12-01-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


“ మధురమైన పిల్లలారా - ఇది మీ వానప్రస్థ అవస్థ కావున ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, నిర్వాణధామములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ’’

ప్రశ్న :-

తండ్రి వద్ద ఏ విషయములో భేదము లేదు?

సమా :-

ధనవంతులు, పేదలు అను భేద భావము లేదు. పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుకునే అధికారము ప్రతి ఒక్కరికీ ఉంది. పోను పోను అందరికీ వారి వారి పదవి సాక్షాత్కారమౌతుంది. బాబా అంటున్నారు - ‘‘నేను పేదల పెన్నిధిని. అందువలన ఇప్పుడు పేదపిల్లల ఆశలన్నీ పూర్తి అవుతాయి. ఇది అంతిమ సమయము. కొందరిది మట్టిలో కలిసిపోతుంది,................(కిస్ కీ దబీ రహేగీ ధూల్ మే,.............) ఎవరు తండ్రికి ఇన్ష్యూర్ చేస్తారో, వారిది సఫలమౌతుంది.

పాట:-

చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చింది,......(ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్ .........)

ఓంశాంతి.

. దీని అర్థము చాలా సింపుల్(సహజము). ప్రతి విషయము క్షణ మాత్రములో అర్థము చేసుకోవచ్చు. సెకండులో తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. అనంతమైన తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. కానీ ఈ నిశ్చయము కూడా కొంతమందిలో స్థిరముగా కూర్చోదు. లౌకిక సంబంధములో తల్లికి కొడుకు జన్మించినప్పుడు, ఈమె నాకు జన్మనిచ్చి పాలన చేస్తుందని కొడుకుకు వెంటనే అర్థమవుతుంది. అలాగే ఇచ్చట కూడా వెంటనే అర్థము చేసుకోవాలి కదా. ‘‘ భక్తి తర్వాతనే భగవంతుడు వస్తారు ’’ అని పిల్లలైన మీకు తెలుసు. భక్తి ఎంతకాలము నడుస్తుందో, ఎప్పుడు మొదలవుతుందో, ప్రపంచములో పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. భక్తి ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో మీరు తెలుపగలరు. మనుష్యులైతే పరంపర(తరతరాల) నుండి వస్తోందని అంటారు. జ్ఞానము వేరే, భక్తి వేరే. ఇది అనాదిగా వస్తోందని అంటారు. కానీ అనాది అంటే అర్థమేమో కూడా తెలియదు. ఈ డ్రామా చక్రము అనాది కాలము నుండి తిరుగుతూ ఉంది. దానికి ఆది, అంత్యాలు లేవు. మనుష్యులు వ్యర్థముగా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలయ్యిందని ఒకసారి అంటారు, మరోసారి అలా కాదు ఇన్ని సంవత్సరాలయ్యిందని అంటారు. తండ్రి వచ్చి అన్నీ ఋజువు చేసి తెలుపుతున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన తండ్రి లభించరు. ఒక సెకండులో తండ్రి నుండి ప్రాప్తి అవుతుంది. సెకండులో ‘ జీవన్ముక్తి ’ అని అంటారు. తండ్రి ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. కల్ప ఆయువును పెద్దదిగా(పొడవు) చేసేశారు. ఇప్పుడు తండ్రికి తెలుసు, పిల్లలకు కూడా సకలము(అన్నీ) తెలుసు అయినా ఆశ్చర్యము కలిగించే విషయమేమంటే - 10-20 సంవత్సరాలైనా కొంతమందికి నిశ్చయము కలగదు. నిశ్చయమైన తర్వాత ‘వీరు మా తండ్రి కారు’ అని అనలేరు. ఇది అత్యంత సులభము. పిల్లలుగా అయ్యేందుకు కూడా మీకు చాలా సమయము పట్టింది. 10-20 సంవత్సరాలు గడచినా పూర్తిగా నిశ్చయము ఏర్పడలేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా పరిచయమిస్తే, సెకండులో నిశ్చయమైపోతుంది. జనకుని ఉదాహరణ కూడా చివరి సమయానిదే ఎందుకనగా పోను పోను ఈ జ్ఞానము చాలా సులభమైపోతుంది. వెంటనే నిశ్చయము కలిగించే మంచి మంచి పాయింట్లు వస్తాయి.

తండ్రి అంటున్నారు -‘‘ పిల్లలూ! అశరీరి భవ! అనేక దేహ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలే వేయండి. నిజానికి మొదట ఒకే ధర్మముండేది కదా. దానితోనే వృద్ధి చెందుతుంది కదా. ఇది వెరైటీ మనుష్యసృష్టి వృక్షము, మనుష్యుల విషయము. వెరైటీ ధర్మాల వృక్షము గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ధర్మ సమ్మేళనాలు జరుగుతాయి. కానీ మొట్టమొదటి పూజ్య ధర్మమేదో వారికి తెలియదు. బుద్ధికి తోచాలి - భారతదేశము ప్రాచీన ధర్మానికి చెందింది కావున దీనిని పరమపిత పరమాత్మనే స్థాపన చేసి ఉంటారు. భారతదేశములో శివజయంతి మహిమ చేయబడ్తుంది. లెక్కలేనన్ని మందిరాలున్నాయి, అన్నిటికంటే అతి పెద్ద మందిరము - తండ్రి ఇల్లైన నిర్వాణధామము. అక్కడ ఆత్మలైన మనము కూడా తండ్రి జతలో ఉంటాము. మందిరమంటే నివాస స్థానము కదా. ఈ మహాతత్వము ఎంత పెద్ద మందిరము. బ్రహ్మతత్వము అన్నింటికంటే ఉన్నతోన్నతమైన మందిరము, మనమందరము అచ్చట ఉండేవారమని మీ బుద్ధిలోకి రావాలి. అచ్చట సూర్య-చంద్రులు ఉండరు ఎందుకనగా అక్కడ రాత్రి-పగలు ఉండవు. వాస్తవానికి మన ఆత్మల మందిరము - ఆ నిర్వాణధామము. అదే శివాలయము. అచ్చట మనము శివబాబా జతలో ఉంటాము. శివబాబా అంటారు - ‘‘నేను ఆ శివాలయ నివాసిని. అది బేహద్ శివాలయము. శివుని పిల్లలైన మీరు కూడా అక్కడే ఉంటారు. అది అశరీర(ఇన్కార్పోరియల్) శివాలయము. తర్వాత శరీరములోకి వచ్చినప్పుడు, ఇచ్చట నివాస స్థానాలు తయారౌతాయి. ఇప్పుడు శివబాబా ఇచ్చట ఉన్నారు, ఈ శరీరములో విరాజమానమై ఉన్నారు. ఇది చైతన్యమైన శివాలయము. ఈ శివాలయముతో మీరు మాట్లాడగలరు. ఆ నిర్వాణధామము కూడా శివబాబా యొక్క శివాలయము. అచ్చట ఆత్మలమైన మనము ఉంటాము. ఆ ఇల్లు అందరికీ గుర్తు వస్తుంది. అక్కడ నుండి మనము పాత్ర చేసేందుకు వచ్చి సతో, రజో, తమో గుణాలలో వస్తాము. ప్రతి ఒక్కరు ఇందులో వచ్చి తీరాలి. ఈ విషయము ప్రపంచములో ఎవరి బుద్ధిలోనూ లేదు. ఉన్న ఆత్మలందరికీ తమ-తమ అనాది పాత్ర లభించి ఉంది. దానికి ఆది లేదు మరియు అంత్యము లేదు. మనము వాస్తవానికి ఆ శివాలయములో ఉండేవారమని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా స్థాపన చేసే స్వర్గాన్ని కూడా ‘శివాలయము’ అని అంటారు - శివబాబా ద్వారా స్థాపించబడిన స్వర్గము. అచ్చట కూడా పిల్లలే ఉంటారు. వారికి ఈ రాజ్యభాగమెలా లభించింది! అది సత్యయుగ ప్రారంభము. ఇది కలియుగ అంతము. కావున సత్యయుగములో దేవీ దేవతలను స్వర్గానికి యజమానులుగా ఎవరు చేశారు? ఇచ్చట కూడా చాలా మంచి-మంచి ఖండాలున్నాయి. అమెరికా అన్నింటికంటే ఫస్ట్‌క్లాస్ ఖండము. అక్కడ చాలా ధనవంతులు, శక్తివంతులు కూడా ఉన్నారు. అమెరికా ఈ సమయములో అన్నిటికంటే ఉత్తమమైనది(హైయెస్ట్). బృహస్పతి దశ కూర్చొని ఉంది. కానీ దానితో పాటు రాహు దశ కూడా ఉంది. ఇప్పుడు అందరి పై రాహు దశ కూర్చుని ఉంది. వినాశనమైతే అందరూ అవుతారు. భారతదేశము ఏదైతే అన్నింటికంటే సంపన్న దేశముగా ఉండేదో ఇప్పుడు ఆ భారతదేశము పేదగా ఉంది. ఇదంతా మాయావీ ఆడంబరము. మాయ పూర్తి ఫోర్సుగా(వైభవోపేతము) ఉంది. అందువలన మనుష్యులు దీనిని స్వర్గమని భావిస్తారు. అమెరికాలో ఏమేమి తయారై ఉన్నాయో చూడండి. మనుష్యులు బాహ్య ఆడంబరమును చూసి ఆకర్షితులుగా అవుతారు. బొంబాయి కూడా ఎంత ఫ్యాషనబుల్‌గా అయ్యిందో చూడండి. ఇంతకు ముందు ఇలా లేదు. మాయావీ పాంప్ (వైభవము, సిటి ఆఫ్ పాంపియా) ఎలా ఉందంటే 8-10 అంతస్థుల భవనాలు ఎన్నో నిర్మిస్తున్నారు. స్వర్గములో అన్ని అంతస్థులు ఉండవు. అచ్చట రెండు అంతస్థులు కూడా ఉండవు. తగినంత భూమి లేనందున ఇక్కడ అంతస్థులు నిర్మిస్తున్నారు. భూమి విలువ ఎంతగానో పెరిగిపోయింది. కావున ఇదే స్వర్గమని మనుష్యులు భావిస్తున్నారు. అనేక ప్లానులు తయారు చేస్తూ ఉంటారు. కానీ మనుష్యుడు ‘తానొకటి తలిస్తే..................’ (నర్ చాహతా కుచ్ ఔర్............) అని అంటారు. మనుష్యులు చాలా చింతలలో మునిగి ఉన్నారు. అందరికీ మృత్యువు తల పై ఉంది. అందరి కంఠానికి మృత్యుపాశము బిగించబడి ఉంది. ఇప్పుడు మీరు కూడా ఉరిలో తగులుకొని ఉన్నారు. మీ బుద్ధి అచ్చట నూతన ప్రపంచములో తగులుకొని ఉంది. ఇప్పుడు అందరూ వానప్రస్థ అవస్థలోకి వెళ్లే సమయము. అందువలన తండ్రి అంటున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. నేను స్వయంగా మీకు ఆదేశమునిస్తున్నాను - మీ అందరిదీ వానప్రస్థ అవస్థ, నేను అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. దోమల వలె మీరందరూ రావలసి వస్తుంది. 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. ఇప్పుడు బ్రతికి ఉండి(శరీరములో ఉంటూ, జీతే జీ) నన్ను స్మృతి చేయండి. మనము ఇలాగే స్వర్గములోకి వెళ్లేందుకు సిద్ధముగా కూర్చొని ఉన్నాము. ఇతరులెవ్వరూ స్వర్గములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోరు. ఒకవేళ స్వర్గములోకి వెళ్లేందుకు ఖుషీ ఉంటే జబ్బు చేసినప్పుడు మందు మొదలైనవి కూడా తీసుకోరు. వారు స్వర్గములోకి వెళ్లరని మీకు తెలుసు. ఇప్పుడు మనము స్వీట్ హోవ్ుకు(మధురమైన ఇంటికి) వెళ్తున్నాము. ఇది గాడ్‌ఫాదర్ ఇల్లు అనగా ఆత్మిక శివాలయము. సత్యయుగాన్ని శారీరిక శివాలయమని అంటారు. ఆ స్వర్గములోకి వెళ్లేందుకు మనము పురుషార్థము చేస్తున్నాము. బాబా అర్థం చేయించారు - ‘‘బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి’’ ప్రసిద్ధి చెందాయి. రాత్రి పూర్తి అయినప్పుడు నేను వస్తాను. ‘లక్ష్మీనారాయణుల పగలు-రాత్రి’ అని అనరు. వారు కూడా వీరే. కానీ బ్రహ్మకు పగలు, రాత్రి గురించిన జ్ఞానము తెలుసు. అక్కడ లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానము లేదు. కావున బ్రహ్మ, బి.కె.లకు మాత్రమే శివుని రాత్రి ఎప్పుడు అవుతుందో తెలుసు. ప్రపంచములోని వారికి ఈ విషయాలు తెలియవు. శివుడు ‘నిరాకారుడు’ మరి వారెలా వస్తారు? ఈ ప్రశ్న కూడా అడగవలసి వస్తుంది కదా. శివజయంతి నాడు మీరు ఎంతో సేవ చేయవచ్చు. రాజధాని స్థాపనవుతోంది. ఇప్పుడు ఇది చాలా చిన్న వృక్షము. ఈ వృక్షానికి తుఫాను వస్తుంది. ఇతర వృక్షాలకు ఇన్ని తుఫానులు రావు. ఇందులో ఒకటి తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఇది మీ నూతన జన్మ. మాయావి తుఫానులు కూడా మీ ముందే నిల్చొని ఉన్నాయి. ఇతరులెవ్వరికీ ఈ తుఫానులను ఎదిరించే అవసరము లేదు. ఇచ్చట ధర్మ స్థాపనలో మాయా తుఫానులు వస్తాయి ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన గమ్యము. విశ్వానికి చక్రవర్తిగా అవ్వడం క్రొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు మీరు ఈ తుఫానులను దాటుకొని మీ రాజ్యభాగ్యమును తీసుకున్నారు. ఎవరు ఏ విధమైన పురుషార్థము చేస్తున్నారో అదంతా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. ఎంతగా ముందుకు వెళ్తారో, అంతగా మీరు ఏ పదవిని పొందుతారో సాక్షాత్కారమౌతుంది. వీరు ఎలాంటి పురుషార్థము చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది కదా. ధనవంతులు, పేదవారన్న విషయము కాదు. చివరికి ఆ రోజు వచ్చింది........... అనే పాట కూడా విన్నారు. పేదల పెన్నిధి అయిన తండ్రి వచ్చారు. బాబా అంటున్నారు - ‘‘ నేను ధనవంతులకు ధనమివ్వను, వారు ధనవంతులుగానే ఉన్నారు. వారికి స్వర్గమిచ్చటనే ఉంది, కోటీశ్వరులున్నారు. ఇంతకుముందు కోటీశ్వరులుగా ఎవరో ఒకరు అతికష్టము మీద ఉండేవారు. ఇప్పుడు కోట్ల మనుష్యుల వద్ద సంపద గోడలలో దాచబడి ఉంది. కానీ ఈ సంపద ఎవ్వరికీ ఉపయోగపడదు. కడుపు ఎక్కువగా తినదు. మోసముతో ధనము పోగు చేసుకునే వారికి నిద్రపట్టదు. గవర్నమెంటువారు ఎప్పుడు అకస్మాత్తుగా తనిఖీ చేస్తారో తెలియదు. తండ్రి అంటున్నారు - ‘‘ఇది అంతిమ సమయము. ఇప్పుడు కొంతమందిది (సంపద) మట్టిలో కూరుకొని పోతుంది. భగవంతుని పేరు మీద ఖర్చు చేసినది మాత్రమే సఫలమౌతుంది.’’ ఆ ‘ధని’(భగవంతుడు) ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇప్పుడు మీరు తండ్రి వద్ద మీదంతా ఇన్ష్యూర్ చేయండి. మృత్యువు మీ ముందే నిలబడి ఉంది. మీ ఆశలన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. తండ్రి పేదలను ఉద్ధరిస్తారు. ధనవంతుల సొమ్ము ఒక వేయి రూపాయలు, పేదల ఒక్క రూపాయి రెండూ సమానమే. ఎక్కువగా పేదవారే వస్తారు. కొంతమంది జీతము 100, కొంతమందిది 150,......... ప్రపంచములో మనుష్యుల వద్ద కోట్లు కోట్లు ఉన్నాయి. వారికిదే స్వర్గము. వారు ఎప్పుడూ రారు, బాబాకు వారి అవసరము కూడా లేదు. బాబా అంటున్నారు - ‘‘ మీ ఇల్లు మొదలైనవి భలే కట్టుకోండి, సేవాకేంద్రాలు తెరవండి. నేను డబ్బు ఏమి చేసుకుంటాను.’’ సన్యాసులు చాలా ప్లాట్లు మొదలైనవి నిర్మించుకుంటారు, వారి వద్ద చాలా సంపద ఉంటుంది. ఈ రథము కూడా అనుభవజ్ఞుడే కదా. ఇప్పుడు నేను పేదవారిని ధనవంతులుగా చేసేందుకు వచ్చాను, ఇప్పుడు ధైర్యము చేయండి, కోటీశ్వరుల ధనము దేనికీ ఉపయోగపడదు. ఇచ్చట ధనము మొదలైనవాటి విషయమేదీ లేదు. తండ్రి కేవలము ‘ మన్మనాభవ ’ అని అంటున్నారు. ఖర్చు విషయమేదీ లేదు. ఈ ఇల్లు నిర్మించారు, అది కూడా చాలా సింపుల్‌గా నిర్మించారు. చివరి సమయములో అందులో మీరే ఉంటారు. మీ స్మృతిచిహ్నాలు ఇచ్చట నిలబడి ఉన్నాయి, ఇప్పుడు మరలా చైతన్యంగా స్థాపన చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ జడ స్మృతిచిహ్నాలు సమాప్తమైపోతాయి. ఆబూలోకి వచ్చి ఈ మందిరాన్ని చూడకుండా, వీరి కర్తవ్యమును తెలుసుకోకుంటే ఏమియూ చూచినట్లే కాదు..........’’ అని మీరు వ్రాయండి. ఇప్పుడు మీరంటారు - ‘‘ మేమిప్పుడు చైతన్యములో కూర్చుని ఉన్నాము, ఈ జడ చిత్రాల రహస్యాన్ని అర్థం చేయించగలము. వారే మేము అని అంటారు. మా జడ స్మృతిచిహ్నాలు తయారు చేయబడ్డాయి, ఇది అద్భుతమైన మందిరము. విచిత్రము కదా! మమ్మా - బాబా మరియు పిల్లలు ఇచ్చట చైతన్యములో కూర్చుని ఉన్నారు, అచ్చట జడ చిత్రాలున్నాయి. ముఖ్యమైనవారు ఈ శివుడు, బ్రహ్మ, జగదంబ మరియు లక్ష్మీనారాయణులు. ఎంత మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. తండ్రివారిగా తయారై తండ్రిని(విడాకులిచ్చేస్తారు) వదిలేస్తారు. ఇది కూడా క్రొత్త విషయమేమీ కాదు. అయినా తండ్రివారిగా అయ్యి మళ్లీ పారిపోతారు. పారిపోయినవారి చిత్రాలు కూడా మనము పెట్టవచ్చు. పక్కా నిశ్చయముంటే మీ రాజ్యపదవి చిత్రాన్ని కూడా తయారు చేసుకుంటే స్మృతి ఉంటుంది. భవిష్యత్తులో మేము డబుల్ కిరీటధారులై స్వర్గానికి అధికారులుగా అవుతాము. తండ్రిని వదిలేస్తే కిరీటము క్రింద పడిపోతుంది. ఇది అర్థము చేసుకోవలసిన చాలా అద్భుతమైన విషయము. తండ్రిని స్మృతి చేయండి. వారి నుండే వారసత్వము లభిస్తుంది. దానినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. బాబా మనలను భవిష్యత్తు కొరకు అర్హులుగా చేస్తున్నారు. మనుష్యులు మరుసటి జన్మ కొరకు దాన-పుణ్యాలు చేస్తారు. అవి అల్పకాలిక ప్రాప్తులు. ఈ చదువు ద్వారా మీకు భవిష్య 21 జన్మలకు ప్రాలబ్ధము తయారౌతుంది. ఎవరైనా ఈ తల్లిదండ్రుల ఆజ్ఞలను పూర్తిగా పాటిస్తే ఒక్కసారిగా దాటి తరిస్తారు, తల్లి-తండ్రి కూడా సంతోషిస్తారు. అమలు పరచకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. శివబాబా అంటున్నారు - ‘‘నేను నిష్కామిని,.......... అభోక్తను,......... నేను ఈ టోలి మొదలైనవేవీ తినను. విశ్వచక్రవర్తి పదవి కూడా మీ కొరకే. ఈ ఆహార-పానీయాలు కూడా మీ కొరకే. నేను సేవకుడను, నేను వచ్చు సమయము కూడా ఫిక్స్ అయ్యింది. కల్ప-కల్పము నా పిల్లలకు రాజ్యభాగ్యమిచ్చి, నేను నిర్వాణధామములో కూర్చుంటాను. తండ్రిని ఎవ్వరూ మర్చిపోరాదు. తండ్రి మీకు స్వర్గ సార్వభౌమత్వమును ఇచ్చేందుకు వచ్చారు అయినా మీరు వారిని మర్చిపోతారు. ఎవరికైనా తండ్రి పరిచయమిచ్చేందుకు కూడా చాలా సహజ విధానము తెలియజేశారు - ‘‘ పరమపిత పరమాత్మతో మీకు ఏ సంబంధముంది? ప్రజాపిత బ్రహ్మతో మీకు సంబంధమేమిటి? ’’ అని వారిని అడగండి. ఇరువురూ తండ్రులే. వారు నిరాకారులు, ఇతను సాకారుడు. తండ్రిని సర్వవ్యాపి అన్నందున వారసత్వము ఎలా లభిస్తుంది? భగవంతుని శ్రీమతము లభిస్తుంది. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా అవుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మాయా తుఫానులను దాటుకుంటూ తండ్రి నుండి సంపూర్ణ వారసత్వము తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆజ్ఞలను అమలు చేయాలి.

2. పాత ప్రపంచాన్ని మర్చిపోయి నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. మృత్యువుకు ముందే తండ్రి వద్ద స్వయాన్ని ఇన్ష్యూర్(భీమా) చేసుకోవాలి.

వరదానము :-

‘‘ సమర్పణ భావముతో సేవ చేస్తూ సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారీ భవ ’’

ఎవరైతే సమర్పణ భావముతో సేవ చేస్తారో, వారు సత్యమైన సేవాధారులు. సేవలో కొంచెము కూడా ‘‘నాది” అనే భావము ఉండరాదు. ఎక్కడైతే నాది అనే భావముంటుందో, అక్కడ సఫలత ఉండదు. ఎవరైనా ఇది నా పని, నా విచారము, నా కర్తవ్యము అని భావించినారంటే - ఈ మేరాపన్ రావడం అనగా మోహం ఉత్పన్నమగుట. కానీ ఎక్కడ ఉన్నా సదా నేను కేవలం నిమిత్తము, ఇది నా ఇల్లు కాదు, సేవాస్థానము అనే స్మృతి ఉండాలి. ఈ సమర్పణ భావము ద్వారా నిర్మోహులుగా అయ్యి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు.

స్లోగన్ :-

‘‘ సదా స్వమానమనే సీటు పై ఉంటే సర్వశక్తులు మీ ఆజ్ఞలను గౌరవిస్తూ ఉంటాయి ’’