ఓంశాంతి
పిల్లలు కూడా ఓంశాంతి అని చెప్తారు. ఆత్మలు ఈ శరీరము ద్వారా ఓంశాంతి అని
చెప్పగలరు. ఆత్మనైన నా స్వధర్మము శాంతి, ఇది మర్చిపోకూడదు. తండ్రి కూడా వచ్చి
ఓంశాంతి అని చెప్తారు. ఎక్కడైతే పిల్లలైన మీరు కూడా శాంతిగా ఉంటారో, అక్కడ తండ్రి
కూడా ఉంటారు. అది మన శాంతిధామము లేక ఇల్లు. ప్రపంచములోని ఏ విద్వాంసులకు, ఆచార్యులకు
ఈ విషయాల గురించి తెలియవు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఆత్మ అంటే ఏమిటి అని
ఆత్మను గురించిన జ్ఞానము కూడా ఎవ్వరికీ లేదు. ఇన్ని కోట్లమంది ఆత్మలు నక్షత్రాల వలె
ఉన్నాయి. ప్రతి ఆత్మలో తమ-తమ అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది, అది సమయానికి ఇమర్జ్
అవుతుంది. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి కూడా జీవాత్మగా అవ్వకుండా
జీవాత్మలకు అర్థం చేయించలేరు. నాకు కూడా తప్పకుండా శరీరము కావాలి కదా. ఎప్పుడైతే
రచనను రచించాల్సి ఉంటుందో, అప్పుడు శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపిత
బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారు, రచయిత అయితే నిరాకార శివుడు. ప్రజాపిత బ్రహ్మా
ద్వారా బ్రహ్మాకుమార-కుమారీలకు అర్థం చేయిస్తున్నారు, శూద్రులకు కాదు. ఇప్పుడు మనది
బ్రాహ్మణ వర్ణము. ఇంతకుముందు శూద్ర వర్ణములో ఉండేవారము. దానికన్నా ముందు వైశ్య
వర్ణము, క్షత్రియ వర్ణములో ఉండేవారము. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. తప్పకుండా
బ్రాహ్మణుల నుండి దేవతలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా...
బ్రాహ్మణులది పిలక. ఇంతకుముందు బ్రాహ్మణులు ఆవు తోకంత పిలకను ఉంచుకునేవారు. మీరు
పిల్లిమొగ్గలాటను ఆడుతారు. నేనైతే ఆడను. ఈ వర్ణాల చక్రములోకి మీరు వస్తారు. ఇది ఎంత
సహజమైన విషయము. మీ పేరే స్వదర్శన చక్రధారి. ఇకపోతే, శాస్త్రాలలోనైతే ఏమేమి విషయాలు
రాసేసారు. బ్రాహ్మణులైన మేమే స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీరు అర్థం చేసుకుంటారు.
కానీ ఈ అలంకారాల గుర్తులను దేవతలకు ఇచ్చారు ఎందుకంటే వారు సంపూర్ణులు. అవి వారికే
శోభిస్తాయి. ఈ జ్ఞానాన్ని ధారణ చేయడంతో మీరు మళ్ళీ చక్రవర్తి రాజులుగా అవుతారు.
ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. యజ్ఞములో
బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. శూద్రులు యజ్ఞాన్ని రచించలేరు. రుద్రుడైన శివబాబా
యజ్ఞాన్ని రచించారు కనుక బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. తండ్రి అంటారు, నేను
బ్రాహ్మణ పిల్లలతోనే మాట్లాడతాను. ఇది ఎంత పెద్ద యజ్ఞము. తండ్రి ఎప్పుడైతే వచ్చారో,
వారు వస్తూనే యజ్ఞాన్ని రచించారు. దీనిని అశ్వమేధ యజ్ఞమని అనగా స్వరాజ్య
స్థాపనార్థము చేసే యజ్ఞమని అంటారు. ఎక్కడ? భారత్ లో. సత్యయుగ స్వరాజ్యాన్ని
రచిస్తారు. దీనిని శివ జ్ఞాన యజ్ఞమని అనండి లేక రుద్ర జ్ఞాన యజ్ఞమని అనండి. సోమనాథ
మందిరము కూడా వారిదే. ఒక్కరికే అనేక పేర్లు ఉన్నాయి. దీనిని యజ్ఞము అని అంటారు,
పాఠశాల అని అనరు. తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. యజ్ఞాన్ని పాఠశాల అని అనరు.
బ్రాహ్మణుల ద్వారా యజ్ఞము రచించబడుతుంది. బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటువంటి దాత
భోళానాథుడు. వారిని శివ భోళానాథ భండారి అని అంటారు. ఇప్పుడు మీరు సమ్ముఖంలో
కూర్చున్నారు. బాప్ దాదా పిల్లలను దత్తత తీసుకున్నారు. వీరు పెద్ద తల్లి. అయితే,
మాతలను సంభాళించడానికి మమ్మా నియమించబడ్డారు, వారు అందరికన్నా వేగవంతంగా ముందుకు
వెళ్తున్నారు. వీరి పాత్ర ముఖ్యమైనది. వీరు జ్ఞాన-జ్ఞానేశ్వరి జగదంబ. మహాలక్ష్మిని
జ్ఞాన-జ్ఞానేశ్వరి అని అనరు. లక్ష్మి అనగా ధన దేవి. వీరి ఇంటిలో లక్ష్మి ఉన్నారు అని
అంటారు కదా అనగా సంపద చాలా ఉంది అని అర్థము. లక్ష్మిని సంపద కోసమే వేడుకుంటారు. 12
మాసాలు పూర్తి అయితే మళ్ళీ ఆహ్వానిస్తారు. జగదంబ అందరి మనోకామనలను పూర్తి చేస్తారు.
జగదంబ ప్రజాపిత బ్రహ్మాకు కుమార్తె అని, ఆమె పేరు సరస్వతి అని పిల్లలకు తెలుసు.
ఒక్క పేరు సరిపోతుంది. తల్లి ఉన్నారంటే పిల్లలు కూడా ఉంటారు. మీరు శివబాబా ద్వారా
జ్ఞానము వింటున్నారు. వీరిని తండ్రి వచ్చి దత్తత తీసుకున్నారు, బ్రహ్మా అని పేరు
పెట్టారు. నేను పతిత శరీరంలోకి వస్తాను అని అంటారు కూడా. శాస్త్రాలలో కూడా ఈ
విషయాలేవీ లేవు. కొత్త ప్రపంచం కోసం మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు.
ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నాము. శూద్రులుగా ఉన్నప్పుడు ముళ్ళగా ఉండేవారము.
ఇప్పుడు బ్రాహ్మణులుగా, పుష్పాలుగా అయ్యారు. బ్రాహ్మణులను పుష్పాలుగా తండ్రి
తయారుచేస్తారు. వారు తోట యజమాని. మీరు నంబరువారుగా ఉన్న తోటమాలులు. ఎవరైతే మంచి-మంచి
తోటమాలులు ఉన్నారో, వారు ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేస్తారు. అంటు కడుతూ ఉంటారు.
నంబరువారుగా ఉన్నారు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు
ఈశ్వరుడు. శాస్త్రాలు మొదలైనవాటినైతే మనుష్యులు వినిపిస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని
పరమ ఆత్మ ఆత్మలకు ఇస్తారు. ఇతరులెవ్వరికీ రచయిత మరియు రచనల జ్ఞానము లభించనే లభించదు.
ఊరికే వ్యర్థ ప్రలాపాలు పలుకుతూ ఉంటారు. ఇది ఉన్నదే అసత్యమైన ప్రపంచము. అంతా అసత్యమే
అసత్యము. వాస్తవానికి ఇంతకుముందు నకిలీ నగలు ఉండేవి కావు. ఇప్పుడైతే నకిలీవి ఎన్ని
తయారయ్యాయి. సత్యమైనవాటిని ఉంచుకోనివ్వరు. అసత్య ఖండములో ఉన్నది రావణ రాజ్యము, సత్య
ఖండములో ఉన్నది రాముని ద్వారా స్థాపించబడిన రాజ్యము. ఇది శివబాబా ద్వారా
స్థాపించబడిన యజ్ఞము. ఇది పాఠశాల కూడా, యజ్ఞము కూడా, ఇల్లు కూడా. మనము పారలౌకిక
తండ్రికి మరియు ప్రజాపిత బ్రహ్మాకు సమ్ముఖంలో కూర్చున్నామని మీకు తెలుసు.
ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకు వారసత్వము ఎలా లభించగలదు. యజ్ఞాన్ని
సంభాళించేందుకు సత్యమైన బ్రాహ్మణులు కావాలి. వికారాలలోకి వెళ్ళేవారిని బ్రాహ్మణులని
అనరు. ఒక కాలు రావణుని నావలో, మరొకటి రాముని నావలో ఉంటే పరిణామము ఏమవుతుంది?
చీరుకుపోతారు. ఇటువంటి నడవడికతో ఇక పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. ప్రజాపిత
బ్రహ్మాకు సంతానముగా పిలవబడతారు కానీ కర్తవ్యమేమో శూద్రులది. తండ్రి అంటారు,
వ్యాపార-వ్యవహారాలను చేసుకోండి కానీ శ్రీమతంపై నడుచుకుంటే బాధ్యత వారిపై ఉంటుంది.
మీరు ఇక్కడకు ఈశ్వరీయ మతాన్ని తీసుకునేందుకే వచ్చారు. అది ఆసురీ మతము. మీరు
శ్రేష్ఠంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని తీసుకుంటారు. ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతమైన
మతాన్ని ఇస్తారు. మనకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ఉన్నతమైన మతము లభిస్తుందని
మీకు తెలుసు. మేమైతే సూర్యవంశీ రాజులుగా అవుతామని అంటారు కూడా. ఈ యజ్ఞము ఉన్నదే
రాజుగా తయారయ్యేందుకు, ప్రజలుగా అయ్యేందుకు కాదు. మీరు రాజా-రాణులుగా అవుతారు కావున
ప్రజలు కూడా తప్పకుండా తయారవ్వాలి. ఏ విధంగానైతే ఈ మమ్మా, బాబా పురుషార్థము ద్వారా
తయారవుతారో, అలా పిల్లలు కూడా తయారవ్వాలి. పిల్లలైన మీకు కూడా సంతోషము ఉండాలి.
బ్రహ్మాకుమార-కుమారీలైన మేము, శివబాబాకు మనవలము-మనవరాళ్ళము. శివుడిని ప్రజాపిత అని
అనరు. వారు రచయిత. స్వర్గంలో ఉండేవారు దేవీ-దేవతలు. తండ్రే మనుష్యులను దేవతలుగా
తయారుచేస్తారు. మీ శరీరము కల్పవృక్ష సమానంగా తయారవుతుంది, పునరుజ్జీవనం చెందుతారు.
నల్లగా అయిపోయిన మీ ఆత్మను పవిత్రంగా, తెల్లగా తయారుచేస్తారు. ఎప్పుడైతే సంపూర్ణ
పవిత్రంగా అవుతారో, అప్పుడిక ఈ శరీరముండదు. అందుకే ఈ ప్రపంచానికి నిప్పు
అంటుకుంటుంది, అందులో అందరి వినాశము జరుగుతుంది. ఇవి అనంతమైన విషయాలు. ఇది అనంతమైన
ద్వీపము, అవి హద్దు ద్వీపాలు. ఎన్ని భాషలున్నాయో, అన్ని పేర్లు పెట్టేసారు. అనేక
ద్వీపాలు ఉన్నాయి. కానీ ఈ మొత్తం సృష్టి అంతా ద్వీపమే. మొత్తం సృష్టి అంతటిపై రావణ
రాజ్యముంది. నేటి మానవుడి పరిస్థితి ఎలా అయిపోయింది భగవంతుడా... అని పాటలో కూడా
విన్నారు కదా. అక్కడ ఒకరినొకరు హతమార్చుకోరు. అక్కడ అయితే రామ్ రాజా, రామ్ ప్రజా...
దుఃఖము యొక్క మాటే ఉండదని అంటారు. ఎవరికైనా దుఃఖమివ్వడము కూడా పాపమే. అక్కడికి మళ్ళీ
ఈ రావణుడు, హనుమంతుడు మొదలైనవారు ఎక్కడి నుండి వస్తారు? మీరు ఇలా చెప్పవచ్చు -
మొట్టమొదటి ముఖ్యమైన విషయమేమిటంటే, గాడ్ ఫాదర్ అని అంటున్నప్పుడు, మరి వారు
సర్వవ్యాపి ఎలా అవ్వగలరు. అటువంటప్పుడు ఫాదర్ హుడ్ అవుతుంది. అందరికందరూ తండ్రులుగా
అయితే అవ్వలేరు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఇది అర్థం చేయించాలి - అర్ధకల్పము మీరు అసత్యమైన సంపాదనను
చేసుకున్నారు, ఇప్పుడు సత్యఖండము కోసము సత్యమైన సంపాదనను చేసుకోవాలి. వారు కూడా
శాస్త్రాలు మొదలైనవి ఏవైతే వినిపిస్తారో, అది సంపాదన కోసమే. శివబాబా అయితే ఈ
శాస్త్రాలు మొదలైనవేవీ చదవలేదు. వారు ఉన్నదే జ్ఞాన సంపన్నులు, జ్ఞాన సాగరులు. వారు
సత్యమైనవారు, చైతన్యమైనవారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బాబా ద్వారా మనము
సత్యఖండము కోసము సత్యమైన సంపాదనను చేసుకుంటున్నాము. అసత్య ఖండము వినాశనమవుతుంది.
దేహ సహితంగా ఇవన్నీ వినాశనమవ్వనున్నాయి. యుద్ధము ఎలా జరుగుతుందో మీరందరూ చూస్తారు.
అందరూ కలిసిపోవాలని వారు భావిస్తారు కానీ విడిపోతూ ఉంటారు. నరుడు ఒకటి తలిస్తే దైవం
మరొకటి తలచినట్లు... వారి ప్లాన్ అంతా వినాశనము కోసము. ఈశ్వరుని ప్లాన్ ఏమిటి? అది
ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అసత్య ఖండాన్ని సత్య ఖండముగా, మనుష్యులను దేవతలుగా
తయారుచేసేందుకే వచ్చారు. సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా అవుతారు మరియు రావణుని
ద్వారా అసత్యంగా అవుతారు. తండ్రి మాత్రమే సత్య జ్ఞానాన్ని ఇస్తారు. బ్రాహ్మణులైన మీ
చేతులు నిండుగా అవుతాయి. ఇకపోతే శూద్రుల చేతులు ఖాళీగా ఉంటాయి.
మనమే దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి కేవలం ఇదే చెప్తారు -
గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వండి మరియు నన్ను స్మృతి చేయండి.
స్మృతిని ఎందుకు మర్చిపోవాలి! ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో,
వారిని మీరు మర్చిపోతారు... ఇది కొత్త విషయము, ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వాల్సి
ఉంటుంది. ఆత్మ అయితే అవినాశీ, ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది. తండ్రి
అంటారు - దేహీ-అభిమానులుగా అవ్వండి ఎందుకంటే తిరిగి వెళ్ళాలి. దేహ భానాన్ని
విడిచిపెట్టండి. ఇది 84 జన్మల పాడైపోయిన చెప్పు. వస్త్రాలను ధరిస్తూ-ధరిస్తూ ఉంటే
పాడైపోతాయి కదా. మీరు కూడా ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు కామ చితి నుండి
దిగి జ్ఞాన చితిపై కూర్చోండి. చాలా మంది వికారాలు లేకుండా ఉండలేరు. తండ్రి అంటారు -
ద్వాపరము నుండి మొదలుకుని మీరు ఈ వికారాల కారణంగానే మహారోగులుగా అయ్యారు. ఇప్పుడు ఈ
వికారాలను జయించండి. కామ వికారములోకి వెళ్ళకండి. ఈ శరీరమైతే అపవిత్రమైనది, పతితమైనది
కదా. పావనంగా అవ్వండి. ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. సత్య-త్రేతా యుగాలలో
ఈ వికారాలు ఉండవు. అక్కడ కూడా ఇవి ఉంటే ఇక దానిని స్వర్గమని, దీనిని నరకమని
ఎందుకంటారు! తండ్రి అంటారు, శాస్త్రాలలోనైతే ఎటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము లేనే లేదు.
ఇక్కడైతే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. మనము ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా
అవుతున్నాము. తండ్రి అంటారు, మీరు ఇంతవరకు ఏదైతే చదివారో, అది మర్చిపోండి. అందులో ఏ
సారము లేదు. మీ ఎక్కే కళ ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది. ఆ తర్వాత దిగే కళ ఉంటుంది.
ఎంతగా తల బాదుకున్నా సరే, కిందికి దిగాల్సిందే. పతితంగా అవ్వాల్సిందే. ఇది ఛీ-ఛీ
ప్రపంచము. మన భారత్ స్వర్గముగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు నరకముగా ఉంది.
మొదట ఆది సనాతన ధర్మము ఒక్కటే ఉండేది, అది ఇప్పుడు లేదు. మళ్ళీ ఆ ధర్మము యొక్క
స్థాపన జరుగుతుంది. బాబా మళ్ళీ వచ్చి బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు. మేము మళ్ళీ
రాజ్యము తీసుకుంటామని మీరు కూడా అంటారు. రాజ్యము తీసుకున్న తర్వాత ఇక ఈ జ్ఞానము
మాయమైపోతుంది. పావనంగా అవ్వడము కోసము ఈ జ్ఞానము పతితులకు మాత్రమే లభిస్తుంది, ఆ
తర్వాత పావన ప్రపంచ జ్ఞానము ఎందుకుంటుంది? లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండి ఎన్ని
సంవత్సరాలు అయ్యింది, ఇది కూడా మీకు తెలుసు. బాబా, మేము 5000 సంవత్సరాల తర్వాత
రాజ్యం తీసుకునేందుకు మళ్ళీ వచ్చాము అని అంటారు. ఆత్మలమైన మనము తండ్రి పిల్లలము.
ఉదాహరణ ఇస్తారు కదా - ఒక వ్యక్తి ‘నేను గేదెను’ అని అనుకుంటూ ఉన్నారు, అప్పుడిక ఆ
నిశ్చయం కూర్చుండిపోయింది. నేను ఈ కిటికీ నుండి బయటకు ఎలా రావాలి... అని అనడం
మొదలుపెట్టారు. ఈ విషయము మీ కోసమే. మేము బాబా పిల్లలమని మీరు నిశ్చయం చేసుకుంటారు.
నేను చతుర్భుజుడను అని అనుకుంటూ ఉన్నంత మాత్రాన అలా అవుతారని కాదు. అలా
తయారుచేసేవారు తప్పకుండా కావాలి. ఇది నరుని నుండి నారాయణునిగా తయారుచేసే జ్ఞానము,
ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో మరియు చేయిస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు.
మాకు చదువుకోవడానికి తీరిక లేదు అని విద్యార్థులు ఇలా అనలేరు. అలాగైతే వెళ్ళి ఇంట్లో
కూర్చోండి. చదువు లేకుండా వారసత్వము లభించజాలదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు, అయినా
కానీ తీరిక లేదు అని అంటారు. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ విడాకులిచ్చేస్తే,
వారిని తండ్రి అంటారు - మీరు మహామూర్ఖులు. ఒక్క ఘడియ, అర్ధ గడియ... మీకు తీరిక లేదా.
అచ్ఛా, ఉదయమున తెల్లవారుజామున కూర్చుని బాబాను స్మృతి చేయండి. మీ తలపై ఏ ఆపదను వేయడం
లేదు. కేవలం ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని
తిప్పండి. ఇతరుల కళ్యాణము చేయలేకపోతే మీ కళ్యాణమైనా చేసుకోండి. దయా హృదయులుగా అయి
ఎంతగా ఇతరుల కళ్యాణము చేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా గొప్ప
సంపాదన. ఎవరి వద్దనైతే చాలా ధనముంటుందో, వారు తీరిక లేదని అంటారు. షావుకార్లు అక్కడ
పేదవారిగా అయ్యేది ఉంది మరియు పేదవారు షావుకార్లుగా అయ్యేది ఉంది. అందరికన్నా
ఎక్కువగా మాతలు ఏడుస్తారు, వారిని నవ్వించేవారిగా అవ్వాలి. నిరంతరం స్మృతి యాత్రలో
ఉండాలి. మధుబన్ లో శాంతి ఉంటుంది కావున చాలా సంపాదన చేసుకోగలుగుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్య ఖండము కోసము సత్యమైన సంపాదనను చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యి ఉండాలి.
ఈ పాడైపోయిన చెప్పు యొక్క అభిమానాన్ని విడిచిపెట్టాలి.
2. దయాహృదయులుగా అయి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. ఉదయముదయాన్నే లేచి తండ్రిని
స్మృతి చేస్తూ, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి.