01-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 13-12-1990


తపస్యకు పునాది - అనంతమైన వైరాగ్యము

ఈ రోజు బాప్ దాదా స్నేహీ పిల్లలందరినీ స్నేహం యొక్క పుష్పాలను అర్పించడం చూస్తున్నారు. దేశ విదేశాలలోని పిల్లలందరి యొక్క హృదయపూర్వకమైన స్నేహం యొక్క పుష్పాల వర్షాన్ని బాప్ దాదా చూస్తున్నారు. పిల్లలందరి మనసు నుండి ఒకే రాగాన్ని లేక పాటను వింటున్నారు. ఒకటే పాట ఉంది - మేరా బాబా (నా బాబా). నలువైపులా మిలనం జరుపుకోవాలనే శుభమైన ఆశల యొక్క దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఈ దివ్య దృశ్యాన్ని పూర్తి కల్పంలో బాప్ దాదా మరియు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు. ఈ సాటిలేని స్నేహపు పుష్పాలు ఇక్కడి ఈ పాత ప్రపంచం యొక్క కోహినూర్ వజ్రం కన్నా అమూల్యమైనవి. హృదయం యొక్క ఈ పాటను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ పాడలేరు. ఇలాంటి దీపావళిని ఇంకెవ్వరూ జరుపుకోలేరు. బాప్ దాదా ఎదురుగా పిల్లలందరూ ఇమర్జ్ అయి ఉన్నారు. ఈ స్థూలమైన స్థానంలో అందరూ కూర్చోలేరు కానీ బాప్ దాదా హృదయ సింహాసనము అతి విశాలమైనది, అందుకే అందరినీ ఇమర్జ్ రూపంలో చూస్తున్నారు. అందరి ప్రియస్మృతులను మరియు స్నేహభరితమైన అధికారంతో కూడిన ఫిర్యాదులను కూడా వింటున్నారు మరియు దానితో పాటు పిల్లలు ప్రతి ఒక్కరికీ రిటర్న్ లో పదమాల రెట్లు ఎక్కువ ప్రియస్మృతులను ఇస్తున్నారు. మేమంతా సాకార స్వరూపంలో మిలనం జరుపుకోవాలి అని పిల్లలు అధికారంతో అంటారు. తండ్రి కూడా కోరుకుంటారు, పిల్లలు కూడా కోరుకుంటారు. అయినా, సమయ ప్రమాణంగా బ్రహ్మాబాబా అవ్యక్త ఫరిశ్తా రూపంలో సాకార స్వరూపం కన్నా అనేక రెట్లు తీవ్ర వేగంతో సేవ చేస్తూ పిల్లలను తమ సమానంగా తయారుచేస్తున్నారు. కేవలం ఒకటి, రెండు సంవత్సరాలే కాదు, కానీ అనేక సంవత్సరాలు అవ్యక్త మిలనాన్ని, అవ్యక్త రూపంలో సేవ యొక్క అనుభవం చేయించారు మరియు చేయిస్తూ ఉన్నారు కూడా. కనుక బ్రహ్మాబాబా అవ్యక్తంగా ఉన్నా కూడా, వ్యక్తంలో పాత్రను ఎందుకు అభినయించారు? సమానంగా తయారుచేయడం కోసము. బ్రహ్మాబాబా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు కనుక పిల్లలు రిటర్న్ లో ఏం చేయాలి? వ్యక్తం నుండి అవ్యక్తంగా అవ్వాలి. సమయమనుసారంగా అవ్యక్త మిలనము, అవ్యక్త రూపం ద్వారా సేవ ఇప్పుడు అత్యంత అవసరము. అందుకే, ఎప్పటికప్పుడు బాప్ దాదా అవ్యక్త మిలనం యొక్క అనుభూతి కోసం సూచన ఇస్తూ ఉంటారు. దీని కోసం తపస్యా సంవత్సరాన్ని కూడా జరుపుకుంటున్నారు కదా. మెజారిటీ పిల్లలకు ఉమంగ-ఉత్సాహాలు బాగున్నాయని బాప్ దాదా హర్షిస్తున్నారు. మైనారిటీ పిల్లలు ప్రోగ్రామ్ అనుసారంగా చేయాల్సిందే అని అనుకుంటారు. ఒకటేమో - ప్రోగ్రాం అనుసారం చేయడము మరియు రెండవది - హృదయపూర్వకమైన ఉమంగ-ఉత్సాహాలతో చేయడము. ప్రతి ఒక్కరు స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎందులో ఉన్నాను?

సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా, స్వఉన్నతి అనుసారంగా, తీవ్ర గతి యొక్క సేవ అనుసారంగా, బాప్ దాదా స్నేహానికి రిటర్న్ ఇవ్వడం కోసము, తపస్య చాలా అవసరము. ప్రేమించడం అతి సులభము మరియు అందరూ ప్రేమిస్తారు కూడా - ఇది బాబాకు తెలుసు, కానీ రిటర్న్ స్వరూపంలో బాప్ దాదా సమానంగా అవ్వాలి. ఈ సమయంలో బాప్ దాదా ఇది చూడాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో కొందరిలో కొందరు మాత్రమే వెలువడుతారు. కోరుకోవడం అందరూ కోరుకుంటారు కానీ కోరుకునేవారు మరియు చేసేవారు - ఈ సంఖ్యలో తేడా ఉంది ఎందుకంటే తపస్యకు సదా మరియు సహజమైన పునాది - అనంతమైన వైరాగ్యము. అనంతమైన వైరాగ్యము అనగా నలువైపులా ఉన్న తీరాలను వదిలేయడము ఎందుకంటే తీరాలను ఆధారంగా చేసుకున్నారు. సమయ ప్రమాణంగా ప్రియంగా అవ్వాలి మరియు సమయ ప్రమాణంగా శ్రీమతమనుసారంగా మరియు నిమిత్తమైన ఆత్మల సూచనల అనుసారంగా బుద్ధి ప్రియం నుండి మళ్ళీ అతీతంగా అవ్వాలి - అలా జరగడం లేదు. ఎంత త్వరగా ప్రియంగా అవుతారో, అంత త్వరగా అతీతంగా అవ్వరు. ప్రియంగా అవ్వడంలో తెలివైనవారిగా ఉన్నారు, అతీతంగా అవ్వడంలో ధైర్యం కావాలి అని ఆలోచిస్తారు. అతీతంగా అవ్వడమే తీరాన్ని వదిలేయడము మరియు తీరాన్ని వదిలేయడమే అనంతమైన వైరాగ్య వృత్తి. తీరాలను ఆధారంగా చేసుకుని పట్టుకోవడం వచ్చు కానీ వదిలే విషయంలో ఏం చేస్తారు? పెద్ద ప్రశ్నార్థకాన్ని పెడతారు. సేవకు ఇంచార్జ్ గా అవ్వడం చాలా బాగా వచ్చు కానీ ఇంచార్జ్ గా అవ్వడంతో పాటు స్వయం మరియు ఇతరుల బ్యాటరీని ఛార్జ్ చేయడం కష్టమనిపిస్తుంది, అందుకే వర్తమాన సమయంలో తపస్య ద్వారా వైరాగ్య వృత్తి అత్యంత అవసరము.

తపస్యలో సఫలతకు విశేషమైన ఆధారము మరియు సహజమైన సాధనము ఏమిటంటే - ఒకటి అనే పదం యొక్క పాఠాన్ని పక్కా చేసుకోండి. రెండు లేక మూడు వ్రాయడం కష్టమనిపిస్తుంది. ఒకటి వ్రాయడం చాలా సులభము. తపస్య అనగా ఒక్కరికి చెందినవారిగా అవ్వడము. దీనినే బాప్ దాదా ఏక్ నామీ అని అంటారు. తపస్య అనగా మనస్సు-బుద్ధిని ఏకాగ్రం చేయడము, తపస్య అనగా ఏకాంతప్రియులుగా ఉండడము, తపస్య అనగా స్థితిని ఏకరసంగా ఉంచుకోవడము, తపస్య అనగా ప్రాప్తించిన సర్వ ఖజానాలను వ్యర్థం నుండి రక్షించడము అనగా ఎకానమీ (పొదుపు) గా నడుచుకోవడము. కనుక ఒకటి అనే పాఠం పక్కా అయింది కదా. ఒకటి అనే పాఠం కష్టమా లేక సులభమా? అసలైతే సహజమే కానీ - అని ఇటువంటి భాషనైతే మాట్లాడరు కదా.

మీరు చాలా చాలా భాగ్యవంతులు. అనేక రకాల శ్రమ నుండి విముక్తులయ్యారు. ప్రపంచంలోని వారి చేత సమయం చేయిస్తుంది మరియు సమయం వచ్చినప్పుడు తప్పదు కాబట్టి చేస్తారు. పిల్లలను తండ్రి సమయం కన్నా ముందే తయారుచేస్తారు మరియు మీరు తండ్రిపై ప్రేమతో చేస్తారు. ఒకవేళ ప్రేమతో చేయలేదు లేక కొద్దిగానే చేసారు, అప్పుడు ఏమవుతుంది? తప్పదు కావున చేయాల్సే వస్తుంది. అనంతమైన వైరాగ్యాన్ని ధారణ చేయాల్సే వస్తుంది కానీ తప్పదు కావున చేసినదానికి ఫలం లభించదు. ప్రేమతో చేస్తే ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము తయారవుతుంది, మరియు తప్పదు కావున చేసేవారు ఎక్కడ నుండి క్రాస్ చేయాల్సి వస్తుంది! క్రాస్ చేయడం కూడా క్రాస్ (శిలువ) పైకి ఎక్కడంతో సమానము. మరి ఏది ఇష్టము? ప్రేమతో చేస్తారు. బాప్ దాదా తర్వాత ఎప్పుడైనా తీరాల లిస్టును వినిపిస్తారు. వాస్తవానికి, తెలుసుకోవడంలోనైతే తెలివైనవారు కానీ రివైజ్ చేయిస్తారు ఎందుకంటే బాప్ దాదా అయితే పిల్లల ప్రతిరోజు దినచర్యను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలరు. మొత్తం రోజంతా ఒక్కొక్కరిదీ చూసే వ్యాపారమేమీ చేయరు. సాకార బ్రహ్మాబాబాను చూడండి, వారి దృష్టి స్వతహాగానే ఎక్కడ పడేది. మీ ఉత్తరం కావచ్చు, లెక్కాపత్రం కావచ్చు, ఏదైనా నడవడిక కావచ్చు, 8 పేజీల ఉత్తరమైనా కావచ్చు కానీ బాబా దృష్టి ఎక్కడ పడేది? ఎక్కడైతే సూచన ఇవ్వాల్సి ఉండేదో, ఎక్కడైతే అవసరముండేదో, అక్కడ పడేది. బాప్ దాదా అన్నీ చూస్తారు కూడా, కానీ చూడరు కూడా. అన్నీ తెలుసు కూడా, కానీ తెలియదు కూడా. ఏదైతే అవసరం లేదో, దానిని చూడరు, తెలుసుకోరు. ఆటలైతే చాలా మంచివి చూస్తాము, అవి మరెప్పుడైనా వినిపిస్తాము. అచ్ఛా. తపస్య చేయడము, అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండడము సులభమే కదా. తీరాలను వదలడం కష్టమా? కానీ తయారవ్వాల్సింది కూడా మీరే. కల్ప-కల్పము యొక్క ప్రాప్తికి అధికారులుగా అయ్యారు మరియు తప్పకుండా అవుతారు. అచ్ఛా. ఈ సంవత్సరం కల్పక్రితం యొక్క, అనేక కల్పాల పాతవారు మరియు ఈ కల్పంలో కొత్త పిల్లలకు అవకాశం లభించింది. కావున అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది కదా? మెజారిటీ కొత్తవారు, టీచర్లు పాతవారు. మరి టీచర్లు ఏం చేస్తారు? వైరాగ్య వృత్తిని ధారణ చేస్తారు కదా? తీరాలను వదిలేస్తారా? లేక ఆ సమయంలో - చేయాలని అనుకుంటున్నాము కానీ ఎలా చేయాలి అని అంటారా? చేసి చూపించేవారా లేక కేవలం వినిపించేవారా? నలువైపుల నుండి ఏ పిల్లలైతే వచ్చారో, ఆ పిల్లలందరినీ బాప్ దాదా సాకార రూపంలో చూసి హర్షిస్తున్నారు. ధైర్యం పెట్టారు మరియు తండ్రి సహాయమైతే సదా ఉండనే ఉంది, అందుకే సదా ధైర్యం ద్వారా సహాయం యొక్క అధికారాన్ని అనుభవం చేస్తూ సహజంగా ఎగురుతూ వెళ్ళండి. తండ్రి సహాయం ఇస్తారు కానీ తీసుకునేవారు తీసుకోవాలి. దాత ఇస్తారు కానీ తీసుకునేవారు యథాశక్తి కలవారిగా అవుతారు. కనుక యథాశక్తి కలవారిగా అవ్వకండి. సదా సర్వశక్తివంతులుగా అవ్వండి. అప్పుడు వెనుక వచ్చేవారు కూడా ముందు నంబరు తీసుకుంటారు. అర్థమయిందా. సర్వశక్తుల అధికారాన్ని పూర్తిగా ప్రాప్తి చేసుకోండి. అచ్ఛా.

నలువైపులా ఉన్న సర్వ స్నేహీ ఆత్మలు, సదా తండ్రి ప్రేమకు రిటర్న్ ఇచ్చేవారు, అనన్య ఆత్మలు, సదా తపస్వీ మూర్తి స్థితిలో స్థితులై ఉండేవారు, తండ్రికి సమీపమైన ఆత్మలు, సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని లక్షణాల రూపంలోకి తీసుకొచ్చేవారు - ఇలాంటి దేశ-విదేశాల పిల్లలందరికీ హృదయాభిరాముడైన తండ్రి యొక్క ప్రాణప్రదమైన, ప్రియాతి ప్రియమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక - అష్టశక్తిధారులు, ఇష్టులు మరియు అష్టులు కదా. అష్టుల గుర్తు ఏమిటో తెలుసు కదా? ప్రతి కర్మలో సమయమనుసారంగా, పరిస్థితి అనుసారంగా ప్రతి శక్తిని కర్మలోకి తీసుకొచ్చేవారు. అష్ట శక్తులు ఇష్టులుగా కూడా చేస్తాయి మరియు అష్టులుగా కూడా చేస్తాయి. అష్టశక్తిధారులుగా ఉన్నారు కనుక ఎనిమిది భుజాలను చూపిస్తారు. ఎనిమిది శక్తులు విశేషమైనవి. వాస్తవానికి ఎన్నో ఉన్నాయి కానీ ఎనిమిదిలో మెజారిటీ వచ్చేస్తాయి. విశేషమైన శక్తులను సమయానికి కార్యంలోకి తీసుకురావాలి. ఎలాంటి సమయమో, ఎలాంటి పరిస్థితో, అలాంటి స్థితి ఉండాలి - అటువంటివారిని అష్టులు లేక ఇష్టులు అని అంటారు. కనుక ఇటువంటి గ్రూపు తయారైంది కదా? విదేశాలలో ఎంతమంది తయారై ఉన్నారు? అష్టులలోకి వచ్చేవారు కదా? అచ్ఛా.

(ఉదయము బ్రహ్మముహూర్త సమయంలో సంతరీ దాదీ శరీరం వదిలారు - 13-12-1990)

మంచిది, అందరు వెళ్ళాల్సిందే. ఎవర్రెడీగా ఉన్నారా లేక నా సెంటరు, జిజ్ఞాసువులు ఏమవుతారు అని గుర్తుకొస్తుందా? నాది-నాది అని అయితే గుర్తు రాదు కదా? అందరు వెళ్ళాల్సిందే కానీ ప్రతి ఒక్కరి లెక్కలు ఎవరివి వారివి. లెక్కాచారాలను సమాప్తం చేసుకోకుండా ఎవరూ వెళ్ళలేరు, అందుకే అందరూ సంతోషంగా సెలవు ఇచ్చారు. అందరికీ మంచిగా అనిపించింది కదా. ఈ విధంగా వెళ్ళడం మంచిది కదా. కనుక మీరు కూడా ఎవర్రెడీగా అవ్వండి. అచ్ఛా.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మిలనము

1. ఢిల్లీ మరియు పంజాబ్, రెండూ సేవ యొక్క ఆది స్థానాలు. స్థాపన యొక్క స్థానాలను సదా మహత్వపూర్ణమైనవిగా చూడడం జరుగుతుంది మరియు మహిమ చేయడం జరుగుతుంది. ఏ విధంగా సేవలో ఆది స్థానాలుగా ఉన్నాయో, అలా స్థితిలో ఆది రత్నాలుగా ఉన్నారా? స్థానంతో పాటు స్థితికి కూడా మహిమ ఉంది కదా. ఆది రత్నాలు అనగా ప్రతి శ్రీమతాన్ని జీవితంలో తీసుకువచ్చేందుకు ఆది (ప్రారంభం) చేసేవారు. కేవలం విని-వినిపించేవారు కాదు, కానీ చేసేవారు, ఎందుకంటే విని-వినిపించేవారు అయితే అనేకమంది ఉన్నారు కానీ చేసేవారు కోట్లలో కొందరే ఉన్నారు. కావున - మేము కోట్లలో కొందరిమి అనే నషా ఉంటుందా? ఈ ఆత్మిక నషా, మాయ యొక్క నషాల నుండి విడిపిస్తుంది. ఈ ఆత్మిక నషా రక్షణ యొక్క సాధనము. ఏ రకమైన మాయ నషా అయినా - ధరించాలని, తినాలని, చూడాలని - ఇవేవీ తమ వైపుకు ఆకర్షించలేవు. ఇటువంటి నషాలో ఉంటారా లేక మాయ కొద్ది-కొద్దిగా ఆకర్షిస్తుందా? ఇప్పుడు తెలివైనవారిగా అయ్యారు కదా. మాయ గురించి తెలివి కూడా ఉంది. తెలివైనవారు ఎప్పుడూ మోసపోరు. ఒకవేళ తెలివైనవారు ఎప్పుడైనా మోసపోతే, అందరూ వారిని ఏమంటారు? తెలివైనవారు, కానీ మోసపోయారా! మోసపోవడం అనగా దుఃఖాన్ని ఆహ్వానించడము. ఎప్పుడైతే మోసపోతారో, అప్పుడు దాని వలన దుఃఖం లభిస్తుంది కదా. మరి దుఃఖాన్ని ఎవరైనా తీసుకోవాలని అనుకుంటున్నారా? అందుకే మీరు సదా ఆది రత్నాలు అనగా ప్రతి శ్రీమతాన్ని మొదట తమ జీవితంలో ఆచరించేవారు. ఇలా ఉన్నారా? లేక ఇతరులను చూస్తారా - మొదట ఇతరులు చేస్తే, అప్పుడు మేము చేస్తాము, వీరు చేయకపోతే మేమెలా చేస్తాము! చేయడంలో మొదట నేను. ఇతరులు మారాలి, అప్పుడు నేను మారతాను... వీరు కూడా మారితే, అప్పుడు నేను మారతాను... అలా ఉండకూడదు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు, మరియు ఎంత పొందుతారు? ఒకటికి పదమాల రెట్లు. కనుక చేయడంలో మజా ఉంది కదా. ఒకటి చేయండి మరియు పదమాలు పొందండి. ఇందులోనైతే ప్రాప్తియే ప్రాప్తి ఉంది, అందుకే శ్రీమతాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురావడంలో మొదట నేను. మాయకు వశమవ్వడంలో మొదట నేను కాదు, కానీ ఈ పురుషార్థంలో మొదట నేను - అప్పుడే సఫలతను ప్రతి అడుగులో అనుభవం చేస్తారు. సఫలత అయ్యే ఉంది. కేవలం కొద్దిగా దారిని మారుస్తారు, దారిని మార్చడంతో గమ్యం దూరమైపోతుంది, సమయం పడుతుంది. ఒకవేళ ఎవరైనా తప్పు దారిలో వెళ్ళిపోతే, గమ్యం దూరమైపోతుంది కదా. కావున అలా చేయకండి. గమ్యం ఎదురుగా నిలబడి ఉంది. ఎప్పుడైనా శ్రమ చేయాల్సి వస్తే, ప్రేమ వైపు త్రాసు పళ్లెము తేలికగా ఉంటుంది. ఒకవేళ ప్రేమ ఉంటే, ఎప్పుడూ శ్రమ చేయలేరు ఎందుకంటే తండ్రి అనేక భుజాల సహితంగా మీకు సహాయం చేస్తారు. వారు తమ భుజాలతో క్షణంలో కార్యాన్ని సఫలం చేస్తారు. పురుషార్థంలో సదా ఎగురుతూ ఉంటారు. పంజాబ్ వారు ఎగురుతారా లేక భయపడతారా? పక్కా అనుభవజ్ఞులుగా అయ్యారా? ఏమవుతుంది, ఎలా అవుతుంది... అని ఎవరైనా భయపడేవారు ఉన్నారా? లేదు. వారికి కూడా శాంతి దానాన్ని ఇచ్చేవారు. ఎవరైనా వస్తే, శాంతిని తీసుకుని వెళ్ళాలి, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. జ్ఞానమివ్వకపోయినా కానీ శాంతి వైబ్రేషన్లు కూడా శాంతిగా చేస్తాయి. అచ్ఛా.

2. నలువైపుల నుండి వచ్చిన శ్రేష్ఠ ఆత్మలందరూ బ్రాహ్మణులు, అంతేకానీ రాజస్థానీయులు, మహారాష్ట్రీయులు, మధ్యప్రదేశీయులు కాదు. అందరూ ఒక్కటే. ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసులు. బ్రాహ్మణుల ఒరిజనల్ స్థానము మధుబన్. సేవ కోసం వేర్వేరు స్థానాలకు వెళ్ళారు. ఒకవేళ ఒకే స్థానంలో కూర్చుంటే, నలువైపులా సేవ ఎలా జరుగుతుంది? అందుకే సేవార్థం వేర్వేరు స్థానాలకు వెళ్ళారు. లౌకికంలో బిజినెస్ మేన్ అయినా లేక గవర్నమెంట్ సర్వెంట్ అయినా లేక ఫ్యాక్టరీలో పని చేసేవారైనా... మీ ఒరిజనల్ కర్తవ్యము - ఈశ్వరీయ సేవాధారి. మాతలు కూడా ఇంట్లో ఉంటూ ఈశ్వరీయ సేవలో ఉన్నారు. జ్ఞానాన్ని ఎవరైనా విన్నా, వినకపోయినా - శుభభావన, శుభకామనల వైబ్రేషన్లతో కూడా పరివర్తనవుతారు. కేవలం వాణి సేవనే సేవ కాదు, శుభభావన పెట్టడం కూడా సేవనే. కనుక రెండు సేవలు చేయడం వచ్చు కదా? ఎవరైనా మిమ్మల్ని నిందించినా కానీ, మీరు శుభభావన, శుభకామనలను వదలకండి. బ్రాహ్మణుల పని - ఏదో ఒకటి ఇవ్వడము. కావున ఈ శుభభావన, శుభకామనలను పెట్టడం కూడా శిక్షణ ఇవ్వడమే. అందరూ వాణి ద్వారా పరివర్తనవ్వరు. ఎలాంటి వారైనా సరే, పక్కా రావణుడైనా సరే, ఎంతో కొంత దోసిలిని తప్పకుండా అందించండి. చాలా మంది మాతలు అంటారు కదా - మా సంబంధీకులు పక్కా రావణులు, వారు మారేవారు కాదు, అలాంటి ఆత్మలకు కూడా మీ ఖజానా నుండి శుభభావన, శుభకామనల దోసిలిని తప్పకుండా ఇవ్వండి. ఎవరైనా నిందించినా కూడా, వారి నోటి నుండి ఏం వెలువడుతుంది? వీరు బ్రహ్మాకుమారీలు... అంటే బ్రహ్మాబాబాను అయితే గుర్తు చేసుకుంటారు, నిందించినా కానీ బ్రహ్మా అని అయితే అంటారు. వారికి తెలిసినా లేక తెలియకపోయినా, ఎంతైనా తండ్రి పేరునైతే తీసుకుంటారు కదా. మీరు అయితే వారికి దోసిలిని అందించండి. ఇలా దోసిలిని అందిస్తారా లేక ఎవరైతే వినరో, వారిని వదిలేస్తారా? వదలకండి లేదంటే చివర్లో మీ చెవి పట్టుకుంటారు, ఫిర్యాదు చేస్తారు - మేమైతే తెలివిలేనివారము, మీరు ఎందుకు ఇవ్వలేదు. కనుక చెవి పట్టుకుంటారు కదా. ఎవరైనా తీసుకున్నా, తీసుకోకపోయినా, మీరు ఇస్తూ వెళ్ళండి. బాప్ దాదా ప్రతిరోజు ఎంత ఖజానాను పిల్లలకు ఇస్తారు. కొందరు పూర్తిగా తీసుకుంటారు, కొందరు యథాశక్తి తీసుకుంటారు. మరి బాప్ దాదా ఎప్పుడైనా - నేను ఇవ్వను, మీరెందుకు తీసుకోరు అని అంటారా? కనుక బ్రాహ్మణుల కర్తవ్యము ఇవ్వడము. దాత పిల్లలు కదా. వారు బాగుంది అని చెప్పిన తర్వాత మీరు ఇస్తే అది తీసుకునేవారిగా అయినట్లు. తీసుకునేవారు ఎప్పుడూ దాత పిల్లలుగా అవ్వలేరు, దేవతలుగా అవ్వలేరు. మీరు దేవతలుగా అయ్యేవారు కదా? దేవతా వస్త్రము తయారుగా ఉంది కదా? లేక ఇప్పుడింకా కుట్టడం జరుగుతుందా, ఉతకడం జరుగుతుందా లేక కేవలం ఇస్త్రీ చేయడం మాత్రమే మిగిలి ఉందా? దేవతా వస్త్రము ఎదురుగా కనిపించాలి. ఈ రోజు ఫరిశ్తా, రేపు దేవత. ఎన్ని సార్లు దేవతగా అయ్యారు? కనుక సదా స్వయాన్ని - మేము దాత పిల్లలము మరియు దేవతలుగా అయ్యేవారము అని గుర్తుంచుకోండి. దాత పిల్లలు మొదట తీసుకుని, తర్వాత ఇవ్వరు. గౌరవం లభించాలి, గౌరవం ఇస్తే ఇస్తాను - ఇలా కాదు. దాత పిల్లలు సదా ఇచ్చేటువంటివారు. ఇటువంటి నషా సదా ఉంటుంది కదా. లేక అప్పుడప్పుడు తక్కువ, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుందా? ఇప్పుడింకా మాయకు వీడ్కోలు ఇవ్వలేదా? నెమ్మది-నెమ్మదిగా ఇవ్వకండి, అంత సమయం లేదు. ఒకటేమో, ఆలస్యంగా వచ్చారు, మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా పురుషార్థం చేస్తే చేరుకోలేరు. నిశ్చయం కలిగింది, నషా ఎక్కింది, ఇక ఎగరండి. ఇప్పుడిది ఎగిరే కళ యొక్క సమయము. ఎగరడము వేగంగా ఉంటుంది కదా. మీరు భాగ్యశాలి - ఎగిరే సమయంలో వచ్చారు. కావున సదా ఇలానే అనుభవం చేయండి - మేము చాలా గొప్ప భాగ్యశాలి. ఇటువంటి భాగ్యము మళ్ళీ పూర్తి కల్పంలో ఎప్పుడూ లభించదు. కావున దాత పిల్లలుగా అవ్వండి, తీసుకునే సంకల్పం కూడా ఉండకూడదు, ధనం ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, భోజనం ఇవ్వండి... అని. దాత పిల్లలకు అన్నీ స్వతహాగానే ప్రాప్తిస్తాయి. అడిగేవారికి లభించవు. దాతగా అయినట్లయితే వాటంతట అవే లభిస్తూ ఉంటాయి. అచ్ఛా.

వరదానము:-

యథార్థ స్మృతి ద్వారా సర్వ శక్తి సంపన్నంగా అయ్యే సదా శస్త్రధారి, కర్మయోగి భవ

యథార్థ స్మృతి యొక్క అర్థము, సర్వశక్తులతో సదా సంపన్నంగా ఉండడము. పరిస్థితి రూపీ శత్రువు వచ్చింది కానీ శస్త్రాలు పని చేయకపోతే, శస్త్రధారులు అని అనడం జరగదు. ప్రతి కర్మలో స్మృతి ఉంటే, అప్పుడే సఫలత ఉంటుంది. ఎలాగైతే కర్మలు చేయకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరో, అలా ఏ కర్మ అయినా కూడా యోగం లేకుండా చేయలేరు, అందుకే కర్మ-యోగులుగా, శస్త్రధారులుగా అవ్వండి మరియు సమయానికి సర్వ శక్తులను ఆజ్ఞానుసారంగా ఉపయోగించండి - అప్పుడు యథార్థ యోగి అని అంటారు.

స్లోగన్:-

ఎవరి సంకల్పాలు మరియు కర్మలు మహాన్ గా ఉంటాయో, వారే మాస్టర్ సర్వశక్తివంతులు.