12-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - చదువు మరియు దైవీ క్యారెక్టర్ ల రిజిస్టర్ ను పెట్టుకోండి, నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగలేదు కదా అని రోజూ చెక్ చేసుకోండి”

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ పురుషార్థము ద్వారా రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు?

జవాబు:-

1. సదా ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థము చేయండి. సంగమయుగంలో ఆజ్ఞాకారులు అన్న తిలకాన్ని పెట్టుకున్నట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. అవిశ్వాసపాత్రులు అనగా ఆజ్ఞను పాటించనివారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. 2. ఏ రోగాన్ని సర్జన్ నుండి దాచిపెట్టకూడదు. దాచిపెట్టినట్లయితే పదవి తక్కువైపోతుంది. బాబా వలె ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, చదువు అంటే తెలివి. ఈ చదువు చాలా సహజమైనది, చాలా ఉన్నతమైనది మరియు చాలా ఉన్నతమైన పదవిని అందించేదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఈ చదువును చదువుకుంటున్నామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున చదువుకునేవారికి చాలా సంతోషం ఉండాలి. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు! ఇది అదే గీతా అధ్యాయము (ఎపిసోడ్). ఇది సంగమయుగము కూడా. పిల్లలైన మీరిప్పుడు మేల్కొన్నారు, మిగిలినవారందరూ నిద్రిస్తూ ఉన్నారు. మాయా నిద్రలో నిద్రిస్తున్నారని గాయనము కూడా ఉంది. బాబా వచ్చి మిమ్మల్ని మేల్కొలిపారు. కేవలం ఒక్క విషయంపై అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, ఎలాగైతే కల్పక్రితము చేశారో, అలా స్మృతియాత్ర బలముతో మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేయండి. బాబా ఈ స్మృతిని కలిగిస్తారు. కల్ప-కల్పము మేము ఈ యోగబలముతో విశ్వానికి యజమానులుగా అవుతాము, మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేశాము అనే స్మృతి మాకు కలిగిందని పిల్లలు కూడా భావిస్తారు. యోగం పైనే పూర్తి ధ్యానమునుంచాలి. ఈ యోగబలంతో పిల్లలైన మీలో ఆటోమెటిక్ గా దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఈ పరీక్ష తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఉన్నది. యోగబలంతో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మా యోగబలంతో మొత్తం విశ్వమంతా పవిత్రంగా అవ్వనున్నదని కూడా మీకు తెలుసు. ఇంతకుముందు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయింది. మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మరియు అది మనసులో కూడా ఉంది. కొత్తవారికైనా సరే ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. దేవతలైన మీరు పూజ్యంగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా, తమోప్రధానంగా అయిపోయారు, ఇంకెవ్వరూ ఇలా చెప్పలేరు కూడా. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గమని తండ్రి క్లియర్గా తెలియజేస్తారు. భక్తి గతించిపోయింది. గతించిన విషయాల గురించి ఆలోచించకండి. అవి కింద పడేసే విషయాలు. తండ్రి ఇప్పుడు పైకి ఎక్కే విషయాలను వినిపిస్తున్నారు. మేము దైవీ గుణాలను తప్పకుండా ధారణ చెయ్యాలని పిల్లలకు కూడా తెలుసు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటాము, మా ద్వారా ఏయే పొరపాట్లు జరిగాయి అని ప్రతిరోజు చార్టు వ్రాయాలి. పొరపాట్లు చేస్తే భారీ దెబ్బ తగులుతుంది. ఆ చదువులో కూడా క్యారెక్టర్లు చూడడం జరుగుతుంది. ఇందులో కూడా క్యారెక్టర్ చూడటం జరుగుతుంది. తండ్రి అయితే మీ కళ్యాణం కోసమే చెప్తారు. అక్కడ కూడా చదువు మరియు నడవడికల రిజిస్టర్ పెడతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ ను తయారు చేసుకోవాలి. పొరపాట్లు జరగకుండా సంభాళించుకోవాలి. నా వలన ఎటువంటి పొరపాటూ జరగలేదు కదా? అందుకే కచేరీ కూడా నిర్వహిస్తారు. ఇంకే స్కూలు మొదలైనవాటిలో కచేరీ జరగదు. మీ మనసును ప్రశ్నించుకోవాలి. మాయ కారణంగా ఏదో ఒక అవజ్ఞ జరుగుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. ప్రారంభంలో కూడా కచేరీ జరిగేది. పిల్లలు సత్యం చెప్పేవారు. ఒకవేళ సత్యం చెప్పకపోతే ఆ పొరపాట్లు వృద్ధి చెందుతూ ఉంటాయి, పైపెచ్చు ఆ పొరపాట్లకు శిక్ష లభిస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. పొరపాటు చెప్పకపోతే ఆజ్ఞను ఉల్లంఘించినవారు అనే ముద్ర పడుతుంది, తర్వాత రాజ్య తిలకం లభించదు. ఆజ్ఞను స్వీకరించకపోతే, అవిశ్వాసపాత్రులుగా అయినట్లయితే రాజ్యాన్ని పొందలేరు. సర్జన్ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకవేళ సర్జన్ వద్ద అనారోగ్యాన్ని దాచిపెట్టినట్లయితే పదవి కూడా తగ్గిపోతుంది. సర్జన్ కు చెప్తే దెబ్బలేమీ పడవు కదా. తండ్రి కేవలం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఒకవేళ మళ్ళీ అలాంటి పొరపాటును చేస్తే నష్టపోతారు, పదవి చాలా తగ్గిపోతుంది. అక్కడైతే న్యాచురల్ గానే దైవీ నడవడిక ఉంటుంది, ఇక్కడైతే పురుషార్థం చెయ్యాలి. పదే-పదే ఫెయిల్ అవ్వకూడదు. పిల్లలూ, ఎక్కువ పొరపాట్లు చేయకండని తండ్రి చెప్తున్నారు. తండ్రి చాలా ప్రేమ సాగరుడు, పిల్లలు కూడా అలా తయారవ్వాలి. యథా తండ్రి, తథా పిల్లలు. యథా రాజా రాణి, తథా ప్రజలు. బాబా అయితే రాజు కాదు. బాబా మనల్ని తమ సమానంగా తయారుచేస్తారని మీకు తెలుసు. తండ్రికి ఏ మహిమనైతే చేస్తారో, అది మీకు కూడా జరగాలి, తండ్రి సమానంగా అవ్వాలి. మాయ చాలా శక్తివంతమైనది, మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనివ్వదు. మాయ పంజాలో పూర్తిగా చిక్కుకొని ఉన్నారు. మాయ జైలు నుండి మీరు బయటపడలేరు. సత్యం చెప్పరు. అందుకే ఏక్యురేట్ స్మృతి చార్టును పెట్టమని తండ్రి చెప్తున్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి, తండ్రినే మహిమ చెయ్యండి. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు కనుక మేము మీ మహిమనే చేస్తాము. భక్తి మార్గంలో ఎంత మహిమను పాడుతారు కానీ వారికి ఏమీ తెలియదు. దేవతలకు మహిమ లేనే లేదు. బ్రాహ్మణులైన మీకే మహిమ ఉంది. అందరికీ సద్గతినిచ్చేవారు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వారు క్రియేటర్ కూడా, డైరెక్టర్ కూడా. సేవ కూడా చేస్తారు మరియు పిల్లలకు అర్థం కూడా చేయిస్తారు. ప్రాక్టికల్ గా చెప్తారు. వారు కేవలం శాస్త్రాల ద్వారా భగవానువాచ అని వింటూ ఉంటారు. గీతను చదువుతూ ఉంటారు కానీ దాని వలన ఏం లభిస్తుంది? ఎంత ప్రేమగా కూర్చొని చదువుతారు, భక్తి చేస్తారు, వీటి ద్వారా ఏమి జరుగుతుంది అనేది తెలియదు! మేము కిందకు మెట్లు దిగుతున్నామని తెలియదు. రోజు రోజుకూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. డ్రామాలో ఆ విధంగా నిశ్చితమై ఉంది. ఈ మెట్ల రహస్యం తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. శివబాబాయే బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. ఇతను కూడా వారి నుండి అర్థం చేసుకొని తర్వాత మీకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన గొప్ప టీచరు, గొప్ప సర్జన్ అయితే తండ్రియే. వారినే స్మృతి చేయాలి. బ్రాహ్మణీని స్మృతి చేయమని ఈ విధంగా చెప్పరు. ఒక్కరి స్మృతియే ఉంచుకోవాలి. ఎప్పుడూ ఎవరి పట్ల మోహం పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి నుండే శిక్షణ తీసుకోవాలి. నిర్మోహులుగా కూడా అవ్వాలి. ఇందులో చాలా కృషి చేయాలి. మొత్తం పాత ప్రపంచం పట్ల వైరాగ్యముండాలి. ఇది సమాప్తమయ్యేదే ఉంది. దీని పట్ల ప్రేమ కానీ, ఆసక్తి కానీ ఏమాత్రం ఉండదు. ఎంత పెద్ద-పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకా ఎంత సమయం ఉంటుంది అనేది కూడా వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కున్నారు, ఇతరులను కూడా మేల్కొలుపుతారు. తండ్రి ఆత్మలనే మేల్కొలుపుతారు, స్వయాన్ని ఆత్మగా భావించమని పదే-పదే చెప్తారు. శరీరమని భావిస్తే నిద్రిస్తున్నట్లు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆత్మ పతితంగా ఉన్నట్లయితే శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. ఆత్మ పావనంగా ఉంటే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది.

మీరే ఈ దేవీ దేవతా వంశానికి చెందినవారిగా ఉండేవారు, మళ్ళీ మీరే అలా తయారవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎంత సహజమైన విషయము. ఇటువంటి అనంతమైన తండ్రిని మనము ఎందుకు స్మృతి చేయము. ఉదయాన్నే లేచి కూడా తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీదైతే అద్భుతము, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన దేవీ దేవతలుగా చేసి నిర్వాణధామంలో కూర్చుండిపోతారు, ఇంత ఉన్నతంగా అయితే ఎవ్వరూ తయారుచేయలేరు, మీరు ఎంత సహజం చేసి తెలియజేస్తారు. బాబా అంటారు - ఎంత సమయం లభిస్తే అంత, కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయగలరు. స్మృతియే మీ నావను తీరానికి చేర్చేటువంటిది అనగా కలియుగం నుండి ఆ తీరానికి శివాలయంలోకి తీసుకువెళ్ళేది. శివాలయాన్ని కూడా గుర్తు చేయాలి, శివబాబా ద్వారా స్థాపన చేయబడిన స్వర్గం - ఈ రెండింటి స్మృతి వస్తుంది. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము కోసం. తండ్రి కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారు. తండ్రి వచ్చి తప్పకుండా ఏదో ఒక కర్తవ్యాన్ని చేస్తారు కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పాత్రను అభినయిస్తున్నానని మీరు చూస్తున్నారు కూడా. పిల్లలైన మీకు 5 వేల సంవత్సరాల క్రితపు స్మృతి యాత్ర మరియు ఆదిమధ్యాంతముల రహస్యాన్ని తెలియజేస్తాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి మా సన్ముఖంలోకి వస్తారని మీకు తెలుసు. ఆత్మయే మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. తండ్రి పిల్లలకు శిక్షణనిస్తారు - ఆత్మనే పవిత్రంగా తయారుచేసుకోవాలి. ఆత్మ ఒక్కసారి మాత్రమే పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. నేను మిమ్మల్ని అనేకసార్లు చదివించాను, మళ్ళీ చదివిస్తాను అని తండ్రి అంటారు. సన్యాసులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. పిల్లలూ, నేను డ్రామా ప్లాన్ అనుసారముగా చదివించేందుకు వచ్చాను, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి చదివిస్తాను, ఎలాగైతే కల్పక్రితం మిమ్మల్ని చదివించి రాజధానిని స్థాపన చేశానో, అలా అనేక సార్లు మిమ్మల్ని చదివించి రాజ్యాన్ని స్థాపన చేశాను అని తండ్రి మాత్రమే అంటారు. తండ్రి ఎంత అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తారు. శ్రీమతం ఎంత శ్రేష్ఠమైనది. శ్రీమతం ద్వారానే మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. అది చాలా చాలా గొప్ప పదవి! ఎవరికైనా పెద్ద లాటరీ లభిస్తే వారి తల పాడైపోతుంది. కొందరు నడుస్తూ-నడుస్తూ, మేము చదవలేము, మేము విశ్వరాజ్యాధికారాన్ని ఎలా తీసుకుంటాము అని హోప్ లెస్ (నిరాశ) అయిపోతారు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. అతీంద్రియ సుఖము మరియు సంతోషపు విషయాలు నా పిల్లలను అడగండి అని బాబా అంటారు. మీరు అందరికీ సంతోషపు విషయాలను వినిపించేందుకు వెళ్తారు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు అనుభవించి బానిసలుగా అయ్యారు. నేను బానిసను, నేను మీ బానిసను అని పాడుతారు కూడా. స్వయాన్ని నీచులమని అనుకోవడం, చిన్నవారిగా అయి నడుచుకోవడం మంచిదని భావిస్తారు. చూడండి, తండ్రి ఎవరు! వారి గురించి ఎవ్వరికీ తెలియదు. వారి గురించి కూడా కేవలం మీరే తెలుసుకున్నారు. తండ్రి వచ్చి అందరినీ పిల్లలూ-పిల్లలూ అని అంటూ ఎలా అర్థం చేయిస్తారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ. వారి నుండి మనకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. అంతేకానీ గంగా స్నానము మొదలైనవి చేయడం ద్వారా స్వర్గ రాజ్యమేమీ లభించదు. గంగా స్నానమైతే చాలా సార్లు చేశారు. నీరు సాగరం నుండి వస్తుంది కానీ ఈ వర్షం ఎలా పడుతుంది, దీన్ని కూడా ప్రాకృతికమని అంటారు. ఈ సమయంలో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు. ధారణ కూడా ఆత్మయే చేస్తుంది, శరీరం కాదు. తప్పకుండా బాబా ఎలా ఉన్న మమ్మల్ని ఎలా తయారుచేశారని మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీపై మీరు దయ చూపించుకోండి. ఎలాంటి అవజ్ఞ చేయకండి. దేహాభిమానులుగా అవ్వకండి. అనవసరంగా మీ పదవిని తక్కువ చేసుకుంటారు. టీచరైతే అర్థం చేయిస్తారు కదా. తండ్రి అనంతమైన టీచర్ అని మీకు తెలుసు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి. ఏదైనా విషయాన్ని ముద్రించినట్లయితే, అది అన్ని భాషల్లోనూ ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ ముద్రించినట్లయితే అందరికీ ఒక్కొక్క కాపీని పంపించండి. ఒక్కొక్క కాపీని లైబ్రరీకి పంపించాలి. ఖర్చు విషయం లేదు. బాబా భండారా బాగా నిండుతుంది. ధనాన్ని తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు. ఇంటికైతే తీసుకువెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇంటికి తీసుకువెళ్ళినట్లయితే పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనం చేసినట్లవుతుంది. అది చాలా పెద్ద తప్పు, ఇటువంటి బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు. పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనమా! అటువంటి మహాన్ పాపాత్ములు మరెవ్వరూ ఉండలేరు. ఎంతటి అధమగతి ఏర్పడుతుంది. ఇదంతా డ్రామాలోని పాత్ర అని తండ్రి అంటారు. మీరు రాజ్యం చేస్తారు, వారు మీ సేవకులుగా అవుతారు. సేవకులు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది! కల్పక్రితం కూడా ఇలాగే స్థాపన జరిగింది.

తమ కళ్యాణం చేసుకోవాలనుకుంటే శ్రీమతంపై నడవండి, దైవీగుణాలు ధారణ చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. క్రోధం చేయడం దైవీ గుణం కాదు. అది ఆసురీ గుణము అయిపోతుంది. ఎవరైనా క్రోధం చేస్తే వారిని శాంతపరచాలి. బదులు చెప్పకూడదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకోవచ్చు, అవగుణాలు అయితే అందరిలో ఉన్నాయి. ఎవరైనా క్రోధం చేస్తే వారి ముఖం రాగి వలె అయిపోతుంది. నోటి ద్వారా బాంబులు వేస్తారు. స్వయాన్నే నష్టపర్చుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. వివేకం ఉండాలి. ఏదైనా పాప కర్మ చేసినట్లయితే, దానిని వ్రాయండి అని బాబా అంటారు. బాబాకు తెలియజేస్తే క్షమాపణ లభిస్తుంది. భారం తేలికైపోతుంది. జన్మ-జన్మాంతరాలుగా మీరు వికారాలలోకి వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఏదైనా పాప కర్మ చేసినట్లయితే అది వంద రెట్లవుతుంది. తండ్రి ఎదురుగా తప్పు చేసినట్లయితే వంద రెట్లు శిక్ష లభిస్తుంది. చేసారు కానీ చెప్పలేదు అంటే ఇంకా వృద్ధి చెందుతుంది. స్వయాన్ని నష్టపరచుకోకండి అని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లల బుద్ధిని మంచిగా చేసేందుకు వచ్చారు. వీరు ఎటువంటి పదవిని పొందుతారు అనేది తెలుసు. అది కూడా 21 జన్మల విషయము. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుంటారో, వారి స్వభావము చాలా మధురంగా ఉండాలి. బాబా, ఈ పొరపాటు జరిగింది అని కొందరు వెంటనే చెప్తారు. బాబా సంతోషిస్తారు. భగవంతుడు సంతోషించారంటే ఇంకేమి కావాలి, వీరైతే తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ కూడా, లేకపోతే ముగ్గురూ కోపగించుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతంపై నడుస్తూ తమ బుద్ధిని మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి అవజ్ఞనూ చేయకూడదు. క్రోధంలోకి వచ్చి నోటి నుండి బాంబులు వేయకూడదు, మౌనంగా ఉండాలి.

2. మనస్ఫూర్తిగా ఒక్క తండ్రి మహిమనే చెయ్యాలి. ఈ పాత ప్రపంచం పట్ల ఆసక్తి లేక ప్రేమ పెట్టుకోకూడదు. అనంతమైన వైరాగులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి.

వరదానము:-

తమ అవ్యక్త శాంత స్వరూపము ద్వారా వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే సాక్షాత్ మూర్త భవ

ఎలాగైతే సేవ కొరకు ఇతర ప్రోగ్రాములు తయారుచేస్తారో, అదే విధంగా ఉదయం నుండి రాత్రి వరకు స్మృతియాత్రలో ఎలా ఉండాలి మరియు ఎప్పుడు ఉండాలి అన్న ఈ ప్రోగ్రామ్ ను కూడా తయారు చేసుకోండి మరియు మధ్య మధ్యలో 2-3 నిమిషాల కోసం సంకల్పాల ట్రాఫిక్ ను స్టాప్ చెయ్యండి, ఎవరైనా వ్యక్త భావంలో ఎక్కువగా కనిపించినప్పుడు వారికి చెప్పకుండానే మీ అవ్యక్త శాంతి రూపాన్ని ఎలా ధారణ చెయ్యండంటే, వారు కూడా సూచన ద్వారానే అర్థం చేసుకోవాలి, దీనితో వాతావరణం అవ్యక్తంగా ఉంటుంది, ప్రత్యేకత కనిపిస్తుంది మరియు మీరు సాక్షాత్కారం చేయించే సాక్షాత్ మూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-

సంపూర్ణ సత్యతయే పవిత్రతకు ఆధారం.