09-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - అనంతమైన తండ్రిని స్మృతి చేయడమనేది గుప్తమైన విషయము, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది, ఎవరైతే స్మృతి చేయరో, వారిని తండ్రి కూడా ఎలా స్మృతి చేయగలరు”

ప్రశ్న:-

మొత్తం కల్పమంతటిలోనూ ఎప్పుడూ చదివించబడని ఏ చదువును సంగమయుగంలో పిల్లలైన మీరు చదువుతారు?

జవాబు:-

జీవిస్తూనే శరీరము నుండి అతీతంగా అనగా శవముగా అయ్యే చదువును ఇప్పుడు మీరు చదువుతారు, ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి. కానీ శరీరంలో ఉన్నంత వరకూ తప్పకుండా కర్మలు చేయవలసిందే. ఎప్పుడైతే శరీరం ఉండదో, అప్పుడే మనసు కూడా శాంతమవుతుంది. అందుకే మనసును జయిస్తే జగత్తును జయిస్తామని భావించడం కాదు, మాయను జయిస్తేనే జగత్ జీతులుగా అవుతారు.

ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు ఎందుకంటే తెలివితక్కువవారినే చదివించడం జరుగుతుందని పిల్లలు అర్థము చేసుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి, ఉన్నతోన్నతమైన భగవంతుడు వస్తారు, వారు ఎవరిని చదివిస్తూ ఉండవచ్చు? తప్పకుండా ఎవరైతే చాలా చాలా బుద్ధిహీనులుగా ఉంటారో, వారినే చదివిస్తారు, అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. విపరీత బుద్ధికలవారిగా ఎలా అయ్యారు? 84 లక్షల యోనులని వ్రాయబడి ఉంది కదా! కావున తండ్రిని కూడా 84 లక్షల జన్మలలోకి తీసుకొచ్చారు. పరమాత్మ కుక్క, పిల్లి, జీవజంతువులన్నింటిలోనూ ఉన్నారని చెప్తారు. ఇది సెకండు నంబరు పాయింటుగా చెప్పవలసి ఉంటుందని పిల్లలకు అర్థము చేయించడం జరుగుతుంది. ఎవరైనా కొత్తవారు వస్తే మొట్టమొదట వారికి హద్దు మరియు అనంతమైన తండ్రుల పరిచయమును ఇవ్వాలి. వారు అనంతమైన పెద్ద తండ్రి మరియు వీరు హద్దులోని చిన్న తండ్రి. అనంతమైన తండ్రి అంటేనే అనంతమైన ఆత్మలకు తండ్రి. ఆ హద్దు తండ్రి జీవాత్మకు తండ్రి అవుతారు. వారైతే ఆత్మలందరికీ తండ్రి. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఏకరసంగా ధారణ చేయలేరు. కొందరు ఒక శాతము ధారణ చేస్తే, కొందరు 95 శాతము ధారణ చేస్తారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. సూర్యవంశీ రాజ్య కుటుంబం ఉంటుంది కదా! రాజా, రాణి మరియు ప్రజలు ఉంటారు. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. ప్రజలలో అన్ని రకాల మనుష్యులు ఉంటారు. ప్రజలంటే ప్రజలు. ఇది చదువు అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరు తమ బుద్ధి అనుసారంగా చదువుకుంటారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. కల్పక్రితము ఎవరు ఎంత చదువును ధారణ చేశారో, ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు. చదువు ఎప్పుడూ దాగి ఉండలేదు. చదువు ద్వారానే పదవి లభిస్తుంది. మున్ముందు పరీక్షలైతే తప్పకుండా జరుగుతాయని తండ్రి అర్థం చేయించారు. పరీక్షలు లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వలేరు. చివరిలో అంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా, మేము ఏ పదవికి యోగ్యంగా ఉన్నాము అన్నది మీరు అర్థం చేసుకోగలరు. అయితే సిగ్గు వలన అందరితోపాటు చేతులు ఎత్తేస్తారు కానీ అలా మేము ఎలా అవ్వగలమని మనసులో భావిస్తారు కూడా, అయినా చేతులెత్తేస్తారు. అర్థము చేసుకొని కూడా చేతులు ఎత్తితే, దీనిని కూడా అజ్ఞానమనే అంటారు. ఎంత అజ్ఞానముంది అన్నది తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. వీరి కంటే ఆ విద్యార్థులలోనే తెలివి ఉంటుంది. నేను స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యుడిని కాదు, పాస్ అవ్వలేను అని వారు అర్థం చేసుకుంటారు. దీని కన్నా ఆ అజ్ఞానులే మేలు, ఎందుకంటే వారు టీచరు ఏదైతే చదివిస్తారో, అందులో వారు ఎన్ని మార్కులను తీసుకుంటారనేది అర్థము చేసుకుంటారు. మేము పాస్ విత్ ఆనర్ గా అవుతామని వారు అనరు. ఇక్కడ అంతటి బుద్ధి కూడా లేదని తద్వారా నిరూపించబడుతుంది. దేహాభిమానము చాలా ఉంది. ఇలా (లక్ష్మీనారాయణులుగా) అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు కావున నడవడిక చాలా బాగుండాలి. కొందరు వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు ఎందుకంటే నియమానుసారంగా తండ్రితో ప్రీతి లేదు, అటువంటప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత పదవిని పొందలేరు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాని అర్థమేమిటో తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు, పిల్లలే పూర్తిగా అర్థము చేసుకోలేకపోతే, ఇక ఇతరులేమి అర్థము చేసుకుంటారు! ఏ పిల్లలైతే మేము శివబాబాకు పిల్లలమని భావిస్తారో, వారు పూర్తి అర్థాన్ని తెలుసుకోలేరు. తండ్రిని స్మృతి చేయడమన్నది గుప్తమైన విషయము. చదువైతే గుప్తమైనది కాదు కదా. చదువులో నంబరువారుగా ఉన్నారు. అందరూ ఒకే విధంగా చదవరు. వీరింకా బేబీస్ (పసిపిల్లలు) గా ఉన్నారని తండ్రి అర్థం చేసుకుంటారు. ఇటువంటి అనంతమైన తండ్రిని మూడేసి, నాలుగేసి నెలలు స్మృతి కూడా చేయరు. వీరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? వారి నుండి ఉత్తరం వస్తే తెలుస్తుంది. ఆ ఉత్తరంలో మేము ఈ-ఈ ఆత్మిక సేవ చేస్తున్నామని సేవా సమాచారం కూడా వ్రాయాలి. ఋజువు కావాలి కదా. ఎవరైతే ఎప్పుడూ స్మృతి చేయరో, సేవకు ఋజువును చూపించరో, వారు దేహాభిమానులుగా ఉంటారు. కొందరైతే బాబా, ఫలానా-ఫలానావారు వచ్చారు, వారికి నేను ఇది అర్థం చేయించాను అని సమాచారం వ్రాస్తారు, అప్పుడు ఆ పిల్లలు బ్రతికే ఉన్నారు, సేవా సమాచారాన్ని సరిగ్గా ఇస్తున్నారని తండ్రి అర్థము చేసుకుంటారు. కొందరైతే 3-4 నెలలు కూడా ఉత్తరం వ్రాయరు. ఏ సమాచారము లేకపోతే మరణించారనో లేక రోగగ్రస్థులుగా అయ్యారనో భావిస్తారు! రోగగ్రస్థులైన మనుష్యులు వ్రాయలేరు. మా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఉత్తరం వ్రాయలేదని కూడా కొంతమంది వ్రాస్తారు. కొందరైతే సమాచారమే ఇవ్వరు, అలాగని ఏ అనారోగ్యమూ లేదు. దేహాభిమానము ఉంది. మరి తండ్రి కూడా ఎవరిని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. కానీ దేహాభిమానము ఉంది. నన్ను సర్వవ్యాపి అని చెప్పి 84 లక్షల కన్నా ఎక్కువ యోనులలోకి తీసుకువెళ్తారు అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మనుష్యులను రాతిబుద్ధి కలవారని అంటారు. భగవంతుడినైతే రాళ్ళలో, రప్పలలో ఉన్నారని అంటారు. ఇవి అనంతమైన నిందలు అయినట్లే కదా! కావుననే నన్ను ఎంతగా గ్లాని చేస్తారని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు నంబరువారుగా అర్థము చేసుకున్నారు. మీరు వస్తే మేము బలిహారమైపోతాము, మిమ్మల్ని వారసునిగా చేసుకుంటామని భక్తి మార్గములో పాడుతారు కూడా. రాళ్ళలో, రప్పలలో ఉన్నారని అన్నవారు వారసులుగా చేసుకుంటారా! ఎంతగా గ్లాని చేస్తారు, అప్పుడు తండ్రి యదా యదాహి...... అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు కావున తండ్రిని ఎంతగా మహిమ చేస్తారు. కొందరు మహిమ కాదు కదా, కనీసం స్మృతి చేసి రెండు అక్షరాలు కూడా వ్రాయరు. దేహాభిమానులుగా అయిపోతారు. మాకు తండ్రి లభించారని, మా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. భగవానువాచ కదా! నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. విశ్వరాజ్యాధికారాన్ని ఎలా పొందవచ్చు అన్నదాని కోసం నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అన్న నషా ఉన్నట్లయితే అపారమైన సంతోషము కలుగుతుంది. గీతను కూడా చదువుతారు కానీ ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్లు చదువుతారు. కృష్ణ భగవానువాచ - నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని చదువుతారు, అంతే. అంతటి బుద్ధియోగము లేక సంతోషము ఉండదు. గీతను చదివేవారిలో లేక వినిపించేవారిలో అంతటి సంతోషము ఉండదు. గీతను చదవడం పూర్తి చేసి వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మాకు భగవంతుడు చదివిస్తారని ఇంకెవ్వరి బుద్ధిలోకీ రాదు. కావున ఎవరు వచ్చినా, మొదట వారికి ఇద్దరు తండ్రుల థియరీని (సిద్ధాంతము) అర్థము చేయించాలి. భారతదేశము స్వర్గంగా ఉండేది కదా, ఇప్పుడది నరకంగా ఉందని చెప్పండి. మేము సత్యయుగంలోనూ ఉన్నాము, కలియుగములోనూ ఉన్నామని అయితే ఎవరూ అనలేరు. ఎవరికైనా దుఃఖము కలిగితే వారు నరకంలో ఉన్నారు, ఎవరికైనా సుఖము లభిస్తే వారు స్వర్గంలో ఉన్నారు. దుఃఖితులైన మనుష్యులు నరకంలో ఉన్నారు, మేమైతే చాలా సుఖంలో ఉన్నాము, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయని చాలా మంది అంటారు. వారు బాహ్య సుఖాలను చాలా చూస్తారు కదా. సత్యయుగంలోని సుఖము ఇక్కడ ఉండజాలదని కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. బంగారు యుగాన్ని ఇనుప యుగమని అన్నా లేక ఇనుప యుగాన్ని బంగారు యుగమని అన్నా అర్థం ఒకటేనని కూడా కాదు. అలా భావించేవారిని కూడా అజ్ఞానులనే అంటారు. కావున మొట్టమొదట తండ్రి థియరీని (సిద్ధాంతము) తెలపాలి. తండ్రి మాత్రమే తమ పరిచయమునిస్తారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మ-పరమాత్మల రూపము ఒక్కటేనని మీరు చిత్రాలలో చూపిస్తారు. వారు కూడా ఆత్మనే కానీ వారిని పరమ ఆత్మ అని అంటారు. తాను ఎలా వస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలన్నీ అక్కడ పరంధామంలో ఉంటాయి. ఈ విషయాలు బయటివారెవ్వరూ అర్థము చేసుకోలేరు. భాష కూడా చాలా సహజమైనది. గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు. ఇప్పుడు కృష్ణుడైతే గీతను వినిపించరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని అతను అందరికీ చెప్పలేరు. దేహధారుల స్మృతితో అయితే పాపాలు తొలగిపోవు. కృష్ణ భగవానువాచ - దేహ సంబంధాలన్నింటినీ త్యాగము చేసి నన్నొక్కరినే స్మృతి చేయండి, కానీ దేహపు సంబంధాలు కృష్ణునికి కూడా ఉన్నాయి, మరియు అతడు చిన్న పిల్లవాడు కదా. ఇది కూడా ఎంత పెద్ద పొరపాటు. ఈ ఒక్క పొరపాటు కారణంగా ఎంత తేడా ఏర్పడుతుంది! పరమాత్మ సర్వవ్యాపి కాలేరు. ఎవరి గురించి అయితే సర్వుల సద్గతిదాత అని అంటారో, వారు కూడా దుర్గతిని పొందుతారా! పరమాత్మ ఎప్పుడైనా దుర్గతిని పొందుతారా ఏమిటి? ఇవన్నీ విచార సాగర మథనము చేయవలసిన విషయాలు. ఇది సమయాన్ని వ్యర్థము చేసుకునే విషయం కాదు. మనుష్యులు మాకు తీరిక లేదని అంటారు. వచ్చి కోర్సు తీసుకోమని మీరు అర్థం చేయిస్తే తీరిక లేదని అంటారు. రెండు రోజులు వస్తారు, మళ్ళీ నాలుగు రోజులు రారు..... చదువుకోకపోతే ఈ లక్ష్మీనారాయణులుగా ఎలా అవ్వగలరు? మాయ ఫోర్సు ఎంతగా ఉంది. ఏ క్షణము, ఏ నిమిషము గతిస్తుందో, అది అలానే రిపీట్ అవుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. లెక్కలేనన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే తండ్రి ద్వారా వింటున్నారు. బాబా జనన-మరణాలలోకి రారు. పూర్తి జనన-మరణాలలోకి వచ్చేది ఎవరు మరియు రానివారు ఎవరు అని పోల్చి చూడడం జరుగుతుంది. ఒక్క తండ్రి మాత్రమే జనన-మరణాలలోకి రారు. మిగిలిన వారంతా వస్తారు, అందుకే చిత్రాలను కూడా చూపించారు. బ్రహ్మా మరియు విష్ణువు, ఇరువురూ జనన-మరణాలలోకి వస్తారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా పాత్రలోకి వస్తూ-వెళ్తూ ఉంటారు. ఇది అంతం అవ్వలేదు. ఈ చిత్రాలను అందరూ వచ్చి చూస్తారు మరియు అర్థము చేసుకుంటారు. ఇది చాలా సహజంగా అర్థము చేసుకునే విషయము. మేము బ్రాహ్మణులము, మళ్ళీ మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని బుద్ధిలోకి రావాలి. మళ్ళీ తండ్రి వస్తే మేమే బ్రాహ్మణులుగా అవుతాము. ఇది స్మృతి చేసినా స్వదర్శన చక్రధారులుగా అయినట్లే. చాలా మందికి స్మృతి నిలవదు. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలు అలా అవ్వరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని పొందడం ద్వారా వారు ఇలా దేవతలుగా అయ్యారు. వాస్తవానికి మనుష్యులెవ్వరూ స్వదర్శన చక్రధారులమని పిలిపించుకునేందుకు అర్హులు కాదు. మనుష్యుల సృష్టి అయిన మృత్యులోకమే వేరు. ఎలాగైతే భారతీయుల ఆచార-వ్యవహారాలు వేరుగా ఉన్నాయో, అలా అందరివీ వేరు-వేరుగా ఉంటాయి. దేవతల ఆచార-వ్యవహారాలు వేరు. మృత్యులోకములోని మనుష్యుల ఆచార-వ్యవహారాలు వేరు. రాత్రికి, పగులుకు ఉన్నంత తేడా ఉంది, అందుకే మేము పతితులము అని అందరూ అంటారు. ఓ భగవంతుడా, పతిత ప్రపంచంలో ఉన్న మా అందరినీ పావనంగా చేయండని అంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము పావన ప్రపంచముండేదని, దానిని సత్యయుగమని అంటారని మీ బుద్ధిలో ఉంది. త్రేతా యుగాన్ని అలా అనరు. అది ఫస్ట్ క్లాస్ అయినది, ఇది సెకెండ్ క్లాస్ అయినది అని తండ్రి అర్థం చేయించారు. కావున ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిలో ధారణ చేయాలి. ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు విని ఆశ్చర్యపోతారు కానీ వారికి పురుషార్థము చేసేందుకు తీరిక ఉండదు. అయితే పవిత్రంగా తప్పకుండా ఉండాలి అని వింటారు. మనుష్యులను పతితంగా చేసేది ఈ కామ వికారమే. దీనిని జయిస్తేనే మీరు జగత్ జీతులుగా అవుతారు. కామ వికారాన్ని జయించి జగత్ జీతులుగా అవ్వండని తండ్రి చెప్పారు కూడా. కానీ మనుష్యులు మనసును జయించి జగత్ జీతులుగా అవ్వండి, మనసును వశము చేసుకోండి అని అంటారు. ఎప్పుడైతే శరీరము ఉండదో, అప్పుడే మనసు శాంతమవుతుంది లేదంటే మనసు ఎప్పుడూ శాంతమవ్వదు. కర్మలు చేసేందుకే దేహము లభిస్తుంది, మరి కర్మాతీత స్థితిలో ఎలా ఉండగలరు? కర్మాతీత స్థితి అని శవానికి అంటారు. జీవించి ఉండే శవాలు అనగా శరీరము నుండి అతీతంగా ఉండడం. మీకు కూడా శరీరము నుండి అతీతంగా అయ్యే చదువును చదివిస్తారు. శరీరము నుండి ఆత్మ వేరుగా ఉంటుంది. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరములోకి వస్తే, అప్పుడు వారిని మనిషి అని అంటారు. కర్మలు చేసేందుకే శరీరము లభిస్తుంది. ఒక శరీరము వదిలితే, ఆత్మ కర్మలు చేసేందుకు ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే కర్మ చేయవలసిన అవసరం ఉండదో, అప్పుడే శాంతిగా ఉంటారు. మూలవతనంలో కర్మలు ఉండవు. సృష్టి చక్రము ఇక్కడ తిరుగుతుంది. తండ్రిని, సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి, దీనినే జ్ఞానమని అంటారు. ఈ కనులు ఎప్పటివరకైతే పతితంగా, క్రిమినల్ గా (అశుద్ధంగా) ఉంటాయో, అప్పటివరకు ఆ కనుల ద్వారా పవిత్రమైన వస్తువుని చూడలేరు, కావుననే జ్ఞానమనే మూడవ నేత్రము కావాలి. ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితిని పొందుతారో అనగా దేవతలుగా అవుతారో, అప్పుడు ఈ స్థూల కనుల ద్వారా దేవతలను చూస్తూ ఉంటారు. అంతేకానీ ఈ శరీరంలోని కనులతో కృష్ణుడిని చూడలేరు. సాక్షాత్కారము కలిగినా దాని ద్వారా ఏమీ లభించదు. అల్పకాలికమైన సంతోషముంటుంది, కోరిక పూర్తవుతుంది. డ్రామాలో సాక్షాత్కారాలు కూడా రచింపబడి ఉన్నాయి, వీటి వలన ఏమీ ప్రాప్తించదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నేను శరీరము నుండి అతీతమైన ఆత్మను. జీవిస్తూనే ఈ శరీరంలో ఉంటూ శవము వలె ఉండే స్థితిని అభ్యాసము చేసి కర్మాతీత స్థితిని తయారుచేసుకోవాలి.

2. సేవకు ఋజువునివ్వాలి. దేహ భానాన్ని వదిలి తమ సత్యాతి-సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. పాస్ విత్ ఆనర్ గా అయ్యే పురుషార్థము చేయాలి.

వరదానము:-

సర్వ ఖాతాలను మరియు సంబంధాలను ఒక్క తండ్రితో ఉంచే డబల్ లైట్ ఫరిస్తా భవ

డబల్ లైట్ ఫరిస్తాలుగా అయ్యేందుకు దేహభానం నుండి కూడా అతీతంగా ఉండండి ఎందుకంటే దేహ భానము మట్టివంటిది, దీని బరువున్నా సరే భారీతనం ఉంటుంది. ఫరిస్తా అనగా మీ దేహంతో కూడా సంబంధం ఉండకూడదు. తండ్రి ఇచ్చిన దేహాన్ని కూడా తండ్రికి ఇచ్చేసారు. మన వస్తువును ఇతరులకు ఇచ్చేసినట్లయితే, ఇక మన సంబంధము సమాప్తమవుతుంది. అన్ని లెక్కాచారాలు, అన్ని ఇచ్చి-పుచ్చుకోవడాలు తండ్రితోనే, మిగిలిన పాత ఖాతాలు మరియు సంబంధాలన్నీ సమాప్తం - ఇటువంటి సంపూర్ణ బికారులే డబల్ లైట్ ఫరిస్తాలు.

స్లోగన్:-

మీ విశేషతలను ప్రయోగంలోకి తీసుకొస్తే ప్రతి అడుగులోనూ ప్రగతిని అనుభవం చేస్తారు.