05-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీరు తండ్రి శ్రీమతంపై నడుచుకున్నట్లయితే మీకు ఎవరూ దుఃఖాన్ని ఇవ్వలేరు, దుఃఖాన్ని, కష్టాన్ని ఇచ్చేది రావణుడు, అతడు మీ రాజ్యంలో ఉండడు

ప్రశ్న:-

ఈ జ్ఞాన యజ్ఞంలో పిల్లలైన మీరు దేనిని ఆహుతి చేస్తారు?

జవాబు:-

ఈ జ్ఞాన యజ్ఞంలో మీరేమీ నువ్వులను, జొన్నలను ఆహుతి చేయరు. దీనిలో దేహ సహితంగా ఏదైతే ఉందో, అదంతా మీరు ఆహుతి చేయాలి అనగా బుద్ధి ద్వారా అన్నింటినీ మర్చిపోవాలి. పవిత్రంగా ఉండే బ్రాహ్మణులే ఈ యజ్ఞం యొక్క సంభాళన చేయగలరు. ఎవరైతే పవిత్ర బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము.... (తుమ్హే పాకే హమ్నే జహాన్...)

ఓంశాంతి

పిల్లలు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రిని గుర్తించి తండ్రి అని అన్నప్పుడే పిల్లలు తప్పకుండా వారి వద్దకు వస్తారు లేదంటే రాలేరు. పిల్లలకు తెలుసు, నిరాకారుడైన అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము, వారి పేరు శివబాబా. వారికి తమదంటూ శరీరం లేదు. వారికి ఎవరూ శత్రువులుగా అవ్వలేరు. ఇక్కడ శత్రువులుగా అయితే, రాజులను హతమారుస్తారు. గాంధీని హతమార్చారు ఎందుకంటే వారికైతే శరీరముంది. తండ్రికైతే తమదంటూ శరీరం లేదు. హతమార్చాలి అని అనుకున్నా కూడా, నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో వారిని హతమార్చాలని అనుకుంటారు. ఆత్మనైతే ఎవరూ హతమార్చలేరు, గాయపర్చలేరు. ఎవరైతే నన్ను యథార్థ రీతిగా తెలుసుకుంటారో, వారికే రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. ఏ పరిస్థితిలోనూ వారి రాజ్య భాగ్యాన్ని ఎవరూ కాల్చలేరు, నీరు ముంచలేదు.

పిల్లలైన మీరు తండ్రి నుండి అవినాశీ రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. అక్కడ ఎవరూ దుఃఖాన్ని లేక కష్టాన్ని ఇవ్వలేరు. అక్కడ కష్టాన్నిచ్చేవారు ఎవరూ ఉండరు. కష్టాన్నిచ్చేవాడు రావణుడు. రావణుడికి 10 తలలు కూడా చూపిస్తారు. కేవలం రావణుడిని చూపిస్తారు, మండోదరిని చూపించరు. కేవలం రావణుడి పత్ని అని చెప్పారు. కనుక ఇక్కడ రావణ రాజ్యంలో మీకు కష్టం కలగవచ్చు. అక్కడైతే రావణుడు ఉండడు. తండ్రి అయితే నిరాకారుడు. వారిని ఎవరూ హతమార్చలేరు, గాయపర్చలేరు. మిమ్మల్ని కూడా అదే విధంగా తయారుచేస్తారు, మీకు శరీరమున్నా కూడా ఎటువంటి దుఃఖమూ ఉండదు. కనుక అటువంటి తండ్రి మతంపై నడుచుకోవాల్సి ఉంటుంది. తండ్రియే జ్ఞాన సాగరుడు, ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మా శివబాబా కుమారుడు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు అని కాదు. ఒకవేళ నాభి అని అన్నట్లయితే శివబాబా నాభి కమలము నుండి వెలువడ్డారు. మీరు కూడా శివబాబా నాభి నుండి వెలువడ్డారు. మిగతా చిత్రాలైతే అన్నీ తప్పుగా ఉన్నాయి. ఒక్క బాబా మాత్రమే ధర్మ సమ్మతమైనవారు. రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు. ఇది ఆట. ఈ ఆట గురించి మీకు మాత్రమే తెలుసు. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమయ్యింది, ఎప్పటి నుండి మనుష్యులు పడిపోతూ-పడిపోతూ పూర్తిగా పడిపోయారు, పైకి ఎవ్వరూ ఎక్కలేకపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు ఎవరైతే మార్గాన్ని చెప్తారో, వారు ఇంకా అడవిలోకి పడేసారు ఎందుకంటే వారికి - తండ్రి ఇంటికి మరియు స్వర్గానికి మార్గమే తెలియదు. గురువులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారందరూ హఠయోగులు. ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. బాబా వాటి నుండి విడిపించరు. పవిత్రంగా అవ్వండి అని అంటారు. కుమారులు మరియు కుమారీలు పవిత్రమైనవారు. ద్రౌపది పిలుస్తారు, బాబా, మమ్మల్ని రక్షించండి. మేము పవిత్రంగా అయి కృష్ణపురిలోకి వెళ్ళాలని అనుకుంటున్నాము. కన్యలు కూడా పిలుస్తారు, తల్లిదండ్రులు విసిగిస్తున్నారు, వివాహం చేసుకునే తీరాలని కొడుతున్నారు. మొదట తల్లిదండ్రులు కన్య పాదాలపై పడతారు, ఎందుకంటే స్వయాన్ని పతితులమని మరియు కన్యను పావనమైనవారని భావిస్తారు. ఓ పతితపావనా రండి - అని పిలుస్తారు కూడా. ఇప్పుడు బాబా అంటారు, కుమారీలు, పతితంగా అవ్వకండి. లేదంటే మళ్ళీ మీరు పిలవాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. బాబా పావనంగా చేయడానికే వచ్చారు. వారంటారు, స్వర్గ రాజ్య వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను, అందుకే పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. పతితులుగా అయితే పతితులుగా అయి మరణిస్తారు. స్వర్గ సుఖాలను చూడలేరు. స్వర్గంలోనైతే చాలా ఆనందం ఉంటుంది. వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. ఆ రాధే-కృష్ణులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. కావున లక్ష్మీ-నారాయణులను కూడా అంతగా ప్రేమించాలి. అచ్ఛా, కృష్ణుడిని ప్రేమిస్తారు, మరి రాధేను ఎందుకు మాయం చేసారు? కృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడిని ఊయలలో ఊపుతారు. మాతలు కృష్ణుడిని చాలా ప్రేమిస్తారు, రాధేను కాదు. మరియు బ్రహ్మా ఎవరైతే కృష్ణునిగా అవ్వనున్నారో, వారికి అంతగా పూజ జరగదు. జగదాంబకైతే చాలా పూజ చేస్తారు, వారు సరస్వతి, బ్రహ్మాకు కుమార్తె. ఆదిదేవ్ బ్రహ్మాకు కేవలం అజ్మేర్ లో మందిరముంది. ఇప్పుడు మమ్మా జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉన్నారు. మీకు తెలుసు, వారు బ్రాహ్మణి, వారేమీ స్వర్గానికి ఆదిదేవి కాదు. వారికి 8 భుజాలేమీ లేవు. మందిరంలో 8 భుజాలను చూపిస్తారు. తండ్రి అంటారు, మాయా రాజ్యంలో అసత్యమే అసత్యముంది. ఒక్క తండ్రి మాత్రమే సత్యమైనవారు, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి వారు సత్యాన్ని తెలియజేస్తారు. ఆ దైహిక బ్రాహ్మణుల ద్వారానైతే మీరు కథలు మొదలైనవి వింటూ-వింటూ ఈ స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. బాబా అంటారు, వృక్షం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు, కలియుగ అంతిమంలో కల్పం యొక్క సంగమయుగంలో నేను వస్తాను. నేను యుగ-యుగములోనూ రాను. నేను కూర్మావతారము, మత్స్యావతారము, వరాహావతారము తీసుకోను. నేను కణ-కణములో ఉండను. ఆత్మలైన మీరు కూడా కణ-కణములోకి వెళ్ళరు, అటువంటప్పుడు నేనెలా వెళ్తాను? మనుష్యుల గురించి, వారు జంతువులుగా కూడా అవుతారని అంటారు. అవైతే అనేక యోనులున్నాయి, లెక్క పెట్టలేరు కూడా. తండ్రి అంటారు - రైట్ విషయాన్ని నేనిప్పుడు మీకు అర్థం చేయిస్తాను. ఇప్పుడు నిర్ణయించండి, 84 లక్షల జన్మలు, సత్యమా లేక అసత్యమా. ఈ అసత్యపు ప్రపంచంలో సత్యం ఎక్కడి నుండి వచ్చేస్తుంది? సత్యమైతే ఒక్కటే ఉంటుంది. తండ్రే వచ్చి సత్య-అసత్యాలను నిర్ణయిస్తారు. మాయ అందరినీ అసత్యంగా చేసేసింది. తండ్రి వచ్చి అందరినీ సత్యంగా తయారుచేస్తారు. రైట్ ఎవరో ఇప్పుడు నిర్ణయించండి. మీకున్న ఇంతమంది గురువులు, సాధువులు రైటా లేదా ఒక్క తండ్రి రైటా? ఒక్క ధర్మయుక్తమైన బాబానే ధర్మయుక్తమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ నియమ విరుద్ధంగా ఏ పనీ జరగనే జరగదు. అక్కడ ఎవరికీ విషం లభించదు.

మీకు తెలుసు, భారతవాసులైన మనం వాస్తవానికి దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు పతితంగా అయిపోయాము. ఓ పతితపావనా రండి అని పిలుస్తారు కూడా. యథా రాజా-రాణి తథా ప్రజా అందరూ పతితులుగా ఉన్నారు. అందుకే లక్ష్మీ-నారాయణులు మొదలైన వారిని పూజిస్తారు కదా. భారత్ లోనే పవిత్రమైన రాజులుండేవారు. ఇప్పుడు అపవిత్రంగా ఉన్నారు. పవిత్రమైనవారిని పూజిస్తారు. ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని మహారాజా-మహారాణిగా చేస్తారు, కనుక పురుషార్థం చేయాలి. అంతేకానీ 8 భుజాల వారైతే ఎవరూ లేరు. లక్ష్మీ-నారాయణులకు కూడా 2 భుజాలే ఉన్నాయి. చిత్రాలలోనేమో నారాయణుడిని నల్లగా, లక్ష్మిని తెల్లగా చూపిస్తారు. ఇప్పుడు ఒకరు పవిత్రంగా, ఒకరు అపవిత్రంగా ఉండడం అనేది ఎలా జరుగుతుంది, కావున చిత్రాలు అసత్యం అయినట్లు కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, రాధేకృష్ణులు ఇరువురు తెల్లగా ఉండేవారు, తర్వాత కామ చితిపై కూర్చొని ఇరువురూ నల్లగా అయిపోయారు. ఒకరు తెల్లగా, మరొకరు నల్లగా అయితే ఉండరు. కృష్ణుడిని శ్యామసుందర్ అని అంటారు. రాధేను శ్యామసుందర్ అని ఎందుకు అనరు? ఈ వ్యత్యాసము ఎందుకుంచారు? జంటలో ఇరువురూ ఒకే విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చొన్నారు, మళ్ళీ మీరు కామ చితిపై ఎందుకు కూర్చొంటారు? పిల్లలతో కూడా ఈ పురుషార్థం చేయించాలి. మేము జ్ఞాన చితిపై కూర్చొన్నాము, మీరు మళ్ళీ కామ చితిపై కూర్చొనే చేష్టలు ఎందుకు చేస్తారు? ఒకవేళ పురుషుడు జ్ఞానం తీసుకొని, స్త్రీ తీసుకోకపోతే కూడా గొడవలు జరుగుతాయి. యజ్ఞంలో విఘ్నాలైతే చాలా కలుగుతాయి. ఈ జ్ఞానం ఎంత విస్తారమైనది. బాబా వచ్చినప్పటి నుండి రుద్ర యజ్ఞం ప్రారంభమయ్యింది. ఎప్పటివరకైతే మీరు బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకు దేవతలుగా అవ్వలేరు. పతిత శూద్రుల నుండి పావన దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. బ్రాహ్మణులే యజ్ఞాన్ని సంభాళిస్తారు, ఇందులో పవిత్రంగా అవ్వాలి. అంతేకానీ, ఎలాగైతే ఇతర మనుష్యులు చేస్తారో, అలా నువ్వులు, జొన్నలు మొదలైనవేవీ పోగు చేసుకుని పెట్టుకోకూడదు. ఆపదల సమయంలో యజ్ఞాలను రచిస్తారు. భగవంతుడు కూడా అటువంటి యజ్ఞాన్ని రచించారని భావిస్తారు. తండ్రి అయితే అంటారు, ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో మీరు ఆహుతి చేస్తారు. దేహ సహితంగా ఏదైతే ఉందో అదంతా ఆహుతి చేయాలి. ధనం మొదలైనవి వేయకూడదు, ఇందులో అంతటినీ స్వాహా చేయాలి. దీనిపై ఒక కథ కూడా ఉంది. దక్ష ప్రజాపిత యజ్ఞం రచించారు అని కథలో ఉంది, ఇప్పుడు ప్రజాపిత అయితే ఒక్కరే ఉన్నారు. వారు ప్రజాపిత బ్రహ్మా, మళ్ళీ ఈ దక్ష ప్రజాపిత ఎక్కడ నుండి వచ్చారు? తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా యజ్ఞాన్ని రచిస్తారు. మీరందరూ బ్రాహ్మణులు. మీకు తాతగారి యొక్క వారసత్వం లభిస్తుంది. మేము శివబాబా వద్దకు బ్రహ్మా ద్వారా వచ్చామని మీరంటారు కూడా. వీరు శివబాబా యొక్క పోస్ట్ ఆఫీసు వంటివారు. ఉత్తరం రాసినా కూడా శివబాబాకు, బ్రహ్మా ద్వారా అని వ్రాయాలి. బాబా యొక్క నివాసము వీరిలో ఉంది. ఈ బ్రాహ్మణులందరూ పావనంగా అయ్యేందుకు జ్ఞాన యోగాలు నేర్చుకుంటున్నారు. మేము పతితులము కాదు అని మీరు అనరు. మేము పతితులమే కానీ పతితపావనుడు మమ్మల్ని పావనంగా చేస్తున్నారు. ఇతర మనుష్యులెవ్వరూ పావనంగా లేరు, అందుకే గంగా స్నానము చేయడానికి వెళ్తారు. ఒక్క సద్గురువైన బాబానే మనల్ని పావనంగా చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. వారి శ్రీమతముంది, పిల్లలూ, మీరు నా ఒక్కరితోనే మీ బుద్ధియోగాన్ని జోడించండి. మీరే నిర్ణయించుకోండి, ఆ గురువుల వద్దకైనా వెళ్ళండి, నా మతంపైనైనా నడవండి. మీకైతే తండ్రి, టీచరు, సద్గురువు ఒక్కరే. అనంతమైన తండ్రి మనుష్యులందరికీ చెప్తారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇక్కడైతే ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. సన్యాసులైతే ఆత్మనే పరమాత్మ, ఆత్మ బ్రహ్మ తత్వంలో లీనమైపోతుందని అంటారు. ఇటువంటి మాటలు వింటూ-వింటూ మీరెంత దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు. ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో, వారిని భ్రష్టాచారులు, పతితులు అని అంటారు. వారు రావణ రాజ్యంలో భ్రష్టాచార కర్మలే చేస్తారు. మళ్ళీ పుష్పాలుగా చేయడానికి తండ్రికే రావాల్సి వస్తుంది. భారత్ లోనే వస్తారు. తండ్రి అంటారు, మీకు జ్ఞాన-యోగాలను నేర్పిస్తాను. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇవి మీకు నేర్పించి, స్వర్గానికి యజమానులుగా చేసాను, ఇప్పుడు మళ్ళీ చేస్తాను. కల్ప-కల్పము నేను వస్తూనే ఉంటాను. దీనికి ఆదీ లేదు, అంతమూ లేదు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రళయం యొక్క విషయమే లేదు. పిల్లలైన మీరు ఈ సమయంలో ఈ అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకుంటారు. శివబాబాను భం-భం మహాదేవ అని అంటారు. భం-భం అనగా శంఖధ్వని చేసి మా జోలెను నింపండి అని అర్థము. జ్ఞానం బుద్ధిలో ఉంటుంది కదా. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మనే చదువుకొని ఇంజనీర్, బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు ఏమవుతారు? బాబా నుండి వారసత్వం తీసుకొని లక్ష్మీ-నారాయణులుగా అవుతామని అంటారు. ఆత్మ పునర్జన్మలైతే తప్పకుండా తీసుకుంటుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు కదా. ఎవరికైనా కేవలం ఈ రెండు పదాలు చెవిలో వేయండి - నీవు ఆత్మవు, శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. ఎంత సహజము! ఒక్క తండ్రి మాత్రమే సత్యం తెలియజేస్తారు. అందరికీ సద్గతినిస్తారు. మిగిలినవారంతా అసత్యం తెలిపి దుర్గతిపాలు చేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారయ్యాయి. భారత్ యొక్క శాస్త్రం ఒక్క గీత మాత్రమే. పరంపర నుండి ఇవి కొనసాగుతూ వచ్చాయి అని అంటారు. కానీ ఎప్పటి నుండి? ఈ సృష్టి లక్షల సంవత్సరాల నాటిదని భావిస్తారు. అచ్ఛా.

పిల్లలైన మీరు బాబా కోసం ద్రాక్షపళ్ళు తీసుకొస్తారు. మీరే తీసుకొస్తారు, మీరే తింటారు, నేను తినను. నేనైతే అభోక్తను. సత్యయుగంలో కూడా మీ కోసం మహళ్ళను తయారుచేస్తాను. ఇక్కడ కూడా మిమ్మల్ని కొత్త భవనాలలో ఉంచుతాను, నేనైతే పాతదానిలోనే ఉంటాను. వీరు అద్భుతమైన బాబా. వీరు తండ్రి కూడా, అలాగే అతిథి కూడా. బొంబాయికి వెళ్తే అతిథి అని అంటారు కదా. నిజానికి వీరు ఈ ప్రపంచమంతటికీ చాలా గొప్ప అతిథి. వీరికి రావడానికి మరియు వెళ్ళడానికి సమయమేమీ పట్టదు. వీరు అద్భుతమైన అతిథి కూడా. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. కావున అతిథి అయ్యారు కదా. మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి వారసత్వాన్ని ఇవ్వడానికి, గవ్వ నుండి వజ్ర సమానంగా చేయడానికి వస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జాన రత్నాలను ధారణ చేసి శంఖధ్వని చేయాలి. అందరికీ ఈ జ్ఞాన రత్నాలను ఇవ్వాలి.

2. సత్యాన్ని మరియు అసత్యాన్ని అర్థం చేసుకొని సత్యమైన మతముపై నడుచుకోవాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మ చేయకూడదు.

వరదానము:-

బుద్ధిని బిజీగా ఉంచుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే సదా సమర్థ భవ

ఎవరైతే బుద్ధిని బిజీగా ఉంచుకునే విధిని అలవరచుకుంటారో, వారే సదా సమర్థులుగా అనగా శక్తిశాలిగా అవుతారు. వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యే సహజ సాధనమే - సదా బిజీగా ఉండడము. అందుకే ప్రతి రోజు ఉదయం, ఎలాగైతే స్థూల దినచర్యను తయారుచేసుకుంటారో, అలా మీ బుద్ధిని బిజీగా ఉంచుకోవడానికి టైమ్ టేబుల్ ను తయారుచేసుకోండి - ఈ సమయంలో, బుద్ధిలో ఈ సమర్థ సంకల్పం ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేస్తాము అని. బిజీగా ఉంటే మాయ దూరం నుండే తిరిగి వెళ్ళిపోతుంది.

స్లోగన్:-

దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోవాలంటే పరమాత్మ ప్రేమలో సదా నిమగ్నమై ఉండండి.