02-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - శాంతి మీ మెడలోని హారము, ఆత్మ యొక్క స్వధర్మము, అందుకే శాంతి కోసం భ్రమించవలసిన అవసరం లేదు, మీరు మీ స్వ ధర్మంలో స్థితులవ్వండి

ప్రశ్న:-

మనుష్యులు ఏ వస్తువునైనా శుద్ధంగా చేయడానికి ఏ యుక్తిని రచిస్తారు మరియు తండ్రి ఏ యుక్తిని రచించారు?

జవాబు:-

మనుష్యులు ఏ వస్తువునైనా శుద్ధంగా చేయడానికి దానిని అగ్నిలో వేస్తారు. యజ్ఞాన్ని రచించినప్పుడు, అందులో కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఇక్కడ కూడా తండ్రి రుద్ర యజ్ఞాన్ని రచించారు, కానీ ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో అందరి ఆహుతి పడాల్సి ఉంది. పిల్లలైన మీరు దేహ సహితంగా అన్నింటినీ ఇందులో స్వాహా చేస్తారు. మీరు యోగాన్ని జోడించాలి. ఇది యోగం యొక్క రేస్ ఉంది. దీని ద్వారానే మీరు మొదట రుద్రుని మెడలోని హారంగా అవుతారు, తర్వాత విష్ణు మెడలోని మాలలో కూర్చబడతారు.

గీతము:-

ఓం నమః శివాయ... (ఓం నమో శివాయ...)

ఓంశాంతి

ఈ మహిమ ఎవరిది విన్నారు? పారలౌకిక పరమపిత పరమ-ఆత్మ అనగా పరమాత్మది. అందరు భక్తులు మరియు సాధన చేసేవారు వారిని స్మృతి చేస్తారు. వారికి మళ్ళీ పతిత పావనుడు అన్న పేరు కూడా ఉంది. పిల్లలకు తెలుసు, భారత్ పావనంగా ఉండేది. లక్ష్మీ-నారాయణులు మొదలైనవారిది పవిత్ర ప్రవృత్తి మార్గం యొక్క ధర్మము ఉండేది, దానిని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమని అంటారు. భారత్ లో పవిత్రత, సుఖము, శాంతి, సంపత్తి, అన్నీ ఉండేవి. పవిత్రత లేదంటే శాంతి లేదు, సుఖము లేదు. శాంతి కోసం భ్రమిస్తూ ఉంటారు. అడవిలో తిరుగుతూ ఉంటారు. ఒక్కరికి కూడా శాంతి లేదు ఎందుకంటే తండ్రి గురించి తెలియదు, తమ గురించి కూడా అర్థం చేసుకోరు - నేను ఆత్మను, ఇది నా శరీరము. దీని ద్వారా కర్మలు చేయవలసి ఉంటుంది. నా స్వధర్మమే శాంతి. ఇవి శరీరం యొక్క అవయవాలు అని. ఆత్మకు ఇది కూడా తెలియదు, ఆత్మలమైన మేము నిర్వాణధామము లేక పరంధామ నివాసులము అని. ఈ కర్మక్షేత్రంలో మేము శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తాము. శాంతి యొక్క హారము మెడలోనే ఉంది కానీ బయట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మనసుకు శాంతి ఎలా లభిస్తుందని అడుగుతూ ఉంటారు. వారికి ఇది తెలియదు, ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంది. ఆత్మ పరమపిత పరమాత్మ యొక్క సంతానము. వారు శాంతిసాగరుడు, మనం వారి సంతానము. ఇప్పుడు అశాంతి అయితే మొత్తం ప్రపంచమంతటా ఉంది కదా. అందరూ శాంతి కావాలని అంటారు. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి యజమాని అయితే ఒక్కరే, వారిని శివాయ నమః అని అంటారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు, శివుడు ఎవరు? ఇది కూడా మనుష్యులెవరికీ తెలియదు. పూజ కూడా చేస్తారు. కొంతమంది మళ్ళీ తమను తాము శివోహమ్ అని చెప్పుకుంటారు. అరే, శివుడు ఒక్కరే తండ్రి కదా. మనుష్యులు తమను తాము శివుడని చెప్పించుకోవడం, ఇదైతే పెద్ద పాపము అయ్యింది. శివుడినే పతితపావనుడని అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను లేదా ఇతర ఏ మనుష్యులను పతితపావనులు అని అనలేరు. పతితపావనుడు, సద్గతిదాత అయితే ఒక్కరే ఉన్నారు. మనుష్యులు, మనుష్యులను పావనంగా చేయలేరు ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం యొక్క ప్రశ్న కదా. తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే సత్యయుగం ఉండేదో - అప్పుడు భారత్ పావనంగా ఉండేది. ఇప్పుడు పతితంగా ఉంది. కావున ఎవరైతే మొత్తం సృష్టిని పావనంగా చేస్తారో, వారినే స్మృతి చేయాలి. ఇకపోతే, ఇది ఉన్నదే పతిత ప్రపంచము. మహాన్ ఆత్మ అని ఏదైతే అంటారో, అటువంటివారు ఎవ్వరూ లేరు. పారలౌకిక తండ్రి గురించే తెలియదు. భారత్ లో శివజయంతి మహిమ చేయబడింది. కావున పతితులను పావనంగా చేయడానికి తప్పకుండా భారత్ లోనే వచ్చి ఉండవచ్చు. వారు అంటారు - నేను సంగమంలో వస్తాను, దానిని కుంభము అని అనడం జరుగుతుంది. ఆ నీటి సాగరము మరియు నదుల యొక్క కుంభము కాదు. ఎప్పుడైతే జ్ఞానసాగరుడు, పతితపావనుడైన తండ్రి వచ్చి ఆత్మలందరినీ పావనంగా చేస్తారో, దానిని కుంభము అని అనడం జరుగుతుంది. ఇది కూడా మీకు తెలుసు - భారత్ ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో, అప్పుడు ఒక్క ధర్మమే ఉండేది. సత్యయుగంలో సూర్యవంశీయుల రాజ్యముండేది. తర్వాత త్రేతాలో చంద్రవంశీయులది. రామ్ రాజా, రామ్ ప్రజా... అని మహిమ ఉంది. త్రేతాకి ఇంత మహిమ ఉన్నప్పుడు సత్యయుగానికి అంతకన్నా ఎక్కువ మహిమ ఉంటుంది. భారత్ యే స్వర్గంగా ఉండేది. పవిత్ర జీవాత్మలు ఉండేవారు. మిగతా అన్ని ధర్మాల ఆత్మలు నిర్వాణధామంలో ఉండేవారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఇది కూడా మనుష్యులెవ్వరికీ తెలియదు. ఆత్మ ఇంత చిన్న బిందువు. దీనిలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. 84 లక్షల జన్మలైతే ఉండజాలవు. 84 లక్షల జన్మలలో కల్ప-కల్పాంతరాలు తిరుగుతూ ఉండడం అనేది జరగజాలదు. ఉన్నదే 84 జన్మల చక్రము. అది కూడా అందరికీ లేదు. ఎవరైతే మొదట ఉండేవారో, వారిప్పుడు వెనుకకు వచ్చేసారు, మళ్ళీ వారు మొదట వెళ్తారు. వెనుక వచ్చే ఆత్మలన్నీ నిర్వాణధామంలో ఉంటాయి. ఇవన్ని విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. వారినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు.

తండ్రి అంటారు, నేను వచ్చి బ్రహ్మా ద్వారా అన్ని వేద-శాస్త్రాలు, గీత మొదలైనవాటి సారాన్ని అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గపు కర్మకాండం యొక్క శాస్త్రాలు తయారై ఉన్నాయి. నేను వచ్చి ఎలా యజ్ఞాన్ని రచిస్తాను అన్న విషయాలైతే శాస్త్రాలలో లేవు. దీని పేరే ఉంది, రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడైతే శివుడు. ఇందులో అందరూ స్వాహా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, దేహ సహితంగా ఎవరైతే మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఉన్నారో, వారిని మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. నేను సన్యాసిని, క్రిస్టియన్ ను... ఇవన్నీ దేహపు ధర్మాలు, వీటన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. నిరాకారుడైతే తప్పకుండా శరీరంలోనే వస్తారు కదా. వారంటారు, నేను ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది. నేనే వచ్చి ఈ తనువు ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన అని మహిమ కూడా చేయబడుతుంది. సూక్ష్మవతనము ఉన్నదే ఫరిశ్తాల ప్రపంచము. అక్కడ ఎముకలు, మాంసము ఉండవు. ఎలాగైతే భూతాలుంటాయో, అలా తెల్ల తెల్లగా అక్కడ సూక్ష్మ శరీరాలు ఉంటాయి. ఏ ఆత్మకైతే శరీరం లభించదో, అది భ్రమిస్తూ ఉంటుంది. ఛాయ వంటి శరీరం కనిపిస్తుంది, దానిని పట్టుకోలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, స్మృతి చేసినట్లయితే, స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా గడిచిపోయింది, కొంత మాత్రమే మిగిలి ఉంది... అని అంటూ ఉంటారు. ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే, అంత మతి సో గతి అయిపోతుంది. గీతలో ఏదో ఒకటి-రెండు పదాలు సత్యమైనవి రాసారు. పిండిలో ఉప్పు ఉన్నట్లు, కొన్ని పదాలు సరియైనవి. మొదటైతే భగవంతుడు నిరాకారుడని తెలియాలి. ఆ నిరాకారుడైన భగవంతుడు, మళ్ళీ ఎలా మాట్లాడుతారు? వారంటారు, సాధారణ బ్రహ్మా తనువులోకి ప్రవేశించి రాజయోగాన్ని నేర్పిస్తాను. పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. ఒక్క ధర్మాన్ని స్థాపన చేసి, మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేయించడానికే నేను వస్తాను. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం, సత్యయుగంలో ఒకటే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. ఆత్మలన్నీ తమ-తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకొని వెళ్తాయి. దానిని వినాశన సమయమని అంటారు. అందరి దుఃఖాల లెక్కాచారాలు సమాప్తం అవుతాయి. దుఃఖము, పాపం కారణంగానే లభిస్తుంది. పాపం యొక్క లెక్క సమాప్తం అయిన తర్వాత, పుణ్యం యొక్క లెక్క మొదలవుతుంది. ప్రతి ఒక్క వస్తువును శుద్ధంగా చేయడానికి అగ్నిని ప్రజ్వలింపజేయడం జరుగుతుంది. యజ్ఞాన్ని రచిస్తారు, అందులో కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఇదైతే భౌతిక యజ్ఞం కాదు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. కృష్ణ జ్ఞాన యజ్ఞము అని అనరు. కృష్ణుడు ఏ యజ్ఞాన్ని రచించలేదు. కృష్ణుడైతే రాకుమారునిగా ఉండేవారు. యజ్ఞము, ఆపదల సమయంలో రచించబడుతుంది. ఈ సమయంలో అన్ని వైపులా ఆపదలున్నాయి కదా. చాలామంది మనుష్యులు రుద్ర యజ్ఞాన్ని కూడా రచిస్తారు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించరు. దానినైతే రుద్రుడు, పరమపిత పరమాత్మనే వచ్చి రచిస్తారు. వారు అంటారు, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో, అందులో అందరిదీ ఆహుతైపోతుంది. బాబా వచ్చి ఉన్నారు, యజ్ఞం కూడా రచించబడి ఉంది. ఎప్పటివరకైతే రాజ్యం స్థాపన జరగదో మరియు అందరూ పావనంగా అవ్వరో, అప్పటివరకు ఉంటుంది. వెంటనే అందరూ పావనంగా అవ్వరు. చివరి వరకు యోగం జోడిస్తూ ఉండండి. ఇది ఉన్నదే యోగం యొక్క రేస్. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంతగా పరుగు పెడుతూ వెళ్ళి రుద్రుని మెడలో హారంగా అవుతారు. తర్వాత మళ్ళీ విష్ణు మెడలోని మాలగా అవుతారు. మొదట రుద్రుని మాల, తర్వాత విష్ణు మాల. మొదట తండ్రి అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో, వారే నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అయి రాజ్యం చేస్తారు అనగా ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం స్థాపనవుతుంది. మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఏ విధంగానైతే 5 వేల సంవత్సరాల క్రితం నేర్పించారో, మళ్ళీ కల్పం తర్వాత నేర్పించడానికి వచ్చారు. శివజయంతి అనగా శివరాత్రిని కూడా జరుపుకుంటారు. రాత్రి అనగా కలియుగీ పాత ప్రపంచము యొక్క అంతిమం, కొత్త ప్రపంచం యొక్క ఆది. సత్య-త్రేతాయుగాలు పగలు, ద్వాపర-కలియుగాలు రాత్రి. బ్రహ్మా యొక్క అనంతమైన పగలు, తర్వాత బ్రహ్మా యొక్క అనంతమైన రాత్రి. కృష్ణుని పగలు-రాత్రి అని మహిమ చేయబడదు. కృష్ణుడికి జ్ఞానమే ఉండదు. బ్రహ్మాకు శివబాబా ద్వారా జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ పిల్లలైన మీకు వీరి ద్వారా లభిస్తుంది అనగా శివబాబా, మీకు బ్రహ్మా తనువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తారు. మనుష్య సృష్టిలో ఒక్కరు కూడా త్రికాలదర్శులుగా ఉండరు. ఒకవేళ ఉన్నట్లయితే జ్ఞానాన్ని ఇవ్వాలి కదా. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది? ఎప్పుడూ కూడా ఈ జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు.

భగవంతుడైతే అందరికీ ఒక్కరే. కృష్ణుడిని ఏమైనా అందరూ భగవంతుడని నమ్ముతారా. వారైతే రాజకుమారుడు. రాజకుమారుడు భగవంతుడు అవుతారా ఏమిటి? ఒకవేళ వారు రాజ్యం చేసినట్లయితే, మళ్ళీ పోగొట్టుకోవలసి ఉంటుంది కూడా. తండ్రి అంటారు, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసి, నేను మళ్ళీ నిర్వాణధామంలోకి వెళ్ళి ఉంటాను. తర్వాత ఎప్పుడైతే దుఃఖం మొదలవుతుందో, అప్పుడు నా పాత్ర కూడా మొదలవుతుంది. నేను మీ పిలుపును వింటాను. నన్ను ఓ దయాహృదయం కలవారా అని కూడా అంటారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా అనగా ఒక్క శివుడిదే చేస్తారు. తర్వాత దేవతలది ప్రారంభిస్తారు. ఇప్పుడైతే వ్యభిచారి భక్తి అయిపోయింది. ఎప్పటి నుండి పూజ చేయడం ప్రారంభమయ్యిందో, పూజారులకు కూడా తెలియదు. శివుడు అన్నా, సోమనాథుడన్నా విషయం ఒక్కటే. శివుడు నిరాకారుడు. సోమనాథుడని ఎందుకు అంటారు? ఎందుకంటే సోమనాథుడైన తండ్రి, పిల్లలకు జ్ఞానామృతాన్ని తాగిస్తారు. పేర్లు అయితే చాలా ఉన్నాయి. బబుల్ నాథ్ అని కూడా అంటారు, ఎందుకంటే ముళ్ళగా ఉండేవారిని పుష్పాలుగా చేసేవారు, సర్వుల సద్గతిదాత తండ్రి. వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనడము... ఇదైతే నింద చేసినట్లే కదా. తండ్రి అంటారు - ఎప్పుడైతే సంగమ సమయం వస్తుందో, అప్పుడు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో, అప్పుడే నేను వస్తాను. ఇది నియమము. నేను ఒకే ఒక్కసారి వస్తాను. తండ్రి ఒక్కరే. అవతారము కూడా ఒక్కటే. ఒక్కసారే వచ్చి, అందరినీ పవిత్ర రాజయోగులుగా చేస్తాను. మీది రాజయోగము. సన్యాసులది హఠయోగము. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. భారత్ ను నిలబెట్టేందుకు హఠయోగుల ధర్మం కూడా ఒకటి ఉంది. పవిత్రత అయితే కావాలి కదా. భారత్ 100 శాతం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. అందుకే, వచ్చి పావనంగా చేయండి అని అంటారు. సత్యయుగము పావన జీవాత్మల ప్రపంచము. ఇప్పుడు గృహస్థ ధర్మం పతితంగా ఉంది. సత్యయుగంలో గృహస్థ ధర్మం పావనంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే పావన గృహస్థ ధర్మం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. ఒక్క తండ్రే సర్వుల ముక్తి-జీవన్ముక్తి దాత. మనుష్యులు, మనుష్యులకు ముక్తి-జీవన్ముక్తి ఇవ్వలేరు.

మీరు జ్ఞానసాగరుడైన తండ్రికి పిల్లలు. బ్రాహ్మణులైన మీరు సత్యాతి-సత్యమైన యాత్రను చేయిస్తారు. మిగిలిన వారంతా అసత్యమైన యాత్రలు చేయించేవారు. మీరు డబల్ అహింసకులు. మీరు ఎటువంటి హింసా చేయరు, కొట్లాడరు, కామ ఖడ్గాన్ని నడిపించరు. కామంపై విజయం పొందడంలో శ్రమ అనిపిస్తుంది. వికారాలపై విజయం పొందాలి. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు. ఇప్పుడు మనం నిరాకార భగవంతుని పిల్లలము, పరస్పరంలో సోదరులము. తర్వాత బ్రహ్మాబాబాకు పిల్లలము. కనుక తప్పకుండా నిర్వికారులుగా అవ్వాలి కదా అనగా మీకు విశ్వ రాజ్యాధికారం మీకు లభిస్తుంది. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. కమల పుష్ప సమానంగా పవిత్రులుగా అవ్వండి. అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు చాలా తెలివైనవారిగా అవుతారు. సృష్టి యొక్క జ్ఞానము, మీ బుద్ధిలో ఉంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. స్వ ఆత్మ కు దర్శనమవుతుంది అనగా జ్ఞానం లభిస్తుంది, పరమపిత పరమాత్మ ద్వారా. వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యమైనవారు. ఇప్పుడు వారు జ్ఞానాన్ని ఇచ్చేందుకు వచ్చారు. బీజము ఒక్కటే, ఇది కూడా మీకు తెలుసు. బీజము నుండి వృక్షము ఎలా వెలువడుతుంది. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. బీజం పైన ఉంది. మొట్టమొదట దైవీ వృక్షము వెలువడుతుంది. తర్వాత ఇస్లామీ, బౌద్ధులు... వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభించింది. ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మీరు ఏది వింటారో, అది మీ బుద్ధిలో మాత్రమే ఉంది. సత్యయుగం ఆదిలో అయితే శాస్త్రాలు ఉండవు. ఈ 5 వేల సంవత్సరాల కథ ఎంత సహజమైనది కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సమయం తక్కువగా ఉంది, చాలా గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది... కనుక ఏదైతే శ్వాస మిగిలి ఉందో - దానిని తండ్రి స్మృతిలో సఫలం చేసుకోవాలి. పాత పాపపు లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి.

2. శాంతి స్వధర్మంలో స్థితులయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఎక్కడ పవిత్రత ఉంటుందో, అక్కడ శాంతి ఉంటుంది. నా స్వధర్మమే శాంతి. నేను శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని... ఈ అనుభవం చేయాలి.

వరదానము:-

నిర్మానత యొక్క విశేషత ద్వారా సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల మాననీయ భవ

అందరి ద్వారా గౌరవం ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము - నిర్మానంగా అవ్వడము. ఏ ఆత్మలైతే స్వయాన్ని సదా నిర్మానచిత్తులనే విశేషత ద్వారా నడిపిస్తారో, వారు సహజంగా సఫలతను పొందుతారు. నిర్మానులుగా అవ్వడమే స్వమానము. నిర్మానులుగా అవ్వడమంటే వంగడం కాదు, కానీ తమ విశేషత మరియు ప్రేమ ద్వారా వంగేలా చేయడము. వర్తమాన సమయానుసారంగా, సదా మరియు సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు ఇదే మూలాధారము. ప్రతి కర్మ, సంబంధము మరియు సంపర్కంలో నిర్మానంగా అయ్యేవారే విజయీ రత్నాలుగా అవుతారు.

స్లోగన్:-

జ్ఞానం యొక్క శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు దాడి చేసేందుకు బదులుగా ఓటమిని పొందుతాయి.