07-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - పాత భక్తులైన మీకు భక్తి ఫలాన్నిచ్చేందుకు తండ్రి వచ్చారు. భక్తికి ఫలము జ్ఞానము, దీనితోనే మీకు సద్గతి లభిస్తుంది"

ప్రశ్న:-

కొంతమంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ తమ భాగ్యాన్ని తామే షూట్ చేసుకుంటారు (కాల్చేసుకుంటారు), ఎలా?

జవాబు:-

ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి సేవ చేయకపోతే, స్వయంపై మరియు ఇతరులపై దయ చూపించకపోతే, వారు తమ భాగ్యాన్ని తామే షూట్ చేసుకుంటారు అంటే పదభ్రష్టులైపోతారు. బాగా చదువుకొని, యోగంలో ఉన్నట్లయితే మంచి పదవి లభిస్తుంది. సర్వీసబుల్ పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి.

గీతము:-

ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...... (కౌన్ ఆయా సవేరే సవేరే......)

ఓంశాంతి. నేను ఆత్మను, శరీరం కాదు మరియు పరమపిత పరమాత్మ నుండి ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది అని ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. నేను వచ్చినప్పుడు మీరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే శరీరంలో ప్రవేశిస్తుంది, ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ మారదు, శరీరం మారుతుంది. ఆత్మ అయితే అవినాశీ కనుక స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానం ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. పిల్లల పిలుపుపై తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా ఎవ్వరికీ తెలియదు. కల్పం యొక్క పురుషోత్తమ సంగమయుగంలో మొత్తం విశ్వం పురుషోత్తమంగా అవుతున్నప్పుడు నేను రావడం జరుగుతుంది అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలోనైతే విశ్వం మొత్తం కనిష్ఠంగా, పతితంగా ఉంది. ఆ ప్రపంచాన్ని అమరపురి అని అంటారు, ఇది మృత్యులోకము. మృత్యులోకంలో ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులుంటారు, అమరలోకంలో దైవీ గుణాలు గల మనుష్యులుంటారు, అందుకే వారిని దేవతలు అని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావం కలిగిన వారిని దేవత వంటి వారని అంటారు. కొంతమంది దైవీ గుణాలు కలిగిన వారు ఉంటారు, ఈ సమయంలో అందరూ ఆసురీ గుణాలు గల మనుష్యులుంటారు. పంచ వికారాల్లో చిక్కుకొని ఉన్నారు, అందుకు మీరు వచ్చి ఈ దుఃఖం నుండి ముక్తులుగా చేయండి అని పాడుతారు. కేవలం ఒక్క సీతను మాత్రమే విడిపించలేదు. భక్తులను సీతలు అని అంటారు, భగవంతుడిని రాముడు అని అంటారని తండ్రి అర్థం చేయించారు. వారు భక్తులకు ఫలం ఇచ్చేందుకు వస్తారు. ఈ అనంతమైన రావణ రాజ్యంలో మొత్తం ప్రపంచం చిక్కుకుని ఉంది. వాళ్ళను విడిపించి రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు. ఇది రఘుపతి రాఘవ రాజా రాముని విషయం కాదు. వారు త్రేతాయుగపు రాజు. ఇప్పుడు ఆత్మలన్నీ తమోప్రధానంగా, శిథిలావస్థలో ఉన్నాయి, మెట్లు దిగుతూ-దిగుతూ కిందకి వచ్చేశాయి. పూజ్యుల నుండి పూజారిగా అయిపోయాయి. దేవతలు ఎవ్వరినీ పూజించరు. వారు పూజ్యులు. మళ్ళీ వారే వైశ్యులుగా, శూద్రులుగా అయినప్పుడు పూజలు మొదలౌతాయి, వామమార్గంలోకి రావడంతో పూజారులుగా అవుతారు, పూజారులు దేవతల చిత్రాల ఎదురుగా నమస్కరిస్తారు. ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులుగా లేరు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు పూజ్యులు, తర్వాత సత్యయుగీ దేవతలు పూజ్యులు. ఈ సమయంలోనైతే అందరూ పూజారులు, మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది, అది అవ్యభిచారీ పూజ. అది సతోప్రధానమైనది, తర్వాత సతో, ఆ తర్వాత దేవతల పూజ నుండి కిందకు దిగి నీటిని, మనుష్యులను, పక్షులను మొదలైనవాటిని పూజించడం ప్రారంభిస్తారు. రోజు-రోజుకూ అనేకులకు పూజ జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ధార్మిక కాన్ఫరెన్స్ లు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆదిసనాతన ధర్మమువారిది, ఒకసారి జైనులది, ఒకసారి ఆర్యసమాజం వారిది జరుగుతూ ఉంటాయి. అక్కడకు చాలామందిని పిలుస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని ఉన్నతంగా భావిస్తారు కదా. ప్రతి ఒక్క ధర్మములో ఏదో ఒక విశేష గుణం ఉన్న కారణంగా వారు స్వయాన్ని గొప్పగా భావిస్తారు. జైనుల్లో కూడా రకరకాల వారుంటారు. 5-6 వెరైటీ వారుంటారు. వారిలో మళ్ళీ కొంతమంది నగ్నంగా కూడా ఉంటారు, నగ్నంగా అవ్వడం అంటే అర్థమేమిటో తెలుసుకోరు. భగవానువాచ - నగ్నంగా అవ్వడం అంటే అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. వారేమో వస్త్రాలు తీసేసి నగ్నంగా అవుతారు. భగవానువాచకు అర్థము తెలియదు. ఆత్మలైన మీరు ఈ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు, ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మయే తన పాత్ర అభినయించేందుకు వస్తుంది, వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. క్రొత్త-క్రొత్త రకాల ధర్మాలు వెలువడుతూ ఉంటాయి, అందుకే దీనిని వెరైటీ నాటకమని అంటారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఇస్లాం వారిని చూడండి, ఎంత నల్లగా ఉన్నారు. వారివి కూడా చాలా శాఖలు వెలువడుతాయి. మహమ్మద్ అయితే తర్వాత వచ్చారు. మొదటిది ఇస్లాం ధర్మము. ముస్లింల సంఖ్య చాలా ఉంది, ఆఫ్రికాలో ఎంతమంది షావుకార్లు ఉన్నారు, అక్కడ బంగారం-వజ్రాల గనులు ఉన్నాయి. ఎక్కడైనా చాలా ధనం కనబడితే, వారిపై దండెత్తి ధనవంతులుగా అవుతారు. క్రిస్టియన్లు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు. భారత్ లో కూడా ధనం ఉంది కానీ అది గుప్తంగా ఉంది. బంగారం మొదలైనవాటిని ఎంతగా పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దిగంబర జైన సభ వారు కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వయాన్ని గొప్పగా భావిస్తారు కదా. ఈ ధర్మాలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి, ఎప్పటికైనా వినాశనం జరగవల్సిందే, ఏమీ అర్థం చేసుకోరు. అన్ని ధర్మాలలోనూ మీ బ్రాహ్మణ ధర్మమే ఉన్నతమైనది, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగీ బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు కానీ వారు కుఖవంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు అంటే అందరూ పరస్పరంలో సోదరీ-సోదరులుగా ఉండాలి. ఒకవేళ ఆ బ్రాహ్మణులు స్వయాన్ని బ్రహ్మా సంతానముగా పిలుచుకుంటే, మరి పరస్పరంలో సోదరీ-సోదరులుగా ఉన్నట్లు, అటువంటప్పుడు వివాహం కూడా చేసుకోకూడదు. కావున వారు బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణులు కారు అని ఋజువు అవుతుంది, కేవలం ఆ పేరు పెట్టుకుంటారు. వాస్తవానికి బ్రాహ్మణులను దేవతల కన్నా ఉన్నతమైనవారు అని అంటారు, వారిది పిలక స్థానం కదా. ఈ బ్రాహ్మణులే మనుష్యులను దేవతలుగా చేస్తారు. వీరిని చదివించేవారు పరమపిత పరమాత్మ, స్వయంగా జ్ఞానసాగరుడు. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి వద్దకు వచ్చి బ్రాహ్మణులుగా అయి మళ్ళీ రేపు శూద్రులుగా అయిపోతారు. పాత సంస్కారాలు మార్చుకోవడం చాలా శ్రమనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి, ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. చేతులు పని వైపు, హృదయం తండ్రి వైపు ఉండాలని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజము. ప్రేయసీ-ప్రియులు ఎలాగైతే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరో, అదే విధంగా బాబా అయితే ప్రియుడే. బాబాను స్మృతి చేస్తూ ఉండే పిల్లలందరూ ప్రేయసులు. ఒక్క తండ్రి మాత్రమే ఎప్పుడూ ఎవ్వరికీ ప్రేయసిగా కారు ఎందుకంటే వారికన్నా ఉన్నతమైనవారు ఎవ్వరూ ఉండరు. అవును, భక్తి మార్గం నుండి మొదలుకొని ప్రియుడినైన నాకు మీరందరూ ప్రేయసులు అని తండ్రి పిల్లల మహిమ చేస్తారు. మీరు వచ్చి దుఃఖం నుండి ముక్తులుగా చేసి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. మీరందరూ వధువులు, నేను వరుడిని. మీరందరూ ఆసురీ జైలులో చిక్కుకొని ఉన్నారు, నేను వచ్చి విడిపిస్తాను. ఇందులో చాలా శ్రమ ఉంది, వికారీ దృష్టి మోసం చేస్తుంది, పవిత్రమైన దృష్టి కలవారిగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది. దేవతలకు ఎంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు అలాంటి దేవతలుగా తయారుచేసేవారు తప్పకుండా కావాలి కదా.

"మానవ జీవితంలో ధర్మం యొక్క ఆవశ్యకత" అని కాన్ఫరెన్సులో టాపిక్ పెట్టారు. డ్రామాను తెలుసుకోని కారణంగా తికమకలో ఉన్నారు. మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. క్రిస్టియన్లు లేదా బౌద్ధులు మొదలైనవారికి క్రీస్తు, బుద్ధుడు మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. మీరు వెంటనే లెక్కను చెప్పగలరు. ధర్మం యొక్క ఆవశ్యకత అయితే ఉంది కదా అని అర్థం చేయించాలి. మొట్టమొదట ఏ ధర్మం ఉండేది, తర్వాత ఏ ధర్మం వచ్చింది అనేది చెప్పాలి. మన ధర్మం వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. యోగం చేయరు. యోగం లేకుండా శక్తి లభించదు, పదును నిండదు. తండ్రిని మాత్రమే ఆల్మైటీ అథారిటీ అని అంటారు. మీరు ఎంత ఆల్మైటీ (సర్వశక్తివంతులు) గా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఆ సమయంలో ఇంకే ఖండమూ ఉండదు. ఇప్పుడైతే ఎన్ని ఖండాలున్నాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము, అయితే సృష్టి ఎంత పెద్దదిగా ఉంది అనేది ఎవ్వరూ కొలవలేరు. భూమిని కొలవగలరు. సాగరాన్ని అయితే కొలవలేరు. ఆకాశం మరియు సాగరం యొక్క అంతాన్ని ఎవ్వరూ కనుక్కోలేరు. అందుకే ధర్మం యొక్క ఆవశ్యకత ఏమిటో వారికి అర్థం చేయించాలి. చక్రమంతా ధర్మాలపైనే తయారయ్యింది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం, ఈ వృక్షం అంధుల ఎదురుగా దర్పణం వంటిది.

మీరిప్పుడు బయటకు సేవకు వెళ్తారు, నెమ్మది-నెమ్మదిగా మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. తుఫాను వస్తే చాలా ఆకులు రాలిపోతాయి కదా. ఇతర ధర్మాలలో తుఫాను యొక్క విషయమేమీ ఉండదు. వారైతే పై నుండి రావాల్సిందే, ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది. మొట్టమొదటి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారికే భగవంతుడు వచ్చి తమ ఇంటికి తీసుకువెళ్ళే ఫలమునివ్వాలి. ఆత్మలైన మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా. తండ్రి స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని కూడా ఇస్తారని ఎవ్వరికీ తెలియదు. సన్యాసులైతే సుఖాన్ని అసలు అంగీకరించరు. వారు మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షాన్ని వారసత్వం అని అనరు. స్వయంగా శివబాబా కూడా పాత్రను ఆభినయించాల్సి వస్తుంది అన్నప్పుడు ఇంకెవరినైనా మోక్షంలో ఎలా ఉంచగలరు. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలైన మీకు తమ ధర్మం మరియు అన్ని ధర్మాల గురించి తెలుసు. మీకు దయ కలగాలి. చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. మీ ధర్మ స్థాపకులు వారి సమయానికి మళ్ళీ వస్తారు అని చెప్పండి. అర్థం చేయించేవారు కూడా తెలివైనవారు ఉండాలి. ప్రతి ఒక్కరూ సతోప్రధానం నుండి సతో-రజో-తమోలోకి రావాల్సిందేనని మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడిది రావణ రాజ్యం. మీది సత్యమైన గీత, దీనిని తండ్రి వినిపిస్తున్నారు. నిరాకారుడినే భగవంతుడు అని అంటారు. ఆత్మ నిరాకారుడైన గాడ్ ఫాదర్ నే పిలుస్తుంది. అక్కడ ఆత్మలైన మీరుంటారు. మిమ్మల్ని పరమాత్మ అని అనరు. పరమాత్మ అయితే ఒక్కరే, వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, మిగిలిన ఆత్మలందరూ వారి పిల్లలు. సర్వుల సద్గతిదాత ఒక్కరే, ఆ తర్వాత దేవతలు. వారిలో కూడా నంబర్ వన్ కృష్ణుడు, ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మీరు సంగమయుగ వాసులు. మీ జీవితం అమూల్యమైనది. దేవతలది అమూల్యమైనది కాదు, బ్రాహ్మణుల జీవితము అమూల్యమైనది. తండ్రి మిమ్మల్ని పిల్లలుగా చేసుకొని మీపై ఎంత శ్రమ చేస్తారు, దేవతలు ఇంత శ్రమ చేయరు. వారు పిల్లలను చదివించేందుకు స్కూలుకు పంపిస్తారు. ఇక్కడ తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు తండ్రి, టీచరు, గురువు, ముగ్గురూ వారే. కనుక వారిని ఎంత గౌరవించాలి. సర్వీసబుల్ పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. మంచి తెలివైనవారు, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. హ్యాండ్స్ అయితే కావాలి కదా. ఎవరికైతే యుద్ధ మైదానంలోకి వెళ్ళడం నేర్పిస్తారో, వారిని ఉద్యోగం మొదలైన వాటన్నిటి నుండి విడిపిస్తారు. వారి వద్ద లిస్టు ఉంటుంది. మేము మైదానంలోకి వెళ్ళము అని ఎవ్వరూ మిలట్రీను తిరస్కరించలేరు. వారికి డ్రిల్లు నేర్పంచి, అవసరమైనప్పుడు పిలుస్తారు. తిరస్కరించేవారి మీద కేసు పెడతారు. ఇక్కడైతే అటువంటి విషయం లేదు. ఇక్కడ ఎవరైతే బాగా సేవ చేయరో, వారు పదభ్రష్టులైపోతారు. సేవ చేయడం లేదు అంటే మిమ్మల్ని మీరు షూట్ చేసుకుంటున్నారు. పదభ్రష్టులైపోతారు. మీ భాగ్యాన్ని షూట్ చేసుకుంటారు. బాగా చదువుకుని, యోగంలో ఉన్నట్లయితే మంచి పదవి లభిస్తుంది. మీపై మీరు దయ చూపించుకోవాలి. మీపై మీరు దయ చూపించుకుంటే ఇతరులపై కూడా చూపిస్తారు. తండ్రి అన్ని రకాల వివరణ ఇస్తూ ఉంటారు. ఈ ప్రపంచ నాటకం ఎలా నడుస్తుంది. రాజధాని స్థాపన కూడా జరుగుతుంది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు ఆహ్వానమైతే లభిస్తుంది. 5-10 నిముషాలలో ఏమి అర్థం చేయించగలరు. ఒకటి-రెండు గంటలు ఇస్తే అర్థం చేయించగలము. డ్రామా గురించి ఏ మాత్రం తెలియదు. అక్కడక్కడ మంచి-మంచి పాయింట్లు వ్రాసుకోవాలి కానీ పిల్లలు మర్చిపోతారు. తండ్రి సృష్టికర్త కూడా, పిల్లలైన మిమ్మల్ని సృష్టిస్తారు. మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు, డైరెక్టర్ గా అయి డైరెక్షన్ కూడా ఇస్తారు. శ్రీమతాన్నిస్తారు మరియు పాత్రను కూడా అభినయిస్తారు, జ్ఞానం వినిపిస్తారు. ఇది కూడా వారి ఉన్నతాతి ఉన్నతమైన కార్యం కదా. డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ ను తెలుసుకోకపోతే ఏమి లాభం? అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అమూల్యమైన జీవితంలో చదివించే టీచర్ పట్ల చాలా చాలా గౌరవముంచాలి, చదువులో చాలా తెలివైనవారిగా అయి సేవలో నిమగ్నమవ్వాలి. మీపై మీరే దయ చూపించుకోవాలి.

2. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేందుకు పవిత్ర దృష్టి కలవారిగా అవ్వాలి. మీ నడవడికను సరిదిద్దుకోవాలి. మనుష్యులను దేవతలుగా చేసే సేవ చేయాలి.

వరదానము:-

సంకల్పాలు మరియు మాటల విస్తారాన్ని సారములోకి తీసుకువచ్చే అంతర్ముఖీ భవ

వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితులవ్వడం అంటే నోటి ద్వారా వెలువడే వ్యర్థం యొక్క శబ్దాన్ని సర్దుకొని సమర్థములోకి అనగా సార రూపంలోకి తీసుకు రావడం - ఇదే అంతర్ముఖత. ఇటువంటి అంతర్ముఖీ పిల్లలే సైలెన్స్ శక్తి ద్వారా భ్రమిస్తున్న ఆత్మలకు సరైన స్థానాన్ని చూపించగలరు. ఈ సైలెన్స్ శక్తి అనేక ఆత్మిక రంగురంగుల ఆటలను చూపిస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ మనసులోని శబ్దము, ఎవరో సన్ముఖంగా మాట్లాడుతున్నట్లుగా సమీపంగా వినిపిస్తుంది.

స్లోగన్:-

స్వభావం, సంస్కారం, సంబంధం, సంపర్కంలో లైట్ గా ఉండడం అంటే ఫరిస్తాగా అవ్వడం.