02-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు భవిష్య 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి, ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి"

ప్రశ్న:-

ఏ పిల్లల బుద్ధి తాళము నంబరువారుగా తెరుచుకుంటూ ఉంటుంది?

జవాబు:-

ఎవరైతే శ్రీమతంపై నడుస్తూ ఉంటారో, పతితపావనుడైన తండ్రి స్మృతిలో ఉంటారో, ఎవరికైతే చదువు చదివించేవారితో యోగముంటుందో, వారి బుద్ధికి వేయబడిన తాళము తెరుచుకుంటూ ఉంటుంది. పిల్లలూ, ఆత్మలమైన మేము సోదరులము, మేము తండ్రి ద్వారా వింటున్నాము అనే అభ్యాసము చేయండి అని బాబా చెప్తున్నారు. దేహీ-అభిమానులుగా అయి వింటూ మరియు వినిపిస్తూ ఉంటే తాళము తెరుచుకుంటూ ఉంటుంది.

ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివబాబా స్మృతిలో ఉండడం మాత్రమే కాదు. అది కేవలం శాంతి అవుతుంది, తర్వాత సుఖం కూడా కావాలి. మీరు శాంతిగా ఉండాలి మరియు స్వదర్శన చక్రధారులుగా అయి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. నరుని నుండి నారాయణునిగా లేదా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకే మీరు పురుషార్థము చేస్తున్నారు. ఇక్కడ ఎవరిలోనైనా ఎన్ని దైవీ గుణాలున్నా కానీ వారిని దేవతలు అని అనరు. దేవతలు స్వర్గములోనే ఉంటారు. ప్రపంచములోని మనుష్యులకు స్వర్గము గురించి తెలియదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, పాత ప్రపంచాన్ని నరకము అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా భారతవాసీయులకు మాత్రమే తెలుసు. సత్యయుగంలో రాజ్యము చేసినటువంటి దేవతల చిత్రాలు కూడా భారత్ లోనే ఉన్నాయి. వీరు ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత వారి చిత్రాలను పూజించేందుకు బయటకు (విదేశాలకు) తీసుకువెళ్తారు. బయట ఎక్కడకు తీసుకెళ్ళినా అక్కడ మందిరాలను నిర్మిస్తారు. ప్రతి ధర్మము వారు ఎక్కడకు వెళ్ళినా, తమ చిత్రాలకే పూజలు చేసుకుంటారు. ఏ-ఏ గ్రామాలపై విజయము పొందుతారో అక్కడకు వెళ్ళి చర్చి మొదలైనవి నిర్మిస్తారు. ప్రతి ఒక్క ధర్మము వారికి పూజ కోసం తమ-తమ చిత్రాలున్నాయి. మేమే దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇంతకుముందు మీకు కూడా తెలియదు. స్వయాన్ని వేరుగా భావించి వారి చిత్రాలను పూజించేవారు. ఇతర ధర్మాల వారికి పూజించేటప్పుడు, మా ధర్మ స్థాపకుడు క్రీస్తు, మేము క్రిస్టియన్లము లేక బౌద్ధులము అని వారికి తెలుసు. ఈ హిందువులకు తమ ధర్మము గురించి తెలియని కారణంగా స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు మరియు దేవతలను పూజిస్తారు. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని, మేము మా పెద్దవారిని పూజిస్తున్నాము అని కూడా వారికి తెలియదు. క్రిస్టియన్లు ఒక్క క్రీస్తును మాత్రమే పూజిస్తారు. భారతవాసీయులకు వారి ధర్మము ఏమిటి, అలాగే దానిని ఎవరు స్థాపించారు మరియు ఎప్పుడు స్థాపించారు అన్నది తెలియదు. భారత్ యొక్క ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ప్రాయః లోపమైనప్పుడు, దానిని మళ్ళీ స్థాపన చేసేందుకు నేను వస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతకుముందు ఏమీ తెలియదు. అర్థము తెలియకుండానే భక్తిమార్గములో చిత్రాలను పూజించేవారు. ఇప్పుడు మనము భక్తి మార్గములో లేమని మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీకు మరియు శూద్ర కులము వారికి రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. అది కూడా మీరు ఈ సమయములోనే అర్థము చేసుకుంటారు. సత్యయుగంలో అలా అనుకోరు. ఈ సమయములోనే మీకు వివేకం లభిస్తుంది. తండ్రి ఆత్మలకు వివేకాన్నిస్తున్నారు. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచములో చాలామంది మనుష్యులున్నారు. ఇక్కడ మనుష్యులు ఎంతగా గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. మనము కూడా ముళ్ళగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని పుష్పాలుగా తయారుచేస్తున్నారు. ముళ్ళు, ఈ సుగంధభరితమైన పుష్పాలకు నమస్కరిస్తారు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మనమే దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత ఇప్పుడు సుగంధభరితమైన పుష్పాలుగా (బ్రాహ్మణులుగా) అయ్యాము. ఇది డ్రామా అని తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఈ డ్రామాలు, సినిమాలు ఉండేవి కావు. ఇవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే ఉదాహరణలు ఇచ్చేందుకు తండ్రికి సహజమవుతుంది. పిల్లలు కూడా అర్థము చేసుకోగలరు. ఈ సైన్సును కూడా పిల్లలు నేర్చుకోవాలి కదా. బుద్ధిలో ఈ సైన్సు సంస్కారాలన్నీ తీసుకువెళ్తారు, అవి తర్వాత అక్కడ ఉపయోగపడతాయి. ప్రపంచము ఒక్కసారిగా సమాప్తమైపోదు. సంస్కారాలను తీసుకువెళ్ళి మళ్ళీ జన్మ తీసుకుంటారు. విమానాలు మొదలైనవి కూడా తయారుచేస్తారు. అక్కడ ఉపయోగపడే వస్తువులన్నీ తయారవుతాయి. స్టీమర్లు తయారుచేసేవారు కూడా ఉంటారు కానీ అక్కడ స్టీమర్లు ఉపయోగపడవు. వారు జ్ఞానము తీసుకున్నవారైనా, కాకపోయినా సరే, వారి ఈ సంస్కారం అక్కడ ఉపయోగపడదు. అక్కడ స్టీమర్లు మొదలైన వాటి అవసరముండదు. డ్రామాలో లేదు. అయితే విమానాలు, విద్యుత్ దీపాలు మొదలైనవాటి అవసరముంటుంది. వాటి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అక్కడ (విదేశాల) నుండి పిల్లలు నేర్చుకుని వస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి.

మనం కొత్త ప్రపంచము కోసమే చదువుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనల్ని భవిష్య 21 జన్మల కోసం చదివిస్తున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మనము పవిత్రంగా అవుతున్నాము. ఇంతకుముందు నరకవాసులుగా ఉండేవారము. ఫలానావారు స్వర్గస్థులైయ్యారని మనుష్యులు అంటారు కూడా. కానీ మేము నరకంలో ఉన్నామని అనుకోరు. బుద్ధి తాళము తెరవబడదు. పిల్లలైన మీకిప్పుడు నంబరువారుగా, నెమ్మది-నెమ్మదిగా తాళము తెరుచుకుంటుంది. ఎవరైతే శ్రీమతంపై నడవడం మొదలుపెడతారో మరియు పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారో, వారి తాళము తెరుచుకుంటుంది. బాబా జ్ఞానాన్ని కూడా ఇస్తారు మరియు స్మృతి చేయడం కూడా నేర్పిస్తారు. టీచరు కదా. మరి టీచరు తప్పకుండా చదివిస్తారు. ఎంతగా టీచరుతో మరియు చదువుతో యోగముంటుందో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఆ చదువులోనైతే తప్పకుండా యోగం ఉంటుంది. బ్యారిస్టరు చదివిస్తున్నారు అని తెలుసు. ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు. ఇది కూడా మర్చిపోతారు ఎందుకంటే కొత్త విషయము కదా. దేహాన్ని గుర్తు చేయడమైతే చాలా సహజము. క్షణ-క్షణము దేహము గుర్తుకొస్తుంది. మేము ఆత్మలమని మర్చిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మనము సోదరులము. నేను పరమాత్మను, స్వయాన్ని ఆత్మగా భావించి ఇతర ఆత్మలను కూర్చోబెట్టి నేర్పించండి అని నేను ఆత్మలకు నేర్పిస్తున్నాను అని తండ్రికి తెలుసు. చెవుల ద్వారా వింటుంది, వినిపించేవారు పరమపిత పరమాత్మ. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు. మీరు ఇతరులకు అర్థం చేయించేటప్పుడు, ఆత్మనైన నాలో జ్ఞానముంది, దానిని ఆత్మకు వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉండాలి. మేము ఏదైతే బాబా నుండి విన్నామో, అది ఇతర ఆత్మలకు వినిపిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. ఇది పూర్తిగా కొత్త విషయము. మీరు ఇతరులను చదివించేటప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యి చదివించరు, మర్చిపోతారు. ఇది గమ్యము కదా. నేను అవినాశీ ఆత్మను, ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తున్నాను - అని బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. ఆత్మలైన మీరు శూద్ర కులములో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులములో ఉన్నారు. తర్వాత దేవతా కులములోకి వెళ్తారు. అక్కడ శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మలైన మనము సోదరులము. తండ్రి పిల్లలను చదివిస్తున్నారు. మేము పరస్పరములో సోదరులము, సోదరుడిని చదివిస్తున్నాము అని పిల్లలు అంటారు. ఆత్మకే అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. స్మృతిలోకి రావు. అర్థకల్పము మీరు దేహాభిమానములో ఉన్నారు. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి, ఆత్మ అని నిశ్చయము చేసుకుని కూర్చోండి. ఆత్మ అని నిశ్చయము చేసుకుని వినండి. పరమపిత పరమాత్మనే వినిపిస్తున్నారు, అందుకే, ఆత్మ-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని అంటారు..... అక్కడైతే చదివించను. ఇక్కడికే వచ్చి చదివిస్తాను. మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ శరీరాలున్నాయి. ఈ తండ్రి అయితే సుప్రీమ్ ఆత్మ. వారికి శరీరం లేదు. వారి ఆత్మ పేరు శివ. ఈ శరీరము నాది కాదని మీకు తెలుసు. నేను సుప్రీమ్ ఆత్మను. నా మహిమ భిన్నమైనది. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వారిది ఉంటుంది కదా. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారని గాయనము కూడా ఉంది కదా. వారు జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు సత్యము, చైతన్యము, ఆనందము, సుఖ-శాంతుల సాగరుడు. ఇది తండ్రి మహిమ. పిల్లలకు తండ్రి ఆస్తి గురించి తెలిస్తుంది - మా తండ్రి వద్ద ఈ ఫ్యాక్టరీ ఉంది, ఈ మిల్లు ఉంది అని నషా ఉంటుంది కదా. మగ పిల్లలే ఆ ఆస్తికి యజమానులుగా అవుతారు. ఈ ఆస్తి అయితే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి వద్ద ఏమి ఆస్తి ఉందో, అది మీరు విన్నారా.

ఆత్మలైన మీరు అమరులు. ఎప్పుడూ మృత్యువును పొందరు. ప్రేమసాగరులుగా కూడా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు ప్రేమసాగరులు. ఎప్పుడూ గొడవపడరు-కొట్లాడుకోరు. ఇక్కడైతే ఎంతగా గొడవపడతారు-కొట్లాడుకుంటారు. ఇక్కడ ప్రేమ వలన ఇంకా చిక్కులు ఏర్పడతాయి. తండ్రి వచ్చి వికారాలను సమాప్తం చేయించినప్పుడు, ఎన్ని దెబ్బలు పడతాయి. పిల్లలూ, పావనంగా అవ్వండి, అప్పుడే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. కామము మహాశత్రువు, అందుకే బాబా వద్దకు వచ్చినప్పుడు ఏమని చెప్తారంటే - ఏవైతే వికర్మలు చేశారో, వాటిని చెప్పేస్తే తేలికైపోతారు, అందులోనూ ముఖ్యంగా వికారాల విషయము. తండ్రి పిల్లల కళ్యాణార్థము అడుగుతారు. ఓ పతిత-పావనా రండి అని తండ్రినే పిలుస్తారు ఎందుకంటే వికారాలలోకి వెళ్ళేవారినే పతితులని అంటారు. ఈ ప్రపంచము కూడా పతితంగా ఉంది, మనుష్యులు కూడా పతితంగా ఉన్నారు, పంచ తత్వాలు కూడా పతితంగా ఉన్నాయి. అక్కడ మీ కోసం తత్వాలు కూడా పవిత్రమైనవి కావాలి. ఈ ఆసురీ పృథ్విపై దేవతల నీడ కూడా పడదు. లక్ష్మిని ఆహ్వానిస్తారు కానీ లక్ష్మి ఇక్కడకు రాలేరు. ఈ పంచ తత్వాలు కూడా పరివర్తన అవ్వాలి. సత్యయుగము కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. ఇది సమాప్తమయ్యే సమయము. ఇంకా 40 వేల సంవత్సరాలున్నాయని మనుష్యులు భావిస్తారు. కల్పము ఆయుష్షు 5 వేల సంవత్సరాలు అన్నప్పుడు, మరి కేవలం ఒక్క కలియుగమే 40 వేల సంవత్సరాలు ఎలా అవుతుంది. ఎంత అజ్ఞాన అంధకారములో ఉన్నారు. జ్ఞానమే లేదు. భక్తి బ్రాహ్మణుల రాత్రి. జ్ఞానము బ్రహ్మాకు మరియు బ్రాహ్మణులకు పగలు. అది ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము-సగము అని అంటారు. కొత్త ప్రపంచానికి ఎక్కువ సమయము, పాత ప్రపంచానికి తక్కువ సమయము ఉండదు. సరిగ్గా సగం-సగం ఉంటాయి. కనుక 1/4 భాగాలుగా కూడా చేయవచ్చు. సరగ్గా సగం-సగం లేకపోతే 1/4 భాగాలుగా కూడా పూర్తిగా చేయలేము. స్వస్తిక్ లో కూడా 4 భాగాలను చూపిస్తారు. స్వస్తిక్ గుర్తును రచించి మేము గణేశుడిని చిత్రిస్తున్నామని భావిస్తారు. ఈ పాత ప్రపంచము వినాశనమవుతుందని పిల్లలకు ఇప్పుడు తెలుసు. మనము కొత్త ప్రపంచము కోసం చదువుకుంటున్నాము. కొత్త ప్రపంచము కోసం మనము నరుని నుండి నారాయణునిగా అవుతున్నాము. కృష్ణుడు కూడా కొత్త ప్రపంచానికి చెందినవాడు. కృష్ణుడికి గాయనముంది, వారిని మహాత్ముడని అంటారు ఎందుకంటే అతను చిన్న బాలుడు. చిన్న పిల్లలు ప్రియమనిపిస్తారు. చిన్నవారిని ప్రేమించినట్లుగా పెద్దవారిని ప్రేమించరు ఎందుకంటే చిన్నవారు సతోప్రధాన స్థితిలో ఉంటారు. వికారాల దుర్గంధం ఉండదు. పెద్దవారవుతూనే వికారాల దుర్గంధం వస్తుంది. పిల్లల్లో వికారీ దృష్టి ఎప్పుడూ ఉండకూడదు. ఈ కళ్ళే మోసము చేస్తాయి, అందుకే అతను తన కళ్ళను తీసేశాడని ఉదాహరణ ఇస్తారు. అలాంటి విషయమేమీ లేదు. అలా ఎవ్వరూ కళ్ళు తీసేసుకోరు. ఈ సమయంలో బాబా జ్ఞాన విషయాలను అర్థం చేయిస్తున్నారు. మీకిప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభించింది. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానము లభించింది. ఆత్మలోనే జ్ఞానముంది. నాలో జ్ఞానముందని తండ్రి చెప్తున్నారు. ఆత్మను నిర్లేపి అని అనలేరు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అవినాశి. చాలా చిన్నది. దానిలో 84 జన్మల పాత్ర ఉంది. ఇటువంటి విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. వారు నిర్లేపి అని అంటారు, అందుకే మొదట ఆత్మను అనుభవము చేయమని తండ్రి చెప్తున్నారు. జంతువులు ఎక్కడికి వెళ్తాయి అని కొంతమంది అడుగుతారు. అరే, జంతువుల విషయమే వదిలేయండి. మొదట ఆత్మను అనుభూతి చేయండి. నేను ఆత్మను, ఎలా ఉన్నాను, ఏమిటి....? స్వయాన్ని ఆత్మ అన్నదే తెలుసుకోలేదంటే, నన్నేమి తెలుసుకుంటారు అని తండ్రి చెప్తున్నారు. ఇవన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్న సూక్ష్మమైన విషయాలు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది, అది అభినయిస్తూ ఉంటుంది. డ్రామాలో నిశ్చితమై ఉంటే మరి మేమెందుకు పురుషార్థము చేయాలి అని కొందరు అడుగుతారు. అరే, పురుషార్థము చేయకుండా నీరు కూడా లభించదు. డ్రామానుసారముగా దానంతట అదే అంతా లభిస్తుందని కాదు. కర్మలైతే తప్పకుండా చేయాల్సిందే. మంచి లేక చెడు కర్మలు ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది రావణ రాజ్యము, ఇందులో మీరు చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. అక్కడ వికర్మలు జరిగేందుకు రావణరాజ్యమే ఉండదు. నేనే మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తాను. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి, రావణరాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. గీతా-పాఠకులు కూడా దీని అర్థాన్ని చెప్పలేరు, వారైతే కేవలం చదివి వినిపిస్తారు, సంస్కృతములో శ్లోకాలు వినిపించి మళ్ళీ హిందీలో అర్థము చెప్తారు. కొన్ని-కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి అని తండ్రి చెప్తున్నారు. భగవానువాచ కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో ఎవ్వరికీ తెలియదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని, ఎలాగైతే తండ్రి శాంతి, పవిత్రత, ఆనందాలకు సాగరుడో, అలా ఆత్మనైన నేను కూడా మాస్టర్ సాగరుడను, ఇదే నషాలో ఉండాలి.

2. డ్రామా అని అంటూ పురుషార్థాన్ని విడిచిపెట్టకూడదు, కర్మలు తప్పకుండా చేయాలి. కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి.

వరదానము:-

సదా తండ్రి యొక్క అవినాశీ మరియు నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండే మాయాప్రూఫ్ భవ

ఏ పిల్లలైతే సదా తండ్రి ప్రేమలో లవలీనమై ఉంటారో వారిని మాయ ఆకర్షించలేదు. ఎలాగైతే వాటర్ ప్రూఫ్ వస్త్రముపై ఒక్క నీటి చుక్క కూడా నిలువదో, అలా ఎవరైతే తపనలో లవలీనులై ఉంటారో వారు మాయాప్రూఫ్ గా అయిపోతారు. మాయ ఏ విధంగానూ దాడి చేయలేదు ఎందుకంటే తండ్రి ప్రేమ అవినాశీ మరియు నిస్వార్థమైనది, ఎవరైతే దీని అనుభవీలుగా అయ్యారో, వారు అల్పకాలిక ప్రేమలో చిక్కుకోరు. ఒకటి తండ్రి, రెండవది నేను, ఇద్దరి మధ్యలో మూడవ వారెవ్వరూ రాలేరు.

స్లోగన్:-

అతీతంగా-ప్రియంగా ఉంటూ కర్మలు చేసేవారే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలరు.