05-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైనపిల్లలూ - ఇక్కడ మీదంతా గుప్తము, అందుకే మీరు ఎటువంటి ఆర్భాటము చేయకూడదు, మీ కొత్త రాజధాని యొక్క నషాలో ఉండాలి’’

ప్రశ్న:-

శ్రేష్ఠ ధర్మము మరియు దైవీ కర్మల స్థాపన కోసం పిల్లలైన మీరు ఏ శ్రమను చేస్తారు?

జవాబు:-

ఇప్పుడు మీరు 5 వికారాలను విడిచిపెట్టే శ్రమను చేస్తారు, ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేసాయి. ఈ సమయంలో అందరూ దైవీ ధర్మము మరియు కర్మలలో భ్రష్టులుగా ఉన్నారని మీకు తెలుసు. తండ్రియే శ్రీమతాన్నిచ్చి శ్రేష్ఠ ధర్మమును మరియు శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతంపై నడుచుకొని తండ్రి స్మృతితో వికారాలపై విజయం పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము..... (తుమ్హే పాకే హమ్నే.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలే బాబా అని అంటారు. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖాన్నిచ్చేవారు అనగా వీరు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ, ఆత్మలందరూ స్మృతి చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పరమపిత పరమాత్మ నుండి విశ్వ రాజ్యాధికారం లభిస్తుందని వారికి తెలియదు. తండ్రి మనకు సత్యయుగీ విశ్వరాజ్యాధికారాన్ని ఏదైతే ఇస్తారో, అది స్థిరమైనది, అఖండమైనది, అచంచలమైనది, మన ఆ రాజ్యాధికారం 21 జన్మలకు నిలిచి ఉంటుందని మీకు తెలుసు. మొత్తం విశ్వంపై మన రాజ్యం ఉంటుంది, దానిని ఎవ్వరూ లాక్కోలేరు, దోచుకోలేరు. మన రాజ్యం అచంచలమైనది ఎందుకంటే అక్కడ ఒకే ధర్మముంటుంది, ద్వైతము ఉండదు. అది అద్వైత రాజ్యము. పిల్లలు పాటను విన్నప్పుడు తమ రాజధాని యొక్క నషా కలగాలి. ఇటువంటి పాటలు ఇంట్లో ఉండాలి. మీదంతా గుప్తము మరియు గొప్ప-గొప్ప వ్యక్తులకు చాలా ఆర్భాటము ఉంటుంది. మీకు ఎటువంటి ఆర్భాటము లేదు. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారు కూడా ఎంత సాధారణంగా ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ మనుష్యులు ప్రతి ఒక్కరు అధర్మయుక్తమైన, ఛీ-ఛీ పనులే చేస్తారని పిల్లలకు తెలుసు, అందుకే వారిని వివేకహీనులు అని అంటారు. బుద్ధికి పూర్తిగా తాళము పడిపోయింది. మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు. విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ ఎంతటి వివేకహీనులుగా చేసిందంటే, ఇక వారు దేనికీ పనికిరానివారిగా అయిపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞతపాదులు మొదలైనవి చాలా చేస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ లభించదు. అలా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. రోజురోజుకూ అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. మనుష్యులు ఎంతెంతగా తమోప్రధానమైపోతారో, అంతంతగా వారి అకళ్యాణము జరగవలసిందే. ఋషులు-మునులు అని ఎవరికైతే గాయనము ఉందో, వారు పవిత్రంగా ఉండేవారు. వారు నేతి-నేతి (తెలియదు, తెలియదు) అని అనేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు కనుక శివోహమ్, తతత్వమ్, సర్వవ్యాపి, నీలో-నాలో అందరిలోనూ ఉన్నారని అంటారు. వారు కేవలం పరమాత్మ అని అంటారు. పరమపిత అని ఎప్పుడూ అనరు. పరమపితను సర్వవ్యాపి అని అనడం తప్పు అవుతుంది, అందుకే మళ్ళీ ఈశ్వరా లేక పరమాత్మ అని అంటారు. పిత అనే పదము బుద్ధిలోకి రాదు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా, నామ మాత్రముగానే అంటారు. ఒకవేళ పరమపితగా భావిస్తే, వారి బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్నిస్తారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అటువంటప్పుడు మనము నరకంలో ఎందుకు పడి ఉన్నామని, ఇప్పుడు ముక్తి-జీవన్ముక్తిని ఎలా పొందగలము అనేది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మ పతితంగా అయిపోయింది. ఆత్మ మొదట సతోప్రధానంగా, వివేకవంతంగా ఉంటుంది, తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది, వివేకహీనంగా అయిపోతుంది. ఇప్పుడు మీకు వివేకము లభించింది. బాబా మనకు ఈ స్మృతినిప్పించారు. భారతదేశము కొత్త ప్రపంచంగా ఉన్నప్పుడు మన రాజ్యముండేది. అక్కడ ఒకే మతము, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే మహారాజా మహారాణుల రాజ్యముండేది, తర్వాత ద్వాపరంలో వామ మార్గము ప్రారంభమవుతుంది, అప్పుడిక ప్రతి ఒక్కరి కర్మలపై ఆధారపడుతుంది. కర్మల అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే, వాటి ద్వారా మీరు 21 జన్మలు రాజ్యాధికారాన్ని పొందుతారని ఇప్పుడు తండ్రి అంటారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు కానీ ఈ రాజ్య వారసత్వము అనంతమైన తండ్రి ఇచ్చినటువంటిది అన్న జ్ఞానము అక్కడ ఉండదు. మళ్ళీ ద్వాపరము నుండి రావణ రాజ్యము ప్రారంభమౌతుంది, సంబంధాలు వికారీగా అవుతాయి. తర్వాత కర్మలనుసారముగా జన్మలు లభిస్తాయి. భారతదేశంలో పూజ్య రాజులు కూడా ఉండేవారు, పూజారి రాజులు కూడా ఉండేవారు. సత్యత్రేతా యుగాలలో అందరూ పూజ్యులుగా ఉంటారు. అక్కడ పూజ గాని, భక్తి గాని ఉండదు, మళ్ళీ ద్వాపర యుగంలో భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు యథా రాజా-రాణి, తథా ప్రజా పూజారులుగా, భక్తులుగా అయిపోతారు. అందరికంటే గొప్ప రాజులైన సూర్యవంశీయులు, పూజ్యులుగా ఉండేవారు, తర్వాత వారే పూజారులుగా అవుతారు.

ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు, దాని ప్రారబ్ధము 21 జన్మల వరకు ఉంటుంది. తర్వాత భక్తి మార్గము ప్రారంభమవుతుంది. దేవతల మందిరాలను నిర్మించి పూజిస్తూ ఉంటారు. ఇది కేవలం భారతదేశములోనే జరుగుతుంది. తండ్రి 84 జన్మల కథను ఏదైతే వినిపిస్తారో, అది కూడా భారతవాసీయుల కోసమే ఉంది. ఇతర ధర్మాల వారు రావడమే తర్వాత వస్తారు. ఇక వృద్ధి చెందుతూ చెందుతూ అనేకమంది అవుతారు. వెరైటీ ధర్మాలవారి ముఖ కవళికలు, ప్రతి విషయంలోనూ వేరువేరుగా ఉంటాయి. ఆచారాలు-పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి. భక్తి మార్గం కోసం సామాగ్రి కూడా కావాలి. ఎలాగైతే బీజము చిన్నదిగా ఉన్నా, వృక్షము ఎంత పెద్దదిగా ఉంటుంది. వృక్షం యొక్క ఆకులు మొదలైనవాటిని లెక్క పెట్టలేము. అదే విధంగా, భక్తి కూడా విస్తారమైపోతుంది. అనేక శాస్త్రాలను తయారుచేస్తూ ఉంటారు. ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమైపోతుందని, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండని తండ్రి పిల్లలతో అంటారు. భక్తి ప్రభావము కూడా చాలా ఉంది కదా. భక్తి ఎంత సుందరమైనది, నృత్యాలు, తమాషాలు, పాటలు మొదలైన వాటికి ఎంత ఖర్చు చేస్తారు. తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండని, మీ ఆది సనాతన ధర్మాన్ని స్మృతి చేయండని ఇప్పుడు తండ్రి అంటారు. జన్మజన్మలుగా మీరు అనేక రకాలుగా భక్తి చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మలు నివసించే స్థానాన్ని, ఆ తత్వాన్ని పరమాత్మగా భావిస్తారు, ఆ బ్రహ్మమును లేక తత్వమునే స్మృతి చేస్తారు. వాస్తవానికి సన్యాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు, వారు అడవులకు వెళ్ళి శాంతిగా ఉండేవారు. వారు బ్రహ్మములోకి వెళ్ళి లీనమవుతారని కాదు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలినట్లయితే ఆ బ్రహ్మములో లీనమవుతారని వారు భావిస్తారు. తండ్రి అంటారు - ఎవ్వరూ లీనమవ్వలేరు, ఆత్మ అవినాశీ కదా, అది ఎలా లీనమవ్వగలదు. భక్తి మార్గములో ఎంతగా తల బాదుకుంటారు, ఇంకప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని అంటారు. ఇప్పుడు రైట్ ఎవరు. మేము బ్రహ్మముతో యోగమును జోడించి బ్రహ్మములో లీనమవుతామని వారంటారు. అలానే, భగవంతుడు ఏదో ఒక రూపంలో పతితులను పావనంగా తయారుచేసేందుకు వస్తారని గృహస్థ ధర్మము వారంటారు. అంతేకానీ పై నుండి ప్రేరణ ద్వారానే నేర్పిస్తారని కాదు. టీచరు ఇంట్లో కూర్చొని ప్రేరణ ఇస్తారా! ప్రేరణ అనే పదమే లేదు. ప్రేరణ ద్వారా ఏ పనీ జరగదు. శంకరుని ప్రేరణ ద్వారా వినాశనం జరుగుతుందని అంటారు కానీ వినాశనమనేది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు ఈ మిసైల్స్ మొదలైనవి తయారుచేయవలసిందే. ఇది కేవలం మహిమగా గాయనము చేయడం జరుగుతుంది. ఎవ్వరికీ వారి పెద్దల మహిమ తెలియదు. ధర్మ స్థాపకులను కూడా గురువులని అంటారు కానీ వారు కేవలం ధర్మ స్థాపనను చేస్తారు. ఎవరైతే సద్గతిని ఇస్తారో, వారిని గురువని అంటారు. ఆ ధర్మ స్థాపకులు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు, వారి వెనుక వారి వంశావళి వస్తూ ఉంటుంది. వారెవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. అటువంటప్పుడు వారిని గురువులని ఎలా అంటారు. గురువు అయితే ఒక్కరే, వారినే సర్వుల సద్గతిదాత అని అంటారు. భగవంతుడైన తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు, ముక్తి-జీవన్ముక్తులనిస్తారు. ఎప్పుడూ ఎవ్వరూ వారిని స్మృతి చేయడం మానలేరు. పతి పట్ల ఎంత ప్రేమ ఉన్నా సరే, ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని తప్పకుండా అంటారు, ఎందుకంటే వారే సర్వుల సద్గతిదాత. ఇదంతా రచన, నేను రచయిత అయిన తండ్రిని అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అందరికీ సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రియే. సోదరుడు సోదరునికి వారసత్వమునివ్వలేరు. వారసత్వము ఎప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. అనంతమైన పిల్లలైన మీ అందరికీ అనంతమైన వారసత్వమునిస్తాను, అందుకే నన్ను - ఓ పరమపిత, క్షమించండి, దయ చూపించండి అని గుర్తు చేసుకుంటారు. ఏమీ అర్థము చేసుకోరు. భక్తి మార్గంలో అనేక రకాలుగా మహిమ చేస్తారు. వీరు కూడా డ్రామానుసారంగా తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - నేనేమీ వీరు పిలవడం వలన రాను. డ్రామా ఇలా తయారుచేయబడింది. డ్రామాలో నేను వచ్చే పాత్ర నిశ్చితమై ఉంది. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన లేదా కలియుగ వినాశనము, సత్యయుగ స్థాపన చేయవలసి ఉంటుంది. నా సమయానికి నా అంతట నేనే వస్తాను. ఈ భక్తి మార్గము యొక్క పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు భక్తి మార్గపు పాత్ర పూర్తయింది, నేను వచ్చాను. పిల్లలు కూడా అంటారు - ఇప్పుడు మేము తెలుసుకున్నాము, 5 వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నాము, బాబా, కల్పక్రితము కూడా మీరు బ్రహ్మా తనువులోనే వచ్చారు. ఈ జ్ఞానము మీకిప్పుడు లభిస్తుంది, ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. ఎక్కే కళ జ్ఞానము యొక్క ప్రారబ్ధము. సెకెండులో జీవన్ముక్తి అని అంటారు. జనకుడు సెకెండులో జీవన్ముక్తిని పొందారని అంటారు. కేవలం ఒక్క జనకుడే జీవన్ముక్తిని పొందారా? జీవన్ముక్తి అంటే ఈ రావణ రాజ్యము నుండి జీవితాన్ని ముక్తి చేస్తారు.

పిల్లలందరికీ ఎంత దుర్గతి ఏర్పడింది అనేది తండ్రికి తెలుసు. మళ్ళీ వారి సద్గతి జరగాలి. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నతమైన గతిని, ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి, తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. ఈ చక్ర రహస్యమంతా తండ్రి అర్థం చేయించారు. మీ తర్వాత వేరే ధర్మాలు కూడా వస్తూ ఉంటాయి, మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షము తమోప్రధానంగా, శిథిలమైపోయింది అని బాబా అంటారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మము యొక్క పునాది పూర్తిగా శిథిలమైపోయింది. మిగిలిన ధర్మాలన్నీ నిలిచి ఉన్నాయి. భారతదేశంలో ఒక్కరు కూడా స్వయాన్ని ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. వారు దేవతా ధర్మమువారే కానీ ఈ సమయంలో, మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారిగా ఉండేవారమని భావించరు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు, తాము పవిత్రంగా లేరని వారికి తెలుసు. అపవిత్రంగా, పతితంగా ఉన్న మేము స్వయాన్ని దేవతలమని ఎలా పిలుచుకోవాలి. డ్రామా ప్లాను అనుసారము హిందూ అని పిల్చుకోవడం కూడా ఆచారమైపోతుంది. జనాభా లెక్కలలో కూడా హిందూ ధర్మమని వ్రాసేస్తారు. గుజరాత్ వారు అయినా హిందూ గుజరాతి అని అంటారు. హిందూ ధర్మము ఎక్కడ నుండి వచ్చింది అని వారిని అడిగి చూడండి. ఎవ్వరికీ తెలియదు, కేవలం మా ధర్మాన్ని కృష్ణుడు స్థాపించారని అంటారు. ఎప్పుడు? ద్వాపరములో అంటారు. ద్వాపరము నుండే ఈ మనుష్యులు తమ ధర్మాన్ని మరచి హిందువులని పిల్చుకోవడం మొదలుపెట్టారు, అందుకే వారిని దైవీ ధర్మ భ్రష్టులని అంటారు. అక్కడ అందరూ మంచి కర్మలు చేస్తారు. ఇక్కడ అందరూ ఛీ-ఛీ కర్మలు చేస్తారు, అందుకే దేవీదేవతా ధర్మము మరియు వారి కర్మలుగా భ్రష్టముగా అయ్యాయి అని అంటారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మల స్థాపన జరుగుతుంది, అందుకే ఈ పంచ వికారాలను వదులుతూ వెళ్ళండని అంటారు. ఈ వికారాలు అర్ధకల్పము నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మలో వీటిని వదిలేయడం - ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. శ్రమ లేకుండా విశ్వ రాజ్యాధికారం లభించదు. తండ్రిని స్మృతి చేస్తేనే మీకు మీరు రాజ్యతిలకాన్ని దిద్దుకుంటారు అంటే రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత మంచి రీతిగా స్మృతిలో ఉంటారో, శ్రీమతంపై నడుస్తారో, అంతగా మీరు రాజులకే రాజులుగా అవుతారు. చదివించే టీచరు చదివించేందుకు వచ్చారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంత ప్రసిద్ధి గాంచినది. దీనిని అమర కథ, సత్యనారాయణ కథ, మూడవ నేత్రం కథ అని కూడా అంటారు. మూడింటి అర్థము కూడా తండ్రి తెలియజేస్తారు. భక్తి మార్గంలోనైతే చాలా కథలున్నాయి. పాట ఎంత బాగుందో చూడండి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా చేస్తారు, ఆ యజమానత్వాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఈ స్మృతినుంచుకోవాలి - మేము ఒకే మతము, ఒకే రాజ్యము, ఒకే ధర్మ స్థాపనకు నిమిత్తులము కనుక ఒకే మతము వారిగా అయి ఉండాలి.

2. స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు వికారాలను వదిలే శ్రమ చేయాలి. చదువు పట్ల పూర్తిగా ధ్యానమునుంచాలి.

వరదానము:-

త్రికాలదర్శి స్థితి ద్వారా మాయ దాడి నుండి సురక్షితంగా ఉండే అతీంద్రియ సుఖం యొక్క అధికారీ భవ

సంగమయుగము యొక్క విశేష వరదానం మరియు బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత - అతీంద్రియ సుఖము. ఈ అనుభవము ఇంకే యుగములోనూ కలగదు. కానీ ఈ సుఖాన్ని అనుభవం చేసేందుకు త్రికాలదర్శి స్థితి ద్వారా మాయ దాడి నుండి సురక్షితంగా ఉండండి. ఒకవేళ పదే-పదే మాయ దాడి జరుగుతూ ఉన్నట్లయితే, కావాలనుకున్నా కానీ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయలేరు. ఎవరైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారో, వారిని ఇంద్రియ సుఖాలు ఆకర్షించలేవు, నాలెడ్జ్ ఫుల్ గా ఉన్న కారణంగా దాని ఎదురుగా ఇంద్రియ సుఖాలు తుచ్ఛమైనవిగా కనిపిస్తాయి.

స్లోగన్:-

కర్మణా సేవ మరియు మనసా సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే శక్తిశాలీ వాయుమండలాన్ని తయారుచేయగలరు.