01-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - పెద్ద-పెద్ద స్థానాలలో పెద్ద-పెద్ద దుకాణాలు (సేవాకేంద్రాలు) తెరవండి, సేవ వృద్ధి చేసేందుకు ప్లాన్లు తయారుచేయండి, మీటింగులు చేయండి, ఆలోచించండి"

ప్రశ్న:-

స్థూలమైన అద్భుతాలైతే అందరికీ తెలుసు కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన అన్నింటి కన్నా గొప్ప అద్భుతమేమిటి?

జవాబు:-

సర్వుల సద్గతిదాత అయిన తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు, ఇదే అన్నింటి కన్నా గొప్ప అద్భుతము. ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేసేందుకు మీరు మీ-మీ దుకాణాలను ఆకర్షణీయంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనుష్యులు ఆర్భాటం (షో) చూసే వస్తారు. మరి, అందరూ వచ్చి తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా అన్నింటికన్నా మంచిదైన మరియు పెద్దదైన దుకాణము రాజధానిలో ఉండాలి.

గీతము:-

మరణించినా నీ దారిలోనే, జీవించినా నీ దారిలోనే... (మర్ నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే...)

ఓం శాంతి. శివ భగవానువాచ. రుద్ర భగవానువాచ అని కూడా అనవచ్చు ఎందుకంటే శివుని మాల అని గాయనము చేయబడలేదు. మనుష్యులు భక్తిమార్గములో దేనినైతే చాలా తిప్పుతారో, దానికి రుద్రమాల అని పేరు పెట్టారు. విషయం ఒక్కటే కానీ సరియైన విధంగా శివబాబా చదివిస్తున్నారు. ఆ పేరే ఉండాలి, కానీ రుద్ర మాల అనే పేరు నడుస్తూ వస్తుంది. శివునికి మరియు రుద్రునికి తేడా ఏమీ లేదని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మేము మంచిరీతిగా పురుషార్థము చేసి బాబా మాలలో సమీపంగా రావాలని పిల్లల బుద్ధిలో ఉంది. ఎలాగైతే పిల్లలు పరుగెత్తుకుంటూ లక్ష్యము వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి టీచరు దగ్గర నిలబడతారో, ఆ ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనము 84 జన్మల చక్రము తిరిగి వచ్చామని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఇప్పుడు వెళ్ళి మొట్టమొదట మాలలో స్మరింపబడాలి. అది స్థూల విద్యార్థుల రేస్. ఇది ఆత్మిక రేస్. మీరు ఆ రేస్ చేయలేరు. ఇది కేవలం ఆత్మలకు సంబంధించిన విషయము. ఆత్మ వృద్ధునిగా, యువకునిగా లేదా చిన్నదిగా-పెద్దదిగా అవ్వదు. ఆత్మ ఒకేలా ఉంటుంది. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. చదువులో ఒకవేళ మందబుద్ధి కలవారిగా అయినా, ఇందులో (స్మృతిలో) కష్టమేముంది, ఏ మాత్రము లేదు. ఆత్మలందరూ సోదరులు. ఆ రేస్ లో యువకులు వేగంగా పరుగెడుతారు. ఇక్కడైతే అటువంటి విషయం లేదు. పిల్లలైన మీది రుద్రమాలలో స్మరింపబడే రేస్. ఆత్మలైన మన వృక్షము కూడా ఉందని మీ బుద్ధిలో ఉంది. అది శివబాబాకు చెందిన మనష్యమాత్రులందరి మాల. కేవలం 108 లేక 16,108 మాల కాదు. మనుష్యుమాత్రులందరి మాల. నంబరువారుగా ప్రతి ఒక్కరూ తమ-తమ ధర్మాలలోకి వెళ్ళి విరాజమానమవుతారు, వారు మళ్ళీ కల్ప-కల్పము అదే స్థానములోకి వస్తూ ఉంటారు అని పిల్లలకు తెలుసు. ఇది కూడా అద్భుతమే కదా. ప్రపంచములోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా ఎవరైతే విశాలబుద్ధి కలవారిగా ఉంటారో వారు ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. మేము అందరికీ మార్గమును ఎలా తెలియజేయాలని పిల్లలు బుద్ధిలో ఇవే ఆలోచనలుండాలి. ఇది విష్ణుమాల. ప్రారంభము నుండి వంశ వృక్షం మొదలవుతుంది, కొమ్మలు-రెమ్మలు అన్నీ ఉంటాయి కదా. అక్కడ కూడా చిన్న-చిన్న ఆత్మలుంటాయి. ఇక్కడ మనుష్యులుంటారు. మళ్ళీ ఆత్మలన్నీ అక్కడ ఏక్యురేట్ గా నిలబడతాయి. ఇవి అద్భుతమైన విషయాలు. మనుష్యులు ఈ స్థూలమైన అద్భుతాలన్నీ చూస్తూ ఉంటారు కానీ అవేమీ కానే కావు. సర్వుల సద్గతిదాతైన పరమపిత పరమాత్మయే వచ్చి చదివిస్తున్నారంటే ఇది ఎంతటి అద్భుతము. కృష్ణుడిని సర్వుల సద్గతిదాత అని అనరు. మీరు ఈ పాయింట్లన్నీ కూడా ధారణ చేయాలి. ముఖ్యమైనది గీతా భగవంతునికి సంబంధించిన విషయము. ఈ విషయంలో విజయం సాధిస్తే చాలు. గీతయే సర్వ శాస్త్రాల శిరోమణి, భగవంతుడు వినిపించినది. మొట్టమొదట ఇది ప్రయత్నించాలి. ఈ రోజుల్లోనైతే చాలా ఆర్భాటం కావాలి, ఏ దుకాణములోనైతే చాలా షో ఉంటుందో, అక్కడకు చాలామంది మనుష్యులు పరుగెత్తుతారు. ఇక్కడ మంచి సరుకు ఉంటుందని భావిస్తారు. ఇంత పెద్ద-పెద్ద సెంటర్లను తెరిచేందుకు లక్ష, రెండు లక్షల అద్దె ఇవ్వాల్సి వస్తుందని పిల్లలు భయపడతారు, అప్పుడే మనసుకు నచ్చిన భవనం దొరుకుతుందని భావిస్తారు. ఒకటైనా రాయల్ గా పెద్ద దుకాణము ఉండాలి, పెద్ద దుకాణము పెద్ద-పెద్ద పట్టణాలలోనే దొరుకుతుంది. మీరు రాజధానిలో అన్నింటికన్నా పెద్ద దుకాణాన్ని తెరవాలి. సేవను ఎలా పెంచాలి అని పిల్లలు విచార సాగర మథనం చేయాలి. పెద్ద దుకాణం తెరిస్తే పెద్ద-పెద్దవారు వస్తారు. పెద్ద వ్యక్తుల శబ్దము వెంటనే వ్యాపిస్తుంది. మొట్టమొదట ఈ ప్రయత్నము చేయాలి. సేవ కోసం పెద్ద-పెద్ద స్థానాలను ఎటువంటి ప్రదేశాలలో తయారుచేయాలంటే, అక్కడకు పెద్ద-పెద్ద మనుష్యులు వచ్చి చూసి ఆశ్చర్యపోవాలి, అంతేకాక అక్కడ అర్థం చేయించేవారు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఎవరైనా ఒక్క బి.కె సరిగ్గా అర్థం చేయించకపోయినా - బహుశా బి.కెలందరూ ఇలాగే ఉంటారని భావిస్తారు, అందుకే దుకాణంలో సేల్స్ మాన్ కూడా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఇది కూడా వ్యాపారమే కదా. పిల్లలు ధైర్యం చేస్తే బాప్ దాదా సహాయం చేస్తారని తండ్రి చెప్తున్నారు. ఆ వినాశీ ధనము అయితే దేనికీ పనికిరాదు. మనమైతే మన అవినాశీ సంపాదన చేసుకోవాలి, ఇందులో చాలామందికి కళ్యాణము జరుగుతుంది. ఈ బ్రహ్మా కూడా ఆ విధంగానే చేశారు కదా. ఎవ్వరూ ఆకలితో మరణించరు. మీరు కూడా తింటున్నారు, వీరు కూడా తింటున్నారు. ఇక్కడ లభించేటటువంటి అన్న-పానాదులు ఇంకెక్కడా లభించవు. ఇవన్నీ పిల్లలవే కదా. పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేయాలి, ఇందులో చాలా విశాలబుద్ధి కావాలి. కేపిటల్ (రాజధాని) లో పేరు వెలువడినట్లయితే అందరూ అర్థం చేసుకుంటారు. అప్పడు వారు ఏమంటారు అంటే - వీరు తప్పకుండా సత్యమే తెలియజేస్తున్నారు, విశ్వానికి యజమానులుగా అయితే భగవంతుడే తయారుచేస్తారు, మనుష్యులు, మనుష్యులను విశ్వానికి యజమానులుగా తయారుచేయలేరు. సేవ వృద్ధి చెందేందుకు బాబా సలహాలిస్తూ ఉంటారు.

పిల్లలు విశాల హృదయులుగా ఉన్నప్పుడే సేవ వృద్ధి చెందుతుంది. ఏ కార్యము చేసినా విశాల హృదయముతో చేయండి. ఎటువంటి శుభ కార్యమైనా మీ అంతట మీరే చేయడం చాలా మంచిది. చెప్పకుండా చేస్తే దేవతలు, చెప్పిన తర్వాత చేస్తే మనుష్యులని అంటారు. చెప్పినా సరే చేయకపోతే..... బాబా అయితే దాత, ఇది చేయండి, ఈ కార్యములో ఇంత పెట్టండి అని బాబా ఎవ్వరికీ చెప్పరు. పెద్ద-పెద్ద రాజుల చేతులు ఎప్పుడూ మూసుకొని ఉండవు, రాజులు సదా దాతలుగానే ఉంటారు అని బాబా అర్థం చేయించారు. వెళ్ళి ఏమేమి చేయాలో - బాబా సలహా ఇస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విజయాన్ని పొందాలి, ఇది చాలా ఉన్నతమైన పదవి. అంతిమంలో రిజల్టు వెలువడుతుంది. ఎవరైతే చాలా మార్కులతో పాస్ అవుతారో వారికి సంతోషము కూడా ఉంటుంది. అంతిమంలో అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి కదా, కానీ ఆ సమయంలో ఏమీ చేయలేరు. అదృష్టములో ఏముంటుందో అదే లభిస్తుంది. పురుషార్థము విషయం వేరు. విశాలబుద్ధి కలవారిగా అవ్వండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ధర్మాత్మలుగా అవుతున్నారు. ప్రపంచములో ఎందరో ధర్మాత్మలైతే ఉండి వెళ్ళారు కదా. వారికి చాలా పేరుంటుంది. అంటే ఫలానావారు చాలా ధర్మాత్ములుగా ఉండేవారని పేరు ఉంటుంది. కొందరైతే ధనాన్ని ప్రోగు చేస్తూ-చేస్తూ అకస్మాత్తుగా మరణిస్తారు. తర్వాత ట్రస్టు ఏర్పడుతుంది. కొంతమంది పిల్లలు అయోగ్యులుగా ఉన్నా కూడా మళ్ళీ ట్రస్టు ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో ఇది పాపాత్మల ప్రపంచము. పెద్ద-పెద్ద గురువులు మొదలైన వారికి దానము చేస్తారు. ఉదాహరణకు కాశ్మీరు మహారాజు వారి దగ్గర ఉన్నదంతా ఆర్య సమాజము వారికి లభించే విధంగా విల్లు రాసి వెళ్ళిపోయారు. వారి ధర్మము వృద్ధి చెందాలని అలా విల్లు వ్రాశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలము ద్వారానే మొత్తం సృష్టిని పవిత్రంగా తయారుచేస్తారు ఎందుకంటే మీకోసమైతే పవిత్ర సృష్టి అవసరము. దీనికి నిప్పు అంటుకోవడం ద్వారా పవిత్రంగా అవుతుంది. చెడు వస్తువును అగ్నిలోనే పవిత్రంగా చేస్తారు. ఇందులో అపవిత్ర వస్తువులన్నీ పడి మళ్ళీ మంచిగా తయారై వస్తాయి. ఇది చాలా ఛీ-ఛీ తమోప్రధాన ప్రపంచమని మీకు తెలుసు. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇది జ్ఞాన యజ్ఞము కదా. మీరు బ్రాహ్మణులు. శాస్త్రాలలో చాలా విషయాలు వ్రాశారని కూడా మీకు తెలుసు, యజ్ఞానికి దక్ష ప్రజాపిత యజ్ఞమని పేరు చూపించారు. మరి రుద్ర జ్ఞాన యజ్ఞము ఎక్కడికి వెళ్ళిపోయింది. దీని కోసం కూడా కూర్చుని ఏమేమో కథలను వ్రాసేశారు. యజ్ఞాన్ని నియమానుసారంగా వర్ణించలేదు. తండ్రే వచ్చి అన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతము ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞాన యజ్ఞమే కాక మళ్ళీ విద్యాలయము కూడా అవుతుంది. జ్ఞానము మరియు యజ్ఞము రెండు పదాలు వేర్వేరు. యజ్ఞములో ఆహుతి వేయాలి. జ్ఞాన సాగరుడైన తండ్రియే వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. ఇది చాలా గొప్ప యజ్ఞము, ఇందులో మొత్తం పాత ప్రపంచం స్వాహా అవ్వనున్నది.

మరి పిల్లలు సేవ కోసం ప్లాన్లు తయారుచేయాలి. పల్లెలు మొదలైన వాటిలో కూడా సేవ చేయండి. పేదవారికి ఈ జ్ఞానము ఇవ్వమని మీకు చాలామంది చెప్తారు. కేవలం సలహా ఇస్తారు, కానీ వారు ఏ పనీ చేయరు. సేవ చేయరు, కేవలం ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుందని సలహా మాత్రం ఇస్తారు. కానీ మాకు తీరిక లేదని అంటారు. జ్ఞానము చాలా బాగుంది, అందరికీ ఈ జ్ఞానము లభించాలని అంటారు. స్వయాన్ని గొప్పవారిగా, మిమ్మల్ని చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువుతోపాటు మళ్ళీ ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా మాట్లాడే తెలివి వస్తుంది. మ్యానర్స్ బాగవుతాయి. చదవుకోనివారు బుద్ధిహీనుల వలె ఉంటారు. వారికి మాట్లాడే తెలివి ఉండదు. పెద్దవారిని సదా "మీరు" అని సంబోధించాలి. ఇక్కడైతే కొంతమంది పతిని కూడా నువ్వు-నువ్వు అని అనేస్తారు. "మీరు" అనే పదము రాయల్ గా ఉంటుంది. పెద్దవారిని "మీరు" అని అంటారు. తండ్రి మొట్టమొదట సలహానిస్తున్నారు - ఢిల్లీ ఏదైతే స్వర్గంగా ఉండేదో, దానిని మళ్ళీ స్వర్గంగా తయారుచేయాలి. కనుక ఢిల్లీలో అందరికీ సందేశమివ్వాలి, ప్రచారము చాలా బాగా చేయాలి. టాపిక్స్ కూడా తెలియజేస్తూ ఉంటారు, టాపిక్స్ లిస్టు తయారుచేయండి, తర్వాత వ్రాస్తూ వెళ్ళండి. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుందో వచ్చి తెలుసుకోండి, 21 జన్మలకు ఏ విధంగా నిరోగులుగా అవ్వగలరో, వచ్చి తెలుసుకోండి. సంతోషానికి సంబంధించిన ఇటువంటి విషయాలు రాసి ఉండాలి. 21 జన్మలకు నిరోగులుగా, సత్యయుగ డబుల్ కిరీటధారులుగా వచ్చి తయారవ్వండి. సత్యయుగీ అనే పదము అన్నింటిలో రాయండి. సుందరమైన అక్షరాలుంటే మనుష్యులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇటువంటి బోర్డు, చిత్రాలు మొదలైనవి తగిలించి ఉండాలి. మీ వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. దానితో పాటు సేవ కూడా చేస్తూ ఉండండి. రోజంతా వ్యాపారములోనే ఉండకూడదు. కేవలం పైన ఉండి చూసుకుంటూ ఉండాలి. మిగిలిన పని అసిస్టెంటు మేనేజరు నడిపిస్తారు. కొంతమంది ధనవంతులు విశాల హృదయం కలవారిగా ఉంటారు, వారి అసిస్టెంటుకు మంచి జీతం ఇచ్చి ఒక పొజిషన్ లో కూర్చోబెడతారు. ఇది అనంతమైన సేవ. మిగిలినవన్నీ హద్దు సేవలు. ఈ అనంతమైన సేవలో ఎంతో విశాలబుద్ధి కలవారిగా ఉండాలి. మనము విశ్వముపై విజయాన్ని పొందుతున్నాము. మనము మృత్యువుపై కూడా విజయాన్ని పొంది అమరులుగా అవుతున్నాము. ఈ విధమైన బోర్డులు చూసి వస్తారు మరియు అర్థము చేసుకునేందుకు ప్రయత్నము చేస్తారు. మీరు అమరలోకానికి యజమానులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి, చాలా టాపిక్స్ తయారుచేయవచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా తయారు చేయగలరు. అక్కడ దుఃఖం యొక్క నామ-రూపాలు ఉండవు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మమ్మల్ని మళ్ళీ ఏ విధంగా తయారుచేసేందుకు వచ్చారు! పాత సృష్టి నుండి కొత్తది తయారవ్వాలని, మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. యుద్ధము ఎలా జరుగుతుందో చూస్తారు. పెద్ద యుద్ధము జరిగితే ఆటనే సమాప్తమైపోతుంది. మీకైతే బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, విశ్వ రాజ్య భాగ్యము మీ కోసమే ఉంది. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, భారత్ లో మీరు లెక్కలేనంత సుఖాన్ని చూశారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున మీకు చాలా సంతోషం ఉండాలి. పిల్లలు పరస్పరములో కలిసి చర్చించుకుని సలహాలు తీయాలి. వార్తాపత్రికల్లో ప్రకటించాలి. ఢిల్లీలో కూడా విమానాల నుండి కరపత్రాలు వేయండి. ఆహ్వానించండి, పెద్దగా ఖర్చు అవ్వదు, పెద్ద ఆఫీసర్లు అర్థం చేసుకుంటే ఉచితంగా కూడా చేస్తారు. బాబా సలహాను ఇస్తారు, ఉదాహరణకు కలకత్తా ఉంది, అక్కడ నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఫస్ట్ క్లాస్ దుకాణము పెద్దదిగా, రాయల్ గా ఉండాలి, అప్పుడు చాలామంది కస్టమర్లు వస్తారు. మద్రాసు, బాంబే వంటి పెద్ద-పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. బాబా వ్యాపారస్థులు కూడా కదా. మీ నుండి పనికిరాని ధనాన్ని తీసుకుని ఎక్స్ చేంజ్ లో ఏమిస్తున్నాను! అందుకే దయాహృదయులని గాయనం ఉంది. వారు గవ్వ నుండి వజ్రంగా తయారుచేసేవారు, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. బలిహారమంతా ఒక్క తండ్రికి మాత్రమే. తండ్రే లేకపోతే, మీకు మహిమ ఏముంటుంది.

భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు నషా ఉండాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము ఉద్దేశ్యం ఎదురుగా ఉంది. ఎవరైతే మొట్టమొదట అవ్యభిచారి భక్తిని ప్రారంభించారో, వారే వచ్చి ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేస్తారు. బాబా ఎంతో మంచి-మంచి పాయింట్లు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మర్చిపోతున్నారు, ఇప్పుడు పాయింట్లు వ్రాయండి అని బాబా చెప్తున్నారు. టాపిక్స్ వ్రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతారు. మీరు మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మకు ఇంజెక్షన్ ఎలా వేయాలో మీకు నేర్పిస్తారు. ఇది జ్ఞాన ఇంజక్షన్. దీనిలో సూది మొదలైనవేవీ ఉండవు. బాబా అవినాశీ సర్జన్, వారు వచ్చి ఆత్మలను చదివిస్తున్నారు. ఆత్మలే అపవిత్రంగా అయ్యాయి. ఇదైతే చాలా సులభము. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, వారిని మనము స్మృతి చేయలేము! మాయ వ్యతిరేకత చాలా ఉంటుంది, అందుకే బాబా చెప్తున్నారు, చార్టు వ్రాయండి మరియు సేవ గురించి ఆలోచించండి, అప్పుడు చాలా సంతోషం ఉంటుంది. మురళీని ఎంతో బాగా నడిపిస్తారు కాని యోగము ఉండదు. తండ్రితో సత్యంగా ఉండడం కూడా చాలా కష్టము. ఒకవేళ మేము చాలా బాగున్నామని భావిస్తే బాబాను స్మృతి చేసి చార్టు పంపించండి, అప్పుడు సత్యం ఎంత ఉంది లేదా అసత్యం ఎంత ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు. అచ్ఛా, అవినాశీ జ్ఞాన రత్నాల సేల్స్ మ్యాన్ గా అవ్వాలని పిల్లలకు అర్థం చేయించారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని నషాలో ఉండాలి, మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సేవతో పాటు స్మృతి యొక్క చార్టును కూడా పెడితే సంతోషముంటుంది.

2. మాట్లాడేటటువంటి మ్యానర్స్ బాగా ఉంచుకోవాలి, "మీరు" అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యము విశాల హృదయం కలవారిగా అయ్యి చేయాలి.

వరదానము:-

స్వ కళ్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వకళ్యాణ సేవలో సదా సఫలతామూర్త భవ

ఎలాగైతే ఈ రోజుల్లో హార్ట్ ఫెయిల్ అనే శారీరిక రోగము ఎక్కువగా ఉందో, అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో నిరుత్సాహపడే రోగము ఎక్కువగా ఉంది. ఈ విధంగా నిరుత్సాహంగా ఉన్న ఆత్మలలో, మన ప్రాక్టికల్ పరివర్తన చూస్తూనే ధైర్యము మరియు శక్తి వస్తుంది. ఎంతో విన్నారు, ఇప్పుడు చూడాలని కోరుకుంటున్నారు. ప్రమాణము (ఋజువు) ద్వారా పరివర్తన అవ్వాలనుకుంటారు. కనుక విశ్వకళ్యాణము కోసం మొదట స్వకళ్యాణాన్ని శ్యాంపుల్ రూపంలో చూపించండి. విశ్వకళ్యాణ సేవలో ప్రత్యక్ష ప్రమాణమే సఫలతా మూర్తులుగా అయ్యేందుకు సాధనం, దీని ద్వారానే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైతే చెప్తారో అది మీ స్వరూపం ద్వారా ప్రాక్టికల్ గా కనిపించాలి, అప్పుడే అంగీకరిస్తారు.

స్లోగన్:-

ఇతరుల ఆలోచనలను మీ ఆలోచనలతో కలపాలి - ఇదే గౌరవాన్ని ఇవ్వడం.