10-01-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


“మధురమైన పిల్లలారా - అర్ధకల్పము నుండి అంటుకొని ఉన్న 5 వికారాల రూపీ రోగాలు ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పుడు తప్పక వదలుతాయి. కావున అపారమైన సంతోషములో ఉండాలి.’’

ప్రశ్న :-

పిల్లలైన మీకు ఇప్పుడు ఏ హాబీ(ఇష్టము, ఆసక్తి) ఉండాలి. ఏ విషయాలతో మీకు సంబంధము లేదు?

సమా :-

ఒక్క తండ్రి నుండి వారసత్వము పూర్తిగా తీసుకొను హాబి ఉంచుకోవాలి. మనుష్యులకు అనేక రకాల హాబీలు ఉంటాయి. మీరు వాటన్నింటిని వదిలేయాలి. మీరు ఈశ్వరుని సంతానంగా అయ్యారు. తండ్రి జతలో వాపసు వెళ్లాలి. కావున ఈ శరీరముతో సంబంధమున్న విషయాలన్నీ మర్చిపోవాలి. పొట్టకు రెండు రొట్టెలు తినిపించాలి. బుద్ధి నూతన ప్రపంచముతో జోడించాలి.

పాట :-

ఎవరికి భగవంతుడు సాదీ¸గా ఉన్నారో,................... (జిస్ కా సాదీ¸ హై భగవాన్,.............)

ఓంశాంతి.

అనన్య మహావీరులైన స్థిరమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి అనేక విధాలైన మానసిక తుఫానులు, ఉపద్రవాలు, జబ్బులు కూడా వస్తాయని తెలుసు. ఎందుకంటే ఇది చివరి సమయములోని ఆడంబరము. మాయ చాలా కదిలిస్తుంది. పక్కా నిశ్చయబుద్ధి గలవారికి శరీర లెక్కాచారము కూడా చుక్తా అవుతుందని ముందే తెలిసిపోతుంది. ఏదైనా జబ్బు వదిలిపోయే సమయంలో చాలా సంతోషము కలుగుతుంది. ఇప్పుడిక చాలా కొద్ది రోజులలో ఈ జబ్బు నుండి విడుదల పొందనున్నాము అని సంతోషమవుతుంది. ఈ 5 వికారాల జబ్బు అర్ధకల్పము నుండి అంటుకొని ఉంది. దీని వలన మనుష్యులు అజామిళుని వంటి పాపాత్మలుగా అయిపోతారు. ఇటువంటి ప్రపంచము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ జబ్బులు పోనే పోతాయి. ప్రపంచములోని వారికి ఈ విషయాలు తెలియవు. వారిది ఆసురీ బుద్ధి. వారు అయ్యో! అయ్యో! రక్షించండి అంటూ ఉంటారు. మీరు ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటారు. మీకు ఈ విషయాలతో ఏ సంబంధమూ లేదు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది జరిగే తీరాలి. ఇందులో భయపడే విషయమేదీ లేదు. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. పొట్టకు రెండు రొట్టెలు తినిపించాలి. బాబా నుండి వారసత్వము తీసుకొనుటే మన హాబి. మనుష్యులకు చాలా రకాల హాబీలు(అలవాట్లు) ఉంటాయి. ఇక్కడ ఏ అలవాట్లు లేవు. శరీరముతో సంబంధమున్న విషయాలను మర్చిపోవాలి. మనము ఈశ్వరుని వారిగా అయ్యాము. ఇప్పుడు బాబా వద్దకు లేక ప్రియుని వద్దకు వెళ్లాలి. ఈ ప్రియుడు కూడా చాలా విచిత్రమైనవాడు. విచిత్రుడైనందున అతనిని పూర్తిగా స్మృతి చేయలేరు. ఇది ఒక నూతన పద్ధతి కదా. ఆత్మ-పరమాత్మను స్మృతి చేయాలి. అలాగని అర్ధకల్పము నుండి స్మృతే చేయరని కాదు. సత్యయుగములో కేవలము నేను ఆత్మనని మాత్రమే భావిస్తారు. ఇక ఏ జ్ఞానమూ ఉండదు. ఆత్మలమైన మనము ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటామని భావిస్తారు. కానీ ఇక్కడ ఇచ్చట ఆత్మనే పరమాత్మగా చేసేశారు. పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీకు ఈ పాత ప్రపంచము లేనట్లే. బుద్ధి నూతన ప్రపంచముతో జోడింపబడి ఉంది. ఏదైనా నూతన ఇల్లు తయారౌతే బుద్ధి పాత ఇంటి నుండి తొలగి నూతన ఇంటితో జోడింపబడి ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ధర్మాల వారు కాన్పÛరెన్సులు (సమ్మేళనాలు) మొదలైనవి చేస్తారు. కానీ ఒక్కరి బుద్ధి యోగము కూడా పరమపిత పరమాత్మతో లేదు. ఇప్పుడు మీకు నేర్పించే తండ్రి లభించారు. వారే జ్ఞానేశ్వరులు, యోగేశ్వరులు. ఈశ్వరుడు తనతో యోగము జోడించుట నేర్పుతారు. జ్ఞానేశ్వరులనగా ఈశ్వరునిలోనే జ్ఞానముంది. వారే జ్ఞాన-యోగాలను నేర్పించగలరు. ఎవరికైతే పక్కా నిశ్చయబుద్ధి ఉందో, వారు ఈ ప్రపంచములో ఇక కొంత సమయము మాత్రమే ఉంటామని, ఇప్పుడు వాపసు వెళ్లాలని భావిస్తారు. నాటకములో పాత్రధారులకు ఇక కొంత సమయము మాత్రమే ఉంది, తర్వాత ఇంటికి పోతామని తెలుస్తుంది కదా. గడియారము చూస్తూ ఉంటారు. మీది అనంతమైన గడియారము. ఇది అంతిమ జన్మ అని మీకు తెలుసు. కావున మీకు చాలా సంతోషముండాలి. మేము ఈ పాత శరీరాన్ని వదిలి విశ్వానికి ప్రిన్స్ (రాకుమారుడు), ప్రిన్సెస్స్(రాకుమార్తె)గా తయారవ్వాలి. మన మమ్మా-బాబా కూడా వెళ్లి ప్రిన్స్-ప్రిన్సెస్‌గా అవుతారు. పిల్లలు కూడా బాగా పరుగు తీసి విజయ మాలలో సమీప నెంబరు తీసుకోవాలి. బాబాను ఎవరైనా అడిగితే విజయమాలలో సమీపంగా వచ్చునట్లు మీ నడవడిక ఉంది అని బాబా తెలియజేస్తారు. మేము ఎంతవరకు పాస్ అవుతామని స్వయానికి కూడా తెలిసిపోతుంది. మేము ఎప్పుడూ పాస్ కాలేమని కొంతమంది భావిస్తారు. నేను బాబా పుత్రుడను, నేను సర్వమూ సమర్పణ చేశాను, నేను బాబా ఒడిలో కూర్చుని ఉన్నాను, అంతమాత్రము చాలదు. ధారణ లేకుండా ఉన్నత పదవి లభించదు. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ సేవ చేస్తున్నారో, వారు ఇచ్చట ఉండువారి కంటే మంచి పదవి పొందగలరు. వారు చాలా తీవ్రముగా వెళ్తున్నారని కనిపిస్తుంది. కేవలం జతలో ఉండినందున కొంత లాభముంటుంది. మేఫూలు సముద్రము వద్దకు వస్తాయి. నీరు నింపుకొని మళ్లీ వర్షించేందుకు వెళ్లిపోతాయి.

మురళీ అయితే అన్నివైపులకు వెళ్తూ ఉంటుంది. మురళీని విని, వినిపిస్తారు కూడా. చాలా సేవ చేయువారు మంచి ఉన్నత పదవిని కూడా పొందుతారు. శ్రమ పడాలి. ఇక్కడ శ్రమ చేయకుంటే క్రింద పడిపోతారు. ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది. ఈ పురుషార్థము ద్వారా నేను ఏ పదవి పొందుతానని మీ నాడి మీరే చూసుకోవచ్చు. ఈ పురుషార్థము ద్వారా నేను ఏ పదవి పొందుతానని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు పురుషార్థము చేసి ఉన్నత పదవి పొందుకోకుంటే కల్ప-కల్పాంతరాలు ఇటువంటి పదవే ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. మీకిప్పుడు అనంతమైన బుద్ధి లభించింది. డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం చాలా మజాగా ఉంటుంది. కానీ మాయా తుఫానులు ఏదో ఒక విరుద్ధమైన పని చేయిస్తాయి. మంచి-మంచి పిల్లలను మాయ జయించేస్తుంది. పోను పోను వృద్ధి చాలా జరుగుతుంది. మీ పేరు ప్రసిద్ధమౌతుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్మ సమ్మేళనము జరుగుతుంది. సమ్మేళనంలో అర్థం చేయించేందుకు చాలా మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. బాగా చదువుకున్న పిల్లలు వెళ్లాలి. మొదట పెద్దవారి చిన్న కమిటీ ఉంటుంది. తర్వాత పెద్ద సమావేశము జరుగుతుంది. పోప్ మొదలైన వారికి ముందే అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. సమావేశములో దీనిని గురించి కూడా చాలా గమనముంచుతారు. ఇటువంటి కాన్పÛరెన్స్లకు వెళ్లే పిల్లలు చాలా మంచి వివేకవంతులుగా ఉండాలి, చాలా గొప్ప-గొప్ప వారికి వెళ్లి తెలపాలి. మొదట హెడ్ ఎవరో తెలుసుకోండి. ఇప్పుడు బాబా కూడా వచ్చి ఉన్నారు - ఇంతకు ముందు దేవీ దేవతా ధర్మము గురించి ఎవ్వరికీ తెలియదు. దేవీ దేవతా ధర్మానికి కూడా హెడ్ ఉన్నారని ఇప్పుడు సంతోషిస్తారు. జ్ఞానములో పరిపక్వముగా ఉన్నవారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనము - అన్ని ధర్మాలలో ఉన్నతమైన ధర్మమేది? అని వీరిని అడగవచ్చు అని అర్థం చేసుకుంటారు. వారినే హెడ్‌గా చేయాలని భావిస్తారు. మీరు బి.కెలు అందరికీ హెడ్ మీరే. మీరు జగన్మాతలు. పదవి కూడా మాతలదే. కుమారీలు భీష్మ పితామహుడు మొదలైనవారికి బాణము వేసినట్లు చూపిస్తారు కూడా. ఈ కుమారీల ముందుకు అందరూ రావాల్సిందే. కావున అత్యంత ఉన్నతులెవరో అర్థం చేయించాలి. అప్పుడు సర్వవ్యాపి జ్ఞానము అసత్యమని అర్థం చేసుకుంటారు.

ఇప్పుడు మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. తండ్రి పరిచయమివ్వడం మీకు కొత్తదేమీ కాదు. మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి మేము ఈ పాత్ర చాలాసార్లు చేశామనే నషా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నది. ఈ పాత శరీరాన్ని వదిలేసి మళ్లీ కొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తాము. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయ్యింది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదలాలి. మళ్లీ 84 జన్మలు కొత్త-కొత్త శరీరాలు తీసుకుంటారు. ఇది సదా బుద్ధిలో ఉండాలి. ప్రతి పాత్రధారికి వారి-వారి పాత్ర గురించి తెలిసి ఉండాలి కదా. 84 జన్మలు తీసుకొని పాత్ర చేశారు. ఇప్పుడు ఆట సమాప్తమౌతుంది. ఈ శరీరము కూడా సమాప్తమైపోతుంది. సృష్టి కూడా తమోప్రధానంగా ఉంది. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుంది. మళ్లీ వినాశనము ప్రారంభమవుతుంది. మనము మరుసటి జన్మలో విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇక్కడ చదివే చదువుకు ఈ జన్మలోనే ఫలితము లభిస్తుంది. మనము వెళ్లి మొదట దైవీ జన్మ తీసుకుంటాము, తర్వాత క్షత్రియ జన్మ తీసుకుంటామని మీకు మళ్లీ గుర్తుకొచ్చింది. ఇది బుద్ధిలో మెదులుతూ ఉండాలి. అప్పుడు ఖుషీ పాదరస మట్టము పెరిగి ఉంటుంది. ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో, వారికి ఇటువంటి విషయాలు బుద్ధిలో మెదులుతూ ఉంటాయి.

కర్మలైతే తప్పక చేయాల్సిందే అని అర్థం చేయించారు. అలాగే మీ స్మృతి చార్టును పెంచుకోవాలి. రాత్రి సమయము బాగుంటుంది. ఇందులో ఎలాంటి అలసట కలగదు. సమయమంతా ఆ స్థితిలో ఉండలేరు. తుఫానులు వస్తాయి. అలసిపోయేలా కూడా చేస్తాయి. వద్దనుకున్నా తుఫానులు వస్తూనే ఉంటాయి. అవి అలసిపోయేలా చేస్తాయి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. టాపిక్‌లు మొదలైనవి తయారుచేస్తూ ఉంటే అందులో బుద్ధి ఇంకా సంపన్నమైపోతుంది, భర్‌పూర్‌గా అవుతుంది. ఇది బాబా అనుభవము. తుఫానులేమో చాలా వస్తాయి. ఎంత రుస్తుంగా అవుతారో, మాయ అంత ఎక్కువగా వెంటబడి కుస్తీలో ఓడిస్తుంది. ఇది ఒక నియమము. తండ్రి అంటున్నారు - మాయ చాలా శక్తివంతమైనది. ఎందుకనగా ఇప్పుడు దాని రాజ్యము పోనున్నది. కావున ఎక్కువగా తుఫానులను సృష్టిస్తుంది. వాటితో భయపడరాదు. శరీరానికి ఏమైనా జరిగితే అది కూడా కర్మభోగమే. ఇందులో సంశయపడరాదు, గుటకలు మింగరాదు. ఇది చివరి శరీరము. ఇక కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. ఇలా అనుకుంటూ ఖుషీలో ఉంటారు. డ్రామాలో ఈ సమయములో మీరు అందరికంటే ఎక్కువ పదవి గలవారు. ఎందుకంటే పరమపిత పరమాత్మ ఒడిలోకి వచ్చారు. మీలో కూడా మంచి పురుషార్థులు ఎవరైతే ఉన్నారో, వారి వంటి సౌభాగ్యశాలురెవ్వరూ లేరు. ఈ ఈశ్వరీయ సుఖము చాలా ఉన్నతమైనది. భారతదేశమే స్వర్గముగా ఉండేదని, అది అవినాశి ఖండమని, అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవని, మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చాయని మీరు అర్థం చేయించవచ్చు. సూర్యవంశీ రాజధాని పోయిన తర్వాత చంద్రవంశము వచ్చింది. వారి చరిత్ర-భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది. సత్యయుగము తర్వాత త్రేతా యుగము వస్తుందని, 2 కళలు తగ్గినందున ఆ సుఖము తగ్గిపోతుందని అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము సత్యయుగములో ఉంటే లోలోపలే బాధపడుతూ, దు:ఖిస్తూ ఉంటారు. మరలా మనము క్రిందికి దిగిపోవాలా అని మనస్సు తింటూ ఉంటుంది. రాజ్యము చేయాలని ఇష్టముండదు. ఇచ్చట కూడా - మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము, మళ్లీ క్రిందికి దిగవలసి వస్తుంది కదా అని కొంతమంది అంటారు. అయినా అక్కడ రాజ్యము లభిస్తుందనే సంతోషము ఉంటుంది. ఇప్పుడు బాబా మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తున్నారు. స్వర్గానికి యజమానులైన లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కారు. సంగమ యుగములోనే తండ్రి వచ్చి జ్ఞాన మూడవ నేత్రము ఇచ్చి త్రికాలదర్శులుగా చేస్తారు. దేవతలకు ఈ అలంకారాలన్నీ ఎందుకిస్తారు? ఎందుకంటే వారు ఫైనల్లో సంపూర్ణులుగా ఉన్నారు. బ్రాహ్మణులైతే పడ్త్తూ లేస్తూ ఉంటారు. కనుక వారికి అలంకారాలనెలా ఇవ్వగలరు? శోభించదు. డ్రామాలో ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నాయి. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులు. ఈ జ్ఞానము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. ఇవి మీ బిరుదులు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. మొట్టమొదట పరమపిత పరమాత్మతో మీకు సంబంధమేమని అడిగి తండ్రి పరిచయమునివ్వండి. వారి పేరే గాడ్‌ఫాదర్. గాడ్‌ఫాదర్‌ను సర్వవ్యాపి అని అనరు. ఆయన తండ్రి కదా. పరమపితతో మీకు ఏమి సంబంధముంది ? అని మనము ఫారవ్ులో వ్రాస్తాము. పరమపిత అనగానే వారు తప్పకుండా తండ్రి అయినారు కదా. తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి నుండి వారసత్వము లభించాల్సి ఉంటుంది. తండ్రి నూతన ప్రపంచ రచయిత. ఈ లక్ష్మీనారాయణులకు నూతన ప్రపంచ వారసత్వము లభించింది. అచ్చట దేవీ దేవతలకు మూడవ నేత్రము అవసరము లేదు. మూడవ నేత్రము తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇస్తారు. త్రిమూర్తి అనే పదానికి అర్థము ఎంత బాగుంది! అర్థము చేయించేందుకు చాలా ఉల్లాసముండాలి. కనుక ఎవరైతే మంచి టీచర్లుగా ఉంటారో, వారికి తెలిపే అభ్యాసముంటుంది. రోజురోజుకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభమౌతూ పోతుంది. పరమపిత పరమాత్మ మీకేమౌతారు? అని అడిగితే తండ్రి అని అంటారు. తండ్రి నూతన ప్రపంచ రచయిత. సత్యయుగములో దేవీ దేవతల రాజ్యముండేది. తప్పకుండా వారికి పరమపిత పరమాత్మ నుండి ఆస్తి లభించి ఉంటుంది. రాజయోగము నేర్చుకొని రాజ్యము పొందుకుంటారు. మనమంతా బి.కెలము. మీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు కదా, కావున మీ తండ్రి అయ్యారు కదా అని ఎవరికైనా అర్థం చేయించండి. శివుడు కూడా తండ్రే, మీరు కూడా బి.కెలు. మేము తాత నుండి వారసత్వమును తీసుకుంటున్నాము, మీరు తీసుకోవడం లేదు. మీరు వచ్చి అర్థం చేసుకోండి. పురుషార్థము చేస్తే మీకు కూడా లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ వీరిరువురు చాలా ముఖ్యమైనవారు. లక్ష్మీనారాయణుల పదవి వారసత్వముగా లభిస్తుంది. పిల్లలకు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. పెద్ద పెద్ద కాన్పÛరెన్సులకు మీరు వెళ్తే పేరు ప్రసిద్ధి చెందుతుంది. మనది జ్ఞానము. ఇతరులందరిదీ భక్తి. భక్తికి సంబంధించిన విషయాలు జ్ఞానము ద్వారా మనకు ఎవరినైనా అడిగే అథారిటీ ఉంది. కానీ అర్థము చేసుకునే వారు కూడా వెంటనే అర్థము చేసుకోలేరు. వ్యర్థ ప్రశ్నలు ఎన్నో వేస్తారు. అర్థము చేసుకుంటే వారి గర్వము సమాప్తమైపోతుంది. కుమారీలు భీష్మ పితామహుని జయించారని వ్రాసి ఉంది. ఇది జరుగుతుంది. డ్రామాలో ఈ పాత్ర తప్పకుండా ఉంది. మంచిది.మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ , ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. విజయమాలలో వచ్చేందుకు మమ్మా-బాబా సమానంగా సేవ చేయాలి. మురళీ ధారణ చేసిన తర్వాత ఇతరులకు వినిపించాలి. నడవడికలు చాలా రాయల్‌గా ఉంచుకోవాలి.

2. విశాలబుద్ధి ద్వారా అనంతమైన డ్రామాను అర్థం చేసుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. తుఫానులు వచ్చినప్పుడు భయపడరాదు. జ్ఞాన మథనము ద్వారా బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి.

వరదానము :-

‘‘ అంశమాత్రపు దేహాభిమానాన్ని కూడా బలి ఇచ్చే మహాబలవాన్ భవ ’’

అన్నిటికంటే పెద్ద బలహీనత - దేహాభిమానము. దేహాభిమానము యొక్క సూక్ష్మ వంశము చాలా పెద్దది. దేహాభిమానాన్ని బలి ఇచ్చుట అనగా అంశము మరియు వంశ సహితంగా సమర్పితులుగా అగుట. ఇలా బలి చేసేవారే మహాబలశాలురుగా అవుతారు. ఒకవేళ దేహాభిమానము యొక్క అంశమునేదైనా దాచుకొని ఉంచుకున్నారంటే అభిమానమునే స్వమానముగా భావించినారంటే అందులో భలే అల్పకాలిక విజయము లభిస్తుంది అయితే అందులో చాలాకాలపు ఓటమి ఇమిడి ఉంది.

స్లోగన్ :-

‘‘ ఇచ్చÛ లేదు కానీ అచ్చాÛగా అనిపించింది అనుట కూడా జీవన బంధ స్థితి ’’