08-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - వికర్మల నుండి రక్షించుకోవడానికి ఘడియ-ఘడియ అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి, ఈ అభ్యాసమే మాయాజీతులుగా చేస్తుంది, స్థిరమైన యోగం జోడించబడి ఉంటుంది

ప్రశ్న:-

ఏ నిశ్చయం ఒకవేళ పక్కాగా ఉన్నట్లయితే యోగము తెగిపోలేదు?

జవాబు:-

సత్య-త్రేతాయుగాలలో మేము పావనంగా ఉండేవారము, ద్వాపర-కలియుగాలలో పతితంగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ మేము పావనంగా అవ్వాలి, ఈ నిశ్చయం పక్కాగా ఉన్నట్లయితే యోగం తెగిపోలేదు. మాయ ఓడించలేదు.

పాట:-
ఎవరైతే ప్రియునితో పాటు ఉన్నారో... (జో పియా కే సాథ్ హై...)

ఓంశాంతి

మధురాతి-మధురమైన పిల్లలు ఈ పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఇది ఆ వర్షం యొక్క విషయమైతే కాదు. ఆ సాగరము మరియు నదులు ఏవైతే ఉన్నాయో, వాటి విషయం కాదు. ఇక్కడున్నది జ్ఞానసాగరుడు, వారు వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు, అప్పుడు అజ్ఞాన అంధకారం దూరమవుతుంది. ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరైతే తమను తాము ప్రజాపిత బ్రహ్మాకుమారులము మరియు కుమారీలము అని భావిస్తారో, వారు అర్థం చేసుకుంటారు. పిల్లలకు తెలుసు, మన తండ్రి శివుడు, వారు బి.కె.లైన మనందరికీ తాతగారు మరియు వారు నిరాకారుడు. మేము ప్రజాపిత బ్రహ్మాకుమారులము మరియు కుమారీలము అని మీరు నిశ్చయం చేసుకున్న తర్వాత, ఇక అది మర్చిపోయే ప్రసక్తే లేదు. పిల్లలందరూ ప్రియునితో పాటు ఉన్నారు. కేవలం మీరు మాత్రమే ఉన్నారని కాదు, మురళీనైతే అందరూ వింటారు. పిల్లల కోసమే జ్ఞాన వర్షముంది, ఈ జ్ఞానముతో ఘోర అంధకారము వినాశనమవుతుంది. మీకు తెలుసు, మనం ఘోర అంధకారములో ఉండేవారము, ఇప్పుడు ప్రకాశము లభించింది కావున అంతా తెలుసుకుంటూ ఉన్నారు. పరమపిత పరమాత్ముని జీవిత కథ గురించి మీకు తెలుసు. ఎవరికైతే శివబాబా జీవిత కథ గురించి తెలియదో, వారు చేతులు ఎత్తండి. అందరికీ పరమాత్ముని జీవిత కథ గురించి తెలుసు. అది కూడా ఒక్క జన్మది కాదు. శివబాబాది ఎన్ని జన్మల జీవిత కథ? మీకు తెలుసా? శివబాబాకు ఈ డ్రామాలో ఏ పాత్ర ఉంది అనేది మీకు తెలుసు. ఆది నుండి అంతిమం వరకు వారి గురించి మరియు వారి జీవిత కథ గురించి తెలుసు. తప్పకుండా భక్తి మార్గములో ఎవరు ఏ భావనతో భక్తి చేస్తారో, దానికి ప్రతిఫలాన్ని నేను ఇవ్వాల్సి ఉంటుంది. వారు చైతన్యముగానైతే లేరు, సాక్షాత్కారము నేనే చేయిస్తాను. మీకు తెలుసు, అర్ధకల్పము భక్తి మార్గం నడుస్తుంది. భక్తి యొక్క మనోకామనలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ పిల్లలుగా అయ్యారు, అటువంటివారికి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు, ఇది నియమము. ఇప్పుడు మీ ముఖము సద్గతి వైపు ఉంది. మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి తెలుసు. ఈ అనంతమైన నాటకములో ముఖ్యమైన పాత్రధారులు ఎవరో తెలుసు. వారు క్రియేటర్ మరియు డైరెక్టర్, రచయిత మరియు చేసేవారు-చేయించేవారు. డైరెక్షన్లు ఇస్తారు కదా. చదివిస్తారు కూడా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను అని అంటారు. ఇది కూడా కర్మ చేయడము వంటిదే కదా మరియు వారు చేయిస్తారు కూడా. అర్ధకల్పము మీరు మాయకు వశమై అసత్యమైన కర్తవ్యాలను చేస్తూ వచ్చారు. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయ మీ ద్వారా అసత్యమైన కర్తవ్యాలను చేయిస్తూ వచ్చింది. అసత్యమైన కర్తవ్యాలను చేయించేవారిని భగవంతుడు అని ఎలా అనగలరు? భగవంతుడు అంటారు, నేను ఒక్కడినే, నేనే అందరికీ సత్య కర్మలు చేయడం నేర్పిస్తాను. ఇప్పుడిది అందరి వినాశన సమయము. అందరినీ సమాధుల నుండి మేల్కొల్పాలి. అందరూ శ్మశానగ్రస్థులై ఉన్నారు. తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మనకు అంతా అర్థం చేయిస్తున్నారు. మీరు అందరి జీవిత కథలను, శివబాబా జీవిత కథను కూడా తెలుసుకున్నవారిగా అయ్యారు. కావున ఉన్నతమైనవారిగా అయినట్లు కదా. ఎవరైతే శాస్త్రాలను చాలా అధ్యయనం చేసేవారు ఉంటారో, వారి ఎదురుగా శాస్త్రాల గురించి తెలియనివారు తల వంచి నమస్కరిస్తారు. మీరు తల వంచి నమస్కరించాల్సిన పని లేదు. ఇది చాలా సహజమైన విషయము. మనం మూలవతనము, శాంతిధామము యొక్క నివాసులుగా అవుతామని, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రజాపిత బ్రహ్మాకుమారులము-కుమారీలము. శివబాబాకు మనం మనవలము. శివబాబాను స్మృతి చేయడంతో మనకు సుఖపు వారసత్వము లభిస్తుంది. పిల్లలైన మీకు నిశ్చయముంది, అదేమిటంటే - మేము పవిత్రంగా ఉండేవారము, తర్వాత పతితంగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ మేము పావనంగా అవ్వాలి. ఒకవేళ నిశ్చయం లేకపోతే యోగం కూడా కుదరదు, పదవిని కూడా పొందలేరు. పవిత్రమైన జీవితము మంచిది కదా. కుమారీలకు చాలా గౌరవముంది ఎందుకంటే ఈ సమయంలో కుమారీలైన మీరు చాలా సేవ చేస్తారు కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా ఉంటారు, ఇప్పటి పవిత్రతనే భక్తి మార్గంలో పూజించబడుతుంది. ఈ ప్రపంచమైతే చాలా అశుద్ధమైనది, కీచకుని కథ ఉంది కదా. మనుష్యులు చాలా అశుద్ధమైన ఆలోచనలతో వస్తారు, వారిని కీచకులు అని అంటారు, అందుకే బాబా అంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా అశుద్ధమైన ముళ్ళ ప్రపంచము. మీకైతే చాలా సంతోషముండాలి. మనము శాంతిధామానికి వెళ్ళి, తర్వాత సుఖధామములోకి వస్తాము. మనము సుఖధామానికి యజమానులుగా ఉండేవారము, తర్వాత చక్రములో తిరిగి వచ్చాము. ఈ నిశ్చయమైతే ఉండాలి కదా. అశరీరులుగా అయ్యే అలవాటు చేసుకోవాలి, లేదంటే మాయ తింటూ ఉంటుంది, యోగము తెగిపోయి ఉంటుంది, వికర్మలు వినాశనమవ్వవు. స్మృతిలో ఉండేందుకు ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. స్మృతితోనే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఎంత వీలైతే అంత అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలమైన మనకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు. కల్ప-కల్పము చదివిస్తారు, రాజ్య-భాగ్యాన్ని ఇస్తారు. మీరు యోగబలంతో మీ రాజధానిని స్థాపన చేసుకుంటారు. రాజు రాజ్యం చేస్తారు, సైన్యము రాజ్యము కోసం యుద్ధం చేస్తుంది. ఇక్కడ మీరు మీ కోసం శ్రమిస్తారు, తండ్రి కోసం కాదు. నేనైతే రాజ్యమే చేయను. నేను మీకు రాజ్యాన్ని ఇప్పించేందుకు యుక్తులను తెలియజేస్తాను. మీరంతా వానప్రస్థులు, ఇది అందరి మృత్యు సమయము. చిన్నా-పెద్దా అన్నదేమీ ఉండదు. చిన్న బిడ్డకైతే తండ్రి యొక్క వారసత్వం లభిస్తుందని కాదు. అలా పొందడానికి ఈ ప్రపంచమే ఉండదు. మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. బాగా ధనము సంపాదించాలనే కోరిక పెట్టుకుంటారు, మా మనవలు, మనవరాళ్ళు తింటారని భావిస్తారు. కానీ ఈ కోరిక ఎవ్వరికీ పూర్తి కాదు. ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఒక్క బాంబు పడగానే అందరూ సమాప్తమైపోతారు. కాపాడేవారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడైతే బంగారం మొదలైనవాటి గనులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. కొత్త ప్రపంచంలో మళ్ళీ అవన్నీ నిండుగా అవుతాయి. అక్కడ కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవి లభిస్తాయి. ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రకాశము వచ్చింది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారము వినాశనమయ్యిందని పాడుతారు. ఇది ఆ సూర్యుని విషయము కాదు, మనుష్యులు సూర్యుడికి నీటిని అర్పిస్తారు. ఇప్పుడు సూర్యుడైతే మొత్తం ప్రపంచానికి నీటిని అందిస్తాడు. ఆ సూర్యునికి తిరిగి నీటిని అర్పిస్తారు, ఇది భక్తి యొక్క విచిత్రము. ఇంకా సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః అని అంటారు. అవి దేవతలు ఎలా అవుతాయి? ఇక్కడైతే మనుష్యులు అసురుల నుండి దేవతలుగా అవుతారు. వాటిని దేవతలని అనలేరు. అవైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుని జెండాను కూడా పెడతారు. జపాన్ లో సూర్యవంశీయులము అని అంటారు. వాస్తవానికి అందరూ జ్ఞాన సూర్య వంశీయులే. కానీ జ్ఞానం లేదు, ఇప్పుడు ఆ సూర్యుడు ఎక్కడ, ఈ జ్ఞాన సూర్యుడు ఎక్కడ. ఇక్కడ కూడా ఈ సైన్స్ ఆవిష్కరణలు వెలువడుతూ ఉంటాయి, కానీ ఫలితం ఏముంటుంది! ఏమీ ఉండదు. వినాశనమే జరుగుతుంది. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు, ఈ సైన్సు ద్వారా మా వినాశనాన్ని మేమే చేసుకుంటామని అర్థము చేసుకుంటారు. వారిది సైన్సు, మీది సైలెన్స్. వారు సైన్సుతో వినాశనం చేస్తారు, మీరు సైలెన్స్ తో స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడైతే నరకంలో అందరి నావ మునిగిపోయి ఉంది. అటువైపు ఆ సైన్యాలు, ఇటువైపు మీరు యోగ బలము యొక్క సైన్యము. మీరు రక్షించేవారు. మీపై ఎంత బాధ్యత ఉంది, కనుక పూర్తి సహాయకులుగా అవ్వాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇప్పుడిది సంగమ సమయము. తండ్రి నావను తీరం చేర్చడానికి వచ్చారు. రాజధాని పూర్తిగా స్థాపన అవుతుంది, అప్పుడు వినాశనం అవుతుంది అని మీరు అర్థం చేసుకున్నారు. మధ్య-మధ్యలో రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. యుద్ధాలైతే చాలా జరుగుతూ ఉంటాయి. ఇది ఉన్నదే ఛీ-ఛీ ప్రపంచము, బాబా మనల్ని పుష్పాల ప్రపంచంలోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఈ పాత వస్త్రాన్ని వదిలేయాలి. మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరించాలి. తండ్రి అయితే గ్యారంటీ ఇస్తారు - నేను కల్ప-కల్పము అందరినీ తీసుకువెళ్తాను, అందుకే నాకు కాలుడికే కాలుడు, మహాకాలుడు అన్న పేరును పెట్టారు. పతిత-పావనుడు, దయా హృదయుడు అని కూడా అంటారు.

మీకు తెలుసు, మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తున్నాము. బాబా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను, దానితో పాటు శరీర నిర్వహణ కూడా చేయాలి. కర్మలు చేయకుండానైతే ఎవ్వరూ ఉండలేరు. కర్మ సన్యాసమైతే సాధ్యం కాదు. స్నానము చేయడము మొదలైనవి, ఇవి కూడా కర్మలే కదా. చివర్లో అందరూ పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటారు, శివబాబా చదివిస్తారు అని వీరు ఏదైతే అంటారో అది కరక్టే అని కేవలం అర్థం చేసుకుంటారు. నిరాకార భగవానువాచ - వారైతే ఒక్కరే, అందుకే బాబా అంటూ ఉంటారు - నిరాకార శివునితో మీకు ఏం సంబంధముంది? అని అందరినీ అడగండి. అందరూ సోదరులే కావున సోదరులకు తండ్రి అయితే ఉంటారు కదా. లేదంటే ఎక్కడ నుండి వచ్చారు. నీవే తల్లివి తండ్రివి... అని పాడుతారు కూడా. ఇది తండ్రి యొక్క మహిమ, తండ్రి అంటారు, నేనే మీకు నేర్పిస్తాను. మీరు తర్వాత విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ కూర్చుని కూడా, శివబాబాను స్మృతి చేయాలి. ఈ నేత్రాలతోనైతే శరీరాన్ని చూస్తారు, మమ్మల్ని చదివించేవారు శివబాబా అని బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో, వారి కోసమే ఈ రాజయోగము మరియు జ్ఞాన వర్షము ఉన్నాయి. పతితులను పావనంగా చేయడము - ఇది తండ్రి పని. వారే ఈ జ్ఞానసాగరుడు, మీకు తెలుసు, మనం శివబాబాకు మనవలము, బ్రహ్మాకు పిల్లలము. బ్రహ్మా తండ్రి శివుడు, వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. స్మృతి కూడా వారినే చేయాలి. ఇప్పుడు మనం విష్ణుపురికి వెళ్ళాలి. ఇక్కడ నుండి మీ లంగరు ఎత్తివేయబడింది. శూద్రుల నావ నిలిచిపోయి ఉంది. మీ నావ బయలుదేరింది. ఇప్పుడు మీరు నేరుగా ఇంటికి వెళ్తారు. పాత వస్త్రాలన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు వస్త్రాన్ని విడిచి ఇంటికి వెళ్తాము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి అసత్యమైన కర్మను చేయకూడదు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, ఇది వినాశన సమయము, అందుకే అందరినీ సమాధి నుండి మేల్కొల్పాలి. పావనంగా తయారయ్యే మరియు తయారుచేసే సేవను చేయాలి.

2. ఈ ఛీ-ఛీ ప్రపంచంలో ఎటువంటి కోరికలు పెట్టుకోకూడదు. అందరి మునిగిపోయి ఉన్న నావలను రక్షించడంలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-

యోగం యొక్క ప్రయోగం ద్వారా ప్రతి ఖజానాను పెంచుకునే సఫల తపస్వీ భవ

తండ్రి ద్వారా ప్రాప్తించిన అన్ని ఖజానాలపై యోగ ప్రయోగము చేయండి. ఖజానాలు తక్కువగా ఖర్చు అవ్వాలి మరియు ప్రాప్తి అధికంగా ఉండాలి - ఇదే ప్రయోగము. ఏ విధంగానైతే సమయము మరియు సంకల్పాలు శ్రేష్ఠ ఖజానాలు. కావున సంకల్పాలు తక్కువగా ఖర్చు అవ్వాలి కానీ ప్రాప్తి అధికంగా ఉండాలి. సాధారణ వ్యక్తి ఏదైతే రెండు, నాలుగు నిమిషాలు ఆలోచించిన తర్వాత సఫలతను ప్రాప్తి చేసుకుంటారో, అది మీరు ఒకటి రెండు క్షణాలలో చేయండి. తక్కువ సమయము, తక్కువ సంకల్పాలతో ఫలితము ఎక్కువ లభించాలి, అప్పుడు యోగ ప్రయోగమును చేసే సఫల తపస్వీ అని అంటారు.

స్లోగన్:-

తమ అనాది, ఆది సంస్కారాలను స్మృతిలో ఉంచుకుని సదా అచలంగా ఉండండి.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ఛాయలోకి తీసుకువెళ్ళండి - ఇప్పుడు కేవలం పరమాత్మ కోసమే ఈ విధంగా పిలుస్తున్నారు. ఎప్పుడైతే మనుష్యులు అతి దుఃఖితులుగా అవుతారో, అప్పుడు పరమాత్మను స్మృతి చేస్తారు - పరమాత్మా, ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ఛాయలోకి తీసుకువెళ్ళండి అని. దీని ద్వారా, తప్పకుండా అటువంటి ప్రపంచం కూడా ఏదో ఉందని ఋజువవుతుంది. ఇప్పుడు ఇదైతే మనుష్యులందరికీ తెలుసు, ఇప్పటి ప్రపంచము ఏదైతే ఉందో అది ముళ్ళతో నిండి ఉంది. ఈ కారణంగా మనుష్యులు దుఃఖాన్ని మరియు అశాంతిని పొందుతున్నారు మరియు పుష్పాల ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటారు. కనుక తప్పకుండా అటువంటి ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది, ఆ ప్రపంచపు సంస్కారాలు ఆత్మలో నిండి ఉంటాయి. ఇప్పుడు ఇదైతే మనకు తెలుసు, దుఃఖము, అశాంతి ఇవన్నీ కర్మ బంధనాల లెక్కాచారాలు. రాజు నుండి మొదలుకొని పేదవాని వరకు మనుష్యమాత్రులు ప్రతి ఒక్కరూ ఈ లెక్కల్లో పూర్తిగా చిక్కుకుని ఉన్నారు, అందుకే పరమాత్మ స్వయంగా అంటారు, ఇప్పటి ప్రపంచము కలియుగము, కావున ఇదంతా కర్మ బంధనముతో తయారై ఉంది మరియు ఇంతకుముందు ఉన్న ప్రపంచము సత్యయుగము, దానిని పుష్పాల ప్రపంచము అని అంటారు. ఇప్పుడు అది కర్మ బంధన రహితమైన జీవన్ముక్త దేవీ-దేవతల రాజ్యము, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం జీవన్ముక్తి అని దేనినైతే అంటామో, దాని అర్థము, మనం దేహము నుండి ముక్తులుగా ఉండేవారమని, వారికి ఎటువంటి దేహ భానము ఉండేది కాదు అని కాదు. కానీ వారు దేహంలో ఉంటూ కూడా దుఃఖాన్ని పొందేవారు కాదు, అనగా అక్కడ ఎటువంటి కర్మ బంధనాల వ్యవహారము లేదు. వారు జీవితాన్ని తీసుకుంటూ, జీవితాన్ని వదిలేస్తూ ఆది, మధ్యాంతాలు సుఖాన్ని ప్రాప్తి చేసుకునేవారు. కనుక జీవన్ముక్తి అంటే అర్థము, జీవితంలో ఉంటూనే కర్మాతీతము, ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం 5 వికారాలలో పూర్తిగా చిక్కుకుని ఉంది, అనగా 5 వికారాలు పూర్తిగా నివసిస్తున్నాయి, కానీ మనుష్యులకు ఈ 5 భూతాలను జయించగలిగేంత శక్తి లేదు, అందుకే పరమాత్మ స్వయంగా వచ్చి మనల్ని 5 భూతాల నుండి విడిపిస్తారు మరియు భవిష్య ప్రారబ్ధమైన దేవీ-దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. అచ్ఛా - ఓం శాంతి.