02-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 01-03-86


''హోలీహంసల బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట''

ఈరోజు బాప్ దాదా సర్వ హోలీహంసల సభను చూస్తున్నారు. ఇది సాధారణ సభ కాదు. ఇది ఆత్మిక హోలీహంసల సభ. అందరూ ఎంతవరకు హోలీ హంసలుగా అయ్యారు అని బాప్ దాదా ప్రతి ఒక్క హోలీహంసను చూస్తున్నారు. హంసల విశేషత ఏమిటో బాగా తెలుసా? అన్నిటికన్నా ముందు హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠంగా మరియు శుభంగా ఆలోచించేవారు. హోలీహంస అనగా రాళ్ళను మరియు రత్నాలను బాగా పరిశీలించగలిగేవారు మరియు ధారణ చేసేవారు, ముందుగా ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి, ఆ తర్వాత ధారణ చేసేవారు. బుద్ధిలో ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల అశుభము లేక సాధారణ భావమును ధారణ చేయనివారు. సదా శుభ భావము మరియు శుభ భావన ధారణ చేసేవారు. భావము తెలుసుకుంటే ఎప్పుడూ ఎవరి సాధారణ స్వభావము లేక వ్యర్థ స్వభావము యొక్క ప్రభావం పడదు. శుభ భావము, శుభ భావన, వీటిని భావ స్వభావాలు అంటారు, వ్యర్థం ఏదైతే ఉన్నదో దానిని పరివర్తన చేసుకోవాలి. ఇటువంటి హంస బుద్ధికలవారిగా ఎంతవరకు అయ్యారు అని బాప్ దాదా చూస్తున్నారు. అలాగే హంస వృత్తి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ కళ్యాణ వృత్తి. ప్రతి ఆత్మ యొక్క అకళ్యాణపు మాటలు వింటూ, చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తిలోకి మార్చడం - దీనిని హోలీహంస వృత్తి అని అంటారు. తమ కళ్యాణ వృత్తి ద్వారా ఇతరులను కూడా మార్చగలరు. వారి అకళ్యాణ వృత్తిని తమ కళ్యాణ వృత్తితో మార్చడము - ఇదే హోలీహంసల కర్తవ్యము. ఇదే విధంగా దృష్టిలో సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠమైన, శుద్ధమైన, స్నేహ దృష్టి ఉండాలి. ఎలా ఉన్నా కానీ మీ వైపు నుండి అందరి పట్ల ఆత్మిక స్నేహ దృష్టిని ధారణ చేయాలి, దీనిని హోలీహంస దృష్టి అని అంటారు. అలాగే మాటలో కూడా, ముందే వినిపించాము కదా, చెడు మాటలు వేరు. అదైతే బ్రాహ్మణులలో మారిపోయింది కానీ వ్యర్థ మాటలను కూడా హోలీహంసల మాటలు అని అనలేము. మాట కూడా హోలీహంస మాటగా ఉండాలి! ఎవరి నోటి నుండి అయితే ఎప్పుడూ వ్యర్థం వెలువడదో వారిది హంస ముఖ స్థితి అని అంటారు. కనుక హోలీహంస బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట. ఎప్పుడైతే ఈ విధంగా పవిత్రంగా అనగా శ్రేష్ఠంగా అవుతారో, అప్పుడు స్వతహాగానే హోలీహంస స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావము కనిపిస్తుంది. మరి నేను ఎంత వరకు సదా హోలీహంసగా అయ్యి నడస్తూ-తిరుగుతూ ఉన్నాను అని అందరూ స్వయాన్ని చూసుకోండి. ఎందుకంటే స్వ ఉన్నతి కోసం సమయము ఎక్కువగా లేదు, కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి మరియు పరివర్తన అవ్వండి.

ఈ సమయం యొక్క పరివర్తన బహుకాలపు పరివర్తనగా ఉండే బంగారు ప్రపంచానికి అధికారిగా తయారుచేస్తుంది. ఈ సూచనను బాప్ దాదా ఇంతకుముందు కూడా ఇచ్చి ఉన్నారు. అందరికీ స్వయం పట్ల అటెన్షన్ అనేది డబుల్ అండర్ లైన్ గా ఉన్నదా? కొద్ది సమయం కోసం అటెన్షన్ ఉంటుంది. బహుకాలపు అటెన్షన్ యొక్క ఫల స్వరూపము శ్రేష్ఠ ప్రాప్తి యొక్క ప్రారబ్ధము, అందుకని ఈ కొద్ది సమయము చాలా శ్రేష్ఠమైన సుందర సమయము. ఇందులో శ్రమ కూడా లేదు, కేవలం బాబా ఏదైతే చెప్పారో, అది ధారణ చేయాలి. ధారణ చేయడము ద్వారా ప్రాక్టికల్ గా స్వతహాగా అయిపోతారు. హోలీహంస పనియే ధారణ చేయడము. మరి ఇది ఇటువంటి హోలీహంసల సభయే కదా. నాలెడ్జ్ ఫుల్ గా అయితే అయ్యారు. వ్యర్థము మరియు సాధారణము ఏమిటో బాగా అర్థం చేసుకున్నారు. మరి అర్థం చేసుకున్న తర్వాత కర్మలో స్వతహాగానే వస్తుంది. మామూలుగా కూడా సాధారణ భాషలో, ఇప్పుడు నాకు అర్థమయింది అని అంటారు కదా. ఇక తర్వాత చేయకుండా ఉండలేరు. కనుక ముందుగా సాధారణము మరియు వ్యర్థము ఏమిటో పరిశీలించండి. ఎప్పుడైనా వ్యర్థాన్ని మరియు సాధారణతనే శ్రేష్ఠంగా భావించడం లేదు కదా? కనుక ముందుగా ముఖ్యమైనది హోలీహంస బుద్ధి. అందులో స్వతహాగా పరిశీలించే శక్తి వచ్చేస్తుంది ఎందుకంటే రైట్ మరియు రాంగ్ యొక్క పరిశీలన లేనప్పుడు వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ సమయము ఉంటాయి. మీ వ్యర్థమును మరియు రాంగ్ ను, రైట్ గా భావిస్తున్నారు, అందుకే ఎక్కువగా వర్థ సమయము ఉంటుంది. అది వ్యర్థము, కానీ నేను సమర్థంగా, రైట్ గా ఆలోచిస్తున్నాను, నేను చెప్పిందే రైటు అని అనుకుంటారు. పరిశీలన శక్తి లేని కారణంగా ఇందులోనే మనసు శక్తి, సమయం శక్తి, వాణి శక్తి అన్నీ పోతున్నాయి మరియు ఇతరులతో శ్రమ తీసుకున్న భారము కూడా మీపై పడుతుంది. కారణము ఏమిటి? ఎందుకంటే హోలీహంస బుద్ధి కలవారిగా అవ్వలేదు. కనుక బాప్ దాదా హోలీహంసలందరికీ మళ్ళీ సూచనను ఇస్తున్నారు, చెడును చెడుగా చేయకండి. ఇది ఉన్నదే చెడు అని ఆలోచించకండి కానీ చెడును మంచిగా ఎలా చేయాలి అని ఆలోచించండి. దీనినే కళ్యాణ భావన అని అంటారు. శ్రేష్ఠ భావము, శ్రేష్ఠ భావనతో తమలోని వ్యర్థ భావ-స్వభావాలను మరియు ఇతరులలోని భావ-స్వభావాలను పరివర్తన చేయడంలో విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అర్థమయిందా! ముందు స్వయంపై విజయులు, తర్వాత సర్వులపై విజయులు, ఆ తర్వాత ప్రకృతిపై విజయులు. ఈ మూడు విజయాలు మిమ్మల్ని విజయమాలలోని మణులుగా చేస్తాయి. ప్రకృతిలో వాయుమండలం, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వస్తాయి. మరి మూడింటిపై విజయులుగా అయ్యారా? ఈ ఆధారంతోనే విజయమాలలో మీ నంబరును చూసుకోవచ్చు, అందుకే దాని పేరు వైజయంతి మాల. మరి అందరూ విజయులేనా? అచ్ఛా! ఈరోజు ఆస్ట్రేలియా వారి టర్ను. ఆస్ట్రేలియా వారికి మధుబన్ నుండి గోల్డెన్ చాన్సలర్ గా అయ్యే అవకాశం లభిస్తుంది ఎందుకంటే అందరినీ ముందుంచి ఛాన్సును ఇస్తారు, ఇది విశేషత. ఇతరులను ముందుంచడము, ఈ ఛాన్సును ఇవ్వడము అనగా ఛాన్సలర్ గా అవ్వడము. ఛాన్స్ తీసుకునేవారిని, ఛాన్స్ ఇచ్చేవారిని, ఇద్దరినీ ఛాన్సలర్ అని అంటాము. బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారు మరియు వర్ణన చేస్తారు. ఆస్ట్రేలియాలో పాండవులకు విశేషంగా సేవ ఛాన్స్ లభించింది. ఎక్కువగా సెంటర్లను కూడా పాండవులు సంభాళిస్తున్నారు. శక్తులు పాండవులకు అవకాశాన్ని ఇచ్చారు. ముందుంచే వారు సదా ముందుంటారు. ఇది కూడా శక్తుల విశాలత. కానీ పాండవులు స్వయాన్ని సదా నిమిత్తంగా భావిస్తూ సేవలో ముందుకు వెళ్తున్నారు కదా. సేవలో నిమిత్త భావమే సేవలో సఫలతకు ఆధారము. బాప్ దాదా మూడు మాటలు చెప్తారు కదా, అవి సాకారుని ద్వారా చివరిలో ఉచ్చరింపబడ్డాయి. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఈ మూడు విశేషతలు నిమిత్త భావంతో స్వతహాగానే వస్తాయి. నిమిత్త భావము లేకపోతే ఈ మూడు విశేషతలు అనుభవం అవ్వవు. నిమిత్త భావము అనేక రకాల నేను, నాది అనేవాటిని సహజంగానే సమాప్తం చేస్తుంది. నేను లేదు, నాది లేదు. స్థితిలో కలిగే అలజడి ఈ ఒక్క లోపం కారణంగానే వస్తుంది. సేవలో కూడా శ్రమించాల్సి వస్తుంది మరియు తమ ఎగిరే కళ యొక్క స్థితిలో కూడా శ్రమించాల్సి వస్తుంది. నిమిత్తము అనగా నిమిత్తం చేసినవారు సదా గుర్తుండటము. మరి ఈ విశేషతతో సదా సేవను వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. సేవ విస్తరించడం, ఇది కూడా సేవా సఫలతకు గుర్తు. ఇప్పుడు అచల-నిశ్చల స్థితిలో బాగా అనుభవజ్ఞులుగా అయ్యారు. అర్థమయిందా - ఆస్ట్రేలియా అంటే కొంత ఎక్స్ ట్రా, వేరే వారిలో లేనిది. ఆస్ట్రేలియాలో ఇంకొక వెరైటీ అనగా గుజరాతీలు మొదలైనవారు లేరు. దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అన్నదానిని ఎక్కువగా చేసారు. తమ తోటివారిని మేల్కొలిపారు. కుమారీ-కుమారుల కళ్యాణం బాగా జరుగుతోంది. ఈ జీవితంలో తమ జీవితం గురించి శ్రేష్ఠ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తమ జీవితాన్ని తయారుచేసుకుంటే సదా కోసం శ్రేష్ఠంగా అయినట్లే. తప్పుడు మెట్లు ఎక్కడం నుండి రక్షింపబడ్డారు. ఒకరిద్దరి ద్వారా అనేకుల దీపాలను వెలిగించి దీపమాలను తయారుచేస్తున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. సేవలో బిజీగా ఉండటం వలన ఉన్నతిని బాగా చేసుకుంటున్నారు.

ఒకటి నిమిత్త భావము గురించి వినిపించాము, రెండు, ఎవరైతే సేవకు నిమిత్తంగా అవుతారో వారికోసం స్వ ఉన్నతి లేదా సేవ యొక్క ఉన్నతి గురించి ఒక విశేషమైన స్లోగన్ సేఫ్టీకి సాధనముగా ఉంటుంది. నిమిత్తంగా ఉన్న మనం ఏమి చేస్తామో, అది చూసి అందరూ చేస్తారు ఎందుకంటే సేవకు నిమిత్తంగా అవ్వడము అంటే స్టేజి పైకి రావడము. ఎలా అయితే ఎవరైనా పాత్రధారి స్టేజి మీదకు వచ్చినప్పుడు, ఎంతో అటెన్షతో ఉంటారు. మరి సేవకు నిమిత్తంగా అవ్వడము అంటే స్టేజిపై పాత్రను పోషించడము. స్టేజి వైపు అందరి దృష్టి ఉంటుంది. ఎవరు ఎంతగా హీరో పాత్రధారిగా ఉంటారో, అంతగా వారిపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కనుక ఈ స్లోగన్ సేఫ్టీకి సాధనము, దీనితో స్వతహాగా ఎగిరే కళను అనుభవం చేసుకుంటారు. అసలైతే సెంటరులో ఉన్నా, ఎక్కడున్నా సేవ చేస్తుంటారు. అందరూ సేవాధారులు. కొందరు తమ నిమిత్త స్థానాలలో ఉండి సేవా అవకాశాన్ని తీసుకుంటారు, వారు కూడా సేవ అనే స్టేజిపై ఉన్నారు. సేవలో తప్ప తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సేవ ఖాతా కూడా చాలా జమ అవుతుంది. సత్యమైన హృదయంతో సేవ చేసేవారు తమ ఖాతాను చాలా బాగా జమ చేసుకుంటున్నారు. బాప్ దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరి ఆది నుండి అంతిమం వరకు సేవ యొక్క ఖాతా ఉంది మరియు ఆటోమేటిక్ గా అందులో జమ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి అకౌంటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అకౌంటు పెట్టుకునే వారి వద్ద చాలా ఫైళ్ళు ఉంటాయి. బాబా వద్ద స్థూల ఫైళ్ళు ఏమీ లేవు. ఒక్క సెకండులో ప్రతి ఒక్కరి ఆది నుండి ఇప్పటి వరకు రిజిస్టర్ ఇమర్జ్ అవుతుంది. ఆటోమేటిక్ గా జమ అవుతూ ఉంటుంది. మమ్మల్ని అయితే ఎవ్వరూ చూడరు, అర్థం చేసుకోరు అని ఎప్పుడూ అనుకోకండి. బాప్ దాదా వద్ద అయితే ఎవరు ఎలా ఉన్నారు, ఎంత చేస్తున్నారు, ఏ స్థితిలో చేస్తున్నారు, అన్నీ జమ అవుతాయి. ఫైలు లేదు కానీ ఫైనల్ ఉంది. ఆస్ట్రేలియాలో శక్తులు బాబాకు చెందినవారిగా అవ్వడంలో, బాబాను గుర్తించడంలో, బాబాతో స్నేహాన్ని నిర్వర్తించడంలో మంచి ధైర్యాన్ని చూపారు. అలజడి అనే పొరపాటు జరుగుతుంది, అయితే, అది స్థానం, ధరణి లేదా టోటల్ గా గత జన్మ సంస్కారాల కారణంగా అలజడి జరగవచ్చు. వాటిని కూడా దాటి స్నేహ బంధనంలో ముందుకు సాగుతూ ఉన్నారు, అందుకని బాప్ దాదా శక్తుల ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ఒకే బలము-ఒకే నమ్మకము ముందుకు నడిపిస్తుంది. శక్తుల ధైర్యము మరియు పాండవుల సేవా ఉల్లాసము అనే రెండు రెక్కలు దృఢంగా అయ్యాయి. సేవా క్షేత్రంలో పాండవులు కూడా మహావీరులుగా అయి ముందుకు వెళ్తున్నారు. అలజడిని దాటడంలో తెలివైనవారు. అందరి చిత్రము అదే. పాండవులను పొడవుగా, దృఢంగా, లావుగా చూపిస్తారు ఎందుకంటే స్థితి అంత గట్టిగా మరియు ఉన్నతంగా ఉంటుంది, అందుకని పాండవులను ఉన్నతంగా, ధైర్యశాలురుగా చూపించారు. ఆస్ట్రేలియా వారు చాలా దయా హృదయులు కూడా. భ్రమిస్తున్న ఆత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి సేవలో ముందుకు వెళ్తున్నారు. వారు ఎప్పుడూ సేవ లేకుండా ఉండలేరు. పిల్లలు ముందుకు వెళ్ళే విశేషతను చూసి బాప్ దాదా సదా సంతోషిస్తారు. విశేషంగా అదృష్టవంతులు. ప్రతి ఒక్కరూ శ్రేష్ఠ లక్ష్యంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు అన్న విషయంలో పిల్లల ప్రతి ఒక్కరి ఉల్లాస ఉత్సాహాలకు బాప్ దాదా హర్షిస్తున్నారు. బాప్ దాదా సదా విశేషతలనే చూస్తారు. ప్రతి ఒక్కరూ, ఒకరికంటే మరొకరు ప్రియముగా అనిపిస్తారు. మీరు కూడా ఇతరులను ఇదే విధితో చూస్తారు కదా. ఎవరిని చూసినా కానీ ప్రియంగా అనిపించాలి ఎందుకంటే 5 వేల సంవత్సరాల క్రితం విడిపోయిన పరివారం పరస్పరం కలుసుకుంది, మరి ఎంత ప్రియంగా అనిపిస్తారు! బాబాపై ప్రేమకు గుర్తు ఏమిటంటే, బ్రాహ్మణ ఆత్మలందరూ ప్రియంగా అనిపిస్తారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ ప్రియంగా అనిపించడము అంటే బాబాపై ప్రేమ ఉన్నట్లు. మాలలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వచ్చేది బ్రాహ్మణులతోనే కదా. బాబా అయితే రిటైర్ అయ్యి చూస్తుంటారు, కనుక బాబాపై ప్రేమకు గుర్తును సదా అనుభవం చేయండి. అందరూ బాబాకు ప్రియమైనవారు కనుక మనకు కూడా ప్రియమైనవారు. అచ్ఛా.

పార్టీలతో -

1. అందరూ స్వయాన్ని విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? విశేష ఆత్మను, విశేష కార్యానికి నిమిత్తంగా ఉన్నాను మరియు విశేషతలనే చూడాలి - ఇది సదా స్మృతిలో పెట్టుకోండి. విశేష స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేసేస్తుంది. వ్యర్థాన్ని కూడా సమాప్తం చేసేస్తుంది. కనుక సదా విశేషము అనే పదాన్ని గుర్తు పెట్టుకోండి. మాట్లాడటము కూడా విశేషము, చూడటము కూడా విశేషము, చేయడము కూడా విశేషము, ఆలోచించడము కూడా విశేషము. ప్రతి విషయంలో ఈ విశేషము అనే పదాన్ని తీసుకురావడం ద్వారా స్వతహాగానే మారిపోతారు మరియు ఈ స్మృతితోనే స్వ పరివర్తన, విశ్వ పరివర్తన సహజంగా జరుగుతాయి. ప్రతి విషయంలో విశేషము అన్న పదాన్ని జోడిస్తూ వెళ్ళండి. దీని ద్వారానే సంపూర్ణతను పొందాలనే లక్ష్యాన్ని, గమ్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు.

2. సదా తండ్రి మరియు వారసత్వము యొక్క స్మృతిలో ఉంటున్నారా? శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనుభవం అవుతుందా? స్థితికి ఆధారము స్మృతి. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా అవుతుంది. స్మృతి సదా శక్తిశాలిగా ఉండాలి. ఆ శక్తిశాలి స్మృతి,"నేను బాబాకు చెందినవాడిని, బాబా నావారు''. ఈ స్మృతితో స్థితి శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తారు. కనుక సదా స్మృతిపై విశేష అటెన్షన్ ఉంచండి. సమర్థ స్మృతి, సమర్థ స్థితి, సమర్థ సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. స్మృతి, స్థితి మరియు సేవ మూడూ సమర్థంగా ఉండాలి. ఎలా అయితే స్విచ్ ఆన్ చేయగానే వెలుగు వస్తుందో, ఆఫ్ చేయగానే అంధకారం అయిపోతుందో, అలాగే ఈ స్మృతి కూడా ఒక స్విచ్ వంటిది. స్మృతి అనే స్విచ్ ఒకవేళ బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. సదా స్మృతి రూపి స్విచ్ పై అటెన్షన్. దీని ద్వారానే స్వయం మరియు సర్వుల కళ్యాణము. కొత్త జన్మ కలిగినప్పుడు కొత్త స్మృతి. పాత స్మృతులన్నీ సమాప్తము. మరి ఈ విధితో సదా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి.

3. అందరూ స్వయాన్ని భాగ్యశాలిగా భావిస్తున్నారా? వరదాని భూమి పైకి రావడము అంటే మహా భాగ్యము. ఒక భాగ్యము, వరదాన భూమికి చేరుకోవడము, ఈ భాగ్యాన్ని ఎంత కావాలనుకుంటే అంత శ్రేష్ఠంగా తయారుచేసుకోవచ్చు. శ్రేష్ఠ మతమే భాగ్య రేఖను గీసే కలము. దీనితో ఎంతగా మీ శ్రేష్ఠ రేఖను తయారుచేసుకుంటూ ఉంటారో అంతగా శ్రేష్ఠంగా అవుతారు. పూర్తి కల్పంలో ఈ శ్రేష్ఠ సమయంలోనే భాగ్య రేఖను తయారుచేసుకోగలరు. ఇటువంటి సమయంలో, ఇటువంటి స్థానానికి చేరుకున్నారు. మరి కొద్దిలోనే సంతోషపడేవారు కాదు. ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు అలసిపోవాలి? బాబా స్మృతియే శ్రేష్ఠంగా తయారుచేస్తుంది. బాబాను గుర్తు చేయడము అంటే పావనంగా అవ్వడము అని అర్థము. ఇది జన్మజన్మల సంబంధము అయినప్పుడు స్మృతి కష్టమా? కేవలం స్నేహంతో మరియు సంబంధంతో గుర్తు చేయండి. స్నేహము ఉన్నచోట స్మృతి లేకపోవడము అన్నది జరగలేదు. మర్చిపోవాలని ప్రయత్నించినా గానీ మర్చిపోలేరు. అచ్ఛా.

వరదానము:-

మస్తకము ద్వారా సంతుష్టత యొక్క ప్రకాశమును చూపించే సాక్షాత్కారమూర్త భవ

ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకం నుండి సంతుష్టతరూపీ ప్రకాశము సదా ప్రకాశిస్తూ ఉంటుంది. వారిని ఎవరైనా ఉదాసీన ఆత్మలు చూసినట్లయితే వారు కూడా సంతోషపడతారు, వారి ఉదాసీనత అంతమైపోతుంది. ఎవరివద్దనైతే సంతుష్టతరూపీ సంతోషపు ఖజానా ఉంటుందో వారివెనుక అందరూ స్వతహాగానే ఆకర్షితులవుతారు. వారి సంతోషమయమైన ముఖము చైతన్యమైన బోర్డుగా అయిపోతుంది, అది అనేక ఆత్మలను తయారుచేసేవారి పరిచయమును ఇస్తుంది. కావున ఇటువంటి సంతుష్టంగా ఉండే మరియు సర్వులను సంతుష్టపరిచే సంతుష్టమణులుగా అవ్వండి, తద్వారా అనేకులకు సాక్షాత్కారము జరుగుతుంది.

స్లోగన్:-

దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడము మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడము.