10-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి వచ్చారు - మీకు శ్రేష్ఠ
మతాన్ని ఇచ్చి సదా కోసం సుఖమయంగా, శాంతిగా చేయడానికి, వారి మతంపై నడవండి, ఆత్మిక
చదువును చదువుకోండి మరియు చదివించండి, అప్పుడు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా
అవుతారు’’
ప్రశ్న:-
ఏ అవకాశము మొత్తం కల్పమంతటిలో ఈ సమయంలో మాత్రమే లభిస్తుంది,
దానిని మిస్ చేసుకోకూడదు?
జవాబు:-
ఆత్మిక సేవ చేసే అవకాశము, మనుష్యులను దేవతలుగా తయారుచేసే
అవకాశము ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఆత్మిక సేవలో
నిమగ్నమవ్వాలి. సర్వీసబుల్ (సేవాయోగ్యులు) గా అవ్వాలి. ముఖ్యంగా కుమారీలు ఈశ్వరీయ
గవర్నమెంట్ యొక్క సేవ చేయాలి. మమ్మాను పూర్తి-పూర్తిగా ఫాలో చేయాలి. ఒకవేళ కుమారీలు
తండ్రికి చెందినవారిగా అయి లౌకిక సేవనే చేస్తూ ఉంటే, ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే
సేవ చేయకపోతే, ఇది కూడా తండ్రిని అగౌరవపరచినట్లు.
గీతము:-
మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి... (జాగ్ సజనియా జాగ్...)
ఓంశాంతి
ప్రేయసులకు ఎవరు అర్థం చేయించారు? ప్రేయసుల కోసం ప్రియుడు వచ్చారు అని అంటారు.
ఎంతమంది ప్రేయసులు ఉన్నారు? ఒక్క ప్రియుడికి ఇంతమంది ప్రేయసులు... ఆశ్చర్యం కదా!
మనుష్యులైతే కృష్ణుడికి 16108 ప్రేయసులు ఉండేవారు అని అంటారు, కానీ కాదు. శివబాబా
అంటారు, నాకైతే కోట్లాది మంది ప్రేయసులు ఉన్నారు. ప్రేయసులందరినీ నేను నాతో పాటు
స్వీట్ హోమ్ కు (మధురమైన ఇంటికి) తీసుకువెళ్తాను. ప్రేయసులు కూడా, బాబా మమ్మల్ని
మళ్ళీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని అర్థం చేసుకుంటారు. జీవాత్మలు ప్రేయసులు.
మనసులో ఉంది - మాకు శ్రీమతాన్ని ఇచ్చి అలంకరణ చేసేందుకు ప్రియుడు వచ్చారు అని.
మతమైతే ప్రతి ఒక్కరికీ ఇస్తారు. పురుషుడు స్త్రీకి, తండ్రి పిల్లలకు, సాధువులు తమ
శిష్యులకు ఇస్తారు, కానీ వీరి మతం అందరికన్నా అతీతమైనది, అందుకే దీనిని శ్రీమతము అని
అనడం జరుగుతుంది, మిగిలినవన్నీ మనుష్య మతాలు. వారంతా తమ శరీర నిర్వహణ కోసం మతాన్ని
ఇస్తారు. సాధువులు-సత్పురుషులు మొదలైనవారందరికీ శరీర నిర్వహణ కోసం చింత ఉంటుంది.
వారందరూ ఇతరులకు ధనవంతులుగా అయ్యేందుకు మతాన్ని ఇస్తూ ఉంటారు. అందరికన్నా మంచి మతము
సాధువులది, గురువులది అని భావిస్తూ ఉంటారు. కానీ వారు కూడా తమ కడుపు కోసం ఎంత
ధనాన్ని పోగు చేసుకుంటారు. నాకైతే నాదంటూ శరీరం లేదు. నేను నా కడుపు కోసం ఏమీ చేయను.
మీ పని కూడా మీ కడుపు కోసమే అనగా మేము మహారాజా-మహారాణిగా అవ్వాలని భావిస్తారు. కడుపు
కోసం అందరికీ చింత ఉంది. అయితే, కొందరు జొన్న రొట్టె తింటే, కొందరు అశోకా హోటల్ లో
తింటారు. సాధువులు ధనాన్ని పోగు చేసి పెద్ద మందిరాలు మొదలైనవి తయారుచేస్తారు.
శివబాబా, శరీర నిర్వహణ కోసమైతే ఏమీ చేయరు. సదా సుఖమయంగా చేసేందుకు, మీకు అంతా
ఇస్తారు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. నేనైతే సదా
ఆరోగ్యవంతంగా అయ్యేందుకు పురుషార్థం చేయను. నేను ఉన్నానే అశరీరి. నేను వచ్చేదే
పిల్లలైన మిమ్మల్ని సదా సుఖమయంగా చేసేందుకు. శివబాబా అయితే నిరాకారుడు.
మిగిలినవారందరికీ కడుపు కోసం చింత ఉంటుంది. ద్వాపరంలో పెద్ద-పెద్ద సన్యాసులు,
తత్వజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు ఉండేవారు. వారు స్మృతిలో ఉండేవారు, అప్పుడు ఇంట్లో
కూర్చుని ఉండగానే వారికి అంతా లభించేది. కడుపు అయితే అందరికీ ఉంది, అందరికీ భోజనం
కావాలి. కానీ వారు యోగంలో ఉంటారు, అందుకే వారికి ఎదురుదెబ్బలు తినాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు, సదా సుఖమయంగా ఎలా ఉండవచ్చు అనే యుక్తిని
తెలియజేస్తారు. బాబా తమ మతాన్ని ఇచ్చి, విశ్వానికి యజమానులుగా చేస్తారు. మీరు
చిరంజీవులుగా ఉండండి, అమరులుగా ఉండండి. అందరికన్నా మంచి మతము వారిది. మనుష్యులైతే
చాలా మతాలు ఇస్తారు. కొందరు పరీక్ష పాస్ అయ్యి బ్యారిస్టర్ గా అవుతారు, కానీ అదంతా
అల్పకాలం కోసము. స్వయం మరియు స్వయం యొక్క పిల్లల కడుపు కోసం పురుషార్థం చేస్తారు.
ఇప్పుడు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తారు, ఓ పిల్లలూ, శ్రీమతంపై నడుస్తూ ఈ ఆత్మిక
చదువును చదువుకోండి, దీని ద్వారా మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవుతారు. అందరికీ
తండ్రి పరిచయాన్ని ఇవ్వండి, అప్పుడు తండ్రి స్మృతిలో ఉండడంతో వారు సదా
ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. వారు అవినాశీ సర్జన్. తండ్రికి పిల్లలైన
మీరు కూడా ఆత్మిక సర్జన్ లే, ఇందులో ఏ కష్టము లేదు. కేవలం నోటితో ఆత్మలకు శ్రీమతం
ఇవ్వడం జరుగుతుంది. సర్వోత్తమ సేవను పిల్లలైన మీరు చేయాలి. ఇటువంటి మతాన్ని మీకు
ఎవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మనం తండ్రికి పిల్లలుగా అయ్యాము కావున తండ్రి యొక్క
వ్యాపారం చేయాలా లేక లౌకిక వ్యాపారం చేయాలా. బాబా నుండి మనం అవినాశీ జ్ఞాన రత్నాలతో
జోలిని నింపుకుంటాము. శివుని ఎదురుగా, జోలిని నింపండి అని అంటారు. 10-20 వేలు
లభిస్తాయి అని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ లభిస్తే, ఇక వారిపై బలిహారమవుతారు, వారిని
చాలా గౌరవిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇప్పుడు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి
మరియు అనంతమైన చరిత్ర-భౌగోళికాలను వినిపించండి. ఇది చాలా సులభము. హద్దు యొక్క
చరిత్ర-భౌగోళికాలలోనైతే చాలా విషయాలు ఉన్నాయి. ఇది అనంతమైన చరిత్ర-భౌగోళికము -
అనంతమైన తండ్రి ఎక్కడుంటారు, ఎలా వస్తారు! ఆత్మలైన మనలో 84 జన్మల పాత్ర ఎలా నిండి
ఉంది. అంతే, ఎక్కువేమీ అర్థం చేయించకండి, కేవలం అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము).
ఆత్మనైన నేను, తండ్రిని స్మృతి చేసి విశ్వానికి యజమానిగా అవుతాను. ఇప్పుడు చదవాలి
మరియు చదివించాలి. అల్ఫ్ అనగా అల్లాహ్, బే అనగా రాజ్యాధికారము. ఇప్పుడు ఆలోచించండి,
ఈ వ్యాపారం చేయాలా లేక లౌకిక వ్యాపారం చేసి 2-4 వందలు సంపాదించాలా!
బాబా అంటారు, ఒకవేళ ఎవరైనా చురుకైన కుమార్తె ఉంటే, నేను వారి మిత్ర-సంబంధీకులకు
కూడా ఇవ్వగలను, దాని ద్వారా వారి శరీర నిర్వహణ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కుమార్తె
మంచిగా ఉండాలి, సర్వీసబుల్ (సేవాయోగ్యం) గా ఉండాలి, లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి,
మాటలో చాలా మధురంగా ఉండాలి. వాస్తవానికి కుమారీ యొక్క సంపాదనను తల్లిదండ్రులు
తినలేరు. బాబాకు చెందినవారిగా అయిన తర్వాత కూడా ఆ లౌకిక సేవకు చాలా అటెన్షన్
ఇవ్వడమంటే - ఇది అగౌరవపరచినట్లు. తండ్రి అంటారు, మనుష్యమాత్రులను స్వర్గానికి
యజమానులుగా చేయండి అని. కానీ పిల్లలేమో లౌకిక సేవ వెనుక తల బాదుకుంటున్నారు!
స్కూళ్ళను తెరవడమైతే గవర్నమెంట్ పని. ఇప్పుడు కుమార్తెలు బుద్ధిని ఉపయోగించాలి. ఏ
సేవ చేయాలి - ఈశ్వరీయ గవర్నమెంట్ దా లేక ఆ గవర్నమెంట్ దా? ఏ విధంగానైతే ఈ బాబా
వజ్రాల వ్యాపారం చేసేవారు, తర్వాత పెద్ద బాబా అన్నారు, ఈ అవినాశీ జ్ఞాన రత్నాల
వ్యాపారం చేయాలి, దీనితో మీరు ఈ విధంగా అవుతారు అని. చతుర్భుజుని సాక్షాత్కారం కూడా
చేయించారు. ఇప్పుడు ఆ విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలా లేక ఇది చేయాలా. అన్నింటికన్నా
మంచి వ్యాపారము ఇది. అయితే, సంపాదన బాగా ఉండేది కానీ బాబా వీరిలోకి ప్రవేశించి
మతాన్ని ఇచ్చారు, అల్ఫ్ (భగవంతుడు) ను మరియు బే (వారసత్వము) ను స్మృతి చేయండి. ఇది
ఎంత సహజము! చిన్న పిల్లలు కూడా చదువుకోగలరు. శివబాబా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ
అర్థం చేసుకోగలరు. వీరు కూడా నేర్చుకోగలరు. వీరు బాహర్యామి (బయటి విషయాలు
తెలిసినవారు), శివబాబా అంతర్యామి (అందరి మనసులు తెలిసినవారు). ఈ బాబా కూడా ప్రతి
ఒక్కరి ముఖం ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా అంతా అర్థం చేసుకోగలరు. కుమార్తెలకు
ఆత్మిక సేవ యొక్క అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు మనసులో అనిపించాలి,
మేము మనుష్యులను దేవతలుగా చేయాలా లేక ముళ్ళను ముళ్ళగా చేయాలా? ఆలోచించండి, ఏం చేయాలి?
నిరాకార భగవానువాచ - దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను తెంచండి. స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బ్రహ్మా తనువు ద్వారా తండ్రి
బ్రాహ్మణులతోనే మాట్లాడుతారు. ఆ బ్రాహ్మణులు కూడా - బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని
అంటారు, వారు కుఖవంశావళి, మీరు ముఖవంశావళి. బాబాకు తప్పకుండా కొడుకు అయిన బ్రహ్మా
కావాలి. కుమార్కా చెప్పండి, బాబాకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? కొందరేమో 600 కోట్లు
అని అంటారు, కొందరేమో ఒక్క బ్రహ్మానే... అని అంటారు. మీరు త్రిమూర్తులు అని అంటారు
కానీ కర్తవ్యాలైతే వేర్వేరు కదా. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు, బ్రహ్మా
నాభి నుండి విష్ణువు, అంటే ఒక్కరే అయినట్లు. విష్ణువు 84 జన్మలు తీసుకుంటారన్నా లేక
బ్రహ్మా అన్నా - విషయమైతే ఒక్కటే. ఇకపోతే మిగిలినది శంకరుడు. శంకరుడే శివుడు అనైతే
కాదు. అలా కాదు, త్రిమూర్తులు అని అనడం జరుగుతుంది. కానీ ధర్మయుతమైన పిల్లలు ఇద్దరు
ఉన్నట్లు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు.
కావున కుమార్తెలకు ఈ సేవ చేయడం మంచిదా లేక మెట్రిక్ మొదలైనవి చదవడం మంచిదా?
అక్కడైతే అల్పకాలిక సుఖం లభిస్తుంది. కొద్దిగా జీతం లభిస్తుంది. ఇక్కడైతే మీరు 21
జన్మల కోసం సుసంపన్నులుగా అవ్వగలరు. మరి ఏం చేయాలి? కన్యలైతే నిర్బంధనులు. అదర్
కన్య కన్నా కుమారీ కన్య చురుకుగా ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే పవిత్రమైనవారు. మమ్మా
కూడా కుమారీ కదా. ధనం యొక్క విషయమేమీ లేదు. మమ్మా ఎంత చురుకుగా ముందుకు వెళ్ళారు,
కావున ముఖ్యంగా కన్యలు, మమ్మాను ఫాలో చేయాలి. ముళ్ళను పుష్పాలుగా చేయాలి. ఈశ్వరీయ
చదువు యొక్క అవకాశాన్ని తీసుకోవాలా లేక ఆ చదువుదా? కన్యల సెమినార్ చేయాలి. మాతలకైతే
పతి మొదలైనవారు గుర్తుకొస్తారు. సన్యాసులకు కూడా చాలా గుర్తుకొస్తూ ఉంటారు. కన్యలైతే
మెట్లు ఎక్కకూడదు. సాంగత్యపు రంగు చాలా అంటుకుంటుంది. ఎవరైనా గొప్ప వ్యక్తి యొక్క
కొడుకును చూస్తే, మనసు పడతారు, వివాహం జరుగుతుంది, అప్పుడిక ఆట సమాప్తము. సెంటర్ లో
విని బయటకు వెళ్తే, ఆట సమాప్తమైపోతుంది. ఇది మధుబన్. ఇక్కడకు ఇటువంటివారు కూడా చాలా
మంది వస్తారు, మేము వెళ్ళి సెంటర్ తెరుస్తామని అంటారు. బయటకు వెళ్ళి మాయమైపోతారు.
ఇక్కడ జ్ఞానం యొక్క గర్భాన్ని ధారణ చేస్తారు, బయటకు వెళ్ళగానే నషా మాయమైపోతుంది.
మాయ చాలా అపోజిషన్ (విరోధము) చేస్తుంది. మాయ కూడా అంటుంది, వాహ్! వీరు బాబాను
గుర్తించారు కూడా, అయినా బాబాను స్మృతి చేయకపోతే, నేను కూడా గట్టిగా దెబ్బ వేస్తాను.
అలాగని, బాబా, నన్ను గట్టిగా కొట్టవద్దు అని మీరు మాయకు చెప్పండి అని అనకూడదు. ఇది
యుద్ధ మైదానము కదా. ఒకవైపు రావణ సైన్యం ఉంది, ఇంకొకవైపు రాముని సైన్యం ఉంది.
ధైర్యవంతులుగా అయి రాముని వైపుకు వెళ్ళాలి. ఆసురీ సంప్రదాయాన్నే దైవీ సంప్రదాయంగా
చేసే వ్యాపారం చేయాలి. లౌకిక చదువును మీరు ఎవరికైనా చదివిస్తే, వారు చదువుకుని
పెద్దయ్యేటప్పటికి వినాశనం కూడా ఎదురుగా వచ్చేస్తుంది. గుర్తులు కూడా మీరు
చూస్తున్నారు. బాబా అర్థం చేయించారు - క్రిస్టియన్ సోదరులు ఇరువురు పరస్పరంలో
కలిసారంటే యుద్ధం జరగజాలదు. కానీ విధి అలా లేదు. వారికి అర్థమే కాదు. ఇప్పుడు
పిల్లలైన మీరు యోగబలంతో రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది శివశక్తి సైన్యము. మీరు
శివబాబా నుండి భారత్ యొక్క ప్రాచీన జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్చుకొని భారత్ ను
వజ్రతుల్యంగా తయారుచేస్తారు. తండ్రి కల్పం తర్వాతనే వచ్చి పతితులను పావనంగా చేస్తారు.
మీరందరూ రావణుని జైలులో ఉన్నారు. శోకవాటికలో ఉన్నారు, అందరూ దుఃఖితులుగా ఉన్నారు.
తర్వాత రాముడు వచ్చి, అందరినీ విడిపించి అశోకవాటికలోకి, స్వర్గంలోకి తీసుకువెళ్తారు.
శ్రీమతం చెప్తుంది - ముళ్ళను పుష్పాలుగా, మనుష్యులను దేవతలుగా తయారుచేయండి. మీరు
మాస్టర్ దుఃఖహర్త-సుఖకర్త. ఈ వ్యాపారమే చేయాలి. శ్రీమతంపై నడుచుకోవడంతోనే మీరు
శ్రేష్ఠంగా అవుతారు, తండ్రి అయితే సలహాను ఇస్తారు, ఇప్పుడు తండ్రి అంటారు, ఇది నా
విన్నపము, ఆపై మీ ఇష్టము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సర్వీసబుల్ (సేవాయోగ్యులు) గా అయ్యేందుకు లోపల-బయట స్వచ్ఛంగా అవ్వాలి. నోటితో
చాలా మధురమైన మాటలు మాట్లాడాలి. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నిటి నుండి
బుద్ధియోగాన్ని తొలగించాలి. సాంగత్యం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.
2. తండ్రి సమానంగా మాస్టర్ దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి. ఆత్మిక సేవ చేసి సత్యమైన
సంపాదన చేసుకోవాలి. ఆత్మిక తండ్రి మతంపై ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. వరదానము:-
‘‘నేను మరియు నా బాబా’’ ఈ విధి ద్వారా జీవన్ముక్త స్థితిని
అనుభవం చేసే సహజ యోగి భవ
బ్రాహ్మణులుగా అవ్వడం అనగా దేహము, సంబంధాలు మరియు సాధనాల
బంధనము నుండి ముక్తులుగా అవ్వడము. దేహ సంబంధీకులతో దేహ సంబంధం పరంగా సంబంధం లేదు
కానీ ఆత్మిక సంబంధముంది. ఒకవేళ ఎవరైనా ఎవరికైనా వశమై, పరవశమైపోతే, అది బంధనమవుతుంది.
కానీ బ్రాహ్మణులనగా జీవన్ముక్తులు. ఎప్పటివరకైతే కర్మేంద్రియాల ఆధారముంటుందో,
అప్పటివరకు కర్మలైతే చేయాల్సిందే, కానీ కర్మ బంధనం కాదు, కర్మ సంబంధముండాలి. ఇలా
ఎవరైతే ముక్తులుగా ఉన్నారో, వారు సదా సఫలతా మూర్తులు. దీనికి సహజ సాధనము - నేను
మరియు నా బాబా, ఈ స్మృతియే సహజయోగులుగా, సఫలతా మూర్తులుగా మరియు బంధన ముక్తులుగా
చేస్తుంది.
స్లోగన్:-
నేను మరియు నాది యొక్క
కల్తీని సమాప్తం చేయడమే రియల్ గోల్డ్ గా అవ్వడము.
మాతేశ్వరి గారి మధుర
మహావాక్యాలు
మనుష్యులు, ఓ గీతా భగవంతుడా,
మీ మాట నిలబెట్టుకునేందుకు రండి అని పాట పాడుతారు. ఇప్పుడు స్వయంగా ఆ గీతా భగవంతుడు,
వారు కల్పక్రితం ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకునేందుకు వచ్చారు మరియు ఇలా అంటున్నారు -
ఓ పిల్లలూ, ఎప్పుడైతే భారత్ లో అతి ధర్మగ్లాని ఉంటుందో, అప్పుడు నేను అదే సమయంలో,
నా ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు తప్పకుండా వస్తాను. అయితే, నేను వస్తాను అంటే
ప్రతి యుగంలోనూ వస్తానని కాదు. అన్ని యుగాలలోనూ ధర్మగ్లాని ఏమీ ఉండదు. ధర్మగ్లాని
కలియుగంలోనే ఉంటుంది కావున పరమాత్మ కలియుగ సమయంలోనే వస్తారని అర్థం చేసుకోండి. మరియు
కలియుగం కల్ప-కల్పము వస్తుంది కనుక వారు కూడా తప్పకుండా కల్ప-కల్పము వస్తారు.
కల్పంలో నాలుగు యుగాలు ఉంటాయి, దానినే కల్పము అని అంటారు. అర్ధకల్పము సత్య-త్రేతా
యుగాలలో సతోగుణము, సతోప్రధానత ఉంటాయి, అక్కడ పరమాత్మ రావాల్సిన అవసరమేమీ ఉండదు.
మరియు ద్వాపర యుగం నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి, ఆ సమయంలో కూడా అతి ధర్మగ్లాని
ఉండదు. కావున పరమాత్మ మూడు యుగాలలో రారు అని దీని ద్వారా ఋజువవుతుంది. ఇక మిగిలింది
కలియుగము, దాని అంతిమంలో అతి ధర్మగ్లాని ఉంటుంది. ఆ సమయంలోనే పరమాత్మ వచ్చి
అధర్మాన్ని సమాప్తం చేసి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఒకవేళ ద్వాపరంలో వచ్చి
ఉంటే, ద్వాపరం తర్వాత సత్యయుగం ఉండాలి, మరి కలియుగం ఎందుకు ఉంది? పరమాత్మ ఘోర
కలియుగాన్ని స్థాపన చేసారు అని అనరు కదా. అలా జరగనే జరగదు. అందుకే పరమాత్మ అంటారు -
నేను ఒక్కడినే, మరియు ఒక్కసారే వచ్చి అధర్మాన్ని వినాశనం చేసి, కలియుగాన్ని వినాశనం
చేసి, సత్యయుగాన్ని స్థాపన చేస్తాను కావున నేను వచ్చే సమయము సంగమయుగము. అచ్ఛా -
ఓంశాంతి.
| | |