08-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచంపై బృహస్పతి దశ కూర్చోనున్నది, బాబా పిల్లలైన మీ ద్వారా భారతదేశాన్ని సుఖధామంగా తయారుచేస్తున్నారు”

ప్రశ్న:-

16 కళా సంపూర్ణులుగా తయారయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థము చేస్తారు?

జవాబు:-

యోగబలమును జమ చేసుకునే పురుషార్థము. యోగబలము ద్వారా మీరు 16 కళా సంపూర్ణులుగా తయారవుతున్నారు. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని దీని కోసమే తండ్రి చెప్తారు. మీరు కింద పడిపోయే విధంగా చేసే కామ వికారాన్ని దానమిచ్చినట్లయితే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. 2. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి, శరీర భానాన్ని వదిలేయండి.

గీతము:-

నీవే తల్లివి, తండ్రివి..... (తుమ్ మాత్ పితా.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, తమ ఆత్మిక తండ్రి మహిమను విన్నారు. వాళ్ళు పాడుతూ ఉంటారు, మీరిక్కడ ప్రాక్టికల్ గా ఆ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబా మా ద్వారానే భారతదేశాన్ని సుఖధామంగా చేస్తున్నారని మీకు తెలుసు. ఎవరి ద్వారానైతే తయారుచేయిస్తున్నారో, తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనము వారసత్వమును పొందుతున్నాము. ఇప్పుడు పిల్లలైన మీపై అనగా మొత్తం ప్రపంచముపై బృహస్పతి యొక్క అవినాశీ దశ ఉంది. ముఖ్యంగా భారతదేశము మరియు ప్రపంచమంతటిపై బృహస్పతి దశ కూర్చోనున్నదని ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మీరిప్పుడు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలోనైతే కళలేవీ లేవు. పిల్లలకు చాలా సంతోషముండాలి. ఇక్కడ సంతోషం ఉంటుంది కానీ బయటకు వెళ్ళడంతో సంతోషం మాయమవ్వడం కాదు. మీరు ఎవరి మహిమనైతే పాడతారో, వారిప్పుడు మీ ముందు హాజరై ఉన్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీకు రాజ్యమునిచ్చి వెళ్ళానని తండ్రి అర్థం చేయిస్తారు. నెమ్మది-నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండడం మీరిప్పుడు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వెలువడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇందిరా గాంధీ కూడా ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యముండాలని అనేవారు, వారిలో ఉన్న ఆత్మనే అలా చెప్తుంది కదా. భారతదేశంలో తప్పకుండా ఒకే రాజధాని ఉండేదని, అది ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి ఉందని ఆత్మకు తెలుసు. ఎప్పటికైనా ఇదంతా సమాప్తమైపోతుంది, ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశము మళ్ళీ 16 కళా సంపూర్ణంగా తప్పకుండా తయారవ్వాలి. ఈ యోగబలము ద్వారా మనము 16 కళా సంపూర్ణులుగా అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని అంటారు కదా. వికారాలను, అవగుణాలను దానమివ్వమని తండ్రి కూడా చెప్తారు. ఇది రావణ రాజ్యము. తండ్రి వచ్చి దీని నుండి విడిపిస్తారు. ఇందులోనూ కామ వికారము చాలా పెద్ద అవగుణము. మీరు దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శరీర భానాన్ని కూడా వదిలేయాలి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇవి ప్రపంచానికి తెలియవు. 16 కళా సంపూర్ణంగా, సంపూర్ణ దేవతల రాజ్యంగా ఉన్న భారతదేశానికి ఇప్పుడు గ్రహణము పట్టి ఉంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు వికారాల గ్రహణము పట్టి ఉంది కావున దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని తండ్రి చెప్తారు. మీరు కింద పడిపోయే విధంగా చేసేది కామ వికారమే, అందుకే దీనిని దానమిచ్చినట్లయితే మీరు 16 కళలు కలవారిగా అవుతారని తండ్రి చెప్తారు. ఇవ్వకపోతే మీరు అలా తయారవ్వరు. ఆత్మలకు తమ-తమ పాత్ర లభించి ఉంది కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీ ఆత్మలో ఎంతటి పాత్ర ఉంది. మీరు విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. ఎంతో మంది పాత్రధారులున్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు ఈ లక్ష్మీనారాయణులు. వీరిది నంబరు వన్ పాత్ర. విష్ణువే బ్రహ్మా-సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మా-సరస్వతులే విష్ణువుగా అవుతారు. వీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదవడం వల్ల ఎవరూ ఏమీ అర్థము చేసుకోరు. వారు కల్పము యొక్క ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. అలాగైతే స్వస్తిక్ కూడా తయారవ్వదు. వ్యాపారస్థులు వారి ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ ను వేస్తారు. గణేశుడిని పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతా పుస్తకము. స్వస్తిక్ లో 4 భాగాలుంటాయి. జగన్నాథపురిలో బియ్యమును అండాలో (పాత్రలో) ఉడికిస్తారు, అది ఉడికిపోయిన తర్వాత 4 భాగాలుగా విడిపోతుంది. అక్కడ కేవలం అన్నము మాత్రమే భోగ్ గా పెడతారు, ఎందుకంటే అక్కడ అన్నము ఎక్కువగా తింటారు. శ్రీనాథ ద్వారములో భోగ్ లో అన్నము ఉండదు. అక్కడ అన్ని పదార్థాలు శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారవుతాయి. భోజనం తయారు చేసినప్పుడు కూడా శుద్ధంగా, నోటిని కప్పుకొని తయారుచేస్తారు. ప్రసాదమును చాలా గౌరవపూర్వకంగా తీసుకువెళ్తారు, భోగ్ పెట్టిన తర్వాత అదంతా పండాలకు లభిస్తుంది. ఆ ప్రసాదాన్ని దుకాణాలలో పెడతారు. అక్కడ చాలా జన సమూహం ఉంటుంది. ఇది బాబా కూడా చూశారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అత్యంత ప్రియమైన తండ్రి వచ్చి మీకు సేవకునిగా అయ్యారు, మీకు సేవ చేస్తున్నారు, ఇంత నషా ఉందా? ఆత్మలైన మనకు తండ్రి చదివిస్తారు. ఆత్మనే అంతా చేస్తుంది కదా. మనుష్యులేమో ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉందని మీకు తెలుసు, అటువంటి ఆత్మను నిర్లేపి అని అనడమంటే, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా అవుతుంది. ఇదంతా ఎవరైనా నెల నెలన్నర కూర్చొని బాగా అర్థము చేసుకున్నప్పుడే, ఈ పాయింట్లు బుద్ధిలో కూర్చుంటాయి. రోజు రోజుకూ ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. పిల్లలకు పూర్తిగా నిశ్చయం ఏర్పడినప్పుడు, నిజంగా పరమపిత పరమాత్మనే స్వయంగా వచ్చి దుర్గతి నుండి సద్గతి చేస్తారని అర్థము చేసుకుంటారు.

మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉందని తండ్రి చెప్తారు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేశాను, ఇప్పుడు రావణుడు మీపై మళ్ళీ రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా చేసేందుకు మళ్ళీ తండ్రి వచ్చారు. కావున స్వయానికి నష్టము కలిగించుకోకూడదు. వ్యాపారస్థులు తమ ఖాతాను సదా సరిగ్గా ఉంచుకుంటారు. నష్టము కలిగించుకునే వారిని అమాయకులని అంటారు. ఇప్పుడు, ఇది అన్నిటికంటే పెద్ద వ్యాపారము. చాలా తక్కువమంది వ్యాపారస్థులు ఈ వ్యాపారాన్ని చేస్తారు. ఇదే అవినాశీ వ్యాపారము, మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీరు సత్యమైన వ్యాపారాన్ని చేస్తున్నారు. తండ్రి జ్ఞానసాగరుడు, వ్యాపారస్థుడు, రత్నాకరుడు. ప్రదర్శినీలకు ఎంతమంది వస్తారో చూడండి. సెంటరుకు ఎవరో కొంతమంది కష్టం మీద వస్తారు. భారతదేశము చాలా విశాలమైనది కదా. మీరు అన్ని స్థానాలకు వెళ్ళాలి. నీటి గంగ మొత్తం భారతదేశమంతటా ఉంది కదా. ఇది కూడా మీరు అర్థము చేయించవలసి ఉంటుంది. నీటి గంగ ఏమీ పతితపావని కాదు. జ్ఞానగంగలైన మీరు వెళ్ళవలసి ఉంటుంది. నలువైపులా మేళాలు, ప్రదర్శినీలు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకూ చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చిత్రాలు ఎంత శోభాయమానంగా ఉండాలంటే, అవి చూస్తూనే ఆనందము కలగాలి, వీరు సరైన రీతిలో అర్థం చేయిస్తున్నారు అన్నట్లు అనిపించాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణుల రాజధాని స్థాపనవుతుంది. మెట్ల చిత్రము కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము స్థాపనవుతుంది. ఈ బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు కావున - నాలో ఇంకా ఏవైనా చిన్నా-పెద్ద ముళ్ళు అయితే లేవు కదా, కామము అనే ముల్లు లేదు కదా అని మనస్సులో స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి, క్రోధమనే చిన్న ముల్లు కూడా చాలా చెడ్డది. దేవతలు క్రోధము కలవారిగా ఉండరు. శంకరుని మూడవ నేత్రం తెరుచుకుంటే వినాశనమవుతుందని చూపిస్తారు. ఈ కళంకాన్ని కూడా వేసారు. వినాశనమైతే జరగవలసిందే. సూక్ష్మవతనంలో శంకరునికి పాము మొదలైనవేవీ ఉండడం జరగదు. సూక్ష్మవతనంలో మరియు మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయములోని మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు, అందుకే దీనిని ముళ్ళ అడవి అని అనడం జరుగుతుంది. సత్యయుగము పుష్పాల తోట. బాబా ఎటువంటి తోటను తయారుచేస్తారు అనేది మీరు చూస్తారు. అత్యంత సుందరంగా తయారుచేస్తారు. అందరినీ సుందరంగా తయారుచేస్తారు. వారైతే సదా సుందరంగా ఉంటారు. ప్రేయసులందరినీ లేదా పిల్లలందరినీ సుందరంగా తయారుచేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా చేసేశాడు. మాపై బృహస్పతి దశ కూర్చున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషముండాలి. అర్ధ సమయము సుఖము, అర్ధ సమయము దుఃఖము ఉంటే దాని వలన లాభమేముంది? అలా కాదు, 3/4 భాగము సుఖము, 1/4 భాగము దుఃఖముంటుంది. ఈ డ్రామా తయారై ఉంది. డ్రామాను ఇలా ఎందుకు తయారుచేశారని చాలామంది అడుగుతారు. అరే, ఇది అనాది డ్రామా కదా. ఎందుకు తయారైంది అన్న ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. ఇది అనాది, అవినాశీగా తయారైన డ్రామా. ఇది తయారై తయారవుతూ ఉన్న డ్రామా. ఎవ్వరికీ మోక్షము లభించదు. ఈ సృష్టి అనాదిగా నడుస్తూ ఉంది, నడుస్తూనే ఉంటుంది. ప్రళయం జరగదు.

తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు కానీ అందులో ఎంత కష్టముంది. మనుష్యులు పతితులుగా, దుఃఖితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి శరీరాలను కల్పతరువుగా చేస్తారు, దానితో అర్ధకల్పము మీకు ఎప్పటికీ అకాలమృత్యువు సంభవించదు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. కావున పిల్లలు చాలా పురుషార్థము చేయాలి. ఎంత ఉన్నతమైన పదవిని పొందితే అంత మంచిది. ఎక్కువ సంపాదనను చేసేందుకు ప్రతి ఒక్కరూ పురుషార్థము చేస్తారు. కట్టెలు కొట్టేవారు కూడా నేను ఎక్కువ సంపాదించాలని అంటారు. కొందరు మోసము చేసి కూడా సంపాదిస్తారు. ధనము కారణంగానే ఆపదలు ఏర్పడుతున్నాయి. అక్కడ మీ ధనాన్ని ఎవరూ దోచుకోలేరు. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నదో చూడండి. అక్కడ ఇటువంటి దుఃఖం కలిగించే విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు. నేను స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యుడినా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి (నారదుని ఉదాహరణ). మనుష్యులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ లభించదు. నలువైపులా తిరిగినా కూడా మేము మీ నుండి దూరముగానే ఉన్నాము అన్న పాట కూడా ఉంది కదా. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్రను నేర్పిస్తున్నారు, ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి అంటారు. చాలా మంచి యుక్తి వినిపిస్తాను. పిల్లలు వింటారు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరము. నేను బాబాకు శరీరమును అప్పుగా ఇచ్చానని ఈ తండ్రికి ఎంత సంతోషం కలుగుతుంది. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు. వీరికి భగీరథుడు అన్న పేరు కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు రామునిపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. కావున పూర్తి పురుషార్థము చేయడంలో నిమగ్నమైపోవాలి. ముల్లుగా ఎందుకు తయారవ్వాలి.

మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. అంతా మురళీపై ఆధారపడి ఉంది. మీకు మురళీ లభించకపోతే, శ్రీమతాన్ని మీరు ఎక్కడ నుండి తీసుకువస్తారు. కేవలం బ్రాహ్మణీ మాత్రమే మురళీ వినిపించాలని కాదు. ఎవరైనా మురళీని చదివి వినిపించవచ్చు. ఈ రోజు మీరు వినిపించండి అని చెప్పాలి. ఇప్పుడైతే, అర్థము చేయించేందుకు ప్రదర్శినీ చిత్రాలు కూడా బాగా తయారు చేయబడ్డాయి. ఈ ముఖ్య చిత్రాన్ని మీ దుకాణంలో పెట్టండి, అనేకుల కళ్యాణము జరుగుతుంది. మీరు వస్తే, ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది మేము మీకు అర్థము చేయిస్తామని చెప్పండి. ఎవరి కళ్యాణమునైనా చేసేందుకు కొంత సమయం పట్టినా పర్వాలేదు. ఆ వ్యాపారముతో పాటు ఈ వ్యాపారమును కూడా చేయించగలరు. ఇది బాబా యొక్క అవినాశీ జ్ఞాన రత్నాల దుకాణము. నంబరువన్ చిత్రము మెట్ల చిత్రము మరియు గీతా భగవానుడు శివుడు అన్న చిత్రము. భారతదేశంలోకి శివభగవానుడు వచ్చారు, వారి జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చారు. యజ్ఞము కూడా రచింపబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తండ్రే వచ్చి రాజులకే రాజులుగా తయారుచేస్తారు. నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజా-రాణులుగా తయారుచేస్తాను అని తండ్రి అంటారు, ఆ రాజా-రాణులకే మళ్ళీ వికారీ రాజులు కూడా నమస్కరిస్తారు. కావున స్వర్గపు మహారాజా-మహారాణులుగా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఇల్లు మొదలైనవి కట్టుకోవడానికి బాబా వద్దనేమీ అనరు. కట్టుకుంటే కట్టుకోండి అని అంటారు. డబ్బు కూడా మట్టిలో కలిసిపోతుంది, దీని కన్నా ఇల్లు కట్టుకొని సుఖంగా ఎందుకు ఉండకూడదు. ధనాన్ని ఉపయోగించాలి. ఇల్లు కూడా కట్టుకోండి, తినేందుకు కూడా ధనం ఉంచుకోండి. దానపుణ్యాలు కూడా చేస్తారు. కాశ్మీరు రాజు తనకున్న ప్రైవేట్ ప్రాపర్టీని (స్వంత ఆస్తిని) అంతా ఆర్య సమాజము వారికి దానంగా ఇచ్చారు. తమ జాతి మరియు ధర్మం కోసం దానము చేస్తారు కదా. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. అందరూ పిల్లలే. జాతి మొదలైనవాటి విషయమేమీ లేదు. అవి దేహానికి సంబంధించిన జాతులు. నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా తయారుచేసి విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. డ్రామానుసారంగా భారతవాసులే రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మాపై బృహస్పతి దశ కూర్చొని ఉందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి, ఇంకేమీ చేయవలసిన అవసరము లేదు అని శ్రీమతము చెప్తుంది. భక్తి మార్గంలో వ్యాపారస్థులు ధర్మము కోసం ఎంతో కొంత తప్పకుండా కేటాయిస్తారు. దానికి కూడా మరుసటి జన్మలో అల్పకాలికంగా లభిస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చాను కావున మీరు ఈ కార్యములో ఉపయోగించండి. నాకు ఏమీ వద్దు. శివబాబాకు స్వయం కోసం ఇల్లు మొదలైనవేవైనా తయారుచేసుకోవాలా ఏమిటి. ఇవన్నీ బ్రాహ్మణులైన మీ కోసమే. పేదవారు, ధనవంతులు అందరూ కలిసే ఉంటారు. భగవంతుని వద్ద కూడా సమ దృష్టి లేదని కొంతమంది బాధపడతారు. కొందరిని మహళ్ళలో, కొందరిని పూరి గుడిసెలలో ఉంచుతారని అంటారు. శివబాబాను మర్చిపోతారు. శివబాబా స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడరు. అందరినీ అడగవలసి ఉంటుంది కదా. వారు ఇంట్లో అంత విశ్రాంతిగా ఉంటున్నారని తెలిసినప్పుడు, వారికి అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయవలసి వస్తుంది, అందుకే అందరినీ పట్టించుకోండి అని అంటారు. ఏదైనా వస్తువు లేకపోతే, అది మీకు అందించవచ్చు. తండ్రికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది. ఇంత ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు. పురుషార్థము చేయమని పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతరుల కోసం కూడా యుక్తులను రచించండి. దీని కోసం 3 అడుగుల నేల చాలు, అందులో పిల్లలు అందరికీ అర్థము చేయిస్తూ ఉంటారు. ఎవరైనా గొప్పవారికి హాలు ఉంటే, మేము కేవలం చిత్రాలను పెడతాము,1-2 గంటలు ఉదయము-సాయంత్రము క్లాసు చేసి వెళ్ళిపోతాము, ఖర్చంతా మాది, మీ పేరు ప్రసిద్ధమవుతుంది, చాలా మంది వచ్చి గవ్వల నుండి వజ్ర సమానంగా అవుతారని చెప్పండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోలోపల ఎలాంటి ముళ్ళు ఉన్నా కానీ వాటిని చెక్ చేసుకొని బయటకు తీసేయాలి. రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేయాలి.

2. అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని చేసి ఎవరి కళ్యాణమునైనా చేసేందుకు సమయమునివ్వాలి. సుందరంగా తయారై ఇతరులను కూడా అలా తయారుచేయాలి.

వరదానము:-

ఫుల్ స్టాప్ ద్వారా శ్రేష్ఠ స్థితి రూపీ మెడల్ ను ప్రాప్తి చేసుకునే మహావీర్ భవ

ఈ అనాది డ్రామాలో ఆత్మిక సైన్యము యొక్క సేనాధిపతులకు ఏ మెడల్ నూ ఇవ్వరు కానీ డ్రామానుసారంగా వారికి శ్రేష్ఠ స్థితి రూపీ మెడల్ స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఎవరైతే ప్రతి ఆత్మ యొక్క పాత్రను సాక్షీగా చూస్తూ సహజంగా ఫుల్ స్టాప్ చిహ్నాన్ని పెడతారో, వారికే ఈ మెడల్ ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఆత్మల పునాది అనుభవం ఆధారంగా ఉంటుంది, అందుకే ఎటువంటి సమస్య అనే గోడ వారిని అడ్డుకోలేదు.

స్లోగన్:-

ప్రతి పరిస్థితి అనే పర్వతాన్ని దాటుకొని తమ గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఎగిరేపక్షిగా అవ్వండి.