06-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - బ్రాహ్మణులైన మీకు ఈశ్వరుని ఒడి లభించింది, తండ్రి ఈ తనువు ద్వారా మమ్మల్ని తమవారిగా చేసుకున్నారు అని మీకు నషా ఉండాలి

ప్రశ్న:-

తండ్రి ఏ దివ్య కర్తవ్యాన్ని చేసిన కారణంగా వారికి ఇంతటి మహిమ చేయడం జరిగింది?

జవాబు:-

పతితులను పావనంగా చేయడము, మనుష్యులందరినీ మాయా రావణుడి సంకెళ్ళ నుండి విడిపించడము - ఈ దివ్య కర్తవ్యాన్ని ఒక్క తండ్రే చేస్తారు. అనంతమైన తండ్రి నుండే అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది, అది ఇక అర్ధకల్పం వరకు నడుస్తుంది. సత్యయుగంలో గోల్డెన్ జూబ్లీ ఉంటుంది, త్రేతాలో సిల్వర్ జూబ్లీ ఉంటుంది. అది సతోప్రధానము, ఇది సతో. రెండింటినీ సుఖధామమనే అనడం జరుగుతుంది. ఇటువంటి సుఖధామం యొక్క స్థాపనను తండ్రి చేసారు, అందుకే వారికి మహిమ చేయడం జరుగుతుంది.

గీతము:-

ఇది న్యాయ దేవత దేవాలయము... (ఇన్సాఫ్ కా మందిర్ హై యహ్... )

ఓంశాంతి

తండ్రి మరియు దాదా కలిసి పిల్లలకు అర్థం చేయిస్తారు. అప్పుడప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, అప్పుడప్పుడు దాదా అర్థం చేయిస్తారు ఎందుకంటే ఈ శరీరము దాదాకు కూడా ఇల్లు. పరమపిత పరమాత్మ అయితే పరంధామంలో ఉంటారు. తప్పకుండా ఏదో ఒక సమయంలో వారికి ఈ భారత్ యే ఇల్లు అవుతుంది, అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. శివునికి ఎన్నో మందిరాలు కూడా ఉన్నాయి. కావున, ఏమని ఋజువవుతుందంటే, వారు భారత ఖండంలోనే వస్తారు, పతితులను పావనంగా చేయడానికి మరియు మనుష్యులందరినీ మాయా రావణుని సంకెళ్ళ నుండి విడిపించడానికి ఎందుకంటే ఇప్పుడిది రావణ రాజ్యము. రావణుడిని కాల్చడం కూడా భారత్ లోనే కాలుస్తారు. శివరాత్రిని మరియు కృష్ణజయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. రావణ రాజ్యం కూడా అర్ధకల్పం నడుస్తుంది. మళ్ళీ తండ్రి పతితులను పావనంగా చేయడానికి వస్తారు. కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చి పావనంగా చేస్తారు, ఇక ఆ తర్వాత రానే రారు. తండ్రి పేరు భారత్ లో ప్రసిద్ధంగా ఉంటుంది. వారు తప్పకుండా ఏదో దివ్య కర్తవ్యాన్ని చేసారు, అందుకే వారికి ఆ పేరు ఉంది. మనుష్యులు, మనుష్యులనైతే పావనంగా చేయలేరు. పతితపావనా అని ఒక్క తండ్రినే అనడం జరుగుతుంది. స్వర్గము, నరకము అన్న ఈ పేర్లు కూడా భారత్ కే పెట్టబడ్డాయి. భారత్ 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది, దానిని పరిస్తాన్ అని కూడా అంటారు, అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించింది. తండ్రి అన్న పదం చాలా మధురంగా అనిపిస్తుంది. వారి నుండే అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ఆ సుఖం అర్ధకల్పం నడుస్తుంది. దాని గోల్డెన్ జూబ్లీని, సిల్వర్ జూబ్లీని జరుపుకుంటారు. సత్యయుగాన్ని గోల్డెన్ జూబ్లీ అని, త్రేతాను సిల్వర్ జూబ్లీ అని అంటారు. అది సతోప్రధానము, ఇది సతో, రెండింటినీ కలిపి సుఖధామమని అంటారు. నంబరువన్ సూర్యవంశీయులు, రెండవ నంబరువారు చంద్రవంశీయులు. తండ్రి ఎప్పుడైతే ఈ భారత ఖండంలోకి వస్తారో, అప్పుడు భారత్ ను పావనంగా చేస్తారు, మళ్ళీ ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో, అప్పుడు కళలు తగ్గిపోతూ వస్తాయి. వృక్షము శిథిలంగా, తమోప్రధానంగా అవుతుంది. అందరూ భక్తులుగా అవుతారు. సాధువులు కూడా, తండ్రిని పొందేందుకు అనగా ముక్తి-జీవన్ముక్తి ధామాలకు వెళ్ళేందుకు సాధన చేస్తారు. తండ్రిని పొందడానికి అర్ధకల్పం భక్తి చేస్తారు. ఎప్పుడైతే ఆ సమయం పూర్తవుతుందో, అప్పుడు భక్తులను సుఖమయంగా చేయడానికి మళ్ళీ తండ్రి వస్తారు. సత్యయుగంలోనైతే సుఖ-శాంతులు, సంపద అన్నీ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. ఎప్పుడూ ఏడవరు, పెడబొబ్బలు పెట్టరు. ఇదంతా ఎవరు అర్థం చేయిస్తున్నారు? అనంతమైన తండ్రి, వారికి పేరు కూడా ఉండాలి కదా. కలియుగంలో ఉన్నదే అంధకారము. భక్తి మార్గం యొక్క ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. స్వర్గంలోనైతే దుఃఖం యొక్క విషయమే ఉండదు, అందరూ సుఖమయంగా ఉంటారు, అందుకే భగవంతుడిని పిలవరు. సత్యయుగాన్ని సుఖధామమని, కలియుగాన్ని దుఃఖధామమని అనడం జరుగుతుంది. వల్లభాచారీ వైష్ణవులు, సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని భావిస్తారు. అక్కడ యథా రాజా-రాణి తథా ప్రజా అందరూ సుఖంగా ఉండేవారు, దానిని గోల్డెన్ ఏజ్ అని అనడం జరుగుతుంది. ఎవరైతే సత్యయుగం నుండి మొదలుకొని చక్రంలోకి వస్తారో, వారికే 84 జన్మలు ఉంటాయి. ఇది వృక్షమని పిల్లలకు అర్థం చేయించారు. ఆకులన్నీ కలిసి ఒకే సమయంలో రావు. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది, వారిని హిందువులని అనరు. దేవీ-దేవతలనైతే సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని అంటూ ఉంటారు... వారి పూజారులు ఎవరైతే ఉన్నారో, వారు తప్పకుండా ఆ ధర్మానికి చెందినవారై ఉండాలి. క్రిస్టియన్లు క్రైస్టును స్మృతి చేస్తారు కనుక వారు ఆ ధర్మానికి చెందినవారే కదా. మరి భారతవాసులు తమ దేవీ-దేవతా ధర్మం యొక్క పేరును ఎందుకు మాయం చేసేసారు?

మీకు తెలుసు, మేమే దేవతలుగా ఉండేవారము. మేమే జనన-మరణాలలోకి వస్తాము. మేమే దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ చివరికి వచ్చి శూద్రులుగా అవుతాము. శూద్రుల నుండి మళ్ళీ బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. బ్రహ్మా సంతానమే బ్రాహ్మణులుగా అవుతారు. ఆత్మలందరూ వాస్తవానికి శివునికి సంతానమే. వారు అనంతమైన తండ్రి. వారిని పరమపిత పరమాత్మ అని, ఓ గాడ్ ఫాదర్ అని లేదా హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. వారు స్వర్గ రచయిత. ఇప్పుడు పిల్లలు బుద్ధిని ఉపయోగించాలి. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు అన్నప్పుడు, మేమెందుకు కొత్త ప్రపంచానికి వారసులుగా అవ్వకూడదు. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచం పాతదిగా అయిపోయింది, మళ్ళీ కొత్త ప్రపంచం ఎలా తయారవుతుంది? గాంధీ కూడా కొత్త రామ రాజ్యము, కొత్త భారత్ ఉండాలని అనేవారు కదా. ఇప్పుడది స్థాపనవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు ఈశ్వరీయ ఒడి లభించింది, అనంతమైన తండ్రిని ప్రాక్టికల్ గా తమవారిగా చేసుకున్నారు. వాస్తవానికి అందరూ, ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని అంటూ ఉంటారు కానీ ఈ సమయంలో తండ్రి వచ్చి ఈ తనువు ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. ఆ కలియుగీ బ్రాహ్మణులు గర్భం యొక్క సంతానము, మనము బ్రహ్మా ముఖవంశావళి. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కావుననే ఇంతమంది పిల్లలకు జన్మనిస్తారు. కావున వీరు ముఖవంశావళి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ముఖం ద్వారా దత్తత తీసుకున్నారు కావున వీరు మాత కూడా అయినట్లు. మీరు మాతా-పిత... ఓ బాబా, మీరు మమ్మల్ని బ్రహ్మా ముఖం ద్వారా తమవారిగా చేసుకున్నారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానసాగరుడు, ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానంతోనే సద్గతి లభిస్తుంది అనగా పగలు వస్తుంది. అజ్ఞానంతో రాత్రి వస్తుంది. కలియుగమైతే రాత్రి కదా, దీనిని భక్తి మార్గమని అనడం జరుగుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటి ద్వారా తండ్రి వద్దకు చేరుకునే మార్గమేమీ లభించదు. తండ్రి కల్ప-కల్పము వస్తారు. శివరాత్రిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు వస్తారు. వారికి తమ శరీరము లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అనడం జరుగుతుంది. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, మళ్ళీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. బ్రహ్మా ఈ సాకార వృక్షానికి పెద్ద. ఇప్పుడు వారు ప్రాక్టికల్ గా అలా ఉన్నారు. తండ్రి సంగమయుగంలోనే వస్తారు. ఇప్పుడు యాదవులు కూడా ఉన్నారు, కౌరవులు కూడా ఉన్నారు మరియు పాండవులైతే యోగబలం కల శక్తి సైన్యంగా ఉన్నారు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, శివబాబా ప్రాక్టికల్ గా బ్రహ్మా తనువులో వచ్చారు. ఆ నిరాకార శివునికి మందిరం కూడా ఉంది. శివరాత్రిని జరుపుకుంటున్నారు కానీ గవర్నమెంట్, శివజయంతి సెలవును కూడా తీసేసింది. ఇతరుల జయంతులను జరుపుకుంటూ ఉంటారు. ధర్మం యొక్క శక్తి అయితే లేదు, అందుకే అధర్మయుక్తంగా, నియమవిరుద్ధంగా, దివాలాకోరులుగా అయిపోయారు. పవిత్రత లేదు, శాంతి లేదు, సమృద్ధత లేదు. ఇదే భారత్ లో 5 వేల సంవత్సరాల క్రితము గోల్డెన్ జూబ్లీ ఉన్నప్పుడు పవిత్రత, శాంతి, సమృద్ధత ఉండేవి. ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించేది కాదు. భారత్ వంటి ఉన్నతమైన, సంపన్నమైన దేశం ఇంకేదీ ఉండనే ఉండదు. భారత ఖండము అన్నింటికన్నా ఉన్నతమైనది. దాని చరిత్ర కూడా తయారుచేయబడి ఉంది. పావనంగా కూడా ఈ భారత్ యే అవుతుంది, పతితంగా కూడా ఈ భారత్ యే అవుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం వారే ఈ చక్రంలో తిరిగి శూద్ర వర్ణంలోకి వచ్చారు. మళ్ళీ శూద్ర వర్ణం నుండి ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. దేవతలకన్నా కూడా బ్రాహ్మణ వర్ణము ఉన్నతమైన పిలక స్థానంలో ఉంది. సత్యయుగీ దేవతల మహిమ ఏదైతే ఉందో, అది తండ్రి మహిమకు వేరుగా ఉంటుంది. తండ్రిని జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు అని అంటారు, కానీ దేవతలను సర్వగుణ సంపన్నులు... అని అంటారు, అక్కడ వికారాల విషయం ఉండదు. శాస్త్రాలలోనైతే, కృష్ణపురిలో కూడా కంసుడు, రావణుడు మొదలైనవారు ఉండేవారని చాలా ప్రగల్భాలు రాసేసారు. వాస్తవానికైతే ఈ సమయంలో కంసపురి ఉంది. మళ్ళీ సత్యయుగంలో కృష్ణపురి ఉంటుంది. ఇది సంగమము, అందుకే వారు కంసుడు, జరాసంధుడు, రావణుడు మొదలైనవారిని సత్యయుగీ దేవతలతో కలిపేసారు. ఇది ఉన్నదే ఆసురీ రావణ సంప్రదాయము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయం వారిగా అయ్యారు. ఈశ్వరీయ ఒడిలోకి వచ్చి పవిత్రంగా అయి, మళ్ళీ 21 జన్మల కోసం దైవీ ఒడిలోకి వెళ్తారు. 8 జన్మలు దైవీ ఒడి, తర్వాత 12 జన్మలు క్షత్రియ ఒడి. కన్య అనగా 21 కులాలను ఉద్ధరించేవారు అని భారత్ లోనే అంటూ ఉంటారు. మీరే ఆ కుమారీలు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. శివబాబా తాతగారు, బ్రహ్మా తండ్రి. మీరు బ్రహ్మాకుమారులు-కుమారీలు. వారసత్వము ఆ అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది. ఇచ్చేవారు వారు, వారైతే నిరాకారుడు. కనుక వారు రాజయోగాన్ని ఇప్పుడు ఎలా నేర్పించాలి. నరుని నుండి నారాయణునిగా తయారుచేసేందుకు తప్పకుండా సాకార శరీరం కావాలి. కావున ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, ఆ పతిత తనువులోకి వస్తారు. ఇది అత్యంత పెద్ద యూనివర్శిటీ. ఇక్కడ స్వయంగా భగవంతుడు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు, రాజులకే రాజులుగా తయారుచేయడానికి. గీతా రచయిత కృష్ణుడు కాదు. గీతా మాత కృష్ణుడికి జన్మనిచ్చింది. ఎవరైతే దేవతలుగా అయ్యారో, వారికి శివబాబా ద్వారా జన్మ లభించింది. క్రిస్టియన్లకు బైబిల్ నుండి క్రైస్టు ద్వారా జన్మ లభించింది. మిమ్మల్ని కూడా బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎవరు తయారుచేసారు? శివబాబా, బ్రహ్మా ముఖం ద్వారా తయారుచేసారు. మీది అనంతమైన సన్యాసము. అది హద్దు యొక్క రజోగుణీ సన్యాసము. అది నివృత్తి మార్గం యొక్క సన్యాసము. మీకు ఈ పాత ఛీ-ఛీ ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగింది. ఇదైతే ఇప్పుడు అంతమవ్వనున్నది అని మీకు తెలుసు. దీని బదులు మనం స్వర్గ రచయిత అయిన తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలూ, మీరు అనేక జన్మల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్ళాలి. ఇందులో పథ్యం కూడా చాలా ఉంది, అశుద్ధమైన వస్తువులను తినకూడదు. తండ్రి అంటారు, మురికి పట్టిన వస్త్రాలను పావనంగా చేసేందుకే నేను సంగమంలో వస్తాను. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. యాదవులు, కౌరవులు మరియు పాండవులు కూడా ఉన్నారు కనుక తప్పకుండా పాండవ పతి కూడా ఉంటారు. పాండవ పతి లేక పిత అని పరమాత్మను అంటారు. మీరేమో పండాలు. సుఖధామానికి, శాంతిధామానికి మార్గాన్ని తెలియపరుస్తారు, అందుకే మిమ్మల్ని పాండవ శివశక్తి సైన్యము అని అనడం జరుగుతుంది. యాదవులైన యూరోప్ వాసులైతే తమ కులాన్నే నాశనం చేసుకుంటారు. భారత్ లో పాండవులు మరియు కౌరవులు ఉన్నారు - వారి విషయంలోనే అసురులకు మరియు దేవతలకు యుద్ధం జరిగింది అని అంటారు. మీరిప్పుడు దేవతలుగా లేరు, అలా తయారవ్వాలి. శ్రీమతంతో మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మిగిలిన వారందరిదీ ఆసురీ రావణ మతము. అర్ధకల్పము రావణ మతం నడుస్తుంది. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమే తమోప్రధానంగా ఉంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, ఇక్కడ తండ్రి కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎప్పుడైతే రాజ్యం స్థాపనవుతుందో, అప్పుడు ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది, ఈ జ్ఞానం ప్రాయఃలోపమైపోతుంది. మళ్ళీ డ్రామానుసారంగా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు ఏవేవి అయితే ఉన్నాయో, అవే వెలువడతాయి. సన్యాసుల ఫాలోవర్స్ (అనుచరులు) చాలా మంది ఉంటారు. అందరూ పాపాన్ని కడుక్కునేందుకు గంగ వద్దకు వెళ్తారు. ఇప్పుడు గంగా నది అయితే ఎవరినీ పావనంగా చేయలేదు. అది నీటి సాగరం నుండి వెలువడినది. జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు మీరు. ఇకపోతే గంగ ఏమీ పతితపావని కాదు. పిల్లలకు మళ్ళీ భక్తి ఫలంగా అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఎవరైతే వచ్చి తండ్రి నుండి చదువుకుంటారో, వారే స్వర్గంలోకి వస్తారు, మిగిలిన వారంతా తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు డ్రామా చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. గవర్నమెంట్ కూడా చక్రాన్ని తయారుచేసింది. మూడు సింహాలను చూపించి, కింద సత్యమేవ జయతే అని రాస్తారు.

ఇప్పుడు శివబాబా వచ్చి పార్వతులైన మీ అందరికీ అమరకథను వినిపిస్తున్నారు - అమరపురికి యజమానులుగా చేయడానికి. దీనినే సత్యనారాయణ కథ లేక అమరకథ అని అనడం జరుగుతుంది. ఈ కథను ఒకేసారి విని మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మిగిలినవన్నీ కట్టుకథలు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేవతా వర్ణంలోకి వెళ్ళేందుకు భోజనం విషయంలో చాలా పథ్యం పాటించాలి. ఎటువంటి అశుద్ధమైన వస్తువును తినకూడదు.

2. ఈ పాత ఛీ-ఛీ ప్రపంచము, ఏదైతే ఇప్పుడు అంతమవ్వనున్నదో, దీని పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి స్వర్గ రచయిత అయిన తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

మీ శక్తులు మరియు గుణాల ద్వారా నిర్బలులను శక్తివంతులుగా చేసే శ్రేష్ఠ దానీ మరియు సహయోగీ భవ

శ్రేష్ఠ స్థితి కల సుపుత్రులైన పిల్లల యొక్క సర్వశక్తులు మరియు సర్వగుణాలు సమయమనుసారంగా సదా సహయోగిగా ఉంటాయి. వారు చేసే సేవ యొక్క విశేష స్వరూపం ఏమిటంటే - తండ్రి ద్వారా ప్రాప్తించిన గుణాలను మరియు శక్తులను అజ్ఞానీ ఆత్మలకు దానం ఇవ్వడము మరియు బ్రాహ్మణాత్మలకు సహయోగం ఇవ్వడము. నిర్బలులను శక్తివంతులుగా చేయడము - ఇదే శ్రేష్ఠ దానము మరియు సహయోగము. ఏ విధంగానైతే వాణి ద్వారా లేక మనసా ద్వారా సేవ చేస్తారో, అదే విధంగా ప్రాప్తించిన గుణాలు మరియు శక్తుల యొక్క సహయోగాన్ని ఇతర ఆత్మలకు ఇవ్వండి, వారికి ప్రాప్తి చేయించండి.

స్లోగన్:-

ఎవరైతే దృఢ నిశ్చయంతో భాగ్యాన్ని నిశ్చితం చేసుకుంటారో, వారే సదా నిశ్చింతగా ఉంటారు.