09-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఉదయము-ఉదయమే లేచి బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడండి, విచార సాగర మథనము చేసేందుకు ఉదయము సమయం చాలా మంచిది”

ప్రశ్న:-

భక్తులు కూడా భగవంతుడిని సర్వశక్తివంతుడని అంటారు మరియు పిల్లలైన మీరు కూడా అంటారు, కానీ ఇద్దరికీ గల తేడా ఏమిటి?

జవాబు:-

భగవంతుడు ఏది కావాలంటే అది చేయగలరు, అంతా వారి చేతిలోనే ఉందని వారంటారు. కానీ నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నానని బాబా చెప్పారని మీకు తెలుసు. డ్రామా సర్వశక్తివంతమైనది. తండ్రిని సర్వశక్తివంతుడని ఎందుకంటారంటే వారి వద్ద సర్వులకు సద్గతినిచ్చే శక్తి ఉంది. ఎప్పుడూ ఎవ్వరూ లాక్కోలేనటువంటి రాజ్యాన్ని స్థాపన చేస్తారు.

ఓంశాంతి. ఎవరన్నారు? బాబా అన్నారు. ఓం శాంతి - ఇది ఎవరన్నారు? దాదా అన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇది గుర్తించారు. ఉన్నతాతి ఉన్నతమైనవారి మహిమ చాలా గొప్పది. వారు సర్వశక్తివంతుడు కనుక వారు చేయలేనిది ఏముందని అంటారు. ఇప్పుడు ఈ భక్తి మార్గంవారు, సర్వశక్తివంతుడు అన్నదానికి అర్థాన్ని చాలా గొప్పగా చెప్తారు. తండ్రి అంటున్నారు - డ్రామానుసారంగా అంతా జరుగుతుంది, నేను ఏమీ చేయను. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. కేవలం మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే సర్వశక్తివంతులుగా అయిపోతారు. పవిత్రంగా అవ్వడం వలన తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి సర్వశక్తివంతుడు, వారు నేర్పించవలసి ఉంటుంది. పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి, తర్వాత సర్వశక్తివంతులుగా అయి విశ్వముపై రాజ్యం చేస్తారు. శక్తి లేకపోతే రాజ్యమెలా చేస్తారు. యోగము ద్వారా శక్తి లభిస్తుంది, అందుకే భారతదేశపు ప్రాచీన యోగము చాలా గాయనం చేయబడింది. పిల్లలైన మీరు నంబరువారుగా స్మృతి చేసి సంతోషాన్ని పొందుతారు. ఆత్మలైన మనము తండ్రిని స్మృతి చేసి విశ్వముపై రాజ్యం ప్రాప్తి చేసుకోగలమని మీకు తెలుసు. దానిని లాక్కునే శక్తి ఎవ్వరికీ లేదు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని అందరూ మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇది నాటకమని తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ నాటకమని తెలిసి ఉంటే, ప్రారంభము నుండి చివరి వరకు అది గుర్తు రావాలి. లేకపోతే నాటకము అనడమే తప్పు అవుతుంది. ఇది నాటకము, మనము పాత్రను అభినయించేందుకు వచ్చామని కూడా అంటారు. మరి ఆ నాటకం యొక్క ఆదిమధ్యాంతాలు కూడా తెలుసుకోవాలి కదా. మనము పై నుండి వస్తాము, అందుకే వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా అని కూడా అంటారు. సత్యయుగంలో కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడ నుండి వచ్చారు. ఇది అనాది తయారై-తయారవుతున్న అవినాశీ డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. ఇది ఆది నుండి అంతిమం వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు సినిమాను మొదటి నుండి చివరి వరకు చూడండి, ఒకవేళ మళ్ళీ రెండవసారి రిపీట్ చేసి చూసినట్లయితే చక్రము యథావిధిగా తప్పకుండా రిపీట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా కూడా తేడా ఉండదు.

తండ్రి మధురాతి-మధురమైన పిల్లలకు ఎలా కూర్చుని అర్థం చేయిస్తారు. వారు ఎంత మధురమైన తండ్రి. బాబా, మీరు ఎంత మధురమైనవారు. బాబా, ఇక చాలు, ఇప్పుడు మేము మా సుఖధామానికి వెళ్తాము. ఆత్మ పావనంగా అయినప్పుడు అక్కడ పాలు కూడా పావనమైనవే లభిస్తాయని ఇప్పుడు తెలుసుకున్నారు. శ్రేష్ఠాచారులైన మాతలు చాలా మధురంగా ఉంటారు, సమయానికి తమకు తామే పిల్లలకు పాలు పడతారు. పిల్లలు ఏడ్చే అవసరముండదు. ఈ విధంగా విచార సాగర మథనము చేయాల్సి ఉంటుంది. ఉదయము వేళ బాబాతో మాట్లాడితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బాబా, శ్రేష్ఠాచారి రాజ్య స్థాపనకు మీరు ఎంత మంచి యుక్తులను తెలియజేస్తున్నారు. తర్వాత, మేము శ్రేష్ఠాచారి మాతల ఒడిలోకి వెళ్తాము. అనేకసార్లు మేమే ఆ కొత్త సృష్టిలోకి వచ్చాము. ఇప్పుడు మా సంతోషకరమైన రోజులు వస్తాయి. ఇదే సంతోషమనే ఔషధము, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. మనల్ని మళ్ళీ స్వర్గానికి యజమానులుగా, శ్రేష్ఠాచారులుగా తయారుచేస్తారు. కల్ప-కల్పము మనము మన రాజ్య-భాగ్యాన్ని తీసుకుంటాము. ఓడిపోతాము, మళ్ళీ విజయము పొందుతాము. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి రావణునిపై విజయము పొందాలి, అప్పుడు మనము పావనంగా అయిపోతాము. అక్కడ యుద్ధము, దుఃఖము మొదలైన పేర్లే ఉండవు, ఏ ఖర్చూ ఉండదు. భక్తిమార్గంలో జన్మ-జన్మాంతరాలు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు, ఎంతమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు మళ్ళీ అర్థకల్పము మనము ఏ గురువును ఆశ్రయించము. శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తాము. మీరు సుఖధామానికి వెళ్ళే యాత్రికులు, ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామంలోకి వెళ్ళాలి అని తండ్రి అంటున్నారు. వాహ్ మా బాబా, మమ్మల్ని ఎలా చదివిస్తున్నారు. మా స్మృతిచిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా అద్భుతము. ఈ దిల్వాడా మందిరానికి అపారమైన మహిమ ఉంది. ఇప్పుడు మనము రాజయోగము నేర్చుకుంటున్నాము. దీని స్మృతిచిహ్నము తప్పకుండా తయారవుతుంది కదా. ఇది తప్పకుండా మన స్మృతిచిహ్నమే. బాబా, మమ్మా మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. కింద యోగము నేర్చుకుంటున్నారు, పైన స్వర్గ రాజ్యముంది. వృక్షములో కూడా ఎంత స్పష్టంగా ఉంది. బాబా ఎలా సాక్షాత్కారము చేయించి తర్వాత కూర్చుని చిత్రాలను తయారు చేయించారు. బాబానే సాక్షాత్కారాలు చేయించారు, తర్వాత కరెక్ట్ కూడా చేశారు. ఎంత అద్భుతం. ఇది పూర్తిగా కొత్త జ్ఞానము. ఈ జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు ఎంత తమోప్రధానంగా అవుతూ ఉంటారో తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. మనుష్య సృష్టి పెరుగుతూ ఉంటుంది. భక్తి కూడా వృద్ధి చెందుతూ-చెందుతూ తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరిప్పుడు సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేస్తారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది. కేవలం భగవంతుడు ఎవరు అన్నది మాత్రము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఉదయం-ఉదయమే లేచి, మనుష్యులకు భగవంతుని పరిచయమెలా ఇవ్వాలో విచార సాగర మథనము చేయాలి. భక్తిలో కూడా మనుష్యులు ఉదయం-ఉదయమే లేచి గదిలో కూర్చొని భక్తి చేస్తారు. అది కూడా విచార సాగర మథనమే కదా. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. తండ్రి మూడవ నేత్రము ఇచ్చే కథను వినిపిస్తారు. దీనినే తీజరీ కథ అని అంటారు. తీజరీ కథ (మూడవ నేత్రం యొక్క కథ), అమరకథ, సత్యనారాయణ కథ కూడా ప్రసిద్ధి చెందినవి. వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే, తర్వాత ఇవి భక్తి మార్గములో కొనసాగుతాయి. జ్ఞానముతో పిల్లలైన మీరు సంపన్నులుగా అవుతారు, అందుకే దేవతలను పదమపతులు అని అంటారు. దేవతలు చాలా ధనవంతులుగా, పదమపతులుగా అవుతారు. కలియుగాన్ని కూడా చూడండి మరియు సత్యయుగాన్ని కూడా చూడండి - రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ప్రపంచమంతా శుభ్రమయ్యేందుకు సమయము పడుతుంది కదా. ఇది అనంతమైన ప్రపంచము. భారతదేశము అవినాశీ ఖండము. ఇది ఎప్పుడూ ప్రాయః లోపమవ్వదు. అర్థకల్పము ఒక్క ఖండము మాత్రమే ఉంటుంది. తర్వాత నంబరువారుగా ఇతర ఖండాలు ఇమర్జ్ అవుతాయి. పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము ఎలా తిరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ప్రాచీన ఋషులు-మునులకు ఎంత గౌరవముంది, కానీ వారికి కూడా సృష్టి ఆదిమధ్యాంతాలు తెలియవు. వారు హఠయోగులు. కానీ వారిలో పవిత్రతా శక్తి ఉంది, దాని ద్వారానే భారత్ ను నిలబెడుతున్నారు. లేకపోతే భారతదేశము ఏమై ఉండేదో తెలియదు. ఇంటిని శుభ్రపరచడం మొదలైనవి చేస్తారు కదా, అప్పుడు శోభిస్తుంది. భారతదేశము చాలా ఉన్నతంగా, పవిత్రంగా ఉండేది, ఇప్పుడదే పతితంగా అయిపోయింది. అక్కడ మీ సుఖం కూడా చాలా సమయము నడుస్తుంది. మీ వద్ద చాలా ధనముంటుంది. మీరు భారతదేశములోనే ఉండేవారు. మీ రాజ్యము ఉండేది, ఇది నిన్నటి విషయము. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. వారు వచ్చి కొద్దిగా తీర్చిదిద్ది తమ పేరును ప్రసిద్ధి చేసుకున్నారు. ఇప్పుడు వారు కూడా అందరూ తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. ఈ విషయాలన్నీ కొత్తవారికి వినిపించకూడదు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. తండ్రి యొక్క నామ, రూప, దేశ, కాలాలు తెలుసా? ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పాత్ర అయితే ప్రఖ్యాతి చెందింది కదా. ఆ తండ్రియే మాకు డైరెక్షన్ ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. పిల్లలైన మీరు నాకు సహాయకులు. మీరు పవిత్రంగా అవుతున్నారు. మీ కోసం పవిత్ర ప్రపంచము తప్పకుండా స్థాపనవుతుంది. పాత ప్రపంచము మారిపోతుందని మీరు వ్రాయవచ్చు. తర్వాత ఈ సూర్య వంశీయుల-చంద్ర వంశీయుల రాజ్యము ఉంటుంది. తర్వాత రావణ రాజ్యము ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడం చాలా మధురంగా ఉంటుంది, ఇందులో తిథి-తారీఖు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. భారతదేశపు ప్రాచీన రాజయోగమంటే స్మృతి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు చదువు ద్వారా హోదా లభిస్తుంది. దైవీగుణాలు ధారణ చేయాలి. మాయ తుఫానులు తప్పకుండా వస్తాయి. ఉదయమే లేచి బాబాతో మాట్లాడడం చాలా మంచిది. భక్తి మరియు జ్ఞానము, రెండింటికీ ఇది మంచి సమయము. మధురాతి-మధురమైన విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మనము శ్రేష్ఠాచారీ ప్రపంచంలోకి వెళ్తాము. మేము శరీరాన్ని వదిలి గర్భములోకి వెళ్తామని వృద్ధుల మనసులో ఉంటుంది కదా. బాబా ఎంత నషా ఎక్కిస్తారు. ఇటువంటి విషయాలు కూర్చుని మాట్లాడుకున్నా మీకు జమ అవుతుంది. శివబాబా మనల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తున్నారు. మొట్టమొదట మనము వస్తాము, మొత్తం ఆల్ రౌండ్ పాత్రను మనము అభినయించాము. ఈ ఛీ-ఛీ శరీరాన్ని వదిలేయండి అని ఇప్పుడు బాబా అంటున్నారు. దేహ సహితంగా ప్రపంచమంతటినీ మర్చిపోండి. ఇది అనంతమైన సన్యాసము. అక్కడ కూడా మీరు వృద్ధులుగా అయినప్పుడు మేము పిల్లలుగా అవుతామని సాక్షాత్కారమవుతుంది. సంతోషం కలుగుతుంది. బాల్యము అయితే అన్నిటికన్నా మంచిది. ఉదయమే కూర్చొని ఈ విధంగా విచార సాగర మథనము చేయాలి. పాయింట్లు వెలువడితే మీకు సంతోషం కలుగుతుంది. సంతోషంలో గంట గంటన్నర గడిచిపోతుంది. ఎంతగా అభ్యాసము అవుతూ ఉంటుందో అంతగా సంతోషము పెరుగుతూ ఉంటుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయాలి. తీరికైతే చాలా ఉంది, అయితే విఘ్నాలు వస్తాయి, ఇందులో అనుమానమేమీ లేదు. వ్యాపారములో మనుష్యులకు నిద్రరాదు. సోమరులు నిద్రపోతారు. ఎంత వీలైతే అంత మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా కోసం మేము భోజనం తయారుచేస్తున్నామని మీ బుద్ధిలో ఉంటుంది. శివబాబా కోసం మేము ఇది చేస్తున్నాము. భోజనము కూడా శుద్ధతతో తయారుచేయాలి. గొడవలు కలిగించే విషయాలేవీ ఉండకూడదు. బాబా కూడా స్వయం స్మృతి చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయము-ఉదయమే లేచి బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడాలి. రోజూ సంతోషమనే ఔషధం తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి.

2. సత్యయుగీ రాజధానిని స్థాపించడంలో తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యేందుకు పావనంగా అవ్వాలి, స్మృతి ద్వారా వికర్మలు వినాశనము చేసుకోవాలి, భోజనం కూడా శుద్ధతతో తయారుచేయాలి.

వరదానము:-

స్వ స్థితి ద్వారా పరిస్థితులపై విజయము ప్రాప్తి చేసుకునే సంగమయుగీ విజయీ రత్న భవ

పరిస్థితులపై విజయం ప్రాప్తి చేసుకునేందుకు సాధనం స్వ-స్థితి. ఈ దేహం కూడా పరాయిదే, స్వంతము కాదు. స్వ స్థితి మరియు స్వ ధర్మము సదా సుఖాన్ని అనుభవం చేయిస్తాయి మరియు ప్రకృతి-ధర్మము అనగా పరాయి ధర్మము మరియు దేహపు స్మృతి ఏదో ఒక రకంగా దుఃఖాన్ని అనుభవం చేయిస్తాయి. కనుక ఎవరైతే సదా స్వ స్థితిలో ఉంటారో, వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు, వారి వద్దకు దుఃఖపు అలలు రాలేవు. వారు సంగమయుగీ విజయీ రత్నాలుగా అవుతారు.

స్లోగన్:-

పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహం యొక్క ఫోర్సును సమాప్తం చేయండి.

 

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

"ఈ అవినాశీ ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ భాషనూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు

మన ఈ ఈశ్వరీయ జ్ఞానము, చాలా సహజమైనది మరియు మధురమైనది, దీని ద్వారా జన్మ-జన్మాంతరాలకు సంపాదన జమ అవుతుంది. ఈ జ్ఞానము ఎంత సహజమైనదంటే, దీనిని మహాన్ ఆత్మలైనా, అహల్య వంటి రాతి బుద్ధి కలవారైనా, ఏ ధర్మానికి చెందినవారైనా, పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా ప్రాప్తి చేసుకోగలరు. చూడండి, ఈ జ్ఞానము ఇంత సహజమైనదైనా కానీ ప్రపంచములోని వారు దీనిని చాలా కష్టమైనదిగా భావిస్తారు. కొంతమంది, మేము చాలా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చదివినప్పుడు గొప్ప-గొప్ప విద్వాంసులుగా అవుతాము అనుకుంటారు, కానీ వాటి కోసం భాష నేర్చుకోవలసి ఉంటుంది. వారికి చాలా హఠయోగము చేసినప్పుడే ప్రాప్తి లభిస్తుంది కానీ ఈ జ్ఞానము చాలా సహజమైనది మరియు సరళమైనది అని మనము అనుభవంతో తెలుసుకున్నాము ఎందుకంటే స్వయంగా పరమాత్మ చదివిస్తున్నారు. ఇందులో ఏ విధమైన హఠక్రియలు కానీ, జపతపాలు కానీ, శాస్త్రాలు తెలిసిన పండితులుగా అవ్వడం కానీ, లేక దీనికోసం సంస్కృత భాషను నేర్చుకునే అవసరము కానీ లేదు. ఇక్కడైతే ఆత్మ తన పరమపిత పరమాత్మతో న్యాచురల్ గా యోగం జోడించాలి. ఒకవేళ ఎవరైనా ఈ జ్ఞానాన్ని ధారణ చేయలేకపోయినా కానీ కేవలం యోగం ద్వారా కూడా చాలా లాభం ఉంటుంది. దీని ద్వారా ఒకటి పవిత్రంగా అవుతారు, రెండవది మళ్ళీ కర్మ బంధనాలు భస్మమవుతాయి మరియు కర్మాతీతులుగా అవుతారు, సర్వశక్తివంతుడైన పరమాత్ముని స్మృతిలో ఇంతటి శక్తి ఉంది. వారు సాకార బ్రహ్మా శరీరము ద్వారా మనకు యోగం నేర్పిస్తున్నారు కానీ డైరెక్టు ఆ జ్యోతి స్వరూపుడైన శివ పరమాత్ముడినే స్మృతి చేయాలి, ఆ స్మృతి ద్వారానే కర్మ బంధనాల మాలిన్యం తొలగిపోతుంది. అచ్ఛా. ఓం శాంతి.