08-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 01-10-87


''ఈశ్వరీయ స్నేహము - జీవన పరివర్తనకు పునాది''

ఈ రోజు స్నేహ సాగరుడు తమ స్నేహీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాబా మరియు పిల్లల స్నేహము విశ్వమును స్నేహ సూత్రములో బంధిస్తుంది. స్నేహ సాగరం మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళ జరిగినప్పుడు, స్నేహభరిత నది కూడా బాబా సమానంగా మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది, అందుకే విశ్వాత్మలు స్నేహ అనుభవము ద్వారా స్వతహాగానే సమీపంగా వస్తున్నారు. పవిత్రమైన ప్రేమ మరియు ఈశ్వరీయ పరివారపు ప్రేమతో, ఎంత పరిచయము లేని ఆత్మలైనా, అలానే చాలాకాలము నుండి పరివారపు ప్రేమ నుండి వంచితులై రాయి సమానంగా అయిపోయిన ఆత్మలైనాకానీ, అటువంటి రాయి సమానమైన ఆత్మలు కూడా ఈశ్వరీయ పరివారపు స్నేహముతో కరిగి నీరులా అయిపోతారు. ఇదే ఈశ్వరీయ పరివారపు ప్రేమ యొక్క అద్భుతము. తమనుతాము ఎంత దూరంగా పెట్టుకున్నాకానీ, ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతము వలె స్వతహాగా సమీపంగా తీసుకువస్తుంది. దీనినే ఈశ్వరీయ స్నేహము యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. మా దారి వేరు అని స్వయాన్ని ఎవరు ఎంత అనుకున్నాగానీ, ఈశ్వరీయ స్నేహమనేది సహయోగిగా చేసి 'మనమందరము ఒక్కటే' అని అంటూ ముందుకు వెళ్ళే సూత్రములో బంధిస్తుంది. ఇటువంటి అనుభవాన్ని చేసారు కదా! స్నేహము ముందుగా సహయోగులుగా తయారుచేస్తుంది, సహయోగులుగా తయారుచేస్తూ-చేస్తూ సమయము వచ్చినప్పుడు స్వతహాగానే అందరినీ సహజయోగులుగా కూడా తయారుచేస్తుంది. సహయోగులుగా అయ్యే గుర్తు - నేటి సహయోగి, రేపటి సహజయోగిగా అయిపోతారు. ఈశ్వరీయ స్నేహము పరివర్తనకు పునాది మరియు జీవన పరివర్తనకు బీజ స్వరూపము. ఏ ఆత్మలలోనైతే ఈశ్వరీయ స్నేహపు అనుభూతి యొక్క బీజము నాటుకుంటుందో, ఆ బీజము సహయోగిగా అయ్యే వృక్షమును స్వతహాగా పెరిగేలా చేస్తూ ఉంటుంది మరియు సమయము వచ్చినప్పుడు సహజయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి, ఎందుకంటే పరివర్తన అనే బీజము తప్పకుండా ఫలాలను ఇస్తుంది. కాకపోతే కొన్ని ఫలాలు త్వరగా వస్తే, మరికొన్ని ఫలాలు సమయము వచ్చినప్పుడు వెలువడుతాయి. నలువైపులా చూడండి, మాస్టర్ స్నేహ సాగరులు, విశ్వ సేవాధారీ పిల్లలైన మీరందరూ ఏ కార్యమును చేస్తున్నారు? విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహము అనే బీజాన్ని నాటుతున్నారు. ఎక్కడకు వెళ్ళినాగానీ - వారు నాస్తికులైనా లేక ఆస్తికులైనా, బాబాను తెలుసుకోనివారైనా, బాబాను అంగీకరించనివారైనాగానీ - శివవంశీ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీల నుండి లభించే ఇటువంటి ఈశ్వరీయ పరివారపు ప్రేమ మరెక్కడా లభించదు అన్నదానినైతే వారు తప్పకుండా అనుభవము చేస్తారు, ఇంకా ఈ స్నేహము మరియు ప్రేమ సాధారణమైనది కాదు, ఇది అలౌకిక ప్రేమ, ఈశ్వరీయ ప్రేమ అన్నదానిని కూడా ఒప్పుకుంటారు, అంటే ఇన్ డైరెక్ట్ గా నాస్తికుల నుండి ఆస్తికులుగా అయిపోయారు కదా! ఈశ్వరీయ ప్రేమ ఉందంటే మరి అదెక్కడి నుండి వచ్చింది? కిరణాలు సూర్యుడి అస్తిత్వాన్ని స్వతహాగా నిరూపిస్తాయి. ఈశ్వరీయ ప్రేమ, అలౌకిక స్నేహము, నిస్వార్థ స్నేహము స్వతహాగానే దాత అయిన బాబాను తప్పకుండా నిరూపిస్తాయి. ఇన్ డైరెక్ట్ ఈశ్వరీయ స్నేహముతో కూడిన ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన బాబాతో సంబంధము జోడింపబడుతుంది కానీ వారిని తెలుసుకోలేరు ఎందుకంటే బీజము ముందు గుప్తంగా ఉంటుంది, వృక్షము స్పష్టంగా కనిపిస్తుంది. కావున ఈశ్వరీయ స్నేహమనే బీజము సమయానుసారంగా సర్వులను సహయోగుల నుండి సహజయోగులుగా, ప్రత్యక్ష రూపంలో ప్రత్యక్షము చేస్తూ ఉంది మరియు చేస్తూ ఉంటుంది. కావున అందరూ ఈశ్వరీయ స్నేహమనే బీజాన్ని వేసే సేవ చేసారు. సహయోగులుగా చేసే - శుభ భావన మరియు శుభ కామనలు అనే విశేషమైన రెండు ఆకులను కూడా ప్రత్యక్షంగా చూసారు. ఇప్పుడు ఈ కాండము వృద్ధి పొందుతూ ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తుంది.

బాప్ దాదా పిల్లలందరి వెరైటీ సేవలను చూసి హర్షితులవుతారు. భాషణ చేసే పిల్లలైనా, స్థూల సేవ చేసే పిల్లలైనా - సర్వుల సహయోగపు సేవ ద్వారా సఫలతా ఫలము ప్రాప్తిస్తుంది. కాపలా కాసేవారైనాగానీ, పాత్రలను సంభాళించేవారైనాగానీ, ఎలా అయితే చేతి ఐదువేళ్ళ సహయోగముతో ఎంతటి శ్రేష్ఠ కార్యమైనా, ఎంతటి పెద్ద కార్యమైనా ఏవిధంగా సహజమైపోతుందో, అలా బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి సహయోగము ద్వారా, ఇలా అవ్వగలదా అని ఎంతగా అయితే ఆలోచించారో, ఆ ఆలోచనకంటే వేలాదిరెట్లు ఎక్కువ సహజంగా కార్యము జరిగిపోయింది. ఇది ఎవరి అద్భుతము? అందరిది. కార్యములో ఎవరెవరైతే సహయోగులుగా అయ్యారో - స్వచ్ఛతను ఉంచి ఉండవచ్చు, టేబుల్ ను శుభ్రం చేసి ఉండవచ్చు, అందరి సహయోగము యొక్క ఫలితం సఫలత. ఈ సంగఠన శక్తి చాలా గొప్పది. కేవలము మధుబన్ కు వచ్చే పిల్లలే కాదు, నలువైపులా కల బ్రాహ్మణ పిల్లలు, ఎవరైతే సాకారములో ఇక్కడ లేరో, వారు దేశములోనివారైనా, విదేశాలలోనివారైనా, అందరి మనసుల శుభ భావన మరియు శుభ కామనల సహయోగము ఉంది అన్నదానిని బాప్ దాదా చూసారు. సర్వాత్మల శుభ భావన, శుభ కామనల యొక్క ఈ కోట ఆత్మలను పరివర్తన చేసేస్తుంది. నిమిత్తంగా శక్తులు కూడా ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు. ప్రతి కార్యానికి నిమిత్త సేవాధారులు విశేషంగా ఉండనే ఉంటారు కానీ వాయుమండలమనే కోట సర్వుల సహయోగముతోనే తయారవుతుంది. నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాప్ దాదా అభినందనలను ఇస్తారు, కానీ అందరికంటే ఎక్కువ అభినందనలు పిల్లలందరికీ. పిల్లలు బాబాకు ఏ అభినందనలను ఇస్తారు, ఎందుకంటే బాబా అయితే అవ్యక్తమైపోయారు. వ్యక్తములోనైతే పిల్లలను నిమిత్తంగా తయారుచేసారు కావున బాప్ దాదా సదా పిల్లల గీతమునే గానము చేస్తారు. మీరు బాబా గీతాన్ని గానము చెయ్యండి, బాబా మీ గీతాన్ని గానము చేస్తారు.

ఏదైతే చేసారో, అది చాలా బాగా చేసారు. భాషణ చేసేవారు బాగా భాషణ చేసారు, స్టేజ్ ను అలంకరించేవారు స్టేజ్ ను బాగా అలంకరించారు మరియు భోజనాన్ని తయారుచేసేవారు, తినిపించేవారు, కూరగాయలను తరిగేవారు విశేషంగా యోగయుక్తంగా ఉన్నారు. మొదటి పునాది అయితే కూరగాయలను తరగడము. కూరగాయలను తరగకపోతే భోజనాన్ని ఎలా తయారుచేస్తారు? అన్ని డిపార్ట్మెంట్లవారు ఆల్ రౌండ్ (అన్నిరకాల) సేవలకు నిమిత్తులుగా ఉన్నారు. వినిపించాము కదా - ఒకవేళ శుభ్రం చేసేవారు శుభ్రం చెయ్యకపోయినా కూడా ప్రభావము పడదు. ప్రతి ఒక్కరి ముఖము ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేకపోయినట్లయితే సేవ సఫలత ఎలా ఉంటుంది! అందరూ ఏ కార్యాన్ని అయితే చేసారో, అది స్నేహాన్ని నింపి చేసారు కనుక వారిలో కూడా స్నేహ బీజము పడింది. ఉల్లాస-ఉత్సాహాలతో చేసారు కనుక వారిలో కూడా ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. అనేకత ఉన్నప్పటికీ స్నేహ సూత్రము ఉన్న కారణంగా ఐక్యత గురించిన మాటలనే చర్చించారు. ఇది వాయుమండలము అనే ఛత్రఛాయ యొక్క విశేషత. వాయుమండలం ఛత్రఛాయగా అవుతుంది. కనుక ఛత్రఛాయ క్రింద ఉన్న కారణంగా ఎటువంటి సంస్కారము కలవారైనాకానీ స్నేహ ప్రభావములో ఇమిడి ఉన్నారు. అర్థమైందా? అందరికీ చాలా పెద్ద డ్యూటీనే (బాధ్యత) ఉన్నది. అందరూ సేవ చేసారు. వారు వేరే ఏదో చెప్పాలని ఎంత అనుకున్నా కానీ వాయుమండలము కారణంగా చెప్పలేరు. వారు మనసులో వేరే ఏదో ఆలోచించినాగానీ అది నోటి నుండి బయటకు రాలేదు ఎందుకంటే మీ అందరి జీవన పరివర్తనను ప్రత్యక్షంగా చూసి వారిలో కూడా పరివర్తనకు చెందిన ప్రేరణ స్వతహాగానే కలుగుతూ ఉంది. ప్రత్యక్ష ప్రమాణమును చూసారు కదా! శాస్త్రాల ప్రమాణము కంటే కూడా, అన్నింటికంటే పెద్దది ఈ ప్రత్యక్ష ప్రమాణము. ప్రాక్టికల్ ప్రమాణము ఎదుట ఇతర అన్ని ప్రమాణాలు చిన్నవే. ఇదే సేవ యొక్క రిజల్టు. ఇప్పుడు కూడా ఆ స్నేహ సహయోగము యొక్క విశేషతతో ఇంకా సమీపంగా తీసుకువస్తున్నట్లయితే సహయోగములో ఇంకా ముందుకు వెళ్తుంటారు. అయినా, ఎప్పుడైతే అన్ని సత్తాల సహయోగము ఉంటుందో, అప్పుడే ప్రత్యక్షత శబ్దము గట్టిగా ఉంటుంది.

విశేషంగా సర్వ సత్తాలు కలిసి ఒకే శబ్దాన్ని ఎక్కువగా చేసినప్పుడే ప్రత్యక్షత అనే పరదా విశ్వము ముందు తెరుచుకుంటుంది. వర్తమాన సమయములో ఏదైతే సేవా ప్లాన్ తయారుచేసారో, అది ఇందుకోసమే తయారుచేసారు కదా. అన్ని వర్గాలవారు అనగా అన్ని సత్తాల కలవారు సంపర్కములోకి, సహయోగములోకి, స్నేహములోకి వచ్చినట్లయితే తరువాత సంబంధములోకి వచ్చి సహజయోగులుగా అయిపోతారు. ఒకవేళ ఏదైనా సత్తా సహయోగములోకి రానట్లయితే సర్వుల సహయోగమునకు చెందిన కార్యమునేదైతే పెట్టుకున్నారో అది ఎలా సఫలమౌతుంది?

ఇప్పుడు విశేష సత్తా యొక్క పునాది పడింది. ధర్మసత్తా అన్నింటికంటే పెద్ద సత్తా కదా. ఆ విశేష సత్తా ద్వారా పునాది ప్రారంభమైంది. స్నేహ ప్రభావమును చూసారు కదా. మీరు ఇంతమందిని కలిపి ఒకేసారి ఎలా పిలుస్తున్నారు అని మామూలుగా అందరూ అనేవారు. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండేవారు కదా, కానీ ఈశ్వరీయ స్నేహ సూత్రము ఒక్కటే ఉంది కనుక అనేకత గురించిన ఆలోచనలు ఉన్నా కూడా సహయోగులుగా అయ్యే ఆలోచన ఒక్కటే ఉంది. అలా ఇప్పుడు సర్వ సత్తాలను సహయోగులుగా చెయ్యండి. అలా తయారవుతున్నారు కూడా, కానీ ఇంకా ఎక్కువ సమీపంగా తీసుకువస్తూ, సహయోగులుగా చేస్తూ వెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ జుబ్లీ (స్వర్ణ జయంతి) సమాప్తమయ్యింది, కనుక ఇప్పటి నుండి, ప్రత్యక్షతకు ఇంకా సమీపంగా వచ్చారు. డైమండ్ జుబ్లీ అనగా ప్రత్యక్షతా నినాదాన్ని ప్రసిద్ధము చెయ్యటము. కనుక ఈ సంవత్సరము నుండి ప్రత్యక్షతా పరదా ఇక తెరుచుకోవటము ఆరంభమైంది. ఒక వైపేమో విదేశాల ద్వారా భారతదేశములో ప్రత్యక్షత జరిగింది, మరొకవైపు నిమిత్త మహామండలేశ్వరుల ద్వారా కార్య శ్రేష్ఠత యొక్క సఫలత. విదేశాలలో యు.న్. వారు నిమిత్తంగా అయ్యారు, వారు కూడా విశేషంగా ప్రసిద్ధి చెందినవారు మరియు భారతదేశములో కూడా ప్రసిద్ధి చెందిన ధర్మ సత్తా ఉంది. కనుక ధర్మ సత్తా కలవారి ద్వారా ధర్మాత్మల ప్రత్యక్షత జరగటము - ఇదే ప్రత్యక్షతా పరదా తెరుచుకోవటము అనేది ఆరంభమవ్వటము. ఇప్పటికి తెరుచుకోవటము ప్రారంభమయ్యింది. ఇప్పుడిక తెరిచుకునేదుంది, పూర్తిగా తెరుచుకోలేదు, తెరుచుకోవటము ఆరంభమైంది. విదేశీ పిల్లలు ఎవరైతే కార్యమునకు నిమిత్తులుగా అయ్యారో, ఈ విశేష కార్యము కూడా మిగిలి ఉంది. ప్రత్యక్షతకు చెందిన విశేష కార్యములో ఈ కార్యము కారణంగా నిమిత్తులుగా అయ్యారు. కనుక బాప్ దాదా విదేశీ పిల్లలకు, ఈ అంతిమ ప్రత్యక్షతకు చెందిన హీరో పాత్రలో నిమిత్తంగా అయిన సేవకు కూడా విశేష అభినందనలను ఇస్తున్నారు. భారతదేశములో సందడి చేసారు కదా. అందరి చెవుల వరకు శబ్దము వెళ్ళింది. విదేశాల యొక్క ఈ బిగ్గరగా ఉన్న శబ్దము భారత్ యొక్క కుంభర్ణులను మేల్కొలిపేందుకు అయితే నిమిత్తంగా అయ్యింది. కానీ ఇప్పుడు కేవలం శబ్దం వెళ్ళింది, ఇప్పుడింకా ఎక్కువగా మేల్కొలపాలి, లేపాలి. ఇప్పుడు కేవలము చెవుల వరకు శబ్దము చేరుకుంది. ఒకవేళ నిద్రపోతున్నవారి చెవులకు శబ్దం చేరుకుంటే, కాస్త కదులుతారు కదా, చలనం వస్తుంది కదా. కనుక చలనం ఉత్పన్నమైంది. ఆ చలనంతో కాస్త లేచారు, ఇందులో ఏదో ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద శబ్దము వచ్చినప్పుడు పూర్తిగా మేల్కొంటారు. మునపటి కన్నా ఇప్పుడు కాస్త బిగ్గరగా వచ్చింది. అలాగే అన్ని సత్తాల వారు కలిసి ఎప్పుడైతే స్టేజ్ పై స్నేహ మిలనము చేస్తారో, అప్పుడు అద్భుతము జరుగుతుంది. అన్ని సత్తాలకు చెందిన ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యపు ప్రత్యక్షత ఆరంభమవ్వాలి, అప్పుడు ప్రత్యక్షతా పరదా పూర్తిగా తెరుచుకుంటుంది. కనుక ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాం ను తయారుచేస్తున్నారో, అందులో అన్ని సత్తాలవారి స్నేహ మిలనము జరగాలి అన్న ఈ లక్ష్యమును పెట్టుకోవాలి. అన్ని వర్గాల వారి స్నేహ మిలనమైతే జరగగలదు. సాధారణ సాధువులను పిలవటమనేది ఏమంత పెద్ద విషయము కాదు, కానీ మహా మండలేశ్వరులను పిలిచారు కదా. శంకరాచార్యుల వలన కూడా ఈ సంగఠనలో ఇంకా ఎక్కువ శోభ ఉండేది. ఇప్పుడు వారి భాగ్యము కూడా తెరుచుకుంటుంది. లోపలనుండైతే వారు సహయోగినే.

పిల్లలు చాలా శ్రమించారు కూడా కానీ లోక మర్యాదలనైతే చూసుకోవలసి ఉంటుంది. శ్రేష్ఠ సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటే ఒక్క పరమాత్మ సత్తాయే అని అన్ని సత్తాల వారు కలిసి అనే ఆ రోజు కూడా వస్తుంది. కనుక బహుకాలపు ప్లాన్ను తయారుచేసారు కదా. ఇంత సమయము ఎందుకు లభించిందంటే, అందరినీ స్నేహ సూత్రములో బంధించి సమీపంగా తీసుకురావడం కోసం. ఈ స్నేహము అయస్కాంతములా అవుతుంది, దీని ద్వారా అందరూ ఒకేసారి సంగఠన రూపంలో బాబా యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. అటువంటి ప్లాన్ ను తయారుచేసారు కదా? అచ్ఛా!

సేవాధారుల సేవకు ప్రత్యక్ష ఫలము కూడా లభించింది. లేదంటే, ఇప్పుడు కొత్త పిల్లల నంబర్ కదా. మీరైతే మిలనాలను చేసుకుంటూ, చేసుకుంటూ ఇప్పుడు వానప్రస్థ స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు మీ చిన్న సోదరీ సోదరులకు టర్న్ ఇస్తున్నారు. స్వయం వానప్రస్థులయ్యారు కావున ఇప్పుడు ఇతరులకు ఛాన్సు ఇచ్చారు. కోరిక అయితే అందరిదీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కలుసుకునేందుకు అవకాశము లభించాలి అని అందరూ అంటారు. ఎంతగా కలుసుకుంటారో, అంతగా కలవాలనే కోరిక ఎక్కువవుతూ ఉంటుంది. అప్పుడేమి చేస్తారు? ఇతరులకు ఛాన్స్ ఇవ్వటము కూడా స్వయం తృప్తిని అనుభవము చెయ్యటము ఎందుకంటే పాతవారైతే అనుభవజ్ఞులు, ప్రాప్తి స్వరూపులు. మరి ప్రాప్తి స్వరూప ఆత్మలు అంటే అందరి పట్ల శుభ భావనను ఉంచేవారు, ఇతరులను ముందు ఉంచేవారు. లేదా మేమైతే కలవాలి అని భావిస్తున్నారా? ఇందులో కూడా నిస్వార్థులుగా అవ్వాలి. మీరు తెలివైనవారు. ఆది-మధ్య-అంత్యములను అర్థం చేసుకునేవారు. సమయము గురించి కూడా అర్థం చేసుకున్నారు. ప్రకృతి ప్రభావాన్ని కూడా తెలిసినవారు. పాత్రను గురించి కూడా తెలిసినవారు. బాప్ దాదా కూడా సదా పిల్లలను కలవాలనుకుంటారు. ఒకవేళ పిల్లలు కలవాలనుకుంటే ముందు బాబా కోరుకుంటారు, అప్పుడు పిల్లలు కూడా కోరుకుంటారు. కానీ బాబాకు కూడా సమయాన్ని, ప్రకృతిని చూడవలసి ఉంటుంది కదా. ఈ ప్రపంచములోకి వస్తున్నప్పుడు ప్రపంచములోని అన్ని విషయాలను చూడవలసి ఉంటుంది. ఇక్కడకు దూరంగా అవ్యక్త వతనములో ఉన్నప్పుడైతే అక్కడ నీరు, సమయము, ఉండేందుకు, మొదలైనవాటి సమస్యలు ఉండనే ఉండవు. గుజరాత్ వారు సమీపంగా ఉంటారు. కావున దానికి కూడా ఫలితము లభించింది కదా. వీరు సదా ఎవర్ రెడీగా ఉంటారు, ఇది కూడా గుజరాత్ వారి విశేషత. ‘‘హా జీ’’ పాఠము చాలా పక్కాగా ఉంది మరియు ఉండేందుకు ఎక్కడ స్థానము లభించినా అక్కడ ఉండిపోతారు. ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండే విశేషత కూడా ఉంది. గుజరాత్ లో వృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంది. సేవల ఉల్లాస ఉత్సాహాలు స్వయమును కూడా నిర్విఘ్నంగా తయారుచేస్తాయి, ఇతరుల కల్యాణము కూడా చేస్తాయి. సేవాభావమునకు కూడా సఫలత ఉంది. సేవాభావములో ఒకవేళ అహంభావము వచ్చినట్లయితే దానిని సేవాభావము అని అనరు. సేవాభావము సఫలతను అందిస్తుంది. ఒకవేళ అహంభావము కలిసినట్లయితే శ్రమ కూడా ఎక్కువ అవుతుంది, సమయము కూడా ఎక్కువ అవుతుంది, అయినా కూడా స్వయము యొక్క సంతుష్టత ఉండదు. సేవాభావము కల పిల్లలు సదా స్వయము కూడా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తారు. సదా ఎగిరేకళను అనుభవము చేస్తారు. వారు మంచి ధైర్యము కలవారు. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో అక్కడ బాప్ దాదా కూడా ప్రతి సమయము కార్యములో సహాయకులుగా ఉంటారు.

మహారథులు మహాదానులుగా అయితే ఉండనే ఉన్నారు. సేవ కొరకు మహారథులు ఎవరైతే వచ్చారో, మీరు మహాదానులు, వరదానులు కదా? ఇతరులకు అవకాశాన్ని ఇవ్వటము - ఇది కూడా మహాదానము, వరదానము. సమయానుసారంగా పాత్రను అభినయించటంలో కూడా చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలందరూ సదా సహయోగులుగా ఉన్నారు మరియు ఉంటారు. కోరిక అయితే ఉంటుంది ఎందుకంటే ఇది శుభప్రదమైన కోరిక. కానీ దీనిని ఇముడ్చుకోవటము కూడా తెలుసు కనుక అందరూ సదా సంతుష్టులు.

పిల్లలు ప్రతి ఒక్కరితో మిలనము జరుపుకోవాలని, సమయము హద్దు ఉండకూడదని బాప్ దాదా కూడా కోరుకుంటారు. కానీ మీ ప్రపంచంలో ఈ హద్దులన్నింటినీ చూడవలసి వస్తుంది. లేదంటే, ఒక్కొక్క విశేష రత్నము యొక్క మహిమను ఒకవేళ గాయనము చేసినట్లయితే అది ఎంత గొప్పగా ఉంటుంది! ఒక్కొక్క బిడ్డ విశేషతల గురించి కనీసం ఒక్కొక్క గీతమునైతే తయారు చెయ్యవచ్చు. కానీ...... అందుకే, ఎటువంటి హద్దులు లేని వతనములోకి రండి అని అంటారు. అచ్ఛా!

సదా ఈశ్వరీయ స్నేహములో నిమగ్నమై ఉన్నవారు, సదా ప్రతి క్షణము సర్వుల సహయోగులుగా అయ్యేవారు, సదా ప్రత్యక్షతా పరదాను తొలగించి బాబాను విశ్వము ముందు ప్రత్యక్షము చేసేవారు, సదా సర్వాత్మలకు ప్రత్యక్ష ప్రమాణ స్వరూపంగా అయ్యి ఆకర్షించేవారు, సదా బాబా మరియు సర్వుల ప్రతి కార్యములో సహయోగులుగా అయ్యి ఒక్కరి పేరును ప్రసిద్ధము చేసేవారు - విశ్వమునకు ఇష్టులైన ఇటువంటి పిల్లలకు, విశ్వములోని విశేష పిల్లలకు, బాప్ దాదాల యొక్క అతి స్నేహ సంపన్న ప్రియస్మృతులు. అలాగే దేశ విదేశముల నుండి స్నేహముతో బాబా ముందుకు చేరుకునే సర్వ సమీప పిల్లలకు సేవ అభినందనలతో పాటు బాప్ దాదాల యొక్క విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి.

వరదానము:-

నాలెడ్జ్ ఫుల్ విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి సురక్షితంగా అయ్యే కమలపుష్ప సమాన అతీత మరియు సాక్షీ భవ

అంతిమము వరకు సంస్కారాలనేవి, కొందరివి దాసి సంస్కారాలుగా, కొందరివి రాజు సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని ఎదురుచూస్తూ ఉండకండి, ఇకపోతే నాపై ఎవ్వరి ప్రభావము ఉండకూడదు, ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నముగా ఉంటాయి, మరొకటి - మాయ రూపముగా అయి కూడా ముందుకువస్తాయి. కావున ఏ విషయపు నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. భిన్న-భిన్న సంస్కారాలు ఉంటూ కూడా ఘర్షణ జరగకుండా ఉండేందుకు జ్ఞానస్వరూపులుగా అయి కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు సాక్షీగా ఉండండి.

స్లోగన్:-

హఠము చేసేందుకు లేదా శ్రమించేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థం చేయండి.