11-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు అతి ప్రియాతి ప్రియమైన శివబాబా వచ్చారు, మీరు వారి శ్రీమతంపై నడవండి”

ప్రశ్న:-

మనుష్యులు పరమాత్ముని గురించి ఏ రెండు విషయాలను ఒకదానికొకటి భిన్నంగా చెప్తారు?

జవాబు:-

ఒకవైపు పరమాత్మ అఖండ జ్యోతి అని అంటారు మరియు ఇంకొకవైపు వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి భిన్నమైపోతాయి. యథార్థ రూపంలో తెలియని కారణంగానే పతితులుగా అవుతూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు వారు తమ సత్యమైన పరిచయాన్ని ఇస్తారు.

గీతము:-

మరణించినా నీ దారిలోనే..... (మర్నా తేరీ గలీ మే.....)

ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. ఎవరైనా మరణించినప్పుడు, వారు ఇంకొక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. తండ్రి వద్ద జన్మ తీసుకున్నారని అంటారు, తల్లి పేరును తీసుకోరు. తండ్రికి అభినందనలు తెలుపడం జరుగుతుంది. మేము ఆత్మలమని పిల్లలైన మీకిప్పుడు తెలుసు, అది శరీరానికి సంబంధించిన విషయము. ఒక శరీరాన్ని వదిలి మరో తండ్రి వద్దకు వెళ్తారు. మీరు 84 జన్మలలో 84 సాకార తండ్రులను పొందారు. వాస్తవానికి మీరంతా నిరాకార తండ్రి పిల్లలు. ఆత్మలైన మీరు, పరమపిత పరమాత్ముని పిల్లలు. మీరు అక్కడే నివసించేవారు, దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని అంటారు. నిజానికి మీరు అక్కడ నివసించేవారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. ఇక్కడకు వచ్చి మీరు లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు, అప్పుడు ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యయుగంలో కూడా మీరు సుఖవంతులుగా అయినప్పుడు ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖములో ఆ తండ్రిని ఎవరూ స్మరించరు. దుఃఖములో స్మరిస్తారు. స్మృతి కూడా ఆత్మయే చేస్తుంది. లౌకిక తండ్రిని స్మరించినప్పుడు బుద్ధి శరీరము వైపు ఉంటుంది. ఈ బాబా (బ్రహ్మా) వారిని (శివబాబాను) స్మృతి చేస్తే, ఓ బాబా! అని అంటారు. నిజానికి ఇరువురూ బాబానే (తండ్రులే). బాబా అన్నది సరైన పదము. వీరూ తండ్రియే, వారూ తండ్రియే. ఆత్మ ఆ ఆత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి అక్కడకు వెళ్తుంది. ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు బాబా వచ్చారని, మనల్ని తమవారిగా చేసుకున్నారని మీకు తెలుసు. తండ్రి అంటారు - మొట్టమొదట నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను. మీరు చాలా చాలా షావుకార్లుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు తీసుకుని డ్రామా ప్లాను అనుసారంగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు డ్రామానుసారంగా పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మీ ఆత్మ మరియు శరీరమనే వస్త్రము, రెండూ సతోప్రధానంగా ఉండేవి, తర్వాత బంగారు యుగము నుండి వెండి యుగములోకి ఆత్మ వచ్చినప్పుడు శరీరము కూడా వెండి యుగములోకి వచ్చింది, తర్వాత రాగి యుగములోకి వచ్చింది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా పతితమైపోయింది కావున శరీరము కూడా పతితంగా ఉంది. 14 క్యారెట్ల బంగారమును ఎవరూ ఇష్టపడరు కదా. అది నల్లగా అయిపోతుంది. మీరు కూడా ఇప్పుడు నల్లగా, ఇనుప యుగము వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మ మరియు శరీరము, మళ్ళీ పవిత్రంగా ఎలా అవుతాయి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? గంగా స్నానము చేయడం ద్వారా జరుగుతుందా? కాదు. ఓ పతితపావనా.... అని పిలుస్తారు. ఆత్మయే ఇలా అంటుంది. ఓ బాబా! అని అంటూనే బుద్ధి పారలౌకిక తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. బాబా అన్న పదము ఎంత మధురంగా ఉందో చూడండి. భారత్ లోనే బాబా-బాబా అని అంటారు. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అయి బాబాకు చెందినవారిగా అయ్యారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను. మీరు కొత్త శరీరాన్ని ధారణ చేసారు. ఇప్పుడు మీరు ఎలా అయిపోయారు. ఈ విషయాలు సదా లోలోపల ఉండాలి. బాబానే స్మృతి చేయాలి. ఓ బాబా, ఆత్మలమైన మేము పతితంగా అయిపోయాము, ఇప్పుడు మీరు వచ్చి పావనంగా చేయండి అని స్మృతి కూడా చేస్తారు కదా. డ్రామాలో కూడా ఈ పాత్ర ఉంది కావుననే పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే పాత ప్రపంచం నుండి కొత్తదిగా అవ్వనున్నదో, అప్పుడు తప్పకుండా సంగమ యుగములోనే వస్తారు.

వీరు అతి ప్రియాతి ప్రియమైన తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ (మధురము, అతి మధురము, మధురాతి మధురము) అని కూడా అంటారు. ఇప్పుడు మధురమైనవారు ఎవరు? లౌకిక సంబంధంలో మొదట జన్మనిచ్చే తండ్రి, తర్వాత టీచరు, అతను మంచివారు ఉంటారు, అతని ద్వారా చదువుకొని పదవిని పొందుతారు. నాలెడ్జ్ ఇజ్ సోర్స్ ఆఫ్ ఇన్ కమ్ (జ్ఞానము సంపాదనకు ఆధారము) అని అంటారు. జ్ఞానము అంటే నాలెడ్జ్. యోగము అంటే స్మృతి. కావున ఏ అనంతమైన తండ్రి అయితే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశారో, వారిని ఇప్పుడు మీరు మర్చిపోయారు. శివబాబా ఎలా వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు. బ్రహ్మా ద్వారా శివబాబా స్థాపన చేయిస్తారు. కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? సత్యయుగము కోసమే రాజయోగాన్ని నేర్పిస్తారు కావున తప్పకుండా సంగమయుగంలో తండ్రియే నేర్పించి ఉంటారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు బాబా. శివబాబా ఇతని ద్వారా చేయిస్తారు, వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. వారు త్రిమూర్తి బ్రహ్మా అని అనేస్తారు. ఉన్నతోన్నతమైనవారు శివుడు కదా. ఇతను సాకారుడు, వారు నిరాకారుడు. సృష్టి కూడా ఇక్కడే ఉంది. ఈ సృష్టిచక్రమే సదా తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మవతనం యొక్క సృష్టి చక్రము అని అనరు. మనుష్యుల ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతుంది. సూక్ష్మవతనంలో చక్రము మొదలైనవేవీ ఉండవు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయని పాడుతారు కూడా. అది ఇక్కడి విషయము. సత్య యుగము, త్రేతా యుగము.... మధ్యలో తప్పకుండా సంగమయుగము ఉండాలి. లేకపోతే కలియుగాన్ని సత్యయుగంగా ఎవరు తయారుచేస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి సంగమయుగములో వస్తారు. ఇది హైయ్యెస్ట్ అథారిటీ గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ (ఉన్నతోన్నతమైన అథారిటీ అయిన ఈశ్వరీయ ప్రభుత్వము). వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదని ఆత్మ అంటుంది. ఏ దేవతా మందిరానికి వెళ్ళినా, వారి ముందుకు వెళ్ళి ఇలాగే అంటారు. వాస్తవానికి అలా తండ్రితో అనాలి. కానీ వారిని వదిలి సోదరులను (దేవతలను) పట్టుకున్నారు. ఈ దేవతలు సోదరులు కదా. సోదరుల నుండి ఏమీ లభించేది లేదు. సోదరుల పూజలు చేస్తూ-చేస్తూ క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని, వారి ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి గురించే తెలియదు, సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు అఖండ జ్యోతి తత్వమని అంటారు. వారు నామ రూపాలకు అతీతమైనవారని కొందరు అంటారు. వారు అఖండ జ్యోతి స్వరూపమైతే, మరి వారిని నామ రూపాలకు అతీతమైనవారని ఎలా అనగలరు. తండ్రి గురించి తెలియని కారణంగానే పతితంగా అయిపోయారు. తమోప్రధానంగా కూడా అవ్వవలసిందే. తండ్రి వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ సతోప్రధానంగా చేస్తారు. నిరాకార ప్రపంచంలో ఆత్మలన్నీ తండ్రితో పాటు ఉంటాయి, తర్వాత ఇక్కడ సతో, రజో, తమోలోకి వచ్చి పాత్రను అభినయిస్తాయి. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వస్తారు, నేను బ్రహ్మా తనువును ఆధారంగా తీసుకుంటానని కూడా అంటారు. ఇది భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథము ఉండదు. ఇదే జ్ఞాన వర్షమని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థము చేయించారు. ఇది జ్ఞానము, దీని ద్వారా ఏమవుతుంది? పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచంగా అవుతుంది. గంగా యమునలు సత్యయుగంలో కూడా ఉంటాయి. కృష్ణుడు యమునా నదీ తీరములో ఆడుకునేవారని అంటారు. అటువంటి విషయాలేవీ లేవు. వారు సత్యయుగ రాకుమారుడు. వారిని చాలా బాగా సంభాళిస్తారు ఎందుకంటే వారు పుష్పము కదా. పుష్పాలు ఎంత మంచిగా, సుందరంగా ఉంటాయి. అందరూ వచ్చి పుష్పాల నుండి సుగంధం తీసుకుంటారు. ముళ్ళ నుండి ఎవరూ సుగంధాన్ని తీసుకోరు. ఇప్పుడిది ముళ్ళ ప్రపంచము. ముళ్ళ అడవిని తండ్రి వచ్చి పుష్పాల తోటగా తయారుచేస్తారు, అందుకే వారికి బబుల్ నాథ్ అన్న పేరును కూడా పెట్టేశారు. వారు కూర్చుని ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు కావుననే ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే బాబా అని మహిమ చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రీతి ఉండాలి. ఆ లౌకిక తండ్రి అయితే మిమ్మల్ని మురికి కాలువలో పడేస్తారు. ఈ తండ్రి 21 జన్మల కోసం మిమ్మల్ని మురికి కాలువ నుండి బయటకు తీసి పావనంగా చేస్తారు. ఆ తండ్రి మిమ్మల్ని పతితంగా చేస్తారు కావుననే లౌకిక తండ్రి ఉన్నా కూడా ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తుంది.

అర్ధకల్పము తండ్రిని స్మృతి చేశామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి తప్పకుండా వస్తారు కూడా. శివజయంతిని జరుపుకుంటారు కదా. మనము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు మన సంబంధం వారితోనూ ఉంది, అలాగే లౌకిక తండ్రితోనూ ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వారు మన లౌకిక తండ్రి అని, వీరు మన పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గములో కూడా ఇది ఆత్మకు తెలుసు. అందుకే ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అవినాశీ తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా యుగాల ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకు వస్తారని ఎవరికీ ఆలోచన రాదు. కావున వారు తప్పకుండా సంగమంలోనే వస్తారు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసి మనుష్యులను పూర్తిగా ఘోరమైన అంధకారములో పడేశారు. తండ్రిని పొందేందుకు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. చాలా భక్తి చేసినవారికి భగవంతుడు లభిస్తారని అంటారు. అందరికన్నా ఎక్కువ భక్తి చేసినవారిని తప్పకుండా ముందే కలవాలి కదా. తండ్రి లెక్కను కూడా తెలియజేసారు, అందరికన్నా ముందు భక్తిని మీరు చేస్తారు కావున భగవంతుని ద్వారా మొట్టమొదట మీకే జ్ఞానము లభించాలి, మీరే మళ్ళీ కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానమునిస్తున్నారు. ఇందులో కష్టము యొక్క విషయమేమీ లేదు. అర్ధకల్పము మీరు స్మృతి చేశారని తండ్రి అంటారు. సుఖములోనైతే ఎవరూ స్మృతి చేయరు. అంతిమంలో ఎప్పుడైతే దుఃఖితులుగా అయిపోతారో, అప్పుడు నేను వచ్చి సుఖవంతంగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు చాలా గొప్ప వ్యక్తులుగా అవుతారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొదలైనవారి బంగళాలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయో చూడండి. అక్కడ ఆవులు మొదలైనవి, మొత్తం ఫర్నీచర్ అంతా ఎంతో ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. మీరు ఎంత గొప్ప వ్యక్తులుగా (దేవతలుగా) అవుతారు. దైవీ గుణాలు కలిగిన దేవతలుగా, స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ కొరకు మహళ్ళు కూడా వజ్రవైఢూర్యాలతో తయారుచేయబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నీచర్ బంగారంతో పొదగబడి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడి ఊయలలు మొదలైనవన్నీ సామాన్యంగా ఉన్నాయి. అక్కడ అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ గా వజ్రవైఢూర్యాలతో పొదగబడి ఉంటాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుడిని రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తైనప్పుడు భగవంతుడు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. సత్యయుగంలో భక్తి లేక యజ్ఞమనే మాటే ఉండదు. ఈ సమయంలోనే తండ్రి ఈ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు, దీనికి తర్వాత గాయనం జరుగుతుంది. భక్తి సదా కొనసాగుతూ ఉండదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. తండ్రి వచ్చి పగలుగా చేస్తారు కావున పిల్లలకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారు అతి ప్రియాతి ప్రియమైన బాబా. వారి కన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. బాబా, మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి అని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీరు మీ గృహస్థ వ్యవహారములో ఉండవలసిందేనని అర్థం చేయిస్తారు. ఇక్కడ బాబా వద్ద ఎంత కాలమని కూర్చుంటారు. తండ్రితో పాటు పరంధామంలో మాత్రమే ఉండగలరు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉండలేరు. టీచరు ప్రశ్నలను ఎలా అడగగలరు. లౌడ్ స్పీకర్ లో రెస్పాన్స్ (సమాధానం) ఎలా ఇవ్వగలరు, కావుననే కొద్ది మంది విద్యార్థులనే చదివిస్తారు. కాలేజీలైతే ఎన్నో ఉంటాయి, తర్వాత అందరికీ పరీక్షలు జరుగుతాయి. లిస్టు వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క తండ్రే చదివిస్తారు. దుఃఖములో అందరూ ఆ పారలౌకిక తండ్రిని స్మరిస్తారని కూడా అర్థం చేయించాలి. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు. మహాభారీ మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత యుద్ధములో కృష్ణుడు వచ్చారని వారు భావిస్తారు. కానీ అది జరగలేదు. పాపం వారు తికమకపడి ఉన్నారు కదా. అయినా కూడా కృష్ణ-కృష్ణ అని స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు కూడా ఎంతో ప్రియమైనవారు, అలాగే కృష్ణుడు కూడా ఎంతో ప్రియమైనవారు. కానీ వారు నిరాకారుడు, ఇతను సాకారుడు. నిరాకార తండ్రి ఆత్మలందరికీ తండ్రి. ఇద్దరూ అతి ప్రియమైనవారే. కృష్ణుడు కూడా విశ్వానికి యజమానియే కదా. అతి ప్రియమైనవారు ఎవరు అన్నది ఇప్పుడు మీరు నిర్ణయించుకోగలరు. శివబాబాయే ఈ విధంగా యోగ్యులుగా చేస్తారు కదా. కృష్ణుడు ఏం చేస్తాడు? తండ్రియే కృష్ణుడిని అలా తయారుచేస్తారు కావున గాయనం కూడా ఎక్కువగా ఆ తండ్రిదే జరగాలి. శంకరుని నాట్యాన్ని చూపిస్తారు. వాస్తవానికి నాట్యము మొదలైనవాటి విషయమేమీ లేదు. మీరందరూ పార్వతులని తండ్రి అర్థము చేయించారు. ఈ అమరనాథుడైన శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. అది నిర్వికారీ ప్రపంచము. అక్కడ వికారాల విషయమే ఉండదు. తండ్రి వికారీ ప్రపంచాన్ని రచించరు. వికారాలలోనే దుఃఖము ఉంది. మనుష్యులు హఠయోగము మొదలైనవి చాలా నేర్చుకుంటారు. గుహలలోకి వెళ్ళి కూర్చొంటారు, అగ్నిని కూడా దాటి వెళ్తారు. రిద్ధులు-సిద్ధులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంద్రజాలంతో ఎన్నో వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. భగవంతుడిని కూడా ఇంద్రజాలికుడని, రత్నాకరుడని, వ్యాపారస్థుడని అంటారు, మరి తప్పకుండా వారు చైతన్యమైనవారు కదా. నేను వస్తాను అని కూడా అంటారు, వారు ఇంద్రజాలికుడు కదా. మనుష్యులను దేవతలుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఇటువంటి ఇంద్రజాలమును ఎప్పుడైనా చూశారా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పుష్పాల తోటలోకి వెళ్ళాలి కావున సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలనూ జోడించాలి.

2. శివబాబా ప్రియాతి ప్రియమైనవారు, వారొక్కరినే ప్రేమించాలి. సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

ఈ లోకం యొక్క ఆకర్షణ నుండి ముక్తులై అవ్యక్త వతనంలో విహరించే ఎగిరే పక్షి భవ

బుద్ధి రూపీ విమానం ద్వారా అవ్యక్త వతనం మరియు మూలవతనంలో విహరించేందుకు ఎగిరే పక్షిగా అవ్వండి. బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోండి. మీరు ఎప్పుడైతే ఈ లోకం యొక్క ఆకర్షణ నుండి అతీతంగా ఉంటారో అప్పుడే ఇది జరుగుతుంది. ఇది సారములేని ప్రపంచము, ఈ సారములేని ప్రపంచంతో ఏ పనీ లేనప్పుడు, ఏ ప్రాప్తి లేనప్పుడు, అక్కడకు బుద్ధి ద్వారా వెళ్ళడాన్ని కూడా సమాప్తం చేయండి. ఇది రౌరవ నరకము, ఇందులోకి వెళ్ళాలన్న సంకల్పము మరియు స్వప్నము కూడా రాకూడదు.

స్లోగన్:-

మీ ముఖము మరియు నడవడిక ద్వారా సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయించడమే శ్రేష్ఠత.