11-01-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము


“ మధురమైన పిల్లలారా - 21 జన్మలు సదా సుఖంగా ఉండేందుకు ఈ కొద్ది సమయములో ఆత్మాభిమానులుగా అయ్యే అలవాటు చేసుకోండి.’’

ప్రశ్న :-

దైవీ రాజధాని స్థాపన చేసేందుకు ప్రతి ఒక్కరికి ఏ ఆసక్తి ఉండాలి ?

సమా :-

సర్వీసు చేయు ఆసక్తి. జ్ఞానరత్నాల దానమెలా చేయాలనే ఆసక్తి ఉంచుకోండి. మీది పతితులను పావనముగా చేయు మిషన్(సంస్థ). కనుక రాజ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు పిల్లలు చాలా బాగా సేవ చేయాలి. ఎక్కడైనా మేళాలు మొదలైనవి జరిగితే జనులు స్నానము చేసేందుకు వెళ్తారు. అచ్చట కరపత్రాలు ప్రింటు చేయించి పంచాలి, దండోరా వేయించాలి.

పాట :-

మిమ్ములను పొందుకొని మేము ప్రపంచాన్నే పొందాము,............(తుమ్హె పాకె హవ్ునే,.............. )

ఓంశాంతి.

. నిరాకార శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మనము ఆత్మలము. మనలను తండ్రి చదివిస్తున్నారు. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయని తండ్రి తెలిపించారు. మాయా రావణుని రాజ్యము వచ్చినప్పుడు అనగా భక్తిమార్గము ప్రారంభమైనప్పుడు దేహాభిమానులుగా అవుతారు. భక్తిమార్గము అంతమైనప్పుడు తండ్రి మళ్లీ వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ‘‘ ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి’’. మీరు చేసిన జపము, తపము, పుణ్యము మొదలైన వాటితో మీకు ఎలాంటి లాభము కలగలేదు. మీలో పంచ వికారాలు ప్రవేశమైనందున మీరు దేహాభిమానులుగా అయ్యారు. రావణుడే మిమ్ములను దేహాభిమానులుగా చేస్తాడు. వాస్తవానికి మీరు దేహీ- అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ స్వయాన్ని ఆత్మగా భావించండని ప్రాక్టీసు చేయించబడ్తుంది. మనము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలి. సత్యయుగములో ఈ పంచ వికారాలు ఉండవు. దేవీదేవతలు శ్రేష్ఠమైన పావనులుగా ఉంటారు. వారు సదా ఆత్మాభిమానులుగా ఉండుట వలన 21 జన్మలు సదా సుఖంగా ఉంటారు. మళ్లీ రావణ రాజ్యము వచ్చినప్పుడు మీరు దేహాభిమానులుగా మారిపోతారు. వీరిని ఆత్మాభిమానులని, వారిని దేహాభిమానులని అంటారు. నిరాకార ప్రపంచములో అయితే దేహాభిమానము, ఆత్మాభిమానమనే ప్రశ్నే ఉండదు. అది సైలెన్స్ ప్రపంచము. ఈ సంస్కారము ఈ సంగమ యుగములోనే ఉంటుంది. మిమ్ములను దేహాభిమానుల నుండి దేహీ-అభిమానులుగా చేయడం జరుగుతుంది. సత్యయుగములో మీరు దేహీ-అభిమానులుగా ఉండుట వలన దు:ఖముండదు. ఎందుకనగా మేము ఆత్మలమనే జ్ఞానముంటుంది. ఇచ్చట అందరూ స్వయాన్ని దేహమని భావిస్తారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయితే వికర్మలు వినాశనమౌతాయి. మళ్లీ మీరు వికర్మాజీతులుగా అయిపోతారు. శరీరము కూడా ఉంటుంది. రాజ్యపాలన కూడా చేస్తారు. ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇచ్చట మీకు ఇచ్చు శిక్షణ వలన మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. సదా సుఖంగా ఉంటారు. ఆత్మాభిమానులుగా అవుతేనే మీ వికర్మలు వినాశనమౌతాయి అందుకు బాబా తెలుపుచున్నారు - నన్ను స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. వారు వెళ్లి గంగా స్నానము చేస్తారు కానీ గంగానది పతితపావని కాదు. కర్మలు భస్మమయ్యే యోగాగ్ని కూడా కాదు. ఇటువంటి సమయములో పిల్లలైన మీకు సేవ చేయు అవకాశము లభిస్తుంది. సమయాన్ని బట్టి సేవ చేయాలి. స్నానము చేసేందుకు అనేకమంది వెళ్తారు. కుంభమేళాలో అన్ని చోట్ల స్నానము చేస్తారు. కొంతమంది నదుల వద్దకు, కొంతమంది సాగరము వద్దకు కూడా వెళ్తారు. కావున అందరికీ పంచేందుకు చాలా కరపత్రాలు అచ్చు వేయించాల్సి వస్తుంది. బాగా పంచాలి. కేవలము ఒక పాయింటు ఉండాలి. సోదరీ-సోదరులారా! ఆలోచించిండి - పతితపావనులు జ్ఞానసాగరులు, వారి నుండి వెలువడిన జ్ఞాన నదుల ద్వారా మీరు పావనంగా అవ్వగలరా ? లేక నీటి సాగరము లేక నీటి నదుల ద్వారా మీరు పావనంగా అవ్వగలరా ? ఈ చిక్కు ప్రశ్నను పరిష్కరిస్తే మీరు ఒక్క సెకెండులో జీవన్ముక్తి పొందగలరు. రాజ్యభాగ్య వారసత్వాన్ని కూడా పొందగలరు. ఇటువంటి కరపత్రాలు ప్రతి సెంటరు వారు ప్రింటు వేయించుకోవాలి. ప్రపంచములో అన్ని చోట్ల నదులున్నాయి. నదులు చాలా దూరము నుండి వస్తాయి. అనేకచోట్ల చాలా నదులు ఉన్నాయి. మరి ఆ నదులలోనే స్నానము చేస్తే పావనమౌతారని ఎందుకంటారు? ఇంత ఖర్చు పెట్టి కష్టపడి ఒక్క చోటుకే ఎందుకు వెళ్తారు? ఒక రోజు స్నానము చేస్తూనే పావనంగా అవ్వరు. స్నానము జన్మ-జన్మాంతరాలుగా చేస్తూనే ఉన్నారు. సత్యయుగములో కూడా స్నానము చేస్తారు. అచ్చట ఉండేదే పవిత్రమైనవారు. ఇక్కడైతే చలిలో ఎంతో కష్టపడి స్నానము చేసేందుకు వెళ్తారు. కావున వారికి అర్థం చేయించాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. బాగా మేల్కొల్పాలి. పతితపావనులు వచ్చి పావనంగా చేస్తారు. కావున దు:ఖములో ఉన్నవారికి దారి చూపాలి. ఈ చిన్న చిన్న కరపత్రాలను అన్ని భాషలలో ప్రింటు చేయించి ఉండాలి. 1-2 లక్షలు అచ్చు వేయించాలి. ఎవరి బుద్ధిలో జ్ఞాన నషా ఉంటుందో, వారి బుద్ధి పని చేస్తుంది. ఈ చిత్రాలు 2-3 లక్షలు ప్రతి భాషలో ఉండాలి. అన్ని చోట్ల సర్వీసు చేయాలి. ముఖ్యమైనది ఒకే పాయింటు - ‘‘ముక్తి-జీవన్ముక్తి సెకెండులో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి.’’ అందులో ముఖ్య సెంటర్ల అడ్రస్సులు అచ్చు వేయించండి. వారు చదువుకోనీ, చదువుకోకపోనీ. మీరు అచ్చు వేయించాలి. పిల్లలైన మీరు త్రిమూర్తి చిత్రము పై అర్థం చేయించాలి - బ్రహ్మ ద్వారా తప్పక స్థాపన జరుగుతుంది. రోజు రోజుకు వినాశనము దగ్గరలో ఉందని మనుష్యులు అర్థము చేసుకుంటూ పోతారు. జగడాలు మొదలైనవి పెరుగుతూనే ఉంటాయి. ఆస్తుల పై ఎన్నో గొడవలు జరుగుతాయి. కొందరు కొట్టుకుంటారు. వినాశనమైతే సమీపములో ఉండనే ఉంది. ఎవరైతే గీత, భాగవతము మొదలైనవన్నీ బాగా చదువుకొని ఉంటారో, వారు ఇది కల్పక్రితము కూడా జరిగిందని అర్థము చేసుకుంటారు. కావున పిల్లలైన మీరు మంచిరీతిగా అర్థం చేయించాలి- నీటిలో స్నానము చేయుట వలన మనుష్యులు పతితుల నుండి పావనమౌతారా? లేక యోగాగ్నితో పావనమౌతారా? భగవానువాచ - నన్ను స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమౌతాయి. మీ సెంటర్లు ఎచ్చటెచ్చట ఉన్నాయో, విశేష సమయాలలో ఇటువంటి కరపత్రాలు పంచాలి. మేళాలు చాలా జరుగుతాయి. అక్కడకు అనేకమంది మనుష్యులు వెళ్తారు. కానీ చాలా కష్టము మీద అర్థము చేసుకుంటారు. కరపత్రాలు పంచేందుకు కూడా చాలామంది కావాలి. వారు ఇతరులకు అర్థం చేయించగలగాలి. అటువంటి చోట నిలబడి ఉండాలి. ఇవి జ్ఞానరత్నాలు. సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉండాలి. మనము మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము కదా. ఇది మనుష్యులను దేవతలుగా అనగా పతితులను పావనంగా చేయు సంస్థ. ఇది కూడా మీరు వ్రాయండి - తండ్రి ‘మన్మనాభవ’ అని తెలియజేస్తున్నారు. పతితపావనులైన బేహద్ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. యాత్ర పాయింటు కూడా పిల్లలైన మీకు మాటి మాటికి తెలియజేయబడ్తుంది. తండ్రిని క్షణ-క్షణము స్మృతి చేయండి. స్మరణ చేసి-చేసి సుఖము పొందుకోండి(సిమిర్ సిమిర్ సుఖ్ పావో). శరీర కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి అనగా మీరు సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. తండ్రి మంత్రమునిచ్చారు - ‘‘నన్ను స్మరణ చేయండి అనగా స్మృతి చేయండి.’’ అంతేకానీ శివ-శివ అని కూర్చొని స్మరణ చేయమని కాదు. శివుని భక్తులు శివ-శివ అంటూ మాల జపిస్తూ ఉంటారు. వాస్తవానికి రుద్రమాల అనగా శివుడు మరియు సాలిగ్రామాలు. పైన శివుడుంటాడు. మిగిలిన చిన్న చిన్న పూసలు అనగా ఆత్మలు. ఆత్మ చాలా చిన్న బిందువు. నల్ల పూసల మాల కూడా ఉంటుంది. శివుని మాల కూడా తయారు చేయబడి ఉంది. ఆత్మలు తమ తండ్రిని స్మృతి చేయాలి. నోటితో శివ-శివ అని అనరాదు. శివ-శివ అని అంటూ ఉంటే బుద్ధియోగము మళ్లీ మాల పైకి పోతుంది. అర్థమైతే ఎవ్వరూ తెలుసుకోరు. శివ-శివ అని జపించినందున వికర్మలు వినాశనము కావు. వికర్మలు ఎప్పుడు వినాశనమవుతాయో మాల తిప్పేవారి వద్ద జ్ఞానము లేదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని సంగమ యుగములో డైరెక్టుగా శివబాబా వచ్చి తెలుపుతారు. ‘మామేకవ్ు యాద్ కరో’ అని మంత్రమును ఇస్తారు. శివ-శివ అని కూర్చుని ఎన్నిసార్లు జపించినా వికర్మలు వినాశనము కావు. కాశీకి కూడా పోయి అచ్చటనే ఉంటారు. శివకాశి, శివకాశి అంటూ ఉంటారు. కాశీలో శివుని ప్రభావముందని అంటారు. శివుని మందిరాలు చాలా విశాలంగా, వైభవంగా నిర్మింపబడి ఉన్నాయి. ఇవన్నీ భక్తిమార్గపు సామాగ్రి.

నాతో యోగము జోడిస్తే పావనమౌతారని బేహద్ తండ్రి తెలియజేస్తున్న విషయాన్ని మీరు అందరికీ తెలుపగలరు. పిల్లలకు సర్వీసు చేయు ఆసక్తి ఉండాలి. తండ్రి అంటున్నారు - నేను పతితులను పావనంగా చేయాలి. పిల్లలైన మీరు కూడా పావనంగా చేయు సేవ చేయండి. కరపత్రాలు తీసుకెళ్లి అర్థం చేయించండి. ఈ కరపత్రము శ్రద్ధగా చదవమని అందరికీ చెప్పండి. మృత్యువు సమీపంగా నిల్చొని ఉంది. ఇది దు:ఖధామము. ఇప్పుడు జ్ఞాన స్నానము ఒక్కసారి చేస్తే, ఒక్క సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. తర్వాత నదులలో స్నానము చేసేందుకు తిరిగే అవసరమేముంది ? మాకు సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకే దండోరా వేయిస్తున్నాము. లేకుంటే ఎవ్వరూ ఇటువంటి కరపత్రాలు అచ్చు వేయించలేరు. పిల్లలకు సేవ చేసే ఆసక్తి చాలా ఉండాలి. తయారు చేయించిన చిక్కు ప్రశ్నలు కూడా సేవ కొరకే. చాలామందికి సేవ పై ఆసక్తి లేదు. సేవ ఎలా చేయాలనే ధ్యాసనే ఉండదు. అందుకు మంచి చమత్కార బుద్ధి కావాలి. ఎవరి కాళ్ళలో దేహాభిమానపు గొలుసులు(సంకెళ్ళు) ఉంటాయో, వారు దేహీ-అభిమానులుగా అవ్వలేరు. వీరు వెళ్లి ఏ పదవి పొందుతారనే భావము కలుగుతుంది. వారి పై జాలి కలుగుతుంది. అన్ని సెంటర్లలో ఎవరెవరు పురుషార్థములో చాలా తీవ్రంగా వెళ్తున్నారో చూడబడ్తుంది. కొంతమంది జిల్లేడు పూలు కూడా ఉన్నారు. కొంతమంది గులాబి పుష్పాలు కూడా ఉన్నారు. మేము ఫలానా పుష్పాలు అని మనకు తెలుసు. బాబా సేవ చేయకుంటే మనము జిల్లేడు పూలుగా అవుతామని అర్థం చేసుకోవాలి. తండ్రి చాలా మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. మీరు వజ్ర సమానంగా తయారయ్యే పురుషార్థము చేస్తున్నారు. కొంతమంది సత్యమైన వజ్రాలు, కొంతమంది నల్లగా, మసకగా కూడా ఉన్నారు. నేను వజ్ర సమానంగా తయారవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ స్వయంలో ఉండాలి. నేను వజ్ర సమానముగా అయినానా ? - అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ , ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. దేహాభిమాన సంకెళ్ళను తెంచి వేసి దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండు సంస్కారమును అలవాటు చేసుకోవాలి.

2. సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. తండ్రి సమానంగా పతితుల నుండి పావనంగా చేయు సేవ చేయాలి. సత్యమైన వజ్రముగా తయారవ్వాలి.

వరదానము :-

‘‘ శ్రేష్ఠ మరియు శుభ వృత్తి ద్వారా వాచా మరియు కర్మను శ్రేష్ఠంగా చేసుకునే విశ్వ పరివర్తక భవ ’’

ఏ పిల్లలైతే తమ బలహీన వృత్తులను తొలగించి శుభమైన శ్రేష్ఠ వృత్తిని ధారణ చేసే వ్రతము తీసుకుంటారో, వారికి ఈ సృష్టి కూడా శ్రేష్ఠంగా కనిపిస్తుంది. వృత్తితో దృష్టికి, కృతికి(కర్మకు) కూడా సంబంధముంది. ఏదైనా మంచి లేక చెడు విషయము వృత్తిలో ధారణ అవుతుంది. తర్వాత వాణిలో, కర్మలో వస్తుంది. వృత్తి శ్రేష్ఠముగా అవ్వడమనగా వాణి మరియు కర్మ స్వతహాగా శ్రేష్ఠమగుట. వృత్తి ద్వారానే వైబ్రేషన్లు, వాయుమండలం తయారవుతుంది. శ్రేష్ఠ వృత్తి అనే వ్రతాన్ని ధారణ చేసేవారు స్వతహాగా విశ్వపరివర్తకులుగా అయిపోతారు.

స్లోగన్ :-

‘‘ విదేహీ లేక అశరీరిగా అయ్యే అభ్యాసము చేస్తే, ఎవరి మనోభావమునైనా తెలుసుకోగలరు ’’