ఓంశాంతి
నిరాకార భగవానువాచ. వారికైతే ఒకే పేరు ఉంది. అర్థం చేయించేందుకు, పక్కా
నిశ్చయాన్ని కలిగించేందుకు శివభగవానువాచ అని చెప్పాల్సి వస్తుంది. తండ్రికి
చెప్పాల్సి వస్తుంది - నేను ఎవరినో, అలాగే ఉంటాను, నా పేరు ఎప్పటికీ మారదు. సత్యయుగం
యొక్క దేవీ-దేవతలు ఎవరైతే ఉన్నారో, వారైతే పునర్జన్మల్లోకి తప్పకుండా వస్తారు.
తండ్రి ఈ తనువు ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు,
తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు, దాదా కూడా గుప్తముగా ఉన్నారు. బ్రహ్మా తనువులోకి
పరమపిత వస్తారని ఎవ్వరికీ తెలియదు. పిల్లలు కూడా గుప్తంగా ఉన్నారు. మేము శివబాబా
సంతానమని అందరూ అంటారు కావున వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వారి శ్రీమతంపై
నడుచుకోవాలి. వారు మన సుప్రీమ్ తండ్రి, టీచరు, సద్గురువు అన్న నిశ్చయమైతే ఉండనే
ఉన్నది. ఇవి ఎంత మధురాతి-మధురమైన విషయాలు. మనము నిరాకార శివబాబాకు విద్యార్థులము,
వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. భగవానువాచ - ఓ పిల్లలూ, నేను మీకు రాజయోగాన్ని
నేర్పిస్తాను. మేయర్ అయితే ఓ పిల్లలూ, అని అనరు. సన్యాసులు కూడా ఈ విధంగా అనలేరు.
పిల్లలూ, అని అనడమైతే ఒక్క తండ్రి కర్తవ్యము మాత్రమే. పిల్లలకు కూడా తెలుసు, మేము
నిరాకార తండ్రికి పిల్లలము, వారి సమ్ముఖంలో కూర్చున్నాము. మేము ప్రజాపిత
బ్రహ్మాకుమార-కుమారీలము. ప్రజాపిత అన్న పదమును వేయకపోతే మనుష్యులు తికమకపడతారు.
బ్రహ్మా అయితే సూక్ష్మవతనవాసి దేవత కదా, మరి వారు ఇక్కడికి ఎక్కడ నుండి వచ్చారు అని
అనుకుంటారు. బ్రహ్మా దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని అంటారు. ఇంకా, గురువని కూడా
అంటారు, గురు బ్రహ్మా, గురు విష్ణు అని అంటారు. ఇప్పుడు విష్ణువు లేక శంకరుడైతే
గురువులు కారు. శంకరుడు పార్వతికి కథను వినిపించారు కావున వారు గురువని భావిస్తారు.
విష్ణువు కూడా గురువు కారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణులు గురువులుగా అవ్వరు.
కృష్ణుడిని కూడా పెద్ద గురువుగా, గీతా భగవానునిగా చేసేసారు. కానీ భగవంతుడు ఒక్కరే,
ఈ విషయాన్ని పిల్లలైన మీరు ఋజువు చేయాలి.
మీరు గుప్త సైన్యము. రావణునిపై విజయం పొందుతారు అనగా మాయను జయించి జగత్ జీతులుగా
అవుతారు. ధనాన్ని మాయ అని అనరు. ధనాన్ని సంపద అని అంటారు. తండ్రి పిల్లలకు అర్థం
చేయిస్తారు, పిల్లలూ, ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇవి 5000 సంవత్సరాల
క్రితము యొక్క ఆ మాటలే. కేవలం నిరాకార భగవానువాచకు బదులుగా సాకార కృష్ణుని పేరును
రాసేసారు. తండ్రి అంటారు - ఈ జ్ఞానము ఏదైతే మీకు ఇప్పుడు లభిస్తుందో, ఇది భవిష్య
ప్రారబ్ధము కోసము. ప్రారబ్ధము లభించిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరముండదు. ఈ
జ్ఞానము ఉన్నదే పతితుల నుండి పావనులుగా అవ్వటానికి. పావన ప్రపంచములో ఇక ఎవరినీ
గురువుగా చేసుకునే అవసరముండదు. వాస్తవానికి గురువైతే ఒక్క పరమపిత పరమాత్మనే. ఓ
పతితపావనా రండి అని పిలుస్తారు కూడా, కావున వారికి అర్థం చేయించాలి కదా. వారే
సుప్రీమ్ గురువు. సర్వుల సద్గతిదాత రాముడు అని అంటూ ఉంటారు. కావున ఎప్పుడైతే అందరూ
దుర్గతిలో ఉంటారో, వారు తప్పకుండా అప్పుడే వస్తారు. అక్కడ ఉన్నది క్షీర సాగరము, సుఖ
సాగరము. విషయ వైతరణీ నది అక్కడ ఉండదు. విష్ణువు క్షీరసాగరములో ఉన్నట్లయితే తప్పకుండా
వారి పిల్లలు కూడా వారితో పాటు ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు,
తర్వాత విష్ణు కులానికి చెందినవారిగా అవుతారు. వారు సంపూర్ణ వైష్ణవులు కదా. దేవతల
ఎదురుగా ఎప్పుడూ నియమ విరుద్ధమైన పదార్థాలను, ఉల్లిపాయలు మొదలైనవాటిని పెట్టరు.
మళ్ళీ ఇటువంటి దేవతలుగా అవ్వాలంటే, వీటన్నిటినీ వదలాల్సి ఉంటుంది. ఇది సంగమయుగము.
బ్రాహ్మణులైన మీరు మాత్రమే సంగమంలో ఉన్నారని, మిగిలినవారందరూ కలియుగంలో ఉన్నారని
అర్థం చేయించడం జరిగింది. ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకు అర్థము
చేసుకోలేరు. తండ్రి అంటారు, నేను కల్పము యొక్క సంగమములో వస్తాను. ఇది ఒక సంగమమని
వారు అర్థం చేసుకోనే చేసుకోరు. ప్రపంచము మారుతుంది కదా. ఈ మాటను అంటారు కూడా కానీ
ఎలా మారుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. కేవలం నామమాత్రంగా నోటితో అలా అంటారు.
శ్రీమతంపై నడుచుకోవడంతోనే శ్రేష్ఠంగా అవుతామని మీరు బాగా అర్థం చేసుకున్నారు.
తండ్రిని స్మృతి చేయాలి. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ మర్చిపోవాలి. బాబా
శరీరము లేకుండా పంపించారు, మళ్ళీ అదే విధంగా వెళ్ళాలి. ఇక్కడకు పాత్రను
అభినయించేందుకు వచ్చారు. ఇది గుప్తమైన శ్రమ, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి
చేయాలి. మీరు ఘడియ-ఘడియ ఇది మర్చిపోతారు. బాబాను మర్చిపోవడంతో మాయ యొక్క చెంపదెబ్బ
పడుతుంది. ఇది కూడా ఒక ఆట, అల్లాహ్ అవల్దీన్ గురించి చూపిస్తారు కదా. అల్లాహ్ మొదటి
ధర్మాన్ని స్థాపన చేసారు. దానిని రుద్దగానే స్వర్గము లభించింది. ఈ ధర్మాన్ని ఎవరు
స్థాపన చేస్తున్నారు? అల్లాహ్ మొదటి నంబరు ధర్మాన్ని స్థాపన చేసారు. హాతిమతాయి ఆటను
కూడా చూపిస్తారు. నోటిలో నాణెమును వేసుకోకపోతే మాయ వచ్చేస్తుంది. మీది కూడా ఇదే
పరిస్థితి. తండ్రిని మర్చిపోయి మిగిలినవారందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
మనము శాంతిధామానికి వెళ్తున్నామని, మళ్ళీ సుఖధామములోకి వస్తామని ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు. దుఃఖధామాన్ని మర్చిపోయే పురుషార్థము చేయండి. ఇదంతా
సమాప్తమవ్వనున్నది. మేము లక్షాధికారులము, ఇలా ఉన్నాము... ఇవేవీ బుద్ధిలో ఉంచుకోకూడదు.
మనము ఉన్నదే అశరీరులుగా, ఇది పాత వస్తువు. ఈ పాత చెప్పు చాలా దుఃఖాన్ని ఇచ్చింది.
అనారోగ్యము ఎంత ఎక్కువగా ఉంటే, అంత సంతోషముండాలి. నాట్యము చేయాలి. అది కర్మభోగము,
లెక్కాచారాన్ని అయితే సమాప్తం చేసుకోవాల్సిందే, దీనికి భయపడకూడదు. మేము యోగబలముతో
వికర్మలను వినాశనం చేసుకోలేకపోతే కర్మభోగముతో సమాప్తం చేసుకోవాల్సి ఉంటుందని అర్థం
చేసుకోవాలి, ఇందులో తికమకపడే విషయమే లేదు. ఈ శరీరము పాతది. ఇది త్వరగా సమాప్తమైతే
మంచిది. ఇంకా, మీ 7 రోజుల భట్టీ కూడా ప్రసిద్ధమైనది. 7 రోజులు మంచి రీతిలో అర్థము
చేసుకుని, ధారణ చేసి, ఇక ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. మురళీ అయితే లభిస్తూ ఉంటుంది,
అదే చాలు. తండ్రిని స్మృతి చేస్తూ చక్రాన్ని తిప్పుతూ ఉండండి. 7 రోజులలో స్వదర్శన
చక్రధారులుగా అవ్వాలి. 7 రోజుల పఠనమును కూడా పెట్టుకుంటారు. 7 రోజులు ప్రసిద్ధమైనవి.
గ్రంథ్ ను కూడా 7 రోజులు పఠిస్తారు. భట్టీ కూడా 7 రోజులది. అలాగని ఎవరు వచ్చినా సరే,
వారికి 7 రోజులని చెప్పకూడదు. మనుష్యుల నాడిని కూడా చూడాల్సి ఉంటుంది. మొదటే 7
రోజుల కోర్సు అని చెప్తే చాలామంది భయపడతారు. మేము ఉండలేకపోతే ఏం చేయాలి అని
భావిస్తారు, అప్పుడిక వెళ్ళిపోతారు, అందుకే మనుష్యులను చూడాల్సి ఉంటుంది. ప్రతి
ఒక్కరి నాడిని చూడాల్సి ఉంటుంది. ఎన్ని రోజుల కోసం వచ్చారు అని మొదటైతే చెక్ చేయాలి.
ఒక్కసారిగా 7 రోజులని చెప్తే భయపడతారు. 7 రోజులను ఎవ్వరూ ఇవ్వలేరు. కొంతమంది
సర్జన్లు (వైద్యులు) ఎలా ఉంటారంటే, వారు నాడి చూసి వెంటనే - నీకు ఫలానా వ్యాధి అని
చెప్తారు. వీరు కూడా మీ అవినాశీ జ్ఞాన సర్జన్. పిల్లలైన మీరు కూడా మాస్టర్ సర్జన్లు.
ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఒక్క క్షణములో మనుష్యులకు జీవన్ముక్తి లభించగలదు అని మీరు
అంటారు. అప్పుడు వారు - ఒక్క క్షణములో జీవన్ముక్తి లభించగలదు అన్నప్పుడు మరి 7
రోజులని ఎందుకు అంటారు, క్షణములో లభించేదాని గురించి చెప్పండి అని అంటారు. మేము
ఉండలేము అని భయపడతారు. అందుకే మొదట నాడిని చూడాలి. అందరికీ ఒకే విషయము వర్తించదు.
చాలామంది పిల్లలు డిస్సర్వీస్ చేస్తారు. ఫారం నింపించే సమయంలో నాడిని చూసి అడగాల్సి
ఉంటుంది. ఎన్ని రోజులు ఉండగలరు అన్నది కూడా అడగాలి. అచ్ఛా, చెప్పండి, అందరికీ
భగవంతుడు ఒక్కరే కదా. పరమపితతో మీకు ఏం సంబంధం? మొదటైతే ఈ విషయంపై అర్థం చేయించాల్సి
ఉంటుంది - వారు తండ్రి, మనము పిల్లలము. తండ్రి అయితే వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గ
వారసత్వము లభించాలి. వారు స్వర్గ రచయిత. ఇప్పుడిది నరకము. భారత్ స్వర్గముగా ఉండేది,
విశ్వానికి యజమానులుగా ఉండేవారు. దేవీ-దేవతల రాజ్యముండేది. తర్వాత మాయ రాజ్యాన్ని
లాక్కుంది. ఇప్పుడు మళ్ళీ మాయపై విజయం పొంది రాజ్యాన్ని తీసుకోవాలి. పాత పతిత
కలియుగీ ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది కావున తప్పకుండా పావన ప్రపంచాన్ని
స్థాపన చేయాల్సి ఉంటుంది. కొద్దిగా సూచనప్రాయంగా చెప్పాలి. ఇక మున్ముందు ఆ
విషయాలన్నీ అర్థము చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. ఇంకెక్కడికి
వెళ్తారు? సద్గతి లభించే దుకాణము ఒక్కటే ఉంది. పరమపిత పరమాత్మ శివబాబా యొక్క దుకాణము
మాత్రమే ఉంది. ఒక్క క్షణములో జీవన్ముక్తి లభించనున్నది. దుకాణము ఎలా ఉందో చూడండి, ఈ
దుకాణానికి మీరు సేల్స్ మెన్. మంచి సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో, వారు పదవి కూడా
మంచిది పొందుతారు. అమ్మకం చేసేందుకు కూడా తెలివి కావాలి. ఒకవేళ తెలివి లేకపోతే, వారు
ఏం సేవ చేస్తారు. మొదట నిశ్చయము కూర్చోబెట్టండి. ఆ తర్వాత 7 రోజుల విషయము. అరే,
తండ్రి అయితే వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. భారత్ సుఖధామముగా ఉండేది, ఇప్పుడు
భారత్ దుఃఖధామముగా ఉంది. మళ్ళీ సుఖధామముగా ఎలా అవుతుంది, ఎవరు తయారుచేస్తారు? మొదట
దారి చూపాలి - ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు
వస్తాము.
ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, తిరిగి ఇంటికి రావాలి. తండ్రిని గుర్తు
ఉంచుకోవడంతో మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎగిరేందుకు మీ రెక్కలు ఏవైతే తెగిపోయాయో,
అవి లభిస్తూ ఉంటాయి. మీరు నా వద్దకు వచ్చేస్తారు. తండ్రే వచ్చి గవ్వ నుండి
వజ్రతుల్యంగా తయారుచేస్తారు. ఈ సంపాదన చాలా గొప్పది. తండ్రిని స్మృతి చేయడంతో 21
జన్మల కోసం మీరు నిరోగులుగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేయడంతో మీరు సదా
ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఇప్పుడైతే రెండూ లేవు. మీలో కూడా
నంబరువారుగా ఉన్నారు, కచ్చాగా ఉన్నవారిని మాయ వెంటనే తినేస్తుంది. అయినప్పటికీ,
మున్ముందు మళ్ళీ స్మృతి కలుగుతుంది. చివరి సమయములో రాజులు కూడా వస్తారు, సన్యాసులు
మొదలైనవారు కూడా వస్తారు. కన్యలు, మాతలైన మీరే బాణాలు వేసారు. ఇక్కడ మందిరాలు కూడా
ఏక్యురేట్ గా తయారై ఉన్నాయి. కుమారీ కన్య యొక్క మందిరము కూడా ఉంది. అధర్ కుమారీ
యొక్క అర్థాన్ని ఏమైనా అర్థం చేసుకుంటారా. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ బి.కె.లుగా
అవుతారో, వారినే అధర్ అని అంటారు. కుమారీ అయితే కుమారీనే. పూర్తి మందిరమంతా మీ
స్మృతిచిహ్నముగా తయారై ఉంది. కల్పక్రితము కూడా మీరు సేవ చేసారు. మీకు ఎంత
సంతోషముండాలి. మీది ఎంత పెద్ద పరీక్ష. చదివించేవారు భగవంతుడు.
(ఢిల్లీ పార్టీ బాబా నుండి సెలవు తీసుకుని తమ స్థానానికి వెళ్తున్నారు) పిల్లలు
మంచిగా రిఫ్రెష్ అయ్యి వెళ్తున్నారు. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. ఎవరైతే బాగా
అర్థం చేసుకుంటారో, వారు బాగా అర్థం చేయిస్తారు కూడా. బాబా కూడా గుప్తముగా ఉన్నారు,
దాదా కూడా గుప్తముగా ఉన్నారని పిల్లలకు తెలుసు. మనము కూడా గుప్తముగా ఉన్నాము.
ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులకు కూడా తెలియదు. మీరు వారికి అర్థం చేయించవచ్చు - మీరు
కుఖ వంశావళి, మేము ముఖవంశావళి. మీరు పతితంగా ఉన్నారు, మేము పావనంగా అవుతూ ఉన్నాము.
ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కావున తప్పకుండా కొత్త ప్రపంచానికి చెందినవారిగా
అయినట్లు కదా. సత్యయుగ దేవతలు కొత్త ప్రపంచానికి చెందినవారా లేక బ్రాహ్మణులు కొత్త
ప్రపంచానికి చెందినవారా? బ్రాహ్మణుల పిలక ఉంటుంది కదా. పిలక (బ్రాహ్మణ కులము) పైన
ఉందా లేక ముఖము (దేవతా కులము) పైన ఉందా? అందులో మళ్ళీ శివబాబాను కూడా మాయం చేసేసారు.
తండ్రి పుష్పాల తోటకు యజమాని అని పిల్లలైన మీకు తెలుసు. రావణుడిని తోట యజమాని అని
ఏమైనా అంటారా. రావణుడు ముళ్ళగా తయారుచేస్తాడు, బాబా పుష్పాలుగా తయారుచేస్తారు. ఇదంతా
ముళ్ళ అడవి. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు,
ఎవ్వరికీ దుఃఖమివ్వకూడదు. క్రోధముతో మాట్లాడినట్లయితే వంద రెట్ల శిక్ష పడుతుంది.
పాపాత్ములుగా అవుతారు. వారికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. తండ్రితో పాటు
సహాయకులుగా ఉంటామని గ్యారంటీ ఇచ్చి, మళ్ళీ డిస్సర్వీస్ చేసినట్లయితే వారికి చాలా
కఠినమైన శిక్ష ఉంటుంది. పిల్లలుగా అయి మళ్ళీ వికర్మలు చేసినట్లయితే వంద రెట్ల శిక్ష
లభిస్తుంది, అందుకే ఒకవేళ ధైర్యముంటే శ్రీమతంపై నడవండి. నరుని నుండి నారాయణునిగా
అవ్వాలి. ఇలా కాదు - అచ్ఛా, ప్రజలుగా అయితే ప్రజలుగానే మంచిది. అలా కాదు, ఇది చాలా
పెద్ద మాల. అవకాశము చాలా ఉంది. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశ చెందకూడదు).
కింద పడవచ్చు, కానీ మళ్ళీ సంభాళించుకోవాలి, నిరాశ చెందకూడదు. శివబాబా నుండి ఒక్క
క్షణములో జీవన్ముక్తిని పొందేందుకు ఇది ఒక్కటే దుకాణము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉన్నత పదవిని పొందేందుకు శివబాబా దుకాణానికి మంచి సేల్స్ మెన్ గా అవ్వాలి.
ప్రతి ఒక్కరి నాడిని చూసి, తర్వాత వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి.
2. క్రోధానికి వశమై నోటితో దుఃఖాన్ని కలిగించే మాటలను మాట్లాడకూడదు. తండ్రికి
సహాయకులుగా అవుతామని గ్యారంటీ ఇచ్చి డిస్సర్వీస్ జరిగే ఏ పనీ చేయకూడదు.