05-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - పతితంగా, నల్లగా తయారైన ఆత్మలను మరియు శరీరాలను తండ్రి స్మృతితో పావనంగా తయారుచేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి

ప్రశ్న:-
భగవంతుడు ఏ పిల్లలకు లభిస్తారు? తండ్రి ఏ లెక్కను తెలియజేసారు?

జవాబు:-
ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేసారో, భగవంతుడు వారికే లభిస్తారు. తండ్రి తెలియజేసిన లెక్క ఏమిటంటే - అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు కావున మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానం లభిస్తుంది. దీని ఆధారంగా మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. తండ్రి అంటారు - మీరు అర్ధకల్పం నన్ను స్మృతి చేసారు. ఇప్పుడు నేను మీకు భక్తి ఫలాన్నిచ్చేందుకు వచ్చాను.

గీతము:-
మరణించినా నీ దారిలోనే... (మర్నా తేరీ గలీమే...)

ఓంశాంతి.
పిల్లలు పాట విన్నారు. ఎవరైనా మరణిస్తే, ఒక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. మనం ఆత్మలమని మీకు తెలుసు. మరణమనేది శరీరానికి సంబంధించినది. ఒక శరీరాన్ని వదిలి, ఇంకొక తండ్రి వద్దకు వెళ్తారు. మీరు ఎంత మంది సాకార తండ్రులను పొందారు. నిజానికి మీరు నిరాకారీ తండ్రికి పిల్లలు. ఆత్మలైన మీరు పరమపిత పరమాత్ముని పిల్లలు. మీరు అక్కడి నివాసులే. దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని అంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. మీరు ఇక్కడకు వచ్చి లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు, అప్పుడిక ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యయుగంలో మీరు సుఖమయంగా ఉంటారు కావున ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. ఆ తండ్రిని సుఖంలో గుర్తు చేయరు, దుఃఖంలో గుర్తు చేస్తారు. ఆత్మయే గుర్తు చేస్తుంది. లౌకిక తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి శరీరం వైపుకు వెళ్తుంది. ఆ పారలౌకిక తండ్రిని, ఓ బాబా, అంటూ గుర్తు చేసుకుంటారు. ఇరువురూ తండ్రులే. తండ్రి అనే పదమే సరియైనది. వారు కూడా తండ్రే, వీరు కూడా తండ్రే. ఆత్మ ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి అటు వైపుకు వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని, మనల్ని తమవారిగా చేసుకున్నారని మీకు తెలుసు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని మొట్టమొదట స్వర్గంలోకి పంపించాను, మీరు చాలా షావుకార్లుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు తీసుకొని డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు. డ్రామానుసారంగా ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. మీ ఆత్మ మరియు ఈ శరీరం రూపీ వస్త్రం సతోప్రధానంగా ఉండేవి, తర్వాత ఆత్మ బంగారు యుగం నుండి వెండి యుగంలోకి వచ్చింది, అప్పుడు శరీరం కూడా వెండి యుగంలోకి వచ్చింది, తర్వాత రాగి యుగంలోకి వచ్చింది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా పతితంగా అయిపోయింది కావున శరీరం కూడా పతితంగా ఉంది. 14 క్యారట్ల బంగారాన్ని ఎవరూ ఇష్టపడరు, అది నల్లగా అవుతుంది. మీరు కూడా ఇప్పుడు నల్లగా, ఇనుప యుగం వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిన ఆత్మ మరియు శరీరం పవిత్రంగా ఎలా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. మరి ఇది ఎలా జరుగుతుంది? గంగా స్నానం చేయడం ద్వారానా? కాదు. ఓ పతిత పావనా రండి, అని పిలుస్తారు కదా. ఆత్మ ఇలా పిలిచినప్పుడు బుద్ధి పారలౌకిక తండ్రి వైపుకు వెళ్తుంది. ఓ బాబా, అని అంటారు. చూడండి, బాబా అనే ఆ పదమే ఎంత మధురమైనది. భారత్ లోనే బాబా, బాబా అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి బాబాకు చెందినవారిగా అయ్యారు. బాబా అంటారు - నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, అక్కడ మీరు కొత్త శరీరాలను ధారణ చేసారు. ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు? ఈ విషయాలు సదా మీలోపల ఉండాలి. బాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఓ బాబా, ఆత్మలైన మేము పతితులుగా అయ్యాము, ఇప్పుడు మీరు రండి, వచ్చి పావనంగా తయారుచేయండి అని అందరూ స్మృతి చేస్తారు కదా. డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది. అందుకే పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా పాత ప్రపంచం కొత్తది తయారయ్యేది ఉందన్నప్పుడు వారు వస్తారు, అంటే తప్పకుండా సంగమంలోనే వస్తారు. తండ్రి అత్యంత ప్రియమైనవారని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వీట్, స్వీటెస్ట్ (మధురమైన, అత్యంత మధురమైన)... అని అంటారు కూడా. ఇప్పుడు మధురమైనవారు ఎవరు? లౌకిక సంబంధంలో ముందు జన్మనిచ్చిన తండ్రి ఉంటారు, తర్వాత టీచరు. మీరు టీచరు ద్వారా చదువుకొని పదవిని పొందుతారు. జ్ఞానం సంపాదనకు ఆధారం అని అంటారు. జ్ఞానమంటే నాలెడ్జ్, యోగమంటే స్మృతి. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. శివబాబా, బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారని చిత్రాలలో స్పష్టంగా చూపించారు కూడా. కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు! రాజయోగాన్ని సత్యయుగం కోసమే నేర్పిస్తారు. కావున తప్పకుండా సంగమంలోనే తండ్రి నేర్పించి ఉంటారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు బాబా, వారు బ్రహ్మా ద్వారా చేయిస్తారు. బాబా చేసేవారు-చేయించేవారు కదా. మనుష్యులు త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. కానీ ఉన్నతోన్నతమైనవారు శివుడు కదా. వీరు సాకారుడు, వారు నిరాకారుడు. సృష్టి కూడా ఇదే. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనంలో సృష్టి చక్రం ఉంటుందని అనరు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలని అంటూ ఉంటారు. మధ్యలో తప్పకుండా సంగమయుగం ఉండాలి. లేదంటే కలియుగాన్ని సత్యయుగంగా ఎవరు తయారుచేస్తారు? నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసే తండ్రి సంగమంలోనే వస్తారు. ఎంత పాత ప్రపంచమో, అంత ఎక్కువ దుఃఖముంటుంది. ఆత్మ ఎంత తమోప్రధానంగా అవుతూ ఉంటుందో, అంత దుఃఖితముగా అవుతుంది. దేవతలు సతోప్రధానమైనవారు. ఇది హైయ్యెస్ట్ అథారిటీ గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్. వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. తండ్రి అంటారు - మీరు శివాలయంలో ఉండేవారు. ఇప్పుడిది వేశ్యాలయము. మీరు పావనంగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే, మేము పాపులమని అంటూ ఉంటారు. నిర్గుణుడైన నాలో ఏ గుణము లేదు అని ఆత్మ అంటుంది. ఏ దేవత మందిరానికి వెళ్ళినా, వారి ఎదురుగా ఇలానే అంటారు. కానీ వాస్తవానికి ఈ మాటలు తండ్రి ఎదురుగా చెప్పాలి, వారిని వదిలి సోదరులకు చెప్తారు. ఈ దేవతలు మీ సోదరులు కదా. సోదరుల నుండి ఏమీ లభించదు. సోదరులను పూజిస్తూ-పూజిస్తూ కిందకు దిగిపోతూ వచ్చారు. తండ్రి వచ్చి ఉన్నారని, వారి నుండి మనకు వారసత్వం లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇకపోతే, మనుష్యులకు తండ్రిని గురించి తెలియను కూడా తెలియదు. వారిని సర్వవ్యాపి అని అంటారు. కొంతమంది భగవంతుడిని అఖండ జ్యోతి తత్వమని అంటారు. కొంతమంది వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. అరే, మీరే అఖండ జ్యోతి స్వరూపుడని అంటారు, మళ్ళీ నామ రూపాలకు అతీతమైనవారని ఎలా అంటారు? తండ్రి గురించి తెలియని కారణంగానే పతితులుగా అయిపోయారు. తమోప్రధానంగా కూడా అవ్వాల్సిందే. తర్వాత, తండ్రి వచ్చినప్పుడు అందరినీ పావనంగా తయారుచేస్తారు. ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచంలో తండ్రితో పాటు ఉంటారు. తర్వాత ఇక్కడకు వచ్చి సతో, రజో, తమోల పాత్రను అభినయిస్తారు. ఆత్మలే తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి వచ్చి చెప్తారు - నేను బ్రహ్మా తనువును ఆధారంగా తీసుకుంటాను. ఇది భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథం ఉండదు. భగీరథుడు గంగను తీసుకువచ్చారని అంటారు. కానీ అలాంటిదేమీ జరగదు. వారేమి చెప్తున్నారో వారికే అర్థం కావడం లేదు.

ఇది జ్ఞాన వర్షమని పిల్లలైన మీకు అర్థం చేయించారు. దీనితో ఏం జరుగుతుంది? పతితుల నుండి పావనంగా తయారవుతారు. గంగ, యమునా అయితే సత్యయుగంలో కూడా ఉంటాయి. కృష్ణుడు యమునా నదీ తీరంలో ఆడుకునేవారని చెప్తారు. అలాంటి విషయాలేమీ జరగలేదు. వారు సత్యయుగ రాకుమారుడు. వారిని చాలా జాగ్రత్తగా పాలన చేస్తారు ఎందుకంటే పుష్పం వంటి వారు కదా. పుష్పాలు ఎంత బాగుంటాయి, సుందరంగా ఉంటాయి. అందరూ పుష్పాల నుండి సుగంధం తీసుకుంటారు. ముళ్ళ నుండి సుగంధం తీసుకోరు. ఇప్పుడిది ముళ్ళ ప్రపంచము. తండ్రి వచ్చి ముళ్ళ అడవిని పూలతోటగా తయారుచేస్తారు. అందుకే వారికి బబుల్ నాథ్ అనే పేరు కూడా పెట్టారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. అందుకే, ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే బాబా అని వారి మహిమను పాడుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి! ఇప్పుడు మనం అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మీ సంబంధం వారితోనూ ఉంది, అలాగే లౌకిక తండ్రితో కూడా ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడంతో మీరు పావనంగా తయారవుతారు. వారు మా లౌకిక తండ్రి మరియు వీరు పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గంలో కూడా ఆత్మకు - వారు మా లౌకిక తండ్రి, వీరు గాడ్ ఫాదర్ అని తెలుసు. అవినాశీ తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి ఎప్పుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. తండ్రి పతితులను పావనంగా చేయడానికే వస్తారు. కావున వారు తప్పకుండా సంగమంలోనే వస్తారు. శాస్త్రాలలోనైతే కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసి మనుష్యులను పూర్తిగా ఘోరమైన అంధకారంలో పడేసారు. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి భగవంతుడు లభిస్తారని అంటారు. కావున అందరికన్నా ఎక్కువ భక్తి చేసినవారికి, తప్పకుండా భగవంతుడు ముందు లభించాలి. తండ్రి లెక్కను కూడా తెలియజేసారు. అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు కావున మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానం లభించాలి. దీని ఆధారంగా మీరే తర్వాత కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తున్నారు. ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి అంటారు - మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేసారు, సుఖంలో ఎవరూ స్మృతి చేయరు, చివర్లో దుఃఖితులుగా అయినప్పుడు నేను వచ్చి సుఖమయంగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు చాలా పెద్ద వ్యక్తులుగా అవుతారు. ఛీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారి బంగళాలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఫర్నీచర్ అంతా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద వ్యక్తులుగా (దేవతలుగా) అవుతారు. దైవీ గుణాలు కల దేవతలుగా, స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ కోసం మహళ్ళు కూడా వజ్ర-వైఢూర్యాలతో పొదగబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నీచర్ బంగారంతో పొదగబడి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది.

ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుడిని రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తయినప్పుడు భగవంతుడు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. సత్యయుగంలో యజ్ఞం లేక భక్తి అనే మాటే ఉండదు. ఈ సమయంలోనే తండ్రి అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు, దీనికే తర్వాత మహిమ జరుగుతుంది. భక్తి సదా కొనసాగదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. తండ్రి వచ్చి పగలు తీసుకొస్తారు కావున పిల్లలకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి! తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి అత్యంత ప్రియమైనవారు కదా. వారి కంటే ప్రియమైన వస్తువేదీ ఉండదు. అర్ధకల్పం నుండి - బాబా, మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు మీ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. ఇక్కడ బాబా వద్ద ఎంతవరకని కూర్చుంటారు. నాతో పాటు పరంధామంలో మాత్రమే ఉండగలరు. ఇక్కడ ఉండలేరు. ఇక్కడ జ్ఞానాన్ని చదువుకోవాలి. జ్ఞానాన్ని చదువుకునేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. లౌడ్ స్పీకర్ ద్వారా ఎప్పుడైనా చదువుకుంటారా? అలా జరిగితే టీచరు ప్రశ్నలు ఎలా వేస్తారు? లౌడ్ స్పీకరు ద్వారా జవాబులు ఎలా చెప్పగలరు? అందుకే విద్యార్థులను కొంత-కొంతమంది చొప్పున చదివిస్తారు. కాలేజీలైతే చాలా ఉంటాయి. అందరికీ పరీక్షలు జరుగుతాయి, రిజల్టు వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి - ఇద్దరు తండ్రులున్నారని అర్థం చేయించాలి. దుఃఖంలో ఆ పారలౌకిక తండ్రినే స్మరిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా ఎదురుగా ఉంది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు వచ్చారని వారు అనుకుంటారు. కానీ అలా జరగదు. పాపం వారు తికమకలో ఉన్నారు. అలా కృష్ణ, కృష్ణ..... అని అంటూ ఉంటారు. ఇప్పుడు అత్యంత ప్రియమైనవారు శివుడు కూడా, అలాగే కృష్ణుడు కూడా. కానీ వారు నిరాకారుడు, వీరు సాకారుడు. నిరాకారీ తండ్రి సర్వాత్మలకు తండ్రి. ఇరువురూ అత్యంత ప్రియమైనవారే. కృష్ణుడు కూడా విశ్వానికి యజమాని కదా. ఎవరు ఎక్కువ ప్రియమైనవారు అనేది ఇప్పుడు మీరు జడ్జ్ చేయగలరు. శివబాబాయే మనల్ని ఆ విధంగా యోగ్యులుగా తయారుచేస్తారు కదా. కృష్ణుడేమి చేస్తారు? తండ్రియే వారిని అలా తయారుచేస్తారు కదా. కావున మహిమ కూడా తండ్రికే ఎక్కువగా జరగాలి కదా. తండ్రి అర్థం చేయించారు - మీరందరూ పార్వతులు. అమరనాథుడైన ఈ శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. మీరందరే అర్జునులు, మీరందరే ద్రౌపదులు. ఈ వికారీ ప్రపంచాన్ని రావణ రాజ్యమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. వికారాల మాటే ఉండదు. నిరాకార తండ్రి వికారీ ప్రపంచాన్ని రచిస్తారా? వికారాలలోనే దుఃఖముంది. సన్యాసులది హఠయోగము, నివృత్తి మార్గము. కర్మను సన్యసించడమనేది ఎప్పుడూ జరగదు. ఆత్మ శరీరం నుండి వేరైనప్పుడే అది సాధ్యమవుతుంది. తర్వాత గర్భ జైలులో కర్మల లెక్కాచారం మొదలవుతుంది. ఇకపోతే, కర్మ సన్యాసమని అనడం తప్పు. ఎంతోమంది హఠయోగం మొదలైనవి నేర్చుకుంటారు. గుహలలోకి వెళ్ళి కూర్చుంటారు, అగ్నిపై కూడా నడుస్తారు. వారికి రిద్ధి-సిద్ధులు కూడా చాలా ఉంటాయి. ఇంద్రజాలంతో చాలా వస్తువులు తీసి చూపిస్తారు. భగవంతుడిని కూడా ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారస్థుడు అని అంటారు. కానీ ఆ హఠయోగుల ద్వారా ఎవరికీ గతి, సద్గతి లభించదు. ఆ సత్యమైన సద్గురువు ఒక్కరే వచ్చి అందరికీ గతి, సద్గతినిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేసే అత్యంత ప్రియమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సుగంధభరితమైన పావన పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి.

2. ఈ జ్ఞానం (చదువు) సంపాదనకు ఆధారం. దీనితో మీరు 21 జన్మలకు చాలా పెద్ద వ్యక్తులు అవుతారు. అందుకే ఈ చదువును చాలా బాగా చదువుకోవాలి మరియు చదివించాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి.

వరదానము:-

బాప్ దాదాను తమ సాథీ (సహచరుడు) గా భావిస్తూ డబుల్ ఫోర్సుతో కార్యం చేసే సహజ యోగీ భవ

ఏ పని చేస్తున్నా సరే, బాప్ దాదాను తమ సహచరునిగా చేసుకోండి, అప్పుడు డబుల్ ఫోర్సుతో కార్యం జరుగుతుంది. అంతేకాక, స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో, వారి స్మృతి స్వతహాగా నిలిచి ఉంటుంది. కనుక ఈ విధంగా సహచరులుగా ఉండటంతో మరియు బుద్ధి ద్వారా నిరంతరం ఆ సత్యమైనవారి సాంగత్యం చేయడంతో సహజయోగులుగా అవుతారు, అంతేకాక శక్తిశాలి సాంగత్యం ఉన్న కారణంగా ప్రతి కార్యంలోనూ మీకు డబుల్ ఫోర్సు ఉంటుంది. తద్వారా ప్రతి కార్యంలోనూ సఫలత అనుభవమవుతుంది.

స్లోగన్:-

ఎవరైతే ఎప్పుడూ మాయ ప్రభావంలో పరవశమవ్వరో, వారు మహారథులు.