09-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీ ఈ సమయం చాలా-చాలా విలువైనది కావున దీనిని వ్యర్థంగా పోగొట్టుకోకండి, పాత్రుడిని చూసి జ్ఞాన దానం చెయ్యండి”

ప్రశ్న:-

గుణాల ధారణ కూడా జరుగుతూ ఉండాలి మరియు నడవడిక కూడా బాగుపడుతూ ఉండాలి, దానికి సహజ విధి ఏమిటి?

జవాబు:-

బాబా ఏదైతే అర్థం చేయించారో, అది ఇతరులకు అర్థం చేయించండి. జ్ఞాన ధనాన్ని దానం చేసినట్లయితే గుణాల ధారణ కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది, నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది. ఎవరి బుద్ధిలోనైతే ఈ జ్ఞానం ఉండదో, జ్ఞానధనాన్ని దానం చెయ్యరో, వారు పిసినారులు. వారు తమనుతాము అనవసరంగా నష్టపరుచుకుంటారు.

గీతము:-

బాల్యపు రోజులు మర్చిపోకూడదు...... (బచపన్ కే దిన్ భులా న దేనా......)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు పాట విన్నారు, అర్థాన్ని బాగా తెలుసుకున్నారు. మనం ఆత్మలము మరియు అనంతమైన తండ్రికి పిల్లలము - ఇది మర్చిపోకూడదు. ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితులవుతారు, ఇప్పుడిప్పుడే స్మృతిని మర్చిపోవడంతో మళ్ళీ దుఃఖములో పడిపోతారు. ఇప్పుడిప్పుడే జీవిస్తారు, ఇప్పుడిప్పుడే మరణిస్తారు అనగా ఇప్పుడిప్పుడే అనంతమైన తండ్రికి చెందినవారిగా అవుతారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ దైహిక పరివారం వైపుకు వెళ్ళిపోతారు. కనుక ఈ రోజు నవ్వుతూ రేపు ఏడవకూడదు అని తండ్రి అంటారు. ఇది పాట యొక్క అర్థం.

చాలా వరకు మనుష్యులు శాంతి కోసమే ఎదురుదెబ్బలు తింటారని పిల్లలైన మీకు తెలుసు. తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగని ఎదురుదెబ్బలు తింటే ఏదో శాంతి లభిస్తుందని కాదు. ఈ ఒక్క సంగమయుగంలోనే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట స్వయాన్ని గుర్తించండి. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం. నివసించే స్థానము కూడా శాంతిధామము. ఇక్కడికి వచ్చామంటే తప్పకుండా కర్మలు చెయ్యాల్సి ఉంటుంది. తమ శాంతిధామములో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. సత్యయుగంలో కూడా శాంతి ఉంటుంది. సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. శాంతిధామాన్ని సుఖధామమని అనరు. సుఖమున్న చోటును సుఖధామమని, దుఃఖమున్న చోటును దుఃఖధామమని అంటారు. మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికైనా అర్థం చేయించాలంటే, సన్ముఖంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. ప్రదర్శినీలో లోపలకు వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఆత్మల తండ్రి ఒక్కరే అని అర్థం చేయించడం జరుగుతుంది. వారే గీతా భగవంతుడు, మిగిలిన వారంతా ఆత్మలు. ఆత్మ శరీరాన్ని వదులుతుంది మరియు తీసుకుంటుంది. శరీరాల పేర్లే మారుతాయి. ఆత్మ పేరు మారదు. అనంతమైన తండ్రి ద్వారానే సుఖ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. తండ్రి సుఖం యొక్క సృష్టిని స్థాపన చేస్తారు. తండ్రి దుఃఖం యొక్క సృష్టిని రచించడమనేది జరగదు. భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. చిత్రాలు కూడా ఉన్నాయి - ఈ సుఖం యొక్క వారసత్వం లభిస్తుందని చెప్పండి. ఒకవేళ వారు, ఇది మీ కల్పన అని అన్నట్లయితే ఇక వారిని వదిలేయాలి. కల్పన అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు. మీ సమయం చాలా విలువైనది. ఈ ప్రపంచం మొత్తంలో మీ అంత విలువైన సమయం ఇంకెవ్వరిదీ లేదు. గొప్ప-గొప్ప వ్యక్తుల సమయము విలువైనదిగా ఉంటుంది. తండ్రి సమయం ఎంత విలువైనది. తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు. కనుక మీరు మీ విలువైన సమయాన్ని పోగొట్టుకోకండి అని తండ్రి పిల్లలైన మీకు మాత్రమే చెప్తారు. జ్ఞానాన్ని పాత్రులకే ఇవ్వాలి. పాత్రులకే అర్థం చేయించాలి - పిల్లలందరూ అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోగలిగేంత బుద్ధి లేదు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆత్మలైన మన తండ్రి శివుడని అర్థం చేసుకోనంతవరకు ఇంకేమీ అర్థం చేసుకోలేరు. చాలా ప్రేమగా, నమ్రతతో అర్థం చేయించి పంపించాలి ఎందుకంటే ఆసురీ సంప్రదాయులు కొట్లాడేందుకు ఆలస్యం చేయరు. స్టూడెంట్లను గవర్నమెంటు ఎంతగా మహిమ చేస్తుంది. వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది. మొట్టమొదట కాలేజీ స్టూడెంట్లే రాళ్ళు వేయడం ప్రారంభిస్తారు. ఆవేశం ఉంటుంది కదా. వృద్ధులు లేక మాతలు అయితే ఇంత గట్టిగా రాళ్ళను విసరలేరు. తరచుగా స్టూడెంట్ల గొడవలే జరుగుతాయి. వారినే యుద్ధం కొరకు సిద్ధం చేస్తారు. మీరు తలక్రిందులుగా అయిపోయారని ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సరి చేస్తున్నారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. సరిగ్గా అవ్వడంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మేము అర్థకల్పం తలకిందులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి అర్థకల్పం కోసం సరి చేస్తున్నారు. అల్లా పిల్లలుగా అయినట్లయితే విశ్వరాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది. రావణుడు తలక్రిందులుగా చేస్తే కళలు తగ్గిపోతాయి, ఇక పడిపోతూనే ఉంటారు. రామరాజ్యము మరియు రావణరాజ్యము గురించి పిల్లలైన మీకు తెలుసు. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చెయ్యాలి, అయినా సమయమైతే చాలా లభిస్తుంది. జిజ్ఞాసులు మొదలైనవారెవరూ లేకపోతే, ఏ పని లేకపోతే తండ్రి స్మృతిలో కూర్చుండిపోవాలి. అదైతే అల్పకాలం కొరకు సంపాదన మరియు మీది సదాకాలం కొరకు సంపాదన, ఇందులో ఎక్కువ అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. మాయ పదే-పదే ఆలోచనలను వేరేవైపుకు తీసుకువెళ్తుంది. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. మాయ మరపింపజేస్తూ ఉంటుంది. దీని పై ఒక నాటకం కూడా చూపిస్తారు - ప్రభువు ఇలా చెప్తారు, మాయ ఇలా చెప్తుంది అని. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఇంకే విషయంలోనూ ఇన్ని విఘ్నాలు రావు. పవిత్రత విషయంలో ఎన్ని దెబ్బలు పడతారు. భాగవతము మొదలైనవాటిలో ఈ సమయం గురించిన గాయనమే ఉంది. పూతనలు, శూర్పణఖలు కూడా ఉన్నారు, ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రంగా తయారుచేసే ఈ సమయంలోని విషయాలే. ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే జరుపుకుంటున్నారో, అవి గతించిన వాటిని మళ్ళీ పండుగలుగా జరుపుకుంటూ వస్తారు. గతాన్ని మహిమ చేస్తూ వస్తారు. రామరాజ్య మహిమను పాడుతారు ఎందుకంటే అది గతించిపోయింది. ఉదాహరణకు క్రీస్తు మొదలైనవారు వచ్చి ధర్మస్థాపన చేసి వెళ్ళారు. తిథి తారీఖులు కూడా వ్రాస్తారు, తర్వాత వారి జన్మదినం జరుపుతూ వస్తారు. భక్తిమార్గంలో కూడా అర్థకల్పం ఈ వ్యవహారం నడుస్తుంది. సత్యయుగంలో ఇది ఉండదు. ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. ఆత్మలన్నీ అంతిమంలో తిరిగి వెళ్ళాలని తండ్రి అర్థం చేయించారు. ఆత్మలన్నీ శరీరం వదిలి వెళ్ళిపోతాయి. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వినాశనం అవ్వాలి. సత్యయుగంలోకి కేవలం మనము మాత్రమే వస్తాము. ఆత్మలన్నీ రావు. కల్పక్రితం వచ్చినవారే నంబరువారుగా వస్తారు. వారే బాగా చదువుకుంటున్నారు మరియు చదివిస్తున్నారు కూడా. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారే మళ్ళీ నంబరువారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆత్మలన్నీ నంబరువారుగా అక్కడ శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటాయి, మళ్ళీ నంబరువారుగా వస్తూ ఉంటాయి అని మీ బుద్ధికి తెలుసు. అయినా, తండ్రి పరిచయమివ్వడమే ముఖ్యమైన విషయమని తండ్రి చెప్తారు. తండ్రి పేరు సదా నోట్లో ఉండాలి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు? ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. భృకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన నక్షత్రము...... అని పాడుతారు. అంతే, ఇంకేమీ తెలియదు. ఈ జ్ఞానము కూడా చాలా కొద్దిమంది బుద్ధిలో మాత్రమే ఉంది. పదే-పదే మర్చిపోతారు. తండ్రియే పతితపావనుడని మొట్టమొదట అర్థం చేయించాలి. వారు వారసత్వం కూడా ఇస్తారు, చక్రవర్తిగా చేస్తారు. మీ వద్ద పాట కూడా ఉంది - ఆఖరికి ఆ రోజు నేడు వచ్చింది...... భక్తిమార్గంలో ఈ మార్గం కోసం ఎంతగానో వెతికారు. ద్వాపరం నుండి భక్తి మొదలౌతుంది, మళ్ళీ అంతిమంలో తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. దీనినే వినాశన సమయమని కూడా అంటారు. ఆసురీ బంధనాల లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. మీకు 84 జన్మల పాత్ర గురించి తెలుసు. ఈ పాత్ర నడుస్తూనే ఉంటుంది. శివజయంతిని జరుపుతున్నారంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు. తప్పకుండా ఏదో చేసి ఉంటారు. వారే కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. మళ్ళీ తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇంతకుముందు ఈ రాజయోగాన్ని నేర్పించారు అని మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి ఇది రాదు. మీరే అర్థము చేయించగలరు. శివబాబా మాకు రాజయోగం నేర్పిస్తున్నారు. శివోహం అని చేసే ఉచ్చరణ కూడా తప్పు. మీరే చక్రంలో తిరిగి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు అని ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. హం సో, సో హం యొక్క అర్థాన్ని కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, ఇది 84 జన్మల చక్రము. ఇదేమీ జపించే మంత్రం కాదు. దీని అర్థం బుద్ధిలో ఉండాలి. అది కూడా సెకండు విషయమే. ఎలాగైతే బీజము మరియు వృక్షము గురించి సెకండులో మొత్తం ధ్యానంలోకి వచ్చేస్తుందో, అదే విధంగా హం సో రహస్యం కూడా సెకండులో వచ్చేస్తుంది. మనము ఇలా చక్రంలో తిరుగుతాము, దీనిని స్వదర్శన చక్రమని కూడా అంటారు. మేము స్వదర్శన చక్రధారులమని మీరు ఎవరికైనా చెప్తే, ఎవ్వరూ అంగీకరించరు. వీళ్ళందరూ తమకు తాము టైటిల్స్ పెట్టుకుంటారని అంటారు. అప్పుడు మీరు, మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది అర్థం చేయిస్తారు. ఈ చక్రం తిరుగుతుంది. ఆత్మకు తన 84 జన్మల దర్శనం జరుగుతుంది, దీనినే స్వదర్శన చక్రధారి అని అంటారు. ఇదంతా విని మొదట ఆశ్చర్యపోతారు, తర్వాత వీరు వ్యర్థ ప్రలాపాలేవో చెప్తున్నారని అంటారు. మీరు తండ్రి పరిచయం ఇచ్చినప్పుడు వారికది ప్రగల్భం అని అనిపించదు. తండ్రిని గుర్తు చేస్తారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము బలిహారమైపోతాము, మిమ్మల్నే గుర్తు చేస్తాము అని పాడుతారు కూడా. ఈ విధంగా మీరే అనేవారు కదా - ఇప్పుడు నేను మీకు మళ్ళీ గుర్తు చేయిస్తున్నాను అని తండ్రి అంటారు. నష్టోమోహులుగా అవ్వండి. ఈ దేహం నుండి కూడా నష్టోమోహులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ మధురమైన విషయం అందరికీ ఇష్టమనిపిస్తుంది. తండ్రి పరిచయం లేకపోతే ఏదో ఒక విషయంలో మళ్ళీ సంశయం కలుగుతూ ఉంటుంది, కనుక మొదట తండ్రి పరిచయం ఉండే 2-3 చిత్రాలు వారి ఎదురుగా ఉంచండి. తండ్రి పరిచయం లభించడంతో వారసత్వం కూడా లభిస్తుంది.

నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను అని తండ్రి అంటారు. ఈ చిత్రాన్ని తయారుచెయ్యండి - డబల్ కిరీటధారులైన రాజుల ఎదురుగా సింగిల్ కిరీటం కలవారు తల వంచి నమస్కరిస్తారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అనే రహస్యం కూడా అర్థమవ్వాలి. మొదట తండ్రిని పూజిస్తారు, తర్వాత కూర్చొని తమ చిత్రాలనే పూజిస్తారు. ఎవరైతే ఇంతకుముందు పావనంగా ఉండి వెళ్ళారో, వారి చిత్రాలను తయారుచేసి కూర్చుని పూజిస్తారు. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. ఒకప్పుడు భగవంతుడిని, మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అనేవారు. మీరే ఈ చక్రంలోకి వస్తారని - ఇప్పుడు మీకు అర్థము చేయించడం జరిగింది. ఈ జ్ఞానం సదా బుద్ధిలో ఉంటుంది, తర్వాత దీనిని అర్థం చేయించాలి కూడా. ధనం ఇచ్చినా ధనం తరగదు...... ఎవరైతే ధనాన్ని దానం చెయ్యరో వారిని పిసినారులు అని కూడా అంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయించారో, అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఒకవేళ అర్థం చేయించకపోతే తమనుతాము అనవసరంగా నష్టపరచుకుంటారు. గుణాలు కూడా ధారణ అవ్వవు. నడవడికే అలా తయారైపోతుంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని తెలుసుకోగలరు కదా. మీకిప్పుడు వివేకం లభించింది. మిగిలినవారందరూ తెలివిలేనివారు. మీకు అన్నీ తెలుసు. ఇటువైపు దైవీ సంప్రదాయం, అటువైపు ఆసురీ సంప్రదాయం అని తండ్రి అంటారు. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నామని బుద్ధి ద్వారా మీకు తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో ఒకరు సంగమయుగం వారిగా, ఒకరు కలియుగం వారిగా ఉంటారు, ఇద్దరూ కలిసి ఉంటారు. హంసగా అయ్యేందుకు యోగ్యంగా లేరని గమనించినప్పుడు యుక్తి రచింపబడుతుంది. లేకపోతే విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. తమ సమానంగా తయారుచేసేందుకు ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే విసిగిస్తూ ఉంటారు, అప్పుడిక యుక్తిగా పక్కకు తప్పుకోవలసి ఉంటుంది. విఘ్నాలైతే కలుగుతాయి. ఇటువంటి జ్ఞానాన్ని మీరే ఇస్తారు. చాలా మధురంగా కూడా అవ్వాలి. నష్టోమోహులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఒక వికారాన్ని వదిలితే ఇక వేరే వికారాలు గొడవ చేస్తాయి. ఏమి జరుగుతున్నా కానీ, అది కల్పక్రితం వలె జరుగుతుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇలా భావించి శాంతిగా ఉండాల్సి ఉంటుంది. విధి అని భావిస్తారు. అర్థం చేయించే మంచి-మంచి పిల్లలు కూడా పడిపోతారు. చాలా గట్టిగా చెంపదెబ్బ తింటారు. కల్పక్రితము కూడా చెంపదెబ్బ తిని ఉండవచ్చు అని అంటారు. ప్రతి ఒక్కరు తమ లోపల ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోగలరు. బాబా, మేము క్రోధంలోకి వచ్చేశాము, ఫలానా వారిని కొట్టాము, లేదా ఈ పొరపాటు జరిగింది అని కూడా వ్రాస్తారు. ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి అని బాబా అర్థం చేయిస్తారు. మనుష్యులున్నారు ఏ విధంగా ఉన్నారు, అబలలపై ఎన్ని అత్యాచారాలు చేస్తారు. పురుషులు బలశాలిగా ఉంటారు, స్త్రీలు అబలలుగా ఉంటారు. మరి తండ్రి మీకు ఈ గుప్త యుద్ధం నేర్పిస్తారు, దీనితో మీరు రావణునిపై విజయం పొందుతారు. ఈ యుద్ధం ఎవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా అర్థం చేసుకోగలవారు నంబరువారుగా ఉన్నారు. ఇది పూర్తిగా కొత్త విషయం. ఇప్పుడు మీరు సుఖధామం కోసం చదువుకుంటున్నారు. ఇది కూడా ఇప్పుడు గుర్తుంది, మళ్ళీ మర్చిపోతారు. ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏమి జరిగినా కానీ, దానిని విధి అని భావించి శాంతిగా ఉండాలి. క్రోధం చేయకూడదు. ఎంత వీలైతే అంత స్వయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. యుక్తిని రచించి తమ సమానంగా తయారుచేసే ప్రయత్నం చెయ్యాలి.

2. చాలా ప్రేమగా మరియు నమ్రతతో అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి, ఈ దేహం నుండి నష్టోమోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారనే మధురాతి-మధురమైన విషయాన్ని అందరికీ వినిపించండి.

వరదానము:-

నమ్రత రూపీ కవచం ద్వారా వ్యర్థమనే రావణుడిని కాల్చే సత్యమైన స్నేహీ, సహయోగీ భవ

ఎవరెంతగా మీ సంగఠనలో లోపాలను వెతికే ప్రయత్నం చేసినా కానీ, కొంచెం కూడా సంస్కార-స్వభావాల ఘర్షణ కనిపించకూడదు. ఒకవేళ ఎవరైనా నిందించినా, అవమానపరచినా, మీరు సెయింట్ గా అయిపోండి. ఒకవేళ ఎవరైనా రాంగ్ చేసినా, మీరు రైట్ గానే ఉండండి. ఎవరైనా గొడవపడుతున్నా కూడా, మీరు వారికి స్నేహమనే నీటినివ్వండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు అనే సంకల్పాలు చేసి అగ్నిలో ఆజ్యం పోయకండి. నమ్రత అనే కవచం ధరించి ఉండండి. ఎక్కడైతే నమ్రత ఉంటుందో, అక్కడ స్నేహము మరియు సహయోగం కూడా తప్పకుండా ఉంటాయి.

స్లోగన్:-

నాది అనే అనేక హద్దు భావనలను ఒక్క"నా బాబా'' లో ఇమిడ్చి వేయండి.