07-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఇప్పుడు తండ్రి సమానంగా దేహీ-అభిమానులుగా అవ్వండి, తండ్రి కోరిక ఏమిటంటే, పిల్లలు నా సమానంగా అయి నాతో పాటు ఇంటికి రావాలి

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ విషయం యొక్క అద్భుతాన్ని చూస్తూ తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతారు?

జవాబు:-

బాబా ఏ విధంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు అన్న అద్భుతాన్ని మీరు చూస్తారు. తమ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి యోగ్యులుగా చేస్తున్నారు. పిల్లలైన మీరు లోలోపలే అటువంటి మధురమైన బాబాకు కృతజ్ఞతలు తెలుపుతారు. బాబా అంటారు, ఈ కృతజ్ఞతలు అనే పదం కూడా భక్తి మార్గానికి చెందినది. పిల్లలకైతే అధికారముంటుంది, ఇందులో కృతజ్ఞతల యొక్క విషయమేముంది. డ్రామానుసారంగా తండ్రి వారసత్వాన్ని ఇవ్వాల్సిందే.

గీతము:-

ఎవరికైతే భగవంతుడు సహచరునిగా ఉంటారో... (జిస్కా సాథీ హై భగవాన్...)

ఓంశాంతి

ఈ పాట పిల్లల కోసము ఉంది. ఎవరికైతే సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మ సహచరునిగా ఉన్నారో, వారిని మాయా తుఫానులు ఏం చేయగలవు. ఆ తుఫానులు కాదు, మాయా తుఫాన్లు ఆత్మ జ్యోతిని ఆర్పి వేస్తాయి. ఇప్పుడు మేల్కొలిపే సహచరుడు లభించారు, కావున మాయ ఏం చేయగలదు. మహావీర్ అన్న పేరు పెట్టడం జరుగుతుంది, వారు మాయా రావణుడిపై విజయం పొందేవారు. ఎలా విజయం పొందాలి? అటువంటి పిల్లలు ఎదురుగా కూర్చున్నారు. బాప్ దాదా కూర్చున్నారు. తాతగారిని మరియు తండ్రిని, పిత మరియు పితామహుడు అని అంటారు. కనుక బాప్ దాదా అయినట్లు. పిల్లలకు తెలుసు, ఆత్మిక తండ్రి మా ఎదురుగా కూర్చున్నారు. ఆత్మిక తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మనే ఇంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది. పిల్లలైన మీకు దేహాభిమానులుగా ఉండడం అలవాటైపోయింది. అర్ధకల్పం దేహాభిమానంలో ఉంటారు. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకున్నారు. శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది, ఒకరేమో నా పేరు పరమానందా అని అంటారు, ఒకరికి ఒక పేరు ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకటి... బాబా అంటారు, నేను సదా దేహీ-అభిమానిగా ఉంటాను. నాకు ఎప్పుడూ దేహం లభించదు కనుక నాకు ఎప్పుడూ దేహాభిమానం ఉండజాలదు. ఈ దేహమైతే ఈ దాదాది. నేను సదా దేహీ-అభిమానిగా ఉంటాను. పిల్లలైన మిమ్మల్ని కూడా నా సమానంగా చేయాలని అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మీరు నా వద్దకు రావాలి. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. దీనికి సమయం పడుతుంది. చాలా సమయం నుండి దేహాభిమానంలో ఉండడం అభ్యాసమైపోయింది. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టండి, నా సమానంగా అవ్వండి ఎందుకంటే మీరు నా అతిథులుగా అవ్వాలి. నా వద్దకు తిరిగి రావాలి, అందుకే మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని చెప్తాను. ఇది నేను ఆత్మలకే చెప్తాను. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే, ఆ దృష్టి సమాప్తమైపోతుంది. ఇందులో శ్రమ ఉంది. మనము ఆత్మలకు సేవ చేస్తున్నాము. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది, ఆత్మనైన నేను మీకు బాబా సందేశాన్ని ఇస్తున్నాను. ఆత్మ స్వయాన్ని పురుషుడని లేక స్త్రీ అని చెప్పదు. శరీరం అనుసారంగా స్త్రీ లేక పురుషుడు అని అనడం జరుగుతుంది. వారైతే ఉన్నదే పరమాత్మ. తండ్రి అంటారు, ఓ ఆత్మలూ వింటున్నారా. ఆత్మ అంటుంది, అవును వింటున్నాను. మీకు మీ తండ్రి గురించి తెలుసు, వారు ఆత్మలందరికీ తండ్రి. ఎలాగైతే మీరు ఆత్మలో, అలాగే నేను మీ తండ్రిని. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు, వారికి తమదంటూ శరీరం లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు తమ-తమ ఆకారాలు ఉన్నాయి. ఆత్మను ఆత్మ అనే అంటారు. నా పేరైతే శివ. శరీరాలకైతే చాలా పేర్లు ఉంటాయి. నేను శరీరం తీసుకోను, అందుకే నా పేరు శారీరక పేరు కాదు. మీరు సాలిగ్రామాలు. ఆత్మలైన మీతో అంటారు - ఓ ఆత్మలూ, వింటున్నారా? ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అయి ఉండే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ అవయవాల ద్వారా ఆత్మలు వింటాయి మరియు మాట్లాడతాయి, తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మ అవివేకంగా అయిపోయింది ఎందుకంటే తండ్రిని మర్చిపోయింది. ఇలా కాదు, శివుడు కూడా పరమాత్మ, కృష్ణుడు కూడా పరమాత్మ అని. వారైతే రాయి-రప్ప అన్నీ పరమాత్మనే అంటారు. మొత్తం సృష్టిలో తప్పుడు జ్ఞానం వ్యాపించి ఉంది. చాలా మంది అయితే, మేము తండ్రి అయిన భగవంతుని పిల్లలము అని భావిస్తారు కూడా. కానీ మెజారిటీ సర్వవ్యాపి అని అనేవారు ఉంటారు. ఈ ఊబి నుండి అందరినీ బయటకు తీయాలి. మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉంది, తండ్రి మరొకవైపు ఉన్నారు. తండ్రి మహిమ గాయనం చేయబడింది. అహో ప్రభూ, మీ లీల... అహో నా మతము, దీని ద్వారా గతి మరియు సద్గతి లభిస్తుంది. సద్గతిదాత అయితే ఒక్కరే. మనుష్యులు గతి-సద్గతి కోసం ఎంతగా కష్టపడతారు. ముక్తి, జీవన్ముక్తి రెండింటినీ ఇచ్చే సద్గురువు వీరు ఒక్కరే.

తండ్రి అంటారు, ఈ సాధు-సత్పురుషులు మొదలైన వారందరికీ సద్గతి ఇవ్వడం కోసం నేను రావాల్సి ఉంటుంది. అందరి సద్గతిని చేసేది నేనొక్కడినే. ఆత్మలతో మాట్లాడతాను. నేను మీ తండ్రిని, ఆత్మలైన మీరంతా నా సంతానము అని ఇలా ఇంకెవరూ అనలేరు. వారైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. కనుక ఈ విధంగా ఎప్పుడూ అనలేరు. ఇదైతే తండ్రి స్వయంగా అంటారు, నేను వచ్చాను, భక్తులకు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి. గాయనం కూడా ఉంది - భక్తుల సంరక్షకుడు భగవంతుడు ఒక్కరే. అందరూ భక్తులే, కావున తప్పకుండా భగవంతుడు వేరుగా ఉంటారు. భక్తులే ఒకవేళ భగవంతుడైనట్లు అయితే, వారు భగవంతుడిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. తమ-తమ భాషలలో పరమాత్మను ఒకరు ఒకలా, ఇంకొకరు ఇంకొకలా పిలుస్తారు. కానీ యథార్థమైన పేరు శివ. ఎవరైనా ఎవరినైనా నిందించినా లేక అవమానపర్చినా, వారిపై కేసు వేస్తారు. కానీ ఇది డ్రామా. ఇందులో ఎవరి మాట చెల్లదు. తండ్రికి తెలుసు, మీరు దుఃఖితులుగా అయ్యారు, మళ్ళీ కూడా ఇలా జరుగుతుంది అని. గీతా శాస్త్రము మొదలైనవి మళ్ళీ కూడా అవే వెలువడతాయి. కానీ కేవలం గీత మొదలైనవి చదవడంతోనైతే ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడైతే సమర్థత ఉండాలి. శాస్త్రాలను వినిపించేవారు - ఓ పిల్లలూ, నాతో యోగం జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని ఈ విధంగా ఎవరి కోసము అనలేరు. వారైతే కేవలం గీతా పుస్తకాన్ని చదివి వినిపిస్తారు.

ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా అయ్యారు. మనము 84 జన్మల చక్రంలోకి ఎలా వస్తాము అనేది మీకు తెలుసు. డ్రామాలో ప్రతి ఒక్క విషయం దాని సమయం అనుసారంగా జరుగుతుంది. ఈ తండ్రి పిల్లలతో, ఆత్మలతో మాట్లాడుతారు, మీరు కూడా ఇలా నేర్చుకోండి - మేము ఆత్మతో మాట్లాడుతాము, మా ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది. మీ ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. నేను తండ్రి సందేశాన్ని ఇస్తాను, నేను ఆత్మను. ఇది అర్థం చేయించడం ఎంత సహజము. మీ ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మ 84 జన్మలు పూర్తి చేసింది. ఇప్పుడు తండ్రి అంటారు, ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే జీవ పరమాత్మ అని అనండి కదా. జీవాత్మ అని ఎందుకు అంటారు? ఇది ఆత్మతో మాట్లాడుతారు. నా సోదరులారా, ఆత్మలారా, 5 వేల సంవత్సరాల క్రితం నాటి తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నానని భావిస్తున్నారా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది దుఃఖధామము. సత్యయుగం సుఖధామము. ఓ ఆత్మలూ, మీరు సుఖధామంలో ఉండేవారు కదా. మీరు 84 జన్మల చక్రాన్ని తిరిగారు. సతోప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. ఇప్పుడు మళ్ళీ పదండి, తిరిగి శ్రీకృష్ణపురిలోకి. వెళ్ళి ఏమవ్వాలని అనుకుంటున్నారు? మహారాజా-మహారాణిగా అవుతారా లేక దాస-దాసీనా? ఈ-ఈ విధంగా ఆత్మలతో మాట్లాడాలి. ఉల్లాసముండాలి. నేను పరమాత్మ అని కాదు. పరమాత్మ అయితే జ్ఞానసాగరుడు. వారెప్పుడూ అజ్ఞానసాగరులుగా అవ్వరు. జ్ఞానము మరియు అజ్ఞానసాగరులుగా మనమే అవుతాము. తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకుని మాస్టర్ సాగరులుగా అవుతాము. వాస్తవానికి, ఒక్క తండ్రే సాగరుడు. మిగిలినవారంతా నదులు. తేడా ఉంది కదా. ఆత్మ ఎప్పుడైతే తెలివిహీనంగా ఉంటుందో, అప్పుడు ఆత్మకు అర్థం చేయించడం జరుగుతుంది. స్వర్గంలో ఎవరికైనా అర్థం చేయిస్తారా ఏమిటి. ఇక్కడ అందరూ తెలివిహీనులుగా, పతితులుగా మరియు దుఃఖితులుగా ఉన్నారు. పేదవారే ఈ జ్ఞానాన్ని విశ్రాంతిగా కూర్చుని వింటారు. షావుకార్లకైతే తమ నషా ఉంటుంది. వారిలో ఎవరో ఒకరు అరుదుగా వెలువడుతారు. రాజా జనకుడు అంతా ఇచ్చేసారు కదా. ఇక్కడ అందరూ జనకులు. జీవన్ముక్తి కోసం జ్ఞానం తీసుకుంటున్నారు. కనుక మేము ఆత్మ అనేది పక్కా చేసుకోవాల్సి ఉంటుంది. బాబా, మేము మీకు ఎంత కృతజ్ఞతలు తెలపాలి. డ్రామానుసారంగా మీకు వారసత్వాన్ని అయితే ఇవ్వాల్సిందే. మేము మీ పిల్లలుగా అవ్వాల్సిందే. ఇందులో కృతజ్ఞతలు ఏం తెలుపుతారు. మేమైతే మీ వారసులుగా అవ్వాల్సిందే. ఇందులో కృతజ్ఞతల యొక్క విషయమేముంది. తండ్రి స్వయంగా వచ్చి, అర్థం చేయించి యోగ్యులుగా చేస్తారు. భక్తి మార్గంలో మహిమ చేసినప్పుడు కృతజ్ఞతలు అనే పదం వెలువడుతుంది. తండ్రికి అయితే తమ కర్తవ్యం చేయాల్సే ఉంటుంది. వారు వచ్చి మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళేందుకు మార్గాన్ని చెప్తారు. డ్రామానుసారంగా బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించాలి, వారసత్వాన్ని ఇవ్వాలి. తర్వాత ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో, దాని అనుసారంగా స్వర్గంలోకి వెళ్తారు. అంతేకానీ బాబా పంపించేస్తారు అని కాదు. స్వతహాగా ఎంత పురుషార్థం చేస్తారో, దాని అనుసారంగా స్వర్గంలోకి వస్తారు. అంతేకానీ, ఇందులో కృతజ్ఞతల విషయమేమీ లేదు. బాబా ఎటువంటి ఆటను చూపించారు అని ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాము. ఇంతకుముందు మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. బాబా, మేము మళ్ళీ ఈ జ్ఞానం మర్చిపోతామా? అవును పిల్లలూ, నా బుద్ధి నుండి మరియు మీ బుద్ధి నుండి ఈ జ్ఞానం ప్రాయఃలోపమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞానమిచ్చే సమయం వస్తుందో, అప్పుడు సమయానికి ఇమర్జ్ అవుతుంది. ఇప్పుడైతే నేను నిర్వాణధామానికి వెళ్ళిపోతాను, మళ్ళీ భక్తి మార్గంలో నేను పాత్రను అభినయిస్తాను. ఆత్మలో స్వతహాగానే ఆ సంస్కారాలు వచ్చేస్తాయి. కల్పం తర్వాత కూడా నేను ఈ శరీరంలోనే వస్తాను. ఇది బుద్ధిలో ఉంటుంది. కానీ మీరైతే దేహీ-అభిమానులుగా ఉండాలి. లేదంటే దేహాభిమానులుగా అయిపోతారు. ముఖ్యమైన విషయము ఇదే. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. కల్ప-కల్పము పురుషార్థం అనుసారంగా మీరు వారసత్వాన్ని పొందుతారు. ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. ఇకపోతే ఈ గమ్యానికి చేరుకోవడంలో గుప్తమైన శ్రమ ఉంది.

ఆత్మ మొట్టమొదట వచ్చినప్పుడు పుణ్యాత్మగా, సతోప్రధానంగా ఉంటుంది. మళ్ళీ అది పాపాత్మగా, తమోప్రధానంగా తప్పకుండా అవ్వాల్సిందే. ఇప్పుడు మళ్ళీ మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి సందేశాన్ని ఇచ్చారు. మొత్తం రచన అంతటికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. వారు సర్వులకు సద్గతిదాత కదా. అందరిపై దయ చూపించేవారు అనగా సర్వులపై జాలి చూపించేవారు. సత్యయుగంలో ఎటువంటి దుఃఖము ఉండదు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఇది వినాశన సమయమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. దుఃఖం యొక్క లెక్కాచారాలు యోగబలంతో సమాప్తం చేసుకోవాలి. తర్వాత జ్ఞానం మరియు యోగబలం ద్వారా భవిష్య సుఖం కోసం మనం ఖాతాను కూడా జమ చేసుకోవాలి. ఎంత జమ చేసుకుంటారో, అంత సుఖాన్ని పొందుతారు మరియు దుఃఖం యొక్క ఖాతా సమాప్తమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కల్పం యొక్క సంగమయుగంలో వచ్చి దుఃఖం యొక్క ఖాతాను సమాప్తం చేస్తాము మరియు ఇంకొకవైపు జమ కూడా చేసుకుంటాము. ఇది వ్యాపారము కదా. బాబా జ్ఞాన రత్నాలను ఇచ్చి గుణవంతులుగా చేస్తారు. తర్వాత ఎవరు ఎంత ధారణ చేయగలుగుతారో. ఒక్కొక్క రత్నము లక్షల సంపద వంటిది. దీని ద్వారా మీరు భవిష్యత్తులో సదా సుఖమయంగా ఉంటారు. ఇది దుఃఖధామము, అది సుఖధామము. స్వర్గంలో సదా సుఖమే సుఖముంటుందని సన్యాసులకు తెలియదు. గీత ద్వారా భారత్ ను ఇంత ఉన్నతంగా తయారుచేసేది ఒక్క తండ్రి మాత్రమే. ఆ మనుష్యులు శాస్త్రాలు మొదలైనవి ఎన్ని వినిపిస్తారు. కానీ ప్రపంచమైతే పాతదిగా అవ్వాల్సిందే. దేవతలు మొదట కొత్త సృష్టిలో రామ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు దేవతలు లేరు. ఎక్కడికి వెళ్ళారు? మరి 84 జన్మలు ఎవరు అనుభవించారు? ఇతరులెవ్వరిదీ 84 జన్మల లెక్క ఉండదు. 84 జన్మలను తప్పకుండా దేవీ-దేవతా ధర్మం వారే తీసుకుంటారు. మనుష్యులైతే లక్ష్మీ-నారాయణులు మొదలైనవారందరినీ భగవంతునిగా భావిస్తారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. అచ్ఛా, పోనీ సర్వవ్యాపి జ్ఞానంతోనైనా సుఖంగా ఉంటారా ఏమిటి? ఈ సర్వవ్యాపి జ్ఞానమైతే కొనసాగుతూనే వచ్చింది, అయినా కూడా భారత్ అయితే నిరుపేదగా, నరకంగా తయారయ్యింది. భక్తి ఫలాన్ని అయితే భగవంతుడు ఇవ్వాల్సిందే. సన్యాసులు ఎవరైతే స్వయమే సాధన చేస్తూ ఉంటారో, వారు ఫలాన్ని ఏమిస్తారు? మనుష్యులు సద్గతిదాత అయితే కారు. ఎవరెవరైతే ఈ ధర్మానికి చెందినవారు ఉన్నారో, వారు తిరిగి వస్తారు. అలా చాలామంది సన్యాస ధర్మంలోకి కూడా కన్వర్ట్ అయ్యారు, వారు కూడా వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు.

బాబా అర్థం చేయిస్తారు - నేను ఆత్మను అన్న అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆత్మ ఆధారంతోనే శరీరం నిలబడి ఉంది. శరీరమైతే వినాశీ, ఆత్మ అవినాశీ. మొత్తం పాత్ర అంతా ఈ చిన్న ఆత్మలో ఉంది. ఎంత అద్భుతము. సైన్సువారు కూడా అర్థం చేసుకోలేరు. ఈ అమరమైన, అవినాశీ పాత్ర ఇంత చిన్న ఆత్మలో ఉంది. ఆత్మ కూడా అవినాశీ, అలాగే పాత్ర కూడా అవినాశీ. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కల్పం యొక్క సంగమంలో యోగబలం ద్వారా దుఃఖం యొక్క ఖాతాను (లెక్కాచారాన్ని) సమాప్తం చేసుకోవాలి. కొత్తది జమ చేసుకోవాలి. జ్ఞాన రత్నాలను ధారణ చేసి గుణవంతులుగా అవ్వాలి.

2. నేను ఆత్మను, సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను, శరీరము వినాశీ. నేను నా సోదర ఆత్మకు సందేశం వినిపిస్తున్నాను, ఇటువంటి అభ్యాసం చేయాలి.

వరదానము:-

శుభ భావన మరియు శ్రేష్ఠ భావము ద్వారా సర్వులకు ప్రియంగా అయి విజయ మాలలో కూర్చబడే విజయీ భవ

ఎవరు ఏ భావముతో మాట్లాడినా లేక నడుచుకున్నా కానీ, మీరు సదా ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము, శ్రేష్ఠ భావాన్ని ధారణ చేయండి. ఇందులో విజయులుగా అయినట్లయితే మాలలో కూర్చబడేందుకు అధికారులుగా అవుతారు, ఎందుకంటే సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సాధనమే సంబంధ-సంపర్కాలలో ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్ఠ భావాన్ని ధారణ చేయడము. ఇటువంటి శ్రేష్ఠ భావము ఉన్నవారు సదా అందరికీ సుఖాన్ని ఇస్తారు, సుఖాన్ని తీసుకుంటారు. ఇది కూడా సేవనే మరియు శుభ భావన మనసా సేవకు శ్రేష్ఠ సాధనము. కావున ఇటువంటి సేవ చేసేవారు విజయమాలలో మణిపూసలుగా అవుతారు.

స్లోగన్:-

కర్మలో యోగాన్ని అనుభవం చేయడమే కర్మయోగిగా అవ్వడము.