ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు - ఇద్దరు తండ్రులు వచ్చేసారు. ఆ
తండ్రి అయినా అర్థం చేయిస్తారు, ఈ తండ్రి అయినా అర్థం చేయిస్తారు. కావున తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తారు - మీరు ఏదైతే బాబా స్మృతిలో శాంతిగా కూర్చుంటారో, దానినే
సత్యమైన శాంతి అని అంటారు. ఇది ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే నిజమైన శాంతి, అది
అసత్యమైనది. తమ స్వధర్మం గురించి తెలియదు. స్వయానికి తన పరమపిత పరమాత్మ గురించి
తెలియదు, మరి శాంతి, శక్తిని ఎవరివ్వాలి? తండ్రే శాంతిదాత. తండ్రి అంటారు, పిల్లలూ,
అశరీరిగా అయ్యి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. మీరైతే అవినాశీ కదా. తమ
స్వధర్మంలో కూర్చోండి, ఇంకెవ్వరూ ఈ విధంగా కూర్చోరు. తప్పకుండా ఆత్మనే ఒక శరీరాన్ని
వదిలి మరొకటి తీసుకుంటుంది. పరమపిత పరమాత్మ అయితే ఒక్కరే, వారి మహిమ చాలా గొప్పది.
వారు తండ్రి, సర్వవ్యాపి కాదు. ఒక్క విషయాన్ని నిరూపించినట్లయితే మీరు విజయం
పొందినట్లే. అప్పుడు, గీతా భగవంతుడు కూడా నిరూపించబడతారు. పాయింట్లు అయితే మీకు చాలా
లభిస్తాయి. సిక్కులు కూడా, సద్గురు అకాల్... అని అంటారు. వారే అకాలమూర్తి. వారు
ముక్తిదాత, సర్వుల సద్గతిదాత అని అంటారు కూడా. వారు వచ్చి దుఃఖం నుండి విముక్తులుగా
చేస్తారు. పతిత-పావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమే. ఇలాంటి-ఇలాంటి పాయింట్లను
ఎల్లప్పుడూ విచార సాగర మథనం చేయాలి. తండ్రిని మర్చిపోయిన కారణంగానే అందరికీ దుర్గతి
కలిగింది. భగవంతుడు ఒక్కరే కావున ఇతరులెవ్వరినీ భగవంతుడు అని అనలేరు.
సూక్ష్మవతనవాసులను కూడా భగవంతుడు అని అనలేరు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు ఒక్కరే.
ఇక్కడైతే మనుష్య సృష్టి ఉంది, వీరు పునర్జన్మలలోకి వస్తారు. పరమపిత పరమాత్మ అయితే
పునర్జన్మలలోకి రారు, అటువంటప్పుడు కుక్క, పిల్లి, అన్నింటిలో పరమాత్మ ఉన్నారని ఎలా
అంటారు. తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని రోజంతా ఇదే బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు
రాత్రి పగలు మీరు ఈ చింతనలో ఉండండి, అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి? పతితులను
పావనంగా చేసేవారు ఒక్కరే. అప్పుడు, గీతా భగవంతుడు కూడా నిరూపించబడతారు. పిల్లలైన
మీకే విజయం లభిస్తుంది, అది కూడా ఎప్పుడైతే శ్రమ చేస్తారో, అప్పుడు లభిస్తుంది.
మహారథులు, గుర్రపుస్వారులు, పాదచారులు అయితే ఉన్నారు కదా.
పిల్లలైన మీకు తెలుసు, భారత్ కే తండ్రి నుండి వారసత్వం లభించింది. ఇప్పుడు
లాక్కోబడింది, మళ్ళీ తండ్రి ఇస్తారు. తండ్రి రావడమే భారత్ లో వస్తారు. ఇన్ని ధర్మాలు
ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ సమాప్తమవ్వనున్నాయి, మళ్ళీ సత్యయుగం వస్తుంది. అయ్యో-అయ్యో
అన్న ఆర్తనాదాల తర్వాత జయ-జయ కారాలు జరుగుతాయి. మనుష్యులు దుఃఖం సమయంలో అయ్యో రామ,
అని అంటారు కదా. రాముడి పేరు మీద దానమివ్వండి అని అంటారు కదా. దీనిపై శ్లోకాలు కూడా
తయారుచేయబడి ఉన్నాయి. సిక్కులకు కూడా చాలా పేరు ఉంది. వారు కూడా అకాల సింహాసనము అని
అంటారు. పిల్లలైన మీ సింహాసనం ఏమిటి? ఆత్మలైన మీరందరూ అకాల మూర్తులు. మిమ్మల్ని
కాలుడు ఎవ్వరూ కబళించలేడు. ఈ శరీరమైతే సమాప్తమైపోతుంది. అకాల సింహాసనం అమృత్సర్ లో
ఉందని వారు భావిస్తారు, కానీ అకాల సింహాసనమైతే మహాతత్వము. ఆత్మలైన మనం కూడా అక్కడి
నివాసులము. బాబా, మీరు మీ సింహాసనాన్ని వదిలి రండి అని పాడుతారు కూడా. అది సర్వుల
కోసం శాంతి యొక్క సింహాసనము. రాజ్య సింహాసనము సర్వుల కోసం అని ఏమీ అనరు. బాబా
సింహాసనము అనగా మనది కూడా. అక్కడి నుండి మనం పాత్రను అభినయించడానికి వస్తాము, ఇకపోతే,
ఆకాశాన్ని వదిలే విషయం లేదు. తండ్రి పరిచయాన్ని ఎవరికి, ఎలా ఇవ్వాలి? అన్నదానిలోనే
పిల్లలు బుద్ధిని పెట్టాలి. తండ్రి కొడుకుని ప్రత్యక్షం చేస్తారు, కొడుకు తండ్రిని
ప్రత్యక్షం చేస్తాడు. మన బాబా ఎవరు, వారి ఆస్తి ఏమిటి, దానికి యజమానులుగా అవుతాము
అని బుద్ధిలో ఉన్నాయి. తండ్రి పరిచయమే ముఖ్యమైనది. మొత్తం గందరగోళం అంతా ఇందులోనే
ఉంది. ఏకైక పొరపాటు కల నాటకం కదా. పొరపాటు చేయించేవారు రావణుడు.
సత్యయుగంలో మీరు దేహీ-అభిమానులుగా ఉంటారు. మేము ఆత్మలము అన్నది తెలుసు. ఇకపోతే,
మాకు పరమపిత పరమాత్మ తెలుసు అని అనరు. అలా అనరు, అక్కడైతే సుఖమే సుఖము ఉంటుంది.
దుఃఖంలో అందరూ స్మరిస్తారు. భక్తి మార్గం పూర్తయ్యింది, జ్ఞాన మార్గం మొదలయ్యింది,
వారసత్వం లభించింది, తర్వాత భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారు! కల్ప-కల్పము
వారసత్వం లభిస్తుంది. ఈ డ్రామానే ఆ విధంగా తయారుచేయబడి ఉంది. తండ్రి గురించి
ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు. రాత్రి పగలు
ఇవే విషయాలు నడుస్తూ ఉండాలి. ఇవి బుద్ధి కోసము భోజనము. తండ్రి పరిచయాన్ని అందరికీ
ఎలా ఇవ్వాలి! తండ్రి యొక్క ఒకే ఒక్క అవతరణ గురించి గాయనముంది. కలియుగ అంతిమము,
సత్యయుగము ఆది యొక్క సంగమంలో, పతితులను పావనంగా చేయడానికి తప్పకుండా వస్తారు అని
భావిస్తారు. ముఖ్యమైనది గీత. గీత ద్వారానే వజ్ర సమానంగా అవ్వగలరు. మిగిలిన
శాస్త్రాలన్నీ గీత యొక్క పిల్లలు, వాటి ద్వారా ఏ వారసత్వమూ లభించదు. సర్వశాస్త్రమయీ
శిరోమణి గీత. శ్రీమతం ప్రసిద్ధి చెందింది. శ్రీ అనగా అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు.
శ్రీ శ్రీ 108 రుద్ర మాల ఉంది. ఇది శివబాబా యొక్క మాల. ఆత్మలందరికీ తండ్రి వీరు అని
మీకు తెలుసు. బాబా-బాబా అనైతే అందరూ అంటారు కదా. బాబా యొక్క రచన రచించబడింది, ఇది
ఎవ్వరూ తెలుసుకోలేరు. బాబా అంటారు, మీకు ఎక్కువ కష్టాన్ని ఏమీ ఇవ్వను. కేవలం
తండ్రిని మర్చిపోవడంతో పడిపోయారు, వారిని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఘోర అంధకారం
నుండి అత్యంత ప్రకాశంలోకి వచ్చేసారు. మీరు జ్ఞానం యొక్క డ్యాన్స్ చేయాలి. మీరా ది
భక్తి యొక్క డాన్స్, అందులో అర్థమేమీ లేదు. వ్యాసుడు భగవంతుడు అని అంటారు, ఇప్పుడు
వ్యాసుడైతే తండ్రి, వారే గీతను వినిపిస్తారు. మీరు ఎవరికైనా నిరూపించి చెప్పవచ్చు -
బాబా ఒక్కరే, వారి నుండే వారసత్వం లభిస్తుంది. లేదంటే భారత్ కు స్వర్గ వారసత్వం ఎవరు
ఇస్తారు? స్వర్గ స్థాపనను తండ్రి తప్ప ఎవ్వరూ చేయలేరు. సర్వులను విముక్తులుగా చేయడము,
ఒక్క తండ్రి పని మాత్రమే. పోప్ కూడా అనేవారు వన్ నెస్ (ఐక్యత) గా ఉండాలి. కానీ అది
ఎలా జరుగుతుంది? మనమంతా ఒక్కరికి చెందినవారిగా అయ్యాము కదా, కావున సోదరీ-సోదరులుగా
ఎలా అవుతాము అన్నది తెలుసుకోవాలి. అందరూ ఒకటే అంటే అందరూ తండ్రులు అయినట్లు, కానీ
వారు అందరూ సోదరులు కదా. మొత్తం ప్రపంచమంతా అంటారు, ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి.
అంటే తప్పకుండా ఎవరో నిర్దయను చూపిస్తున్నారు. నిర్దయను చూపించేవారు ఎవరు అన్నది
తెలియదు. దయ చూపించేవారైతే తండ్రి ఒక్కరే. నిర్దయుడు రావణుడు, అతడిని కాలుస్తూ
వస్తారు, కానీ కాలిపోడు. శత్రువు మరణిస్తే మళ్ళీ పదే-పదే ఏమైనా కాలుస్తారా. వారు ఏం
చేస్తున్నారు అన్నది ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఒకప్పుడు మీరు ఘోర అంధకారంలో
ఉండేవారు, ఇప్పుడైతే లేరు కదా. కావున మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి. భారత్ ను
సుఖధామంగా చేసేవారు తండ్రి ఒక్కరే. బాబా పరిచయాన్నే ఇవ్వాలి. ఇది కూడా అర్థం
చేయించడం జరుగుతుంది, కానీ అందరూ అర్థం చేసుకోరు. ఎవరైతే శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అయ్యేది ఉందో, వారే అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, నా భక్తులు
ఎవరైతే ఉన్నారో, ప్రయత్నం చేసి వారికే జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞాన ధనాన్ని వ్యర్థంగా
పోగొట్టకండి. దేవతల భక్తులైతే తప్పకుండా దేవతా కులానికి చెందినవారై ఉంటారు.
ఉన్నతోన్నతమైనవారు తండ్రి ఒక్కరే, అందరూ వారిని స్మృతి చేస్తారు. వీరైతే శివబాబా కదా,
తండ్రి నుండి అయితే వారసత్వం తీసుకోవాలి. ఎవరైనా మంచి పని చేసి వెళ్ళిపోతే, వారిని
పూజించడం జరుగుతుంది. కలియుగంలో ఎవరి ద్వారా మంచి పని జరగనే జరగదు ఎందుకంటే ఇక్కడ
ఉన్నది ఆసురీ రావణ మతము. సుఖం ఎక్కడ ఉంది? ఎంత మంచి రీతిగా తండ్రి అర్థం చేయిస్తారు,
కానీ ఎప్పుడైతే తండ్రి పరిచయం ఇస్తారో, అప్పుడే ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుంది.
వీరు తండ్రి కూడా, టీచరు, సద్గురువు కూడా. వీరికి తండ్రి, టీచరు ఎవ్వరూ లేరు.
మొట్టమొదట తల్లి తండ్రి, తర్వాత టీచరు, ఆ తర్వాత సద్గతి కోసం గురువు. అనంతమైన తండ్రి
ఒక్కరే తండ్రి, టీచరు మరియు సద్గురువు - ఇది అద్భుతము.
ఆ తండ్రి ఉన్నతోన్నతమైనవారని మీకు తెలుసు. వారే భారత్ కు స్వర్గ వారసత్వాన్ని
ఇచ్చేవారు. నరకం తర్వాత స్వర్గమే ఉంటుంది. నరకం యొక్క వినాశనం కోసం వినాశ జ్వాల
నిలబడి ఉంది. హోలీలో హాస్యభరిత నాటకం చేస్తారు కదా, మారు వేషము వేసుకొని - స్వామీజి,
వీరి కడుపు నుండి ఏం వెలువడుతుంది? అని అడుగుతారు. యూరోప్ వాసులైన యాదవుల బుద్ధి
నుండి సైన్సు యొక్క ఎన్ని ఆవిష్కరణలు వెలువడుతాయి అన్నది తప్పకుండా చూస్తారు. మీరు
ప్రయత్నించి ఒక్క విషయం పైనే అర్థం చేయించాలి. సర్వుల సద్గతిదాత ఒక్కరే. తండ్రి
రావడమే భారత్ లో వస్తారు - కావున ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము అయ్యింది.
భారత్ ప్రాచీనంగా ఉండేదని అంటారు కూడా. కానీ అర్థము చేసుకోరు. ఏదైతే ప్రాచీనంగా
అయ్యిందో ,అది మళ్ళీ అవుతుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు రాజయోగాన్ని
నేర్చుకున్నారు, అదే మళ్ళీ నేర్చుకుంటారు. ఈ జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము ఇస్తారని
బుద్ధిలో ఉంది. శివునికి కూడా అనేక పేర్లు పెట్టారు. బబుల్ నాథ్ మందిరం కూడా ఉంది.
ముళ్ళను పుష్పాలుగా చేసారు, అందుకే బబుల్ నాథ్ అని అంటారు. ఈ విధంగా చాలా పేర్లు
ఉన్నాయి, వాటి అర్థాన్ని మీరు అర్థం చేయించగలరు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని
ఇవ్వండి, వారిని అందరూ మర్చిపోయారు. మొదట తండ్రిని తెలుసుకోవాలి, అప్పుడే బుద్ధి
యోగం జోడించబడుతుంది. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ముక్తిధామము నుండి మళ్ళీ
జీవన్ముక్తి ధామములోకి వెళ్ళాలి. ఇది పతిత జీవన బంధనము. బాబా అంటారు, పిల్లలూ,
అశరీరిగా అవ్వండి. అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి, దీని ద్వారానే నావ
తీరానికి చేరుకుంటుంది. ఆత్మలందరికీ తండ్రి వారొక్కరే. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, నన్ను
స్మృతి చేసినట్లయితే యోగంతో వికర్మలు వినాశనమవుతాయి. అంతి మతి సో గతి అవుతుంది. మనం
తిరిగి వెళ్ళాలి, ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళాలి. కానీ త్వరగానైతే జరగదు. ఉన్నత
పదవిని పొందాలి అంటే బాబాను గుర్తు పెట్టుకోవాలి. మనం ఒక్క తండ్రి పిల్లలము. ఇప్పుడు
తండ్రి, మన్మనాభవ అని అంటారు. కృష్ణుడు ఏమైనా అలా అంటారా. కృష్ణుడు ఎక్కడున్నారు?
వీరైతే తండ్రి పరమపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు, కావున
తప్పకుండా ఇక్కడే ఉండాలి. ఇది వ్యక్త పతిత ప్రపంచము. అది పావన ప్రపంచము. పతిత
ప్రపంచంలో పావనమైనవారు ఎవ్వరూ ఉండరు. వృక్షములో చూడండి, పైన నిలబడి ఉన్నారు మరియు
కింద తపస్యలో బ్రహ్మా కూర్చున్నారు, వీరి రూపురేఖలనే సూక్ష్మవతనంలో చూస్తారు. వీరు
వెళ్ళి ఫరిశ్తాగా అవుతారు. శ్రీకృష్ణుడు ఈ సమయంలో నల్లగా ఉన్నారు కదా. మొదటి విషయం
ఎప్పటివరకైతే అర్థం చేయించరో, అప్పటివరకు ఏమీ అర్థం చేసుకోరు. ఇందులోనే శ్రమ
అనిపిస్తుంది. మాయ వెంటనే తండ్రి స్మృతిని మరిపింపజేస్తుంది. నిశ్చయంతో రాస్తారు
కూడా, తప్పకుండా మేము నారాయణ పదవిని పొందుతాము అని, అయినా కూడా మర్చిపోతారు. మాయ
చాలా శక్తివంతమైనది. మాయా తుఫానులు ఎన్ని వచ్చినా కానీ చలించకూడదు. అది అంతిమ స్టేజ్.
మాయ రుస్తుమ్ గా అయ్యి యుద్ధం చేస్తుంది. మేకలుగా ఉన్నట్లయితే, వారిని వెంటనే
పడేస్తుంది. భయపడకూడదు. వైద్యులు అంటారు, మొదట వ్యాధి అంతా బయటకు వస్తుంది. మాయా
తుఫానులు కూడా చాలా వస్తాయి. ఎప్పుడైతే మీరు పక్కాగా అవుతారో, అప్పుడు మాయ యొక్క
ఒత్తిడి తగ్గిపోతుంది. ఇప్పుడు వీరు చలించేవారు కాదు అని అర్థం చేసుకుంటుంది. బాబానే
వచ్చి రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేస్తారు. ఇది చాలా రమణీకమైన జ్ఞానము.
భారత్ యొక్క ప్రాచీన రాజయోగం గాయనం చేయబడుతుంది. ఇది మీకు తెలుసు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. స్వధర్మంలో స్థితులయ్యే అభ్యాసం
చేయాలి. జ్ఞాన డ్యాన్స్ చేయాలి మరియు చేయించాలి.
2. మాయా తుఫానులకు చలించకూడదు. భయపడకూడదు. పక్కాగా అయి మాయ యొక్క ఒత్తిడిని
సమాప్తము చేయాలి.