04-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ- ఇది వినాశన సమయము, రావణుడు అందరినీ శ్మశానగ్రస్థులుగా చేసేశాడు, తండ్రి అమృత వర్షమును కురిపించి తోడుగా తీసుకువెళ్ళేందుకు వచ్చారు”

ప్రశ్న:-

శివబాబాను భోళా భండారీ అని కూడా అంటారు - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే శివ భోళానాథుడు వచ్చినప్పుడు వేశ్యలకు, అహల్యలకు, కుబ్జలకు కూడా కళ్యాణము చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు రావడం కూడా చూడండి, పతిత ప్రపంచము మరియు పతిత శరీరంలోకి వస్తారు, అంటే భోళాగా ఉన్నట్లే కదా. భోళా తండ్రి యొక్క డైరెక్షన్ - మధురమైన పిల్లలూ, ఇప్పుడు అమృతము తాగండి, వికారాల రూపీ విషాన్ని వదిలేయండి.

గీతము:-

దూరదేశములో నివసించేవారు..... (దూర్ దేశ్ కా రహ్ నే వాలా.....)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు అనగా ఆత్మలు ఈ శరీరము యొక్క చెవులు అనే కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. దూరదేశము యొక్క ప్రయాణికుడు వస్తారు, మీరు కూడా ప్రయాణికులే కదా. మనుష్యాత్మలందరూ ప్రయాణికులే. ఆత్మలకు ఇల్లు అంటూ ఏదీ లేదు. ఆత్మ నిరాకారీ. నిరాకారీ ప్రపంచములో నివసించే నిరాకారీ ఆత్మలు. దానిని నిరాకారీ ఆత్మల ఇల్లు, దేశము లేక లోకము అని అంటారు, దీనిని జీవాత్మల దేశమని అంటారు. అది ఆత్మల దేశము, ఆత్మలు ఇక్కడకు వచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశించినప్పుడు నిరాకారి నుండి సాకారిగా అవుతాయి. ఆత్మకు ఎటువంటి రూపము లేదని కాదు, ఆత్మకు రూపం కూడా తప్పకుండా ఉంటుంది, పేరు కూడా ఉంటుంది. ఇంత చిన్న ఆత్మ ఈ శరీరము ద్వారా ఎంతటి పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మలో పాత్రను అభినయించేందుకు ఎంత రికార్డు నిండి ఉంది. రికార్డు ఒక్కసారి నిండిన తర్వాత ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే, అదే నడుస్తుంది. ఇదే విధంగా, ఆత్మ కూడా ఈ శరీరము లోపల ఒక రికార్డు వంటిది, ఇందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఏ విధంగా తండ్రి నిరాకారుడో, అదే విధంగా ఆత్మ కూడా నిరాకారి. ఆత్మ నామ రూపాలకు అతీతమైనదని శాస్త్రాలలో అక్కడక్కడా వ్రాశారు, కానీ నామ రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశము కూడా పోలార్ (శూన్యము). దానికి ఆకాశమనే పేరు అయితే ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువూ ఉండదు. మనుష్యులు పరమపిత పరమాత్మ అని అంటారు. ఇప్పుడు దూరదేశంలోనైతే ఆత్మలన్నీ ఉంటాయి. ఇది సాకార దేశము, ఇందులో కూడా ఇరువురి రాజ్యము నడుస్తుంది - రామ రాజ్యము మరియు రావణ రాజ్యము. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. తండ్రి ఎప్పుడూ పిల్లల కోసం దుఃఖం యొక్క రాజ్యాన్ని తయారుచేయరు. ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు. నేనెప్పుడూ పిల్లలకు దుఃఖమునివ్వను. నా పేరే దుఃఖహర్త, సుఖకర్త అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది మనుష్యుల పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖమునివ్వరు. ఈ సమయంలో దుఃఖధామము ఉన్నది. అర్ధకల్పము రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం లభిస్తుంది. ఇసుమంత సుఖము కూడా ఉండదు. మళ్ళీ సుఖధామంలో దుఃఖమే ఉండదు. తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. దీనిని కొత్త ప్రపంచమని ఎవ్వరూ అనరు. కొత్త ప్రపంచము పేరే సత్యయుగము, అదే మళ్ళీ పాతదిగా అవుతుంది కనుక కలియుగమని అంటారు. కొత్త వస్తువు బాగా కనిపిస్తుంది మరియు పాత వస్తువు పాడైనదిగా కనిపిస్తుంది కావున పాత వస్తువును సమాప్తం చేయడం జరుగుతుంది. మనుష్యులు విషాన్నే సుఖమని భావిస్తారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అని అనడం జరుగుతుంది. మీ వల్ల అందరి మేలు జరుగుతుందని, మీరు ఏదైతే వచ్చి చేస్తారో దాని వలన మేలే జరుగుతుందని కూడా అంటారు. లేదంటే రావణ రాజ్యంలో మనుష్యులు చెడు కర్మలే చేస్తారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయింది, మళ్ళీ వారు ఎప్పుడు వస్తారు అనేది ఇప్పుడు పిల్లలకు తెలిసింది. నానక్ ఆత్మ జ్యోతి, జ్యోతిలో ఇమిడిపోయింది అని వారు అంటారు. అటువంటప్పుడు మళ్ళీ ఎలా వస్తారు. నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురునానక్ మళ్ళీ వస్తారని మీరంటారు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళము తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు, దీనిని వినాశన సమయము అని అంటారు. మనుష్యులందరూ మరణించినవారి వలె ఉన్నారు. అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరినీ మేలుకొలిపేందుకు తండ్రి వస్తారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని భస్మమైపోయారో, వారిని అమృత వర్షముతో మేలుకొలిపి తోడుగా తీసుకువెళ్తారు. మాయా రావణుడు కామచితిపై కూర్చోబెట్టి శ్మశానగ్రస్థులుగా చేసేశాడు. అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి జ్ఞానామృతాన్ని తాగిస్తారు. ఇప్పుడు జ్ఞానామృతము ఎక్కడ మరియు ఆ నీరు ఎక్కడ. సిక్కుల యొక్క ముఖ్యమైన రోజుల్లో, వారు చాలా ఘనంగా సరోవరాన్ని శుభ్రము చేస్తారు, మట్టిని తీస్తారు, అందుకే దానికి అమృత్సర్ అని పేరు పెట్టారు. అమృతం యొక్క సరోవరము. గురునానక్ కూడా తండ్రి మహిమను చేశారు. ఏక్ ఓంకార్, సత్ నామ్..... వారు సదా సత్యము చెప్పేవారు అని గురునానక్ స్వయంగా అంటారు. సత్యనారాయణుని కథ ఉంది కదా. మనుష్యులు భక్తి మార్గంలో ఎన్ని కథలను వింటూ వచ్చారు. అమరకథ, మూడవ నేత్రం కథ..... శంకరుడు పార్వతికి కథను వినిపించారని అంటారు. వారు సూక్ష్మవతనంలో నివసించేవారు, మరి అక్కడ ఏ కథను వినిపించారు? వాస్తవానికి నేను మీకు అమరకథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు వచ్చానని ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. మృత్యులోకము నుండి అమరలోకములోకి తీసుకువెళ్తాను. మరి సూక్ష్మవతనంలో పార్వతి ఏం తప్పు చేసారని ఆమెకు అమరకథను వినిపిస్తారు. శాస్త్రాల్లోనైతే అనేక కథలు వ్రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ అయితే లేనే లేదు. మీరు ఎన్ని సత్యనారాయణుని కథలు విని ఉంటారు. అయినా ఎవరైనా సత్యనారాయణునిగా అయ్యారా, ఇంకా దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని మీకు తెలుసు. ఇది అమరలోకములోకి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, మూడవ నేత్రం కథ. ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభించింది. మీరే పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారని, మళ్ళీ 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారని తండ్రి అర్థం చేయిస్తారు, అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని గాయనము చేయబడింది. తండ్రి అంటారు - నేను సదా పూజ్యుడను. నేను వచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఇది పతిత ప్రపంచము. సత్యయుగంలో పూజ్యులైన పావన మనుష్యులుంటారు, ఈ సమయంలో పూజారులైన పతిత మనుష్యులుంటారు. సాధు-సత్పురుషులు పతిత పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. ఈ పదాలు సరైనవే..... సీతలందరూ వధువులు. ఓ రామా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. భక్తులందరూ పిలుస్తారు, ఓ రామా అని ఆత్మ పిలుస్తుంది. గాంధీజీ కూడా గీతను వినిపించి పూర్తి చేసేటప్పుడు, ఓ పతితపావన సీతారామా అని అనేవారు. గీతను కృష్ణుడేమీ వినిపించలేదని మీకిప్పుడు తెలుసు. బాబా అంటారు - ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని ఒపీనియన్ (అభిప్రాయం) తీసుకుంటూ ఉండండి. గీతా భగవంతుడు శివుడు, కృష్ణుడు కాదు. గీతా భగవంతుడు అని ఎవరిని అంటారు అని మొదట అడగండి. భగవంతుడు అని నిరాకారుడిని అంటారా లేక సాకారుడిని అంటారా అని అడగండి. కృష్ణుడు సాకారుడు. శివుడు నిరాకారుడు. వారు కేవలం ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. అంతేకానీ తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు. శివునికి శరీరము లేనే లేదు. ఇక్కడ ఈ మనుష్య లోకంలో స్థూల శరీరముంటుంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు. తండ్రి మహిమ - పతితపావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తిదాత, దుఃఖహర్త-సుఖకర్త. అచ్ఛా, సుఖము ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు. సుఖము మరుసటి జన్మలో లభిస్తుంది, పాత ప్రపంచం సమాప్తమై స్వర్గ స్థాపన జరిగినప్పుడు లభిస్తుంది. అచ్ఛా, దేని నుండి ముక్తులుగా చేస్తారు? రావణుని దుఃఖము నుండి ముక్తులుగా చేస్తారు. ఇది దుఃఖధామము కదా. అచ్ఛా, ఇంకా మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. ఇకపోతే, ఆత్మలను తీసుకువెళ్తారు. మొదట ప్రియుడు, తర్వాత ప్రేయసులు వెళ్తారు. వారు అవినాశీ, సుందరమైన ప్రియుడు. అందరినీ దుఃఖము నుండి విడిపించి, పవిత్రంగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్తారు. వివాహం చేసుకొని వచ్చినప్పుడు మొదట పతి ఉంటారు, అతని వెనుక వధువు (పత్ని) ఉంటుంది, తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది. పైన పుష్పము శివబాబా, దానికి నమస్కరిస్తారు. తర్వాత జంట పూసలు, బ్రహ్మా-సరస్వతి. తర్వాత బాబాకు సహాయకులు అయిన మీరు ఉంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశీ, విష్ణుమాలగా అయ్యారు. బ్రహ్మా-సరస్వతులు, లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు, బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. వీరు శ్రమించారు, అందుకే పూజింపబడతారు. మాల అంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. ఒట్టిగా మాలను తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంటుంది. దీనిని పెద్ద పెద్ద మందిరాలలో పెట్టడం జరుగుతుంది, అప్పుడు కొందరు ఒక చోట నుండి, కొందరు ఇంకొక చోట నుండి పట్టుకొని తిప్పుతారు. బాబా బొంబాయిలో లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళేవారు, అక్కడికి వెళ్ళి మాలను తిప్పేవారు, రామ-రామ అని జపించేవారు, ఎందుకంటే పుష్పము ఒక్క తండ్రియే కదా. పుష్పాన్నే రామ-రామ అని అంటారు. తర్వాత మొత్తం మాలకు తల వంచి నమస్కరిస్తారు. జ్ఞానము ఏ మాత్రమూ లేదు. ఫాదర్లు కూడా చేతితో మాలను తిప్పుతూ ఉంటారు. ఎవరి మాలను తిప్పుతున్నారు అని అడగండి. వారికైతే తెలియదు. క్రీస్తు స్మృతిలో తిప్పుతున్నామని అంటారు. క్రీస్తు ఆత్మ స్వయంగా ఎక్కడ ఉంది అనేది వారికి తెలియదు. క్రీస్తు ఆత్మ ఇప్పుడు తమోప్రధానంగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమోప్రధానులుగా, బికారులుగా ఉండేవారు. ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. భారతదేశము రాకుమారుని వలె ఉండేది, ఇప్పుడు బికారిగా ఉంది, మళ్ళీ రాకుమారునిగా అవుతుంది. అలా తయారుచేసేవారు తండ్రి. మీరు మనుష్యుల నుండి రాకుమారులుగా అవుతారు. ప్రిన్స్ కాలేజ్ (రాకుమారుల కాలేజ్) కూడా ఒకటి ఉండేది, అక్కడకు రాకుమారులు, రాకుమార్తెలు వెళ్ళి చదువుకునేవారు.

మీరిక్కడ చదువుకొని 21 జన్మలకు స్వర్గంలో రాకుమార-రాకుమార్తెలుగా అవుతారు. ఈ శ్రీకృష్ణుడు రాకుమారుడు కదా. వీరి 84 జన్మల కథ రాయబడి ఉంది. మనుష్యులకేమి తెలుసు. ఈ విషయాలు కేవలం మీకే తెలుసు. ‘భగవానువాచ’ - వారు అందరికీ తండ్రి. మీరు గాడ్ ఫాదర్ నుండి వింటున్నారు, వారు స్వర్గ స్థాపన చేస్తారు. దానిని సత్య ఖండమని అంటారు. ఇది అసత్య ఖండము. సత్య ఖండాన్ని అయితే తండ్రి స్థాపన చేస్తారు. అసత్య ఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుని రూపాన్ని తయారుచేస్తారు, దాని అర్థము ఏమీ తెలియదు. హతమారుస్తున్నా సరే, మళ్ళీ జీవిస్తున్న ఆ రావణుడు ఎవరు అనేది ఆఖరుకి ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి 5 వికారాలు స్త్రీలవి, 5 వికారాలు పురుషులవి..... దీనినే రావణుడు అని అంటారు. అతడిని హతమారుస్తారు. రావణుడిని హతమార్చి బంగారాన్ని దోచుకుంటారు.

ఇది ముళ్ళ అడవి అని పిల్లలైన మీకు తెలుసు. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరము కూడా ఉంది. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటారు అనగా కామ ఖడ్గాన్ని నడిపిస్తూ ఉంటారు, అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు, అవే పుష్పాలు ముళ్ళగా అవుతాయి, మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతాయి. ఇప్పుడు మీరు 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. ఈ రావణ రాజ్య వినాశనము జరగవలసిందే. చివర్లో పెద్ద యుద్ధము కూడా జరుగుతుంది. సత్యాతి-సత్యమైన దసరా కూడా జరగాలి. రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది, తర్వాత మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు మహళ్ళు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణునిపై విజయము ప్రాప్తి చేసుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్నిస్తారు, అందుకే వారిని శివభోళా భండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలు..... అందరినీ తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారు ఎంతటి అమాయకులు. వారు రావడం కూడా పతిత ప్రపంచములో, పతిత శరీరములోకి వస్తారు. ఇకపోతే, మిగతా ఎవరైతే స్వర్గానికి యోగ్యులు కారో, వారు విషాన్ని తాగడం అసలు విడిచిపెట్టరు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి. ఈ వికారాలు మిమ్మల్ని ఆదిమధ్యాంతాలు దుఃఖితులుగా చేస్తాయి. మీరు ఈ ఒక్క జన్మ కోసం విషాన్ని తాగడం వదిలి పెట్టలేరా? నేను మీకు అమృతమును తాగించి అమరులుగా చేస్తాను, అయినా మీరు పవిత్రంగా అవ్వరా. విషము లేకుండా, సిగరెట్టు, మద్యం లేకుండా ఉండలేరా. అనంతమైన తండ్రిని నేను మీకు చెప్తున్నాను - పిల్లలూ, ఈ ఒక్క జన్మ కోసం పావనంగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేయడం మరియు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం - ఇది తండ్రి యొక్క పనియే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖము నుండి విడిపించి సుఖధామానికి, శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చేసారు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మము మళ్ళీ స్థాపనవుతుంది. గ్రంథ్ లో కూడా పరమపిత పరమాత్మను అకాల మూర్తి అని అంటారు. తండ్రి మహాకాలుడు, కాలుడికే కాలుడు. ఆ కాలుడు అయితే ఒకరిద్దరిని తీసుకువెళ్తాడు. నేను అయితే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను, అందుకే మహాకాలుడు అని అంటారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ జన్మలో విషాన్ని త్యాగము చేసి అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. పావనంగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేయాలి.

2. విష్ణువు మెడలోని మాల యొక్క మణిగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి, పూర్తి సహాయకులుగా అయ్యి తండ్రి సమానంగా దుఃఖహర్తలుగా అవ్వాలి.

వరదానము:-

డ్రామా యొక్క డాలును ఎదురుగా పెట్టుకొని సంతోషమనే ఔషధాన్ని తినే సదా శక్తిశాలి భవ

సంతోషం రూపీ భోజనం ఆత్మను శక్తిశాలిగా తయారుచేస్తుంది, సంతోషము వంటి ఔషధం లేదని కూడా అంటారు. దీని కోసం డ్రామా యొక్క డాలును మంచి రీతిగా కార్యములో ఉపయోగించండి. ఒకవేళ సదా డ్రామా స్మృతిలో ఉన్నట్లయితే, ఇక ఎప్పుడూ వాడిపోలేరు, సంతోషము మాయమవ్వలేదు, ఎందుకంటే ఈ డ్రామా కళ్యాణకారి, అందుకే అకళ్యాణకారి దృశ్యములో కూడా కళ్యాణము ఇమిడి ఉంటుంది, ఈ విధంగా భావిస్తూ సదా సంతోషంగా ఉండండి.

స్లోగన్:-

పరచింతన మరియు పరదర్శన అనే ధూళి నుండి దూరంగా ఉండేవారే సత్యమైన, అమూల్యమైన వజ్రాలు.