12-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మహావీరులుగా అవ్వండి, మాయా తుఫాన్లతో యుద్ధం చేసేందుకు బదులుగా అచల్-అడోల్ గా (స్థిరంగా-దృఢంగా) అవ్వండి

ప్రశ్న:-

బ్రహ్మాబాబా ఎదురుగా అనేక గొడవలు జరుగుతున్నా కూడా వారు ఎప్పుడూ చింతించలేదు - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే, నేను తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అన్న నషా బాబాకు ఉండేది. ఇదంతా కల్పక్రితం వలె జరుగుతుంది, ఇందులో నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు). అందరికంటే ఎక్కువ నిందలు తండ్రికే లభించాయి. ఆ తర్వాత, కృష్ణుడిని కూడా నిందిస్తారు. కావున ఒకవేళ నేను కూడా నిందలు పడవలసి వస్తే, అందులో పెద్ద విషయమేముంది. ప్రపంచానికి మన విషయాలు తెలియవు కావున తప్పకుండా నిందిస్తారు, అందుకే బ్రహ్మాబాబా ఏ విషయంలోనూ దుఃఖపడలేదు. అదే విధంగా ఫాలో ఫాదర్ చేయండి.

గీతము:-
భోళానాథునికన్నా అతీతమైనవారు ఎవరూ లేరు... (భోలేనాథ్ సే నిరాలా...)

ఓంశాంతి.

ఇది భక్తి మార్గం వారి పాట. జ్ఞాన మార్గంలో పాటలు మొదలైనవి పాడడం జరగదు, అలానే తయారుచేయడం జరగదు, వాటి అవసరం కూడా లేదు ఎందుకంటే - తండ్రి ద్వారా సెకెండులో జీవన్ముక్తి వారసత్వం లభిస్తుందని అంటూ ఉంటారు. ఇందులో పాటలు మొదలైనవాటి విషయమేమీ లేదు. మనకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. భక్తి మార్గం యొక్క ఆచార-పద్ధతులు ఇక్కడ కొనసాగవు. పిల్లలు కవితలు మొదలైనవి కూడా ఇతరులకు వినిపించేందుకు తయారుచేస్తారు. అవి కూడా మీరు అర్థం చేయించనంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కావున సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలి. తండ్రి 84 జన్మల చక్రం యొక్క నాలెడ్జ్ ను కూడా వినిపించారు. ఇప్పుడు మనం స్వదర్శన చక్రధారులుగా అయ్యామని, తండ్రి ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతున్నామని సంతోషముండాలి. నిశ్చయబుద్ధి కలవారికే విజయం లభిస్తుంది. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో, వారు తప్పకుండా సత్యయుగంలోకి వెళ్తారు. కనుక పిల్లలకు సదా సంతోషముండాలి, ఫాలో ఫాదర్ చేయాలి (తండ్రిని అనుసరించాలి). ఎప్పటి నుండైతే నిరాకార బాబా ఈ తనువులోకి ప్రవేశించారో, అప్పటి నుండి వీరి వద్ద కూడా చాలా గొడవలు జరిగాయని పిల్లలకు తెలుసు. సోదరుల గొడవలు, ఊర్లోని గొడవలు, మొత్తం సింధ్ లో గొడవలు జరిగాయి. వీరి (బ్రహ్మాబాబా) పిల్లలు పెద్దవారైనప్పుడు, పిల్లలకు త్వరగా వివాహం చేయండి, వివాహం చేయకపోతే ఎలా నడుస్తుంది అని అన్నారు. బాబా గీతను చదవడం మిస్ చేసేవారు కాదు. గీతా భగవంతుడు శివుడు అని తెలిసినప్పుడు, ఇక ఆ గీతను చదవడం మానేసారు. ఇక నేను విశ్వానికి యజమానిగా అవుతాను అనే నషా కలిగింది. ఇది శివ భగవానువాచ కనుక ఆ గీతను వదిలేసారు. తర్వాత, పవిత్రతకు సంబంధించి పెద్ద గొడవ జరిగింది. సోదరులు, పెదనాన్నలు, చిన్నాన్నలు మొదలైనవారు ఎంతమంది ఉండేవారు. ఇందులో చాలా ధైర్యం కావాలి కదా. మీరు మహావీరులు, మహావీరనీలు. మీకు ఒక్కరి గురించి తప్ప ఇంకెవ్వరి గురించి పట్టింపు లేదు. పురుషుడు రచయిత. స్వయంగా రచయిత పావనంగా అయితే రచనను కూడా పావనంగా తయారుచేయాలి. పవిత్రమైన హంస మరియు అపవిత్రమైన కొంగ కలిసి ఎలా ఉండగలరు. రచయిత అయితే - నా ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలనుకుంటే నడుచుకోండి, లేదంటే వెళ్ళిపోండి అని వెంటనే ఆదేశిస్తారు. మీకు తెలుసు కదా - వీరి (బ్రహ్మాబాబా) లౌకిక పుత్రికకు వివాహం జరిగింది. వారికి జ్ఞానం లభించనప్పుడు - వాహ్! తండ్రి పవిత్రంగా అవ్వమని చెప్తున్నప్పుడు నేనెందుకు అవ్వను అని అన్నారు. నేను విషమివ్వను అని వెంటనే పతికి జవాబిచ్చారు. అంతే, ఇక ఈ విషయంపై చాలా మందికి గొడవలు జరిగాయి. పెద్ద-పెద్ద ఇళ్ళ నుండి కన్యలు వచ్చారు, ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఎవరి భాగ్యంలోనైతే లేదో, వారు అర్థం చేసుకోలేరు కూడా. పవిత్రంగా ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. ఈ విధంగా చెప్పేందుకు అంతటి ధైర్యం కూడా కావాలి కదా. బాబా ఎదురుగా ఎన్ని గొడవలు జరిగాయి. బాబాను ఎప్పుడైనా చింతించడం చూసారా! అమెరికా వరకు వార్తాపత్రికలలో ప్రచురించబడింది. ఇందులో నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు). ఇది కల్పక్రితం వలె జరుగుతుంది, ఇందులో భయపడాల్సిన విషయమేముంది. మనమైతే మన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. మన రచనను రక్షించుకోవాలి. ఈ సమయంలో రచనంతా పతితంగా ఉందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పావనంగా చేయాలి. తండ్రినే అందరూ - ఓ పతితపావన, లిబరేటర్ (ముక్తిదాత) రండి, అని పిలుస్తారు. కనుక వారికి దయ కలుగుతుంది. వారు దయాహృదయులు కదా. కనుక తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఏ విషయంలోనూ భయపడకండి. భయపడితే అంత ఉన్నత పదవిని పొందలేరు. మాతల పైనే అత్యాచారాలు జరుగుతాయి. దీనికి గుర్తుగానే ద్రౌపదిని వివస్త్రగా చేయడం గురించి చెప్తారు. తండ్రి 21 జన్మల కోసం వివస్త్రగా అవ్వడం నుండి రక్షిస్తారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. సద్గతిదాతను నేను కదా. మనుష్యులు దుర్గతిని పొందనంత వరకు నేను వచ్చి సద్గతిని ఎలా ఇవ్వగలను. సృష్టి పతితంగా, తమోప్రధానంగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు కొత్త నుండి పాతగా తప్పకుండా అవుతుంది. పాత ఇంటిని వదలాల్సి ఉంటుంది. కొత్త ప్రపంచం గోల్డెన్ ఏజ్, పాత ప్రపంచం ఐరన్ ఏజ్. సదా కొత్తగా ఉండదు. ఇది సృష్టి చక్రమని పిల్లలైన మీకు తెలుసు. దేవీ-దేవతల రాజ్యం మళ్ళీ స్థాపనవుతుంది. మీకు మళ్ళీ గీతా జ్ఞానాన్ని వినిపిస్తానని తండ్రి అంటారు. ఇక్కడ రావణ రాజ్యంలో దుఃఖముంది. రామ రాజ్యమని దేనినంటారో ఎవరికీ తెలియదు, అంతేకాక అర్థం చేసుకోరు కూడా. తండ్రి అంటారు - నేను స్వర్గాన్ని అనగా రామ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలో ఉంది. 21 జన్మలు సత్యయుగంలో ఉంటారు, దానిని 21 తరాలని అంటారు, అనగా వృద్ధులుగా అయినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ అకాలమృత్యువు ఎప్పుడూ సంభవించదు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మనం జన్మ-జన్మలు భక్తి చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. రావణ రాజ్యంలో కూడా ఎంత ఆర్భాటముందో చూడండి. ఇది అంతిమ సమయంలోని ఆర్భాటము. రామ రాజ్యం సత్యయుగంలో ఉంటుంది - అక్కడ ఈ విమానాలు మొదలైనవన్నీ ఉండేవి, తర్వాత అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ, ఈ సమయంలో అన్నీ వెలువడ్డాయి. ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. తర్వాత వచ్చి అక్కడ విమానాలను తయారుచేస్తారు. ఇవి మీకు భవిష్యత్తులో సుఖమిస్తాయి. ఈ విమానాలు మొదలైనవన్నీ భారతవాసులు కూడా తయారుచేయగలరు. ఇది కొత్త విషయమేమీ కాదు. వీరూ తెలివైనవారే కదా. ఈ సైన్సు మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సైన్సు దుఃఖం కోసముంది, తర్వాత అక్కడ సుఖం కోసముంటుంది. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపనవుతుంది. తండ్రియే కొత్త ప్రపంచ రాజధానిని స్థాపన చేస్తున్నారు. కనుక పిల్లలు మహావీరులుగా అవ్వాలి. భగవంతుడు వచ్చారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు, మహా అంటే నిందిస్తారు. వీరిని కూడా చాలా నిందించారు. కృష్ణుడిని కూడా నిందించినట్లుగా చూపిస్తారు. నిజానికి కృష్ణుడు అయితే నిందలపాలవ్వరు. కలియుగంలో నిందలపాలవుతారు. ఇప్పుడున్న మీ రూపము మళ్ళీ కల్పం తర్వాత ఈ సమయంలోనే ఉంటుంది, మధ్యలో ఉండదు. జన్మ-జన్మకు రూపురేఖలు మారుతూ ఉంటాయి. ఒక ఆత్మకు 84 జన్మలలో ఒకే విధమైన రూపురేఖలు లభించవు. సతో, రజో, తమోలలోకి వస్తూ ఉంటారు, రూపురేఖలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా తయారై ఉంది. 84 జన్మలలో ఏ రూపురేఖలతోనైతే జన్మలు తీసుకున్నారో, మళ్ళీ అలానే తీసుకుంటారు. వీరి రూపురేఖలు మారి మరుసటి జన్మలో వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. ఇప్పుడిది కొత్త విషయము. బాబా కూడా కొత్తవారే, విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు అంత త్వరగా ఎవరికీ అర్థం కావు. భాగ్యంలో ఉంటే, ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. మహావీరులు ఏ తుఫానులకు భయపడరు. ఆ అవస్థ చివర్లో ఏర్పడుతుంది, అందుకే ఆతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని అంటూ ఉంటారు. తండ్రి, పిల్లలను స్వర్గానికి యోగ్యులుగా తయారుచేసేందుకే వచ్చారు. కల్పక్రితం వలె నరకం యొక్క వినాశనం జరగాల్సిందే. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. ఐక్యత ఉండాలని, ఒకే ధర్మం ఉండాలని కోరుకుంటారు. రామ రాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు అని కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ వికారాలు లేకుండా జన్మ జరగదు. మురికిగా అయిపోయారు కదా. ఇప్పుడు తండ్రి పట్ల నిశ్చయముంటే, శ్రీమతమనుసారంగా పూర్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి నాడిని చూడడం జరుగుతుంది. దాని అనుసారంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. బాబా కూడా పిల్లలకు - ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. చాలా మంది మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూర్చొని ఉన్నారు, వారు వివాహం చేయించేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి నాడి చూడడం జరుగుతుంది. ఈ విధంగా అడుగుతారు - బాబా, పరిస్థితి ఇలా ఉంది, మేము పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నాము, మా మిత్ర-సంబంధీకులు మమ్మల్ని ఇంటి నుండి పంపించేయాలని అనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి. బాబా అంటారు - పవిత్రంగా ఉండాలా అని అడుగుతున్నారా, ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి వివాహం చేసుకోండి. అచ్ఛా, ఎవరికైనా నిశ్చితార్థం జరిగితే, రాజీ చేసుకోవాలి, తప్పేమీ లేదు. వివాహం చేయించేటప్పుడు కూడా - వీరు మీకు పతి, గురువు అని చెప్తారు. అచ్ఛా, ఆ సమయంలో మీరు వారి చేత ఈ విషయాలను రాయిస్తూ వెళ్ళండి. నేను మీకు గురువును, ఈశ్వరుడిని అని ఒప్పుకుంటారా, రాయండి. అచ్ఛా, ఇప్పుడు నేను మీకు ఆజ్ఞను ఇస్తున్నాను - పవిత్రంగా ఉండాలి. దీని కోసం ధైర్యం కావాలి కదా. గమ్యం చాలా ఉన్నతమైనది. ఇరువురూ ఎలా కలిసి ఉంటున్నారు అనేది అందరికీ చూపించాలి. దీని ద్వారా చాలా గొప్ప ప్రాప్తి లభిస్తుంది. ప్రాప్తి గురించి తెలియనప్పుడే నిప్పు అంటుకుంటుంది. తండ్రి అంటారు - ఇంత గొప్ప ప్రాప్తి లభిస్తున్నప్పుడు ఒక్క జన్మ పవిత్రంగా ఉండడమనేది ఏమంత పెద్ద విషయము. నేను మీ పతిని, ఈశ్వరుడిని. నా ఆజ్ఞ అనుసారంగా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. తండ్రి యుక్తులను తెలియజేస్తారు. భారత్ లో ఈ నియమముంది - మీకు పతియే ఈశ్వరుడిని, అతని ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవాలని స్త్రీకి చెప్తారు. పతి పాదాలను ఒత్తాలని చెప్తారు ఎందుకంటే లక్ష్మీ, నారాయణుడి పాదాలను ఒత్తారని అనుకుంటారు. ఈ అలవాటు ఎక్కడ నుండి మొదలయింది? ఈ అసత్యమైన చిత్రాల నుండి మొదలయ్యింది. సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. లక్ష్మీ కూర్చొని పాదాలు ఒత్తడానికి నారాయణుడు ఎప్పుడైనా అలసిపోతారా? అలసట యొక్క విషయమే ఉండదు ఎందుకంటే అలసిపోవడం అనేది దుఃఖపడే విషయము. అక్కడ దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది. ఎన్ని అసత్యమైన విషయాలను రాసేసారు. బాబాకు చిన్నప్పటి నుండే వైరాగ్యముండేది, అందుకే భక్తి చేసేవారు.

బాబా పిల్లలకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. కొంతమంది పిల్లలను సంబంధీకులు విసిగిస్తారు - అచ్ఛా, వివాహం చేసుకోండి, స్త్రీ మీవారు అవుతారు, అప్పుడిక ఎవ్వరూ ఏమీ చేయలేరు. పరస్పరంలో కలిసి ఉంటూ పవిత్రంగా ఉండండి, కంపానియన్లుగా ఉంటారు. విదేశాలలో వృద్ధులుగా అయినప్పుడు, వాళ్ళను చూసుకునేందుకు కంపానియన్ గా పెట్టుకుంటారు. సివిల్ మ్యారేజ్ చేసుకుంటారు, వికారాలలోకి వెళ్ళరు. మనం ఒక్క తండ్రి పిల్లలమని, పరస్పరంలో సోదరీ-సోదరులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని పిలవడం కూడా పతిత ప్రపంచంలోకి పిలుస్తారు. ఓ పతితపావనా, సీతలందరి రామా, అని పిలుస్తారు. మనుష్యులు రామ-రామ అని జపించినప్పుడు సీతను గుర్తు చేసుకోరు. సీత కంటే లక్ష్మి గొప్పవారు. కానీ స్మృతి అయితే ఒక్క తండ్రిని మాత్రమే చేస్తారు. లక్ష్మీనారాయణుల గురించైతే ఎంతోకొంత తెలుసు కానీ శివుని గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ బిందువు కనుక ఆత్మల తండ్రి కూడా బిందువే అవుతారు కదా. ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. ఆత్మలైన మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. జ్ఞానసాగరుడు కూర్చొని ఆత్మలైన మీకు అర్థం చేయిస్తారు. ఆత్మ చైతన్యమైనది. మీ ఆత్మ జ్ఞానసాగరముగా అవుతుంది. మీకు మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉంది. మధురమైన పిల్లలు ధైర్యం పెట్టాలి. మనం బాబా శ్రీమతాన్ని అనుసరించాలి కదా. అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు కనుక తండ్రి అంటారు - మీరు కూడా మీ రచనను మీ చేత్తుల్లో పెట్టుకోవాలి. ఒకవేళ కొడుకు మీ ఆజ్ఞను పాటించకపోతే ఇక ఆ కొడుకు, కొడుకు కానట్లే. అతడు కుపుత్రుడు అయినట్లు. ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రుడైన కొడుకు అయితే వారసత్వానికి హక్కుదారునిగా అవ్వగలడు. అనంతమైన తండ్రి కూడా అంటారు - నా శ్రీమతాన్ని అనుసరించినట్లయితే, మీరు ఈ విధంగా శ్రేష్ఠంగా అవుతారు లేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. తండ్రి మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేయడానికి వచ్చారు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మమ్మా, బాబా రాజా-రాణులుగా అవుతారు కనుక మీరు కూడా ధైర్యం చేయండి. తండ్రి తప్పకుండా తమ సమానంగా తయారుచేస్తారు. ప్రజలుగా అవ్వడంలో సంతోషపడకూడదు. మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, బలిహారమవుతాము అని - పురుషార్థం చేయాలి. మీరు బాబాను తమ వారసునిగా చేసుకుంటే, వారు మీకు 21 జన్మలకు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. పిల్లలంటారు - బాబా, ఈ తనువు, మనసు, ధనం అంతా మీదే. మీరు తండ్రి కూడా మరియు బిడ్డ కూడా. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ. ఒక్క తండ్రి మహిమ ఎంత గొప్పది. ప్రపంచంలో ఎవరికీ ఈ విషయాల గురించి తెలియవు. ఇదంతా భారత్ కు సంబంధించిన విషయమే. ఇది అదే 5 వేల సంవత్సరాల క్రితం నాటి యుద్ధము అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. కావున పిల్లలు సదా చాలా సంతోషంగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కనుక మీరు సంతోషంగా ఉండాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మిమ్మల్ని చదివిస్తారు కూడా - వారు అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు. మనకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రి గురించి తెలియదో, వారు నాస్తికులు. మీకు తండ్రి గురించి మరియు రచన గురించి తెలుసు కనుక మీరు ఆస్తికులు. లక్ష్మీనారాయణులు ఆస్తికులా లేక నాస్తికులా? మీరేమంటారు? సత్యయుగంలో పరమాత్మను ఎవరూ స్మృతి చేయరు అని మీరే చెప్తారు. అక్కడ సుఖముంటుంది కావున సుఖంలో పరమాత్మను స్మరించరు ఎందుకంటే పరమాత్మ గురించి తెలియదు. ఈ సమయంలో మీరు ఆస్తికులుగా అయి వారసత్వాన్ని పొందుతున్నారు. తర్వాత అక్కడ అసలు స్మృతి చేయరు. ఇక్కడ వారిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి తెలియదు, అందుకే నాస్తికులని అంటారు. అక్కడ తండ్రి గురించి తెలియదు కనుక స్మృతి కూడా చేయరు. ఈ వారసత్వం మాకు శివబాబా నుండి లభించింది అన్న విషయం కూడా వారికి తెలియదు. కానీ వారిని నాస్తికులని అనరు ఎందుకంటే వారు పావనమైనవారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతాన్ని అనుసరించేందుకు పూర్తి ధైర్యమునుంచాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు మరియు దుఃఖపడకూడదు.

2. తమ రచనను తమ చేతుల్లో పెట్టుకోవాలి. వారిని వికారాల నుండి రక్షించాలి. పావనంగా తయారయ్యే సలహానివ్వాలి.

వరదానము:-

శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం తాకట్టుగా భావిస్తూ కార్యంలో ఉపయోగించే నష్టోమోహా భవ

ఎలాగైతే ఎవరిదైనా తాకట్టు వస్తువు ఉంటే, ఆ తాకట్టు వస్తువు పట్ల నాది అనే భావన ఉండదు, మమకారం కూడా ఉండదు. అలాగే ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కోసం ఒక తాకట్టు వంటిది. ఈ తాకట్టు ఆత్మిక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినట్లయితే ఆత్మికత వస్తుంది, నాది అనే మమకారం ఉండదు. నిరంతర యోగులుగా, నష్టోమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మికత యొక్క స్థితిని ప్రత్యక్షం చేయండి.

స్లోగన్:-

వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను అండర్ లైన్ చేయండి.