03-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 06-01-1986


"సంగమయుగము - జమ చేసుకునేయుగము"

ఈ రోజు పిల్లల మూడు కాలాలు తెలిసిన త్రికాలదర్శి అయిన బాప్ దాదా పిల్లలందరి జమ ఖాతాను చూస్తున్నారు. మొత్తం కల్పమంతటిలో శ్రేష్ఠమైన ఖాతాను జమ చేసుకునే సమయం ఈ సంగమయుగం ఒక్కటే అని అందరికీ తెలుసు. ఇది చిన్న యుగం, చిన్న జీవితం. కాని ఈ యుగము, ఈ జీవితము యొక్క విశేషత ఏమిటంటే ఎంత కావాలంటే అంత ఇప్పుడే జమ చేసుకోవచ్చు. ఈ సమయంలోని శ్రేష్ఠ ఖాతా అనుసారంగా పూజ్య పదవిని కూడా పొందుతారు, మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా కూడా అవుతారు. ఈ సమయం యొక్క శ్రేష్ఠమైన కర్మలు, శ్రేష్ఠమైన జ్ఞానము, శ్రేష్ఠమైన సంబంధాలు, శ్రేష్ఠమైన శక్తులు, శ్రేష్ఠమైన గుణాలు, వీటన్నిటి శ్రేష్ఠమైన ఖాతాను ఇప్పుడే జమ చేసుకుంటారు. ద్వాపర యుగము నుండి భక్తి ఖాతా అల్పకాలికమైనది, ఇప్పుడే చేస్తారు, ఇప్పుడే ఫలితాన్ని పొందుతారు, ఆ ఖాతా సమాప్తమైపోతుంది. భక్తి ఖాతా అల్పకాలికమైనది ఎందుకంటే ఇప్పుడే సంపాదించుకుంటారు, ఇప్పుడే తినేస్తారు. జమ చేసుకునే అవినాశి ఖాతా అనగా జన్మ-జన్మలు కొనసాగే ఖాతాను జమ చేసుకునే సమయం ఇదే. అందుకే ఈ శ్రేష్ఠమైన సమయాన్ని పురుషోత్తమ యుగమని, ధర్మావూ యుగమని అంటారు. పరమాత్మ అవతరణ యుగమని అంటారు. డైరెక్ట్ తండ్రి ద్వారా శక్తులను ప్రాప్తి చేసుకునే యుగమని దీని మహిమయే చేయబడింది. ఈ యుగంలోనే తండ్రి విధాత మరియు వరదాతల పాత్రను అభినయిస్తారు, అందుకే ఈ యుగాన్ని వరదాని యుగమని కూడా అంటారు. ఈ యుగంలో స్నేహం కారణంగా తండ్రి భోళా భండారిగా అవుతారు ఎందుకంటే ఒకటికి పదమాల రెట్లు ఫలితమునిస్తారు. ఒకటికి పదమాల రెట్లు జమ చేసుకునే విశేషమైన భాగ్యము ఇప్పుడే ప్రాప్తిస్తుంది. వేరే యుగాలలో ఎంత చేస్తే అంత మాత్రమే లభించే లెక్క ఉంది. వ్యత్యాసముంది కదా, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టు తండ్రి వారసత్వము మరియు వరదానం రెండు రూపాలలో ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. భక్తిలో భావనకు ఫలముంటుంది. ఇప్పుడు వారసత్వము మరియు వరదానాల ఫలముంది. అందుకే ఈ సమయానికి గల మహత్వమును తెలుసుకొని, ప్రాప్తులను తెలుసుకొని, జమ అయ్యే లెక్కను తెలుసుకొని, త్రికాలదర్శులుగా అయి ప్రతి అడుగు వేస్తున్నారా? ఈ సమయంలోని ఒక సెకండు సాధారణ సమయంలోని సెకండు కంటే ఎంత పెద్దదో తెలుసా? ఒక సెకండులో ఎంత జమ చేసుకుంటున్నారు మరియు ఒక సెకండులో ఎంత పోగొట్టుకుంటున్నారు? ఈ లెక్క బాగా తెలుసా? లేక సాధారణ పద్ధతిలో కొంత సంపాదించుకొని కొంత పోగొట్టుకుంటున్నారా? ఇటువంటి అమూల్యమైన సమయాన్ని సమాప్తం చేసుకోవడం లేదు కదా? బ్రహ్మాకుమారులు బ్రహ్మాకుమారీలుగా అయితే అయ్యారు కానీ అవినాశి వారసత్వము మరియు విశేష వరదానాలకు అధికారులుగా అయ్యారా? ఎందుకంటే ఈ సమయంలో అధికారులుగా అయినవారు జన్మ జన్మలకు అధికారులుగా అవుతారు. ఈ సమయంలో ఏదో ఒక స్వభావము లేక సంస్కారము లేక ఏదైనా సంబంధానికి అధీనులుగా ఉండే ఆత్మలు, జన్మ-జన్మలు అధికారులుగా అయ్యేందుకు బదులు ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. రాజ్యాధికారులుగా అవ్వలేరు. ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. ఇక్కడకు రాజయోగులుగా అయ్యేందుకు, రాజ్యాధికారులుగా అయ్యేందుకు వచ్చారు కానీ అధీనమయ్యే సంస్కారము వలన విధాత పిల్లలుగా ఉన్నప్పటికీ రాజ్య అధికారులుగా అవ్వలేకపోతున్నారు అందుకే సదా స్వ అధికారులుగా ఎంతవరకు అయ్యారో చెక్ చేసుకోండి. ఎవరైతే స్వయంపై అధికారం పొందలేరో వారు విశ్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? విశ్వ రాజ్యాధికారులుగా అయ్యేవారి చైతన్యమైన మోడల్ ను, ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయినందుకు తయారుచేస్తారు. ఏదైనా వస్తువు తయారుచేయాలంటే ముందు దాని మోడల్ ను(నమూనాను) తయారుచేస్తారు కదా. కనుక మొదట ఈ మోడల్ ను చూడండి.

స్వ అధికారి అనగా సర్వ కర్మేంద్రియాల రూపి ప్రజలకు రాజులుగా అవ్వడం. ప్రజా రాజ్యమా లేక రాజు యొక్క రాజ్యమా? ఇది తెలుసుకోగలరు కదా? ప్రజా రాజ్యమైతే రాజు అని అనరు. ప్రజా రాజ్యంలో రాజ వంశము సమాప్తమైపోతుంది. ఏదైనా ఒక్క కర్మేంద్రియము మోసము చేసినా కానీ వారిని స్వరాజ్య అధికారులని అనరు. ఒకటో రెండో బలహీనతలు ఉండనే ఉంటాయని, సంపూర్ణంగా అయ్యేది చివర్లో అని అనుకోకండి. కానీ బహుకాలపు బలహీనత ఒక్కటి ఉన్నా అది సమయానికి మోసం చేస్తుంది. బహుకాలం అధీనులుగా అయ్యే సంస్కారము అధికారులుగా కానివ్వదు, అందుకే అధికారులు అనగా స్వ అధికారులు. చివర్లో సంపూర్ణంగా అవుతాములే అని మోసపోకండి. బహుకాలపు స్వ అధికారుల సంస్కారముంటే బహుకాలపు విశ్వ అధికారులుగా అవుతారు. కొంత సమయపు స్వరాజ్య అధికారాలు కొంత సమయం మాత్రమే విశ్వ అధికారులుగా అవుతారు. ఎవరైతే ఇప్పుడు తండ్రి సమానంగా అవ్వాలనే ఆజ్ఞానుసారముగా తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవుతారో వారే రాజ్య సింహాసనానికి అధికారులుగా అవుతారు. తండ్రి సమానంగా అవ్వడం అనగా తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవ్వడం. ఎలాగైతే బ్రహ్మాబాబా సంపన్నంగా, సమానంగా అయ్యారో అలా సంపూర్ణంగా, సమానంగా అవ్వండి. రాజ్య సింహాసనానికి అధికారులుగా అవ్వండి. ఎలాంటి నిర్లక్ష్యము కారణంగా మీ రాజ్య వారసత్వాన్ని మరియు వరదానాన్ని తక్కువగా ప్రాప్తి చేసుకోకండి. కనుక జమ ఖాతాను చెక్ చేసుకోండి. కొత్త సంవత్సరం ప్రారంభమయింది కదా. పాత ఖాతాను చెక్ చేసుకోండి. కొత్త ఖాతాను, సమయము మరియు తండ్రి వరదానములతో బాగా ఎక్కువగా జమ చేసుకోండి. కేవలం సంపాదించుకోవడం, తినడం - ఇటువంటి ఖాతాను తయారుచేసుకోవద్దు! అమృతవేళలో యోగం చేసి జమ చేసుకున్నారు. క్లాసులో చదువుకుని జమ చేసుకున్నారు, మిగిలిన రోజంతా పరిస్థితులకు వశమై లేక మాయ దాడికి వశమై లేక మీ సంస్కారాలకు వశమై జమ చేసుకున్న దానిని యుద్ధము చేసి విజయులుగా అవ్వడంలో ఖర్చు చేశారు. మరి ఫలితం ఏమయింది? సంపాదించుకున్నారు, తిన్నారు. ఏం జమ చేసుకున్నారు? కనుక జమ ఖాతాను సదా చెక్ చేసుకోండి మరియు వృద్ధి చేసుకుంటూ ఉండండి. అలాగే చార్టు వ్రాసేటప్పుడు ఊరికే అలా టిక్ వేయకండి. క్లాసుకు వెళ్లారా? అవును. యోగం చేశారా? కానీ ఎటువంటి శక్తిశాలి యోగము సమయానుసారముగా జరగాలో అలా ఉoదా? సమయం బాగా గడిచింది, చాలా ఆనందము కలిగింది, వర్తమానమైతే తయారయింది. కానీ వర్తమానముతో పాటు జమ కూడా చేసుకున్నారా? అంత శక్తిశాలిగా అనుభవం చేశారా? నడుస్తున్నాము - కేవలం ఇది మాత్రమే చెక్ చేసుకోకండి. ఎవరినైనా ఎలా నడుస్తున్నారు అని అడగండి. అందుకు వారు చాలా బాగా నడుస్తున్నామని చెప్తారు. కానీ ఎంత వేగంతో నడుస్తున్నారో చెక్ చేసుకోండి. చీమ వలె నడుస్తున్నారా లేక రాకెట్ వేగంతో నడుస్తున్నారా? ఈ సంవత్సరం అన్ని విషయాలలో శక్తిశాలిగా అయ్యే వేగాన్ని, శాతాన్ని చెక్ చేసుకోండి. ఎంత శాతంలో జమ చేసుకుంటున్నారు? 5 రూపాయలైనా జమ అయిందనే అంటారు, 500 రూపాయలైనా జమ అయిందనే అంటారు. జమ అయితే చేసుకున్నారు కానీ ఎంత జమ చేసుకున్నారు? ఏం చేయాలో అర్థమయిందా?

గోల్డెన్ జూబ్లీ వైపు వెళ్తున్నారు - ఈ సంవత్సరమంతా గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కదా. కనుక ప్రతి విషయంలో గోల్డెన్ యుగ స్టేజ్ అనగా సతోప్రధానమైన స్టేజ్ ఉందా లేక సతో స్థితి అనగా సిల్వర్ యుగం స్టేజ్ ఉందా అని చెక్ చేసుకోండి. పురుషార్థం కూడా సతోప్రధానం అనగా గోల్డెన్ యుగానిదిగా ఉండాలి. సేవ కూడా గోల్డెన్ యుగానిదిగా ఉండాలి. కొంచెం కూడా పాత సంస్కారాల మలినం ఉండకూడదు. ఈ రోజుల్లో వెండిపై కూడా బంగారు పూత వేస్తున్నారు, బయటికేమో బంగారం అనిపిస్తుంది. కానీ లోపల ఏముంటుంది? మిక్స్ (పూత) అని అంటారు కదా. కనుక సేవలో కూడా అభిమానము మరియు అవమానాల అలాయ్ (మిశ్రమము) ఉండకూడదు. దీనినే గోల్డెన్ యుగ సేవ అని అంటారు. స్వభావంలో కూడా ఈర్ష్య, ఋజువు చేసి చూపిస్తాను అనుకోవడం, మొండిగా ఉండే భావాలు ఉండకూడదు. వీటిని అలాయ్ అని అంటారు. ఈ మలినాన్ని సమాప్తం చేసి బంగారుయుగ స్వభావము కలవారిగా అవ్వండి. సంస్కారంలో సదా హాజీ. ఎటువంటి సమయమో అటువంటి సేవ చేయాలి, ఆ విధంగా స్వయాన్ని మౌల్డ్ చేసుకోవాలి (మలచుకోవాలి) అనగా రియల్ గోల్డ్ గా అవ్వాలి. నేను మౌల్డ్ అవ్వాలి. ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటే దీనిని మొండితనము అంటారు. ఇది రియల్ గోల్డ్ కాదు. ఈ మలినాలను సమాప్తం చేసి, గోల్డెన్ యుగం వారిగా అవ్వండి. సంబంధాలలో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, కళ్యాణ భావన ఉండాలి, స్నేహ భావన ఉండాలి, సహయోగ భావన ఉండాలి. ఎటువంటి భావ స్వభావాల వారైనా కానీ వారి పట్ల మీకు సదా శ్రేష్ఠమైన భావముండాలి. ఈ విషయాలన్నిటిలో స్వపరివర్తన చేసుకోవడమే గోల్డెన్ జూబ్లీ జరపుకోవడము. మలినాలను కాల్చివేయడం అనగా గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం. అర్థమయిందా - ఈ సంవత్సరాన్ని గోల్డెన్యుగ స్థితితో ప్రారంభించండి. సులభమే కదా. వినేటప్పుడు అందరూ చేయాల్సిందే అని భావిస్తారు కానీ సమస్య వచ్చినప్పుడు ఇది చాలా కష్టమని అనుకుంటారు. సమస్యల సమయములో స్వరాజ్య అధికారితనపు అధికారమును చూపించే సమయం ఉంటుంది. యుద్ధ సమయంలోనే విజయులుగా అవ్వాల్సి ఉంటుంది. పరీక్షా సమయమే నంబరువన్ తీసుకునే సమయము. సమస్యా స్వరూపంగా అవ్వకండి కానీ సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఈ సంవత్సరం ఏం చెయ్యాలో అర్థమయిందా. అప్పుడు గోల్డెన్ జూబ్లీ సమాప్తిని, సంపన్నముగా అయ్యే గోల్డెన్ జూబ్లీ అని అంటారు. ఇంకా ఏ నవీనత చేస్తారు? బాప్ దాదా వద్దకు పిల్లలందరి సంకల్పాలు చేరుతూనే ఉంటాయి. ప్రోగ్రాంలో కూడా నవీనత ఏం చేస్తారు? గోల్డెన్ సంకల్పాలను వినిపించే టాపిక్ పెట్టారు కదా. బంగారముగా తయారుచేసి, బంగారు యుగాన్ని తీసుకువచ్చే బంగారు సంకల్పాలు, బంగారు ఆలోచనలు - ఈ టాపిక్ పెట్టారు కదా. అచ్ఛా. ఈ రోజు వతనంలో ఈ విషయంపై ఆత్మిక సంభాషణ జరిగింది, దీని గురించి తర్వాత వినిపిస్తాము. అచ్ఛా.

సర్వ వారసత్వము మరియు వరదానాలకు డబల్ అధికారి భాగ్యశాలి ఆత్మలకు, సదా స్వరాజ్య అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయాన్ని గోల్డెన్ యుగ స్థితిలో స్థితి చేసుకునే రియల్ గోల్డ్ పిల్లలకు, సదా స్వపరివర్తన చేసుకోవాలనే లగనముతో విశ్వ పరివర్తనలో ముందుకు వెళ్ళే విశేషమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మీటింగ్ లో వచ్చిన డాక్టర్లతో అవ్యక్త బాప్ దాదా కలయిక -

మీ శ్రేష్ఠమైన ఉల్లాస ఉత్సాహాల ద్వారా అనేక ఆత్మలను సదా సంతోషంగా చేసే సేవలో లగ్నమై ఉన్నారు కదా. డాక్టర్ల విశేష కార్యము ప్రతి ఆత్మకు సంతోషమునివ్వడం. మొదటి ఔషధము - సంతోషము. సంతోషము సగం జబ్బును సమాప్తం చేసేస్తుంది. కనుక ఆత్మిక డాక్టర్లు అనగా సంతోషమనే ఔషధం ఇచ్చేవారు. మీరు అటువంటి డాక్టర్లు కదా. ఒక్క సారి అయినా సంతోషపు మెరుపు ఆత్మలకు అనుభవమయిందంటే వారు సదా సంతోషపు మెరుపుతో ముందుకు ఎగురుతూ ఉంటారు. మరి అందరినీ డబల్ లైట్ గా చేసి ఎగిరించే డాక్టర్లు కదా. ఆ డాక్టర్లు బెడ్ నుండి లేపుతారు, బెడ్ పై పడుకున్న రోగిని లేపుతారు. మీరు పాత ప్రపంచము నుండి లేపి కొత్త ప్రపంచంలో కూర్చోబెట్టండి. ఇటువంటి ప్లాను తయారుచేశారు కదా. ఆత్మిక పరికరాలను ఉపయోగించే ప్లాను తయారుచేశారా? ఇంజెక్షన్ ఏమిటి, మాత్రలు ఏమిటి, రక్తము ఇవ్వడము అంటే ఏమిటి – వీటన్నిటినీ ఆత్మిక సాధనాలుగా చేసుకున్నారు కదా! ఎవరికైనా రక్తమునిచ్చే అవసరమొస్తే ఏ ఆత్మిక రక్తమునివ్వాలి? గుండె జబ్బు కలవారికి ఏ మందునివ్వాలి? గుండె జబ్బు రోగి అంటే వ్యాకులపడే రోగి. కనుక ఆత్మిక సామగ్రి కావాలి. వారు కొత్త కొత్త ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు. వారు సైన్సు సాధనాలతో ఇన్వెన్షన్లు చేస్తారు. మీరు సైలెన్స్ సాధనాలతో సదాకాలము కొరకు నిరోగులుగా చేయండి. వారి వద్ద ఎలాగైతే మొత్తం లిస్టు అంతా ఉంటుందో, ఈ పరికము ఉంది, ఈ పరికరము ఉంది అని, అలా మీ వద్ద కూడా పెద్ద లిస్టు ఉండాలి. అటువంటి డాక్టర్లుగా ఉన్నారా? సదా ఆరోగ్యవంతంగా చేసేందుకు ఇంత ఫస్ట్ క్లాసు సాధనాలుండాలి. మీ వృత్తిని అలా చేసుకున్నారా? డాక్టర్లందరూ మీ మీ స్థానాలలో ఇటువంటి బోర్డు తగిలించారా? సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా చేస్తామనే బోర్డు పెట్టుకున్నారా? ఎలాగైతే వారు తమ వృత్తిని వ్రాసుకుంటారో అలాగే ఈ లిఖితం ఎలా ఉండాలంటే దానిని చూసి ఇదేమిటి, లోపలికి వెళ్ళి చూద్దాము అని అనిపించాలి. బోర్డు బాగా ఆకర్షించేదిగా ఉండాలి. బోర్డుపై ఎలాంటి లిఖితముండాలంటే పరిచయం తీసుకోకుండా ఎవ్వరూ ఉండకూడదు. పిలవాల్సిన అవసరమే ఉండకూడదు, వారంతట వారే మీ ముందుకు వచ్చేయాలి, అటువంటి బోర్డును పెట్టుకోండి. వారు ఎమ్.బి.బి.ఎస్, ఫలానా-ఫలానా అని వ్రాసుకుంటారు. మీరు ఆత్మిక ఆక్యుపేషన్ (వృత్తి) వ్రాయండి. అది చదివి వారు ఈ స్థానము మాకు అవసరమని అనుకోవాలి. అలా మీ ఆత్మిక డిగ్రీని తయారుచేసుకున్నారా లేక మీ పాత డిగ్రీలే వ్రాసుకుంటారా?

(సేవకు శ్రేష్ఠమైన సాధనము ఏది ఉండాలి) సేవ జరిగేందుకు అన్నిటికంటే వేగవంతమైన సాధనము - సమర్థ సంకల్పాలతో సేవ. సమర్థ సంకల్పాలతో పాటు మాటలు, కర్మలు కూడా సమర్థంగా ఉండాలి. మూడూ ఒకేసారి పని చేయాలి. ఇదే శక్తిశాలి సాధనము. వాచాలోకి వస్తే శక్తిశాలి సంకల్పాల శాతము తగ్గిపోతుంది లేక ఆ శాతముంటే వాచా శక్తిలో తేడా వచ్చేస్తుంది. అలా కాదు. మూడూ కలిసి ఉండాలి. ఎలాగైతే ఎవరైనా రోగికి ఒకేసారి ఒకరు నాడి చూస్తారు, ఒకరు ఆపరేషన్ చేస్తారు... అందరూ కలిసి చేస్తారు. నాడి చూడాల్సిన వ్యక్తి తర్వాత చూసినా, ఆపరేషన్ ను ముందే చేసేసినా ఏమవుతుంది? ఒకేసారి ఎంత పని జరుగుతుంది. అలాగే ఆత్మిక సేవా సాధనాలు కూడా కలిసి పని చేయాలి. ఇకపోతే సేవకు ప్లాను తయారుచేశారు, చాలా బాగుంది. కాని ఈ ఆత్మిక డాక్టరు సదా కొరకు ఆరోగ్యంగా చేసేవారు అని అందరూ భావించే ఏదైనా సాధనాన్ని తయారుచేయండి. అచ్ఛా.

పార్టీలతో - 1. ఎవరైతే అనేకసార్లు విజయీ ఆత్మలుగా ఉన్నారో వారి గుర్తు ఏది? వారికి ప్రతి విషయము చాలా సహజంగా, తేలికగా అనుభవమవుతుంది. ఎవరైతే కల్ప-కల్పము విజయీ ఆత్మలుగా ఉండరో వారికి చిన్న కార్యము కూడా కష్టంగా అనుభవమవుతుంది. సహజమనిపించదు. ప్రతి కార్యము ప్రారంభించే ముందు ఈ కార్యము జరిగే ఉంది అన్నట్లు స్వయానికి అనుభవమవుతుంది. అవుతుందా లేక అవ్వదా అనే ప్రశ్న రానే రాదు. జరిగే ఉంది అనే అనుభూతి సదా ఉంటుంది. సదా సఫలత ఉండనే ఉంది, విజయము ఉండనే ఉంది అని వారికి తెలుసు - ఇలాంటి నిశ్చయబుద్ధితో ఉంటారు. ఏ విషయమూ కొత్తగా అనిపించదు, చాలా పాత విషయము. ఈ స్మృతితో స్వయాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు.

2. డబల్ లైట్ గా అయ్యేవారి గుర్తులెలా ఉంటాయి? డబల్ లైట్ ఆత్మలు సదా సహజంగా ఎగిరేకళను అనుభవం చేస్తారు. ఒకసారి ఆగుతూ, ఒకసారి ఎగురుతూ ఉండటం కాదు. సదా ఎగిరేకళను అనుభవం చేసేవారిగా ఉంటారు. ఇటువంటి డబల్ లైట్ ఆత్మలే డబల్ కిరీటానికి అధికారులుగా అవుతారు. డబల్ లైట్ గా ఉండేవారు స్వతహాగా ఉన్నతమైన స్థితిని అనుభవం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మేము డబల్ గా ఉన్నామని గుర్తుంచుకోండి. పిల్లలుగా అయ్యారు అనగా తేలికగా అయిపోయారు. ఎలాంటి బరువును తీసుకోనవసరం లేదు. అచ్ఛా. ఓంశాంతి.

వరదానము:-

శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మాబాబా సమానంగా మాస్టర్ దాత భవ

బ్రహ్మాబాబా సమానంగా మాస్టర్ దాతలుగా అయ్యేందుకు ఈర్ష్య, ద్వేషము, విమర్శ - ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉంటూ అందరి పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన స్థితిని అనుభవం చేయండి ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలిపోతారు, ఇతరులకూ దుఃఖమునిస్తారు. ద్వేషం ఉన్నవారు స్వయం కూడా క్రింద పడ్తారు, ఇతరులను కూడా క్రింద పడేస్తారు. తమాషాకు కూడా ఇతరులను విమర్శించేవారు ఆ ఆత్మను ధైర్య విహీనంగా చేసి దుఃఖితులుగా చేస్తారు. అందువలన ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలుగా అవ్వండి.

స్లోగన్:-

మనసు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యము చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి.