11-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణ దానమునిచ్చేందుకు వచ్చారు, ప్రాణ దానము లభించడం అనగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడం”

ప్రశ్న:-

డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా ఏ దృశ్యము మీకు కొత్తది కాదు?

జవాబు:-

ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఎవైతే హంగామాలున్నాయో, వినాశన కాలంలో విపరీత బుద్ధి గలవారై తమ కులాన్నే అంతము చేసుకునేందుకు అనేక సాధనాలను తయారుచేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు ఎందుకంటే ఈ ప్రపంచం అయితే మారనున్నదని మీకు తెలుసు. మహాభారత యుద్ధము తర్వాతనే మన కొత్త ప్రపంచం వస్తుంది.

గీతము:-

ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు..... (యహ్ కౌన్ ఆజ్ ఆయా.....)

ఓంశాంతి. ఉదయాన్నే వచ్చి మురళీని మోగించేదెవరు? ప్రపంచం అయితే పూర్తిగా ఘోరమైన అంధకారములో ఉంది. మీరిప్పుడు మురళీని వింటున్నారు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి వింటున్నారు. వారు ప్రాణాన్ని రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖము నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయము లభిస్తుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తమైనదని మీకు తెలుసు. పిల్లల శరీరము ప్రత్యక్షంగా ఉంటుంది. తండ్రి శ్రీమతము పిల్లల కోసం ఉన్నది. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత ప్రసిద్ధి గాంచినది. కేవలం అందులో శ్రీకృష్ణుని పేరును వేశారు. శ్రీమతము అనేది భగవానువాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్ఠాచారులను శ్రేష్ఠాచారులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రియేనని కూడా మీకు తెలుసు. వారే నరుని నుండి నారాయణునిగా చేస్తారు. సత్యనారాయణ కథ కూడా ఉంది. అమరకథ అని గాయనం చేయడం జరుగుతుంది. అమరపురికి యజమానులుగా తయారుచేయడమన్నా లేక నరుని నుండి నారాయణునిగా తయారుచేయడమన్నా, విషయం ఒక్కటే. ఇది మృత్యులోకము. భారతదేశమే అమరపురిగా ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడే అమరుడైన బాబా పార్వతులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపదియే కాదు. ఈ కథను చాలామంది పిల్లలు వింటున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా వినిపిస్తారు. నేను బ్రహ్మా ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తానని తండ్రి అంటారు.

ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి పిల్లలకు అర్థము చేయించారు. తండ్రియే అలా తయారుచేయగలరు. ప్రపంచంలోని మనుష్యమాత్రులు ఒక్కరికి కూడా ఆత్మ జ్ఞానము లేదు. ఆత్మ జ్ఞానమే లేనప్పుడు పరమాత్మ జ్ఞానము ఎలా ఉంటుంది. ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాటులో చిక్కుకుని ఉంది. పూర్తిగా రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతిబుద్ధి గలవారిగా లేరు, మేము ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారుచేస్తున్నామో, ఇవి స్వయాన్నే కాక మొత్తం ప్రపంచమంతటినీ అంతము చేసేందుకు తయారుచేస్తున్నామని వారి బుద్ధిలోకి రాదు. ఈ సమయంలో బుద్ధి దేనికీ పనికి రాకుండా ఉంది. తమ వినాశనం కోసమే అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పిల్లలైన మీకిది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారముగా వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. రాతిబుద్ధి గలవారు కాకపోతే ఇటువంటి పనులు చేయగలరా? మొత్తం కులాన్నంతా వినాశనము చేస్తున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారు, ఆశ్చర్యముగా ఉంది కదా. ఈ రోజు అలా కూర్చుని ఉండగా బాగానే ఉంటుంది, రేపు మిలట్రీవారు డిస్టర్బ్ అయితే ప్రెసిడెంటును కూడా హతమార్చేస్తారు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవ్వరినీ సహించరు, ఎందుకంటే శక్తివంతులు కదా. ఈనాటి ప్రపంచంలో చాలా హంగామాలున్నాయి, రాతిబుద్ధి గలవారు కూడా అనేకమంది ఉన్నారు. వినాశనకాలములో ఎవరైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి గలవారిగా ఉంటారో, వారు వినాశనమవుతారని గాయనముందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది. మహాభారత యుద్ధము తప్పకుండా జరిగిందని కూడా మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాలలోనైతే మొత్తం వినాశనమైందని చూపించారు. కానీ మొత్తం వినాశనము అవ్వదు, అలా అయితే ప్రళయం జరగాలి, అప్పుడు మనుష్యులు ఎవ్వరూ ఉండరు, కేవలం పంచతత్వాలు మాత్రమే మిగలాలి. అలా అయితే జరగదు. ప్రళయం జరిగినట్లయితే మనుష్యులు ఎక్కడ నుండి వస్తారు. సాగరములో రావి ఆకు పై శ్రీకృష్ణుడు బొటనవేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక బాలుడు ఆ విధంగా ఎలా రాగలడు? శాస్త్రాలలో ఎటువంటి విషయాలను వ్రాసేశారంటే, ఇక అడగకండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులకు, భీష్మపితామహులు మొదలైన వారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. మున్ముందు వారు కూడా వస్తారు. మీరు సేవలో ఎంతెంతగా ఫోర్సును నింపుతూ ఉంటారో, తండ్రి పరిచయమును అందరికీ ఇస్తూ ఉంటారో, అంతగా మీ ప్రభావము పెరుగుతుంది. అయితే, విఘ్నాలు కూడా వస్తాయి. ఆసురీ సంప్రదాయము వారు ఈ జ్ఞాన యజ్ఞంలో చాలా విఘ్నాలను కలిగిస్తారని కూడా అంటూ అంటారు. పాపం రాతిబుద్ధి గల మనుష్యులకు ఇది ఏమిటి అన్నది ఏ మాత్రం తెలియదు. వీరి జ్ఞానమే అతీతమైనదని అంటారు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలని కూడా మీకు తెలుసు. మీకు ఈ రాజయోగాన్ని ఇతరులెవ్వరూ నేర్పించలేరని తండ్రి అంటారు. జ్ఞానమును మరియు యోగమును తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే, వారే పతితపావనుడు కనుక తప్పకుండా పతితులకే జ్ఞానమునిస్తారు కదా. మనము పారసబుద్ధి గలవారిగా అయి పారసనాథులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు ఎన్నో మందిరాలను నిర్మించారు. కానీ వారు ఎవరు, ఏమి చేసి వెళ్ళారు అనేది కొంచెము కూడా అర్థము చేసుకోరు. పారసనాథుని మందిరము కూడా ఉంది కానీ భారతదేశము పారసపురిగా ఉండేదని ఎవ్వరికీ తెలియదు, అక్కడ బంగారం మరియు వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయము. వారు కేవలం ఒక్క సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అంటారు. మొత్తం డ్రామా అంతా 5 వేల సంవత్సరాలేనని తండ్రి అంటారు. అందుకే, నేటి భారతదేశము ఎలా ఉంది! నిన్నటి భారతదేశం ఎలా ఉండేది! అని అంటారు. లక్షల సంవత్సరాలైతే ఎవ్వరికీ గుర్తు ఉండదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతి లభించింది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మాకు స్మృతినిప్పిస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయం. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది? ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అని ఎవరినైనా అడిగినట్లయితే, లక్షల సంవత్సరాలని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీరు అర్థము చేయించగలరు. క్రీస్తుకు ఇంత సమయం ముందు స్వర్గముండేదని కూడా అంటారు. తండ్రి భారతదేశములోనే వస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు - బాబా జయంతిని జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా ఏదో చేసేందుకు వచ్చి ఉంటారు, వారు పతితపావనుడు కనుక వారు వచ్చి తప్పకుండా పావనంగా తయారుచేసి ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా జ్ఞానమునిస్తారు కదా. యోగములో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది జ్ఞానము కదా. వారైతే హఠయోగులు. మఠం వేసుకుని కూర్చుంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు. మాతలైన మీరైతే ఈ విధంగా చేయలేరు. అలా కూర్చోలేరు కూడా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీరు ఇవేవీ చేయవలసిన అవసరం లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారముగా కూర్చుంటారు కదా. తండ్రి అయితే అది కూడా చెప్పరు. ఎలా కావాలనుకుంటే అలా కూర్చోండి అని అంటారు. అచ్చా, కూర్చొని అలసిపోయినట్లయితే పడుకోండి అని అంటారు. బాబా ఏ విషయంలోనూ వద్దనరు. ఇది పూర్తిగా సహజంగా అర్థము చేసుకునే విషయము. ఎంత అనారోగ్యం ఉన్నా సరే, ఇందులో ఎటువంటి కష్టము లేదు. మీరు వింటూ వింటూ, శివబాబా స్మృతిలో ఉంటూ ఉంటూ, ప్రాణము తనువు నుండి వెళ్ళిపోవచ్చునేమో తెలియదు. గంగా తీరములో ఉండాలి, గంగా జలము నోటిలో ఉండాలి, అప్పుడు ప్రాణము తనువు నుండి వెళ్ళిపోవాలి అని గాయనం చేయడం జరుగుతుంది కదా. అవన్నీ భక్తి మార్గము యొక్క విషయాలు. వాస్తవానికి ఇది జ్ఞానామృతం యొక్క విషయము. నిజంగా ప్రాణమును అలాగే వదలనున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీరు పరంధామము నుండి వస్తారు. నన్ను విడిచిపెట్టి వెళ్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, నేను పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు వస్తాను. మీకు మీ ఇంటి గురించీ తెలియదు, ఆత్మ గురించీ తెలియదు. మాయ మీ రెక్కలను పూర్తిగా కట్ చేసేసింది. అందుకే ఆత్మ ఎగరలేదు ఎందుకంటే తమోప్రధానంగా ఉంది. ఎప్పటి వరకైతే సతోప్రధానంగా అవ్వరో, అప్పటివరకు శాంతిధామానికి ఎలా వెళ్ళగలరు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా పూర్తిగా తమోప్రధానంగా శిథిలావస్థలో ఉంది. ఆత్మలన్నీ తమోప్రధానంగా ఉన్నాయని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచములో సతోప్రధానంగా ఉంటాయి. ఇక్కడ ఎవ్వరికీ సతోప్రధాన అవస్థ ఉండలేదు. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే ఇక ఇక్కడ నిలవదు, ఒక్కసారిగా పారిపోతుంది. అందరూ ముక్తి కోసం లేదా శాంతిధామానికి వెళ్ళేందుకు భక్తి చేస్తారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. లా అలా చెప్పదు. ధారణ చేసేందుకు ఈ రహస్యాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, అయినా ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేస్తే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మొదట వృక్షము చిన్నదిగా ఉంటుంది, తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది. అనేక ధర్మాలున్నాయి కదా. మీరు ఒక్క సెకండులో తెలుసుకుంటారు. మనుష్య సృష్టికి బీజరూపుడైన వారొక్కరే అందరికీ తండ్రి అని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎప్పుడూ సర్వవ్యాపి కాలేరు. ఇది చాలా పెద్ద పొరపాటు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరని మీరు అర్థము చేయిస్తారు కూడా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను సహజము చేసి అర్థం చేయిస్తారు, ఇక తర్వాత ఎవరి భాగ్యంలో ఉంటే, ఎవరికి నిశ్చయముంటే, వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయం లేకపోతే వారు ఎప్పటికీ అర్థము చేసుకోరు. భాగ్యమే లేకపోతే ఇక పురుషార్థం కూడా ఏమి చేస్తారు. భాగ్యంలో లేకపోతే వారు ఏమీ అర్థము కానట్లుగానే కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారని ఈ మాత్రం నిశ్చయం కూడా వారికి ఉండదు. ఎవరైనా కొత్త వ్యక్తి మెడికల్ కాలేజిలోకి వెళ్ళి కూర్చున్నట్లయితే ఏమి అర్థము చేసుకుంటారు? ఏమీ అర్థము చేసుకోరు. ఇక్కడకు కూడా అలాగే వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశీ జ్ఞానము వినాశనమవ్వదు. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు - రాజధాని స్థాపనవుతుంది కదా, మరి నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు, అందరూ కావాలి కదా, కనుక అలాంటివారు కూడా వస్తారు. కొంతమందికి చాలా మంచి రీతిగా అర్థమవుతుంది. అభిప్రాయమును కూడా వ్రాస్తారు కదా. మున్ముందు కొద్దిగా ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయంలో కష్టము, ఎందుకంటే ఆ సమయంలో చాలా హంగామాలు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు తుఫానులు పెరుగుతూ ఉంటాయి. ఇన్ని సెంటర్లు ఉన్నాయి. మంచిరీతిగా అర్థము చేసుకుంటారు కూడా. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా వ్రాసి ఉంది. వినాశనమును కూడా ఎదురుగా చూస్తారు. వినాశనం అయితే జరగాల్సిందే. జనాభా తగ్గాలని గవర్నమెంట్ అంటుంది కానీ ఇందులో వారు ఏమి చేయగలరు? వృక్షము అయితే వృద్ధి చెందాల్సిందే. తండ్రి ఉన్నంతవరకు, అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ ఉండాల్సిందే. వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆత్మలు రావడం ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే కానీ ఈ విషయాలను ఎవ్వరూ అర్థము చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, మాకు రామ రాజ్యము కావాలని బాపూజీ కూడా అనేవారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు, మరి దీని అర్థము ఇది నరకమని కదా. మనుష్యులు ఈ మాత్రం కూడా అర్థము చేసుకోరు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా. అంటే తప్పకుండా అప్పటివరకు నరకవాసులుగానే ఉన్నట్లు కదా. మనుష్యుల ముఖాలు మనుష్యుల వలె ఉన్నాయి కానీ లక్షణాలు కోతుల వలె ఉన్నాయని బాబా అర్థం చేయిస్తారు. పతితపావన సీతారామ అని అందరూ పాడుతూ ఉంటారు. మనము పతితులము, పావనంగా తయారుచేసేవారు తండ్రి. వారంతా భక్తి మార్గము యొక్క సీతలు, తండ్రి రాముడు. ఇది ఎవరికైనా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముడినే పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రమునిచ్చారు. మీరు వేరే ప్రపంచానికి చెందినవారి వలె అయ్యారు. పాత ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉంటారు అనేది ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటారు. పిల్లలైన మీరు తెలివిహీనుల నుండి తెలివైనవారిగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎంత తెలివిహీనులుగా చేసేశాడు. మనుష్యులందరూ ఈ సమయములో తమోప్రధానంగా అయిపోయారని తండ్రి అర్థం చేయిస్తారు, అందుకే తండ్రి వచ్చి సతోప్రధానంగా చేస్తారు. తండ్రి అంటారు - పిల్లలైన మీరు మీ సర్వీసును కూడా చేసుకుంటూ ఉండండి, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే మార్గం ఇతరులెవ్వరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ వారొక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు ఎందుకంటే ఆత్మయే తమోప్రధానంగా అయ్యింది. తండ్రిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఆత్మ ఇప్పుడు సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యింది, దానికి ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగము పైన జోడించండి. జీవిస్తూనే ఉరికంభానికి వేలాడుతూ ఉండండి అంటే స్వీట్ హోమ్ తో బుద్ధి యోగాన్ని జోడించండి. మనము స్వీట్ సైలెన్స్ హోమ్ కు వెళ్ళాలి. నిర్వాణధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచం వినాశనం జరగనున్నది కనుక మీరు స్వయాన్ని దీని నుండి వేరుగా భావించాలి. వృక్షము యొక్క వృద్ధితో పాటుగా, విఘ్నాల రూపీ తుఫానులు ఎవైతే వస్తాయో, వాటికి భయపడకూడదు, వాటిని దాటేయాలి.

2. ఆత్మను సతోప్రధానంగా తయారుచేసుకునేందుకు స్వయానికి జ్ఞాన-యోగాల ఇంజెక్షన్ ను ఇచ్చుకోవాలి. తమ బుద్ధి యోగాన్ని స్వీట్ హోమ్ తో జోడించాలి.

వరదానము:-

తమ భాగ్యము మరియు భాగ్యవిధాత యొక్క స్మృతి ద్వారా అన్ని చిక్కుల నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ రచయిత భవ

సదా వాహ్ నా భాగ్యము మరియు వాహ్ భాగ్య విధాత! మనసు యొక్క ఈ సూక్ష్మ శబ్దాన్ని వింటూ ఉండండి మరియు సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. తెలుసుకోవలసినది తెలుసుకున్నాను, పొందాల్సినది పొందేసాను - ఈ అనుభవాలలో ఉన్నట్లయితే అన్ని చిక్కుల నుండి ముక్తులైపోతారు. ఇది చిక్కులలో ఉన్న ఆత్మలను బయటకి తీసే సమయము కనుక నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, మాస్టర్ రచయితను - ఈ స్మృతితో బాల్యము యొక్క చిన్న చిన్న విషయాలలో సమయాన్ని పోగొట్టుకోకండి.

స్లోగన్:-

కమలాసనధారులే మాయ ఆకర్షణ నుండి అతీతంగా ఉంటారు, తండ్రి స్నేహంలో ప్రియంగా ఉంటారు, శ్రేష్ఠ కర్మ యోగులుగా ఉంటారు.