02-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైనపిల్లలూ - ఖుదా (భగవంతుడు) మీ స్నేహితుడు, రావణుడు మీ శత్రువు, అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుని కాలుస్తారు’’

ప్రశ్న:-

ఎటువంటి పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి?

జవాబు:-

ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ స్వయం కూడా పవిత్రంగా అవుతారో మరియు ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేస్తారో, వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ఠంగా అయ్యేందుకు ఒకే ఒక శ్రీమతమునిస్తారు - పిల్లలూ, ఏ దేహధారినీ స్మృతి చేయకుండా నన్ను స్మృతి చేయండి.

గీతము:-

చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. ఓం శాంతి యొక్క అర్థమునైతే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ అయితే చూడడానికి కనిపించదు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనస్సు-బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి లేదు. ముఖ్యమైనది ఆత్మ. ఇది నా శరీరము. ఆత్మను ఎవరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరము చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. ఆత్మను చూడలేము. శరీరాన్ని చూడగలము. అదే విధంగా ఆత్మల తండ్రి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో, వారిని కూడా చూడలేము, వారిని అర్థము చేసుకోవడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మలైన మనమంతా సోదరులము. శరీరములోకి వచ్చినప్పుడు వీరు సోదరులు, వీరు సోదరీ-సోదరులు అని అంటారు. ఆత్మలైతే పరస్పరంలో అందరూ సోదరులే. ఆత్మలకు తండ్రి పరమపిత పరమాత్మ. దైహిక సోదరీ-సోదరులు ఒకరినొకరు చూడగలరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే, వారిని చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. సత్యయుగం కొత్త ప్రపంచముగా ఉండేది. ఇప్పుడున్నది కలియుగ పాత ప్రపంచము, ఇప్పుడిది పరివర్తన అవ్వనున్నది. పాత ప్రపంచం సమాప్తమవ్వాలి కదా. పాత ఇల్లు సమాప్తమైతే కొత్త ఇల్లు తయారవుతుంది కదా, అదే విధంగా ఈ పాత ప్రపంచము కూడా సమాప్తము అవ్వనున్నది. సత్యయుగం తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు, మళ్ళీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవ్వనున్నాయి. సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యముంటుంది. సూర్య వంశీయులు మరియు చంద్ర వంశీయులు ఉంటారు. వాటిని లక్ష్మీనారాయణుల వంశం, సీతా రాముల వంశం అని అంటారు. ఇది సహజమే కదా. తర్వాత ద్వాపర, కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. అప్పుడు పవిత్రంగా ఉన్న దేవతలు అపవిత్రమవుతారు, దీనిని రావణ రాజ్యమని అంటారు. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు కానీ రావణుడు కాలిపోడు. మళ్ళీ మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ పెద్ద శత్రువు, అందుకే రావణుడిని కాల్చే ఆచారము ఏర్పడింది. భారత్ కు నంబర్ వన్ శత్రువు ఎవరు? నంబర్ వన్ మిత్రుడు, సదా సుఖమునిచ్చేవారు ఖుదా. ఖుదాను స్నేహితుడని అంటారు కదా. దీని గురించి ఒక కథ కూడా ఉంది. కావున ఖుదా స్నేహితుడు, రావణుడు శత్రువు. స్నేహితుడైన ఖుదాను ఎప్పుడూ కాల్చరు. రావణుడు శత్రువు, అందుకే పది తలల రావణుడిని తయారుచేసి ప్రతి సంవత్సరము కాలుస్తారు. మాకు రామ రాజ్యము కావాలి అని గాంధీజీ కూడా అనేవారు. రామ రాజ్యంలో సుఖము, రావణ రాజ్యంలో దుఃఖము ఉంటుంది. ఇప్పుడిది ఎవరు కూర్చొని అర్థం చేయిస్తారు? పతితపావనుడైన తండ్రి. శివబాబా, బ్రహ్మా దాదా. బాబా సదా "బాప్ దాదా” అని సంతకం చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా కూడా అందరికీ చెందిన వారిగా అయ్యారు. వీరిని ఆడమ్ అని కూడా అంటారు. వీరిని గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుష్య సృష్టికి వీరు ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు, మళ్ళీ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. వీరిని ప్రజాపిత బ్రహ్మా అని అంటారు, వీరు మనుష్య సృష్టికి పెద్దవారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలున్నారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు. వీరు సాకార బాబా. శివబాబా నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడిది మీ పాత చర్మము. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుని ఆసురీ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. అందుకోసమే ఈ మహాభారత యుద్ధము ఉన్నది. తర్వాత సత్యయుగంలో శత్రువైన ఈ రావణుడిని ఎవరూ కాల్చరు. రావణుడు ఉండనే ఉండడు. రావణుడే దుఃఖపు ప్రపంచాన్ని తయారుచేసాడు. ఎవరి వద్దనైతే ఎక్కువ ధనముందో, పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయో, వారు స్వర్గములో ఉన్నారని కాదు.

కొందరి వద్ద కోట్ల ధనం ఉండవచ్చు కానీ ఇదంతా మట్టిలో కలిసిపోనున్నదని తండ్రి అర్థం చేయిస్తారు. కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త గనులు వెలువడతాయి, వాటి ద్వారా కొత్త ప్రపంచం యొక్క మహళ్ళు మొదలైనవన్నీ తయారు చేయబడతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. మనుష్యులు సద్గతి కోసమే భక్తి చేస్తారు. మమ్మల్ని పావనంగా చేయండి, మేము వికారులుగా అయిపోయాము అని అంటారు. వికారులను పతితులని అంటారు. సత్యయుగంలో నిర్వికారులే ఉంటారు, వారు సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు యోగబలంతో జన్మిస్తారు. అక్కడ వికారాలుండవు. దేహాభిమానముండదు, కామము, క్రోధము..... 5 వికారాలు ఉండవు, అందుకే అక్కడ ఎప్పుడూ రావణుడిని కాల్చరు. ఇక్కడైతే రావణ రాజ్యముంది. మీరు పవిత్రులుగా అవ్వండని ఇప్పుడు తండ్రి అంటారు. ఈ పతిత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఎవరైతే శ్రీమతమును అనుసరించి పవిత్రంగా ఉంటారో, వారే తండ్రి మతముపై నడిచి విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా. ఇప్పుడు రావణ రాజ్యము ఉంది, ఇది సమాప్తమవ్వనున్నది. సత్యయుగ రామ రాజ్యము స్థాపనవ్వనున్నది. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఢిల్లీయే క్యాపిటల్ (రాజధాని) గా ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యముంటుంది. సత్యయుగంలో ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది. ఢిల్లీనే సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా క్యాపిటల్ ఢిల్లీయే, రామ రాజ్యంలో కూడా ఢిల్లీయే క్యాపిటల్ గా ఉంటుంది. కానీ రామరాజ్యంలోనైతే వజ్రవైఢూర్యాల మహళ్ళు ఉండేవి. అపారమైన సుఖముండేది. మీరు విశ్వ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, నేను మీకు మళ్ళీ ఇస్తాను అని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు నా మతముపై నడవండి. శ్రేష్ఠంగా అవ్వాలంటే కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా మెడలోని మాలగా అయి తర్వాత విష్ణు మాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను, తర్వాత బ్రహ్మా-సరస్వతులు ఇరువురూ ఉన్నారు. వారే సత్యయుగంలో మహారాజా మహారాణులుగా అవుతారు. తర్వాత నంబరువారుగా సింహాసనముపై కూర్చొనే వారి మాల ఉంటుంది. నేను బ్రహ్మా-సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తాను. ఎవరైతే శ్రమ చేస్తారో, వారి స్మృతిచిహ్నమే తయారవుతుంది. అది రుద్రమాల, ఇది విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది మరియు విష్ణుమాల మనుష్యులది. ఆత్మలు నివసించే స్థానము నిరాకార పరంధామము, దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. ఆత్మ అండాకారములోనేమీ ఉండదు, ఆత్మ ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మలైన మనమందరమూ అక్కడ స్వీట్ హోమ్ లో నివసించేవారము. ఆత్మలైన మనము తండ్రితో కలిసి ఉంటాము. అది ముక్తిధామము. ముక్తిధామానికి వెళ్ళాలని మనుష్యులందరూ కోరుకుంటారు కానీ ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించడానికి రావలసిందే, అప్పటివరకు తండ్రి మిమ్మల్ని తయారుచేస్తూ ఉంటారు. మీరు తయారైపోతే, మిగిలిన ఆత్మలన్నీ వచ్చేస్తాయి. తర్వాత అంతా సమాప్తమైపోతుంది. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు, మళ్ళీ నంబరువారుగా చక్రము తిరుగుతుంది. చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది..... అని పాటలో విన్నారు కదా. ఇప్పుడు నరకవాసులుగా ఉన్న భారతవాసులు ఎవరైతే ఉన్నారో, వారే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. చాలా కొద్దిగానే అర్థం చేయించాలి. అల్ఫ్ బాబా, బే రాజ్యాధికారం. అల్ఫ్ కు (మొదటివారికి) రాజ్యాధికారం లభిస్తుంది. నేను ఆ రాజ్యాన్నే మళ్ళీ స్థాపన చేస్తానని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు 84 జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులుగా అయ్యారు. రావణుడు పతితంగా తయారుచేశాడు. మళ్ళీ పావనంగా ఎవరు చేస్తారు? పతితపావనుడు అని పిలవబడే భగవంతుడు. మీరు పతితుల నుండి పావనంగా, పావనుల నుండి పతితంగా ఎలా అవుతారో, ఆ చరిత్ర-భూగోళమంతా రిపీట్ అవుతుంది. దీని కోసమే ఈ వినాశనము ఉంటుంది. శాస్త్రాలలో బ్రహ్మా ఆయువు 100 సంవత్సరాలని అంటారు. ఇప్పుడు ఏ బ్రహ్మాలోనైతే తండ్రి కూర్చొని వారసత్వాన్ని ఇస్తారో, వారు కూడా శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుష్యులను పావనంగా చేయలేరు. దేవతలు ఎప్పుడూ వికారాల ద్వారా జన్మించరు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు కదా. భాగ్యము మేలుకొనే విధంగా తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. మనుష్యుల భాగ్యాన్ని మేలుకొలిపేందుకే తండ్రి వస్తారు. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు కదా. రక్షణ కోసం ఆర్తనాదాలు చేస్తూ వినాశనమైపోతారు, అందుకే ఆర్తనాదాలు కన్నా ముందే అనంతమైన తండ్రినైన నా నుండి వారసత్వము తీసుకోండి అని తండ్రి అంటారు. ఈ ప్రపంచంలో మీరు చూసేదంతా సమాప్తమవ్వనున్నది. ఫాల్ ఆఫ్ భారత్, రైజ్ ఆఫ్ భారత్ (భారతదేశ పతనం, భారతదేశ ఉన్నతి), ఇది దీనికి సంబంధించిన ఆటయే. రైజ్ ఆఫ్ వరల్డ్ (ప్రపంచ ఉన్నతి జరగనున్నది). స్వర్గంలో ఎవరెవరు రాజ్యము చేస్తారు అనేది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. రైజ్ ఆఫ్ భారత్ అంటే దేవతల రాజ్యము, ఫాల్ ఆఫ్ భారత్ అంటే రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది. కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది ఎంత సహజము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు. ఇది కూడా బాగా అర్థము చేసుకోవాలి. ఏ-ఏ ధర్మాలు ఎప్పుడు వస్తాయి, ద్వాపరము తర్వాతనే ఇతర ధర్నాలన్నీ వస్తాయి. వారు మొదట సుఖమును, తర్వాత దుఃఖమును అనుభవిస్తారు. ఈ చక్రమంతా బుద్ధిలో కూర్చోబెట్టుకోవలసి ఉంటుంది. దీని ద్వారా మీరు చక్రవర్తి మహారాజా-మహారాణులుగా అవుతారు. కేవలం అల్ఫ్ మరియు బే ను అర్థము చేసుకోవాలి. ఇప్పుడు వినాశనము తప్పకుండా జరగనున్నది. ఎంతగా గొడవలు జరుగుతాయంటే, ఇక విదేశాల నుండి తిరిగి రాలేరు కూడా, కావుననే భారతభూమి అన్నింటికంటే ఉత్తమమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు. చాలా తీవ్రమైన యుద్ధము మొదలవుతుంది, అప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా సరే, అతి కష్టం మీద రాగలరు. భారతభూమి అన్నింటికంటే ఉత్తమమైనది. అక్కడకు తండ్రి వచ్చి అవతరిస్తారు. శివజయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. కేవలం కృష్ణుని పేరు వేసినందుకు మహిమ అంతా సమాప్తమైపోయింది. మనుష్యమాత్రులందరి ముక్తిదాత ఇక్కడికే వచ్చి అవతరిస్తారు. శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. గాడ్ ఫాదర్ నే వచ్చి ముక్తినిస్తారు. మరి అటువంటి తండ్రినే నమస్కరించాలి, వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి ఇక్కడ భారతదేశంలోకి వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ స్థానము అయినట్లు. అందరినీ దుర్గతి నుండి విడిపించి సద్గతినిస్తారు, ఈ డ్రామా తయారై ఉంది. మన బాబా ఈ శరీరము ద్వారా ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నారని ఆత్మలైన మీకిప్పుడు తెలుసు. ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా వింటున్నాను. ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతూ ఉంటుంది, మీరు పవిత్రంగా అయి తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే, అంత పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారుచేస్తే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఉన్నత పదవిని పొందుతారు, అందుకే క్షణంలో జీవన్ముక్తి అని పాడుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతమనుసారంగా పవిత్రంగా అయి ప్రతి అడుగు తండ్రి మతముపై నడుస్తూ విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. తండ్రి సమానంగా దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.

2. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువును సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారుచేసే సేవ చేస్తూ ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి.

వరదానము:-

అధికారీతనపు స్థితి ద్వారా తండ్రిని తమ సహచరుని చేసుకునే సదా విజయీ భవ

తండ్రిని సహచరుని చేసుకునేందుకు సహజమైన పద్ధతి - అధికారీతనపు స్థితి. ఎప్పుడైతే అధికారీతనపు స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు వ్యర్థ సంకల్పాలు లేక అశుద్ధ సంకల్పాల అలజడిలో లేక అనేక రసాలలో బుద్ధి కింద మీద అవ్వదు. బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా ఎదుర్కొనే శక్తి, పరిశీలనా శక్తి మరియు నిర్ణయించే శక్తి వచ్చేస్తాయి, ఇవి సహజంగానే మాయ చేసే అనేక రకాల దాడులలో విజయులుగా చేస్తాయి.

స్లోగన్:-

క్షణంలో సారము నుండి విస్తారములోకి మరియు విస్తారము నుండి సారములోకి వెళ్ళే అభ్యాసము ఉన్నవారే రాజయోగులు.