10-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - సదా ఈ నషాలోనే ఉండండి, జ్ఞానసాగరుడైన తండ్రి యొక్క జ్ఞాన వర్షం మనపై కురుస్తుంది, దాని ద్వారా మనం పావనంగా అయి మన పెద్ద ఇంటికి వెళ్తాము

ప్రశ్న:-

పిల్లలైన మీ యొక్క నిశ్చయం దేని ఆధారంగా ఇంకా కూడా పక్కాగా అవుతూ ఉంటుంది?

జవాబు:-

ప్రపంచంలో ఎంతగా హంగామాలు పెరుగుతాయో, మీ దైవీ వృక్షము యొక్క వృద్ధి జరుగుతుందో, అంతగా పాత ప్రపంచం పట్ల మనసు తొలగిపోతూ ఉంటుంది మరియు మీ నిశ్చయం పక్కా అవుతూ ఉంటుంది. విహంగ మార్గం యొక్క సేవ జరుగుతూ ఉంటుంది. ధారణ పట్ల అటెన్షన్ పెడుతూ వెళ్ళినట్లయితే బుద్ధి యొక్క ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అపారమైన సంతోషంలో ఉంటారు.

ఓంశాంతి

శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు ప్రతి రోజూ ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదు. మేము శివబాబా సంతానమని పిల్లలకు తెలుసు. చెప్పాల్సిన అవసరం ఉండదు. శివబాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తారు, ఇది జ్ఞాన సాగరుడి జ్ఞాన వర్షము. ఇప్పుడు మాపై జ్ఞాన సాగరుని జ్ఞాన వర్షం కురుస్తుందని పిల్లల బుద్ధిలో ఉంది. ఎవరైతే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారో, వారిపైనే నేను జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను, పిల్లల సమ్ముఖంలో ఉంటాను. ఇప్పుడు పిల్లలు సమ్ముఖంలో కూర్చున్నారు. బాబా, ఘడియ-ఘడియ సమ్ముఖంగా ఉన్నారనే నషా ఎక్కిస్తారు. మాయ మళ్ళీ నషాను దించేస్తుంది. కొందరిది పూర్తిగా దించేస్తుంది, కొందరిది తక్కువగా. పిల్లలకు తెలుసు - మేము సాగరుని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చాము అనగా మురళీ పాయింట్లను ధారణ చేసి డైరెక్షన్లు తీసుకునేందుకు వచ్చాము. మేము వారి ఎదురుగా కూర్చుని ఉన్నాము. ఈ జ్ఞాన సాగరుని వర్షం ఒక్కసారి మాత్రమే కురుస్తుంది. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఓ పతిత పావనా... అని మహిమను కూడా పాడతారు. సత్యయుగంలోనైతే ఈ విధంగా పిలవరు. అక్కడైతే జ్ఞాన సాగరుని జ్ఞాన వర్షంతో పావనంగా అయి ఉన్నారు. జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా ఉంటుంది. దేని పట్ల? పాత పతిత ప్రపంచం పట్ల బుద్ధితో వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తామని పిల్లలకు బుద్ధి ద్వారా తెలుసు. పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి - దీనికి వైరాగ్యము అన్న పదాన్ని ఉపయోగించారు. ఏ విధంగానైతే బాబా కొత్త ఇంటిని తయారుచేస్తే పాత దాని పట్ల బుద్ధియోగం తొలగి కొత్త దాని పట్ల జోడించబడుతుంది. పాతది సమాప్తమైతే మేము కొత్త దానిలోకి వెళ్తామని భావిస్తారు. పిల్లలు కూడా లోలోపల అనుకుంటూ ఉండవచ్చు, త్వరత్వరగా స్వర్గం యొక్క స్థాపన జరగాలి, అప్పుడు మేము మా ఇంటికి వెళ్తాము, సుఖంగా ఉంటాము. మొట్టమొదట మనము ప్రియునితో పాటు ఇంటికి వెళ్తాము. ఇది పుట్టినిల్లు, ఇది చిన్నది, అది పెద్ద బాబా యొక్క ఇల్లు, పెద్ద ఇల్లు. మీకు తెలుసు, అదైతే ఆత్మలందరి యొక్క ఇల్లు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇంతకుముందైతే అంధకారము ఉండేది, ఇప్పుడు ప్రకాశముంది. జ్ఞానమైతే అందరూ తీసుకోరు అని కూడా అర్థం చేసుకుంటారు. ఇంటికైతే అందరూ తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. శ్రీమతంపై యోగ్యులుగా అవుతున్నారు. స్వర్గానికి యోగ్యులుగా అవ్వాలి. ఒకటేమో నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, రెండవది చక్రాన్ని తిప్పండి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, దీని ఆయువు ఎంత, ఎవరు ఎప్పుడు వస్తారు, ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని ఏదైతే అంటారో, వాటిని అందరూ తీసుకుంటారా? ఇప్పుడు మీకు తెలుసు, 84 జన్మలు ఉంటాయి, వాటికి కూడా లెక్క ఉంది. అందరూ అయితే 84 జన్మలు తీసుకోరు. ప్రారంభం నుండి మొదలుకొని పునర్జన్మలలోకి వస్తూ ఉంటారు. చివర్లో కొందరికి ఒకటి రెండు జన్మలు కూడా ఉంటాయి. మొట్టమొదట ఎవరైతే వస్తారో, వారు 84 జన్మలు తీసుకుంటారు. ఉదాహరణకు ఈ లక్ష్మీ-నారాయణులు ఉన్నారు, మనుష్యులు వీరి మందిరాలకు వెళ్తూ ఉండవచ్చు కానీ ఏమీ తెలియదు. భగవాన్-భగవతీలను దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నామని అంటారు, అంతే. కానీ వీరి ఈ రాజధాని ఎలా స్థాపన అయ్యింది, ఇదేమీ తెలియదు. ఎవరికైతే పూజ చేస్తారో, వారి కర్తవ్యం గురించే తెలియకపోతే ఆ పూజ దేనికి పనికొస్తుంది! అందుకే దీనిని అంధశ్రద్ధ అని అంటారు. జప-తపాదులు, తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తారు, వీటి ద్వారా భగవంతుడిని పొందే మార్గం లభిస్తుందని భావిస్తారు. కానీ వీటి ద్వారా ఎవ్వరికీ భగవంతుడు లభించలేరు. ఇక్కడకు కూడా కొంతమంది వస్తారు, మళ్ళీ దర్శనం చేసుకునేందుకు జగదంబ మందిరాలకు కూడా వెళ్తారు అనుకోండి, వీరి బుద్ధిలో ఏమీ కూర్చోలేదని బాబా అనుకుంటారు. మీవైతే మనోకామనలన్నీ పూర్తవుతున్నాయి కదా. జగదంబ పాత్ర ఏక్యురేట్ గా నడుస్తుంది. తప్పకుండా జగదంబ పాత్ర ఉన్నతమైనది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఇది మీ అంతిమ జన్మ. లెక్కాచారాలు ఇక్కడి నుండి సమాప్తమవుతాయి. కర్మభోగాన్ని అనుభవించి విముక్తులుగా అవ్వాలి మరియు తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి పిల్లలు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. దేహధారులను స్మృతి చేసినట్లయితే అది సమయం వృథా చేసినట్లు అవుతుంది. ఎవరైనా నిరంతరం స్మృతి చేయడమైతే జరగదు. నిరంతరం స్మృతి చేసేటువంటి వస్తువేదీ ఉండదు. స్త్రీ, పతిని కూడా నిరంతరం స్మృతి చేయలేరు. తప్పకుండా భోజనం తయారుచేస్తారు, పిల్లల సంభాళన చేస్తారు, అప్పుడు పతి ఏమైనా గుర్తుకొస్తారా. ఇక్కడైతే మీరు నిరంతరం స్మృతి చేసే అభ్యాసం చేయాలి, తద్వారా చివర్లో ఒక్కరి స్మృతి మాత్రమే ఉండేటువంటి అవస్థ ఏర్పడాలి. ఇది చాలా పెద్ద పరీక్ష. 8 రత్నాలకు కూడా చాలా మహిమ ఉంది. ఎవరికైనా గ్రహచారం కూర్చుంటే 8 రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. చివరి సమయంలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, అది కూడా బుద్ధి లైను పూర్తిగా క్లియర్ గా ఉండాలి, ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు - అప్పుడు మాలలోని మణిపూసగా అవ్వగలరు. 9 రత్నాల మహిమ చాలా గొప్పది. కావున ఇప్పుడు నిరంతరం స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఇప్పుడైతే 2-3 గంటలు కూడా అతి కష్టం మీద స్మృతి చేస్తారు. ఎంతగానైతే ప్రపంచంలో హంగామాలు పెరుగుతూ ఉంటాయో, అంతగా మీకు నిశ్చయం కలుగుతూ ఉంటుంది, పాత ప్రపంచం పట్ల మనసు తొలగిపోతూ ఉంటుంది. మరణించడమైతే చాలామంది మరణిస్తారు, మాయ చాలా పాత శత్రువు అని బుద్ధి కూడా చెప్తుంది. శత్రువులు లేనటువంటి చోటు ఏదీ లేదు.

పిల్లలైన మీరు ఇప్పుడు అశుద్ధమైనవారి నుండి స్వచ్ఛమైనవారిగా అవుతున్నారు. అశుద్ధమైనవారి చేతివంటను మనం తినలేము అని మీకు జ్ఞానముంది. ఎటువంటి భోజనమో అటువంటి మనసు అని అంటూ ఉంటారు కూడా. ఎవరైతే అశుద్ధమైన వస్తువును కొనుగోలు చేస్తారో, ఎవరైతే తయారుచేస్తారో, ఎవరైతే తింటారో - వారందరికీ పాపం అంటుకుంటుంది. తండ్రి అయితే అన్ని విషయాలను మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఇక్కడి నుండి రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. మొత్తం రోజంతా బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉండాలి మరియు తమ ఇల్లు గుర్తుండాలి. ఇక్కడి నుండి మీరు మీ లౌకిక ఇంటికి వెళ్ళినప్పుడు అవస్థలో తేడా వస్తుంది ఎందుకంటే సాంగత్యము అలా ఉంటుంది. ఇక్కడ కూర్చుని కూడా కొందరి బుద్ధియోగము బయటకు వెళ్ళిపోతుంది, అందుకే పూర్తిగా ధారణ చేయలేరు. ఆత్మలైన మీకు అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు ఆత్మ, మీరు ఈ శరీరం ద్వారా కార్యాలు చేస్తున్నారు. మీకు తెలుసు, మనం బాబా నుండి శ్రీమతం తీసుకుని మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. ఎంత సంతోషముండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుని పిల్లలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. ఎంత ఎక్కువగా అవస్థ తయారవుతుందో మరియు వృద్ధి చెందుతారో, అప్పుడు సంతోషం యొక్క పాదరసం కూడా ఎక్కుతూ ఉంటుంది మరియు నిశ్చయం కూడా పక్కా అవుతూ ఉంటుంది. ధారణ పట్ల అటెన్షన్ ఇస్తూ వెళ్ళినట్లయితే మీ బుద్ధి యొక్క ఉత్సాహము పెరుగుతూ ఉంటుంది. మున్ముందు మీ విహంగ మార్గపు సేవ జరుగుతూ ఉంటుంది. యుక్తులను తీయాల్సి ఉంటుంది, తద్వారా ఎవరికైనా మంచి రీతిలో బాణం తగలాలి. ముఖ్యమైనది తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. జ్ఞానసాగరుడు కూడా వారే. జ్ఞానం ద్వారానే మనుష్యులు పావనంగా అవుతారు. పతితపావనుడు ఆ తండ్రే. సర్వవ్యాపి అన్న మాటతో భక్తి కూడా నడవదు అన్న ఒక్క పాయింటునే ఉపయోగించండి. ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయించాలి. వీరి జ్ఞానముతో వినాశనం జరుగుతుందని ఆ మనుష్యులు అంటారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల వెలువడిందని మీరు కూడా అంటారు. వారు కూడా నిజమే చెప్తారు. ఎవరైనా విషయాన్ని ఒప్పుకోకపోతే వినాశనమే జరుగుతుంది, ఇంకేమి జరుగుతుంది! ఇలా కల్పక్రితం కూడా వినాశనం జరిగింది. భగవానువాచ, రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఇవన్నీ స్వాహా అవుతాయి. వీరి జ్ఞానమే అటువంటిది అని ఆ మనుష్యులు భావిస్తారు, అందుకే విరోధిస్తారు. చాలా భక్తి చేస్తే భగవంతుడు లభిస్తారని భావిస్తారు. మనం కూడా అంటాము, ఎవరైతే చాలా భక్తి చేసారో, వారికే భగవంతుడు లభించారు అని. కానీ ఈ విషయాలను అర్థం చేసుకోవడము మనుష్యులకు చాలా కష్టమవుతుంది. కల్పక్రితం కూడా పిల్లలైన మీరు తండ్రి సహాయంతో నరకాన్ని స్వర్గంగా తయారుచేసారు. కావున తప్పకుండా నరకం యొక్క వినాశనం కూడా జరిగే ఉంటుంది. ఎప్పుడైతే నరకం యొక్క వినాశనం జరుగుతుందో, అప్పుడు స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. భారత్ తప్పకుండా పావనంగా ఉండేదని కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఏ ధర్మం వారైనా సరే, తప్పకుండా స్వర్గము ఉండేదని అంటారు. ప్రాచీనమైనది అనగా అన్నింటికన్నా పురాతనమైనది. అది స్వర్గమే అవుతుంది కదా, ఏదైతే పాతదిగా అయ్యిందో, అది మళ్ళీ కొత్తదిగా అవ్వనున్నది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపనను చేయిస్తున్నారు. ఎవరి సహాయంతో? సర్వుల నిరాకార తండ్రి, సర్వాత్మల తండ్రి సహాయంతో. ఈ విషయాల గురించి మీకు తెలుసు. మీరు ఎంత సాధారణమైనవారు. తండ్రి అంటారు, నేను కూడా పేదల పెన్నిధిని, మీరు పేదవారు కదా. మీ వద్ద ఏముంది. మీరు అంతటినీ భారత్ కోసం స్వాహా చేసారు, రావణునితో మీ యుద్ధము ఎంత పెద్దది. శక్తి సైన్యము కదా. వందే మాతరం అని అంటూ ఉంటారు. అపవిత్రమైనవారు, పవిత్రమైనవారికి వందనం చేస్తారు. ఏ మాతకు? వారు భూ మాత అని భావిస్తారు. కానీ ఇది భూమిపై ఉండేవారి యొక్క విషయము. జగదంబ ఉన్నారంటే, పిల్లలు కూడా ఉన్నారు. ఈ దిల్వాడా మందిరము స్మృతిచిహ్నంగా తయారై ఉంది. కుమారీలు, అదర్ కుమారీలు కూడా ఉన్నారు. వీరిని మాత అని కూడా అంటారు. మీరు ఇలా అంటారు, బాబా, మేము బి. కె.లము, మమ్మల్ని మాత అని అనకుండా, కుమార్తె అని అనండి, మేము కుమారీలము. ఇది ఎంత గుహ్యమైన అర్థం చేసుకోవాల్సిన విషయము. కానీ అర్థం చేసుకోలేరు. పాత జన్మ-జన్మాంతరాల భానము కూర్చుని ఉంది, అది తెగిపోనే తెగిపోదు. మీ బుద్ధిలో ఉంది, బాబా మన ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆత్మలతో మాట్లాడుతున్నారు. తండ్రి ఈ శరీరంలో ప్రవేశిస్తారు. బాబా వచ్చి అలౌకిక దివ్య కర్తవ్యాలను చేస్తారు. పతితులను పావనంగా చేసేందుకు చదివిస్తారు. పూర్తి స్మృతి ఉండాలి. మనల్ని పతిత-పావనుడైన శివబాబా చదివిస్తారు. పతితపావనుడు అందరికన్నా ఉన్నతమైనవారు, ఇంకా తండ్రి, టీచరు కూడా. మొట్టమొదటి పదము పతిత-పావనుడు అనే రావాలి. వారిని తలచుకుంటారు, ఓ గాడ్ ఫాదర్ రండి, వచ్చి మళ్ళీ మాకు రాజయోగాన్ని నేర్పించండి అని. తండ్రి కూడా అంటారు, మళ్ళీ పిల్లలైన మీకు సహజ జ్ఞానాన్ని, యోగాన్ని నేర్పిస్తున్నాను అని. ఇందులో పుస్తకాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇలా వారు పేర్లు పెట్టేసారు. ఇప్పుడైతే తండ్రి మీకు యోగ్యులుగా అయ్యేందుకు శిక్షణనిస్తున్నారు. నిత్యము కొత్త పాయింట్లు లభిస్తాయి. ఇకపోతే గీతా, గ్రంథ్ మొదలైనవి ఏవైతే తయారుచేస్తారో, వాటిలో ఏమీ కలపరు, ఎలాంటి మార్పు-చేర్పులు చేయరు, అలాగే వినిపిస్తారు. ఇక్కడ కలుపుతారు, మార్పు-చేర్పులు కూడా చేయబడతాయి. రోజూ కొత్త-కొత్త పాయింట్లు లభిస్తాయి. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది, ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. కామము మహాశత్రువు, భగవానువాచ - దేహ సహితంగా అందరినీ మర్చిపోండి, ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఆత్మలైన మీ అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. నేను అకాలమూర్తిని, కాలుడికే కాలుడిని. నేను పిల్లలందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను, కావున మీకు సంతోషముండాలి కదా.

ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. త్వరగా తెలివైనవారిగా అవ్వండి, బాబా నుండి వారసత్వాన్ని అయితే తీసుకోవాలి. అప్పటివరకు యుద్ధం ప్రారంభమవ్వరాదు. బాబా అంటారు, నేను ఏమైనా చేయగలనా. మొదట రిహార్సల్ జరుగుతుంది. ఇప్పుడైతే రాజులు మొదలైనవారు కూడా రాలేదు. రాజస్థాన్ అనే పదము ఆధారంగా కూడా అర్థం చేయించవచ్చు. రాజస్థాన్ అన్న పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా, చెప్పండి? భారత్ లో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. మళ్ళీ ఆ రాజస్థాన్కావాలి, అది ఇప్పుడు మళ్ళీ స్థాపనవుతుంది. మనకు తెలుసు, కానీ బుద్ధిలో ఎప్పుడైతే కూర్చుంటుందో, అప్పుడు సంతోషపు పాదరసం ఎక్కుతుంది. భక్తి మార్గంలో ఈ దేవతల మందిరాలను తయారుచేస్తారు. భారత్ లో ఎంత ధనముండేది. మనము మళ్ళీ దీనిని దైవీ రాజస్థాన్ గా తయారుచేస్తాము. ఈ విషయాలను వచ్చి అర్థం చేసుకోండి. అర్థం చేయించాలి అనేటువంటి ఉత్సాహము కూడా ఉండాలి. ఇది కూడా సెమినార్ కదా. ఎలా సేవ చేయాలి. బాబా అర్థం చేయించారు, కుమారీలు, మాతలు, గోపులు అందరూ కలిసి వింటారు. ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడు, కృష్ణుడు కాదు. కావున రాజస్థాన్ అన్న పదముపై మీరు అర్థం చేయించవచ్చు. తప్పకుండా ఒకప్పుడు రాజస్థాన్ ఉండేది, ఎవరి మందిరాలైతే తయారై ఉన్నాయో, వాటిని మళ్ళీ మనం తయారుచేస్తున్నాము. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు కూడా అర్ధకల్పం కోసం ప్రయత్నించండి. ఇక ఇంకెప్పుడూ ఏడ్వాల్సిన అవసరముండదు. మనం రాముని శ్రీమతం ఆధారముగా రావణునిపై విజయం పొందుతున్నాము. పదాలు వింటే లోపల కూర్చుంటాయి. ఎవరికైతే బాణం తగులుతుందో, వారు అర్థం చేసుకునేందుకు వస్తారు. ఈ అనంతమైన సెమినార్ ను బాబా ప్రతి రోజూ చేస్తారు. ఇది పరమాత్మతో ఆత్మల యొక్క సెమినార్. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మభోగము నుండి విముక్తులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. దేహధారుల స్మృతితో సమయాన్ని వృథా చేసుకోకూడదు. బుద్ధి లైన్ ను చాలా స్పష్టంగా ఉంచుకోవాలి.

2. చాలా శుద్ధమైన భోజనాన్ని తినాలి. ఎటువంటి ఆహారమో, అటువంటి మనసు, అందుకే అశుద్ధమైనవారి చేతి భోజనాన్ని తినకూడదు. బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి.

వరదానము:-

ఆత్మిక దయ ద్వారా సర్వులను సంతుష్టపరిచే సదా సంపద కలవారిగా కండి

ఈ నాటి విశ్వములో సంపద కలవారైతే చాలా మంది ఉన్నారు కానీ అన్నింటికన్నా అత్యంత అవసరమైన సంపద, దయ. పేదవారైనా లేక ధనవంతులైనా కానీ, నేడు దయ అనేది లేదు. మీ వద్ద దయ అనే సంపద ఉంది, అందుకే ఎవరికైనా సరే, వేరే ఏమీ ఇవ్వకపోయినా కానీ దయతో అందరినీ సంతుష్టపర్చగలరు. మీ దయ ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధంతో ఉంది, ఈ ఆత్మిక దయతో తనువు, మనసు మరియు ధనము పరంగా సంతుష్టం చేయగలరు.

స్లోగన్:-

ప్రతి కార్యంలో సాహసాన్ని తోడుగా చేసుకున్నట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది.