09-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు అమరలోకాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తులు, అక్కడ ఎలాంటి దుఃఖము లేక పాపము ఉండదు, అది నిర్వికారీ ప్రపంచము”

ప్రశ్న:-

గాడ్లీ ఫ్యామిలీలోని అద్భుతమైన ప్లాన్ ఏది?

జవాబు:-

గాడ్లీ ఫ్యామిలీ యొక్క ప్లాన్ - ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) చేయడం. ఒకే సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనము చేయడం. మనుష్యులు కుటుంబ నియంత్రణ చేసేందుకు ప్లాన్లు తయారుచేస్తారు, వారి ప్లాన్లు సఫలమవ్వవు అని తండ్రి చెప్తారు. నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను, అప్పుడు ఇతర ఆత్మలన్నీ పైన ఉన్న ఇంటికి వెళ్ళిపోతాయి. కొన్ని ఆత్మలే మిగిలి ఉంటాయి.

ఓంశాంతి. ఇది ఇల్లు కూడా, విశ్వవిద్యాలయము కూడా మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన, ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలు సాలిగ్రామాలు. ఇది ఆత్మ యొక్క శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము చెప్పదు. ఇది నా శరీరమని ఆత్మ చెప్తుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన బాబా శివుడు, వారు సుప్రీమ్ తండ్రి. వారు మన సుప్రీమ్ బాబా కూడా అని ఆత్మకు తెలుసు. వారే సుప్రీమ్ టీచర్, సుప్రీమ్ గురువు కూడా. ఓ గాడ్ ఫాదర్ అని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు. మరణించే సమయంలో కూడా హే భగవంతుడా, హే ఈశ్వరా అని అంటారు. పిలుస్తారు కదా. కానీ యథార్థంగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే, వారినే ఓ పతితపావనా అని అంటారు. అంటే వారు గురువుగా కూడా అయ్యారు. దుఃఖము నుండి మమ్మల్ని విడిపించి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. కావున వారు తండ్రి కూడా మరియు పతిత-పావన సద్గురువు కూడా. తర్వాత సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మనుష్యులు 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనే ఆ అనంతమైన చరిత్ర-భూగోళాన్ని వినిపిస్తారు, కావున వారు సుప్రీమ్ టీచరుగా కూడా అయ్యారు. అజ్ఞాన కాలంలో తండ్రి వేరు, టీచరు వేరు, గురువు వేరుగా ఉంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది. అనంతమైన తండ్రి తన పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆ తండ్రి కూడా హద్దు వారసత్వాన్ని ఇస్తారు. ఆ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర-భూగోళము గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు, ఆ రాజ్యం ఎంత సమయం కొనసాగింది, ఆ తర్వాత త్రేతా యుగంలో సీతా-రాములు ఎంత సమయము రాజ్యం చేశారు అనేది ఎవరికీ ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. బాబా సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఇది తమోప్రధానమైన ప్రపంచము. ప్రతి వస్తువు సతో, రజో, తమోలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా ఆయువు ఉంది, కొత్త నుండి పాతదిగా, పాత నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది అందరికీ తెలుసు. సత్యయుగంలో భారతదేశమే ఉండేది, అందులో దేవీ-దేవతల రాజ్యముండేది. గాడ్-గాడెస్ యొక్క రాజ్యముండేది. అచ్ఛా, తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతోప్రధానము నుండి సతో, సతో నుండి రజో, తమోలలోకి వచ్చారు. ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు. భారతదేశంలో 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మినారాయణుల రాజ్యమున్నప్పుడు అక్కడ మనుష్యుల ఆయుష్షు సుమారుగా 125-150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకమని అంటారు. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు. ఇది మృత్యులోకము. అమరలోకములో మనుష్యులు అమరులుగా ఉంటారు, ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. సత్యయుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమముండేది. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. మేము శివబాబా సంతానమని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. ఇతను దాదా (అన్నయ్య), వారు తాతగారు. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. తాతగారి ఆస్తిపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. వారిని ఆడమ్-ఈవ్, ఆదమ్-బీబీ అని అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు (ప్రజాపిత) సాకార తండ్రి అయినట్లు. వీరికి తన శరీరము ఉంది. శివబాబాకు తమ శరీరము లేదు. కావున మీకు శివబాబా నుండి బ్రహ్మా ద్వారా వారసత్వము లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. అలా శివబాబా నుండి కూడా బ్రహ్మా ద్వారా లభిస్తుంది, మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి ఎంతో సమయం పట్టదు... ఎవరు చేశారు? భగవంతుడు. గ్రంథ్ లో ఇలా మహిమ చేస్తారు కదా. వారికి చాలా మహిమ ఉంది. అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేస్తే బే అనగా వారసత్వం మీకు లభిస్తుంది అని బాబా అంటారు. సాహెబ్ ను జపిస్తే సుఖము లభిస్తుంది అని గురునానక్ కూడా అంటారు. ఆ నిరాకార అకాలమూర్తి అయిన తండ్రి మహిమనే పాడతారు. నన్ను స్మృతి చేస్తే సుఖము లభిస్తుందని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు. యుద్ధము పూర్తైన తర్వాత లక్ష్మినారాయణుల రాజ్యంలో ఒకే ధర్మముంటుంది. ఇవి అర్థము చేసుకునే విషయాలు. భగవానువాచ - పతితపావనుడు, జ్ఞానసాగరుడు అని భగవంతుడిని అనడం జరుగుతుంది. వారే దుఃఖహర్త-సుఖకర్త. మనము ఆ తండ్రికి పిల్లలము కావున మనము తప్పకుండా సుఖంలో ఉండాలి. భారతవాసులు సత్యయుగంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉండేవి. ఇప్పుడు ఆత్మలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. తర్వాత మనము వెళ్ళి దేవీదేవతలుగా అవుతాము. స్వర్గంలో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచం దుఃఖధామము, కొత్త ప్రపంచం సుఖధామము. ఇల్లు పాతదిగా అయినప్పుడు దాని నుండి ఎలుకలు, పాములు మొదలైనవి బయటకు వస్తాయి. ఈ పాత ప్రపంచం కూడా అటువంటిదే. ఈ కల్పము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు ఇది అంతిమము. గాంధీగారు కూడా కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ, రామ రాజ్యంగా అవ్వాలని కోరుకునేవారు. కానీ ఇది కేవలం తండ్రి యొక్క కర్తవ్యమే. దేవతల రాజ్యమునే రామరాజ్యమని అంటారు. కొత్త ప్రపంచంలో తప్పకుండా లక్ష్మీనారాయణుల రాజ్యము ఉంటుంది. మొదట రాధా-కృష్ణులు ఇరువురూ, వేరు వేరు రాజధానులకు చెందినవారు, వారి వివాహము జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారు తప్పకుండా ఈ సమయంలో అటువంటి కర్మలను చేస్తూ ఉండవచ్చు. తండ్రి కూర్చొని మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మనుష్యులు చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలోని కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది కానీ పేరు మార్చేశారు. ఇది పొరపాటు. కృష్ణ జయంతి సత్యయుగంలో జరుగుతుంది. శివుడు నిరాకార పరమపిత. కృష్ణుడు సాకార మనుష్యుడు. మొదట శివజయంతి జరుగుతుంది, తర్వాత కృష్ణ జయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారతదేశానికి స్వర్గ రాజ్యమునిస్తారు. శివజయంతి తర్వాత కృష్ణ జయంతి ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో రాఖీ ఉంటుంది, ఎందుకంటే పవిత్రత కావాలి. పాత ప్రపంచ వినాశనము కూడా జరగాలి. తర్వాత యుద్ధము మొదలైతే అందరూ సమాప్తమైపోతారు, అప్పుడు మీరు వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యము చేస్తారు. మీరు ఈ పాత ప్రపంచము, మృత్యులోకము కోసం చదవరు. మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకము కోసం. ఇటువంటి కాలేజి ఇంకేదీ ఉండదు. ఇది మృత్యులోకము యొక్క అంతిమము కావున త్వరగా చదువుకొని తెలివైనవారిగా అవ్వాలని ఇప్పుడు తండ్రి చెప్తారు. వారు తండ్రి కూడా, పతితపావనుడు కూడా, వారు చదివిస్తారు కూడా. అందుకే ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (విశ్వవిద్యాలయము). భగవానువాచ కదా. కృష్ణుడైతే సత్యయుగ రాజకుమారుడు. వారు కూడా శివబాబా నుండి వారసత్వము తీసుకుంటారు. ఈ సమయంలో అందరూ భవిష్యత్తు కోసం వారసత్వమును తీసుకుంటున్నారు, ఇక ఎంత చదువుకుంటారో అంత వారసత్వము లభిస్తుంది. చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. ఎక్కడ ఉన్నా సరే చదువుకుంటూ ఉండండి. మురళీ అయితే విదేశాలకు కూడా వెళ్ళగలదు. బాబా ప్రతి రోజూ అటెన్షన్ ను కూడా ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలో ఏర్పడిన మలినం తొలగిపోతుంది, ఆత్మ 100 శాతము పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు అపవిత్రంగా ఉంది. మనుష్యులైతే చాలా భక్తి చేస్తారు, తీర్థయాత్రలకు, మేళాలకు లక్షలాది మంది మనుష్యులు వెళ్తారు. ఇది జన్మ జన్మలుగా కొనసాగుతూ వస్తుంది. ఎన్ని మందిరాలు మొదలైనవి తయారుచేస్తారు, శ్రమిస్తారు. అయినా కానీ మెట్లు దిగుతూనే వస్తారు. ఇప్పుడు ఎక్కే కళ ద్వారా మేము సుఖధామములోకి వెళ్తాము, మళ్ళీ మేము కిందకు దిగి రావాలని మీకిప్పుడు తెలుసు. తర్వాత తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా కొత్త ఇంటి యొక్క వైభవము తగ్గిపోతుంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యయుగంలో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామరాజ్యము ప్రారంభం అయ్యింది, ఇప్పుడు పూర్తిగా తమోప్రధానంగా ఉంది. ఎంత మంది మనుష్యులు ఉన్నారు. ప్రపంచము పాతదైపోయింది. వారు ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) యొక్క ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. ఎంతగా తికమక పడుతూ ఉంటారు. ఇది గాడ్ ఫాదర్ (భగవంతుని) యొక్క కర్తవ్యమేనని మనము వ్రాస్తాము. సత్యయుగంలో 9-10 లక్షల మంది మనుష్యులు వెళ్ళి ఉంటారు. మిగిలినవారందరూ తమ ఇంటికి, స్వీట్ హోమ్ కి వెళ్ళిపోతారు. ఇది గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్ (ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ). ఏక ధర్మస్థాపన, మిగిలిన ధర్మాలన్నిటి వినాశనము జరుగుతుంది. తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారు. బయటి వారు, వికారాలలోకి వెళ్ళవచ్చు కానీ పిల్లలు కలగకూడదని అంటారు. ఇలా చేయడం వలన లాభమేమీ ఉండదు. ఈ ప్లానింగ్ అయితే అనంతమైన తండ్రి చేతిలో ఉంది. నేనే దుఃఖధామాన్ని సుఖధామంగా తయారుచేయడానికి వచ్చానని తండ్రి చెప్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆదిలో నేను వస్తాను. ఇప్పుడిది సంగమము, ఈ సమయంలో పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచంగా తయారవుతుంది. పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయడము అనేది తండ్రి కర్తవ్యమే. సత్యయుగంలో ఒకే ధర్మముండేది. ఈ లక్ష్మినారాయణులు విశ్వానికి యజమానులుగా, మహారాజా-మహారాణులుగా ఉండేవారు. ఎవరి మాల తయారయ్యింది అనేది కూడా మీకు తెలుసు. పైన పుష్పం అయిన శివబాబా ఉన్నారు, తర్వాత జంట పూస బ్రహ్మా-సరస్వతి. ఎవరైతే విశ్వాన్ని నరకము నుండి స్వర్గంగా, పతితము నుండి పావనంగా తయారుచేస్తారో, వారిదే ఈ మాల. ఎవరైతే సేవ చేసి వెళ్తారో, వారి స్మృతే ఉంటుంది. కావున వీరు సత్యయుగంలో పవిత్రంగా ఉండేవారు కదా అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రవృత్తి మార్గము పవిత్రంగా ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పాడతారు కూడా. సత్యయుగంలో ఈ విధంగా పిలవరు. సుఖంలో తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. తండ్రి లిబరేటర్ (ముక్తిదాత), దయాహృదయుడు, బ్లిస్ ఫుల్ (ఆనందసాగరుడు), వారు వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తిని ఇస్తారు. వచ్చి స్వీట్ హోమ్ కు తీసుకువెళ్ళండి అని వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖము లేదు. ఇది ప్రజలపై ప్రజా రాజ్యము. సత్యయుగంలో రాజు, రాణి, ప్రజలు ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు అనేది తండ్రి తెలియజేస్తారు. అక్కడ మీ వద్ద అపారమైన, లెక్కలేనంత ధనముంటుంది. బంగారు ఇటుకలతో ఇళ్ళు తయారవుతాయి. మిషన్ల నుండి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి. ఇటుకలలో కూడా వజ్రవైఢూర్యాలను పొదుగుతారు. ద్వాపరంలో కూడా ఎన్ని వజ్రాలుండేవి, వాటిని దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచం బంగారము కూడా కనిపించదు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి చెప్తారు. పాత ప్రపంచ వినాశనము కోసం ఎటామిక్ బాంబులు మొదలైనవి తయారు చేయబడి ఉన్నాయి. ఇది సైన్సు. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులను తయారు చేశారంటే, వాటి ద్వారా తమ కులం యొక్క వినాశనము చేసుకుంటారు. బాంబులను ఉంచుకునేందుకు తయారుచేయరు. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. రాజధాని స్థాపన అవ్వనంత వరకు యుద్ధము ప్రారంభమవ్వదు. తయారీలు జరుగుతున్నాయి, వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుష్యులు ఉండరు.

ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం స్వీట్ హోమ్ ను, స్వర్గ రాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా. ఇప్పుడు కూడా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. తండ్రి సర్వుల సద్గతిదాత. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. శరీరాలన్నీ ఇక్కడే సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. దేవతలు పవిత్రమైనవారు కదా. వారి ముందు ఎప్పుడూ కూడా బీడీ, పొగాకు మొదలైనవి ఉంచరు, వారు వైష్ణవులు. దానిని విష్ణుపురి అని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు నిర్వికారీ ప్రపంచములోకి వెళ్ళాలి. ఇంకా కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. ఎటామిక్ బాంబుల ద్వారా అందరూ సమాప్తమైపోతారని స్వయము కూడా అర్థం చేసుకుంటారు. యుద్ధమైతే జరగవలసిందే. ఎవరో ప్రేరణ ఇస్తున్నారు కావున మేము వీటిని తయారు చేస్తున్నామని వారు అంటారు. వారి కులము వినాశనం అవుతుందని తెలిసినా కానీ తయారు చేయకుండా ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనము, ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. జ్ఞాన యజ్ఞము ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఈ పాత ప్రపంచము వినాశనమై కొత్తదిగా తయారవుతుంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ మస్ట్ రిపీట్ (చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వవలసిందే). మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది, తర్వాత చంద్ర వంశ క్షత్రియ ధర్మము, ఆ తర్వాత ఇస్లామీ, బౌద్ధ ధర్మము మొదలైన ధర్మాలు వచ్చాయి, ఆ తర్వాత తప్పకుండా మొదటి నంబరువారే వస్తారు, మిగిలినవారంతా వినాశనమైపోతారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? ఆ నిరాకార శివబాబా. వారే శిక్షకుడు, సద్గురువు. వారు రావడంతోనే చదివించడం ప్రారంభిస్తారు, అందుకే శివజయంతియే గీతా జయంతి, గీతా జయంతియే శ్రీకృష్ణ జయంతి అని వ్రాయబడి ఉంది. శివబాబా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురి అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని చదివించే వారు ఏ సాధువులు, సత్పురుషులు లేక మనుష్యులు కాదు. వీరు దుఃఖహర్త-సుఖకర్త, వీరు అనంతమైన తండ్రి. 21 జన్మలకు మీకు వారసత్వాన్ని ఇస్తారు. వినాశనమైతే జరగవలసిందే. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు..... అని ఈ సమయం కోసమే అనడం జరుగుతుంది. దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి, నిప్పు కూడా అంటుకోనున్నదని. ఈ యజ్ఞములో అంతా స్వాహా అయిపోతుంది. ఇప్పుడు కొద్ది-కొద్దిగా నిప్పు అంటుకుంటుంది, తర్వాత ఆగిపోతుంది. ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. అందరూ పరస్పరములో కొట్లాడుకుంటారు. విడిపించేవారు ఎవరూ ఉండరు. రక్తపు నదుల తర్వాత పాల నదులు ప్రవహిస్తాయి. దీనిని అనవసర రక్తసిక్తపు ఆట అని అంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని కూడా చూసారు, తర్వాత ఈ కళ్ళతో కూడా చూస్తారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిన తర్వాత వినాశనము జరుగుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు స్వయాన్ని యోగ్యంగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి, అశుద్ధ ఆహార పానీయాలను త్యాగము చేయాలి. వినాశనానికి ముందే తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి.

2. త్వరత్వరగా చదువుకొని తెలివైనవారిగా అవ్వాలి. వికర్మలేవీ జరగకుండా అటెన్షన్ పెట్టాలి.

వరదానము:-

త్యాగము మరియు తపస్సు ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారి భవ

సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనము త్యాగము మరియు తపస్య. త్యాగము అనగా మనసా సంకల్పాల ద్వారా కూడా త్యాగము. ఏదైనా పరిస్థితి కారణంగా, మర్యాదల కారణంగా, తప్పదన్నట్లుగా త్యాగం చేయడమనేది త్యాగం కాదు. జ్ఞాన స్వరూపంగా అయి సంకల్పాలతో కూడా త్యాగులుగా అవ్వండి. తపస్వీ అనగా సదా తండ్రి తపనలో లవలీనులుగా, జ్ఞానము, ప్రేమ, ఆనందం, సుఖము, శాంతి సాగరంలో ఇమిడి ఉండడం. ఇటువంటి త్యాగీలు మరియు తపస్వీలే సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారులు.

స్లోగన్:-

మీ తపస్సు ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపజేయడమే విశ్వ సేవాధారులుగా అవ్వడము.