06-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు మహావీరులు, మీరు మాయా తుఫానులకు భయపడకూడదు, ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ పట్టించుకోకుండా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి”

ప్రశ్న:-

పిల్లల్లో ఏ ధైర్యము ఉన్నట్లయితే వారు చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు?

జవాబు:-

శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా అయ్యే ధైర్యము. ఎన్ని గొడవలు జరిగినా కానీ, కష్టాలు సహించవలసి వచ్చినా కానీ, పవిత్రంగా తయారయ్యేందుకు తండ్రి ఏ శ్రేష్ఠ మతమునైతే ఇచ్చారో, దానిపై నిరంతరం నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఏ విషయములోనూ భయపడకూడదు, ఏమి జరిగినా కానీ - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).

గీతము:-

భోళానాథునికన్నా అతీతమైనవారు..... (భోలేనాథ్ సే నిరాలా.....)

ఓంశాంతి. ఇది భక్తి మార్గము వారి పాట. జ్ఞాన మార్గములో పాటలు మొదలైనవాటి అవసరమేమీ ఉండదు ఎందుకంటే తండ్రి నుండి మనకు అనంతమైన వారసత్వము లభించనున్నదని గాయనము చేయబడింది. భక్తి మార్గము యొక్క ఆచారాలు-పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అవి ఇందులోకి రాలేవు. పిల్లలు ఇతరులకు వినిపించేందుకు కవితలు మొదలైనవి తయారు చేస్తారు. మీరు అర్థం చేయించనంత వరకు వాటి అర్థము కూడా ఎవరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కనుక సంతోషపు పాదరసం ఎక్కాలి. తండ్రి 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా వినిపించారు. ఇప్పుడు మేము స్వదర్శన చక్రధారులుగా అయ్యామని సంతోషముండాలి. తండ్రి నుండి విష్ణుపురి యొక్క వారసత్వం తీసుకుంటున్నాము. నిశ్చయబుద్ధి విజయంతి. ఎవరికైతే నిశ్చయముంటుందో, వారు సత్యయుగములోకైతే వెళ్తారు. కనుక పిల్లలకు సదా సంతోషముండాలి - ఫాలో ఫాదర్. నిరాకార శివబాబా వీరిలో ప్రవేశించినప్పటి నుండి పెద్ద గొడవలు జరిగాయని పిల్లలకు తెలుసు. పవిత్రత విషయంలో చాలా గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దవారైతే, త్వరగా వివాహము చేసుకోండి, వివాహము చేసుకోకపోతే ఎలా నడుస్తుంది అని అంటారు. మనుష్యులు గీతను చదువుతారు కానీ దాని ద్వారా ఏమీ అర్థము చేసుకోరు. అందరికన్నా ఎక్కువగా బాబాకు అభ్యాసముండేది. ఒక్క రోజు కూడా గీతను చదవడం మిస్ చేసేవారు కాదు. గీతా భగవంతుడు శివుడని తెలిసిన తర్వాత, నేను విశ్వానికి యజమానిగా అవుతానని నషా కలిగింది. ఇది శివ భగవానువాచ. తర్వాత పవిత్రత విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. ఇందులో ధైర్యము కావాలి కదా. మీరే మహావీరులు-మహావీరనీలు. ఒక్కరిని తప్ప ఇతరులెవ్వరినీ లెక్క చేయవలసిన అవసరము లేదు. పురుషుడు రచయిత, స్వయంగా రచయిత పావనంగా అయినట్లయితే రచనను కూడా పావనంగా చేస్తారు. కేవలం ఈ విషయము గురించే చాలామందితో గొడవలు అయ్యాయి. గొప్ప-గొప్ప ఇళ్ళ నుండి బయటకు వచ్చేశారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఎవరి భాగ్యములోనైతే లేదో, వారు ఎలా అర్థము చేసుకుంటారు. పవిత్రంగా ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పండి. ఇంతటి ధైర్యము కావాలి కదా. బాబా ఎదురుగా ఎన్ని గొడవలు జరిగాయి. బాబాను ఎప్పుడైనా చింతించడం చూశారా? అమెరికా వరకు వార్తాపత్రికలలో ప్రచురించారు. నథింగ్ న్యూ. ఇది కల్పక్రితము వలె జరుగుతుంది, ఇందులో భయపడే విషయమేముంది. మనమైతే మన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మన క్రియేషన్ (రచన) ను రక్షించాలి. ఈ సమయంలో మొత్తం క్రియేషన్ (రచన) అంతా పతితంగా ఉందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పావనంగా చేయాలి. ఓ పతితపావనా, ముక్తిదాతా రండి అని అందరూ తండ్రినే పిలుస్తారు కనుక వారికే దయ కలుగుతుంది. వారు దయా హృదయుడు కదా. కనుక తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఏ విషయములోనూ భయపడకండి. భయపడడం వలన అంతటి ఉన్నతమైన పదవిని పొందలేరు. మాతల పైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది వస్త్ర అపహరణ చేసారు అనేది దీనికే గుర్తు. తండ్రి 21 జన్మలకు నగ్నంగా అవ్వడం నుండి రక్షిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. ఈ సృష్టి పతితంగా, తమోప్రధానంగా, పాతదిగా అవ్వాల్సిందే. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్ళీ పాతదిగా తప్పకుండా అవ్వనున్నది. పాత ఇంటిని వదిలిపెట్టాల్సిందే. కొత్త ప్రపంచము బంగారు యుగము, పాత ప్రపంచము ఇనుప యుగము..... ప్రపంచము సదా కొత్తగా ఉండదు. ఇది సృష్టి చక్రమని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతల రాజ్యము మళ్ళీ స్థాపనవుతుంది. నేను మీకు మళ్ళీ గీతా జ్ఞానాన్ని వినిపిస్తాను అని తండ్రి కూడా అంటారు. ఇక్కడ రావణ రాజ్యములో దుఃఖముంది. రామ రాజ్యమని దేనినంటారు అనేది కూడా ఎవ్వరు అర్థం చేసుకోరు. నేను స్వర్గాన్ని అంటే రామ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యము తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలోనూ ఉంది. 21 జన్మలు మనము సత్యయుగంలో ఉంటాము, దానిని 21 తరాలు అని అంటారు అంటే వృద్ధ అవస్థ వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేస్తారు. అకాలమృత్యువు ఎప్పుడూ జరగదు. ఇప్పుడు మీరు త్రికాలదర్శుల వలె అయ్యారు. శివబాబా ఎవరు అనేది మీకు తెలుసు. శివుని మందిరాలను కూడా ఎన్నో నిర్మించారు. మూర్తినైతే ఇంట్లో కూడా పెట్టుకోగలరు కదా. కానీ భక్తి మార్గము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. కృష్ణుని మూర్తిని లేదా శివుని మూర్తిని ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు. వస్తువు అయితే ఒక్కటే. మరి ఇంత దూర-దూరాలకు ఎందుకు వెళ్తారు. వారి వద్దకు వెళ్తే కృష్ణపురి యొక్క వారసత్వం ఏమైనా లభిస్తుందా. జన్మ జన్మలుగా మనం భక్తి చేస్తూ వచ్చామని మీకిప్పుడు తెలుసు. రావణ రాజ్యం యొక్క ఆర్భాటము కూడా ఎంతగా ఉందో చూడండి. ఇది చివరి సమయంలో ఉండే ఆర్భాటము. రామ రాజ్యం సత్యయుగంలో ఉండేది. అక్కడ ఈ విమానాలు మొదలైనవన్నీ ఉండేవి, తర్వాత అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ ఈ సమయంలో ఇవన్నీ వెలువడ్డాయి. ఇప్పుడు వారు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, నేర్చుకునేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. అక్కడకు వచ్చి మళ్ళీ విమానాలను తయారు చేస్తారు. ఇవి భవిష్యత్తులో మీకు సుఖమునిచ్చే వస్తువులు. ఈ సైన్సు మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సైన్సు దుఃఖము కోసమే ఉంది, తర్వాత అక్కడ సుఖము కోసం ఉంటుంది. ఇప్పుడు స్థాపన జరుగుతుంది. తండ్రి కొత్త ప్రపంచం కోసం రాజధానిని స్థాపన చేస్తున్నారు కనుక పిల్లలైన మీరు మహావీరులుగా అవ్వాలి. భగవంతుడు వచ్చేసారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, ఇందులో భయపడే విషయమేమీ లేదు. మహా అయితే తిడతారు. వీరిని కూడా చాలా నిందించారు. అందుకే కృష్ణుడు నిందలు పడినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు కృష్ణుడు అయితే నిందలు పడరు. కలియుగములోనే తిట్లు తింటారు. ఇప్పుడు మీకు ఏ రూపమైతే ఉందో, అది మళ్ళీ కల్పము తర్వాత ఈ సమయంలోనే ఉంటుంది. ఈ రూపము మధ్యలో ఎప్పుడూ ఉండదు. జన్మ జన్మకు ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి, ఈ డ్రామా నిశ్చితమై ఉంది. 84 జన్మలలో ఏ ముఖ కవళికలతో జన్మ తీసుకున్నారో, మళ్ళీ అలాగే జన్మ తీసుకుంటారు. ఈ ముఖ కవళికలు మారి మరుసటి జన్మలో లక్ష్మీనారాయణుల ముఖ కవళికలు ఏర్పడతాయని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. ఇది కొత్త విషయము. బాబా కూడా కొత్తవారే, విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు ఎవ్వరికీ త్వరగా అర్థము కావు. భాగ్యంలో ఉంటే కొద్దిగానైనా అర్థము చేసుకుంటారు. ఇకపోతే, ఎవరైతే ఎన్ని తుఫానులు వచ్చినా సరే కదలరో, వారిని మహావీరులు అంటారు. ఇప్పుడింకా ఆ అవస్థ లేదు. కానీ తప్పకుండా ఏర్పడుతుంది. మహావీరులు ఏ తుఫానులకూ భయపడరు. ఆ అవస్థ చివర్లో ఏర్పడుతుంది, అందుకే అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలనే అడగండి అని గాయనముంది. పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. కల్పక్రితము వలె నరకం యొక్క వినాశనం జరగాల్సిందే. సత్యయుగంలోనైతే ఒకే ధర్మముంటుంది. ఏకత్వము, ఒకే ధర్మము ఉండాలని కూడా కోరుకుంటారు. రామ రాజ్యము, రావణ రాజ్యము వేర్వేరు అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రిపై పూర్తిగా నిశ్చయమున్నట్లయితే శ్రీమతంపై నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి నాడిని చూడడం జరుగుతుంది. దాని అనుసారంగా సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. బాబా కూడా పిల్లలతో అన్నారు - ఒకవేళ వివాహము చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకోండి. చాలా మంది మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూర్చున్నారు, వాళ్ళు వివాహము చేయించేస్తారు. ఆ సమయంలో వివాహం చేయించేందుకు ఎవరో ఒకరు వెలువడుతారు. కావున ప్రతి ఒక్కరి నాడిని చూడడం జరుగుతుంది. బాబా, ఇదీ పరిస్థితి, మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము, మా సంబంధీకులు మమ్మల్ని ఇంటి నుండి పంపించేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని పిల్లలు అడుగుతారు. అరే, ఇది కూడా అడగుతారా, పవిత్రంగా ఉండాలి, ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి వివాహం చేసుకోండి. అచ్ఛా, ఎవరిదైనా నిశ్చితార్థము జరిగిందనుకోండి, అవతలి వారిని ఒప్పించాలి, ఫర్వాలేదు. కంకణము కట్టే సమయంలో ఈ పతి నీకు గురువు అని చెప్తారు. అచ్ఛా, నేను నీకు గురువును, ఈశ్వరుడిని అని నీవు ఒప్పుకుంటున్నావా, అయితే రాయు అని చెప్పి మీరు ఆమె చేత వ్రాయించండి. అచ్చా, ఇప్పుడు పవిత్రంగా ఉండాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పండి. ధైర్యముండాలి కదా. గమ్యము చాలా ఉన్నతమైనది. ప్రాప్తి చాలా గొప్పది. ప్రాప్తి గురించి తెలియనప్పుడే కామము యొక్క అగ్ని అంటుకుంటుంది. తండ్రి అంటారు - ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతున్నప్పుడు ఒక్క జన్మ పవిత్రంగా ఉండడమనేది ఏమంత పెద్ద విషయము. నేను నీ పతిని, ఈశ్వరుడిని, నా ఆజ్ఞపై పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పండి. బాబా యుక్తులను తెలియజేస్తారు. నీ పతియే ఈశ్వరుడు, వారి ఆజ్ఞపైనే నడుచుకోవాలి అని స్త్రీకి చెప్తారు - ఇది భారతదేశంలోని నియమము. పతి పాదాలను వత్తాలి ఎందుకంటే లక్ష్మి కూడా నారాయణుని పాదాలని వత్తారని భావిస్తారు కదా. ఈ అలవాటు ఎక్కడ నుండి వెలువడింది. భక్తి మార్గపు చిత్రాల నుండి వెలువడింది. సత్యయుగంలోనైతే ఇటువంటి విషయాలుండవు. లక్ష్మి, నారాయణుడి పాదాలను వత్తడానికి వారు ఎప్పుడైనా అలసిపోతారా. అలసిపోయే విషయమే ఉండదు. ఇది దుఃఖపు విషయం అయిపోతుంది. అక్కడ దుఃఖము, నొప్పి ఎక్కడ నుండి వస్తాయి. అప్పుడు బాబా, ఫోటో నుండి లక్ష్మి చిత్రాన్నే తొలగించేసారు. నషా అయితే ఎక్కుతుంది కదా. బాల్యం నుండే వైరాగ్యముండేది, అందుకే చాలా భక్తి చేసేవారు. కావున బాబా చాలా యుక్తులను తెలియజేస్తారు. మనం ఒక్క తండ్రికి పిల్లలము కనుక పరస్పరంలో సోదరీ-సోదరులము అయ్యామని మీకు తెలుసు. తాతగారి నుండి వారసత్వం తీసుకుంటాము. హే పతిత పావనా, సీతలందరి రామా అని తండ్రిని పతిత ప్రపంచములోనే పిలుస్తారు. తండ్రిని సత్యము అని అంటారు, వారు సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. వారే మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల సత్యమైన జ్ఞానాన్ని మీకు ఇస్తారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా జ్ఞాన సాగరంగా తయారవుతుంది.

మేము బాబా శ్రీమతంపై నడవాలని మధురమైన పిల్లలు ధైర్యమును ఉంచాలి. అనంతమైన తండ్రి అనంతమైన రచనను స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. కావున పురుషార్థము చేసి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. బలిహారమవ్వాలి. మీరు వారిని మీ వారసునిగా చేసుకుంటే వారు మీకు 21 జన్మలకు వారసత్వాన్నిస్తారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. బాబా, ఈ తనువు-మనస్సు-ధనము అన్నీ మీవే, మీరు తండ్రి కూడా, కొడుకు కూడా అని పిల్లలంటారు. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ..... అని కూడా పాడుతారు..... ఆ ఒక్కరి మహిమ ఎంత గొప్పది. వారినే సర్వుల దుఃఖహర్త - సుఖకర్త అని అంటారు. సత్యయుగంలో 5 తత్వాలు కూడా సుఖమునిచ్చేవిగా ఉంటాయి. కలియుగంలో 5 తత్వాలు కూడా తమోప్రధానమైన కారణంగా దుఃఖమునిస్తాయి. అక్కడ సుఖమే ఉంటుంది. ఈ డ్రామా తయారుచేయబడింది. ఇది అదే 5 వేల సంవత్సరాల క్రితము జరిగిన యుద్ధమని మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. కావున పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, తర్వాత పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తారు కూడా, చదివిస్తారు కూడా. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా తండ్రి సమానంగా అయ్యే ధైర్యమునుంచాలి. తండ్రి పై పూర్తిగా బలిహారమవ్వాలి.

2. ఏ విషయములోనూ భయపడకూడదు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.

వరదానము:-

సదా దయా దృష్టి మరియు కళ్యాణ దృష్టి ద్వారా విశ్వ సేవ చేసే విశ్వ పరివర్తక భవ

విశ్వపరివర్తకులు మరియు విశ్వసేవాధారీ ఆత్మల ముఖ్య లక్షణము - తమ దయాదృష్టి మరియు కళ్యాణ దృష్టి ద్వారా విశ్వాన్ని సంపన్నంగా మరియు సుఖంగా చేయడం, అప్రాప్తి వస్తువులైన ఈశ్వరీయ సుఖము, శాంతి మరియు జ్ఞాన ధనముతో, సర్వ శక్తులతో సర్వాత్మలను బికారుల నుండి అధికారులుగా చేయడం. ఇటువంటి సేవాధారులు తమ ప్రతి సెకండును, మాటను మరియు కర్మను, సంబంధమును, సంపర్కమును సేవలోనే వినియోగిస్తారు. వారు చూడడంలో, నడవడంలో, తినడంలో అన్నింటిలోనూ సేవ ఇమిడి ఉంటుంది.

స్లోగన్:-

పేరు ప్రతిష్టలను త్యాగం చేసి తమ సమయాన్ని అనంతమైన సేవలో సఫలం చేయడమే పరోపకారిగా అవ్వడం.

 

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘పరమార్థము ద్వారా వ్యవహారము స్వతహాగా సిద్ధి అవుతుంది’’

భగవానువాచ, మీరు నా ద్వారా పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే నా పరమ పదవిని ప్రాప్తి చేసుకుంటారు అంటే పరమార్థాన్ని తెలుసుకోవడం ద్వారా వ్యవహారము సిద్ధి అవుతుంది. చూడండి, దేవతల ఎదురుగా ప్రకృతి చరణదాసిగా అయి ఉంటుంది, ఈ పంచతత్వాలు సుఖ స్వరూపంగా అయి మనసుకు ఇష్టమైన సేవను చేస్తాయి. ఈ సమయంలో చూడండి, మనసుకు ఇష్టమైన సుఖము లభించని కారణంగా మనుష్యులకు దుఃఖము, అశాంతి ప్రాప్తిస్తూ ఉంటాయి. సత్యయుగంలోనైతే ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. చూడండి, దేవతల యొక్క జడ చిత్రాలపై కూడా ఇన్ని వజ్ర-వైఢూర్యాలను అలంకరిస్తారన్నప్పుడు, మరి వారు చైతన్యంలో ప్రత్యక్షమైనప్పుడు, ఆ సమయంలో వారికి ఎన్ని వైభవాలుంటాయి. ఈ సమయంలో మనుష్యులేమో ఆకలితో మరణిస్తున్నారు, కానీ జడ చిత్రాలపై కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మరి ఈ తేడా ఏమిటి! వారు తప్పకుండా అటువంటి శ్రేష్ఠ కర్మలను చేశారు, అందుకే వారి స్మృతిచిహ్నాలు తయారయ్యాయి. వారికి ఎంతగా పూజ జరుగుతుంది! వారు నిర్వికారీ ప్రవృత్తిలో ఉంటూ కూడా కమలపుష్ప సమాన అవస్థలో ఉండేవారు, కానీ ఇప్పుడు వారు నిర్వికారీ ప్రవృత్తికి బదులుగా వికారీ ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు, ఈ కారణంచేత అందరూ పరమార్థాన్ని మర్చిపోయి వ్యవహారం వైపుకు వెళ్ళిపోయారు. అందుకే రిజల్టు వ్యతిరేకత వైపే వెళ్తుంది. ఇప్పుడు స్వయంగా పరమాత్మ వచ్చి మనల్ని వికారీ ప్రవృత్తి నుండి బయటకు తీసి నిర్వికారీ ప్రవృత్తిని నేర్పిస్తారు, దీనితో మీ జీవితము సదాకాలానికి సుఖవంతంగా అవుతుంది, అందుకే మొదట పరమార్థం కావాలి, తర్వాతనే వ్యవహారము. పరమార్థంలో ఉండటం ద్వారా వ్యవహారము ఆటోమెటిక్ గా సిద్ధి అవుతుంది. ఓం శాంతి.