05-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - భోళానాథుడైన అత్యంత ప్రియమైన తండ్రి మీ సమ్ముఖంలో కూర్చున్నారు, మీరు ప్రేమతో స్మృతి చేసినట్లయితే లగన్ (ప్రేమ) పెరుగుతూ ఉంటుంది, విఘ్నాలు సమాప్తమైపోతాయి”

ప్రశ్న:-

బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయం సదా గుర్తున్నట్లయితే ఎప్పుడూ వికర్మలు జరగవు?

జవాబు:-

ఏ కర్మలనైతే నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు - ఇది గుర్తున్నట్లయితే వికర్మలు జరగవు. ఒకవేళ ఎవరైనా దాచిపెట్టి పాప కర్మలను చేసినా, ధర్మరాజు నుండి దాగి ఉండలేరు, వెంటనే దానికి శిక్ష లభిస్తుంది. మున్ముందు మార్షల్ లా (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనం) ఏర్పడుతుంది. ఈ ఇంద్రసభలో పతితులెవ్వరూ దాక్కుని కూర్చోలేరు.

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు..... (భోళేనాథ్ సే నిరాలా.....)

ఓంశాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. వారి పేరే భోళానాథుడు. తండ్రి అనేవారు ఎంతో భోళాగా (అమాయకంగా) ఉంటారు, ఎంతటి కష్టాన్ని అయినా సహించి పిల్లలను చదివిస్తారు, సంభాళిస్తారు. పిల్లలు పెద్దవారైన తర్వాత అంతా వారికిచ్చి స్వయం వానప్రస్థ అవస్థలోకి వెళ్తారు. నేను నా బాధ్యతను పూర్తి చేశాను, ఇప్పుడిక పిల్లలు చూసుకుంటారని అనుకుంటారు. కనుక తండ్రి భోళాయే కదా. ఇది కూడా ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు స్వయం భోళానాథుడు. కావున హద్దు తండ్రి గురించి కూడా వారెంత భోళా అయిన వారని అర్థం చేయిస్తారు. వారు హద్దులో భోళాతనము (అమాయకత్వం) కలవారు. వీరు అనంతమైన భోళానాథ తండ్రి. పరంధామం నుండి పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి వస్తారు, అందుకే మనుష్యులు, పాత పతిత శరీరంలోకి రావడమనేది ఎలా జరుగుతుందని అనుకుంటారు. అర్థం చేసుకోని కారణంగా పావన శరీరం కల కృష్ణుని పేరును రాసేశారు. ఇదే గీత, ఇవే వేదాలు, శాస్త్రాలు, మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. శివబాబా ఎంత భోళానో చూడండి. వారు వచ్చినప్పుడు, తండ్రి ఇక్కడే కూర్చుని ఉన్నారు అనే అనుభూతిని కలిగిస్తారు. ఈ సాకార బాబా కూడా భోళానే కదా. వారికి ఎటువంటి కండువా లేదు, ఎటువంటి తిలకం మొదలైనవి లేవు కానీ సాధారణంగా ఉన్న ఈ బాబా, బాబాయే. ఇంతటి నాలెడ్జ్ ను అంతా శివబాబాయే ఇస్తారని, ఇతరులెవ్వరికీ ఇవ్వగలిగే శక్తి లేదని పిల్లలకు తెలుసు. రోజు రోజుకు పిల్లలకు లగన్ (ప్రేమ) పెరుగుతూ ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ప్రేమ పెరుగుతుంది. అత్యంత ప్రియమైనవారు తండ్రి కదా. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, భక్తి మార్గంలో కూడా మీరు వారిని అత్యంత ప్రియమైనవారిగా భావించేవారు. బాబా, మీరు వచ్చినట్లయితే, అందరి పట్ల ఉన్న ప్రేమను వదిలి, ఒక్క తండ్రితోనే ప్రేమను పెట్టుకుంటాము అని అనేవారు. ఇది మీకిప్పుడు తెలుసు కానీ మాయ అంతగా ప్రేమించనివ్వదు. మీరు మాయను వదిలి తండ్రిని స్మృతి చేయడమనేది మాయకు ఇష్టం ఉండదు. వీరు దేహాభిమానులుగా అయి నన్ను ప్రేమించాలి అని మాయ కోరుకుంటుంది. మాయ ఇదే కోరుకుంటుంది, అందుకే ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. మీరు విఘ్నాలను దాటేయాలి. పిల్లలు ఎంతోకొంత శ్రమనైతే చేయాలి కదా. పురుషార్థంతోనే మీరు మీ ప్రారబ్ధాన్ని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థం చేయాలి అన్నది పిల్లలకు తెలుసు. ఒకటేమో - వికారాలను దానం చేయాలి, రెండవది - తండ్రి నుండి లభిస్తున్న అవినాశీ జ్ఞాన రత్నాల ధనాన్ని దానం చేయాలి. ఈ అవినాశీ ధనంతోనే మీరు ఇంతటి ధనవంతులుగా అవుతారు. నాలెడ్జ్ సంపాదనకు ఆధారము. వారిది శాస్త్రాల ఫిలాసఫీ, ఇది స్పిరిచ్యుల్ నాలెడ్జ్. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని కూడా చాలా సంపాదిస్తారు. ఒక గదిలో గ్రంథ్ మొదలైనవి పెట్టుకుని, కొంచెం వినిపించినా చాలు, సంపాదన జరుగుతుంది. అది యథార్థమైన జ్ఞానమేమీ కాదు. యథార్థమైన జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఎవరికైనా ఈ ఆత్మిక నాలెడ్జ్ లభించనంతవరకు, ఆ శాస్త్రాల ఫిలాసఫీయే బుద్ధిలో ఉంటుంది. మీ మాట వినరు. మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పిల్లలు ఈ ఆత్మిక నాలెడ్జ్ ను, ఆత్మిక తండ్రి నుండి తీసుకున్నారు అనేది 100 శాతము వాస్తవము. నాలెడ్జ్ సంపాదనకు ఆధారము. చాలా ధనం లభిస్తుంది. యోగం ఆరోగ్యానికి ఆధారము అనగా నిరోగీ శరీరం లభిస్తుంది, జ్ఞానంతో ధనం లభిస్తుంది - ఈ రెండూ ముఖ్యమైన సబ్జెక్టులు. అయితే, వీటిని కొంతమంది మంచి రీతిగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు కావున ధనం కూడా నంబరువారుగా తక్కువగా లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత పదవిని పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, అప్పుడిక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమవుతుంది. స్కూల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇది అనంతమైన నాలెడ్జ్, దీనితో నావ తీరానికి చేరుతుంది. ఆ నాలెడ్జ్ లో బ్యారిస్టర్, డాక్టర్, ఇంజనీర్ అవ్వడానికి చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకే చదువు ఉంటుంది. యోగం మరియు జ్ఞానంతో సదా ఆరోగ్యంగా, సంపన్నంగా అవుతారు, రాకుమారులుగా అయిపోతారు. అక్కడ స్వర్గంలో బ్యారిస్టరు, జడ్జ్ మొదలైన వారెవరూ ఉండరు. అక్కడ ధర్మరాజు అవసరం కూడా ఉండదు. గర్భ జైలు శిక్షలు ఉండవు, ధర్మరాజుపురి శిక్షలు ఉండవు. గర్భ మహల్ లో చాలా సుఖంగా ఉంటారు. ఇక్కడైతే గర్భ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇకపోతే శాస్త్రాల్లోని సంస్కృతం శ్లోకాలు మొదలైనవాటిని మనుష్యులు తయారుచేసారు. సత్యయుగంలో ఏ భాష ఉంటుందని అడుగుతారు. దేవతల భాష ఏదైతే ఉంటుందో, అదే నడుస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. అక్కడ ఉండే భాష, ఇంకెక్కడా ఉండజాలదు. అక్కడ సంస్కృత భాష ఉండడమనేది జరగదు. దేవతల భాష మరియు పతిత మనుష్యుల భాష ఒక్కటే ఉండదు. అక్కడ ఏ భాష ఉంటుందో, అదే నడుస్తుంది. దీని గురించి అడగవలసిన అవసరం లేదు. ముందు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. కల్పక్రితం ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. ముందు వారసత్వాన్ని తీసుకోండి, వేరే విషయాలేవీ అడగకండి. అచ్ఛా, 84 జన్మలు కాకపోతే, 80 లేక 82 జన్మలు ఉండచ్చు, ఈ విషయాలను మీరు వదిలేయండి. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. స్వర్గ రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుంది కదా. మీరు అనేక సార్లు స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకున్నారు. పై నుండి దిగవలసి ఉంటుంది కూడా. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ సుఖ సాగరులుగా అవుతారు. మీరు పురుషార్థీలు. బాబా అయితే కంప్లీట్ (సంపూర్ణులు). తండ్రిలో ఏ నాలెడ్జ్ అయితే ఉందో, అది పిల్లలలో ఉంది కానీ మిమ్మల్ని సాగరమని అనరు. సాగరుడు ఒక్కరే ఉంటారు, కేవలం అనేక పేర్లను పెట్టేసారు. ఇకపోతే మీరు జ్ఞానసాగరుడి నుండి వెలువడిన నదులు. మీరే మానస సరోవరాలు, నదులు. నదులకు పేర్లు కూడా ఉంటాయి. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తాలో నది మరియు సాగరముల సంగమం ఉంది. దాని పేరు డైమండ్ హార్బర్. మీరు బ్రహ్మా ముఖ వంశావళి, మీరు వజ్రం వలె అవుతారు. చాలా భారీ మేళా ఏర్పాటు అవుతుంది. బాబా ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి పిల్లలను కలుస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎంతైనా బాబా, మన్మనాభవ అని అంటారు. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. వారు అత్యంత ప్రియమైనవారు, సర్వ సంబంధాల స్యాక్రిన్. అవన్నీ వికారీ సంబంధాలు, వారి నుండి దుఃఖం లభిస్తుంది. బాబా మీకు అన్నింటికీ రిటర్న్ ఇచ్చేస్తారు. సర్వ సంబంధాల ప్రేమనిస్తారు, ఎంత సుఖాన్నిస్తారు. ఇతరులెవ్వరూ ఇంతటి సుఖాన్నివ్వలేరు. ఎవరైనా ఇచ్చినా కూడా అల్పకాలానికే ఇస్తారు. దానినే సన్యాసులు కాకిరెట్ట సమానమైన సుఖమని అంటారు. దుఃఖధామంలో తప్పకుండా దుఃఖమే ఉంటుంది. మనం ఈ పాత్రను అనేక సార్లు అభినయించామని పిల్లలైన మీకు తెలుసు. కానీ మేము ఉన్నతమైన పదవిని ఎలా పొందాలి అనే చింత ఉండాలి. మేము అక్కడ ఫెయిల్ అవ్వకూడదు అని చాలా పురుషార్థం చేయాలి. మంచి నంబరులో పాస్ అయినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు మరియు సంతోషం కూడా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండలేరు, యోగంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది గోపికలు అసలు కలవలేదు. తండ్రిని కలుసుకునేందుకు తపిస్తారు. సాధు సన్యాసుల వద్ద తపించే విషయం ఉండదు. ఇక్కడికైతే శివబాబాను కలుసుకునేందుకు వస్తారు. ఇది అద్భుతమైన విషయం కదా. శివబాబా, మేము మీ పిల్లలము అని ఇంట్లో కూర్చుని స్మృతి చేస్తారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది. మేము శివబాబా నుండి కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రే, కల్పం తర్వాత వచ్చి ఉన్నారు కనుక వారిని చూడకుండా ఉండలేరు. బాబా వచ్చారని ఆత్మకు తెలుసు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ ఏమీ తెలియదు. శివబాబా వచ్చి చదివిస్తున్నారనేది ఏమీ తెలియదు. శివజయంతిని నామమాత్రంగా జరుపుకుంటారు. శెలవు కూడా ఇవ్వరు. ఎవరైతే వారసత్వాన్నిచ్చారో, వారికి ఎటువంటి మహత్వాన్ని ఇవ్వడం లేదు మరియు ఎవరికైతే వారసత్వాన్నిచ్చారో (కృష్ణుడికి) వారి పేరును ప్రఖ్యాతం చేశారు. వారు వచ్చి విశేషంగా భారత్ ను స్వర్గంగా తయారుచేశారు. మిగిలినవారందరికీ ముక్తినిస్తారు. అందరూ ముక్తిని కోరుకుంటారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మాయ బంధనం నుండి విముక్తులుగా చేస్తారు. తండ్రిని సర్వుల సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి అయితే నంబరువారు పురుషార్థానుసారంగా అందరికీ లభిస్తుంది. ఇది పతిత ప్రపంచము, దుఃఖధామము అని తండ్రి అంటారు. సత్యయుగంలో మీకు ఎంత సుఖం లభిస్తుంది. దానిని బహిష్త్ అని అంటారు. అల్లా బహిష్త్ ను ఎందుకు రచించారు. కేవలం ముసల్మానుల కోసమే రచించారా? తమ తమ భాషల్లో కొంతమంది స్వర్గమని అంటారు, కొంతమంది బహిష్త్ అని అంటారు. హెవెన్ లో కేవలం భారత్ యే ఉంటుందని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారంగా కూర్చున్నాయి. నేను అల్లా గార్డెన్ లోకి వెళ్ళాను అని ఒక ముస్లిమ్ కూడా అనేవారు. ఇటువంటి సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఇదంతా డ్రామాలో ముందే రచింపబడి ఉంది. డ్రామాలో ఏదైతే జరుగుతుందో, ఒక సెకెండు గడవడమైనా సరే, అది కల్పక్రితం కూడా జరిగిందని అంటారు. రేపు ఏమి జరగనున్నదో తెలియదు. డ్రామాపై నిశ్చయముండాలి, అప్పుడు ఏ విషయంలోనూ చింత ఉండదు. మనకైతే బాబా ఆజ్ఞను ఇచ్చారు - నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు మీ వారసత్వాన్ని స్మృతి చేయండి. అందరూ సమాప్తమవ్వాల్సిందే. ఒకరి కోసం ఒకరు ఏడ్వలేరు కూడా. మృత్యువు వస్తుంది మరియు వెళ్ళిపోతారు, ఇక ఏడ్చేందుకు సమయం ఉండదు. శబ్దం కూడా రాదు. ఈ రోజుల్లోనైతే మనుష్యులు బూడిదను తీసుకొని కూడా ఎంతగా తిరుగుతారు. దాని పట్ల భావన ఉంటుంది. ఇదంతా సమయాన్ని వృథా చేసుకోవడము..... దీనితో ఏమి ఉపయోగం ఉంటుంది. మట్టి, మట్టిలో కలిసిపోతుంది. దీనితో భారత్ పవిత్రంగా అయిపోతుందా ఏమిటి. పతిత ప్రపంచంలో ఏ పని చేసినా, అది పతితంగానే చేస్తుంది. దాన-పుణ్యాలు మొదలైనవి కూడా చేస్తూ వచ్చారు కానీ భారత్ ఏమైనా పావనంగా అయ్యిందా. మెట్లు దిగాల్సిందే. సత్యయుగంలో సూర్యవంశీయులుగా అవుతారు, తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది, నెమ్మది-నెమ్మదిగా దిగుతారు. యజ్ఞ తపాదులు మొదలైనవి ఎన్ని చేసినా కానీ మరుసటి జన్మలో అల్పకాలిక ఫలం లభిస్తుంది. ఎవరైనా చెడు కర్మలు చేస్తే వారికి దాని రిటర్న్ కూడా లభిస్తుంది. పిల్లలను చదివించేందుకు వచ్చారని అనంతమైన తండ్రికి తెలుసు. తనువు కూడా సాధారణమైనది తీసుకున్నారు. తిలకం మొదలైనవేవీ పెట్టే అవసరం లేదు. భక్తులు పెద్ద-పెద్ద తిలకాలను పెడతారు కానీ ఎంత మోసం చేస్తారు. నేను సాధారణ తనువులోకి వస్తాను, వచ్చి పిల్లలను చదివిస్తాను అని బాబా అన్నారు. వానప్రస్థ అవస్థలో ఉన్నారు. కృష్ణుని పేరు ఎందుకు వేసారు. ఇక్కడ జడ్జ్ చేసే (నిర్ణయించే) బుద్ధి కూడా లేదు. ఇప్పుడు తండ్రి రైట్-రాంగ్ లను జడ్జ్ చేసే బుద్ధినిచ్చారు.

తండ్రి అంటారు - మీరు యజ్ఞ-తపాదులను, దాన-పుణ్యాలను చేస్తూ, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఆ శాస్త్రాల్లో ఏమైనా ఉందా. మీకు రాజయోగాన్ని నేర్పించి, విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చింది నేనా లేక కృష్ణుడా, జడ్జ్ చెయ్యండి. బాబా, మీరే వినిపించారు అని అంటారు. కృష్ణుడు చిన్న రాకుమారుడు, అతను ఎలా వినిపిస్తారు! బాబా, మీ రాజయోగం ద్వారానే మేము ఇలా తయారవుతామని అంటారు. తండ్రి అంటారు - శరీరంపై భరోసా లేదు, చాలా పురుషార్థం చేయాలి. ఫలానావారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారని బాబాకు సమాచారాన్ని వినిపిస్తారు. నేను అంటాను - వారికి అసలు నిశ్చయం లేదు, ఎవరినైతే ఎంతో ప్రేమించామో వారు ఈ రోజు లేరు. తండ్రి అయితే అందరితో ప్రేమగా వ్వవహరిస్తారు. నేను ఎటువంటి కర్మను చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. చాలామంది వికారాల్లోకి వెళ్ళి, దాచిపెట్టి వచ్చి కూర్చుంటారు. బాబా అయితే వెంటనే సందేశీలకు తెలుపుతారు. ఇటువంటి కర్మలు చేసేవారు చాలా నాజూకుగా అయిపోతూ ఉంటారు, మున్ముందు నడవలేరు. అంతిమం యొక్క నాజూకు సమయంలో, ఎవరైనా ఏదైనా చేస్తే, ఒక్కసారిగా మార్షల్ లా ను (కఠినమైన నియమాలతో కూడిన సైనిక శాసనాన్ని) అమలు పరుస్తారు. బాబా ఏమేమి చేస్తారు అనేది మున్ముందు మీరు చాలా చూస్తారు. బాబా శిక్షలు ఇవ్వరు, ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారు. జ్ఞానంలో ప్రేరణ విషయం ఉండదు. మనుష్యులందరూ భగవంతుడిని, ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. ఆత్మలన్నీ ఇంద్రియాల ద్వారా పిలుస్తాయి. తండ్రి జ్ఞాన సాగరుడు. వారి వద్ద చాలా వెరైటీ సామాగ్రి ఉంది. అటువంటి సామాగ్రి ఎవరి వద్ద లేదు. కృష్ణుని మహిమ పూర్తిగా వేరు. తండ్రి శిక్షణతో వీరు (లక్ష్మీనారాయణలు) ఎలా తయారయ్యారు. తయారుచేసేవారైతే తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ మూడవ నేత్రం తెరుచుకుంది. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, పాత్రను అభినయించాలి. ఇది స్వదర్శన చక్రం కదా. మీ పేరు స్వదర్శన చక్రధారులు, బ్రాహ్మణ కులభూషణలు, ప్రజాపిత బ్రహ్మా కుమార-కుమారీలు. లక్షలాది మంది స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఎంత జ్ఞానాన్ని చదువుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇది చాలా నాజూకు సమయం కావున ఎటువంటి తప్పుడు కర్మలను చేయకూడదు. కర్మ-అకర్మ-వికర్మల గతిని ధ్యానంలో పెట్టుకొని సదా శ్రేష్ఠ కర్మలనే చేయాలి.

2. యోగం ద్వారా సదా కోసం తమ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. ఒక్క అత్యంత ప్రియమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి నుండి లభించే అవినాశీ జ్ఞాన ధనాన్ని దానం చేయాలి.

వరదానము:-

స్వమానంలో స్థితులై విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే, దేహాభిమానం నుండి ముక్త భవ

చదువు యొక్క ముఖ్యమైన లక్ష్యము - దేహాభిమానం నుండి అతీతులై దేహీ-అభిమానులుగా అవ్వడము. ఈ దేహాభిమానం నుండి అతీతులుగా అనగా ముక్తులుగా అయ్యేందుకు విధి - సదా స్వమానంలో స్థితులై ఉండడము. సంగమయుగం మరియు భవిష్యత్తు యొక్క అనేక రకాల స్వమానాల్లో, ఏ ఒక్క స్వమానంలో స్థితులై ఉన్నా సరే, దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. ఎవరైతే స్వమానంలో స్థితులై ఉంటారో, వారికి స్వతహాగా గౌరవం ప్రాప్తిస్తుంది. సదా స్వమానంలో ఉండేవారే విశ్వమహారాజుగా అవుతారు మరియు విశ్వం వారిని గౌరవిస్తుంది.

స్లోగన్:-

సమయాన్ని బట్టి స్వయాన్ని మలచుకోవడమే రియల్ గోల్డ్ గా అవ్వడము.