08-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము, బ్రాహ్మణులైన మాకే తండ్రి యొక్క శ్రేష్ఠ మతము లభిస్తుందనే నషా మీకుండాలి”

ప్రశ్న:-

ఎవరికైతే కొత్త రక్తము ఉంటుందో, వారికి ఏ అభిరుచి మరియు ఎటువంటి నషా ఉండాలి?

జవాబు:-

ఈ ప్రపంచమేదైతే పాతగా, ఇనుప యుగముగా అయిపోయిందో, దానిని కొత్త బంగారు యుగముగా తయారు చేయాలనే, పాతదానిని కొత్తదిగా తయారుచేయాలనే అభిరుచి ఉండాలి. కన్యలది కొత్త రక్తము కనుక తమ తోటివారిని పైకెత్తాలి. నషాను స్థిరంగా ఉంచుకోవాలి. భాషణ చేయడంలో కూడా చాలా నషా ఉండాలి.

గీతము:-

రాత్రి ప్రయాణికుడా అలసిపోకు..... (రాత్ కే రాహీ థక్ మత్ జానా.....)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను అర్థము చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయమైన రాత్రి పూర్తవుతుంది. ఇప్పుడు మాపై కిరీటము రానున్నదని పిల్లలకు తెలుసు. ఇక్కడ కూర్చున్నారు, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం మీ లక్ష్యము-ఉద్దేశ్యము. నీవు స్వయాన్ని ఎద్దుగా భావించినట్లయితే ఆ రూపము ఏర్పడుతుందని సన్యాసులు అర్థం చేయిస్తారు. అది భక్తి మార్గము యొక్క ఉదాహరణ. అలాగే రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని కూడా ఉదాహరణ ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు. మనమే డబల్ కిరీటధారులైన దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను ఇది చదువుకొని డాక్టరుగా అవుతాను, ఇంజినీరుగా అవుతానని అంటారు. ఈ చదువు ద్వారా మనమే దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ శరీరాన్ని వదిలేస్తాము మరియు మన తలపై కిరీటముంటుంది. ఇది చాలా అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము కదా. కొత్త ప్రపంచము ఫస్ట్ క్లాస్ ప్రపంచము. పాత ప్రపంచము పూర్తిగా థర్డ్ క్లాస్ ప్రపంచము. ఇది అంతమవ్వనున్నది. కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారుచేసేవారు తప్పకుండా విశ్వ రచయితయే అవుతారు. ఇతరులెవ్వరూ చదివించలేరు. శివబాబాయే మిమ్మల్ని చదివించి నేర్పిస్తారు. పూర్తిగా ఆత్మాభిమానులుగా అయిపోతే ఇంకేమి కావాలి అని తండ్రి అర్థం చేయించారు. మీరు బ్రాహ్మణులు ఉన్నారు. మేము దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఎంత పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ ఎంత పతిత మనుష్యులు ఉన్నారు. ముఖము మనుష్యులదే కానీ లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎవరైతే దేవతల పూజారులుగా ఉన్నారో, వారు కూడా స్వయం వారి ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు..... మేము వికారులము, పాపులము అని మహిమను పాడుతారు. వారి ముఖము కూడా మనుష్యుల వంటిదే కానీ వారి వద్దకు వెళ్ళి మహిమను పాడుతారు, తమను తాము అశుద్ధమైనవారిమని, వికారులమని అనుకుంటారు. మాలో ఏ గుణాలు లేవని అంటారు. వారు కూడా మనుష్యులే. ఇప్పుడు మనము పరివర్తనై వెళ్ళి దేవతలుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. కృష్ణపురిలోకి వెళ్ళేందుకే కృష్ణుని పూజ చేస్తారు కానీ ఎప్పుడు వెళ్తారనేది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి భక్తి ఫలమునిస్తారని భక్తి చేస్తూ ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అనే నిశ్చయం మీకు మొట్టమొదట ఉండాలి. ఇది శ్రీ శ్రీ శివబాబా యొక్క మతము. శివబాబా మీకు శ్రీమతమునిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోనివారు శ్రేష్ఠంగా ఎలా అవ్వగలరు. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివబాబా మతంపై నడుస్తున్నారు. పరమాత్మ మతమే శ్రేష్ఠంగా తయారుచేస్తుంది, ఎవరి భాగ్యంలో ఉంటే, వారి బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే ఏమీ అర్థము చేసుకోరు. ఎప్పుడైతే అర్థము చేసుకుంటారో, అప్పుడు సంతోషించి సహాయము చేయడం ప్రారంభిస్తారు. చాలామందికి తెలియదు, వీరు ఎవరు అనేది వారికేమి తెలుసు, అందుకే బాబా ఎవ్వరినీ కలవరు. అటువంటివారైతే ఇంకా తమ మతమును ఇస్తారు. శ్రీమతం తెలియని కారణంగా వారికి కూడా తమ మతమునివ్వడం ప్రారంభిస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని శ్రేష్ఠంగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు. 5 వేల సంవత్సరాల క్రితము వలె తండ్రి వచ్చి తమను కలుసుకున్నారని పిల్లలకు తెలుసు. ఎవరికైతే తెలియదో, వారు ఈ విధంగా బదులు చెప్పలేరు. పిల్లలకు చదువు యొక్క నషా చాలా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు కానీ మాయ కూడా చాలా వ్యతిరేకిస్తుంది. ఏ చదువు ద్వారానైతే మన శిరస్సుపై డబుల్ కిరీటాలు వస్తాయో, ఆ చదువును మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మ జన్మాంతరాలు డబుల్ కిరీటధారులుగా అవుతారు. కనుక దీని కోసం మళ్ళీ అటువంటి పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి కదా. దీనిని రాజయోగమని అంటారు. ఇది ఎంత అద్భుతమైనది. లక్ష్మీనారాయణుల మందిరాలకి వెళ్ళండని బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తారు. మీరు పూజారులకు కూడా అర్థము చేయించవచ్చు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ పదవి ఎలా లభించింది, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అన్నది పూజారులు కూడా కూర్చుని ఎవరికైనా అర్థం చేయించాలి. ఈ విధంగా కూర్చుని వినిపించినట్లయితే పూజారులకు కూడా గౌరవము లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యమెలా లభించింది అనేది మేము మీకు అర్థం చేయిస్తామని మీరు చెప్పవచ్చు. గీతలో కూడా భగవానువాచ ఉంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారుచేస్తాను. మీరే స్వర్గవాసులుగా అవుతారు కదా కనుక మేమిలా అవుతామని పిల్లలకెంత నషా ఉండాలి. మీ చిత్రాన్ని మరియు మీ రాజ్యపు చిత్రాన్ని కలిపి ఇక్కడ తీయించుకోండి. క్రింద మీ చిత్రం, పైన రాజ్యము యొక్క చిత్రము ఉండాలి. ఇందులో ఖర్చేమీ ఉండదు కదా. రాజదుస్తులనైతే వెంటనే తయారుచేయవచ్చు, అప్పుడు మేము దేవతలుగా అవుతున్నామని పదే-పదే గుర్తుంటుంది. పైన శివబాబా కూడా ఉండాలి. ఈ చిత్రాన్ని కూడా తీసుకోవలసి ఉంటుంది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఈ శరీరము వదిలి మనము వెళ్ళి దేవతలుగా అవుతాము ఎందుకంటే మనమిప్పుడు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. కనుక ఈ ఫోటో కూడా సహాయపడుతుంది. పైన శివబాబా, దాని క్రింద రాజ్యపు చిత్రాలు. దాని క్రింద మీ సాధారణ చిత్రము. శివబాబా నుండి రాజయోగాన్ని నేర్చుకుని మనము దేవతలుగా, డబుల్ కిరీటధారులుగా తయారవుతున్నాము. చిత్రము పెట్టుకున్నట్లయితే, మాకు రాజయోగాన్ని నేర్పించేవారు ఈ శివబాబా అని మనం ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాము. చిత్రం చూస్తూనే పిల్లలకు నషా ఎక్కుతుంది. దుకాణములో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గములో బాబా నారాయణుని చిత్రాన్ని పెట్టుకునేవారు. పాకెట్ లో కూడా ఉండేది. మీరు కూడా మీ ఫోటో పెట్టుకున్నట్లయితే మేమే దేవీ దేవతలుగా అవుతున్నామని గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలు వెతకాలి. తండ్రిని మర్చిపోవడం వల్లనే పడిపోతారు. వికారాల్లో పడిపోతే మళ్ళీ సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఈ దేవతలుగా అవ్వలేమని హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మనము దేవతలుగా ఎలా అవుతాము? వికారాల్లో పడిపోయే వారి ఫోటోలు తీసేయండని బాబా అంటారు. మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా లేరు, మీ పాస్పోర్టు క్యాన్సిల్ అని వారికి చెప్పండి. మేము పడిపోయాము, ఇప్పుడు మేము స్వర్గానికి ఎలా వెళ్తామని స్వయం కూడా ఫీల్ అవుతారు. నారదుని ఉదాహరణను ఇస్తారు కదా. నీవు నీ ముఖము చూసుకో, లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నారా అని వారితో అన్నారు. అప్పుడు వారి ముఖము కోతి వలె కనిపించింది. కనుక మనుష్యులకు కూడా - మాలో ఈ వికారాలున్నాయి, మరి మేము శ్రీ నారాయణుని లేక శ్రీ లక్ష్మిని ఎలా వరించగలము అని సిగ్గు అనిపిస్తుంది. బాబా అయితే యుక్తులన్నీ తెలియజేస్తారు కానీ ఎవరైనా విశ్వాసం కూడా ఉంచాలి కదా. వికారాల నషా కలిగినప్పుడు, ఈ లెక్కన మేము రాజులకే రాజుగా, డబుల్ కిరీటధారులుగా ఎలా అవుతామని వారు అర్థం చేసుకుంటారు. పురుషార్థమైతే చేయాలి కదా. ఇటువంటి యుక్తులను రచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండని బాబా తెలియజేస్తూ ఉంటారు. రాజయోగం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. రోజు రోజుకూ తుఫానుల జోరు పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. భవిష్య ఉన్నత పదవిని పొందేందుకే మీరు ఈ చదువును చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితుల నుండి పావనంగా అవుతారు. మేము నరకవాసులమని మనుష్యులు అర్థం చేసుకోరు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. భాగ్యంలో ఉన్నట్లయితే వెంటనే అర్థము చేసుకుంటారు లేదంటే మీరు ఎంతగా తల బాదుకున్నా సరే, బుద్ధిలో కూర్చోదు. తండ్రి గురించే తెలియకపోతే నాస్తికులు అనగా అనాథలు, కావున శివబాబా పిల్లలైనందుకు వారిని సనాథలుగా చేయాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానముంటుందో, వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులైతే వారి పిల్లలను కూడా తమ వలె చిక్కుకునేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షించడం జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట కన్యలను రక్షించాలి. తల్లిదండ్రులు పిల్లలను వికారాలలో తోసేస్తూ ఉంటారు. ఇది భ్రష్టాచార ప్రపంచమని మీకు తెలుసు. శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని కోరుకుంటారు. భగవానువాచ - నేను శ్రేష్ఠాచారిగా తయారుచేయడానికి వచ్చినప్పుడు అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. నేను అందరినీ ఉద్ధరిస్తాను. గీతలో కూడా సాధుసన్యాసులు మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు భగవంతుడే రావలసి ఉంటుందని వ్రాయబడి ఉంది. ఒక్క భగవంతుడైన తండ్రియే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. ఇప్పుడు మనుష్యులు ఎంత రాతి బుద్ధికలవారిగా అయిపోతారో అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ఒకవేళ గొప్ప-గొప్పవారికి గీతా భగవంతుడు శివుడని తెలిస్తే ఏమైపోతుందో తెలియదు. హాహాకారాలు వ్యాపిస్తాయి. కానీ అందుకు ఇంకా సమయముంది లేకపోతే అందరి ఆసనాలు ఒక్కసారిగా కదలడం మొదలుపెడతాయి. ఎంతోమంది సింహాసనాలు కదులుతాయి కదా. యుద్ధము జరిగినప్పుడు, వీరి సింహాసనం కదలడం మొదలయ్యింది, ఇప్పుడు పడిపోతారని తెలుస్తుంది. ఇప్పుడే ఇవి కదిలితే చాలా అలజడి జరుగుతుంది. ఇది మున్ముందు జరుగనున్నది. తప్పకుండా బ్రహ్మా తనువు ద్వారానే స్థాపన చేస్తున్నానని పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత స్వయంగా చెప్తున్నారు. సర్వుల సద్గతిని అనగా ఉద్ధరణను చేస్తున్నాను. భగవానువాచ - ఇది పతిత ప్రపంచము, వీరందరినీ నేను ఉద్ధరించాలి. ఇప్పుడందరూ పతితులుగా ఉన్నారు. మరి పతితులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు? మొదట స్వయం పావనంగా అయి ఆ తర్వాత ఫాలోవర్స్ ను తయారు చేయాలి. భాషణ చేయడంలో చాలా నషా ఉండాలి. కన్యలది కొత్త రక్తము. మీరు పాతవారి నుండి కొత్తవారిగా చేస్తున్నారు. మీ ఆత్మ ఏదైతే పాత ఇనుప యుగముదిగా అయిపోయిందో, అది ఇప్పుడు కొత్త బంగారు యుగముదిగా అవుతుంది. మలినము తొలగిపోతూ ఉంటుంది. కనుక పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. నషాను స్థిరంగా ఉంచుకోవాలి. మీ తోటివారిని మేల్కొలపాలి. గురుమాత అనే గాయనము కూడా ఉంది. మాత గురువుగా ఎప్పుడవుతారు అనేది మీకిప్పుడు తెలుసు. జగదంబయే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతారు. అక్కడ ఇక గురువులెవ్వరూ ఉండరు. గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి వచ్చి మాతలపై జ్ఞానామృత కలశాన్ని పెడతారు. ప్రారంభము నుండి ఇలాగే జరుగుతుంది. సెంటర్ల కోసం కూడా బ్రహ్మాకుమారి కావాలని అంటారు. మీరే నడుపుకోండి, ధైర్యము లేదా అని బాబా అంటారు. అలా కాదు బాబా, మాకు టీచరు కావాలి అని అంటారు. ఇది కూడా మంచిదే, గౌరవాన్ని ఇస్తారు.

ఈ రోజుల్లో ప్రపంచంలో ఒకరికొకరు కుంటి గౌరవమునిస్తారు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు, రేపు వారిని తొలగించేస్తారు. స్థిరమైన సుఖము ఎవ్వరికీ లభించదు. ఈ సమయంలో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్య భాగ్యము లభిస్తోంది. బాబా మీకు ఎన్ని రకాలుగా అర్థము చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తారు. శుభ భావన ఉంచాలి కదా. ఓహో! మేము ఈ లక్ష్మీ నారాయణులుగా అవుతాము. ఒకవేళ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇక పురుషార్థమేమి చేస్తారు. బాబా పురుషార్థమునైతే తెలియజేస్తారు కదా. పురుషార్థము ఎప్పుడూ వ్యర్థమవ్వదు, అది సదా సఫలమవుతుంది. రాజధాని స్థాపన జరిగి తీరుతుంది. వినాశనము కూడా మహాభారత యుద్ధము ద్వారా జరగవలసిందే. మున్ముందు మీరు ఇంకా తీవ్రతరం చేసినట్లయితే వారందరూ వస్తారు. ఇప్పుడు అర్థము చేసుకోరు, తర్వాత వారి రాజ్యమంతా ఎగిరిపోతుంది. ఎంతమంది గురువులున్నారు, ఎవ్వరికీ ఫాలోవర్స్ గా అవ్వనటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ఇక్కడ మీకు సద్గతినిచ్చే ఒక్క సద్గురువు లభించారు. చిత్రాలు చాలా బాగున్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, ఇది ముక్తిధామము. ఆత్మలైన మనమంతా నిర్వాణధామములో ఉంటామని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడి నుండి మళ్ళీ టాకీలోకి వస్తాము. ఆత్మలు అక్కడి నివాసులము. ఈ ఆట భారతదేశముపైనే తయారుచేయబడి ఉంది. శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఇప్పుడు నేను వచ్చాను, కల్పము తర్వాత మళ్ళీ వస్తానని తండ్రి అంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి రావడంతోనే స్వర్గముగా తయారవుతుంది. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది, స్వర్గముండేదని కూడా చెప్తారు. ఇప్పుడు లేదు, మళ్ళీ తయారవుతుంది. కనుక నరకవాసుల వినాశనము, స్వర్గవాసుల స్థాపన తప్పకుండా జరగాలి. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నరకవాసులందరూ వినాశనమైపోతారు. ఇంకా లక్షల సంవత్సరాలున్నాయి, పిల్లలు పెద్దవారైన తర్వాత వారికి వివాహము చేయాలి..... అని వారు భావిస్తారు కానీ మీరు ఆ విధంగా అనరు. ఒకవేళ కొడుకు మీ సలహాపై నడవకపోతే, స్వర్గవాసిగా అవ్వకపోతే ఏం చేయాలి అని శ్రీమతము తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆజ్ఞాకారిగా లేకపోతే వారిని వెళ్ళిపోనివ్వండి అని తండ్రి అంటారు. ఇందులో పక్కా నష్టోమోహ స్థితి కావాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రేష్ఠ మతంపై నడుచుకొని స్వయాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకోవాలి. శ్రీమతములో మన్మతము మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ చదువు యొక్క నషాలో ఉండాలి.

2. తమ తోటివారి కళ్యాణము కొరకు యుక్తులను రచించాలి. అందరి పట్ల శుభభావనను ఉంచుతూ ఒకరికొకరు సత్యమైన గౌరవమునివ్వాలి. కుంటి గౌరవము కాదు.

వరదానము:-

ఆత్మిక ఎక్సర్ సైజ్ మరియు సెల్ఫ్ కంట్రోల్ ద్వారా సూక్ష్మతను అనుభవం చేసే ఫరిస్తా భవ

బుద్ధి యొక్క సూక్ష్మత మరియు తేలికతనము బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ. సూక్ష్మతయే మహానత. కానీ దాని కోసం ప్రతిరోజూ అమృతవేళ అశరీరితనం యొక్క ఆత్మిక ఎక్సర్ సైజ్ చేయండి మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనం యొక్క పత్యము చేయండి. పత్యము కోసం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏ సమయములో ఏ సంకల్పం రూపీ భోజనాన్ని స్వీకరించాలో, ఆ సమయములో దానినే స్వీకరించండి. వ్యర్థ సంకల్పాలనే ఎక్స్ ట్రా భోజనం చేయకండి, అప్పుడు సూక్ష్మ బుద్ధి కలవారిగా అయి ఫరిస్తా స్వరూపమనే లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు.

స్లోగన్:-

ఎవరైతే ప్రతి సెకండు, ప్రతి అడుగు శ్రీమతముపై ఎక్యురేట్ గా నడుస్తారో, వారే మహానాత్మలు.