01-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - సదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉన్నట్లయితే తండ్రి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది, సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది

ప్రశ్న:-

దృష్టితో తృప్తి చెందే పిల్లల యొక్క హృదయంలో ఎటువంటి సంతోషం ఉంటుంది?

జవాబు:-

వారి హృదయంలో స్వర్గ రాజ్యం యొక్క సంతోషం ఉంటుంది ఎందుకంటే తండ్రి దృష్టి లభించింది అనగా వారసత్వానికి అధికారులుగా అయ్యారు. తండ్రిలో అంతా ఇమిడి ఉంది.

ప్రశ్న:-
తండ్రి పిల్లలకు ప్రతి రోజు రకరకాల పద్ధతులలో కొత్త పాయింట్లను ఎందుకు వినిపిస్తారు?

జవాబు:-
ఎందుకంటే పిల్లల యొక్క అనేక జన్మల మనోకామనలను పూర్తి చేయాలి. పిల్లలు తండ్రి ద్వారా కొత్త-కొత్త పాయింట్లను వింటారు, అప్పుడు తండ్రి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది.

గీతము:-
నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు... (తూనే రాత్ గవాయీ సోకే ...)

ఓంశాంతి

పిల్లలు వారిని చూస్తూ కూర్చున్నారు. తండ్రి కూడా ఆత్మను మరియు ఈ శరీరాన్ని చూస్తున్నారు. పిల్లలు కూడా చూస్తున్నారు. చూడడంలో ఆనందం కలుగుతుందా లేక వినడంలో ఆనందం కలుగుతుందా? ఎందుకంటే వినడమైతే చాలానే విన్నారు. జ్ఞానం మొదలైనవాటిని లెక్కలేనంతగా విన్నారు. మీరు నంబరువన్ భక్తులు. మీరే అందరికన్నా ఎక్కువ భక్తిని చేసారు. వేదాలు, శాస్త్రాలు, గ్రంథ్, గీత, గాయత్రి, మొదలైనవన్నీ చదివారు, జప-తపాదులు మొదలైనవి చేసారు, చాలా విన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పటి నుండి మొదలుకొని వీటిని విన్నారు? ఎప్పటి నుండైతే ఇవి ప్రారంభమయ్యాయో, అప్పటి నుండి చాలా విన్నారు. ఇకపోతే, తండ్రిని దృష్టి ద్వారా కలుసుకోవడమైతే ఇప్పుడే జరుగుతుంది. దృష్టితో తప్పకుండా తృప్తి చెందుతారు. ఒక శ్లోకము కూడా ఉంది - స్వామి, సద్గురువు అయిన పరమాత్మ యొక్క ఒక్క చల్లని చూపు మనకు ఎంతో తృప్తినిస్తుంది. వారు గురువు కూడా, ప్రేయసులకు స్వామి కూడా. వారి దృష్టి ఎదురుగా కూర్చున్నారు. దృష్టి ద్వారానే తండ్రి గురించి తెలుసుకున్నారు - వారి నుండి మనకు విశ్వం యొక్క యజమానత్వం లభిస్తుంది అని. తండ్రిని చూడడంతో హృదయం సంతోషిస్తుంది ఎందుకంటే తండ్రి ద్వారానే అంతా లభిస్తుంది. తండ్రిలోనే మొత్తం అంతా ఇమిడి ఉంది. తండ్రి లభించినప్పుడు, వారి దృష్టి ఎదురుగా కూర్చున్నప్పుడు తప్పకుండా పిల్లలకు స్వర్గ రాజ్యం యొక్క నషా కూడా ఎక్కుతుంది. మొదట తండ్రి యొక్క నషా, ఆ తర్వాత రాజ్యవారసత్వం యొక్క నషా. మనం ఇప్పుడు తండ్రి ఎదురుగా కూర్చున్నామని మనకు తెలుసు. దేహాభిమానము ఇప్పుడు తొలగుతూ ఉంది. ఆత్మలమైన మనం ఈ శరీరముతో పాటు చక్రములో తిరుగుతాము, పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ, ఇప్పుడు మన తండ్రి కూడా సమ్ముఖంలో కూర్చున్నారు. తండ్రి విషయంలో వారసత్వం యొక్క సంతోషం ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే పెద్దవారవుతారో, అప్పుడు నేను ఇంజనీరు బిడ్డను, బ్యారిస్టరు బిడ్డను, చక్రవర్తి బిడ్డను, నేను రాజ్యానికి చక్రవర్తిని అని బుద్ధిలోకి వస్తుంది. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుందని ఇక్కడ మీకు తెలుసు. తండ్రిని చూడడంతో పిల్లలకు స్థిరమైన సంతోషం కలగాలి, దీనినే ఆత్మిక సంభాషణ అని అంటారు. ఎవరైతే సర్వులకు పరమపితనో, వారు కూర్చుని ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మ ఈ శరీరం ద్వారా వింటుంది. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఎప్పుడైతే వారు వస్తారో మరియు దృష్టినిస్తారో, అప్పుడు 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు, కేవలం ఈ ఒక్కసారి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది పిల్లలైన మీకు గుర్తుండాలి. పిల్లలు మర్చిపోతారు, అలా మర్చిపోకూడదు. బాబా దృష్టికి ఎదురుగా ఉన్నప్పుడే, మేము బాబాతో పాటు కూర్చున్నాము అని భావిస్తారు. బాబాను చూడడంతో సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది మరియు తండ్రి కూర్చుని కొత్త-కొత్త పాయింట్లను అర్థం చేయిస్తారు. తండ్రి పట్ల పిల్లలకు పూర్తి ప్రేమ ఉండాలి. ఆత్మ తన మనోకామనలను నెరవేర్చుకోవాలి ఎందుకంటే ఇంతకాలం తండ్రి నుండి విడిపోయి ఉంది. అనేక రకాల దుఃఖాలను చూసారు. ఇప్పుడు సమ్ముఖంలో కూర్చున్నారు కావున చూసి హర్షితులవ్వాలి. తండ్రి సమ్ముఖంలో ఉన్నప్పుడు హర్షితంగా ఉంటారా లేక తండ్రి నుండి దూరంగా ఉన్నా కూడా ఇంతే హర్షితంగా ఉంటారా? వివేకం ఏం చెప్తుంది అంటే, బయట అయితే చాలా విషయాలను వింటారు కనుక బుద్ధి వేరే వైపులకు వెళ్తుంది. ఇక్కడ మధుబన్ లో ఏ పిల్లలైతే కూర్చున్నారో, వారు సమ్ముఖంలో వింటారు. బాబా ప్రేమగా ఆకర్షిస్తారు. చూడండి, మీ బాబా ఎంతటి మధురమైనవారు, ఎంతటి ప్రియమైనవారు. మిమ్మల్ని స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నారు. పిల్లలు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు డ్రామానుసారంగా అంతా పోగొట్టుకున్నారు. రాజ్యాన్ని పోగొట్టుకోవడము మరియు పొందడము, ఇదైతే పెద్ద విషయమేమీ కాదు. మీకు మాత్రమే ఈ విషయము గురించి తెలుసు. ప్రపంచంలో కోట్లాది మంది ఆత్మలు ఉన్నారు, కానీ కోట్లలో ఏ ఒక్కరో నన్ను గుర్తిస్తారు. నేను ఎవరిని మరియు ఎలా ఉన్నాను, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, నా ద్వారా ఏం లభిస్తుంది అన్నది అర్థం చేసుకున్నా కూడా విచిత్రమేమిటంటే, మాయ మరపింపజేస్తుంది. అలాగని, సమ్ముఖంలో ఉన్నవారికి మాయ మరపింపజేయదని కాదు. సమ్ముఖంగా ఉన్నవారిని కూడా మాయ మరపింపజేస్తుంది. శివబాబా పట్ల కూడా పూర్తి ప్రేమ ఉండాలి. బాబా నుండి మనం ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రేమ ఎలా పెరుగుతుంది? తండ్రి అంటారు - సేవ చేయండి. తండ్రి పిల్లల సేవను చేస్తారు. బాబా దూరదేశము నుండి వచ్చారని పిల్లలకు తెలుసు. నిశ్చయబుద్ధి కల పిల్లలు ఎప్పుడూ చంచలమవ్వకూడదు, తికమకపడకూడదు, కానీ మాయ చాలా శక్తివంతమైనది. బాబా అయితే అలంకరిస్తున్నారు. మనుష్యులను దేవతలుగా చేస్తారు. ఇది ఉన్నదే దేవతలుగా అయ్యే స్కూలు. ఇది పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు చేసేటువంటి శ్రమ. బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అని అంటారు. మనుష్యులు మరణించేటప్పుడు రాముడిని తలుచుకోండి అని వారికి చెప్తారు. కానీ రాముడి గురించి తెలియనే తెలియనప్పుడు తలచుకోవడం వలన లాభమేమీ ఉండదు. మీకైతే తండ్రి గురించి పూర్తి పరిచయం ఉంది. మీరు శివబాబా వద్దకే వస్తారు. వారు నిరాకారుడు, రచయిత. ఎలా రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మాను కూడా రచయిత అని అంటారు, బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టి రచించబడుతుంది, అందుకే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మేము శివబాబాకు మనవలుగా, బ్రహ్మాకు పిల్లలుగా అయ్యామని ఆత్మ అయిన మీకు ఇప్పుడు మంచి రీతిలో తెలుసు. మా వికర్మలు వినాశనమవ్వాలి మరియు మేము విజయ మాలలో దగ్గరగా కూర్చబడాలి అని పిల్లలైన మీరు కోరుకుంటారు, దానికోసం బాబాను చాలా స్మృతి చేయవలసి ఉంటుంది. అంతేకాక మీరు కర్మయోగులు కూడా. ఇళ్ళు-వాకిళ్ళను సంభాళిస్తూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. ఈ ఉదాహరణ సన్యాసులెవ్వరికీ వర్తించదు. వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండలేరు. అంతేకాక ఎవ్వరికీ చెప్పలేరు. ఎవరు ఏ విధంగా ఉంటారో, వారు ఆ విధంగానే తయారుచేస్తారు. సన్యాసులు, కమలం వలె పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు. ఒకవేళ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయమని చెప్పినా, అది కూడా సంభవం కాదు. మీరైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలేసారు, మేము ఎలా వదలాలి? అని అంటారు. మీరే ఇంట్లో-గృహస్థంలో ఉండలేకపోతే, మరి ఇతరులకు ఎలా చెప్పగలరు. వారు రాజయోగ శిక్షణను ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అన్ని ధర్మాల వారి రహస్యాలను అర్థం చేసుకున్నారు. ప్రతి ధర్మము మళ్ళీ తమ సమయంలో రావాల్సి ఉంటుంది. కలియుగము నుండి మళ్ళీ సత్యయుగము రానున్నది. సత్యయుగము కోసం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కావాలి, ఇతర ధర్మానికి సంబంధించిన వారు మనుష్యులను దేవతలుగా తయారుచేయలేరు. వారు ముక్తిలోకే వెళ్ళేది ఉంది, సుఖం స్వర్గములోనే ఉంటుంది. మనము దేవీ-దేవతలుగా అయినప్పుడు ఇతర ధర్మాల వారు ముక్తిలోకి వెళ్తారు. ఎప్పటివరకైతే మనం జీవన్ముక్తిధామమైన స్వర్గంలోకి వెళ్ళమో, అప్పటివరకు ఎవ్వరూ ముక్తిలోకి వెళ్ళలేరు. స్వరము మరియు నరకము కలిసి ఒకేసారి ఉండలేవు. మనము జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందితే జీవన బంధనం వారు ఉండకూడదు. ఇది సంగమ సమయమని మీకు తెలుసు. మీరే కల్పము యొక్క సంగమంలో బాబాను కలుస్తారు, ఇతరులెవ్వరూ కలవలేరు. ఇది కలియుగము అని ఇతరులు భావిస్తారు. మనము ఇప్పుడు కలియుగంలో లేము. బాబా నుండి స్వర్గము కొరకు మళ్ళీ వారసత్వాన్ని పొందుతున్నాము. మనము జీవిస్తూ మరణించి తండ్రికి చెందినవారిగా అయ్యాము. ఎవరైతే దత్తత తీసుకోబడతారో, వారికి రెండు ప్రపంచాల గురించి తెలుస్తుంది. ఫలానావారికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు ఫలానావారికి చెందినవారిగా అయ్యాము. వారికి తమ మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరి గురించి తెలుసు, ఇరువైపుల గురించి తెలిసి ఉంటుంది. పిల్లలైన మీకు తెలుసు, ఈ ప్రపంచం నుండి మనం లంగరు ఎత్తేసాము. ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాము. దీనితో మనకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇది భగవంతుడు తమ పిల్లలతో అనగా పరమపిత పరమాత్మ సాలిగ్రామాలైన పిల్లలతో మాట్లాడుతున్నారు. భగవంతుడికి రావలసి ఉంటుంది, కానీ వారి గురించి తెలియదు. తండ్రి గురించి తెలియని కారణంగా తికమక పడతారు. ఇంతటి సహజమైన విషయాన్ని ఎవ్వరూ అర్థము చేసుకోరు. కానీ వారిని తలుచుకుంటారు. ఆత్మలైన మనము శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. మనము పరంధామము నుండి వస్తాము. అక్కడ పరమపిత పరమాత్మ కూడా ఉంటారు. మనుష్యులకైతే ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. భగవంతుడు ఎలా వచ్చి కలుస్తారు? ఏం చేస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. గీతలో అన్నీ తప్పుగా రాసేసారు. పేరునే మార్చేసారు. తండ్రి అడుగుతారు, మీకు నేను తెలుసు కదా? కృష్ణుడు ఏమైనా, మీకు నేను తెలుసా? అని అడుగుతారా. వారి గురించైతే మొత్తం ప్రపంచానికి తెలుసు. వారు జ్ఞానాన్ని ఇవ్వలేరు. కావున భగవంతుడు రూపాన్ని మారుస్తారు కానీ కృష్ణుడిగా అవ్వరు అని తప్పకుండా అర్థం చేయించాలి. వారు మనిషి తనువులోకి వస్తారు, కృష్ణుని తనువులోకి రారు. వీరు బ్రహ్మా. వీరు ఉన్నదే కృష్ణుని ఆత్మ. కేవలం చిన్న విషయంలో పొరపాటు చేసారు. వీరు కృష్ణుని యొక్క 84వ జన్మలోని ఆత్మ, వీరే మళ్ళీ ఆదిలో కృష్ణునిగా అవుతారు. అంతిమ జన్మలో కృష్ణుని పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. చిన్న విషయాన్ని మర్చిపోయారు, ఇందులో పెద్ద తిరకాసు ఉంది.

మనము కృష్ణుని వంశానికి చెందినవారమని మీకు తెలుసు. ఇప్పుడు శివబాబా నుండి మళ్ళీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. మన బుద్ధిలో కృష్ణుడు కూర్చోరు. మనుష్యులైతే కృష్ణ భగవానువాచ అని అంటారు. దీనితో ఏదీ ఋజువు కాదు. పంచ పాండవులు మిగిలారని గీతలో చూపించారు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఇంత సహజమైన విషయము కూడా మనుష్యులకు తెలియదు. మీరు కేవలం సూచనతోనే అర్థం చేసుకోగలరు, మేమే సూర్యవంశానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు సూర్యవంశంవారి నుండి శూద్రవంశంవారిగా అయ్యాము. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. వర్ణాలను కూడా బుద్ధిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వారు వర్ణాలను కూడా సగము చేసేసారు. పిలక అయిన బ్రాహ్మణులను మరియు శివబాబాను మర్చిపోయారు. మిగిలిన దేవతలను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపించారు. బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. బ్రహ్మా సంతానము ఎక్కడికి వెళ్ళారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. మీకు తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు, మీరు బుద్ధిలో మంచి రీతిలో ధారణ చేయాలి. ఏ జ్ఞానమైతే తండ్రి బుద్ధిలో ఉందో అది మీ బుద్ధిలో కూడా ఉండాలి. నేను ఆత్మలైన మిమ్మల్ని నా సమానంగా తయారుచేస్తాను. సృష్టి చక్ర జ్ఞానం ఏదైతే నాలో ఉందో, అది మీ బుద్ధిలో కూడా ఉంది. వివేకవంతులుగా ఉండాలి. బాబాతో పాటు యోగము కూడా ఉండాలి మరియు ఘడియ-ఘడియ విచార సాగర మథనము జరుగుతూ ఉండాలి. మీరిప్పుడు సమ్ముఖంలో కూర్చున్నారు. బాబా అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారని భావిస్తారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరంగా ఉన్నారు... అని అంటారు కూడా, ఇప్పుడు సద్గురువు మధ్యవర్తి రూపంలో చదివిస్తారు. మధ్యవర్తి అనగా వ్యాపారం చేయించేవారు. తండ్రి వీరి ద్వారా వచ్చి తమతో వ్యాపారం చేయిస్తారు. మధ్యవర్తిని గుర్తు చేయకూడదని మీకు తెలుసు. మధ్యవర్తి ద్వారా శివబాబాతో మన నిశ్చితార్థం జరుగుతుంది. మీరంతా మధ్యలోనున్న మధ్యవర్తులు. పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధము ఉంది? అని అంటారు. మీరు నిశ్చితార్థం చేయించే యుక్తిని రచిస్తారు. ఇంకా, ప్రజాపిత పేరును కూడా తీసుకుంటారు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. స్వర్గ రచయిత వారే. జీవాత్మలకు పరమాత్మతో నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరిగింది, వారసత్వాన్ని పొందారు, మళ్ళీ పొందుతారు.

మీకు తెలుసు, కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగంలో మనది ఇదే వ్యాపారము, ఇతర ఏ ఆత్మలకు పరమాత్మతో నిశ్చితార్థం చేయించరు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా చేస్తారో వారితో నిశ్చితార్థం చేయిస్తారు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక నిశ్చితార్థము. ఆత్మిక నిశ్చితార్థము చేయడము కల్ప-కల్పము తండ్రి నుండే నేర్చుకుంటారు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. కల్ప-కల్పము మనుష్యుల నుండి దేవతలుగా తప్పకుండా అవుతారు. దేవతలు మళ్ళీ మనుష్యులుగా అవుతారు. మనుష్యులైతే మనుష్యులే. కానీ మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు... అని ఎందుకు రాసారు, ఎందుకంటే వారు దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ నిశ్చితార్థంతో మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితము భారత్ స్వర్గంగా ఉండేదని అందరూ అంటారు, కానీ బుద్ధిలోకి రాదు. భారత్ ఇంతకుముందు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు కూడా ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. కానీ అందరిదీ దిగే కళ. మనది ఎక్కే కళ. ఎక్కే కళకు ఒక్క క్షణం పడుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక చెంది నిశ్చయంలో కిందా-మీదా అవ్వకూడదు. ఇళ్ళు-వాకిళ్ళను సంభాళిస్తూ కర్మయోగిగా అయి ఉండాలి. విజయ మాలలో దగ్గరగా వచ్చేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి.

2. వివేకవంతులుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క విచార సాగర మథనం చేయాలి. సదా సేవలో తత్పరులై ఉండాలి. తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి.

వరదానము:-

బాబా అనే పదం యొక్క స్మృతితో హద్దులోని నాది అన్నదానిని అర్పణ చేసే అనంతమైన వైరాగీ భవ

చాలామంది పిల్లలు, ఇది నా గుణము, నా శక్తి అని అంటారు. ఇది కూడా తప్పు, పరమాత్మ ఇచ్చిన కానుకను నాదిగా భావించడము, ఇది మహాపాపము. చాలా మంది పిల్లలు సాధారణ భాషలో మాట్లాడుతూ ఉంటారు, నా ఈ గుణాన్ని, నా బుద్ధిని ఉపయోగించడం లేదు. కానీ నాది అని అనడము అంటే మలినంగా అవ్వడము - ఇది కూడా మోసము, అందుకే ఈ హద్దు యొక్క నాది అన్నదానిని అర్పించి, సదా బాబా అనే పదము గుర్తుండాలి, అప్పుడే అనంతమైన వైరాగీ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

తమ సేవను తండ్రి ముందు అర్పించినట్లయితే సేవ యొక్క ఫలము మరియు బలము ప్రాప్తిస్తూ ఉంటాయి.