01-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ప్రాణాలను రక్షించే ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు మధురమైన జ్ఞాన మురళిని వినిపించి ప్రాణాలు రక్షించేందుకు వచ్చారు

ప్రశ్న:-

ఏ నిశ్చయం అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది?

జవాబు:-

మా శ్రేష్ఠ అదృష్టాన్ని తయారుచేసేందుకు స్వయంగా తండ్రి వచ్చారు. తండ్రి నుండి మాకు భక్తి ఫలం లభిస్తుంది. మాయ ఏ రెక్కలనైతే తెంచివేసిందో, ఆ రెక్కలను ఇచ్చేందుకు, తమతో పాటు తిరిగి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఈ నిశ్చయం అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది.

గీతము:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు... (యహ్ కౌన్ ఆయా ఆజ్ సవేరే...)

ఓంశాంతి.

ఉదయాన్నే వచ్చి మురళిని ఎవరు మ్రోగిస్తారు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. జ్ఞానసాగరుడు, పతితపావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి ఇప్పుడు మీరు మురళిని వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. హే ఈశ్వరా, ఈ దుఃఖం నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయం లభిస్తుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ గుప్తము, తండ్రి కూడా గుప్తమని మీకు తెలుసు. పిల్లల శరీరం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు తండ్రి కూడా ప్రత్యక్షంగా ఉంటారు. ఆత్మ గుప్తంగా ఉంది కనుక తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు. తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు ఇచ్చేది శ్రీమతము. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత ప్రసిద్ధమైనది, అందులో కేవలం పేరు మార్చేసారు. శ్రీమతమనేది భగవానువాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమేనని, వారే నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారని కూడా అర్థం చేసుకున్నారు. కథ కూడా సత్యనారాయణునిది. అమరకథ అనేది అమరపురికి యజమానులుగా చేసేటువంటి కథ లేక నరుని నుండి నారాయణునిగా తయారుచేసేటువంటి కథ అని అంటూ ఉంటారు. విషయం ఒక్కటే. ఇది మృత్యులోకము. భారత్ యే అమరపురిగా ఉండేదని ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా అమర బాబా భారతవాసులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపది మాత్రమే లేరు. ఇది అనేక మంది పిల్లలు వింటున్నారు. శివబాబా, బ్రహ్మా ద్వారా వినిపిస్తారు. తండ్రి అంటారు - నేను బ్రహ్మా ద్వారా మధురాతి మధురమైన ఆత్మలకు అర్థం చేయిస్తాను. పిల్లలు తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలని తండ్రి అర్థం చేయించారు. తండ్రి మాత్రమే అలా తయారుచేయగలరు. ఆత్మ జ్ఞానం ఉన్న మనుష్యులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మ జ్ఞానమే లేదంటే ఇక పరమపిత పరమాత్ముని జ్ఞానం ఎలా ఉంటుంది. ఆత్మనే పరమాత్మ అని అనేస్తారు. మొత్తం ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాటులో చిక్కుకొని ఉంది. ఈ సమయంలో మనుష్యుల బుద్ధి దేనికి పనికి రాకుండా ఉంది. స్వయం యొక్క వినాశనం కోసమే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలైన మీకు ఇది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారంగా వారి పాత్ర కూడా ఉందని, వారు డ్రామా యొక్క బంధనంలో బంధించబడి ఉన్నారని మీకు తెలుసు. ఈ రోజుల్లో, ప్రపంచంలో చాలా హంగామా జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశ కాలే ప్రీతి బుద్ధి కలవారిగా ఉన్నారు, తండ్రితో విపరీత బుద్ధి కలవారి కొరకు వినశ్యంతి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది. మహాభారత యుద్ధం తప్పకుండా జరిగిందని, తండ్రి రాజయోగం నేర్పించారని కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో మొత్తం వినాశనమైపోతుందని రాసేసారు. కానీ మొత్తం వినాశనమవ్వదు, అలా జరిగితే ప్రళయం సంభవించాలి, మనుష్యులెవ్వరూ ఉండకూడదు, కేవలం 5 తత్వాలే మిగిలి ఉండాలి. ఇలా అయితే జరగదు. ప్రళయం జరిగితే, ఇక మనుష్యులెక్కడ నుండి వస్తారు. కృష్ణుడు బొటను వేలును నోటిలో పెట్టుకుని సాగరంలోకి రావి ఆకుపై వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక చిన్న బాలుడు ఈ విధంగా ఎలా రాగలడు. శాస్త్రాలలో ఎలాంటి విషయాలను రాసేసారు అంటే, ఇక అడగకండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులు, భీష్మ పితామహులు మొదలైనవారికి జ్ఞాన బాణాలు తగలాల్సి ఉంది. మున్ముందు వారు కూడా వస్తారు. ఎంతెంతగా మీరు సేవలో తీవ్రతను పెంచుతారో, తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో, అంతగా మీ ప్రభావం పడుతుంది. అయితే, విఘ్నాలు కూడా వస్తాయి. ఈ జ్ఞాన యజ్ఞంలో ఆసురీ సంప్రదాయం వారి విఘ్నాలు చాలా కలుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. మీరు నేర్పించలేరు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారే పతితులను పావనంగా చేస్తారు, అంటే తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. తండ్రిని ఎప్పుడైనా సర్వవ్యాపి అని అనుకోవచ్చా! మనం పారస బుద్ధి కలవారిగా అయ్యి పారసనాథులుగా అవుతామని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు ఎన్ని మందిరాలను తయారుచేసారు. కానీ వారెవరు, ఏం చేసి వెళ్ళారు అన్న అర్థాన్ని తెలుసుకోరు. పారసనాథుని మందిరం కూడా ఉంది. భారత్ పారసపురిగా ఉండేది. బంగారం, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయమే. వారు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అనేస్తారు. కానీ మొత్తం డ్రామా అంతా 5 వేల సంవత్సరాలదని తండ్రి అంటారు, అందుకే నేడు భారత్ ఎలా ఉంది, నిన్నటి భారత్ ఎలా ఉండేదని అంటూ ఉంటారు. లక్షల సంవత్సరాల విషయం ఎవ్వరికీ గుర్తుండదు. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది - ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు. తండ్రి అంటారు - యోగంలో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానం అయినట్లు కదా. వారు హఠయోగులు. ఒక కాలుపై మరొకటి వేసుకొని కూర్చొంటారు. ఏమేమి చేస్తారు. మాతలైన మీరైతే అలా చేయలేరు. అలా కూర్చోలేరు కూడా. భక్తి మార్గపు చిత్రాలు ఎన్ని ఉన్నాయి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు ఇవేవీ చేయాల్సిన అవసరం లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారంగా కూర్చొంటారు. ఇక్కడ తండ్రి అలా కూడా చెప్పరు. ఎలా కావాలనుకుంటే అలా కూర్చోండి, కూర్చొని అలసిపోతే, అచ్ఛా, చారబడండి. బాబా దేనికీ వద్దని చెప్పరు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయము, ఇందులో కష్టతరమైన విషయమేమీ లేదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే, వింటూ-వింటూనే, శివబాబా స్మృతిలో ఉంటూ-ఉంటూ ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోవాలి. గంగా జలము నోటిలో ఉండగా... తనువు నుండి ప్రాణాలు వెళ్ళిపోవాలని అంటూ ఉంటారు కదా. అవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. వాస్తవానికి ఇవి జ్ఞానామృతానికి సంబంధించిన విషయాలు. నిజంగా ఇలానే తనువు నుండి ప్రాణాలు వెళ్ళిపోవాలని మీకు తెలుసు. పిల్లలైన మీరు ఇక్కడకు వచ్చేటప్పుడు నన్ను వదిలేసి వస్తారు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని తండ్రి అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకే వచ్చాను. మీకు మీ ఇంటి గురించి తెలియదు, అలానే ఆత్మ గురించి తెలియదు. మాయ రెక్కలను పూర్తిగా తెంచేసింది, అందుకే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమోప్రధానంగా ఉంది. ఆత్మ సతోప్రధానంగా అవ్వనంత వరకు శాంతిధామానికి ఎలా వెళ్ళగలదు. డ్రామా ప్లాను అనుసారంగా అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ ఎవరికీ సతోప్రధాన అవస్థ ఉండదు. ఆత్మ ఇక్కడ పవిత్రంగా అయినట్లయితే, ఇక ఇక్కడ నిలిచి ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. అందరూ ముక్తి కోసమే భక్తి చేస్తారు కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. నియమం అలా లేదు. ధారణ చేసేందుకు తండ్రి కూర్చొని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. అయినా, ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేయడంతో మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు ఒక్క క్షణంలో అంతా తెలుసుకుంటారు. మనుష్య సృష్టికి బీజరూపుడైన వారే అందరికీ ఏకైక తండ్రి అని ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. కృష్ణుడు భగవంతుడు కాదు. కృష్ణుడినే శ్యామసుందరుడని అంటారు. అయితే, పాము కాటేసిన కారణంగా నల్లగా అయ్యారని కాదు. కామ చితిపై కూర్చోవడంతో మనుష్యులు నల్లగా అవుతారు. రాముడిని కూడా నల్లగా చూపిస్తారు, మరి అతడిని ఎవరు కాటేసారు! ఏమీ అర్థం చేసుకోరు. కానీ, ఎవరికైనా అదృష్టంలో ఉంటే, నిశ్చయముంటే, వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయం లేకపోతే ఎప్పటికీ అర్థం చేసుకోరు. అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు. అదృష్టంలో లేకపోతే, వారికి ఏమీ అర్థం కావడం లేదు అన్నట్లుగా కూర్చొంటారు. తండ్రి, అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అన్న నిశ్చయం కూడా ఉండదు. కొత్తవారు ఎవరైనా వైద్య కళాశాలలోకి వెళ్ళి కూర్చొంటే ఏమి అర్థమవుతుంది, ఏమీ అర్థం కాదు. ఇక్కడికి కూడా అలాగే వచ్చి కూర్చొంటారు. ఈ అవినాశీ జ్ఞానం వినాశనమవ్వదు. మరి అలాంటి వారు వచ్చి ఏం చేస్తారు. రాజధాని స్థాపనవుతుంది అన్నప్పుడు నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు మొదలైనవారంతా కావాలి కదా. మున్ముందు ఎంతో కొంత చదువుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ కష్టమవుతుంది, ఎందుకంటే ఆ సమయంలో చాలా హంగామా ఉంటుంది. రోజు-రోజుకు తుఫాన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్ని సెంటర్లు ఉన్నాయి, చాలా మంది వచ్చి మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా రాయబడి ఉంది. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. వినాశనం అవ్వాల్సిందే. జన్మించేవారి సంఖ్య తగ్గాలని అంటూ అంటారు. కానీ వృక్షం వృద్ధి చెందాల్సిందే. తండ్రి ఉన్నప్పుడే, అన్ని ధర్మాల ఆత్మలకు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వెళ్ళే సమయం వచ్చినప్పుడు, ఆత్మల రావడం ఆగిపోతుంది. ఇప్పుడు అందరూ రావాల్సిందే, కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. భక్తుల రక్షకుడు భగవంతుడని అంటారు, అంటే తప్పకుండా భక్తులకు ఆపద వస్తుందని అర్థము. రావణ రాజ్యంలో అందరూ పూర్తిగా పాపాత్ములుగా అయిపోయారు. రావణ రాజ్యం కలియుగ అంతిమంలో ఉంటుంది, రామ రాజ్యం సత్యయుగ ఆదిలో ఉంటుంది. ఈ సమయంలో అందరూ ఆసురీ సంప్రదాయం వారు కదా. ఫలానావారు స్వర్గవాసులయ్యారని అంటారు, అంటే ఇది నరకమనే కదా అర్థము. స్వర్గవాసులు అయ్యారంటే మంచిదే. మరి ఇక్కడ ఏమై ఉన్నట్లు, తప్పకుండా నరకవాసులుగా ఉండేవారు. తాము నరకవాసులమని కూడా అర్థం చేసుకోరు. తండ్రియే వచ్చి స్వర్గవాసులుగా తయారుచేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటూ ఉంటారు. వారే వచ్చి హెవెన్ ను (స్వర్గాన్ని) స్థాపన చేస్తారు. అందరూ - పతితపావన సీతా-రామ, మేము పతితులము, మీరు పావనంగా చేసేవారు అని పాడుతూ ఉంటారు. వారంతా భక్తి మార్గానికి చెందిన సీతలు. తండ్రి రాముడు. ఎవరికైనా ఇలా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముడిని పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరొక ప్రపంచానికి చెందినట్లుగా అయ్యారు.

తండ్రి అర్థం చేయిస్తారు - ఇప్పుడు తప్పకుండా అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే, అప్పుడే కదా తండ్రి వచ్చి సతోప్రధానంగా తయారుచేస్తారు. తండ్రి కూర్చొని ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - పిల్లలైన మీరు ఏదైనా సేవ చేస్తున్నా కూడా, కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. సతోప్రధానంగా అయ్యేందుకు మార్గాన్ని ఇంకెవరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ ఒక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు, ఎందుకంటే ఆత్మనే తమోప్రధానంగా అయ్యింది. తండ్రిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఆత్మ అవినాశీ, పరమాత్మ తండ్రి కూడా అవినాశీ. ఇప్పుడు ఆత్మ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యింది, ఆత్మకు ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని పైన జోడించినట్లయితే స్వీట్ హోమ్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన స్వీట్, సైలెన్స్ హోమ్ కు వెళ్ళాలని మీ బుద్ధిలో ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానము మరియు యోగముతో బుద్ధిని పారసంగా తయారుచేసుకోవాలి. ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత కష్టమున్నా, ఆ సమయంలో కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి.

2. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు పూర్తిగా నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. బుద్ధియోగాన్ని తమ స్వీట్ సైలెన్స్ హోమ్ తో జోడించాలి.

వరదానము:-

సదా కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని సహజం చేసే డబల్ లైట్ భవ

ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో, వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ఎదురుగా ఏ సమస్య వచ్చినా, స్వయాన్ని కంబైండ్ గా అనుభవం చేసుకుంటారు, భయపడరు. ఈ కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ఎలాంటి కష్టమైన కార్యాన్ని అయినా సహజం చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినట్లయితే, తమ భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్ గా అవ్వండి. అప్పుడు ఫరిశ్తాల వలె రాత్రింబవళ్ళు సంతోషంలో మనసుతో నాట్యం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

ఎలాంటి కారణాన్ని అయినా నివారణ చేసి, సంతుష్టంగా ఉంటూ, సంతుష్టం చేసేవారే సంతుష్టమణులు.


మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు - జ్ఞానం మరియు యోగం మధ్యన వ్యత్యాసము

యోగం మరియు జ్ఞానం అనేవి రెండు పదాలు, పరమాత్మ స్మృతిని యోగమని అంటారు. ఇంకెవరి స్మృతి విషయంలోనూ యోగం అనే పదం రాదు. గురువులు ఏ యోగాలనైతే నేర్పిస్తారో, అవి కూడా పరమాత్మతో జోడించేవే, కానీ వారికి పరమాత్మ గురించిన పూర్తి పరిచయం లేని కారణంగా యోగం యొక్క పూర్తి సిద్ధి లభించదు. యోగం మరియు జ్ఞానం, ఇవి రెండూ బలాలు, ఈ రెండింటి పురుషార్థంతో మైట్ (శక్తి) లభిస్తుంది మరియు మనం వికర్మాజీతులుగా అయి శ్రేష్ఠ జీవితాన్ని తయారుచేసుకుంటాము. యోగం అనే పదాన్ని అందరూ ఉపయోగిస్తారు కానీ ఎవరితో యోగం జోడించబడుతుందో, ముందు వారి పరిచయం కావాలి. ఇప్పుడు పరమాత్మ పరిచయం కూడా మనకు పరమాత్మ ద్వారానే లభిస్తుంది, ఆ పరిచయంతో యోగం జోడించడం ద్వారా పూర్తి సిద్ధి లభిస్తుంది. యోగంతో - మనం గత వికర్మల భారాన్ని భస్మం చేసుకుంటాము మరియు జ్ఞానంతో - మున్ముందు మనం ఎటువంటి కర్మలను చేయాలి మరియు ఎందుకు చేయాలి అనేది తెలుస్తుంది. జీవితానికి మూలం సంస్కారము, ఆత్మ కూడా అనాది సంస్కారాలతో తయారై ఉంది, కానీ కర్మల ద్వారా ఆ సంస్కారాలు మారుతూ ఉంటాయి. యోగం మరియు జ్ఞానంతో ఆత్మలో శ్రేష్ఠత వస్తుంది మరియు జీవితంలో బలం వస్తుంది, కానీ ఈ రెండు పరమాత్మ నుండి లభిస్తాయి. కర్మ బంధనాల నుండి విముక్తి చెందే మార్గం కూడా మనకు పరమాత్మ నుండి ప్రాప్తిస్తుంది. మనం వికర్మల ద్వారా ఏ కర్మబంధనాలైతే తయారుచేసుకున్నామో, వాటి నుండి ముక్తులుగా అవ్వాలన్నా మరియు మున్ముందు మన కర్మలు వికర్మలుగా అవ్వకుండా ఉండాలన్నా, ఈ రెండు బలాలను పరమాత్మ తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. యోగం మరియు జ్ఞానం, ఈ రెండింటినీ పరమాత్మనే తీసుకువస్తారు. యోగాగ్నితో, మనం చేసిన వికర్మలను భస్మం చేయిస్తారు మరియు జ్ఞానంతో భవిష్యత్తు కోసం శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. దీని ద్వారా కర్మ, అకర్మగా అవుతుంది, అందుకే - ఈ కర్మ-అకర్మ-వికర్మల గతి చాలా లోతైనది అని పరమాత్మ చెప్పారు. ఇప్పుడు ఆత్మలైన మనకు డైరెక్ట్ పరమాత్ముని బలం కావాలి. శాస్త్రాల ద్వారా ఈ యోగం మరియు జ్ఞానం యొక్క బలాలు లభించవు, కానీ బలశాలి అయిన ఆ సర్వశక్తివంతుని ద్వారానే బలం లభిస్తుంది. ఇప్పుడు మనం మన జీవితం యొక్క మూలాన్ని (సంస్కారాన్ని) ఎలా తయారుచేసుకోవాలంటే, దానితో జీవితంలో సుఖం లభించాలి. కనుక పరమాత్మ వచ్చి జీవితం యొక్క మూలంలో శుద్ధ సంస్కారాల బీజాన్ని వేస్తారు, ఆ శుద్ధ సంస్కారాల ఆధారంగా మనం అర్ధకల్పం జీవన్ముక్తులుగా అవుతాము. అచ్ఛా - ఓంశాంతి.