10-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు లేక భాషణ చేసినప్పుడు బాబా-బాబా అని అంటూ అర్థము చేయించండి, తండ్రిని మహిమ చేయండి, అప్పుడు బాణము తగులుతుంది”

ప్రశ్న:-

బాబా భారతవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు?

జవాబు:-

భారతవాసీ పిల్లలైన మీరు ఎంతో షావుకారులుగా ఉండేవారు, సర్వ గుణసంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మీరు పవిత్రంగా ఉండేవారు, కామఖడ్గమును నడిపించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. మరి మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు - కారణము తెలుసా? పిల్లలూ, మీరు బానిసలుగా ఎలా అయ్యారు? ఇంత ధనం సంపదలను ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు పావనం నుండి పతితులుగా ఎలా అయ్యారో ఆలోచించండి. పిల్లలైన మీరు కూడా ఇటువంటి విషయాలను బాబా-బాబా అని అంటూ ఇతరులకు కూడా అర్థం చేయించండి - అప్పుడు వారు సహజంగా అర్థము చేసుకుంటారు.

ఓంశాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు కూడా తండ్రి తప్పకుండా గుర్తు రావాలి. తండ్రి మొట్టమొదట చెప్పేది మన్మనాభవ. తప్పకుండా ఇంతకుముందు కూడా చెప్పారు, అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు, ఎక్కడైనా సభలో భాషణ చేయడానికి వెళ్ళినప్పుడు, వారికైతే తండ్రి గురించి తెలియదు. కనుక శివబాబా తానే పతితపావనుడు అని అంటారు అని వారికి కూడా ఈ విధముగా చెప్పాలి. పావనంగా తయారుచేసేందుకు వారు తప్పకుండా ఇక్కడకు వచ్చి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఏ విధంగా బాబా మీకు చెప్తారో - హే పిల్లలూ, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశాను, ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందిన మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని, అదే విధంగా మీరు కూడా బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పాలి. భాషణలో ఈ విధంగా చెప్పినట్లు ఎవరి నుండి సమాచారం రాలేదు. శివబాబా చెప్తున్నారు, నన్ను ఉన్నతాతి ఉన్నతమైనవాడిగా స్వీకరిస్తారు, పతితపావనుడిగా కూడా స్వీకరిస్తారు. నేను భారతదేశములోనే వస్తాను మరియు రాజయోగమును నేర్పించేందుకు వస్తాను, నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తాను, ఉన్నతమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే ఈ తండ్రి ఇచ్చేటటువంటి దాత. మీరు తప్పకుండా భారతదేశములో విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. అప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండవు. తండ్రి పిల్లలైన మాకు అర్థం చేయిస్తారు, మేము మళ్ళీ మీకు అర్థం చేయిస్తాము. బాబా అంటున్నారు - భారతవాసులైన మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు. సర్వ గుణసంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా, దేవతా ధర్మము ఉండేది, మీరు పవిత్రంగా ఉండేవారు, కామఖడ్గమును నడిపించేవారు కాదు. చాలా ధనవంతులుగా ఉండేవారు. మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు - కారణము తెలుసా అని తండ్రి అడుగుతున్నారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి బానిసలుగా ఎందుకు అయ్యారు? అందరి నుండి అప్పులు తీసుకుంటూ ఉన్నారు. అంత ధనము ఏమైపోయింది? బాబా ఏ విధంగా భాషణ చేస్తున్నారో, అదే విధంగా మీరు కూడా భాషణ చేసినట్లయితే చాలామంది ఆకర్షితులౌతారు. మీరు తండ్రిని స్మృతి చేయరు కావున ఎవ్వరికీ బాణము తగలదు. ఆ శక్తి లభించదు. లేకపోతే ఇటువంటి భాషణ మీది ఒక్కటి విన్నా అద్భుతము జరుగుతుంది. శివబాబా అర్థము చేయిస్తున్నారు - భగవంతుడు అయితే ఒక్కరే. వారు దుఃఖహర్త - సుఖకర్త, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. ఈ భారతదేశములోనే స్వర్గముండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, ఒకే రాజ్యముండేది. అందరూ క్షీరఖండము వలె ఉండేవారు. ఏ విధంగా తండ్రి మహిమ అపారమైనదో, అదే విధంగా భారతదేశ మహిమ కూడా అపారమైనది. భారతదేశ మహిమను విని సంతోషిస్తారు. ఇంత ధన సంపదలు ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు. భక్తిమార్గములో మీరు ఎంత ఖర్చు చేస్తూ వచ్చారు. ఎన్ని మందిరాలు నిర్మించారు. మీరు పావనం నుండి పతితంగా ఎలా అయ్యారో ఆలోచించండి అని తండ్రి చెప్తున్నారు. బాబా, దుఃఖములో మిమ్మల్ని స్మరిస్తాము, సుఖములో చేయము అని కూడా అంటారు కదా. కానీ మిమ్మల్ని దుఃఖితులుగా చేసిందెవరు? పదే-పదే బాబా పేరును తీసుకుంటూ ఉండండి. మీరు బాబా సందేశాన్నిస్తారు. నేను స్వర్గాన్ని, శివాలయాన్ని స్థాపించాను, స్వర్గములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా అని బాబా అంటున్నారు. మీరు ఇది కూడా మర్చిపోయారు. రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా మీకు తెలియదు. కృష్ణుడు విశ్వానికి యజమానిగా ఉండేవారు, వారిపై కళంకాన్ని మోపారు, నాపై కూడా కళంకాన్ని మోపారు. నేను మీ సద్గతిదాతను, మీరు నన్ను పిల్లిలో, కుక్కలో, కణ-కణములో ఉన్నానని అనేస్తారు. మీరు ఎంత పతితంగా అయిపోయారు అని బాబా అంటున్నారు. సర్వుల సద్గతిదాతను, పతితపావనుడను నేను అని బాబా అంటున్నారు. మీరు మళ్ళీ పతితపావని గంగ అని అంటారు. నాతో యోగము జోడించకపోవడంతో మీరు ఇంకా పతితంగా అయిపోతారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి. పదే-పదే బాబా పేరు తీసుకుని అర్థము చేయించినట్లయతే శివబాబా గుర్తుంటారు. మేము తండ్రి మహిమ చేస్తామని చెప్పండి. నేను సాధారణ పతిత శరీరములో అనేక జన్మల అంతిమంలో వస్తానని స్వయంగా తండ్రి చెప్తున్నారు. వీరికే అనేక జన్మలుంటాయి. ఇప్పుడు వీరు నా వారిగా అయ్యారు కనుక ఈ రథము ద్వారా మీకు అర్థము చేయిస్తాను. వీరికి తన జన్మల గురించి తెలియదు. వీరు భగీరథుడు, వీరి వానప్రస్థ అవస్థలోనే నేను వస్తాను. శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు, అంటూ ఈ విధముగా భాషణ ఇవ్వడం ఎవ్వరిదీ వినలేదు. బాబా పేరును కూడా తీసుకోరు. రోజంతా బాబాను ఏ మాత్రము స్మృతి చేయరు. పరచింతనలో నిమగ్నమై ఉంటారు మరియు మేము ఈ విధంగా భాషణ చేసాము, మేము ఇది అర్థం చేయించాము అని వ్రాస్తారు. ఇప్పుడు మీరు చీమల వలె ఉన్నారు, పెద్ద పురుగులంత కూడా అవ్వలేదు, అయినా ఎంత అహంకారము ఉంటుంది అని బాబా అనుకుంటారు. శివబాబా, బ్రహ్మాబాబా ద్వారా చెప్తున్నారని అర్థము చేసుకోరు, శివబాబాను మీరు మర్చిపోతారు. బ్రహ్మా గురించి వెంటనే గొడవ చేస్తారు. మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి, మీకు నాతోనే పని ఉంది అని తండ్రి అంటున్నారు. నన్ను స్మృతి చేస్తారు కదా. కానీ తండ్రి ఎవరు, ఎప్పుడు వస్తారు అనేది మీకు కూడా తెలియదు. కల్పము లక్షల సంవత్సరాలది అని గురువులు మీకు చెప్తారు కానీ కల్పము 5 వేల సంవత్సరాలదే అని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచం మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది. క్రొత్తది మళ్ళీ పాతదిగా అవుతుంది. ఇప్పుడు క్రొత్త ఢిల్లీ ఎక్కడుంది? ఢిల్లీ పరిస్తాన్ గా అయినప్పుడు క్రొత్త ఢిల్లీ అంటారు. కొత్త ప్రపంచంలో క్రొత్త ఢిల్లీ యమునా నదీ తీరములో ఉండేది. అక్కడ లక్ష్మీనారాయణుల మహళ్ళు ఉండేవి. పరిస్తాన్ గా ఉండేది. ఇప్పుడైతే శ్మశానవాటికగా అవ్వనున్నది, అందరూ పూడ్చబడతారు, అందుకే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని తండ్రి అంటున్నారు. సదా బాబా-బాబా అని అంటూ అర్థము చేయించండి. బాబా పేరు తీసుకోకపోవడం వలన మీరు చెప్పేది ఎవ్వరూ వినడం లేదు. బాబా స్మృతి లేకపోవడంతో మీలో పదును నిండడం లేదు. మీరు దేహాభిమానములోకి వచ్చేస్తారు. బంధనములో దెబ్బలు తింటున్నవారు కూడా మీ కన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు, ఎంతగా పిలుస్తారు. తండ్రి అంటున్నారు - మీరంతా ద్రౌపదులు కదా. ఇప్పుడు మీమ్మల్ని నగ్నంగా అవ్వడం నుండి రక్షిస్తారు. మాతలలో కూడా ఇటువంటివారు కొందరుంటారు, వారికి కల్పక్రితము కూడా పూతన మొదలైన పేర్లు పెట్టారు. మీరు మర్చిపోయారు.

భారతదేశము శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు అని తండ్రి అంటున్నారు. ఇక్కడ భవనాలు, విమానాలు మొదలైనవి ఉన్నవారు, మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. ఎంత మూఢమతులుగా ఉన్నారు. ప్రతి విషయంలో బాబా చెప్తున్నారు అని చెప్పండి. ఈ హఠయోగులు మీకు ముక్తినివ్వలేరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అయినప్పుడు మళ్ళీ గురువులనెందుకు ఆశ్రయిస్తారు? మీరు సన్యాసులుగా అవ్వాలనుకుంటున్నారా లేక హఠయోగము నేర్చుకొని బ్రహ్మములో లీనమవ్వాలనుకుంటున్నారా అని అడగండి. ఎవ్వరూ లీనమవ్వలేరు. అందరూ పాత్రను అభినయించాల్సిందే. అందరూ అవినాశీ పాత్రధారులు. ఇది అనాది అవినాశీ డ్రామా, ఎవరికైనా మోక్షము ఎలా లభిస్తుంది. నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తాను అని తండ్రి అంటున్నారు. మరి గంగ పతితపావని ఎలా అవుతుంది. పతితపావనుడు అని మీరు నన్నే అంటారు కదా. నాతో యోగము తెగిపోయినందున మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ నాతో యోగము జోడించినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. ముక్తిధామంలో పవిత్రాత్మలుంటాయి. ఇప్పుడైతే మొత్తం ప్రపంచం పతితంగా ఉంది. పావన ప్రపంచము గురించి మీకు తెలియనే తెలియదు. మీరందరూ పూజారులు, ఒక్కరు కూడా పూజ్యులు లేరు. మీరు బాబా పేరు తీసుకుని అందరినీ జాగృతము చేయవచ్చు. విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రిని మీరు కూర్చుని నిందిస్తున్నారు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, సర్వ గుణసంపన్నుడు, అతడు కూర్చొని ఇటువంటి పని ఎలా చేస్తాడు. మరియు కృష్ణుడు అందరికీ తండ్రి ఎలా అవ్వగలరు. భగవంతుడు ఒక్కరే ఉంటారు కదా. నా శ్రీమతంపై నడవనంత వరకు తుప్పు ఎలా తొలగుతుంది. మీరు అందరినీ పూజిస్తూ ఉండడం వలన మీ పరిస్థితి ఏమయ్యింది, అందుకే నేను రావలసి ఉంటుంది. మీరు ఎంతగా ధర్మ, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. హిందూ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారో చెప్పండి? ఈ విధంగా గర్జిస్తూ భాషణ చేయండి. మీకు పదే-పదే తండ్రి స్మృతి రావడం లేదు. మాలో బాబానే వచ్చి భాషణ ఇచ్చినట్లుగా అనిపించింది అని అప్పుడప్పుడు కొందరు వ్రాస్తారు. బాబా చాలా సహాయము చేస్తూ ఉంటారు. మీరు స్మృతియాత్రలో ఉండరు కనుక చీమ మార్గం వంటి సేవ చేస్తున్నారు. బాబా పేరు తీసుకున్నప్పుడే ఎవరికైనా బాణము తగులుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, మీరే ఆల్ రౌండ్ 84 జన్మల చక్రమును తిరిగారు కావున మీకే వచ్చి అర్థం చేయించాల్సి ఉంటుంది. నేను భారతదేశములోనే వస్తాను. పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. నేను పూజ్యునిగా, పూజారిగా అవ్వను.

"బాబా చెప్తున్నారు, బాబా చెప్తున్నారు” అనేది పదే-పదే ధునిలా అంటూ ఉండాలి. మీరు ఈ విధంగా భాషణ చేసారని నేను విన్నప్పుడు, మీరు చీమల నుండి చిన్న పురుగులుగా అయ్యారని భావిస్తాను. నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. కేవలం నన్ను స్మృతి చేయండి అని ఈ రథము ద్వారా మీకు చెప్తాను. రథాన్ని స్మృతి చేయకూడదు. బాబా ఈ విధంగా చెప్తున్నారు, బాబా ఇది అర్థం చేయిస్తున్నారు, అని ఈ విధంగా మీరు మాట్లాడినట్లయితే మీ ప్రభావం ఎంతగా వెలువడుతుందో చూడండి. దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించండి అని తండ్రి అంటున్నారు. మీ దేహమును కూడా వదిలేస్తే ఇక మిగిలేది ఆత్మ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చాలామంది "అహమ్ బ్రహ్మస్మి”, మాయకు మేము యజమానులము అని అంటారు. మాయ అని దేనిని అంటారో మరియు సంపద అని దేనిని అంటారో కూడా మీకు తెలియదని తండ్రి అంటున్నారు. మీరు ధనాన్ని మాయ అని అనేస్తారు. ఈ విధంగా మీరు అర్థం చేయించవచ్చు. చాలా మంచి-మంచి పిల్లలు మురళీ కూడా చదవరు. తండ్రిని స్మృతి చేయకపోతే బాణము తగలదు ఎందుకంటే స్మృతిబలము లభించదు. స్మృతి ద్వారానే బలము లభిస్తుంది. ఈ యోగబలంతోనే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలూ, ప్రతి విషయంలో బాబా పేరును తీసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవ్వరూ ఏమీ అనలేరు. సర్వుల భగవంతుడైన తండ్రి ఒక్కరేనా లేక అందరూ భగవంతులేనా? మేము ఫలానా సన్యాసికి ఫాలోవర్స్ అని అంటారు. ఇప్పుడు వారు సన్యాసులు మరియు మీరు గృహస్థులు, మరి మీరు ఫాలోవర్స్ ఎలా అవుతారు? అసత్యపు మాయ, అసత్యపు శరీరము, ప్రపంచంతా అసత్యము అని కూడా పాడుతారు. సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు రానంత వరకు మనము సత్యంగా అవ్వలేము. వారొక్కరే ముక్తి-జీవన్ముక్తిదాత. వారికి చెందినవారిగా అయ్యేందుకు మిగిలినవారెవ్వరూ ముక్తినివ్వలేరు. ఇది కూడా డ్రామాలో ఉంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు అప్రమత్తంగా అయి కళ్ళు తెరవండి. బాబా ఈ విధంగా చెప్తున్నారు, అని చెప్పడం ద్వారా మీరు విముక్తులైపోతారు. మీతో ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు. త్రిమూర్తి శివబాబా అని చెప్పాలి, కేవలం శివ అని కాదు. త్రిమూర్తులను ఎవరు రచించారు? బ్రహ్మా ద్వారా ఎవరు స్థాపన చేయిస్తారు? బ్రహ్మా సృష్టికర్తనా? ఈ విధంగా నషాతో మాట్లాడండి, అప్పుడు పని చేయగలరు. లేకపోతే దేహాభిమానములో కూర్చొని భాషణ చేస్తారు.

ఇది అనేక ధర్మాల కల్పవృక్షము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదటిది దేవీదేవతా ధర్మము. ఇప్పుడు ఆ ధర్మము ఏమైయ్యింది? లక్షల సంవత్సరాలని అంటారు, ఇది 5 వేల సంవత్సరాల విషయం. మీరు వారికి మందిరాలను కూడా నిర్మిస్తూ ఉంటారు. పాండవులు మరియు కౌరవుల యుద్ధము జరిగినట్లుగా చూపిస్తారు. పాండవులు పర్వతాలపై కరిగిపోయి మరణిస్తారు, తర్వాత ఏమయ్యింది? నేను ఎలా హింస చేస్తాను. నేను మిమ్మల్ని అహింసక వైష్ణవులుగా తయారుచేస్తాను. కామ ఖడ్గాన్ని నడిపించకూడదు, అటువంటివారినే వైష్ణవులని అంటారు. వారు విష్ణు వంశావళి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి విషయంలో బాబా పేరును తీసుకోవాలి. స్మృతిలో ఉంటూ సేవ చేయాలి. పరచింతనలో మీ సమయాన్ని వ్యర్థము చేసుకోకూడదు.

2. సత్యాతి-సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. ఎటువంటి హింసా చేయకూడదు. దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-

విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వం యొక్క ఆధారమూర్త్ భవ

విశ్వకళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో బిజీగా ఉంటారో, వారికి స్వప్నంలో కూడా చాలా కొత్త-కొత్త విషయాలు, సేవా ప్లాన్లు మరియు విధానాలు కనిపిస్తాయి. వారు సేవలో బిజీగా ఉన్న కారణంగా తమ పురుషార్థములో వ్యర్థము నుండి మరియు ఇతరుల వ్యర్థము నుండి కూడా రక్షింపబడి ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వములోని ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెం కూడా నిర్లక్ష్యము రాదు. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

సంగమయుగంలోని ఒక్కొక్క సెకండు సంవత్సరాలకు సమానము కావున నిర్లక్ష్యంలో సమయాన్ని పోగొట్టుకోకండి.