04-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ ప్రపంచం హోప్ లెస్ కేసులా (ఆశ లేనటువంటిదిగా) ఉంది, అందరూ మరణిస్తారు, అందుకే దీని పట్ల మమకారాన్ని తొలగించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి

ప్రశ్న:-

సేవ చేసేందుకు ఉత్సాహం కలగకపోవడానికి కారణాలేమిటి?

జవాబు:-

1. ఒకవేళ లక్షణాలు సరిగ్గా లేకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే, సేవ చేసేందుకు ఉత్సాహం కలగదు. ఏవో ఒక తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి, అందుకే సేవ చేయలేరు. 2. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే - అని తండ్రి ఇచ్చిన మొదటి డైరెక్షన్ ను అమలులోకి తీసుకురారు. బుద్ధి దేహం మరియు దేహ సంబంధాలలో చిక్కుకొని ఉన్నట్లయితే సేవ చేయలేరు.

గీతము:-

ఓం నమః శివాయ.....

ఓంశాంతి.

ఇప్పుడు ఈ భక్తి మార్గపు పాటను విన్నారు. శివాయ నమః అని అంటారు. శివుని పేరును పదే-పదే తీసుకుంటారు, శివుని మందిరానికి రోజూ వెళ్తారు మరియు పండుగలను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది, పురుషోత్తమ సంవత్సరం కూడా ఉంటుంది. శివాయ నమః అని రోజూ అంటూ ఉంటారు. శివుని పూజారులు చాలా మంది ఉన్నారు. శివుడు రచయిత, వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. పతితపావనుడు, పరమపిత పరమాత్మ శివుడు అని కూడా అంటారు. రోజూ పూజ కూడా చేస్తారు. ఈ సంగమయుగము పురుషోత్తములుగా తయారయ్యే యుగమని పిల్లలైన మీకు తెలుసు. ఉదాహరణకు భౌతిక చదువు ద్వారా ఏదో ఒక ఉన్నతమైన పదవిని పొందుతారు కదా. ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారు, విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది ఎవరికీ తెలియదు. శివాయ నమః అని కూడా అంటారు. నీవే తల్లివి-తండ్రివి... అని అంటూ రోజూ వారి మహిమను పాడుతారు కానీ వారు ఎప్పుడు వచ్చి తల్లి-తండ్రిగా అయి వారసత్వాన్ని ఇస్తారు అనేది తెలియదు. ప్రపంచంలోని మనుష్యులకు ఏమీ తెలియదని మీకు తెలుసు. భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. అమరనాథ్ కు గుంపులు గుంపులుగా ఎంతమంది వెళ్తారు. ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఈ మాట ఎవరితోనైనా అంటే డిస్టర్బ్ అవుతారు. పిల్లలైన మీలో కొంతమందికి మాత్రమే లోలోపల చాలా సంతోషముంది. బాబా, మిమ్మల్ని గుర్తించినప్పటి నుండి, ఇక మా సంతోషానికి అవధులు లేవు అని రాస్తూ ఉంటారు కూడా. ఎదైనా కష్టం వచ్చినా సరే, సంతోషంగా ఉండాలి. మేము తండ్రికి చెందినవారిగా అయ్యాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. మేము శివబాబాను పొందాము - అని పిల్లలైన మీకు తెలుసు కనుక ఇక మీ సంతోషానికి అవధులనేవి ఉండకూడదు. మాయ పదే-పదే మర్చిపోయేలా చేస్తుంది. మాకు నిశ్చయముంది, మాకు బాబా తెలుసు అని కూడా రాస్తారు కానీ నడుస్తూ-నడుస్తూ చల్లబడిపోతారు. 6-8 నెలలు, 2-3 సంవత్సరాలు రాకపోతే, ఈ పిల్లలు పూర్తి నిశ్చయబుద్ధి కలవారు కాదని, వీరికి పూర్తి నషా ఎక్కలేదని బాబాకు అర్థమవుతుంది. ఇలాంటి అనంతమైన తండ్రి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది అన్న నిశ్చయముంటే, సంతోషం యొక్క నషా చాలా ఉండాలి. ఉదాహరణకు ఎవరి కొడుకునైనా రాజు దత్తత తీసుకోవాలని అనుకున్నప్పుడు, రాజు అతడిని వారసునిగా చేసుకుంటానని మాట్లాడుతున్నట్లుగా ఆ పిల్లవాడికి తెలిస్తే, అతనికి చాలా సంతోషం కలుగుతుంది కదా. నేను రాజుకు కొడుకుగా అవుతున్నానని అనిపిస్తుంది. లేదా, పేదవారి కొడుకును షావుకారులు దత్తత తీసుకుంటే అతనికి చాలా సంతోషం కలుగుతుంది కదా. నన్ను ఫలానావారు దత్తత తీసుకుంటున్నారని తెలిస్తే పేదరికపు దుఃఖాన్ని మర్చిపోతాడు. కానీ ఎంతైనా అది ఒక్క జన్మకు సంబంధించిన విషయము. ఇక్కడ పిల్లలకు, 21 జన్మలకు వారసత్వం తీసుకుంటామనే సంతోషం ఉంటుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి. పతితపావనుడైన శివబాబా వచ్చి ఉన్నారు. నేను మీ తండ్రిని అని వారు అర్థం చేయిస్తారు. ఈ విధంగా నేను మీ అనంతమైన తండ్రిని అని మనుష్యులెవరూ చెప్పలేరు. నేను 5 వేల సంవత్సరాల క్రితం వచ్చానని తండ్రియే అర్థం చేయిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని మాత్రమే చెప్పాను. పతితపావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తేనే, మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కృష్ణుడిని భగవంతుడని అనలేరు. గీతా భగవంతుడు, ఒక్క పతితపావనుడు మాత్రమే, వారు పునర్జన్మ రహితుడు. మొట్టమొదట ఈ విషయాన్ని రాయించండి. పెద్ద-పెద్దవారు రాసింది చూస్తే, ఇది సరియైనదని భావిస్తారు. ఎవరైనా సాధారణ వ్యక్తులు రాసింది చూస్తే, బ్రహ్మాకుమారీలు వీరికి గారడి చేసారు, అందుకే ఇలా రాసారు అని అంటారు, పెద్ద వ్యక్తుల కోసం ఇలా అనరు. మీరు ఏదైనా చెప్తే, చిన్న నోటితో భగవంతుడు వచ్చారనే పెద్ద మాటలు మాట్లాడుతున్నారని భావిస్తారు. పిల్లలైన మీరు కేవలం భగవంతుడు వచ్చారని చెప్పడం కాదు, అలా చెప్తే ఎవరూ అర్థం చేసుకోరు, ఇంకా నవ్వుకుంటారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని అర్థం చేయించాలి. భగవంతుడు వచ్చారని ముందే డైరెక్టుగా చెప్పకూడదు, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా స్వయాన్ని భగవంతుడని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. వారంతా తమను తాము భగవంతుని అవతారంగా భావిస్తారు. అందుకే యుక్తితో ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. తండ్రి పేరు - శివ. వారు ఆత్మలందరికీ తండ్రి కనుక తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇస్తూ ఉండవచ్చు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, అంటే తప్పకుండా నరకం యొక్క వినాశనం అవ్వనున్నది. దానికి గుర్తుగా ఈ మహాభారత యుద్ధం ఉంది. ఇకపోతే, కేవలం భగవంతుడు వచ్చారని చెప్తే ఎవరూ అర్థం చేసుకోరు. దండోరా వేస్తూ ఉంటారు. ఇలా తప్పుగా సేవ చేస్తే, సేవలో ఇంకా ఢీలాతనం వచ్చేస్తుంది. ఒక వైపు భగవంతుడు వచ్చారని, భగవంతుడు చదివిస్తున్నారని అంటారు, మరో వైపు వెళ్ళి వివాహం చేసుకుంటారు. అప్పుడు మనుష్యులు - మీకు ఏమయింది, మీరు భగవంతుడు చదివిస్తున్నారని చెప్పేవారు కదా అని అడుగుతారు. అప్పుడు - మేము ఏది విన్నామో, అది చెప్పాము అని అంటారు. ఇక్కడ కూడా పిల్లల ద్వారా అనేక రకాల విఘ్నాలు ఏర్పడతాయి, ఎలాగైతే హిందు ధర్మం వారు తమకు తామే చెంప దెబ్బ వేసుకున్నారో, అలా. వాస్తవానికి వారు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కానీ మేము హిందువులమని చెప్పుకుంటారు. అంటే, తమకు తాము చెంప దెబ్బ వేసుకున్నట్లు కదా. ఇప్పుడు మీకు తెలుసు - మనం పూజ్యులుగా ఉన్నప్పుడు శ్రేష్ఠ కర్మలు ఉండేవి, శ్రేష్ఠ ధర్మం ఉండేది, ఆసురీ మతం అనుసారంగా కర్మలు మరియు ధర్మం భ్రష్టమయ్యాయి. ఆసురీ మాయావి మతం కారణంగా మనమే మన ధర్మాన్ని నిందించడం మొదలుపెడతాము, అందుకే బాబా స్వయంగా చెప్పారు - వారు ఆసురీ సంప్రదాయం వారు, ఇది దైవీ సంప్రదాయం, వీరికి నేను రాజయోగం నేర్పిస్తాను. ఇప్పుడిది కలియుగము. ఎవరైతే వచ్చి ఈ జ్ఞానాన్ని వింటారో, వారు అసురుల నుండి మారి దేవతలుగా అవుతారు. దేవతలుగా తయారయ్యేందుకే ఈ జ్ఞానం ఉంది. 5 వికారాలపై విజయం పొందడంతో దేవతలుగా అవుతారు, అంతేకానీ, అసురులకు, దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. ఇలా అని పొరపాటు చేసారు. ఎవరి వైపైతే సాక్షాత్తు భగవంతుడు ఉన్నారో, వారికి విజయం లభించిందని చూపిస్తారు, అతనికి కృష్ణుడు అనే పేరు పెట్టేసారు. వాస్తవానికి మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. తండ్రి కూర్చొని ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు కానీ ఎంత తమోప్రధానంగా ఉన్నారంటే అసలేమీ అర్థం చేసుకోవడం లేదు. తండ్రిని స్మృతి చేయలేకపోతారు. మా బుద్ధి ఎంత తమోప్రధానంగా ఉందంటే, స్మృతి నిలవడమే లేదు, అందుకే తప్పుడు పనులు చేస్తూ ఉంటాము - అని కూడా వారు అర్థం చేసుకుంటారు. మంచి-మంచి పిల్లలు కూడా అసలు స్మృతి చేయరు. లక్షణాలు బాగవ్వవు, అందుకే సేవ చేయాలనే ఉత్సాహం కలగదు. తండ్రి అంటారు - దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటినీ హతమార్చండి అనగా మర్చిపోండి. వాస్తవానికి ఇక్కడ హతమార్చడం అనే పదం ఉండదు. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఏమనంటే - మీరు నాకు చెందినవారిగా అయ్యారు కనుక వీటన్నింటినీ బుద్ధితో మర్చిపోండి, ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఎవరి విషయంలోనైనా వ్యాధి హోప్ లెస్ కేసుగా అయిపోతే, వాళ్ళ పట్ల మమకారాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారిని రామ-రామ అనమని చెప్తారు. ఈ ప్రపంచం యొక్క కేసు చాలా హోప్ లెస్ గా ఉందని తండ్రి కూడా అంటారు. ఇది సమాప్తం అవ్వాల్సిందే, అందరూ మరణిస్తారు, కనుక దీని పట్ల మమకారాన్ని తొలగించండి. వారు రామ-రామ అన్న జపం మొదలుపెడతారు. ఇది ఒక్కరి విషయం కాదు. మొత్తం ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది, అందుకే మీకు ఒకే మంత్రాన్ని ఇస్తాను - నన్నొక్కరినే స్మృతి చేయండి. రకరకాల పద్ధతులలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు పురుషోత్తమ మాసం వచ్చింది కనుక పురుషోత్తమ యుగం గురించి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. అర్థం చేయించేందుకు చాలా వివేకముండాలి. ధారణ బాగుండాలి. ఏ పాప కర్మలు చేయకూడదు. అనుమతి లేకుండా ఏదైనా వస్తువును తీసుకోవడము, తినడము - ఇది కూడా చాలా గుప్తమైన పాపము. నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి, పాపం చేసి కూడా చెప్పకపోతే, ఇక పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలైన మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. నాకు పుణ్యాత్ముల పట్ల స్నేహం ఉంది, పాపాత్ముల పట్ల విరోధం ఉంది. భక్తి మార్గంలో కూడా, మంచి కర్మలు చేస్తే మంచి ఫలం లభిస్తుందని చెప్పి దాన పుణ్యాలు మొదలైన మంచి కర్మలు చేస్తారు కదా. ఇది డ్రామా, అయినా కానీ భగవంతుడు మంచి కర్మలకు మంచి ఫలాన్ని ఇస్తారని అంటారు. నేను కేవలం ఈ పనే చేస్తూ ఉండనని తండ్రి అంటారు. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. డ్రామానుసారంగా తండ్రికి తప్పకుండా రావాల్సి ఉంటుంది.

తండ్రి అంటారు - నేను వచ్చి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఇందులో కృప మొదలైన విషయమేమీ లేదు. కొందరు ఇలా రాస్తూ ఉంటారు - బాబా, మీ కృప ఉంటే మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము అని. తండ్రి అంటారు - నేను ఎప్పుడూ కృప మొదలైనవి చూపించను, ఇవి భక్తి మార్గానికి చెందిన విషయాలు. మీరు మీపై కృప చూపించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గానికి చెందిన విషయాలు జ్ఞాన మార్గంలో ఉండవు. జ్ఞాన మార్గమంటేనే చదువు. టీచర్ ఎవరి పైనా కృప చూపించరు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు, దానిపై నడుచుకోవాలి కదా. కానీ స్వంత మతంపై నడుస్తున్న కారణంగా ఏ సేవ చేయరు. పిల్లలు పూర్తిగా పుణ్యాత్ములుగా అవ్వాలి. కొంచెం కూడా పాపం జరగకూడదు. చాలా మంది పిల్లలు వారు చేసిన పాపాలను ఎప్పుడూ చెప్పరు. అటువంటివారు ఎప్పటికీ ఉన్నత పదవిని పొందరని తండ్రి కూడా అంటారు. ఎక్కితే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు కానీ ఒకవేళ తప్పటడుగు వేసి మాయకు వశమై దిగజారితే అధఃపాతాళము తప్పదు అని అంటూ ఉంటారు. ఇది చాలా ఉన్నతమైన పదవి అని పిల్లలకు తెలుసు. పడిపోతే దేనికి పనికి రాకుండా అయిపోతారు. అశుద్ధ అహంకారము మొదటి నంబరు, తర్వాత కామం, క్రోధం, లోభం కూడా తక్కువేమీ కాదు. లోభం, మోహం కూడా సర్వ నాశనం చేసేస్తాయి. పిల్లలు మొదలైన వారి పట్ల మోహముంటే వారు గుర్తొస్తూ ఉంటారు. ఆత్మ అంటుంది - నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు, ఇతరులు ఎవరూ గుర్తు రానటువంటి పురుషార్థం చేయాలి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, ఇక తర్వాత వారసత్వాన్ని తీసుకోలేరు. ఈ ప్రపంచం పట్ల ఏం మోహం పెట్టుకోవాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ప్రపంచమంతటినీ బుద్ధితో మర్చిపోవాలి. ఇదంతా సమాప్తమవ్వాల్సిందే. ఒక్కసారిగా సమాప్తమయ్యే విధంగా తుఫాన్లు వస్తాయి. ఎక్కడో నిప్పు అంటుకుంటుంది, అప్పుడు గాలి వేగంగా వీచిందంటే ఒక్కసారిగా మొత్తం సమాప్తం చేసేస్తుంది. అరగంటలో 100-150 గుడిసెలను సమాప్తం చేసేస్తుంది. ఈ అడవికి తప్పకుండా నిప్పు అంటుకోనున్నదని మీకు తెలుసు, లేదంటే ఇంతమంది మనుష్యులు ఎలా మరణిస్తారు. ఎవరైతే మంచి పిల్లలు ఉన్నారో, లక్షణాలు కూడా బాగున్నాయో, వారు సేవ కూడా బాగా చేస్తారు. పిల్లలైన మీకు నషా ఉండాలి. అంతిమంలో కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు పూర్తి నషా ఉంటుంది, అప్పటి వరకు పురుషార్థం చేస్తూ ఉంటారు. బనారస్ లోని శివుని మందిరానికి చాలా మంది వెళ్తారు ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. అక్కడ శివుని భక్తి చాలా ఉంటుంది. బాబా అయితే చెప్తూ ఉంటారు - అక్కడకు వెళ్ళి వారికి అర్థం చేయించండి - శివ భగవానుడు ఈ లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వాన్ని ఇస్తారు, వారికి సంగమంలోనే శివుని నుండి ఈ వారసత్వం లభిస్తుంది. ఇలా అర్థం చేయిస్తే, బ్రహ్మా-సరస్వతుల గురించి కూడా అర్థమవుతుంది. వీరికి ఆ రాజ్యం ఎలా లభించింది అనేది చిత్రాలతో చాలా స్పష్టంగా అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో భక్తి మార్గం లేదు. భక్తి అనాదిగా ఉందని వారంటారు. ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం లభించింది కావున మీకు నషా ఎక్కాలి కదా. 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకు మనల్ని స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. మీరు విద్యార్థులు కదా. నిశ్చయం ఉన్నవారు - ఈ బ్రహ్మాకుమారీలు ఎవరి ద్వారానైతే విని మాకు నిశ్చయం కలిగిస్తున్నారో, ఆ వినిపించేవారు స్వయం ఎలా ఉంటారు, ఆ తండ్రిని ముందు కలుసుకోవాలని అనుకుంటారు. పూర్తి నిశ్చయం కలగనంత వరకు ముందుకు రారు. నిశ్చయమున్నవారు వెంటనే పరుగెడతారు. అటువంటి తండ్రిని మేము వెళ్ళి కలుసుకుంటాము, విడిచిపెట్టము అని అంటారు. బాబా, ఇక మేము మీ వారిగా అయిపోయాము, ఇక మేము వెళ్ళము అని అంటారు. పాట కూడా ఉంది కదా - మీరు ప్రేమించినా, తిరస్కరించినా, ఈ పిచ్చివాడు మీ ద్వారాన్ని విడిచిపెట్టరు అని. కానీ, ఇక్కడ కూర్చోబెట్టలేము. సేవకు పంపించాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. అలా రాసి ఇస్తారు కూడా, కానీ బయటకు వెళ్తూనే మాయ చక్రంలో చిక్కుకుపోతారు. మాయ అంతటి ప్రబలమైనది. మాయ విఘ్నాలు చాలా కలుగుతాయి. చిన్న దీపానికి మాయ తుఫాన్లు ఎన్ని వస్తాయి. ఈ పాటల సారాన్ని కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీ పురుషోత్తమ యుగం నడుస్తూ ఉంది. భక్తుల పురుషోత్తమ మాసం గడిచిపోయింది. తండ్రి అంటారు - పతితులను పావనంగా చేసేందుకు నేను ఈ సంగమయుగంలోనే వస్తాను. వివరణ ఎంత బాగా ఉంది.

అచ్ఛా - రోజు-రోజుకూ సేవ వృద్ధి కోసం కొత్త-కొత్త యుక్తులు వెలువడుతూ ఉంటాయి. మంచి-మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ఆలస్యం అయినా సరే, కార్యం బాగా అవుతుందని అంటారు కదా. తయారుగా ఉన్న సరుకు లభిస్తుంది, దీనితో ఎవరైనా వెంటనే అర్థం చేసుకోగలరు. మెట్ల చిత్రం చాలా బాగుంది. మేము పావనంగా ఉన్నామని ఈ సమయంలో ఎవరూ అనలేరు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని మాత్రమే అంటారు. ఈ లక్ష్మీనారాయణులు పావన ప్రపంచానికి యజమానులు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కొద్దిగా కూడా పెద్ద పాపం లేక సూక్ష్మ పాపం అనేది జరగకూడదు, దీని పట్ల చాలా-చాలా అటెన్షన్ పెట్టాలి. ఎప్పుడూ ఏ వస్తువును దాచిపెట్టి తీసుకోకూడదు. లోభం, మోహం నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి.

2. సర్వనాశనం చేసే అశుద్ధ అహంకారాన్ని త్యాగం చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు - ఈ పురుషార్థమే చేయాలి.

వరదానము:-

సూక్ష్మ సంకల్పాల బంధనం నుండి కూడా ముక్తులుగా అయి ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే నిర్బంధన భవ

ఏ పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటే, అంత ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండగలరు, అందుకే చెక్ చేసుకోండి - మనసా, వాచా మరియు కర్మణాలో సూక్ష్మంగా కూడా ఏ దారము జోడించబడి లేదు కదా! ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. మీ దేహం గుర్తొచ్చినా సరే, దేహంతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము అన్నీ ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధనుడను - ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని మాయా జాలం నుండి ముక్తులుగా చేసే సేవ చేయండి.

స్లోగన్:-

దేహీ-అభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనసు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచలంగా ఉంటారు.