10-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలనే చింత పెట్టుకోండి, ఏ విధమైన లోపము ఉండిపోకూడదు, మాయ పొరపాట్లు చేయించకూడదు”

ప్రశ్న:-

పిల్లలైన మీ నోటి నుండి ఎటువంటి శుభమైన మాటలు సదా వెలువడుతూ ఉండాలి?

జవాబు:-

మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము, తక్కువ పదవి వారిగా అవ్వము. మేమే విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ అవుతాము అనే శుభమైన మాటలను సదా మాట్లాడాలి. కానీ ఈ గమ్యము ఉన్నతమైనది కావున చాలా-చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. లక్ష్యాన్ని ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని పురుషార్థము చేస్తూ ఉండాలి, హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు.

ఓంశాంతి. తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు, మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని సోదరీ-సోదరులకు చెప్పండి. ఈ స్మృతినిప్పించాలి. ఇప్పుడు మీకు ఈ స్మృతి లభిస్తుంది. మనం ఆత్మలము, మన తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారు. మనము కూడా కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటాము. తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారము తీసుకుని వీటి ద్వారా మొట్టమొదట - తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. ఇది జ్ఞాన మార్గమని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. దీనిని భక్తి మార్గమని అనరు. జ్ఞానము కేవలం జ్ఞానసాగరుడు, పతితపావనుడు అయిన వారొక్కరే ఇస్తారు. మీకు మొదటి నంబరు పాఠముగా ఇదే లభిస్తుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా అవసరము. ఇతర ఏ సత్సంగములోనూ ఎవ్వరికీ ఇలా చెప్పడం రాదు. ఈ రోజుల్లో నకిలీ సంస్థలు అయితే చాలా వెలువడ్డాయి. మీ ద్వారా విని ఎవరైనా చెప్పినా కానీ వారు అర్థము చేసుకోలేరు. అర్థము చేయించే తెలివి ఉండదు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మీకు మాత్రమే చెప్తారు. ఇది పాత ప్రపంచమని వివేకము కూడా చెప్తుంది. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి చాలా తేడా ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. ఓ పతిత పావనా రండి, వచ్చి పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అనే పదాలున్నాయి. దేహం యొక్క సర్వ సంబంధాలను త్యాగము చేసి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహపు సంబంధాలు ఇంతకుముందు లేవు. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి - అని గాయనం కూడా ఉంది. దీని అర్థము మనుష్యులకు తెలియదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా తెలుసు. స్మృతియాత్ర ద్వారా మరియు స్మృతి బలము ద్వారా మనమిప్పుడు పావనంగా అవుతున్నాము. ఇది రాజయోగ బలము. అది హఠయోగము, దాని వలన మనుష్యులు కొంత సమయం కోసం ఆరోగ్యంగా ఉంటారు. సత్యయుగంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. హఠయోగము యొక్క అవసరము ఉండదు. ఇవన్నీ ఇక్కడ ఈ ఛీ-ఛీ ప్రపంచంలోనే చేస్తారు. ఇది ఉన్నదే పాత ప్రపంచము. సత్యయుగము కొత్త ప్రపంచము, గతించిపోయిన ఆ ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రతి ఒక్క వస్తువు కొత్తగా ఉంటుంది. మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి..... అని పాట కూడా ఉంది కదా. నవ యుగమంటే సత్యయుగము. పాత యుగమనగా కలియుగము. ఇప్పుడు దీనినెవరూ సత్యయుగమని అనరు. ఇప్పుడిది కలియుగము, మీరు సత్యయుగము కోసం చదువుతున్నారు. ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుందని చెప్పేవారు, ఈ విధంగా చదివించేవారు కూడా ఎవ్వరూ ఉండరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీకు ప్రతి విషయము స్మృతినిప్పించడం జరుగుతుంది. పొరపాట్లు చేయకూడదు. బాబా అందరికీ అర్థము చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ చేయండి. వ్యాపార వ్యవహారాలలో కొద్దిగా కష్టం ఉంటుంది కావున ఎంత వీలైతే అంత - సమయం తీసి స్మృతిలో కూర్చోండి, అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇంకే ఉపాయమూ లేదు. మీరు కొత్త ప్రపంచము కోసం రాజయోగము నేర్చుకుంటున్నారు. అక్కడకు ఇనుప యుగపు ఆత్మ వెళ్ళలేదు. ఆత్మకు గల రెక్కలను మాయ విరిచేసింది. ఆత్మ ఎగురుతుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అన్నిటికన్నా తీవ్ర వేగము గల రాకెట్. ఈ కొత్త-కొత్త విషయాలను విని పిల్లలైన మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్న రాకెట్. అందులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఇటువంటి విషయాలను మనసులో జ్ఞాపకం ఉంచుకుంటే ఉత్సాహము కలుగుతుంది. స్కూలులో విద్యార్థుల బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఏముంది? బుద్ధి అనేది శరీరంలో ఉండదు. మనసు-బుద్ధి ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే చదువుకుంటుంది. ఉద్యోగము మొదలైనవన్నీ ఆత్మనే చేస్తుంది. శివబాబా కూడా ఆత్మనే. కానీ వారిని పరమ అని అంటారు. వారు జ్ఞాన సాగరులు. వారు చాలా చిన్న బిందువు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రిలో ఉన్న సంస్కారాలే పిల్లలైన మీలో నింపబడుతున్నాయి. ఇప్పుడు మీరు యోగబలంతో పావనంగా అవుతున్నారు. దీనికోసం పురుషార్థము చేయాల్సి ఉంటుంది. మేము ఫెయిల్ అవ్వకూడదని చదువులో చింత ఉంటుంది. ఆత్మనైన నేను సతోప్రధానంగా అవ్వాలన్నదే ఇందులో మొదటి నంబరు సబ్జెక్ట్. ఏ లోపాలు మిగిలిపోకూడదు. లేకపోతే ఫెయిల్ అయిపోతారు. మాయ మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మరిపింపజేస్తుంది. చార్టు పెట్టాలి, రోజంతటిలో ఎలాంటి ఆసురీ పనులు చేయకూడదని ఆత్మ కూడా కోరుకుంటుంది. కానీ మాయ చార్టు పెట్టనివ్వదు. మీరు మాయ పంజాలోకి వచ్చేస్తారు. లెక్కాపత్రము పెట్టాలని మనసు కూడా చెప్తుంది. వ్యాపారస్థులు లాభ నష్టాల లెక్కను ఎప్పుడూ వ్రాస్తారు. మీకు ఇది చాలా పెద్ద లెక్కాపత్రము. 21 జన్మల సంపాదన, ఇందులో పొరపాటు చేయకూడదు. పిల్లలు చాలా పొరపాట్లు చేస్తారు. ఈ బాబాను పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో, స్వర్గంలో కూడా చూస్తారు. బాబా కూడా చాలా పురుషార్థము చేస్తారు. ఆశ్చర్యము కూడా కలుగుతూ ఉంటుంది. బాబా స్మృతిలోనే స్నానము చేస్తాను, భోజనము తింటాను, అయినా మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ స్మృతి చేయడం ప్రారంభిస్తాను. ఇది పెద్ద సబ్జెక్టు కదా. ఈ విషయంలో ఎలాంటి బేధాభిప్రాయాలు తలెత్తలేవు. దేహ సహితంగా దేహపు ధర్మాలన్నీ వదిలేయండి అని గీతలో కూడా ఉంది. ఇక మిగిలేది ఆత్మ. దేహాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే పతితంగా, తమోప్రధానంగా అయ్యింది. ఆత్మ నిర్లేపి అని మనుష్యులు అంటారు. ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ కావున ఆత్మకు ఏమీ అంటుకోదని అంటారు. తమోగుణీ మనుష్యులు తమోగుణీ శిక్షణనే ఇస్తారు. వారు సతోగుణీగా చేయలేరు. భక్తిమార్గంలో తమోప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు మొదట సతోప్రధానంగా ఉండి, తర్వాత రజో తమోలోకి వస్తుంది. నిర్మాణము మరియు వినాశనము జరుగుతాయి. తండ్రి కొత్త ప్రపంచ నిర్మాణము చేయిస్తారు, తర్వాత ఈ పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని రచించేవారు. ఈ పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు కదా. వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. త్రేతాయుగాన్ని కొత్త ప్రపంచమని అనరు. కలియుగాన్ని పాతదని, సత్యయుగాన్ని కొత్తదని అంటారు. ఇది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమయుగము. ఎవరైనా ఎమ్.ఎ, బి.ఎ. చదువుకుంటే ఉన్నతంగా అవుతారు కదా. మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతారు. వీరిని ఇంత ఉన్నతంగా తయారుచేసింది ఎవరు అనేది ప్రపంచం వారికి తెలియదు. ఇప్పుడు మీరు ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు అందరి జీవిత కథలు తెలుసు. ఇది జ్ఞానము. భక్తిలో జ్ఞానము ఉండదు, కేవలం కర్మకాండలను నేర్పిస్తారు. భక్తి చాలా ఎక్కువగా ఉంది. ఎంతగా వర్ణిస్తారు. చాలా అందంగా కనిపిస్తుంది. బీజములో అందమేముంటుంది, ఇంత చిన్న బీజము ఎంత పెద్దదిగా అవుతుంది. ఇది భక్తి యొక్క వృక్షము, ఎన్నో కర్మకాండలున్నాయి. జ్ఞానములో ఒకే ఒక మాట ఉంది - మన్మనాభవ. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఓ పతిత పావనా, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు అంటారు కూడా. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ పావనంగా, సుఖంగా ఉంటారు. రామరాజ్యము, రావణరాజ్యము అనే పేర్లు అయితే ఉన్నాయి. రామరాజ్యము గురించి పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. 84 జన్మల రహస్యము కూడా మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. భగవానువాచ - మన్మనాభవ అని అంటూ ఉంటారు. మీరు పూర్తి 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది ఎవ్వరూ అర్థము చేయించలేరు. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. గీతను వినిపించేవారి వద్దకు వెళ్ళి - గీత గురించి వారు ఏమి చెప్తున్నారో వినండి. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానము చుక్క చుక్క పడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని బాబా అడుగుతారు. అవును బాబా, కల్పక్రితము కలిసాము అని అంటారు. బాబా అడుగుతారు మరియు మీరు అర్థ సహితంగా జవాబు చెప్తారు. అంతేగానీ చిలుక వలె మాట్లాడుతారని కాదు. ఎందుకు కలిసారు, ఏం పొందారు అని మళ్ళీ బాబా అడుగుతారు. మేము విశ్వరాజ్యాన్ని పొందాము అని మీరు చెప్పవచ్చు, ఇందులో అంతా వచ్చేస్తుంది. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యామని మీరంటారు కానీ విశ్వానికి యజమానులుగా అవ్వడం అంటే అందులో రాజా, రాణి మరియు దైవీ వంశము అందరూ ఉంటారు. విశ్వానికి రాజా, రాణి, ప్రజలు అందరూ యజమానులుగా అవుతారు. దీనినే శుభం పలకడం అని అంటారు. మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము, తక్కువగా అవ్వము. సరే పిల్లలూ, పూర్తి పురుషార్థము చేయండి అని తండ్రి అంటారు. ఈ పరిస్థితిలో నేను ఉన్నతపదవిని పొందగలనా లేదా, ఎంతమందికి మార్గాన్ని తెలియజేసాను, ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాను అని మీ లెక్కాపత్రాన్ని కూడా చూసుకోవాలి. ఒకవేళ సేవ చేయడం లేదంటే మేము ప్రజలలోకి వెళ్ళిపోతామని అర్థము చేసుకోవాలి. ఒకవేళ నేను ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తే ఏం పదవిని పొందుతాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది చాలా గొప్ప గమ్యము కనుక జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు, మేమైతే స్మృతే చేయడం లేదు కావున ఇక లెక్కాపత్రము పెట్టి ఏం చేస్తాము అని భావిస్తారు. దీనిని హార్ట్ ఫెయిల్ అని అంటారు. వారు చదువును కూడా ఇలానే చదువుతారు. ధ్యానం పెట్టరు. నాకు అన్నీ తెలుసు అని కూర్చుండిపోకూడదు, అలా చేస్తే చివర్లో ఫెయిల్ అయిపోతారు. మీ కళ్యాణము చేసుకోవాలి. లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మేము చదువుకొని ఇలా తయారవ్వాలి. ఇది కూడా ఆశ్చర్యం కదా. కలియుగంలోనైతే రాజ్యము లేదు. మరి సత్యయుగంలో వీరికి రాజ్యం ఎక్కడ నుండి వచ్చింది. అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. అంతేకానీ దేవతలకు మరియు అసురులకు యుద్ధము జరిగింది, దేవతలు విజయం పొంది రాజ్యము పొందారని కాదు. ఇప్పుడు అసురులకు మరియు దేవతలకు యుద్ధము ఎలా జరుగుతుంది. కౌరవులకు మరియు పాండవులకు కూడా యుద్ధము జరగదు. యుద్ధమనే విషయమే నిషేధించబడుతుంది. దేహం యొక్క సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారని మొదట చెప్పండి. ఆత్మలైన మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. పవిత్రాత్మలు మాత్రమే తిరిగి వెళ్ళగలవు. తమోప్రధాన ఆత్మలు వెళ్ళలేవు. ఆత్మ రెక్కలు తెగిపోయాయి. మాయ పతితంగా చేసింది. తమోప్రధానంగా అయిన కారణంగా అంత దూరంలో ఉన్న ఆ హోలీ (పవిత్ర) స్థానానికి వెళ్ళలేవు. వాస్తవానికి మేము పరంధామములో నివసించేవారమని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. పాత్రను అభినయించేందుకు ఇక్కడ ఈ పంచ తత్వాల బొమ్మను తీసుకుంది. మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఎవరు? అక్కడకు వెళ్ళింది ఆత్మనా లేక శరీరమా? శరీరమైతే కాలిపోయింది. ఇక మిగిలింది ఆత్మ. ఆత్మ స్వర్గములోకైతే వెళ్ళలేదు. మనుష్యులు ఎవరు ఏది వినిపిస్తే అది చెప్తూ ఉంటారు. భక్తిమార్గము వారు భక్తినే నేర్పించారు, కర్తవ్యాలను గురించి ఎవ్వరికీ తెలియదు. శివుని పూజ అన్నిటికన్నా ఉన్నతమైనదని అంటారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివుడు, వారినే స్మృతి చేయండి, స్మరించండి. మాలను కూడా ఇస్తారు. శివ-శివ అని అంటూ మాలను తిప్పుతూ ఉండండి. అర్థము లేకుండా మాలను తిప్పుతూ శివ-శివ అని అంటూ ఉంటారు. గురువులు అనేక రకాల శిక్షణలను ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒకటే విషయము - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి అని స్వయంగా తండ్రి చెప్తారు. శివ-శివ అని నోటితో అనకూడదు. తండ్రి పేరును కొడుకు స్మరణ చేయడు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే కల్పక్రితము అర్థము చేసుకున్నారో, వారే అర్థము చేసుకుంటారు. కొత్త-కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. మున్ముందు డ్రామా ఏం చూపిస్తుందో, దానిని సాక్షీగా అయి చూడాలి. ఇలా-ఇలా జరుగుతుందని మొదటే బాబా సాక్షాత్కారము చేయించరు. అప్పుడు ఆర్టిఫీషియల్ అయిపోతుంది. ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. మీకు తెలివి లభించింది, భక్తిమార్గములో తెలివితక్కువవారిగా ఉండేవారు. డ్రామాలో భక్తి కూడా నిశ్చితమై ఉందని మీకు తెలుసు.

మనము ఈ పాత ప్రపంచంలో ఉండేవారము కాము అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. విద్యార్థులకు ఈ చదువు బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా ముఖ్యమైన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. నంబరు వన్ విషయమైన అల్ఫ్ ను పక్కా చేసిన తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే అనవసరమైనవి అడుగుతూ ఉంటారు. గీతా భగవంతుడు శివుడు, ఇది పూర్తిగా కరెక్ట్ అని ఫలానావారు రాసి ఇచ్చారని పిల్లలు వ్రాస్తారు. అలా అంటారు కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఒకవేళ తండ్రి వచ్చారని అర్థము చేసుకుంటే, అటువంటి తండ్రిని మేము వెళ్ళి కలుసుకుంటాము, వారసత్వము తీసుకుంటామని అంటారు. ఒక్కరికి కూడా నిశ్చయం కూర్చోదు. ఒక్కరి నుండి కూడా వెంటనే ఉత్తరము రాదు. జ్ఞానము చాలా బాగుందని కూడా వ్రాస్తారు, కానీ వాహ్ ఎటువంటి తండ్రి, ఇంత సమయము మీ నుండి దూరంగా ఉన్నాము, భక్తిమార్గంలో ఎదురుదెబ్బలు తిన్నాము, ఇప్పుడు ఆ తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చారని అర్థము చేసుకునేంత ధైర్యము ఉండదు. అలా ఉంటే, పరుగెత్తుకుని వచ్చేవారు. అటువంటివారు మున్ముందు వెలువడుతారు. ఒకవేళ భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారని తండ్రిని గుర్తించినట్లయితే వారికి చెందినవారిగా అవ్వండి కదా. వారి బుద్ధి తెరుచుకునే విధంగా వారికి అర్థము చేయించాలి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం తీసి స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎప్పుడూ ఎలాంటి ఆసురీ కర్మలు చేయకూడదు.

2. స్వ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. చదువు చదువుకోవాలి మరియు చదివించాలి, నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. స్మృతి బలమును జమా చేసుకోవాలి.

వరదానము:-

సాకార తండ్రిని ఫాలో చేసి నంబరు వన్ తీసుకునే సంపూర్ణ ఫరిస్తా భవ

నంబర్ వన్ గా వచ్చేందుకు సహజ సాధనం - నంబర్ వన్ అయిన బ్రహ్మాబాబా ఒక్కరినే చూడండి. అనేకులను చూసేందుకు బదులుగా ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే ఫాలో చేయండి. హంసో ఫరిస్తా (నేనే ఫరిస్తాను) అనే మంత్రాన్ని పక్కా చేసుకున్నట్లయితే వ్యత్యాసము తొలగిపోతుంది, ఇక తర్వాత సైన్సు యంత్రము తన పనిని ప్రారంభిస్తుంది మరియు సంపూర్ణ ఫరిస్తాలైన మీరు, దేవతలుగా అయి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. కనుక సంపూర్ణ ఫరిస్తాలుగా అవ్వడం అనగా సాకార తండ్రిని ఫాలో చేయడం.

స్లోగన్:-

మననం చేయడం ద్వారా వెలువడే సంతోషం రూపీ వెన్నయే - జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది.