04-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - అడుగడుగులోనూ తండ్రి శ్రీమతముపై నడుస్తూ ఉండండి, ఒక్క తండ్రి నుండే విన్నట్లయితే మాయ దాడి జరగదు”

ప్రశ్న:-

ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమిటి?

జవాబు:-

ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ ఉండండి. తండ్రి డైరెక్షన్ లభించడంతోనే పిల్లలు దానిని ఆచరించాలి. ఇంకే విషయము సంకల్పంలో కూడా రాకూడదు. 2. ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వండి. మీకు ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే, అప్పుడే ఉన్నత పదవి లభించగలదు.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము సర్వమునూ పొందాము..... (తుమ్ హే పాకే హమ్ నే జహాన్ పా లియా హై.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇది భక్తి మార్గములో గాయనం చేయబడింది. ఈ సమయంలో తండ్రి దీని రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మేము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలు కూడా భావిస్తారు. మన ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. భారతదేశ రాజ్యాన్ని ఎంతోమంది దోచుకున్నారు కదా. ముసల్మానులు దోచుకున్నారు, ఆంగ్లేయులు దోచుకున్నారు. వాస్తవానికి మొట్టమొదట ఆసురీ మతము ద్వారా రావణుడు దోచుకున్నాడు. ఈ కోతుల చిత్రాలనేవైతే తయారుచేస్తారో - హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్..... (చెడు వినకండి, చెడు చూడకండి.....) దీనికి కూడా ఏదో రహస్యముంటుంది కదా. ఒక వైపు తండ్రి ఎవరో తెలియని రావణుని ఆసురీ సంప్రదాయము ఉన్నారు, ఇంకొకవైపు పిల్లలైన మీరు ఉన్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇతను ఎంతో భక్తి చేశారు, ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి ఇతని గురించి వినిపిస్తారు. ఇతనే మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు. ఇతని గురించి నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మాట వినకండి. నేను పిల్లలైన మీతో మాట్లాడతాను అని తండ్రి అంటారు. అప్పుడప్పుడు మీ మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని తీసుకొస్తే, వారితో కొద్దిగా మాట్లాడతాను. మొట్టమొదటి విషయము - పవిత్రంగా అవ్వాలి, అప్పుడే బుద్ధిలో ధారణ అవుతుంది. ఇక్కడి నియమాలు చాలా కఠినమైనవి. 7 రోజులు భట్టీలో ఉండాలని, ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదని, ఉత్తరాలు మొదలైనవి కూడా వ్రాయకూడదని ఇంతకుముందు చెప్పేవారు. ఎక్కడైనా ఉండండి కానీ రోజంతా భట్టీలో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడైతే మీరు భట్టీలో ఉండి మళ్ళీ బయటకు వెళ్తారు. కొందరు ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, ఓహో మాయ, మళ్ళీ పారిపోతారు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రి చెప్పేది ఒప్పుకోరు. మీరు వానప్రస్థులు, మీరెందుకు అనవసరంగా చిక్కుకుని ఉన్నారు అని తండ్రి అంటారు. మీరు ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వండి. మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచము మరణించినట్లే, అప్పుడు ఉన్నత పదవి లభించగలదు. మీది నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము. అడుగడుగులోనూ తండ్రి డైరెక్షన్ పై నడవవలసి ఉంటుంది కానీ ఇందులో కూడా ధైర్యం కావాలి. కేవలం నోటితో చెప్పే విషయం కాదు. మోహపు బంధనం తక్కువేమీ కాదు, నష్టోమోహులుగా అవ్వాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించాలి. మనము బాబా శరణు తీసుకుంటాము. మనం ఎప్పుడూ విషమును ఇవ్వము. మీరు ఈశ్వరుని వైపుకు వస్తే మాయ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు, ఎంతగానో పడగొడుతూ ఉంటుంది. ఈ మందుతో ముందు రోగమంతా బయటకు వస్తుంది, భయపడకండి అని వైద్యులు కూడా అంటారు. ఇది కూడా అటువంటిదే. మాయ చాలా విసిగిస్తుంది, వానప్రస్థ అవస్థలో కూడా వికారీ సంకల్పాలను తీసుకొస్తుంది. మోహము ఉత్పన్నమైపోతుంది. ఇవన్నీ జరుగుతాయని బాబా ముందే తెలియజేస్తారు. జీవించి ఉన్నంతవరకు మాయతో ఈ బాక్సింగ్ జరుగుతూనే ఉంటుంది. మాయ కూడా పెహల్వాన్ (వస్తాదు)గా అయి మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. వికల్పాలు తీసుకురావద్దని నేను మాయకు చెప్పను. బాబా, నాపై కృప చూపించండని చాలామంది వ్రాస్తారు. నేను ఎవరి పైనా కృప చూపించను. ఇక్కడ మీరు శ్రీమతముపై నడవాలి. నేను కృప చూపించినట్లయితే అందరూ మహారాజులుగా అయిపోతారు. ఇది డ్రామాలో కూడా లేదు. అన్ని ధర్మాలవారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటారో, వారు బయటకు వస్తారు. ఈ అంటు కట్టబడుతుంది, ఇందులో చాలా శ్రమ ఉంది. కొత్తవారు వచ్చినప్పుడు వారికి కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్పాలి. శివభగవానువాచ. కృష్ణుడు భగవంతుడు కాదు. అతను 84 జన్మలలోకి వస్తారు. అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి. ఇది బుద్ధిలో పూర్తిగా ధారణ చేయాలి. మనము పతితులుగా ఉండేవారము. ఇప్పుడు మనం పావనులుగా ఎలా అవ్వాలి అన్నది తండ్రి తెలియజేస్తున్నారు. కల్పక్రితము కూడా నన్నొక్కరినే స్మృతి చేయండని చెప్పారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ ధర్మాలన్నింటినీ వదిలి, జీవిస్తూనే మరణించండి. తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను సర్వులకూ సద్గతినిచ్చేందుకు వచ్చాను. భారతవాసులే ఉన్నతంగా అవుతారు, వారే మళ్ళీ 84 జన్మలు తీసుకొని క్రిందకు దిగుతారు. మీరు చెప్పండి - భారతవాసులైన మీరే ఈ దేవీ దేవతలను పూజిస్తారు. వీరు ఎవరు? వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడెక్కడున్నారు? 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? సత్యయుగంలోనైతే ఈ దేవీ-దేవతలే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఈ మహాభారత యుద్ధము ద్వారా అందరి వినాశనం జరగనున్నది. ఇప్పుడందరూ పతితులుగా, తమోప్రధానంగా ఉన్నారు. నేను కూడా ఇతని అనేక జన్మల అంతిమంలోనే వచ్చి ప్రవేశిస్తాను. ఇతను పూర్తిగా భక్తునిగా ఉండేవారు. నారాయణుని పూజ చేసేవారు. ఇతనిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతడినే నారాయణునిగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు కూడా పురుషార్థము చేయాలి. ఈ దైవీ రాజధాని స్థాపనవుతూ ఉంది. మాల తయారవుతుంది కదా. పైన నిరాకార పుష్పముంది, తర్వాత మేరువు, జంటపూసలు ఉన్నాయి. శివబాబా కింద వీరు అతి సమీపంగా నిలబడి ఉన్నారు. వీరు జగత్ పిత బ్రహ్మా మరియు జగదంబ సరస్వతి. ఇప్పుడు మీరు ఈ పురుషార్థము ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. భారతదేశము మాది అని ప్రజలు కూడా అంటారు కదా. మేము విశ్వానికి యజమానులమని మీరు కూడా భావిస్తారు. మేము రాజ్యం చేస్తాము, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండదు. ఇది మా రాజ్యమని అనలేరు, అక్కడ ఇంకే రాజ్యమూ ఉండదు. ఇక్కడ చాలా ఉన్నాయి కావున మాదీ, మీదీ అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలే ఉండవు. కావున పిల్లలూ, ఇతర విషయాలన్నిటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరో ఒకరు ఎదురుగా కూర్చొని యోగము చేయించాలి, దృష్టినివ్వాలి అనేది ఏమీ లేదు. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలని తండ్రి అంటారు. మీ చార్టును పెట్టండి - మొత్తం రోజంతటిలో ఎంత స్మృతి చేశాను? ఉదయాన్నే లేచి ఎంత సమయం తండ్రితో మాట్లాడాను? ఈ రోజు బాబా స్మృతిలో కూర్చున్నానా? ఈ విధంగా మీతో మీరు శ్రమించాలి. జ్ఞానమైతే బుద్ధిలో ఉంది, ఇది ఇతరులకు కూడా అర్థము చేయించాలి. కామము మహాశత్రువని ఎవరి బుద్ధిలోకీ రాదు. 2-4 సంవత్సరాలు ఉన్న తర్వాత మాయ దెబ్బ జోరుగా తగలడంతో కింద పడిపోతారు. బాబా, మేము నల్ల ముఖము చేసుకున్నామని వ్రాస్తారు. అలా నల్ల ముఖము చేసుకున్నవారు 12 నెలలు వరకూ ఇక్కడకు రావలసిన అవసరము లేదని బాబా వ్రాస్తారు. మీరు తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలలోకి పడిపోయినట్లైతే నా వద్దకు ఎప్పుడూ రాకండి. ఇది చాలా పెద్ద గమ్యము. పతితుల నుండి పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. చాలామంది పిల్లలు వివాహము చేసుకుని పవిత్రంగా ఉంటారు. ఎవరైనా కన్యలకు దెబ్బలు పడుతుంటే, వారిని రక్షించేందుకు గంధర్వ వివాహము చేయించి పవిత్రముగా ఉంచుతారు. వారిలో కూడా కొంతమందిని మాయ ముక్కుతో పట్టుకుంటుంది. వారు ఓడిపోతారు. ఎంతోమంది స్త్రీలు కూడా ఓడిపోతారు. వారు శూర్పణఖలని బాబా అంటారు, ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. ఇక్కడైతే బాబా వికారులెవ్వరినీ కూర్చోనివ్వరు. అడుగడుగునా తండ్రి నుండి సలహా తీసుకోవలసి ఉంటుంది. సమర్పితమైపోతే, ఇక ట్రస్టీలుగా అవ్వండని, సలహాపై నడుస్తూ ఉండండని తండ్రి అంటారు. లెక్కాపత్రము తెలియజేస్తేనే, సలహానిస్తారు. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. మీరు భోగ్ పెట్టినా కానీ నేనేమీ తినను. నేను దాతను. అచ్ఛా.

రాత్రి క్లాసు - 15-06-1968

ఏదైతే గతించిపోయిందో దానిని రివైజ్ చేయడంతో, బలహీన మనస్సు కలవారి మానసిక బలహీనత కూడా మళ్ళీ రివైజ్ అవుతుంది, అందుకే పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది. స్మృతి ద్వారానే ముఖ్యమైన లాభము ఉంది. స్మృతి ద్వారానే ఆయువు పెరుగుతుంది. పిల్లలు డ్రామాను అర్థము చేసుకున్నట్లయితే, ఇక ఎప్పుడూ ఏ ఆలోచనలూ ఉండవు. డ్రామాలోని ఈ సమయములో జ్ఞానమును నేర్చుకోవడం మరియు నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ పాత్ర సమాప్తమైపోతుంది. అప్పుడిక తండ్రి పాత్రా ఉండదు, మన పాత్రా ఉండదు. వారికి ఇచ్చే పాత్రా ఉండదు, మనకు తీసుకునే పాత్రా ఉండదు. అప్పుడిక ఒకటైపోతారు కదా. మన పాత్ర కొత్త ప్రపంచంలో ఉంటుంది. బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది. పాత్రతో రీలు నింపబడి ఉంది కదా, మనది ప్రారబ్ధపు పాత్ర, బాబాది శాంతిధామపు పాత్ర. ఇచ్చి పుచ్చుకునే పాత్ర పూర్తవుతూనే, డ్రామా కూడా సమాప్తమైపోతుంది. అప్పుడు మనము రాజ్యం చేసేందుకు వస్తాము, ఆ పాత్ర మారిపోతుంది. జ్ఞానము ఆగిపోతుంది, మనము అలా తయారైపోతాము. పాత్రనే పూర్తయిపోతే ఇంకేమీ వ్యత్యాసము ఉండదు. పిల్లలు మరియు తండ్రి పాత్ర కూడా ఉండదు. వీరు కూడా జ్ఞానమును పూర్తిగా తీసుకుంటారు. వారి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్ద ఏమీ ఉండదు, తీసుకునేవారి వద్ద లోటు ఉండదు అన్నప్పుడు ఇరువురు సమానమైపోతారు. ఇందులో విచార సాగర మథనము చేసే బుద్ధి కావాలి. స్మృతియాత్రయే ముఖ్యమైన పురుషార్థము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వినిపించడానికి పెద్ద విషయముగా ఉంటుంది కానీ బుద్ధిలోనైతే సూక్ష్మంగా ఉంటుంది కదా. శివబాబా రూపమేమిటి అనేది లోలోపల తెలుసు. అర్థము చేయించేందుకు పెద్ద రూపంగా ఉంటుంది. భక్తి మార్గములో పెద్ద లింగాన్ని తయారుచేస్తారు. ఆత్మ అయితే చిన్నది కదా, ఇది ప్రాకృతికము. ఎక్కడివరకు అంతాన్ని పొందుతారు? మళ్ళీ తర్వాత బేఅంత్ (అంతము లేనిది) అని అంటారు. పాత్ర అంతా ఆత్మలో నిండి ఉందని బాబా అర్థం చేయించారు. ఇది ప్రాకృతికము. దీని అంతమును పొందలేము, సృష్టిచక్ర అంతమునైతే తెలుసుకోగలము. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి మీకే తెలుసు. బాబా జ్ఞానసాగరులు, తర్వాత మనము కూడా ఫుల్ గా అయిపోతాము. ఇక పొందేందుకు ఏమీ ఉండదు. తండ్రి వీరిలో ప్రవేశించి చదివిస్తారు. వారు ఒక బిందువు. ఆత్మ లేక పరమాత్మల సాక్షాత్కారము కలగడంతో సంతోషమేమీ కలగదు. శ్రమించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. నాలో జ్ఞానము ఆగిపోయినట్లయితే మీలో కూడా ఆగిపోతుందని తండ్రి అంటారు. జ్ఞానాన్ని తీసుకొని ఉన్నతంగా అవుతారు. అంతా తీసుకుంటారు కానీ తండ్రి తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు, తండ్రిగా అవ్వరు కదా. ఇది జ్ఞానము. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచార సాగర మథనము చేసి లోతుల్లోకి వెళ్ళవలసిన విషయాలు. అందరూ వెళ్ళవలసిందే అనేది కూడా తెలుసు. అందరూ వెళ్ళిపోయేవారే. ఆత్మ మాత్రం అక్కడ వెళ్ళి ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. ఇందులో నిర్భయులుగా ఉండవలసి ఉంటుంది. నిర్భయులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. శరీరము మొదలైనవాటి భానమేదీ ఉండకూడదు. ఆ అవస్థకు చేరుకోవాలి. తండ్రి తమ సమానంగా తయారుచేస్తారు, పిల్లలైన మీరు కూడా తమ సమానంగా తయారుచేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండే విధమైన పురుషార్థం చేయాలి. ఇప్పుడు ఇంకా సమయముంది. ఈ రిహార్సల్స్ ను తీవ్రతరము చేయాలి. అభ్యాసము లేకపోతే అక్కడే ఆగిపోతారు. కాళ్ళు వణకడం మొదలవుతుంది మరియు అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. తమోప్రధాన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వడంలో ఆలస్యమవ్వదు. ఎంతగా అశరీరులుగా అవుతూ ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా సమీపంగా వస్తూ ఉంటారు. యోగము చేసేవారే నిర్భయులుగా ఉంటారు. యోగము ద్వారా శక్తి లభిస్తుంది, జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. పిల్లలకు శక్తి కావాలి. కావున శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అవినాశీ సర్జన్. వారు ఎప్పుడూ పేషెంట్ గా అవ్వలేరు. మీరు మీ అవినాశీ ఔషధమును తీసుకుంటూ ఉండండని ఇప్పుడు తండ్రి అంటారు. మేము ఎటువంటి సంజీవని మూలికను ఇస్తామంటే, ఇక మళ్ళీ ఎప్పుడూ ఎవ్వరూ రోగులుగా అవ్వరు. కేవలం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అయిపోతారు. దేవతలు సదా నిరోగులుగా, పావనంగా ఉంటారు కదా. మేము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటామని పిల్లలకు నిశ్చయమైపోయింది. ఇప్పుడు ఎలా వచ్చారో, అలాగే బాబా లెక్కలేనన్ని సార్లు వచ్చారు. బాబా ఏదైతే నేర్పిస్తారో, ఏదైతే అర్థం చేయిస్తారో, అదే రాజయోగము. ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞానమార్గమును తండ్రి మాత్రమే తెలియజేస్తారు. తండ్రియే వచ్చి క్రింద నుండి పైకెత్తుతారు. పక్కా నిశ్చయబుద్ధి కలిగిన వారే మాలలోని మణులుగా అవుతారు. భక్తి చేస్తూ-చేస్తూ మేము క్రింద పడుతూ వచ్చామని పిల్లలు భావిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తారు. పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదనను లౌకిక తండ్రి చేయించలేరు. అచ్ఛా, పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ పెహల్వాన్ (వస్తాదు) గా అయి మీ ముందుకు వస్తుంది, దానికి భయపడకూడదు. మాయాజీతులుగా అవ్వాలి. అడుగడుగు శ్రీమతముపై నడుస్తూ మీపై మీరే కృప చూపించుకోవాలి.

2. తండ్రికి మీ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రమును తెలియజేయాలి. ట్రస్టీలుగా (నిమిత్తులుగా) అయి ఉండాలి. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

వరదానము:-

మీ స్వరూపం ద్వారా భక్తులకు ప్రకాశ కిరీటాన్ని సాక్షాత్కారము చేయించే ఇష్టదేవ భవ

ఎప్పటి నుండైతే మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారో, పవిత్రతా ప్రతిజ్ఞను చేసారో, దానికి రిటర్న్ లో మీకు ప్రకాశ కిరీటం లభించింది. ఈ ప్రకాశ కిరీటం ముందు రత్నజడిత కిరీటం ఏమీ కాదు. సంకల్పము, మాట మరియు కర్మలో ఎంతెంతగా పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో, అంతగా ఈ ప్రకాశ కిరీటము స్పష్టమవుతూ ఉంటుంది మరియు ఇష్టదేవి రూపంలో భక్తుల ముందు ప్రత్యక్షమవుతూ ఉంటారు.

స్లోగన్:-

సదా బాప్ దాదా ఛత్రఛాయ లోపల ఉన్నట్లయితే విఘ్న-వినాశకులుగా అవుతారు.