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి మరియు అందరి ప్రీతిని ఒక్క తండ్రితో జోడింపజేసే సేవను చేయాలి.

2. సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి. స్వ కళ్యాణం కూడా చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. అవస్థను చాలా సంతోషభరితంగా చేసుకోవాలి.

వరదానము:-

ఒక్క తండ్రి స్మృతితో సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మా భవ

ఎవరైతే ఇతరాత్మల మాటలను వింటూ కూడా వినరో, ఎవరైతే సంకల్పంలోకి గానీ, స్వప్నంలోకి గానీ ఇతరాత్మల స్మృతిని తీసుకురారో, అనగా ఏ దేహధారి ప్రభావంలోకి రారో, ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న స్మృతిలో ఉంటారో, వారికి అవినాశీ సౌభాగ్యం యొక్క తిలకం దిద్దబడుతుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యం కలవారే భాగ్యశాలులు.

స్లోగన్:-

తమ స్థితిని శ్రేష్ఠంగా తయారు చేసుకోవాలంటే, ముందు అంతర్ముఖులుగా అయి, అప్పుడు బాహ్యముఖతలోకి రండి.