09-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏకాంతములో కూర్చుని విచార సాగర మథనము చేయండి, ఏ పాయింట్లు అయితే వింటారో వాటిని రివైజ్ చేయండి"

ప్రశ్న:-

మీ స్మృతియాత్ర ఎప్పుడు పూర్తవుతుంది?

జవాబు:-

ఎప్పుడైతే మీ కర్మేంద్రియాలేవీ మోసము చేయవో, కర్మాతీత స్థితి ఏర్పడుతుందో, అప్పుడు స్మృతియాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి, నిరాశ చెందకూడదు. సేవలో తత్పరులై ఉండాలి.

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? అర్థకల్పము మేము దేహాభిమానులుగా ఉన్నాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యి ఉండేందుకు శ్రమ చేయవలసి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు లేకపోతే మర్చిపోతారు అని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. స్మృతి చేయకపోతే యాత్ర ఎలా చేయగలరు! పాపాలు ఎలా సమాప్తమౌతాయి! నష్టం కలుగుతుంది. ఇది పదే-పదే గుర్తు చేసుకోండి. ఇది ముఖ్యమైన విషయము. తండ్రి అయితే అనేక రకాల యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. తప్పు ఏమిటో, ఒప్పు ఏమిటో అనేది కూడా అర్థం చేయించారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. భక్తి గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏమేమి చేయవలసి ఉంటుంది. ఈ యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం, ఇదంతా భక్తిమార్గమని చెప్తున్నారు. తండ్రిని మహిమ చేస్తారు, కానీ తప్పుగా చేస్తారు. వాస్తవానికి కృష్ణుని మహిమ గురించి కూడా పూర్తిగా తెలియదు. ప్రతి ఒక్క విషయాన్ని అర్థము చేసుకోవాలి కదా. కృష్ణుడిని వైకుంఠనాథుడని అంటారు. అచ్ఛా, కృష్ణుడిని త్రిలోకనాథుడు అని అనవచ్చా అని బాబా అడుగుతున్నారు. త్రిలోకనాథుడు - అని గాయనం చేయబడుతుంది కదా. ఇప్పుడు త్రిలోకనాథుడు అనగా మూడు లోకాలైన మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - వీటికి నాథుడు. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. నేను బ్రహ్మాండానికి యజమానిని అని కృష్ణుడు భావిస్తారా? లేదు. వారు వైకుంఠములో ఉండేవారు. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని వైకుంఠం అని అంటారు. కనుక వాస్తవానికి త్రిలోకనాథుడు ఎవ్వరూ లేరు. తండ్రి యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. మూడు లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమాని, మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనము విషయమే లేదు. స్థూల వతనములో కూడా వారు యజమాని కాదు, స్వర్గానికి కానీ, నరకానికి కానీ వారు యజమాని కాదు. కృష్ణుడు స్వర్గానికి యజమాని. నరకానికి యజమాని రావణుడు. దీనిని రావణరాజ్యము, ఆసురీ రాజ్యము అని అంటారు. మనుష్యులు కూడా అంటారు కానీ వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. రావణునికి 10 తలలు చూపించారు. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషునిలోనివి. ఇప్పుడు 5 వికారాలు అందరిలోనూ ఉన్నాయి. అందరూ రావణ రాజ్యములోనే ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. తండ్రి వచ్చి శ్రేష్ఠాచార ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు. ఏకాంతంలో కూర్చోవడం ద్వారా ఈ విధంగా విచార సాగర మథనము నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు పుస్తకాలు తీసుకుని ఏకాంతంలో చదువుకుంటారు. మీరు పుస్తకాలు చదవాల్సిన అవసరము లేదు, అయితే మీరు పాయింట్లు నోట్ చేసుకుంటారు. వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇవి అర్థము చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు. ఈ రోజు మీకు గుహ్యాతి గుహ్యమైన కొత్త కొత్త పాయింట్లు అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తారు కదా. లక్ష్మీ-నారాయణులు పారసపురికి యజమానులు. విష్ణువు అని కూడా అనము. ఈ లక్ష్మీ-నారాయణులే విష్ణువు అని కూడా భావించరు. ఇప్పుడు మీరు క్లుప్తంగా లక్ష్యాన్ని ఉద్దేశ్యాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మా-సరస్వతులు కూడా పరస్పరములో భార్య-భర్తలు కాదు. వీరు ప్రజాపిత బ్రహ్మా కదా. ప్రజాపిత బ్రహ్మాను గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు, శివబాబాను కేవలం బాబా అనే అంటారు. మిగిలినవారందరూ సోదరులు. వీరందరూ బ్రహ్మా సంతానము. భగవంతుని సంతానమైన మనము సోదరులమవుతాము అన్నది అందరికీ తెలుసు కానీ అది నిరాకార ప్రపంచములో. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. కొత్త ప్రపంచం అని సత్యయుగాన్నే అంటారు. దీనికి పురుషోత్తమ సంగమయుగం అని పేరు పెట్టారు. సత్యయుగంలో పురుషోత్తములే ఉంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మీరు కొత్త ప్రపంచము కోసం తయారౌతున్నారు. ఈ సంగమయుగములోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతామని కూడా అంటారు. వారు అందరి కంటే ఉత్తమ పురుషులు. వారినే దేవతలు అని అంటారు. ఉత్తమోత్తములు, నంబరువన్ అయినవారు లక్ష్మీ-నారాయణులు, ఆ తర్వాత పిల్లలైన మీరు నంబరువారుగా అవుతారు. సూర్యవంశీయులని ఉత్తములని అంటారు. నంబరువన్ గా అయితే ఉన్నారు కదా. నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతాయి.

ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తము పెడతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లలకు సంతోషము కలుగుతుంది. ముహూర్తము నిశ్చయించుకుంటారు. పిల్లలైన మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు. ముహూర్తము నిశ్చయించుకుంటారు. బంగారు పుష్పాల వర్షము కురుస్తుందని కూడా వ్రాయబడింది. పిల్లలైన మీకు సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కిపోవాలి. మీకు సుఖం మరియు శాంతి రెండూ లభిస్తాయి. ఇంతటి సుఖం మరియు శాంతి పొందేవారు ఎవ్వరూ ఉండరు. వేరే ధర్మము వస్తే అది ద్వైతమైపోతుంది. మేము పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుతాము అని పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉంటుంది. భాగ్యములో ఏముంటే అది లభిస్తుంది, పాసవ్వాలని ఉంటే అవుతాము అని భావించకూడదు. అలా కాదు. ప్రతి విషయములో పురుషార్థము తప్పకుండా చేయాలి. పురుషార్థము చేయలేకపోతే భాగ్యములో ఏముంటే అది లభిస్తుంది అని అంటారు. తర్వాత పురుషార్థము చేయడమే మానేస్తారు. మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. స్త్రీలకు అన్ని స్థానాలలో గౌరవముంది. విదేశాలలో కూడా గౌరవముంది. ఇక్కడ కూతురు జన్మించినట్లయితే మంచాన్ని తలకిందులుగా తిప్పేస్తారు. ప్రపంచం పూర్తిగా అశుద్ధంగా ఉంది. భారత్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఈ సమయంలో పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మనుష్యులు మర్చిపోయారు, కేవలం శాంతి-శాంతి అని అడుగుతూ ఉంటారు. విశ్వంలో శాంతిని కోరుకుంటారు. మీరు ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూపించండి. వీరి రాజ్యము ఉన్నప్పుడు పవిత్రత-సుఖం-శాంతి కూడా ఉండేవి. మీకు అటువంటి రాజ్యము కావాలి కదా. మూలవతనంలో విశ్వశాంతి అని అనరు. విశ్వములో శాంతి ఇక్కడే ఉంటుంది కదా. దేవతల రాజ్యము మొత్తం విశ్వములో ఉండేది. మూలవతనం ఆత్మల లోకం. ఆత్మల లోకం ఉంటుందని కూడా మనుష్యులకు తెలియదు. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా, పురుషోత్తములుగా తయారుచేస్తాను, ఇది అర్థము చేయించే విషయము అని బాబా చెప్తున్నారు. అంతేకానీ భగవంతుడు వచ్చేసారని అరవడం కాదు, అలా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. ఇంకా తిట్లు తిడతారు మరియు తినిపిస్తారు. బి.కె.లు తమ బాబానే భగవంతుడు అని అంటున్నారు అని వారంటారు. ఇలా సేవ జరగదు. బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. గదిలో గోడపైన 8-10 చిత్రాలను చక్కగా అమర్చండి మరియు బయట అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వం తీసుకోవాలంటే లేక మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలంటే రండి, మేము మీకు అర్థం చేయిస్తాము అని వ్రాయండి. అప్పుడు ఎంతోమంది రావడం మొదలుపెడతారు. వారంతట వారే వస్తారు. విశ్వములో శాంతి అయితే ఉండేది కదా. ఇప్పుడు ఇన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి, తమోప్రధాన ప్రపంచములో శాంతి ఎలా ఏర్పడుతుంది. విశ్వములో శాంతిని భగవంతుడు మాత్రమే ఏర్పరచగలరు. శివబాబా వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా కానుకను తీసుకువస్తారు. అంత దూరము నుండి వచ్చే తండ్రి వీరు ఒక్కరే మరియు ఈ తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇంత గొప్ప తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు పిల్లల కోసం కానుకలను తీసుకొస్తారు కదా. స్త్రీకి పతిగా, పిల్లలకు తండ్రిగా అవుతారు కదా. తర్వాత తాత, ముత్తాత, ముత్తాతలకు తాతగా అవుతారు. వీరిని మీరు బాబా అని అంటారు, గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు. వంశాలున్నాయి కదా. ఆడమ్, ఆదిదేవ్ అని పేర్లున్నాయి కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా సృష్టిచక్రము యొక్క చరిత్ర-భూగోళాలను మీరు తెలుసుకుని చక్రవర్తీ రాజులుగా అవుతున్నారు. బాబా ఎంత ప్రేమతో మరియు అభిరుచితో చదివిస్తున్నారు కనుక అంతగా చదువుకోవాలి కదా. ఉదయం సమయములోనైతే అందరూ ఫ్రీగా ఉంటారు. ఉదయము క్లాసు జరుగుతుంది, అరగంట ముప్పావు గంట మురళీని విని మళ్ళీ వెళ్ళిపోండి. స్మృతి అయితే ఎక్కడ ఉన్నా కూడా చేయవచ్చు. ఆదివారం రోజైతే సెలవు ఉంటుంది. ఉదయము 2-3 గంటలు కూర్చోండి. పగటివేళలో చేసుకోలేని సంపాదనను అక్కడ మేకప్ చేసుకోండి. జోలెను పూర్తిగా నింపుకోండి. సమయమైతే లభిస్తుంది కదా. మాయా తుఫాను రావడం వలన స్మృతి చేయలేరు. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. భక్తిమార్గములో ఎన్నో సత్సంగాలకు వెళ్తారు. కృష్ణుని మందిరంలోకి, మళ్ళీ శ్రీనాథుని మందిరంలోకి, ఇంకా వేరే మందిరాలలోకి వెళ్తారు. యాత్రలో కూడా ఎంతగా వ్యభిచారులుగా అవుతారు. అంత కష్టపడినా కూడా, ఫలితమేమీ ఉండదు. డ్రామాలో ఇది కూడా రచించబడి ఉంది, మళ్ళీ జరుగుతుంది. మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్య-త్రేతాయుగాలలో కల్పక్రితం ఏ పాత్రనైతే అభినయించారో అదే అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థము చేసుకోలేరు. సూక్ష్మబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారే బాగా అర్థము చేసుకుని అర్థం చేయించగలరు. ఇది తయారైన అనాది నాటకమని వారికి లోపల అనుభవమవుతుంది. ఇది అనంతమైన నాటకమని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. దీనిని అర్థము చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని విస్తారంగా అర్థం చేయించిన తర్వాత - ముఖ్యమైనది స్మృతియాత్ర అని చెప్పడం జరుగుతుంది. క్షణములో జీవన్ముక్తి అని కూడా గాయనముంది. మరియు జ్ఞానసాగరుడు అని కూడా గాయనము ఉంది. మొత్తం సాగరాన్ని సిరాగా చేసి, అడవిని కలంగా చేసి, భూమిని కాగితముగా చేసినా..... కూడా అంతము కాదు. మొదటి నుండి మీరు ఎంతగా వ్రాస్తూ వచ్చారు. ఎన్నో కాగితాలు తయారయ్యాయి. మీరు ఎదురుదెబ్బలు తినకూడదు. ముఖ్యమైనవారు అల్ఫ్ (అల్లా). తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా వీరిలో ప్రవేశించి మిమ్మల్ని ఎంతో ప్రేమగా చదివిస్తారు. ఎటువంటి ఆర్భాటము ఉండదు. నేను పాత శరీరములోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. శివబాబా ఎంత సాధారణ రీతిగా వచ్చి చదివిస్తున్నారు. ఎటువంటి అహంకారమూ లేదు. ఓ బాబా, పతిత ప్రపంచములో, పతిత శరీరములోకి రండి, వచ్చి మాకు శిక్షణనివ్వండి అని మీరు నన్ను పిలుస్తారని తండ్రి చెప్తున్నారు. సత్యయుగంలో వజ్ర-వైఢూర్యాల మహల్ లోకి వచ్చి కూర్చోండి, భోజనము తినండి..... అని నన్ను పిలువరు. అసలు శివబాబా భోజనమే చేయరు. మీరు వచ్చి భోజనం చేయండి అని ఇంతకుముందు పిలిచేవారు. 36 రకాల భోజనము తినిపించేవారు, ఇది మళ్ళీ జరుగుతుంది. దీనిని కూడా చరిత్ర అనే అంటారు. కృష్ణుని చరిత్ర ఏమిటి? వారైతే సత్యయుగపు రాకుమారుడు. వారిని పతిత-పావనుడు అని అనరు. సత్యయుగంలో వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు. మనుష్యులైతే పూర్తిగా ఘోరమైన అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు అతి ప్రకాశములో ఉన్నారు. తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు. అర్థకల్పము మీరు రాజ్యము చేస్తారు కనుక ఎంత సంతోషము ఉండాలి.

ఎప్పుడైతే మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలూ మోసము చేయవో అప్పుడు మీ స్మృతియాత్ర పూర్తవుతుంది. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి చేరుకుంటారో, అప్పుడు స్మృతియాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు అదింకా పూర్తవ్వలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి. నిరాశ చెందకూడదు. సేవ మరియు సేవ. తండ్రి కూడా వృద్ధ తనువు ద్వారా వచ్చి సేవ చేస్తున్నారు కదా. తండ్రి, చేసేవారు మరియు చేయించేవారు. పిల్లల కోసం ఇది తయారుచేయాలి, ఇళ్ళులు నిర్మించాలి అని ఎంతో చింత ఉంటుంది. లౌకిక తండ్రికి ఎలాగైతే హద్దులోని ఆలోచనలుంటాయో, అలాగే పారలౌకిక తండ్రికి అనంతమైన ఆలోచనలుంటాయి. పిల్లలైన మీరే సేవ చేయాలి. రోజు-రోజుకు చాలా సహజమౌతూ ఉంటుంది. ఎంతగా వినాశనానికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా శక్తి వస్తూ ఉంటుంది. భీష్మపితామహుడు మొదలైనవారికి చివరిలో బాణము తగిలిందని గాయనం కూడా ఉంది. ఇప్పుడే బాణము తగిలినట్లయితే చాలా హంగామాలు అయిపోతాయి. ఎంతగా గుంపు ఏర్పడుతుందంటే ఇక అడగకండి. తల గోక్కునేందుకు కూడా ఖాళీ లేదని అంటారు కదా. అలా ఎవ్వరూ ఉండరు. కానీ అంతమంది గుంపులుగా వచ్చేస్తే, అప్పుడు అలా అంటారు. ఎప్పుడైతే వీరికి బాణము తగులుతుందో అప్పుడు మీ ప్రభావము వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయమైతే లభించాలి.

మీరు మూడడుగుల స్థలంలో కూడా ఈ అవినాశీ హాస్పటిల్ మరియు గాడ్లీ యూనివర్సిటీని తెరవవచ్చు. ధనము లేకపోయినా ఫర్వాలేదు. మీకు చిత్రాలు లభిస్తాయి. సేవలో మానావమానాలు, సుఖ-దుఃఖాలు, చలి-వేడి, అన్నీ సహనం చేయాలి. ఎవరినైనా వజ్ర సమానంగా తయారుచేయడం చిన్న విషయమా! తండ్రి ఎప్పుడైనా అలసిపోతారా? మీరెందుకు అలసిపోతారు? అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయం సమయములో అరగంట, ముప్పావు గంట చాలా ప్రేమగా మరియు అభిరుచితో చదువు (మురళీ)ను చదువుకోవాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. కర్మేంద్రియాలన్నీ వశంలోకి వచ్చే విధంగా స్మృతి యొక్క పురుషార్థము ఉండాలి.

2. సేవలో సుఖ-దుఃఖాలు, మానావమానాలు, చలి-వేడి అన్నీ సహనము చేయాలి. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. మూడడుగుల స్థలంలో కూడా హాస్పటిల్ మరియు యూనివర్సిటీని తెరిచి వజ్ర సమానంగా తయారుచేసే సేవ చేయాలి.

వరదానము:-

సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు మార్గం చూపించే చైతన్య లైట్ హౌస్ భవ

ఆత్మనైన నేను, విశ్వకళ్యాణ సేవ కోసం పరంధామం నుండి అవతరించాను అన్న స్మృతిలో సదా ఉన్నట్లయితే ఏ సంకల్పాలు చేసినా, ఏ మాటలు మాట్లాడినా, అందులో విశ్వకళ్యాణము ఇమిడి ఉంటుంది. మరియు ఈ స్మృతియే లైట్ హౌస్ లా పని చేస్తుంది. ఏ విధంగా ఆ లైట్ హౌస్ ద్వారా ఒక రంగు లైట్ వెలువడుతూ ఉంటుందో అదే విధంగా చైతన్య లౌట్ హౌస్ లైన మీ ద్వారా సర్వశక్తుల లైట్ ఆత్మలకు ప్రతి అడుగులోనూ మార్గం చూపించే కార్యము చేస్తూ ఉంటుంది.

స్లోగన్:-

స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబరు లభిస్తుంది.