12-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు, యువకులు అందరిదీ వానప్రస్థ అవస్థ ఉంది ఎందుకంటే అందరూ వాణి నుండి అతీతంగా ముక్తిధామానికి వెళ్ళాలి, మీరు వారికి ఇంటి యొక్క మార్గాన్ని తెలియజేయండి

ప్రశ్న:-

తండ్రి యొక్క శ్రీమతం పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల వేర్వేరుగా ఉంటుంది, ఒకే విధంగా ఉండదు - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరి నాడిని చూసి, పరిస్థితులను చూసి శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరైనా నిర్బంధనులుగా ఉన్నారనుకోండి, వృద్ధులైనా లేక కుమారీలైనా, సేవకు యోగ్యులుగా ఉన్నట్లయితే, ఈ సేవలో పూర్తిగా నిమగ్నమవ్వండి అని బాబా సలహా ఇస్తారు. ఇకపోతే అందరినీ అయితే ఇక్కడ కూర్చోబెట్టరు. ఎవరికి తండ్రి నుండి ఏ శ్రీమతం లభిస్తే, అందులో కళ్యాణముంది. ఎలాగైతే మమ్మా-బాబా, శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, అదే విధంగా ఫాలో చేసి, వారి వలె సేవ చేసి వారసత్వాన్ని తీసుకోవాలి.

గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు... (భోలేనాథ్ సే నిరాలా...)

ఓంశాంతి

మధురాతి మధురమైన సికీలధే పిల్లలు పాటను విన్నారు. శివుడిని భోళానాథుడని అంటారు మరియు ఎవరైతే ఢమరుకాన్ని మ్రోగిస్తారో, వారిని శంకరుడు అని అంటారు. అక్కడ ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి వినిపిస్తారు, ఇది కూడా ఒక రకంగా ఢమరుకాన్ని మ్రోగించినట్లే. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడకు మనుష్యులు వెళ్ళి నివసిస్తారు కూడా, కానీ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ లేదు. గురువులు మమ్మల్ని వాణి నుండి అతీతంగా శాంతిధామానికి తీసుకువెళ్తారని భావిస్తారు. ఇక్కడే ప్రాణాలను త్యజించాలి అన్న ఆలోచనతో అక్కడకు వెళ్ళి ఉంటారు కానీ తిరిగి అయితే ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. వారైతే తమ-తమ భక్తి మొదలైనవి నేర్పిస్తారు. ఇక్కడైతే ఇది సత్యాతి-సత్యమైన వానప్రస్థమని పిల్లలకు తెలుసు. పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ వానప్రస్థులుగా ఉన్నారు. ఇకపోతే ముక్తిధామంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేయిస్తున్నారు. సద్గతి మార్గాన్ని లేదా వాణి నుండి అతీతంగా వెళ్ళే మార్గాన్ని తెలిపేవారు ఇంకెవరూ ఉండరు. గతి-సద్గతిదాత ఒక్కరు మాత్రమే. గృహస్థ వ్యవహారాన్ని విడిచిపెట్టి ఇక్కడే కూర్చుండిపోండి అని తండ్రి ఈ విధంగా అనలేరు. అవును, ఎవరైతే సేవకు యోగ్యులుగా ఉన్నారో, వారిని ఉండనివ్వచ్చు. ఇతరులకు కూడా వానప్రస్థం యొక్క మార్గాన్ని తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళే సమయము. వానప్రస్థం లేదా ముక్తిధామంలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి వద్ద మీరు కూర్చున్నారు. వారైతే వానప్రస్థాన్ని తీసుకుంటారు కానీ తిరిగి అయితే ఎవరూ కూడా వెళ్ళలేరు. వానప్రస్థంలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి, వారే మంచి మతాన్ని ఇస్తారు. ఎవరైనా బాబా, మేము కుటుంబమంతటినీ తీసుకుని ఇక్కడకు వచ్చి కూర్చోవచ్చా అని అడిగితే, అలా కాదు, వీరు సేవకు యోగ్యులుగా ఉన్నారా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఎవరైనా బంధనముక్తులుగా ఉంటే, వృద్ధులుగా ఉంటే, సేవాధారులుగా ఉంటే, వారికి శ్రీమతం ఇవ్వడం జరుగుతుంది. సెమినార్ చేసినట్లయితే, సేవ యుక్తులను నేర్చుకుంటాము అని పిల్లలంటారు. కన్యలతో పాటు మాతలు, పురుషులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. సెమినార్ అయితే ఇదే కదా. ఎవరికి ఏ విధంగా అర్థం చేయించాలి అనేది బాబా ప్రతి రోజు శిక్షణ ఇస్తూ ఉంటారు. సలహా ఇస్తూ ఉంటారు. మొదటైతే ఒకే విషయాన్ని అర్థం చేయించండి. పరమపిత పరమాత్మ, ఎవరినైతే మీరు స్మృతి చేస్తారో, వారు మీకు ఏమవుతారు. ఒకవేళ తండ్రి అయినట్లయితే, తండ్రి నుండి వారసత్వం లభించాలి. మీకైతే తండ్రి గురించి తెలియదు. అందరిలోనూ భగవంతుడు ఉన్నారని అనేస్తారు. కణకణములోనూ భగవంతుడు ఉన్నట్లయితే, మీ పరిస్థితి ఏమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనము బాబా ఎదురుగా కూర్చున్నాము. బాబా మనల్ని యోగ్యులుగా చేసి ముళ్ళ నుండి పుష్పాలుగా చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. మిగిలినవారంతా అయితే అడవి యొక్క మార్గాన్నే చెప్తారు. తండ్రి అయితే ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. సెకండులో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. అదేమైనా అసత్యమా ఏమిటి. బాబా అని అన్నారంటే మీరు జీవన్ముక్తులైనట్లే. బాబా మొట్టమొదట తమ ఇంటికి తీసుకువెళ్తారు. మీరందరూ మీ ఇంటిని మర్చిపోయారు కదా. గాడ్ ఫాదర్ సందేశకులందరినీ ధర్మ స్థాపన కోసం పంపిస్తారని అంటారు, మరి సర్వవ్యాపి అని ఎందుకంటారు? పై నుండి పంపిస్తారు కదా. ఒకటి చెప్తారు కానీ అది నమ్మరు. తండ్రి ధర్మస్థాపనార్థము పంపిస్తారు, అప్పుడు వారి సంస్థ కూడా వారి వెనుక రావడం మొదలవుతుంది. మొట్టమొదట దేవీ-దేవతల సంస్థ ఉంటుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన లక్ష్మీ-నారాయణులు తమ ప్రజల సహితంగా వస్తారు, ఇంకెవ్వరూ ప్రజల సహితంగా రారు. వారు ఒక్కరే వస్తారు, తర్వాత రెండవ వారు, మూడవ వారు వస్తారు. ఇక్కడ మీరందరూ తండ్రి నుండి వారసత్వము తీసుకోవడానికి తయారవుతున్నారు. ఇది స్కూల్. ఇంట్లో ఉంటూ కూడా ఒక ఘడియ, అర్ధ ఘడియ... పావు ఘడియ చదువుతారు. ఒక్క సెకండులో మీకు కేవలం - పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధముంది అనేది తెలియజేస్తారు. నోటితో పరమపిత అని అంటారు కూడా... వారైతే అందరికీ తండ్రి, రచయిత, అయినా కూడా తండ్రి అని భావించకపోతే ఏమంటారు! తండ్రి స్వర్గానికి రచయిత కావున తప్పకుండా స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారు. భారత్ కు ఇచ్చి ఉన్నారు కదా. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే రాజయోగము ప్రసిద్ధమైనది. ఇది సత్యనారాయణ కథ కూడా. అమరకథ కూడా, తీజరి అనగా మూడవ నేత్రము లభించే కథ కూడా. పిల్లలైన మీకు తెలుసు, బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. వారి మతము ద్వారా తప్పకుండా కళ్యాణమే జరుగుతుంది. బాబా ప్రతి ఒక్కరి నాడి చూస్తారు. వారికి ఏ బంధనము లేదు. సేవ కూడా చేయగలరు. తండ్రి యోగ్యులను చూసి, అప్పుడు డైరెక్షన్లు ఇస్తారు. పరిస్థితులను చూసి మీరు ఇక్కడ ఉండవచ్చు, సేవ కూడా చేస్తూ ఉండండి అని అంటారు. ఎక్కడెక్కడైతే అవసరము ఉంటుందో, అక్కడికి వెళ్ళాలి. ప్రదర్శనీలో అనేకుల అవసరము ఉంటుంది. వృద్ధులు కూడా కావాలి, కన్యలు కూడా కావాలి. అందరికీ శిక్షణ లభిస్తూ ఉంటుంది. ఇది చదువు. భగవానువాచ, భగవంతుడు అని నిరాకారుడిని అంటారు. ఆత్మలైన మీరు వారి పిల్లలు. ఓ గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు, మళ్ళీ సర్వవ్యాపి అని అంటారా. లౌకిక తండ్రి ఏమైనా సర్వవ్యాపినా! కాదు, మీరు ఫాదర్ అని అంటారు మరియు తండ్రి పతితపావనుడని పాడుతారు కూడా కనుక తప్పకుండా ఇక్కడకు వచ్చి పావనంగా చేస్తారు. పతితుల నుండి పావనంగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు.

తండ్రి అంటారు, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్న నా పిల్లలూ, మీరు మళ్ళీ వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. రాజధాని స్థాపన అవుతుందని మీకు తెలుసు. ఎలాగైతే మమ్మా, బాబా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, అలా మనము కూడా వారి నుండి తీసుకుంటాము. ఫాలో చేయండి. మమ్మా, బాబాలా సేవ కూడా చేయండి. మమ్మా, బాబా నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. మరి మనము తక్కువెందుకు వినాలి. ఆ సూర్యవంశీయులే తర్వాత చంద్రవంశీయులుగా కూడా అవుతారని మీకు తెలుసు. మొదటైతే సూర్యవంశంలోకి వెళ్ళాల్సి ఉంటుంది కదా. తెలివైతే ఉంది కదా. ఏమీ తెలియకుండా స్కూల్లో ఎవరూ కూర్చోలేరు. బాబా శ్రీమతాన్ని ఇస్తారు. వీరిలోనైతే బాబా ప్రవేశించారని మనకు తెలుసు. లేదంటే ప్రజాపిత ఎక్కడ నుండి వస్తారు. బ్రహ్మా అయితే సూక్ష్మవతనవాసి. ప్రజాపిత అయితే ఇక్కడే కావాలి కదా. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తాను. ఎవరిని? బ్రాహ్మణులను. ఈ బ్రహ్మాలో ప్రవేశిస్తాను. ఆత్మలైన మీరు కూడా శరీరంలో ప్రవేశిస్తారు కదా. నన్ను జ్ఞానసాగరుడని అంటారు. మరి నిరాకారుడైన నేను జ్ఞానాన్ని ఎలా వినిపించాలి. కృష్ణుడినైతే జ్ఞానసాగరుడని అనరు. కృష్ణుని ఆత్మ అనేక జన్మల అంతిమములో జ్ఞానం తీసుకుని మళ్ళీ కృష్ణునిగా అయ్యింది, ఇప్పుడు అలా లేదు. భగవంతుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని దేవీ-దేవతలు స్వర్గానికి యజమానులుగా అయ్యారని మీకు తెలుసు. తండ్రి అంటారు, కల్ప-కల్పము మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. చదువు ద్వారా రాజ్యం లభిస్తుంది. మీరు రాజులకే రాజుగా అవుతారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. మీరు వచ్చారు మళ్ళీ సూర్యవంశీ దేవీ-దేవతలుగా అవ్వడానికి. ఒక్క దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే అనేకానేక ధర్మాలున్నాయి. అనేకమంది గురువులు ఉన్నారు. వారందరూ సమాప్తమైపోతారు. ఈ గురువులందరికీ గురువు సద్గతిదాత ఒక్క తండ్రే. సాధువులకు కూడా సద్గతి చేయడానికి వచ్చాను. మున్ముందు వారు కూడా కల్పక్రితం వలె మీ ముందు వంగుతారు.

పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా యొక్క రహస్యమంతా ఉంది. మీకు తెలుసు, సూక్ష్మవతనంలో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉన్నారు, వీరేమో ప్రజాపిత. బ్రహ్మా యొక్క వృద్ధ తనువులో ప్రవేశిస్తానని అంటారు. వీరితో కూడా అంటారు - ఓ పిల్లలూ, మీరందరూ బ్రాహ్మణులు, మీ పైన కలశం పెడతాను. మీరు ఇన్ని జన్మలు తీసుకున్నారు. ఈ సమయంలో ఉన్నదే రౌరవ నరకము, అంతేకానీ నరకము అని పిలవబడే నది ఏదీ లేదు. గరుడ పురాణంలోనైతే చాలా విషయాలు రాసారు. ఇప్పుడు బాబా, పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు కూడా చదివి ఉన్నారు కదా. ఇప్పుడు భోళానాథుడైన తండ్రి, అమాయకంగా ఉన్న పిల్లలైన మీకు కూర్చొని అర్థం చేయిస్తారు. పేదవారైన, అమాయకులైన పిల్లలను మళ్ళీ ఉన్నతోన్నతమైన షావుకార్లుగా చేస్తారు. మీకు తెలుసు, సూర్యవంశీయులు యజమానులుగా అవుతారు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా దిగుతూ-దిగుతూ ఎలా అయిపోయారు. ఎంత అద్భుతమైన ఆట. స్వర్గంలో ఎంత సుసంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు కూడా రాజులకు చాలా పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయి. జైపూర్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడే ఇలాంటి మహళ్ళు ఉన్నాయంటే, మరి ఇంతకుముందువి ఎలా ఉండి ఉండవచ్చో తెలియదు. ప్రభుత్వ గృహాలు ఈ విధంగా తయారవ్వవు. రాజుల మహళ్ళను తయారుచేసే ఆడంబరమే వేరు. అచ్ఛా, ఒకవేళ స్వర్గం యొక్క మోడల్ చూడాలి అనుకుంటే అజ్మేర్ కు వెళ్ళండి. ఒక మోడల్ ని తయారుచేయడానికి కూడా చాలా బాగా శ్రమించారు. చూడడంతోనే మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఇక్కడైతే బాబా వెంటనే సాక్షాత్కారం చేయిస్తారు. ఏదైతే దివ్య దృష్టితో చూస్తారో, దానిని మళ్ళీ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. భక్తి మార్గంలో భక్తులకు సాక్షాత్కారాలైతే జరుగుతాయి కానీ వారేమైనా వైకుంఠానికి యజమానులుగా అయ్యారా ఏమిటి. మీరైతే ప్రాక్టికల్ గా యజమానులుగా అవుతారు. ఇప్పుడైతే ఉన్నదే నరకము. ఒకరినొకరు గాయపర్చుకుంటూ, కొట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు తండ్రిని, సోదరుడిని కూడా హతమార్చడానికి వెనుకాడరు. సత్యయుగంలో కొట్లాటలు మొదలైనవాటి విషయమే ఉండదు. ఇప్పటి సంపాదనతో మీరు 21 జన్మల కోసం పదవిని పొందుతారు. కావున ఎంత సంతోషముండాలి! మొదటి విషయము, ఒకవేళ తండ్రి పరిచయము, తండ్రి జీవిత కథను తెలుసుకోకపోతే ఇక బాబా అని అనడం వలన లాభమేముంది. ఇన్ని దాన-పుణ్యాలు చేస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని అంటారు. కానీ ఎప్పుడు మరియు ఎవరికి లభిస్తారు! భక్తి అయితే అందరూ చేస్తారు కానీ అందరికీ రాజ్యమైతే లభించదు. అర్థం చేసుకోవడంలో ఎంత లోటు ఉంది. మీరు ఎవరికైనా చెప్పవచ్చు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మర్చిపోండి, జీవిస్తూ మరణించండి. బ్రహ్మము అనేది తత్వము. దాని నుండి వారసత్వమైతే లభించదు. వారసత్వమైతే తండ్రి ద్వారానే లభిస్తుంది. కల్ప-కల్పము మనం తీసుకుంటాము. కొత్త విషయమేమీ కాదు. ఇప్పుడు నాటకం పూర్తవ్వనున్నది. మనము శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎంతగా స్మృతి చేస్తామో, అంతగా అంతమతి సో గతి అవుతుంది. దీనిని వినాశన సమయమని అంటారు. పాపాత్ముల లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి. ఇప్పుడు యోగబలం ద్వారా పుణ్యాత్ములుగా అవ్వాలి. ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి. ఒక్క ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది, కనుక అనేక ధర్మాలు తప్పకుండా తిరిగి వెళ్ళిపోతాయి. శరీరాన్ని ఏమైనా తమతో పాటు తీసుకువెళ్తారా.

కొందరు మోక్షం లభించాలి అని అంటారు, కానీ ఇది ఎలా జరగగలదు, ఇది తయారై తయారవుతున్న డ్రామా, అది ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దీని అంతము ఎప్పటికీ అవ్వదు. అనాది చక్రం ఎలా తిరుగుతుంది అని ఇప్పుడు తండ్రి కూర్చొని రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువమంది అర్థం చేసుకోవడం మొదలుపెడతారో, అప్పుడు వృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది మీ చాలా ఉన్నతమైన ధర్మము. దీనిని పక్షులు తినేస్తాయి, ఇతర ధర్మాలను పక్షులు తినవు. పిల్లలైన మీరు ఈ ప్రపంచం పట్ల ఎటువంటి అభిరుచి పెట్టుకోకూడదు. ఇది శ్మశానవాటిక. పాత ప్రపంచం పట్ల ఏమి మోహం పెట్టుకోవాలి. అమెరికాలో ఎవరైతే తెలివైనవారు ఉంటారో, వారు ఎవరో ప్రేరకులు ఉన్నారని భావిస్తారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. వినాశనమైతే అవ్వాల్సిందే. అందరి మనసైతే తింటూ ఉంటుంది. డ్రామా విధి ఈ విధంగా రచించబడి ఉంది. శివబాబా అయితే దాత, వీరికైతే ఏ ఆసక్తి లేదు. వారు నిరాకారుడు, ఇదంతా పిల్లలది. కొత్త ప్రపంచం కూడా పిల్లలదే. విశ్వ రాజ్యాధికారాన్ని మనం స్థాపన చేస్తున్నాము, మనమే రాజ్యం చేస్తాము. బాబా ఎంత నిష్కామి. మీరు బాబాను స్మృతి చేసినప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది. మీరు డబుల్ మహాదానులు. తనువు-మనసు-ధనాన్ని ఇస్తారు, అవినాశీ జ్ఞాన రత్నాలను కూడా ఇస్తారు. శివబాబాకు మీరు ఏమిస్తారు? కాటికాపరికి ఇస్తారు కదా. ఈశ్వర సమర్పణమ్ అని అంటారు, ఈశ్వరుడు ఏమైనా ఆకలితో ఉన్నారా? లేదా కృష్ణార్పణమ్ చేస్తారు. ఇరువురినీ బికారులుగా చేసేసారు. వారైతే దాత. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాత ప్రపంచం యొక్క ఏ వస్తువుపైన మోహం ఉంచుకోకూడదు. ఈ ప్రపంచంలోని ఏ విషయము పట్ల అభిరుచి పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది శ్మశానవాటికగా అవ్వనున్నది.

2. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, లెక్కాచారాలను సమాప్తం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అందుకే యోగబలం ద్వారా పాపాల నుండి ముక్తులుగా అయి పుణ్యాత్మగా అవ్వాలి. డబల్ దానులుగా అవ్వాలి.

వరదానము:-

సంతోషమనే ఔషధం ద్వారా మనసు మరియు బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే అచంచలమైన-స్థిరమైనవారిగా కండి

వాహ్ బాబా వాహ్ మరియు వాహ్ నా భాగ్యం వాహ్! సదా ఈ సంతోషం యొక్క పాటను పాడుతూ ఉండండి. సంతోషం అన్నింటికన్నా గొప్ప ఔషధం, సంతోషం వంటి ఔషధం ఇంకేదీ లేదు. ఎవరైతే ప్రతిరోజు సంతోషమనే ఔషధం తింటారో, వారు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ బలహీనంగా అవ్వరు, అందుకే సంతోషమనే ఔషధం ద్వారా మనసు మరియు బుద్ధిని శక్తిశాలిగా చేసుకున్నట్లయితే స్థితి శక్తిశాలిగా ఉంటుంది. ఇటువంటి శక్తిశాలి స్థితి ఉన్నవారు సదా అచంచలంగా-స్థిరంగా ఉంటారు.

స్లోగన్:-

మనసు మరియు బుద్ధిని అనుభవమనే సీటుపై సెట్ చేసినట్లయితే ఎప్పుడూ అప్ సెట్ అవ్వరు.