02-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీరు భవిష్య కొత్త ప్రపంచం కోసం మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు, మీ ఈ రాజయోగము కొత్త ప్రపంచం కోసముంది

ప్రశ్న:-

భాగ్యశాలీ పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-

1. భాగ్యశాలీ పిల్లలు నియమానుసారంగా శ్రీమతమును అనుసరిస్తారు. ఎటువంటి నియమవిరుద్ధమైన పనులు చేసి స్వయాన్ని గాని, తండ్రిని గాని మోసం చేయరు. 2. వారికి చదువు పట్ల పూర్తి అభిరుచి ఉంటుంది. అర్థం చేయించే అభిరుచి కూడా ఉంటుంది. 3. పాస్ విత్ ఆనర్ గా అయ్యి స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేస్తారు. ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వరు. ఎప్పుడూ ఏ విధమైన తప్పుడు కర్మలు చేయరు.

గీతము:-
భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాను..... (తక్దీర్ జగాకర్ ఆయీ హూ.....)

ఓంశాంతి.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా విన్నారు, కుమారీలు కూడా విన్నారు. ఇది పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు. అక్కడ అనేక రకాల భాగ్యము ఉంటుంది. కొందరు సర్జన్ గా అయ్యే భాగ్యాన్ని, కొందరు బ్యారిస్టరుగా అయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యం-ఉద్దేశ్యం అని అంటారు. భాగ్యాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు. కొత్త ప్రపంచంలో మన రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు మనం కూడా భాగ్యం తయారు చేసుకొని వచ్చామని ఇప్పుడు ఇక్కడ పిల్లలకు తెలుసు. ఇది కొత్త ప్రపంచం కోసం రాజయోగము. వారు పాత ప్రపంచం కోసం బ్యారిస్టరు, ఇంజనీరు, సర్జన్ మొదలైనవారిగా అవుతారు. అలా తయారవుతూ-తయారవుతూ, ఇప్పుడు పాత ప్రపంచం యొక్క సమయం చాలా తక్కువ ఉంది, ఇది ఇక సమాప్తమైపోతుంది. ఆ భాగ్యము ఈ మృత్యులోకం కోసం, ఈ జన్మ కోసం మాత్రమే. మీ చదువు కొత్త ప్రపంచం కోసము. మీరు కొత్త ప్రపంచం కోసం భాగ్యాన్ని తయారుచేసుకొని వచ్చారు. కొత్త ప్రపంచంలో మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. ఎవరు చదివిస్తున్నారు? అనంతమైన తండ్రి. వారి నుండే వారసత్వాన్ని పొందేది ఉంది. ఎలాగైతే డాక్టర్లకు, తమ డాక్టరు చదువుకు సంబంధించిన వారసత్వం లభిస్తుంది. అచ్ఛా, వృద్ధులుగా అయినప్పుడు గురువుల వద్దకు వెళ్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణనివ్వండి, మాకు సద్గతినివ్వండి, ఇక్కడ నుండి బయటకు తీసి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. తండ్రి నుండి కూడా ఈ జన్మ కోసం వారసత్వం లభిస్తుంది. ఇకపోతే గురువుల నుండి ఏమీ లభించదు. టీచరు నుండి ఏదో ఒక వారసత్వాన్ని పొందుతారు ఎందుకంటే జీవనాధారం కావాలి కదా! తండ్రి యొక్క వారసత్వం ఉన్నా కూడా, మేము కూడా సంపాదించాలి అనుకుంటూ చదువుకుంటూ ఉంటారు. గురువు నుండి సంపాదనేమీ లభించలేదు. అయితే, కొందరు గీత మొదలైనవి బాగా చదువుకొని, గీతపై భాషణ చేస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖం కోసము. ఇప్పుడిది ఈ మృత్యులోకం యొక్క అంతిమము. మనం కొత్త ప్రపంచం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. తండ్రి ఆస్తి మరియు మీ ఆస్తి, అంతా భస్మమైపోతుంది. చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం సంపాదన కావాలి. పాత ప్రపంచంలోని మనుష్యులు ఈ సంపాదనను చేసుకోలేరు. కొత్త ప్రపంచం కోసం సంపాదన చేయించేవారు శివబాబా మాత్రమే. ఇక్కడ మీరు కొత్త ప్రపంచం కోసం భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. ఆ తండ్రియే మీకు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. భవిష్యత్తు కోసం సంపాదించడం నేర్పించేందుకు వారు సంగమంలోనే వస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, ఈ విషయం ఈ ప్రపంచంలోని మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచం కోసం వీరు మనకు తండ్రి, టీచరు, సద్గురువు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకే వస్తారు. ఎవరైనా భాగ్యాన్ని తయారు చేసుకోవడం లేదంటే వారేమీ అర్థం చేసుకోలేదు అన్నట్లు. ఒకే ఇంట్లో పత్ని చదువుకుంటారు, పతి చదువుకోరు, పిల్లలు చదువుకుంటారు, తల్లిదండ్రులు చదువుకోరు. ఇలా జరుగుతూ ఉంటుంది. మొదట్లో పరివారాలకు పరివారాలే వచ్చారు. కానీ మాయ తుఫాన్లు రావడంతో ఆశ్చర్యవంతులై విన్నారు, వినిపించారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యవంతులై వింటారు, వినిపిస్తారు, తండ్రికి చెందినవారిగా అవుతారు, చదువును చదివిస్తారు, అయినా..... అయ్యో, డ్రామా రాత అని అంటూ ఉంటారు. ఇది డ్రామా అన్నట్లే కదా! ఓహో డ్రామా, ఓహో మాయ, అని తండ్రి స్వయంగా అంటారు. ఎవరికి విడాకులిచ్చారు! పతి-పత్ని ఒకరికొకరు విడాకులిచ్చుకుంటారు. పిల్లలు తండ్రికి విడాకులిస్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. తండ్రి పిల్లల చేత సత్యమైన సంపాదన చేయించేందుకు వచ్చారు. తండ్రి ఎవరినీ గోతులో పడేయరు. తండ్రి అయితే పతితపావనుడు, దయాహృదయుడు. తండ్రి వచ్చి దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు మరియు మార్గదర్శకులై తనతో పాటు తీసుకువెళ్తారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని ఏ లౌకిక గురువు చెప్పరు. శాస్త్రాలలో, నేను మీ అందరినీ తీసుకువెళ్తానని భగవానువాచ ఉంది. దోమల వలె అందరూ వెళ్ళేది ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలేయాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే. కేవలం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇది పాత ఛీ-ఛీ శరీరము. ఈ ప్రపంచం కూడా పాతదే. పాత ఇంట్లో కూర్చుని ఉండగా ఎదురుగా కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే, తండ్రి కూడా - ఇది మా కోసమే అని అనుకుంటారు, అలాగే పిల్లలు కూడా - ఇది మా కోసమే తయారవుతుందని అనుకుంటారు. కొత్త ఇంట్లో ఇది చేయండి, ఇది చేయండి అని బుద్ధి కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. బుద్ధి అందులోనే నిమగ్నమై ఉంటుంది, తర్వాత పాత ఇంటిని పడగొట్టేస్తారు. పాతదాని పట్ల మమకారమంతా తొలగి కొత్తదానితో జోడించబడుతుంది. ఇది అనంతమైన ప్రపంచానికి సంబంధించిన విషయము. పాత ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించుకోవాలి మరియు కొత్త ప్రపంచంతో జోడించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ప్రపంచమంటే స్వర్గము. అందులో మనం రాజ్య పదవిని పొందుతాము. ఎంతగా యోగంలో ఉంటారో, జ్ఞానాన్ని ధారణ చేస్తారో, ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. ఇది చాలా భారీ పరీక్ష. మనం 21 జన్మల కోసం వారసత్వాన్ని పొందుతున్నాము. షావుకార్లుగా అవ్వడం మంచిదే కదా! దీర్ఘాయువు లభించడం మంచిదే కదా! సృష్టి చక్రాన్ని ఎంతగా గుర్తు చేస్తారో, ఎంతమందిని తమ సమానంగా తయారుచేస్తారో, అంత లాభముంటుంది. రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ప్రదర్శనీలకు ఎంతో మంది వస్తారు. వారంతా ప్రజలు అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానం వినాశనమవ్వదు. పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధిలోకి వస్తుంది. రామ రాజ్య స్థాపన జరుగుతుంది, రావణ రాజ్యం వినాశనమైపోతుంది. సత్యయుగంలో దేవతలు మాత్రమే ఉంటారు.

బాబా ఇలా అర్థం చేయించారు - లక్ష్మీనారాయణుల చిత్రాలు ఏవైతే తయారుచేస్తారో, వాటిలో ఇలా వ్రాయాలి, ఏమనంటే - గత జన్మలో వీరు తమోప్రధాన ప్రపంచంలో ఉండేవారు, తర్వాత ఈ పురుషార్థంతో తమోప్రధాన ప్రపంచం నుండి సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు అని. రాజు, ప్రజలు అందరూ యజమానులుగానే ఉంటారు కదా. ప్రజలు కూడా, మా భారత్ అన్నింటికంటే ఉన్నతమైనదని అంటారు. నిజంగా భారత్ యే అన్నింటికంటే ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు, తప్పకుండా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారత్ అన్నింటికంటే షావుకారుగా ఉండేది. భారతవాసులైన మనం అన్నింటికంటే ఉన్నతమైన దేవతా కులానికి చెందినవారిగా ఉండేవారము. ఇతురులెవ్వరినీ దేవీ-దేవతలని అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి కదా! ప్రదర్శినీలు మొదలైనవాటికి టెలిగ్రాములు ఎలా రాయాలో వ్రాసుకొని రండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారు కదా! మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వారు ఈ పదవిని ఎలా పొందారు అనేది మీరు ఋజువు చేసి చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ శివబాబా నుండి ఈ పదవిని పొందుతున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివుడు పరమపిత పరమాత్మ. బ్రహ్మా, విష్ణువు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. విష్ణుపురి ఎదురుగా నిలబడి ఉంది. విష్ణువు ద్వారా కొత్త ప్రపంచ పాలన జరుగుతుంది. విష్ణువు అనగా రాధా-కృష్ణుల కంబైండ్ రూపము. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరు? గీతా భగవంతుడు నిరాకార శివుడు, కృష్ణుడు కాదు అని ముందు వ్రాయండి. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు. ఒక్క చిత్రం గురించి అర్థం చేయించడానికే ఎంత సమయం పడుతుంది. ఈ విషయం బుద్ధిలో కూర్చోవాలి కదా! మొట్టమొదట ఇది అర్థం చేయించి, తర్వాత వ్రాయాలి, ఏమనంటే - తండ్రి అంటున్నారు - మీకు యోగబలంతో బ్రహ్మా ద్వారా 21 జన్మల అధికారం లభిస్తుంది అని. శివబాబా బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. మొట్టమొదట వీరి ఆత్మ వింటుంది. ఆత్మయే ధారణ చేస్తుంది. ఇదే ముఖ్యమైన విషయము. శివుని చిత్రాన్నే చూపిస్తారు. వీరు పరమపిత పరమాత్మ శివ, తర్వాత ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా కావాలి. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మాకు అనేక మంది బ్రహ్మాకుమార-కుమారీలున్నారు. బ్రహ్మా పిల్లలుగా అవ్వనంత వరకు, బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు, శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. గర్భం ద్వారానైతే ఇంతమంది జన్మ జరగదు. ముఖ వంశావళి అని కూడా అంటూ ఉంటారు. మేము ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి అని మీరు అంటారు. వారు గురువులకు శిష్యులుగా లేకు ఫాలోవర్స్ గా ఉంటారు. ఇక్కడ మీరు ఒక్కరినే తండ్రి, టీచరు, సద్గురువు అని అంటారు. ఆ నిరాకార శివబాబానే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. వారు టీచర్ కూడా. నిరాకారుడు వచ్చి సాకారుని ద్వారా వినిపిస్తారు. ఆత్మయే మాట్లాడుతుంది కదా! నా శరీరాన్ని విసిగించకండి అని ఆత్మ అంటుంది. ఆత్మ దుఃఖితముగా అవుతుంది. ఈ సమయంలో పతితాత్మలు ఉన్నారు. పతితులను పావనంగా చేసేవారు పరమపిత పరమాత్మ. ఓ పతితపావనా, ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు ఒక ఫాదర్ అయితే ఎలాగూ కూర్చుని ఉన్నారు, మరి ఇంకెవరిని స్మృతి చేస్తున్నారు. వీరు నా ఆత్మకు ఫాదర్, వారు శరీరానికి ఫాదర్ అని ఆత్మ అంటుంది. ఆత్మలకు తండ్రి అయిన నిరాకారుడు గొప్పవారా లేక శరీరానికి రచయిత అయిన సాకార తండ్రి గొప్పవారా అని ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. సాకార తండ్రి అయితే నిరాకారుడిని స్మృతి చేస్తారు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది కనుక అందరికీ వివరించడం జరుగుతుంది. పారలౌకిక తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు అంతిమంలోనే వస్తారు. మిగిలినదంతా వినాశనం అవ్వనున్నది. దీనినే మృత్యులోకమని అంటారు. ఎవరైనా మరణించినప్పుడు, ఫలానావారు పరలోకానికి వెళ్ళారని, శాంతిధామానికి వెళ్ళారని అంటారు. పరలోకం అని సత్యయుగాన్ని అంటారా లేక శాంతిధామాన్ని అంటారా అనేది మనుష్యులకు తెలియదు. సత్యయుగమైతే ఇక్కడే ఉంటుంది. పరలోకం అని శాంతిధామాన్ని అంటారు. అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి - ఇది శివబాబా స్మృతిచిహ్నము, ఆ శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. వాస్తవానికి శివుడు ఒక బిందువు. కానీ బిందువును ఎలా పూజించాలి. వారికి ఫలాలు, పుష్పాలు మొదలైనవి ఎలా అర్పించాలి. అందుకే, పెద్ద రూపాన్ని తయారుచేసారు. కానీ ఇంత పెద్ద రూపమేమీ ఉండదు. భృకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన సితార..... అని అంటూ ఉంటారు. పెద్ద వస్తువై ఉంటే సైన్స్ వారు వెంటనే పట్టుకునేవారు! వారికి పరమపిత పరమాత్మ గురించి పూర్తి పరిచయం లభించలేదని బాబా అర్థం చేయిస్తారు. భాగ్యం మేల్కోనంత వరకు పరిచయం లభించదు. ఇప్పుడు ఇంకా వారి భాగ్యం మేల్కోలేదు. తండ్రిని తెలుసుకోనంత వరకు, మా ఆత్మ బిందు సమానంగా ఉంటుందని అర్థం చేసుకోరు. శివబాబా కూడా ఒక బిందువే, మనం బిందువును గుర్తు చేస్తాము. ఈ విధంగా భావిస్తూ స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఇకపోతే, ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది..... వీటిని మాయా విఘ్నాలని అంటారు. మాకు పరమాత్మ లభించారనే సంతోషం ఇప్పుడు ఉంది. కానీ జ్ఞానం కూడా కావాలి కదా! ఎవరికైనా కృష్ణుని సాక్షాత్కారం జరిగితే సంతోషపడతారు. బాబా అంటారు - కృష్ణుని సాక్షాత్కారాన్ని పొంది చాలా సంతోషంగా డాన్స్ మొదలైనవి చేస్తారు కానీ వాటితో సద్గతి ఏమీ లభించదు. ఈ సాక్షాత్కారాలైతే సులభంగా జరుగుతాయి. ఒకవేళ మంచి రీతిగా చదువుకోకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కొంచెం విన్నా కూడా కృష్ణపురిలోకి వెళ్ళి సాధారణ ప్రజలు మొదలైనవారిగా అవుతారు. శివబాబా మాకు ఈ నాలెడ్జ్ ను వినిపిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు నాలెడ్జ్ ఫుల్.

తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అన్నది బాబా ఆజ్ఞ. కానీ కొందరు పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు పతితులు కూడా ఇక్కడకు దాక్కుని వచ్చేస్తారు. వారు తమను తామే నష్టపరచుకుంటారు. స్వయాన్ని మోసం చేసుకుంటున్నారు. తండ్రిని మోసం చేసే ప్రసక్తే లేదు. తండ్రిని మోసగించి వారి నుండి ధనం ఏమైనా తీసుకునేది ఉందా. శివబాబా శ్రీమతమనుసారంగా, నియమానుసారంగా నడుచుకోకపోతే మీ పరిస్థితి ఏమవుతుంది. చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాక, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎటువంటి నియమవిరుద్ధమైన పనులు చేయకూడదు. మీ నడవడిక సరిగ్గా లేదని తండ్రి అర్థం చేయిస్తారు కదా! తండ్రి సంపాదించుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇక చేయడం, చేయకపోవడం అనేది వారి భాగ్యము. శిక్షలను అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్ళాల్సిందే, పద భ్రష్టులు అయిపోతారు, అప్పుడిక ఏమీ లభించదు. రావడం చాలా మంది వస్తారు కానీ ఇక్కడ తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయముంటుంది. బాబా నుండి మేము స్వర్గం యొక్క సూర్యవంశీ రాజ్య పదవిని పొందుతామని పిల్లలంటారు. ఇది రాజయోగం కదా! విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా! పాస్ అయిన వారికి స్కాలర్షిప్ లభిస్తుంది కదా. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో, వారి మాలయే తయారు చేయబడింది. ఎంతగా పాస్ అవుతారో, అలాంటి స్కాలర్షిప్ లభిస్తుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ వేలాది మంది తయారవుతారు. రాజ్య పదవియే స్కాలర్షిప్. ఎవరైతే ఈ చదువును బాగా చదువుకుంటారో, వారు గుప్తంగా ఉండలేరు. చాలా మంది కొత్తవారు పాతవారి కంటే ముందుకు వెళ్ళిపోతారు. వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటారు. తమ సత్యమైన సంపాదనను జమ చేసుకొని 21 జన్మల కోసం వారసత్వాన్ని పొందుతారు. ఎంత సంతోషం కలుగుతుంది. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడూ తీసుకోలేరని మీకు తెలుసు. చదువు పట్ల అభిరుచి ఉంటుంది కదా! కొందరికైతే అర్థం చేయించాలనే అభిరుచి ఏ మాత్రం లేదు. డ్రామానుసారంగా భాగ్యంలో లేకపోతే భగవంతుడు కూడా ఏం చేయగలరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ పనిని శ్రీమతానికి విరుద్ధంగా చేయకూడదు. చదువును మంచి రీతిగా చదువుకొని ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు.

2. ఈ పాత ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించుకోవాలి. బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచంతో జోడించాలి. సంతోషంగా ఉండేందుకు జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి.

వరదానము:-

లైట్ హౌస్ స్థితి ద్వారా పాప కర్మలను సమాప్తం చేసుకునే పుణ్యాత్మ భవ

ఎక్కడైతే లైట్ ఉంటుందో, అక్కడ ఎలాంటి పాప కర్మ జరగదు. కనుక సదా లైట్ హౌస్ స్థితిలో ఉండడం వలన మాయ ఎలాంటి పాప కర్మను చేయించలేదు, సదా పుణ్యాత్మగా అవుతారు. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఎలాంటి పాప కర్మను చేయలేరు. ఎక్కడైతే పాపముంటుందో, అక్కడ తండ్రి స్మృతి ఉండదు. కనుక నేను పుణ్యాత్మను, పాపమనేది నా ఎదురుగా రాలేదు అని దృఢ సంకల్పం చేయండి. స్వప్నంలో లేక సంకల్పంలో కూడా పాపాన్ని రానివ్వకండి.

స్లోగన్:-

ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షీగా అయి చూస్తారో, వారే సదా హర్షితంగా ఉంటారు.