12-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం


'' మధురమైన పిల్లలారా - సత్సంగము జ్ఞాన మార్గములో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యములో కూర్చొని ఉన్నారు, తండ్రి స్మృతిలో ఉండుట అనగా సత్సంగము చేయడం ''

ప్రశ్న:-

పిల్లలైన మీకు సత్సంగము ఈ సమయములోనే అవసరము - ఎందుకు ?

జవాబు:-

ఎందుకంటే ఒక్క సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు సాంగత్యము వల్లనే తమోప్రధాన ఆత్మలు సతోప్రధానము అనగా అపవిత్రము నుండి పవిత్రంగా అవుతాయి. సత్యమైన తండ్రి సాంగత్యము లేకుంటే నిర్బలాత్మలు శక్తివంతంగా అవ్వలేవు. తండ్రి సాంగత్యము ద్వారా ఆత్మలో పవిత్రతా శక్తి వస్తుంది. 21 జన్మలకు వారి నావ తీరానికి చేరుకుంటుంది.

ఓంశాంతి.

పిల్లలు సత్సంగములో కూర్చొని ఉన్నారు. ఈ సత్సంగము(సత్యమైన సాంగత్యము)లో పిల్లలు కల్ప-కల్పము ఈ సంగమ యుగములోనే కూర్చుంటారు. సత్యమైన సాంగత్యమంటే ఏమిటో ప్రపంచములోని వారికి తెలియదు. సత్సంగము అనే పేరు మాత్రము అవినాశిగా వస్తూనే ఉంది. భక్తిమార్గములో కూడా మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నామని అంటారు. కాని వాస్తవానికి భక్తి మార్గములో సత్సంగానికి ఎవ్వరూ వెళ్లరు. సత్సంగము ఒక్క జ్ఞాన మార్గములోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సత్యము(ట్రూత్/ుతీబ్ష్ట్ర) సాంగత్యములో కూర్చొని ఉన్నారు. ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యములో కూర్చొని ఉన్నాయి. ఏ ఇతర చోట ఆత్మలు పరమపిత పరమాత్మ సాంగత్యములో కూర్చోవు. ఎందుకంటే తండ్రి అంటే ఎవరో తెలియదు. మేము సత్సంగానికి వెళ్తామని అంటారు. కాని వారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. మీరు దేహాభిమానంలోకి రారు. మనమంతా ఆత్మలమని సత్యమైన తండ్రి సాంగత్యములో కూర్చున్నామని భావిస్తారు. ఇతర మనుష్యులెవ్వరూ సత్యమైన సాంగత్యములో కూర్చోలేరు. సత్యంతో సాంగత్యము అనే పేరు కూడా ఇప్పటిదే. సత్యానికి యథార్థమైన అర్థము తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రి ఎవరైతే సత్యమైనవారో, వారి జతలో కూర్చొని ఉన్నారు. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు అనగా మీరు సత్సంగములో కూర్చొని ఉన్నారు. మీరు ఇక్కడ ఇంటిలో కూర్చుని ఉన్నా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలమైన మనము ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యమైన సాంగత్యములో ఉన్నాము. తండ్రి మధువనంలో కూర్చ్చొని ఉన్నారు. తండ్రిని స్మృతి చేసే అనేక విధములైన యుక్తులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. మనము 16 కళా సంపూర్ణంగా అవుతామని మళ్లీ క్రిందకు వస్తూ వస్తూ కళలు తగ్గిపోతాయని కూడా పిల్లలైన మీకు తెలుసు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. తర్వాత దిగుతూ, దిగుతూ వ్యభిచారి భక్తిగా అయినందున తమోప్రధానమైపోతారు కనుక వారికి మళ్లీ సత్యమైన సాంగత్యము తప్పకుండా అవసరము. లేకుంటే పవిత్రంగా ఎలా అవుతారు? ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించింది. మనము బాబాను స్మృతి చేయాలని వారి సాంగత్యములోనే ఉండాలని ఆత్మకు తెలుసు. స్మృతిని కూడా సాంగత్యమని అంటారు. ఇది సత్యముతో సాంగత్యము. దేహమున్నా ఆత్మలైన మీరు నన్ను స్మృతి చేయండి. ఇదే సత్యముతో సాంగత్యము. ఇతనికి ఎవరో గొప్ప వ్యక్తి సాంగత్యము లభించిందని, అందువలన దేహాభిమానిగా అయ్యాడని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించింది. దీని వలన మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి అంటున్నారు - నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇప్పుడు ఆత్మ పరమాత్మ సాంగత్యము చేసినందున మీరు 21 జన్మలు తీరానికి చేరుకుంటారు. ఆ తర్వాత మళ్లీ మీకు దేహ సాంగత్యము లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండి అంటున్నారు - పిల్లలైన మీరు నా సాంగత్యములోనికి వచ్చినందున సతోపధ్రానంగా అవుతారు. దానిని స్వర్ణిమ యుగమని అంటారు.

సాధు-సత్పురుషులు మొదలైనవారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. అందరూ పరమాత్మలే పరమాత్ములని అనుకుంటారు అనగా పరమాత్మలో మలినము ఏర్పడిందని అర్థమవుతుంది. పరమాత్మలో మలినము చేరనే చేరదు. తండ్రి అడుగుతున్నారు - పరమాత్మ అయిన నాలో మలినము చేరుతుందా? చేరదు. నేను సదా పరంధామములో ఉంటాను, ఎందుకంటే నేను జనన-మరణాలలోకి రాను. ఇది పిల్లలైన మీకు తెలుసు - మీలో కూడా కొంతమందికి నాతో సాంగత్యము ఎక్కువగా ఉంది, కొందరికి తక్కువగా ఉంది. కొందరు బాగా పురుషార్థము చేసి యోగములో ఉంటారు. ఎంత సమయము ఆత్మ, పరమాత్మ సాంగత్యములో ఉంటుందో అంత లాభముంటుంది, వికర్మలు వినాశనమవుతాయి. తండి అంటున్నారు - ఓ ఆత్మలారా! తండి అయిన నన్ను స్మృతి చేయండి. నా సాంగత్యము చేయండి. నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది లేకుంటే పరమాత్మ ఎలా మాట్లాడ్తారు? ఆత్మ ఎలా వింటుంది? ఇప్పుడు పిల్లలైన మీరు సత్య సాంగత్యములో ఉన్నారు. సత్యమైన తండిన్రి నిరంతరము స్మృతి చేయాలి. ఆత్మలు సత్యమైన సాంగత్యము చేయాలి. ఆత్మ కూడా అద్భుతమైనదే. పరమాత్మ కూడా అద్భుతమైనవారే. ప్రపంచము కూడా అద్భుతమైనదే. ఈ ప్రపంచము చక్రములో ఎలా తిరుగుతూ ఉందో, అది కూడా అద్భుతమే. మీరు డ్రామాలో ఆల్రౌండు పాత్ర చేస్తారు. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిశ్చయింపబడి ఉంది. అద్భుతము కదా. సత్యయుగములోని ఆత్మలకు, ఇప్పటి కలియుగములోని ఆత్మలకు ఎంత వ్యత్యాసము! అందులో కూడా అందరికంటే ఎక్కువ ఆల్రౌండరుగా ఉండేది ఆత్మలైన మీరే. నాటకములో కొంతమందికి ప్రారంభము నుండే పాత్ర ఉంటుంది. కొంతమందికి మధ్య నుండి, కొంతమందికి చివర్లో పాత్ర ఉంటుంది. అవన్నీ హద్దులోని డ్రామాలు. అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఇప్పుడు సైన్సుకు పేరు ప్రతిష్ఠలు ఎక్కువగా ఉన్నాయి. సత్యయుగములో సైన్సుకు ఎంత శక్తి ఉంటుంది. నూతన పప్రంచము ఎంత త్వరగా తయారవుతుంది. అక్కడ ముఖ్యమైనది పవితత్రా బలము. ఇప్పుడు అందరూ నిర్బలులే, అక్కడ అందరూ బలవంతులే. ఈ లక్ష్మీనారాయణులు శక్తివంతులు కదా. ఇప్పుడు రావణుడు బలమంతా లాక్కున్నాడు. మీరు మళ్లీ ఆ రావణుని పై విజయము పొంది ఎంతో శక్తివంతులుగా అవుతారు. సత్యముతో ఎంత సాంగత్యములో ఉంటారో అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండిన్రి స్మృతి చేస్తుందో అంత శక్తిశాలిగా అవుతుంది. చదువులో కూడా బలము లభిస్తుంది కదా. మీకు కూడా బలము లభిస్తుంది. మీరు విశ్వమంతటి పై అధికారము కలిగి ఉంటారు. ఆత్మకు సత్యము జతలో యోగము సంగమ యుగములోనే ఉంటుంది. తండ్రి అంటున్నారు - ఆత్మకు నా సాంగత్యము లభించినందున ఆత్మ చాలా బలశాలిగా అవుతుంది. తండ్రి సర్వశక్తివంతుడు(ఔశీతీశ్రీస ూశ్రీఎఱస్త్రష్ట్ర్వ ూబ్ష్ట్రశీతీఱ్వ) కదా. వారి ద్వారా బలము లభిస్తుంది. ఇందులో వేదశాస్త్రాలన్నింటి సారము, ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా వచ్చేస్తుంది.

తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులో మీరు కూడా సర్వశక్తివంతులుగా అవుతారు. విశ్వం పై మీరు రాజ్యము చేస్తారు, మీ నుండి ఎవ్వరూ మీ రాజ్యాన్ని లాక్కోలేరు. మీకు నా ద్వారా ఎంతో బలము లభిస్తుంది. ఇతనికి కూడా లభిస్తుంది. ఎంత స్మృతి చేస్తారో, అంత బలము లభిస్తుంది. తండ్రి ఇక ఏ ఇతర కష్టమునివ్వరు. కేవలం స్మృతి చేస్తే చాలు. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యింది. ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్లాలి. ఇది అర్థము చేసుకోవడం ఏమంత పెద్ద విషయము కాదు. ఎక్కువ విస్తారంగా తెలిపే అవసరము లేదు. బీజమును తెలుసుకొనుట వలన ఈ బీజము ద్వారా వృక్షమంతా ఈ విధంగా పెరుగుతుందని, విస్తారమవుతుందని అర్థం చేసుకుంటారు. క్లుప్తంగా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా విచిత్రమైన విషయాలు. భక్తిమార్గములో మానవులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. చాలా శ్రమిస్తారు కానీ ఏమీ లభించదు. అయినా తండ్రి వచ్చి మళ్లీ మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తారు. మనము యోగబలముతో విశ్వమంతటికీ అధికారులుగా అవుతాము. మీరు చేయవలసిన పురుషార్థమిదే. భారతదేశ యోగము ప్రసిద్ధి చెందినది. యోగము ద్వారా మీ ఆయువు ఎంతో వృద్ధి చెందుతుంది. సత్య సాంగత్యము ద్వారా మీకు ఎంతో లాభముంది ఆయువు వృద్ధి అవ్వడమే కాక శరీరము కూడా నిరోగిగా అవుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే నింపబడ్తాయి. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన సాంగత్యములో లేరు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానము. తాతకు పౌత్రులు. మేము తాతకు పౌత్రులమనే ఖుషీ ఉండాలి కదా. వారసత్వము కూడా తాత నుండే లభిస్తుంది. ఇదే స్మృతియాత్ర, బుద్ధిలో ఇదే స్మృతి చేస్తూ ఉండాలి. ఆ సత్సంగాలలో అయితే ఒక చోటకు వెళ్లి కూర్చుంటారు. ఇక్కడ అటువంటి విషయము లేదు. ఒక్కచోట కూర్చుంటేనే సత్యమైన సాంగత్యము జరుగుతుందని అనుకోరాదు. అలా కాదు. లేస్తూ-కూర్చుంటూ-నడుస్తూ-తిరుగుతూ వారిని స్మృతి చేస్తే మనము సత్యమైన సాంగత్యములోనే ఉంటాము. స్మృతి చేయకుంటే దేహాభిమానములో ఉంటాము. దేహము అసత్యమైనది కదా, సత్యమైనది కాదు. శరీరము జడ పదార్థము, పంచ తత్వాలతో చేయబడింది. అందులో ఆత్మ లేకపోతే కదలను కూడా కదలదు. మానవ శరీరానికి ఏ విలువా లేదు. ఇతర శరీరాలన్నిటికి విలువ ఉంది. నేను ఫలానా ఫలానా అని ఆత్మనే అంటుంది కదా. కావున సౌభాగ్యము ఆత్మకే లభించాలి. తండ్రి చెప్తున్నారు - కోడిగుడ్లు, చేపలు, మాంసము అన్నీ తింటూ ఉంటారు, కనుక ఇప్పుడు ఆత్మ ఎంతో పతనము చెందింది. పత్రి ఒక్కరు భస్మాసురులుగా ఉన్నారు. వారంతకు వారే భస్మము చేసుకుంటున్నారు. ఎలా ? కామచితి పై కూర్చుని పత్రి ఒక్కరూ స్వయాన్ని భస్మము చేసుకుంటున్నారు కనుక భస్మాసురులు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చితి పై కూర్చుని దేవతలుగా అవుతారు. ప్రపంచమంతా కామచితి పై కూర్చుని భస్మమైపోయింది, తమోప్రధానంగా, నల్లగా(అపవిత్రంగా) అయిపోయింది. పిల్లలను నలుపు నుండి తెల్లగా(పవిత్రంగా) చేసేందుకే తండ్రి వచ్చారు. అందుకే తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు. వారు ఇంటిలో ఉన్నా ఆ చదువు బుద్ధిలో ఉంటుంది కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇది మీ విద్యార్థి జీవితము. లక్ష్యము మీ ఎదురుగా నిలబడి ఉంది. లేస్తూ - కూర్చుంటూ - నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి.

పిల్లలు రిఫ్రెష్(తాజా) అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. ఫలానా విధంగా అర్థం చేయించమని యుక్తులు తెలుపుతారు. ప్రపంచంలో అనేక సత్సంగాలున్నాయి. ఎంతోమంది మనుష్యులు కలుస్తూ ఉంటారు. వాస్తవానికి అవి సత్సంగాలు కానే కావు. సత్యమైన సాంగత్యము పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. తండ్రే వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. మీరు అధికారులుగా అయిపోతారు. దేహాభిమానము లే అసత్య అభిమానము వలన మీరు క్రిందపడిపోతారు. సత్యమైన సాంగత్యము ద్వారా ఉన్నతంగా అవుతారు. మీరు అర్ధకల్పము ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ ఏ సత్సంగమూ ఉండదు. సత్సంగము, దుష్ట సంగమని ఆ రెండూ ఉన్నప్పుడే అంటారు. సత్యమైన తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే అన్ని విషయాలు వారే అర్థం చేయిస్తారు. ఎంతవరకు ఆ సత్యమైన తండ్రి రారో అంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియజేస్తున్నారు - ఓ ఆత్మలారా! నా జతలో ఉండండి. లభించిన దేహాల సాంగత్యము నుండి అతీతమైపోండి. దేహ సాంగత్యము భలే సత్యయుగములో కూడా ఉంటుంది. కానీ అక్కడ మీరు పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు మీరు సత్సంగము వలన పతితము నుండి పావనంగా అవుతారు. తర్వాత శరీరము కూడా సతోప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ప్రపంచము క్రొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. నూతన ప్రపంచములో ఆదిసనాతన దేవీ దేవతా ధర్మముండేది. ఈ రోజు ఆ ధర్మమును మర్చిపోయి ఆదిసనాతన హిందూ ధర్మానికి చెందిన వారమని అంటారు. తికమకపడి ఉన్నారు. మేము ప్రాచీన దేవీదేవతా ధర్మానికి చెందిన వారమని ఇప్పుడు భారతవాసులైన మీరు భావిస్తారు. సత్యయుగానికి అధికారులుగా ఉండేవారము. కానీ ఆ నషా ఎక్కుడుంది? కల్పము ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. అన్ని విషయాలు మర్చిపోయారు. దీని పేరే భూల్ భులైయా(మర్చిపోయే) ఆట. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మొత్తం జ్ఞానమంతా తెలుసుకున్నందున ఉన్నతపదవి పొందుతారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత క్రిందపడ్తారు. ఎందుకంటే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ప్రపంచము పాతదైపోతుంది కదా. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారమని, ఇప్పుడు పాత ప్రపంచములో ఉన్నామని అర్థం చేసుకున్నారు. కొంతమందికి ఇది కూడా గుర్తుండదు. బాబా మనలను స్వర్గవాసులుగా చేస్తారు. అర్ధకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము. మళ్లీ అర్ధకల్పము తర్వాత క్రింద పడ్తారు. ఎందుకంటే రావణ రాజ్యం ఆరంభమవుతుంది. ప్రపంచము పాతదంటూ అవుతుంది కదా. బాబా మనలను స్వర్గ వాసులుగా తయారు చేస్తున్నారని మీరు భావిస్తారు. అర్ధకల్పము స్వర్గ వాసులుగా ఉంటాము, అర్ధకల్పము నరకవాసులుగా అవుతాము. మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారము మాస్టర్ సర్వశక్తివంతులు(వీaర్వతీ ూఎఱస్త్రష్ట్ర్వ)గా అవుతారు. ఇది జ్ఞానామృత డోస్. శివబాబాకు పాత అవయవాలు లభించాయి, క్రొత్తవి లభించవు. పాత శరీరము లభిస్తుంది. తండ్రి వానప్రస్థములోనే వస్తారు. పిల్లలు సంతోషంగా ఉంటే తండ్రి కూడా సంతోషంగా ఉంటారు. తండ్రి అంటున్నారు - పిల్లలకు జ్ఞానమిచ్చి రావణుని నుండి విడిపించేందుకు నేను వస్తాను. పాత్ర ఖుషీగా అభినయించాలి కదా. తండ్రి చాలా సంతోషంగా పాత్రను అభినయిస్తారు. తండ్రి కల్ప-కల్పము రావలసి వస్తుంది. ఈ పాత్ర ఎప్పుడూ ఆగిపోదు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎంతెంత సత్యముతో సాంగత్యము చేస్తారో అంత సంతోషము ఉంటుంది. స్మృతి తక్కువగా ఉంది, అందువలననే అంత ఖుషీ ఉండదు. తండ్రి తన పిల్లలకు వారసత్వమునిస్తారు. ఏ పిల్లలు సత్యమైన హృదయము గలవారిగా ఉంటారో, వారి పై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది. సత్యమైన హృదయము ఉంటే సాహెబ్(బాబా) రాజీగా ఉంటారు. ఆంతరికంగా, బాహ్యంగా ఎవరు సత్యంగా ఉంటారో, తండిక్రి సహాయకారులుగా ఉంటారో, సేవలో తత్పరులై ఉంటారో వారే తండిక్రి పియ్రమైనవారుగా ఉంటారు. మేము సత్యమైన సేవ చేస్తున్నామా ? అని మీ అంతకు మీరు పశ్న్రించుకోండి. సత్యమైన బాబా సాంగత్యములో ఉన్నామా ? సత్యమైన బాబా సాంగత్యములో లేకుంటే గతి ఏమవుతుంది ? చాలామందికి దారి చూపుతూ ఉంటే ఉన్నతపదవి కూడా పొందుతారు. సత్యమైన తండ్రి ద్వారా మేము ఏ వారసత్వము పొందుకున్నామని ఆంతరికములో చూసుకోండి. నంబరువారుగా ఉన్నారని మీకు తెలుసు. ఒక్కరు పొందుకున్న వారసత్వానికి, మరొకరు పొందుకున్న వారసత్వానికి రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసముంటుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీకు లభించిన ఈ దేహ సాంగత్యము నుండి అతీతంగా ఉండాలి. సత్యమైన సాంగత్యము ద్వారా పావనంగా అవ్వాలి.

2. ఈ విద్యార్థి జీవితములో నడుస్తూ - తిరుగుతూ బుద్ధిలో జ్ఞాన చింతన జరుగుతూ ఉండాలి. లక్ష్యమును ముందుంచుకొని పురుషార్థము చేయాలి. సత్యమైన హృదయముతో తండ్రికి సహాయకారులుగా అవ్వాలి.

వరదానము:-

'' బంగారు యుగ స్వభావం ద్వారా బంగారు యుగ సేవ చేసే శ్రేష్ఠ పురుషార్థీ భవ ''

ఏ పిల్లల స్వభావంలో ఈర్ష్య, సిద్ధము చేసే, జిద్దు చేసే భావము, ఏదైనా పాత సంస్కారము మిక్స్ అవ్వలేదో వారు బంగారుయుగ స్వభావం గలవారు. ఇటువంటి బంగారుయుగ స్వభావము మరియు సదా హాజి అనే సంస్కారాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి పిల్లలు ఎటువంటి సేవ ఉంటుందో, అలా స్వయాన్ని మల్చుకొని నిజమైన(అసలు) బంగారుగా అవుతారు. సేవలో కూడా అభిమానము లేక అవమానాల మురికి మిక్స్ అవ్వరాదు. అప్పుడు వారిని బంగారుయుగ సేవ చేయువారని అంటారు.

స్లోగన్:-

'' ఎందుకు ? ఏమి ? అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్నచిత్తులుగా ఉండండి