10-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు ఈ చదువు ద్వారా వయా శాంతిధామము, మీ సుఖధామానికి వెళ్తారు, ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము, దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు"

ప్రశ్న:-

పిల్లలైన మీరు సాక్షీగా అయి ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నారు?

జవాబు:-

ఈ సమయంలో డ్రామాలో పూర్తిగా దుఃఖపు దృశ్యం ఉంది. ఒకవేళ ఎవరికైనా సుఖమున్నాకానీ అది అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖమే. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. పిల్లలైన మీరిప్పుడు వెలుగులోకి వచ్చారు. క్షణ-క్షణమూ ఈ అనంతమైన సృష్టిచక్రం తిరుగుతూ ఉంటుంది, ఒక రోజు మరొక రోజుతో కలువదు అని మీకు తెలుసు. మొత్తం ప్రపంచపు పాత్ర మారుతూ ఉంటుంది. కొత్త దృశ్యం కొనసాగుతూ ఉంటుంది.

డబల్ ఓంశాంతి. ఒకటేమో బాబా స్వధర్మంలో స్థితులై ఉన్నారు, రెండవది - మీరు మీ స్వధర్మంలో స్థితులై తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు కూడా చెప్తారు. ఇలా స్వధర్మంలో స్థితులవ్వండి అని ఇతరులెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయముంది. 'నిశ్చయబుద్ధి విజయంతి.' వారే విజయాన్ని పొందుతారు. ఏ విజయాన్ని పొందుతారు? తండ్రి వారసత్వం యొక్క విజయాన్ని పొందుతారు. స్వర్గంలోకి వెళ్ళడము - ఇది బాబా వారసత్వము యొక్క విజయము పొందడం. మిగిలినదంతా పదవి కోసం చేసే పురుషార్థం. స్వర్గంలోకైతే తప్పకుండా వెళ్ళాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. ఎన్నో అపారమైన దుఃఖాలు రానున్నాయి. డ్రామా చక్రం గురించి కూడా మీకు తెలుసు. పావనంగా తయారుచేసి ఆత్మలందరినీ దోమల వలె తీసుకువెళ్ళేందుకు బాబా అనేకసార్లు వచ్చారు, ఆ తరువాత వారు కూడా నిర్వాణధామంలోకి వెళ్ళి నివసిస్తారు. పిల్లలు కూడా వెళ్తారు! ఈ చదువు ద్వారా మనము వయా శాంతిధామము, మన సుఖధామానికి వెళ్తామని పిల్లలకు ఈ సంతోషం ఉండాలి. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఇది మర్చిపోకూడదు. మీరు దీనిని ప్రతిరోజూ వింటారు. మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు అని అర్థం చేసుకున్నారు. పావనంగా అయ్యేందుకు స్మృతి అనే సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది కూడా కొత్త విషయమేమి కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారని వ్రాయబడి ఉంది. కేవలం కృష్ణుని పేరు వేయడమే వారు చేసిన పొరపాటు. పిల్లలకు లభిస్తున్న జ్ఞానము గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రాలలోనూ ఉండదు. తండ్రికి ఉండేటటువంటి మహిమ మరే మనుష్యులకూ లేదని పిల్లలకు తెలుసు. తండ్రి రాకపోతే సృష్టిచక్రమే తిరగదు. దుఃఖధామం నుండి సుఖధామంగా ఎలా అవుతుంది? సృష్టి చక్రమైతే తప్పకుండా తిరగాల్సిందే. తండ్రి కూడా తప్పకుండా రావాల్సిందే. అందరినీ తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు, ఆ తరువాత చక్రం తిరుగుతుంది. తండ్రి రాకపోతే కలియుగం నుండి సత్యయుగంగా ఎలా అవుతుంది? ఈ విషయాలైతే ఇతర ఏ శాస్త్రాలలోనూ లేవు. రాజయోగం గీతలోనే ఉంది. భగవంతుడు ఆబూలో వచ్చారని అర్థం చేసుకున్నట్లయితే వారిని కలుసుకునేందుకు ఒక్కసారిగా పరుగుతీస్తారు. భగవంతుడిని కలుసుకోవాలని సన్యాసులు కూడా కోరుకుంటారు కదా. తిరిగి వెళ్ళేందుకు పతితపావనుడిని స్మృతి చేస్తారు. పిల్లలైన మీరిప్పుడు పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖముంటుంది. కొత్త ప్రపంచంలో దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు లేదు. తండ్రి బ్రహ్మా ద్వారానే దైవీ రాజ్యస్థాపనను చేస్తారు. ఇదైతే స్పష్టంగా ఉంది. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఇందులో సంశయపడే విషయమేమీ లేదు. మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు, రాజధాని తప్పకుండా స్థాపనవుతుంది. ఆదిసనాతన దేవీదేవతా ధర్మం ఉంటుంది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు దీనికి భారత్ అనే పేరు ఉంటుంది, మళ్ళీ మీరు ఎప్పుడైతే నరకంలోకి వస్తారో అప్పుడు హిందుస్థాన్ అనే పేరు వస్తుంది. ఇక్కడ ఎంతగా దుఃఖముంది. మళ్ళీ ఈ సృష్టి మారుతుంది. తర్వాత స్వర్గంలో ఉండేదే సుఖధామం. పిల్లలైన మీలో ఈ జ్ఞానం ఉంది. ప్రపంచంలోని మనుష్యులకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఇది అంధకారమయమైన రాత్రి, రాత్రివేళ మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. పిల్లలైన మీరు వెలుగులో ఉన్నారు. ఇది కూడా సాక్షీగా అయి బుద్ధిలో ధారణ చేయాలి. క్షణ-క్షణమూ అనంతమైన సృష్టిచక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలువదు. మొత్తం ప్రపంచపు పాత్రంతా పరివర్తనవుతూ ఉంటుంది. కొత్త దృశ్యం కొనసాగుతూ ఉంటుంది. ఈ సమయంలో మొత్తం అంతా దుఃఖమయమైన దృశ్యాలే ఉన్నాయి. ఒకవేళ సుఖమున్నా, అది కూడా కాకిరెట్టతో సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఏదో ఈ జన్మలో కొద్దిగా సుఖమున్నా మరుసటి జన్మలో దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు మేము మా ఇంటికి వెళ్తాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇందులో పావనంగా అయ్యేందుకు శ్రమించాలి. శ్రీ శ్రీ అయిన తండ్రి, శ్రీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు శ్రీమతమును ఇచ్చారు. 'బ్యారిస్టర్ భవ' అని బ్యారిస్టర్ తమ మతమును ఇస్తారు. ఇప్పుడు తండ్రి కూడా శ్రీమతం ద్వారా ఇలా అవ్వండి అని చెప్తారు.

నాలో ఎటువంటి అవగుణాలూ లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు, మీరే జాలి చూపించండి అని ఈ సమయంలో గానం చేస్తారు. జాలి అనగా దయ. పిల్లలూ, నేను ఎవరిపైనా దయ చూపించను. ప్రతి ఒక్కరు తమపై తామే దయ చూపించుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. నిర్దయుడైన రావణుడు మిమ్మల్ని దుఃఖంలోకి తీసుకువస్తాడు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇందులో రావణుని దోషం కూడా ఏమీ లేదు. తండ్రి వచ్చి కేవలం సలహాను ఇస్తారు. ఇదే వారు చూపించే దయ. ఈ రావణ రాజ్యమైతే కొనసాగుతుంది. డ్రామా అనాది అయినది. రావణుని దోషమూ లేదు, మనుష్యుల దోషమూ లేదు. చక్రమైతే తిరగవలసిందే. రావణుని నుండి విడిపించేందుకు బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. రావణుని మతముపై మీరు ఎంత పాపాత్ములుగా అయ్యారు! ఇప్పుడిది పాత ప్రపంచం. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. చక్రమైతే తిరుగుతుంది కదా. సత్యయుగం మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఇప్పుడిది సంగమయుగము. మహాభారత యుద్ధము కూడా ఈ సమయములోనిదే. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇది జరగనున్నది. అలాగే విజయులైన మనం స్వర్గాధిపతులుగా అవుతాము. మిగిలినవారెవ్వరూ ఉండరు. పవిత్రంగా అవ్వకుండా దేవతలుగా అవ్వడం కష్టమని కూడా అర్థం చేసుకుంటారు. శ్రేష్ఠమైన దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు తండ్రి ద్వారా శ్రీమతం లభిస్తుంది. ఇటువంటి మతము ఎప్పుడూ లభించదు. శ్రీమతమును ఇచ్చే వారి పాత్ర సంగమయుగంలోనే ఉంది. ఇతరులెవ్వరిలోనూ ఈ జ్ఞానమే లేదు. భక్తి అనగా భక్తి. దానిని జ్ఞానము అని అనరు. ఆత్మిక జ్ఞానాన్ని జ్ఞాన సాగరుడైన పరమాత్మయే ఇస్తారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు అన్నది వారి మహిమయే. పురుషార్థం చేసేందుకు తండ్రి యుక్తులను కూడా తెలియజేస్తారు. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప-కల్పాంతరాలూ ఫెయిల్ అవుతాము, ఎంతో పెద్ద దెబ్బ తగుల్తుంది అన్న ఆలోచన ఉంచుకోవాలి. శ్రీమతంపై నడవకపోయినట్లయితే దెబ్బ తగుల్తుంది. బ్రాహ్మణుల వృక్షము కూడా తప్పకుండా పెరగవల్సిందే. ఎంతగా దేవతల వృక్షం పెరిగిందో, ఇదీ అంతే పెరుగుతుంది. మీరు పురుషార్థం చేయాలి మరియు చేయించాలి. అంటు కట్టబడుతూ ఉంటుంది. వృక్షం పెద్దదవుతుంది. ఇప్పుడు మన కళ్యాణం జరుగుతుందని మీకు తెలుసు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వెళ్ళేందుకు కళ్యాణం జరుగుతుంది. పిల్లలైన మీ యొక్క బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. బాబా వివేకవంతుల బుద్ధి కదా! ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మున్ముందు ఎవరెవరి తాళాలు తెరవబడతాయో చూడాలి. ఈ డ్రామా కూడా కొనసాగుతుంది. మళ్ళీ సత్యయుగం నుండి పునరావృతం అవుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడైతే సింహాసనంపై కూర్చుంటారో, అప్పుడు శకం ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని కూడా మీరు వ్రాస్తారు, ఎంత స్పష్టంగా ఉంది. ఇది సత్యనారాయణుని కథ. అమరనాథుని కథ కూడా ఉంది కదా! ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన అమరనాథుని కథను వింటారు, దానికి మళ్ళీ గాయనం జరుగుతుంది. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. శివబాబా జయంతి నంబర్ వన్ పండుగ. కలియుగము తర్వాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి తప్పకుండా రావలసి ఉంటుంది. చిత్రాలను ఎవరైనా బాగా పరిశీలించిండి, పూర్తి లెక్క ఎంత బాగా తయారుచేయబడి ఉందో చూడండి. ఇదే మీ గౌరవము, కల్పక్రితం ఎంతగా పురుషార్థం చేశారో, అంతగా తప్పకుండా చేస్తారు. సాక్షీగా అయి ఇతరులను కూడా చూస్తారు. తమ పురుషార్థాన్ని కూడా తెలుసుకుంటారు. మీకు కూడా తెలుసు. విద్యార్థులకు తమ చదువును గురించి తెలియదా? మేము ఈ సబ్జెక్టులో చాలా అపరిపక్వంగా ఉన్నామని మనస్సు చాలా తింటూ ఉంటుంది. తర్వాత ఫెయిల్ అవుతారు. పరీక్షల సమయంలో ఎవరైతే అపరిపక్వంగా ఉంటారో, వారి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. పిల్లలైన మీకు కూడా సాక్షాత్కాలు కలుగుతాయి. కానీ ఫెయిల్ అయిపోతారు కదా, అప్పుడేం చేయగలరు! స్కూలులో ఫెయిల్ అయితే సంబంధీకులు కూడా అసంతుష్టులుగా అవుతారు, టీచర్లు కూడా అసంతుష్టులుగా అవుతారు. స్కూలులో తక్కువ మంది పాస్ అయినట్లయితే టీచర్లు అంత మంచిగా లేరు కావున తక్కువ మంది పాస్ అయ్యారని భావిస్తారు. సెంటర్లో మంచి టీచర్లు ఎవరెవరు ఉన్నారో, ఎలా చదివిస్తారో బాబాకు కూడా తెలుసు. ఎవరెవరు బాగా చదివించి తీసుకొస్తారో, అన్నీ తెలుస్తాయి. మేఘాలను తీసుకురండి అని బాబా అంటారు. చిన్న పిల్లలను తీసుకొచ్చినట్లయితే వారిపై మోహముంటుంది. ఒంటరిగా వచ్చినప్పుడు బుద్ధి బాగా జోడింపబడి ఉంటుంది. పిల్లలనైతే అక్కడ కూడా చూసుకుంటూనే ఉంటారు కదా.

ఈ పాత ప్రపంచమైతే శ్మశానవాటికగా అవ్వనున్నది అని తండ్రి చెప్తారు. కొత్త ఇంటిని తయారుచేస్తున్నప్పుడు, మా కొత్త ఇల్లు తయారవుతుంది అని బుద్ధిలో ఉంటుంది కదా! వ్యాపారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు కానీ బుద్ధి కొత్త ఇంటి వైపు ఉంటుంది. మౌనంగా అయితే కూర్చోరు కదా. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. ప్రతి కార్యమూ చేస్తూ, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని స్మృతి ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలూ, మీ పిల్లలు మొదలైనవారిని కూడా సంభాళించాలి, కాని బుద్ధి అక్కడ జోడింపబడి ఉండాలి అని తండ్రి అంటారు. స్మృతి చేయకపోతే పవిత్రంగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు, జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. ఇక్కడైతే అందరూ పతితులే. రెండు తీరాలున్నాయి. బాబాను నావికుడు అని అంటారు, కానీ అర్థాన్ని తెలుసుకోరు. తండ్రి ఆవలి తీరానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మేమిప్పుడు తండ్రిని స్మృతి చేసి చాలా సమీపంగా వెళ్తున్నామని ఆత్మకు తెలుసు. నావికుడు అన్న పేరు కూడా అర్థసహితంగా పెట్టారు కదా. నా నావను ఒడ్డుకు చేర్చండి అని అందరూ మహిమ చేస్తారు. సత్యయుగంలో ఇలా అంటారా? కలియుగంలోనే పిలుస్తారు. బుద్ధిహీనులు ఇక్కడకు రాకూడదని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దంటారు. నిశ్చయం లేకపోతే ఎప్పుడూ తీసుకురాకూడదు. ఏమీ అర్థం చేసుకోలేరు. మొదట 7 రోజుల కోర్సును ఇవ్వండి. కొందరికి 2 రోజులలోనే బాణము తగుల్తుంది. బాగా తగిలినట్లయితే, ఇక తర్వాత వదలరు. మేము ఇంకా 7 రోజులు నేర్చుకుంటాము అని అంటారు. వీరు ఈ కులానికి చెందినవారే అని మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. చురుకైన బుద్ధి కలవారు ఏ విషయాలను లెక్కచేయరు. అచ్ఛా, ఒక ఉద్యోగం పోయినట్లయితే మరొకటి లభిస్తుంది, విశాల హృదయం గల పిల్లలవి, ఉద్యోగము మొదలైనవి కూడా పోవు. స్వయమే ఆశ్చర్యపోతారు. మా పతి బుద్ధిని పరివర్తన చేయండి అని పిల్లలు అంటారు. అది నాకు చెప్పకండి అని బాబా అంటారు. మీరు యోగబలముతో కూర్చుని జ్ఞానాన్ని అర్థం చేయించండి. బాబా బుద్ధిని పరివర్తన చేయరు. అలా అయితే అందరూ ఇటువంటి వ్యాపారమే చేస్తూ ఉంటారు. ఏ ఆచారము వెలువడితే, అది అందరూ అనుసరిస్తారు. ఎవరైనా గురువు ద్వారా ఎవరికైనా లాభం కలిగింది అని వింటే ఇక అందరూ వారి వెనుకపడతారు. కొత్త ఆత్మ వచ్చినప్పుడు వారి మహిమ అయితే వెలువడుతుంది కదా! దానితో ఎంతో మంది అనుచరులుగా అవుతారు, కావున ఈ విషయాలన్నింటినీ చూడకూడదు. నేను ఎంత వరకు చదువుతున్నాను అని మీరు స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఇలా బాబా డీటైల్ గా చిట్ చాట్ చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి, ఇదైతే ఇంట్లో ఉంటూ కూడా చేయవచ్చు అని చెప్పవచ్చు. కానీ జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానం కూడా ఇస్తారు కదా! 'మన్మనాభవ' అన్నది ముఖ్యమైన విషయము. దానితో పాటు సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను కూడా అర్థం చేయిస్తారు. ఈ సమయంలో చిత్రాలు కూడా చాలా మంచి-మంచివి వెలువడ్డాయి. వాటి అర్థాన్ని కూడా తండ్రి వివస్తారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వచ్చినట్లుగా చూపించారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు, మరి విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడడమేమిటి? ఇది సరైనదా లేక తప్పా అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఊహా చిత్రాలను కూడా ఎన్నో తయారుచేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు. కాని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయువును వ్రాసేశారు. అనేక మతాలున్నాయి కదా. శాస్త్రాలలో హద్దు విషయాలను వ్రాసేశారు, తండ్రి మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యముందని అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. మేము పతితులుగా ఎలా అయ్యాము, మళ్ళీ పావనులుగా ఎలా అవుతాము అన్న జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మిగిలిన ధర్మాలు తర్వాత వస్తాయి. అనేక వెరైటీలు ఉన్నాయి. ఒకటి మరొక దానితో కలవదు. ఒకే విధమైన రూపురేఖలు కలవారు ఇద్దరు ఉండరు. ఇది రచింపబడియున్న ఆట, ఇదే పునరావృతమవుతూ ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయం తగ్గిపోతూ ఉంటుంది. మేము ఎంతవరకు సంతోషంగా ఉంటున్నాము అని స్వయాన్ని పరిశీలించుకోండి. మనం ఎటువంటి వికర్మలూ చేయకూడదు. తుఫానులైతే వస్తాయి. అంతర్ముఖులుగా అయి తమ చార్టును పెట్టుకున్నట్లయితే, ఏ తప్పులైతే జరుగుతాయో వాటి గురించి పశ్చాత్తాపపడగలరు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది యోగబలముతో స్వయాన్ని క్షమించుకున్నట్లు అవుతుంది. బాబా ఏమీ క్షమించరు. డ్రామాలో క్షమాపణ అన్న పదమే లేదు. మీకు మీరే శ్రమ చేయాలి. పాపాల శిక్షను మనుష్యులు స్వయమే అనుభవిస్తారు. క్షమించే విషయమే లేదు. ప్రతి విషయంలో శ్రమించండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చొని ఆత్మలకు యుక్తులను తెలియజేస్తారు. పురాతన రావణ దేశములోకి రండి, పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. అది ఆసురీ సాంప్రదాయము. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు, దైవీ సాంప్రదాయులుగా అవుతున్నారు. పురుషార్థము కూడా పిల్లలు నంబరువారుగా చేస్తారు. మళ్ళీ వీరి భాగ్యంలో ఇంతే ఉంది అని అనేస్తారు. తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. జన్మ-జన్మాంతరాలూ, కల్ప-కల్పాంతరాలూ ఉన్నత పదవిని పొందలేరు. స్వయాన్ని నష్టపరుచుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది, మళ్ళీ నష్టములోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యంలో ఎంతగా నష్టం జరుగుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి తమను తాము పరిశీలించుకోవాలి, ఏ పొరపాట్లైతే జరుగుతాయో వాటి గురించి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి యోగబలం ద్వారా క్షమించుకోవాలి. మీకు మీరు కష్టపడాలి.

2. తండ్రి సలహా ఏదైతే లభిస్తుందో దానిపై పూర్తిగా నడుస్తూ, మీపై మీరే దయ చూపించుకోవాలి. సాక్షీగా అయి తమ మరియు ఇతరుల పురుషార్థాన్ని గమనించాలి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు.

వరదానము:-

నిరంతర స్మృతి ద్వారా అవినాశీ సంపాదనను జమ చేసుకునే సర్వ ఖజానాలకు అధికారి భవ

నిరంతర స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ సంపాదనను జమ చేసుకుంటూ ఉన్నట్లయితే సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ.... ఈ ఖజానాలన్నింటి యొక్క అధికారాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి కష్టమూ కష్టంగా అనుభవమవ్వదు. సంగమయుగంలో బ్రాహ్మణులకు ఎటువంటి కష్టము కలగదు. ఒకవేళ ఏదైనా కష్టమొచ్చినా, అది తండ్రి స్మృతిని కలిగించేందుకే వస్తుంది. ఎలాగైతే గులాబీ పుష్పంతో పాటు ముళ్ళు దానిని రక్షించే సాధనంగా ఉంటాయో, అలా ఈ కష్టాలు, ఇంకా తండ్రి స్మృతిని కలిగించేందుకు నిమిత్తంగా అవుతాయి.

స్లోగన్:-

పరమాత్ముని శ్రీమతమనే ఆధారంపై కర్మరూపీ బీజానికి శుభసంకల్పాలు అనే జలం లభిస్తూ ఉన్నట్లయితే బీజము శక్తిశాలిగా అవుతుంది.