03-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఆత్మ రూపీ బ్యాటరి 84 మోటార్లలో (కార్లలో) తిరిగిన కారణంగా డల్ అయిపోయింది, ఇప్పుడు దానిని స్మృతియాత్ర ద్వారా నిండుగా చేయండి”

ప్రశ్న:-

బాబా ఏ పిల్లలను చాలా-చాలా భాగ్యశాలురుగా భావిస్తారు?

జవాబు:-

ఎవరికైతే ఏ జంజాటాలు ఉండవో, ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో, అటువంటి పిల్లలకు, మీరు చాలా-చాలా భాగ్యశాలురు అని బాబా అంటారు, మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ యోగము లేకుండా కేవలం జ్ఞానము వినిపిస్తూ ఉన్నట్లయితే బాణము తగలదు. ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవము వినిపించినా కానీ స్వయంలో ధారణ లేకపోతే మనస్సు తింటూ ఉంటుంది.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరు ఏమిటి? శివబాబా. వారు భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుష్యులను ఎప్పుడూ అనంతమైన తండ్రి లేక ఈశ్వరుడు లేక భగవంతుడని అనలేరు. శివ అనే పేరు చాలామందికి ఉండవచ్చు కానీ వారంతా దేహధారులు కనుక వారిని భగవంతుడని అనలేరు. తండ్రి కూర్చొని పిల్లలకు ఈ విషయాలు అర్థము చేయిస్తున్నారు. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, ఇది వారి అనేక జన్మల అంతిమ జన్మ. మీరు వీరిని భగవంతుడని ఎందుకు అంటారు అని చాలామంది పిల్లలైన మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏ స్థూల లేక సూక్ష్మ దేహధారులను భగవంతుడని అనలేము అని తండ్రి ముందే తెలియజేశారు. సూక్ష్మ దేహధారులు సూక్ష్మవతనవాసులు. వారిని దేవతలని అంటారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, పరమపిత. వారి పేరు ఉన్నతాతి ఉన్నతమైనది, వారి స్థానము ఉన్నతమైనది. తండ్రి ఆత్మలందరితో పాటు అక్కడ నివసిస్తారు. వారి ఆసనము కూడా ఉన్నతమైనది. వాస్తవానికి అది కూర్చునే స్థానమేమీ కాదు. నక్షత్రాలు ఎక్కడైనా కూర్చున్నాయా? నిలబడి ఉన్నాయి కదా. ఆత్మలైన మీరు కూడా మీ శక్తి ద్వారా అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడకు వెళ్ళి నిలబడే విధంగా శక్తి లభిస్తుంది. తండ్రి పేరే సర్వశక్తివంతుడు, వారి ద్వారా శక్తి లభిస్తుంది. ఆత్మ వారిని స్మృతి చేస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కారులో బ్యాటరీ ఉంటుంది, దాని శక్తి వల్లనే కారు నడుస్తుంది. బ్యాటరీలో కరెంటు నింపబడి ఉంటుంది, తర్వాత నడుస్తూ-నడుస్తూ అది ఖాళీ అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీని మెయిన్ పవర్ తో ఛార్జి చేసి కారులో పెడతారు. అవి హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. మీ బ్యాటరీ అయితే 5 వేల సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తూ-నడుస్తూ తర్వాత ఢీలా అయిపోతుంది. శక్తి పూర్తిగా సమాప్తమవ్వదు, ఎంతోకొంత మిగిలి ఉంటుందని తెలుస్తుంది. ఎలాగైతే టార్చి లైట్ డిమ్ అవుతుంది కదా. ఆత్మ ఈ శరీరంలో బ్యాటరీ వంటిది. ఇది కూడా డల్ అయిపోతుంది. ఈ శరీరము నుండి బ్యాటరీ బయటకు వస్తుంది కూడా, తర్వాత రెండవ, మూడవ మోటరులోకి వెళ్తుంది. దానిని 84 మోటర్లలో పెట్టడం జరుగుతుంది. మీరు ఎంత మందబుద్ధి, రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి. తండ్రి స్మృతి ద్వారా తప్ప ఆత్మ ఎప్పుడూ పవిత్రంగా అవ్వలేదు. సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే, వారితో యోగము జోడించాలి. నేను ఎవరు, ఎలా ఉంటాను అని తండ్రే స్వయంగా తమ పరిచయమునిస్తారు. మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఎలా డల్ అయిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే బ్యాటరీ సతోప్రధానంగా, ఫస్ట్ క్లాస్ గా అవుతుందని ఇప్పుడు మీకు సలహా ఇస్తున్నాను. పవిత్రంగా అయినట్లయితే ఆత్మ 24 క్యారెట్లదిగా తయారవుతుంది. ఇప్పుడు మీరు అపవిత్రంగా (నకిలీ బంగారంగా) అయిపోయారు. శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. ఆ శోభయే లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ముఖ్యమైన విషయము, యోగములో ఉండడం, పవిత్రంగా అవ్వడం. లేకపోతే బ్యాటరీ నిండదు. యోగము కుదరదు. ఇతరులకు జ్ఞానము చెప్పి తాను మాత్రము నిదురించే జ్ఞానీలు అయితే చాలామంది ఉన్నారు. జ్ఞానాన్నిస్తారు కానీ ఆ స్థితి ఉండదు. ఇక్కడ చాలా గొప్పగా అనుభవాన్ని వినిపిస్తారు. నేను వర్ణన చేస్తున్న స్థితి నాకు లేదని లోపల తింటూ ఉంటుంది. యోగీ ఆత్మలైన పిల్లలు కూడా కొందరు ఉన్నారు. తండ్రి అయితే పిల్లలను చాలా మహిమ చేస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు చాలా-చాలా భాగ్యశాలురు. మీకు ఇన్ని జంఝాటాలు లేవు. ఎవరికైతే ఎక్కువమంది పిల్లలుంటారో, వారికి బంధనము కూడా ఉంటుంది. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు. అందరీని సంభాళిస్తూ పాలన చేయవలసి ఉంటుంది. బాబాను కూడా స్మృతి చేయాలి. ప్రియుని స్మృతి అయితే చాలా పక్కాగా ఉండాలి. భక్తిమార్గములో, ఓ భగవంతుడా అని అంటూ మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు, మొట్టమొదటి పూజ కూడా వారికే చేస్తారు. మొదట నిరాకార భగవంతుడినే పూజిస్తారు. ఆ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు. ఆత్మాభిమానులు ఇక పూజ చేయరు.

మొట్టమొదట భక్తి ఆరంభమైనప్పుడు, మొదట ఒక్క తండ్రిని మాత్రమే పూజిస్తారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క శివుడిని మాత్రమే పూజిస్తారు. యథా రాజా-రాణి తథా ప్రజా. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడే, వారినే స్మృతి చేయాలి. క్రింద ఉన్నవారెవరినీ - బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా స్మృతి చేయాల్సిన అవసరము లేదు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినే స్మృతి చేయాలి. కానీ డ్రామాలో పాత్ర ఎలా ఉందంటే, మీరు క్రిందకు దిగేందుకు బంధించబడి ఉన్నారు. మీరు ఎలా క్రిందకు దిగుతారో తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి విషయము ఆది నుండి అంత్యము వరకు, పై నుండి క్రింది వరకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి కూడా మొదట సతోప్రధానముగా ఉంటుంది, తర్వాత సతో-రజో-తమోగా అవుతుంది. మీరిప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవుతున్నారు, ఇందులోనే శ్రమ ఉంది. పవిత్రంగా అవ్వాలి. మాయ ఎక్కడా మోసము చెయ్యడం లేదు కదా? నాకు వికారీ దృష్టి ఉండడం లేదు కదా? పాపపు ఆలోచనలేవీ రావటం లేదు కదా? అని స్వయాన్ని చూసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మా అని గాయనముంది, మరి వారి సంతానమైన బ్రాహ్మణ-బ్రాహ్మణీలు సోదరీ-సోదరులవుతారు కదా. ఇక్కడి బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మా సంతానమని చెప్పుకుంటారు. మీరు కూడా బ్రాహ్మణులు సోదరీ-సోదరులవుతారు కదా. మరి వికారీ దృష్టి ఎందుకు ఉంచుకుంటున్నారు. మీరు బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టినివ్వవచ్చు. బ్రహ్మా సంతానము, బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా అయిన తర్వాత దేవతలుగా అవుతారని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి వచ్చి బ్రాహ్మణ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని కూడా చెప్తారు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. మనము బ్రహ్మా సంతానము సోదర-సోదరీలయ్యాము కనుక చెడు దృష్టి ఎప్పుడూ ఉండకూడదు. దానిని ఆపాలి. ఈమె కూడా మా మధురమైన సోదరి అని ఆ ప్రేమ ఉండాలి. రక్త సంబంధంలో ఎలాగైతే ప్రేమ ఉంటుందో, అది మారి ఆత్మికంగా అవ్వాలి. సహజ స్మృతి అయినా ఇందులో చాలా-చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వికరీ దృష్టి ఉండకూడదు. ఈ కళ్ళు చాలా మోసము చేస్తాయి, వాటిని పరివర్తన చేసుకోవాలి అని బాబా అర్థం చేయించారు. మనము ఆత్మలము. ఇప్పుడు మనము శివబాబా పిల్లలము. దత్తత తీసుకోబడిన సోదరీ-సోదరులము. మనం స్వయాన్ని బి.కె.లుగా చెప్పుకుంటాము. నడవడికలో తేడా ఉంటుంది కదా. నాకు సోదర-సోదరీ దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా లేక ఏదైనా చంచలత ఉందా అని క్లాసులో అందరినీ ప్రశ్నించడం టీచరు పని. సత్యమైన తండ్రి ముందు సత్యము చెప్పకుండా అసత్యము చెప్తే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. సత్యమైన తండ్రి ఎదురుగా సత్యము చెప్పకుండా, అసత్యం చెప్తే చాలా శిక్ష పడుతుంది. సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుని ఎదురుగా సత్యం చెప్తాము అని కోర్టులో ప్రమాణము చేస్తారు కదా. సత్యమైన తండ్రి పిల్లలు కూడా సత్యంగానే ఉంటారు. బాబా సత్యము కదా. వారు సత్యమే చెప్తారు. మిగిలినన్నీ వ్యర్థ ప్రలాపాలు. శ్రీ శ్రీ 108 అని స్వయాన్ని పిలిపించుకుంటారు, వాస్తవానికి ఇది స్మరించే మాల కదా. మనం ఎందుకు స్మరణ చేస్తున్నామో కూడా తెలియదు. బౌద్ధుల మాల, క్రిస్టియన్ల మాల కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతులలో మాలను తిప్పుతారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది. 108 మాలలో పైన ఉన్న పుష్పము నిరాకారుడు, వారినే అందరూ స్మృతి చేస్తారని చెప్పండి. వారి స్మృతి ద్వారానే మనము స్వర్గము యొక్క పట్టపు రాణులుగా అనగా మహారాణులుగా అవుతాము. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడం - ఇది సూర్య వంశీ మఖ్మల్ పట్టపు రాణులుగా అయ్యి తర్వాత ఖాదీ వారిగా అయిపోతారు. ఇటువంటి పాయింట్లు బుద్ధిలో ఉంచుకొని తర్వాత అర్థం చేయించాలి. అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. మాట్లాడడంలో సింహం వలె అవ్వండి. మీరు శివశక్తి సైన్యం కదా. అనేక రకాల సైన్యాలున్నాయి కదా. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఏం నేర్పిస్తున్నారో చూడండి. లక్షల మంది మనుష్యులు వెళ్తారు. వికారీ దృష్టి చాలా మోసము చేస్తుందని బాబా అర్థం చేయించారు. మీ స్థితిని వర్ణన చేయాలి. మేము ఇంటిలో ఎలా ఉంటున్నాము, స్థితిపై ఏం ప్రభావము పడుతుంది అని అనుభవము వినిపించాలి. ఎంత సమయం ఈ స్థితిలో ఉంటున్నాను అని డైరీ పెట్టండి. రుస్తుమ్ తో మాయ కూడా రుస్తుమ్ అయ్యి యుద్ధము చేస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధ మైదానము కదా. మాయ చాలా శక్తిశాలి అయినది. మాయ అనగా 5 వికారాలు. ధనాన్ని సంపద అని అంటారు, ఎవరి వద్దనైతే ఎక్కువ సంపద ఉంటుందో, వారే ఎక్కువ అజామిళులుగా అవుతారు.

మొట్టమొదట మీరు వేశ్యలను రక్షించండి అని తండ్రి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంస్థను తయారుచేస్తారు. మేమైతే తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. నేను మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. ఇది అంతిమ జన్మ. వేశ్యలకు అర్థము చేయించాలి - మీ పేరు కారణంగా భారతదేశము పరువు ఇంతగా పోయింది. ఇప్పుడు శివాలయంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. మేము శ్రీమతం ఆధారంగా మీ వద్దకు వచ్చాము. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవ్వండి. మా వలె భారతదేశము పేరును ప్రసిద్ధము చేయండి. మేము కూడా తండ్రిని స్మృతి చేయడం వలన పవిత్రంగా అవుతున్నాము. మీరు కూడా ఈ ఒక్క జన్మ ఛీ-ఛీ పనులు వదిలేయండి. వారిపై దయ చూపించాలి కదా. తర్వాత మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వీళ్ళని ఇటువంటి అశుద్ధమైన వ్యాపారం నుండి విడిపించే శక్తి వీరిలో ఉంది అని అంటారు. అందరికీ అసోసియేషన్ లు ఉన్నాయి. మీరు మీ అసోసియేషన్ తయారుచేసుకుని గవర్నమెంట్ నుండి ఏం సహాయం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కనుక ఇప్పుడు భారతదేశ పేరును అప్రతిష్టపాలు చేసిన అటువంటి ఛీ-ఛీగా ఉన్నవారి సేవ చేయండి. 10-12 మంది పరస్పరం కలిసి వెళ్ళి అర్థము చేయించే విధంగా మీ యూనియన్ కూడా చాలా పక్కాగా ఉండాలి. మాతలు కూడా బాగుండాలి. ఎవరైనా కొత్త యుగళ్ళు అయితే, మేము పవిత్రంగా ఉంటున్నామని చెప్పాలి. పవిత్రంగా ఉండటం వల్లనే విశ్వానికి యజమానులుగా అవుతారు. మరి ఎందుకు పవిత్రంగా అవ్వకూడదు. మొత్తం గుంపు అంతా వెళ్ళాలి. మేము మీకు పరమపిత పరమాత్ముని సందేశాన్నిచ్చేందుకు వచ్చాము అని చాలా నమ్రతగా వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. నేను అందరినీ ఉద్ధరించడానికి వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలలోకి వెళ్ళకండి. బ్రహ్మాకుమారీ-కుమారులైన మేము మా తనువు-మనసు-ధనముతోనే సేవ చేస్తున్నాము, మేము భిక్ష అడగము, మేము ఈశ్వరుని సంతానము అని వారికి అర్థం చేయించవచ్చు. ఇటువంటి ప్లాన్లు తయారుచేయండి. మీరు సహాయము చెయ్యలేరని కాదు. వాహ్-వాహ్ అనేటటువంటి పనులు చేయండి. మీకు సహాయము చేయడానికి వేల మంది వస్తారు. మీ సంగఠన తయారుచేసుకోండి. ముఖ్యాతి-ముఖ్యమైనవారిని ఎన్నుకొని సెమినార్ చేయండి. పిల్లలను సంభాళించేవారు చాలామంది వస్తారు. మీరు ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వండి. సేవ కోసం వెంటనే బయలుదేరే విశాల హృదయం కలవారిగా అవ్వాలి. ఒకవైపు ఈ సేవ మరియు రెండవ విషయము గీతకు సంబంధించినది, ఈ విషయాలను కలిపి చెప్పండి. ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరు చదువుతున్నారు కావున ఇక్కడ పిల్లలైన మీకు పరస్పరము అభిప్రాయ బేధాలుండకూడదు. ఒకవేళ తండ్రి నుండి ఏదైనా విషయము దాచిపెడితే, సత్యము చెప్పకపోతే, అప్పుడు కూడా స్వయాన్నే నష్టపరచుకుంటారు మరియు ఇంకా వంద రెట్ల పాపము పెరుగుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనము మధురమైన తండ్రి పిల్లలము, పరస్పరము మధురమైన సోదరీ-సోదురులుగా ఉండాలి. ఎప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు. దృష్టిలో ఎలాంటి చంచలత ఉన్నా ఆత్మిక సర్జన్ కు సత్యము చెప్పాలి.

2. ఎప్పుడూ పరస్పరం అభిప్రాయ బేధాలలోకి రాకూడదు. విశాలహృదయం కలవారిగా అయి సేవ చేయాలి. తమ తనువు-మనస్సు ధనముతో, చాలా-చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని ( సందేశాన్ని) ఇవ్వాలి.

వరదానము:-

మీ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ఋజువునిచ్చే మాయాప్రూఫ్ భవ

స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ఉదాహరణ లేక ప్రూఫ్ గా భావించడం ద్వారా మాయా ప్రూఫ్ గా అయిపోతారు. మీ శ్రేష్ఠమైన పవిత్ర జీవితమే ప్రత్యక్ష ప్రూఫ్. ప్రవృత్తిలో ఉంటూ పర-వృత్తిలో ఉండడం, దేహము మరియు దేహ ప్రపంచపు సంబంధాల నుండి అతీతంగా ఉండడం - ఇది అన్నిటికన్నా పెద్ద అసంభవం నుండి సంభవమయ్యే విషయం. పాత శరీరం యొక్క కళ్ళతో పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడకుండా ఉండడం అనగా సంపూర్ణ పవిత్ర జీవితంలో నడవడం - ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయాప్రూఫ్ గా అయ్యే సహజ సాధనము.

స్లోగన్:-

అటెన్షన్ రూపీ కాపలాదారుడు బాగుంటే అతీంద్రియ సుఖమనే ఖజానాను పోగొట్టుకోరు.